Sunday, December 2, 2018

పతి పూజయె కార్తికమున భద్రత నొసగున్!

 
 
 
పతి పూజయె కార్తికమున భద్రత నొసగున్!
 
పతి మూలాధారమున ! సు
మతి, స్వాధిష్టానపు పతి, మణిపూరకమం
దతడె యనాహతమున ! నా
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!

***

పతియతడె విశుద్ధిని ప
ద్ధతిగా భృకుటిని సహస్ర దళ కమలములో
సతి శక్తి గా పతి శివుడు!
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!

***

సతి బ్రహ్మరంధ్రమును దా
టి త్రికూటమ్ములను దాటి టిక్కిని దాటన్
పతి పెంజీకటి కావల!
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!
***
 
పతి గణపతి! పతి బ్రహ్మయు
పతి విష్ణువు! పతి శివుండు! పతిజీవాత్మన్
పతి పరమాత్మ! జిలేబీ!
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!

***

సతి శాకిని!సతి కాకిని
సతి లాకిని! రాకిని సతి! సతి ఢాకిని మేల్
సతి హాకిని! మూలంబగు
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!

***

సతి రక్తము! పతి పీతము
సతి నీలము! పతి యరుణము సతి ధూమ్రమగున్
పతి విద్యుత్కర్పూరము!
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!

జిలేబి