పతి పూజయె కార్తికమున భద్రత నొసగున్!
పతి మూలాధారమున ! సు
మతి, స్వాధిష్టానపు పతి, మణిపూరకమం
దతడె యనాహతమున ! నా
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!
***
పతియతడె విశుద్ధిని ప
ద్ధతిగా భృకుటిని సహస్ర దళ కమలములో
సతి శక్తి గా పతి శివుడు!
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!
***
సతి బ్రహ్మరంధ్రమును దా
టి త్రికూటమ్ములను దాటి టిక్కిని దాటన్
పతి పెంజీకటి కావల!
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!
మతి, స్వాధిష్టానపు పతి, మణిపూరకమం
దతడె యనాహతమున ! నా
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!
***
పతియతడె విశుద్ధిని ప
ద్ధతిగా భృకుటిని సహస్ర దళ కమలములో
సతి శక్తి గా పతి శివుడు!
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!
***
సతి బ్రహ్మరంధ్రమును దా
టి త్రికూటమ్ములను దాటి టిక్కిని దాటన్
పతి పెంజీకటి కావల!
పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!
***
పతి గణపతి! పతి బ్రహ్మయు
పతి విష్ణువు! పతి శివుండు! పతిజీవాత్మన్
పతి పరమాత్మ! జిలేబీ!
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!
***
సతి శాకిని!సతి కాకిని
సతి లాకిని! రాకిని సతి! సతి ఢాకిని మేల్
సతి హాకిని! మూలంబగు
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!
***
సతి రక్తము! పతి పీతము
సతి నీలము! పతి యరుణము సతి ధూమ్రమగున్
పతి విద్యుత్కర్పూరము!
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!
జిలేబి
పతి విష్ణువు! పతి శివుండు! పతిజీవాత్మన్
పతి పరమాత్మ! జిలేబీ!
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!
***
సతి శాకిని!సతి కాకిని
సతి లాకిని! రాకిని సతి! సతి ఢాకిని మేల్
సతి హాకిని! మూలంబగు
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!
***
సతి రక్తము! పతి పీతము
సతి నీలము! పతి యరుణము సతి ధూమ్రమగున్
పతి విద్యుత్కర్పూరము!
పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!
జిలేబి
“కష్టేఫలే” శర్మ గారు తన బ్లాగ్ టపాలను ఇ-పుస్తకాల రూపంలో ప్రచురించే ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి మీకు తెలుసు గదా. వారి శ్రమ ఫలించింది. మొదటి పుస్తకం నిన్న 18-12-2018 వైకుంఠ ఏకాదశి రోజున కినిగె వారు ప్రచురించారని శర్మ గారు తన బ్లాగ్ లో ఈ ఉదయం టపా పెట్టారు. మీరు చూశారా?
ReplyDeleteఈ మొదటి పుస్తకానికి మీరు వ్రాసిన “ముందుమాట” / పరిచయం చాలా చక్కగా ఉంది.
గత కొన్ని రోజులుగా బ్లాగుల్లో మీ పలుకు వినిపించడం లేదు. అందువల్ల శర్మ గారి పుస్తక ప్రచురణ సంగతి మీకు తెలియజేద్దామని ఈ కామెంట్ పెడుతున్నాను.
అంతా కుశలమేనని తలుస్తాను.
@నీహారిక గారూ :
Deleteపుస్తకం చదివి చూడరాదా, మీకే తెలుస్తుంది? 👍
Deleteముఫత్ మే పుస్తక్ మిల్ నే సే పడేంగే :)
జిలేబి
ReplyDeleteజిలేబిగారు
మీరు మొదటి మాట రాసిన నా ఇ-బుక్ ప్రచురింపబడింది,కినిగెలో.
http://kinige.com/kbook.php?id=9223
వీలుంటే చూడండి. ఆరోగ్యం జాగ్రత, కన్ను కదా! కన్నుంటేనే కలియుగం.
నమస్కారం
మీరు ముందు మాట అ రాసిన నా ఇ-బుక్ గురించి కినిగె వారిచ్చిన సమాచారం,ఈ వారం ప్రచురించిన పుస్తకాలలో మొదటి పదిలోనూ ఉందట.
ReplyDeleteధన్యవాదాలు.
Kinige.com
6:41 AM (1 hour ago)
Your book is in weekly top ten books of Kinige. This means it is very prominently displayed on Kinige.com home page and also on every other book page of Kinige, for every visitor 24/7 for this whole of week. http://kinige.com/kbook.php?name=Sarma+Kalakshepam+Kaburlu+Aai+Maadi+Pagoji+Andi
మిత్రులు శర్మగారు,
Deleteదీని అర్థం ఎంతోమంది మీ మార్గదర్శనాన్ని అపేక్షిస్తున్నారని. చాలా సంతోషం.
శ్యామలీయంగారు
Deleteనమస్కారం
ధన్యవాదాలు.,
Wonderful news. అభినందనలు శర్మ గారూ 👏. రాబోయే వారాల్లో కూడా తప్పక ఇలాగే కొనసాగుతుంది 👍.
ReplyDeleteపైన మీరిచ్చిన ఈ “కినిగె” సమాచారాన్ని మీ “కష్టేఫలే” బ్లాగ్ లో కూడా సంబంధిత టపా క్రింద పంచుకుంటే బాగుటుంది కదా?
విన్నకోట నరసింహా రావుగారు
ReplyDeleteతప్పకుండానండి. అమ్మవారికి నివేదించుకోవాలని ఇక్కడ చెప్పాను ముందుగా!
ధన్యవాదాలు.
జిలేబీ గారూ,
ReplyDeleteశర్మ గారు "ఆరోగ్యం జాగ్రత్త. కన్నుకదా!" అన్నారు. ఏమైంది మీకు? దాదాపు ఇరవై రోజులుగా మీరు వ్యాఖ్యలు పెట్టడం లేదు. నేను, జిపియస్ వారు ఆందోళన చెందుతున్నాము.
మొన్న ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమంలో చదవ వలసిన పూరణలలో మీ పద్యాన్ని టిక్ చేసాను. కాని సమయాభావం వల్ల మీ పద్యం చదవలేకపోయారు మాచవోలు శ్రీధర రావు గారు. కేవలం పేరును ప్రస్తావించారు. మదనపల్లెలో ఉన్నారా ఇప్పుడు?
😊
Delete"Enigma! Thy name is Zilebi!"
Deleteకంది వారికి
జీపీయెస్ వారికి
నమో నమః
జిలేబి
ReplyDelete“జిలేబి” గారూ,
బ్లాగుల్లో కనబడడం లేదేమిటా అనుకున్నానే గానీ కంటాపరేషన్ అని ఇప్పుడు శర్మ గారి వ్యాఖ్య ద్వారా తెలిసింది. ఇది రెండో కంటికా? కంటికి విశ్రాంతి ఇవ్వండి, మీరు విశ్రాంతి తీసుకోండి.
Wish you speedy recovery 👍.
Zilebi
ReplyDeleteమీ కుడి కన్ను ఆపరేషన్ అయి నెలకి వారం తక్కువనుకుంటా. జాగ్రత తీసుకోండి. మీరు ముందుమాట రాసిన నా ఇ-బుక్ ఈ వారం కూడా మొదటి పదిలోనూ ఉన్నదని కినిగెవారి వార్త.
నమస్సులు.
Your book శర్మ కాలక్షేపం కబుర్లు - ఆయ్! మాది ప.గో.జి అండి! (Sarma Kalakshepam Kaburlu Aai Maadi Pagoji Andi) is in weekly top ten list of Kinige
Inbox
x
Kinige.com
6:41 AM (1 hour ago)
to me
Your book is in weekly top ten books of Kinige. This means it is very prominently displayed on Kinige.com home page and also on every other book page of Kinige, for every visitor 24/7 for this whole of week. http://kinige.com/kbook.php?name=Sarma+Kalakshepam+Kaburlu+Aai+Maadi+Pagoji+Andi
ధన్యవాదాలు.
Deleteమూడు పుత్తములాయె సముచితముగ జి
లేబి, లలితమ్మ వనజయు లెస్సగాను
ముందుమాట రాసిరి! దుడ్డు మూట వచ్చె
నా తెలియ గోరి ప్రశ్నించెనా యనామ
కమ్ము శర్మగారిని భళి గాటు తగిలె :)
జిలేబి
ఆర్యా!
ReplyDeleteమాలికలోని వ్యాఖ్యల విభాగంలో నా బ్లాగులోని వ్యాఖ్యలు కనిపించుట లేదు,కారణం ఏమిటి?సాంకేతికపరమైన లోపమైనచో సరిచేయగలరు, విధి పూర్వకమైన నిషేధమైనచో కారణము తెలుపగలరు!
హరి.S.బాబు
ఆర్యా !
Deleteమీ బ్లాగులో సరుకు నాడెంగా ఉందో లేదో జిలేబీ గారు చెపుతారా ? అమ్మిపెట్టేవారికి సిఫార్సు అక్కరలేదు. అమ్మిపెట్టడానికి షరతులు వారి దగ్గరకెళ్ళి అడిగితే చెపుతారు.
:-)
Deleteజిలేబీ కూడా యాగ్రిగేటరు అవతారం ఎత్తింది కదా, భరద్వాజ గోత్రీకులకీ శ్రీనివాస నామధారులకీ యావైనా బాదరాయణ సంబంధం ఉంటుందేమోనని అడిగా - మధ్యలో మీకెందుకీ రుసరుసలూ నసనసలూ సునసూయలూ!
Delete
Deleteమా లక్కుపేట రౌడి గారికి విన్న పాలు
వెంఠనే హరిబాబు గారి ఆశ తీర్చవలె :)
జిలేబి
HAPPY NEW YEAR JILEBI!
ReplyDeleteHAPPY NEW YEAR FRIENDS!
ReplyDeleteకామింటిన అందరికి
కుశలము విచారించిన అందరికి
నెనరులు !
ఉభయకుశలోపరి!
నూతన వత్సర శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteగల్ఫునకు వెళ్ళినట్టి మగండు జ్ఞాప
కమున కరుగుదెంచి యెలమిగ కవగొనెను
మల్లియలు గుబాళించఁగ,మహిళ రోసె
తన పరిస్థితి గాంచి వెతలను నొంది !
నూతన వత్సర శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteతల్లీ! భారతి! వందనమ్ములివియే! తాతయ్య పల్కుల్ సదా
యుల్లాసంబును జేర్చె! మీదు మదిలో యుత్సాహముప్పొంగగా
కల్లోలంబుల తీర్చెనందరికి శ్రీ కష్టేఫలీశర్మ కో
కొల్లల్గట్టి కతల్ జిలేబి వరుసన్ కొండాట్టమైనిల్పగా!
జిలేబి
ReplyDeleteఉన్నదొకటె కామను హాలు యూరిజనుల
కెల్ల! పెండ్లి యయ్యె జనులు కెడను బాయ,
వచ్చె పో, యమావాస్యయు వరలుకొనుచు
పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట!
జిలేబి
ReplyDeleteపాలవరపు శ్రీకర! మా
గోలను భళి నారదార్య గురువులతో హే
రాలముగా బోల్చిరిగ! వ
యోలా! నెనరులు జిలేబులొప్పంగ గొనన్ :)
జిలేబి
వెల్ కం
ReplyDeleteబెక బెక యందునో
చక చక పద్యాలురాల
కన్నుల పండువాయె
నెలయన నాల్గువారములె
ఉన్న చోటననుంటిరిగదా
ReplyDeleteమార్పెట్లు గల్గెనో
భూమధ్య రేఖకు దగ్గరనుంటిరిగదా
కన్నుకు రెస్టు వలయున్
''కొండాట్టమై''అనగానేమి?
ReplyDelete
Deleteఔరా!
తెలుగు తాతకు కొండాట్టమన్న యేమిటో తెలియదా ! :)
హతవిధీ !
ఆంధ్రభారతీ దయగొనుమా :)
జిలేబి
కొండాడు టెరుంగుదుగాని
Deleteకొండాట్ట మెరుంగనైతి నకటా
కొంటె జిలేబి కిదెగదా
కొండాడుటే మేలగున్
ReplyDeleteకాల వాహిని లోన నాకాశమున జి
లేబి గాన వచ్చును వింత లెస్స గాను!
అదిగొ! చూడుము! సూర్యగ్రహణము! అదిగొ
చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు!
జిలేబి
ReplyDeleteఐపీ అడ్రెస్సుల తో
టోపీ వేయగ జిలేబి టోకర గాంచెన్
మా పొలమూరు గురువు తా
నీ పాటికి బుర్రవేడినిక తాళునకో !
జిలేబి
"కనకవనంబులో విరియు కాంతులు దీపములెల్ల పద్యముల్"
ReplyDelete
ReplyDeleteవాలకపు పరిష్వంగము,
గోలల చెంత సుఖముల బుగులుబుగులు సరా
గాల నరుడ, హెచ్చగు తా
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్ :)
జిలేబి
ReplyDeleteరాలిన వెంట్రుకలు రుజువు !
యేలన్ సావాసము! సరియే కాదు సఖా,
చాలించు బీడి! వడి ధూ
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్
జిలేబి
ReplyDeleteఏలన్ మూర్ఖత? యంత
ర్జాలములో చదివినావ? సరికాదు సుమా
పాలనగ శక్తి కద! యే
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్?
జిలేబి
ReplyDeleteలైలాని నీకు, ప్రియుడా!
రాలిన పువ్వువలె చూడ రమణిని తగునా?
కాలెను మదియు, సరసి తా
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్?
జిలేబి
ReplyDeleteమాలలు, జపమాలలు, పూ
మాలలు, తోమాలలు పరిమళ సౌగంధం
బాలివ్వవు సుఖముల! కో
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్!
జిలేబి
ReplyDeleteమూలాధారము నుండి క
పాలపు కొపురు వరకున్ తపస్సును జేయన్
స్థూలముగ యక్కసుల , తా
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్!
జిలేబి
ReplyDeleteలోలాక్షి! జిలేబీ! లల
నా! లావణ్యవతి! రావె! నాదు ప్రియ సఖీ
మాలిని! గుబులేలా! తా
పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్?
జిలేబి
ReplyDeleteనిజమైన సత్పురుషులకు
ప్రజలకు వైరాగ్యములను ప్రతినిమిషము నే
ర్పు జనులకున్ వ్యత్యాసము
సుజనా చెప్పుమని సరసి సూటిగ యడిగెన్
జిలేబి
ReplyDeleteఇతరుల కై సన్యాసి, స
తతము తనకొరకు బతుకును తల్లీ బైరా
గి! తరచి చూడన్ భేదమి
ది తరుణి నీహారికా! యిది తెలుసు కొనుమా :)
జిలేబి
ReplyDeleteసత్యము ధర్మంబులనను
నిత్యము బోధించిరమ్మ నిష్కామముగా
ముత్యము పై నీరువలెన్
దత్యులుగా జీవితమున దారిని గనిరే !
జిలేబి
ReplyDeleteచిన్నప్పుడు విన్నది యో
రన్నా ! గుర్తుకు మరి సరి రాలే! కనుకే
చిన్నగ జ్ఞాపక ముగొనుచు
దన్నుగ నిచ్చట నిలిపితి తరతరములకై !
జిలేబి
సంప్రదాయ పద్య సత్కవివరులకు
ReplyDeleteగ్రామ్య పద్య కవుల ప్రణతి , ప్రణుతి ,
ప్రతిభ గల్గు విబుధ ! బాగుందు రనుకొందు ,
క్షేమ మరయ వినతి సేయు వాడ .
ReplyDeleteశ్రీ రాజారావు కవివ
రా! రాజిల్లు మధురముగ గ్రామ్యపు భాషా
సౌరభములే నెపుడు! కవి
తా రాణికి నచ్చినట్టి దరువులవి సదా !
జిలేబి
ReplyDeleteరాముని సన్నిధి యే సు
మ్మీ మాకెల్లరకు వసతి మేల్ గాన సదా
క్షేమమును చేర్చు పెన్నిధి
యై మా యారాటముల భయమ్ముల ద్రోలున్!
జిలేబి
ReplyDeleteతాత తాత తాత తాతకు జింతాత
దీది దీది దీది దిదిది దీది
మామ మామ మామ మామకు మాంధాత
నాన నాన నాన ననన నాన!
జిలేబి
ReplyDeleteబైరాగులనగ యింటిని
దారా సుతులను జవాబుదారీ తనమున్
జారవిడిచి దేశములో
రారోలువలె పడివుండు రహటులు సుమ్మీ !
జిలేబి
ReplyDeleteఅక్షరపు ముక్క నేర్వక
సాక్షియు లేక నవివేకి ! చలకపు తీరుల్
చక్షువుల కానదొకొ? యే
రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్?
జిలేబి
ఆలు కాళికైన
ReplyDeleteకాలు నిల్వదాయె
కాలు నిల్వనోడు
కలిలోన బైరాగి.
ఇది నిజం, శర్మ గారూ 👌. ఆలి పెట్టే హింసలు మరీ ఎక్కువైపోతే కండువా విసిరేసి, కాషాయం కట్టేసి బైరాగుల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. అథవా మానసికంగా బైరాగి అయినా అవుతాడు.
Delete
Deleteగండర గండడు పెండ్లా
మండగ యుండక జిలేబి మాదిరి యెగురన్
తిండాట్టము తాళక తా
కండువను దులిపి బికారి గా పోవునయా :)
జిలేబి
ఉగ్రనారాయణి అవతారం :)
ReplyDeleteబులుసయ్య ఘృతాచి యనుచు
పలికిరి కష్టేఫలి నరవర భళి భళి మీ
మొలకెత్తిన పొత్తములచ
ట! లబ్జు గానుండె ముచ్చటగ నుండెనయా :)
జిలేబి
ReplyDeleteచదివిన చదువులు వ్యర్థము !
చదువక పండితుఁడగు! మఱి చదివి మొఱఁకునౌ
చు దవక లుపడెడు వారల
సదనంబందున గనుమిక! చదువును విడుమా !
జిలేబి
ReplyDeleteమదిని చిలుకంగ చాలును
చదువక పండితుఁడగు! మఱి చదివి మొఱఁకునౌ
చు దెసచెడుటేల ! నరుడా
హృదయము లో రహిని నింపి హృత్వుని గనుమా!
జిలేబి
ReplyDeleteమదమున బల్కితివా ? బు
ద్ధి దప్పడంబాయెనా? చెదిరెనా జ్ఞానం
బు? దడబుడలేల శిష్యా!
చదువక పండితుఁడగు? మఱి చదివి మొఱఁకునౌ?
జిలేబి
ఇవ్వాళ యింకెన్ని వస్తాయో :)
ReplyDeleteమూడు వేల పేజీలపై మూడు నూర్లు
మొత్తము పదిహేనన పొత్తములు! జిలేబు
లై కినిగెలోన హాట్కేకులయ్యె చదువ
రులకు, టాపు టెన్నున వెల్గురువ్వలగుచు :)
జిలేబి
ReplyDeleteతీసేయడమా ! నో వే!
కాసింత తెలివి గలిగిన కామింటిదియే!
దోసిలియొగ్గి గ్రహించెద
భాసిత భూషణములివియె వైవీయుడ నే :)
జిలేబి
ReplyDeleteఆండాళ్ళూ యని యావిడ
బోండాలన్ కోటు చేసె పొద్దుట యే!యే
కొండాట్టమిక మొదలగును?
తిండాట్టములిక జిలేబి తీరుగనునకో :)
జిలేబి
ReplyDeleteహైలెస్సా! పొత్తంబులు
హై లెస్సంగ పదిహేను హైహై జంబూ
మాలగ గుచ్చిరి! విదురులు
సోలెడు సాయమునకు మము స్తుతియించిరిగా :)
జిలేబి
ReplyDeleteఆఖరి వాక్యంబులు ప
ద్మా, ఖచ్చితముగ నమోఘ మమ్మ జిలేబీ
దాఖలు పరచితివిగదా
లేఖల సారాంశముగ భలె టపా సూపర్ :)
జిలేబి
ReplyDeleteసద్వసధము రావణునిది!
విద్వాంసుడు రామబంటు, విన్నుమనుమడా
యద్వందుడౌ హనుమ యం
గద్వాల ప్రభవపు వహ్ని కాల్చెను లంకన్!
జిలేబి
ReplyDeleteవిద్వన్మణీ! సభాభవ
నాద్విలసిత ఢాంఢఢాంఢ నాదంబు హనూ
మద్వాలప్రజ్వలనా
గద్వాలానలము గాల్చెగద లంక నయో!
జిలేబి
ReplyDeleteపొత్తంబదిగో నైదవ
దత్తరి కినిగె ప్రచురించె ధర సరసము లీ
విత్తులు జీవితమునకను
దాత్తములు చదువులపడతి దయయు, జిలేబీ !
జిలేబి
ReplyDeleteతరుణీ! దుందుడు కుతనం
బరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్
పరమాత్ముని సేవ యొసగు
పరిశీలింప వివిధములు ప్రభువుని లీలల్
జిలేబి
ReplyDeleteహరియే యన్నిటికిన్ మన
పరిధిని నేది గల దంచు భక్తియు తోడై
పరిపూర్ణముగా నమ్మగ
నరిషడ్వర్గమ్ములొసుఁగు నానందమ్మున్!
జిలేబి
ReplyDeleteపరిశోధింపగ నంతః
పురంపు శత్రువులతో విపులముగ నొడబా
టు రహియు గనన్ జిలేబీ
యరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్
జిలేబి
ReplyDeleteపరిశీలింపగ నంతః
కరణమ్మును తొలిచెడు ప్రతికర్తల నొడబా
టు రహియు గనన్ జిలేబీ
యరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్
జిలేబి
ReplyDeleteవ్యసనంబాయెగదా బ్లా
గ్ల సక్కగ చదివి కమింట్లు కాస్తై నా వే
య సరి సరి మనసు పోయె వె
రసి యెట్లు విడుచుట నాకు రథ్యంబేదో :)
నారదా!
జిలేబి
ReplyDeleteజంబలకడిపంబ విదుర!
తంబళ తలతిక్కయగు కత యిక శకారా
దంబోవడివలె చెప్మా !
"అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్"
***
సాంబుడు, ధ్యానింపగ నా
నంబనుఁ బెండ్లాడె, సాల్వుఁ డందరు మెచ్చన్,
త్ర్యంబకుని దేనము గనన్
సౌంబక ము బడసె సమాధి సౌభాగ్యమహో
***
తంబీ సాల్వుండెక్కడ
నంబనుఁ బెండ్లాడె? సాల్వుఁ డందరు మెచ్చన్,
త్ర్యంబకుని దేనము గనన్
సౌంబక ము బడసె గదా వసతిగ తిరుగుచున్ :)
జిలేబి
ReplyDeleteసంక్రాంతి శుభాకాంక్షలతో
ధరణిని విస్తారముగా
పరిపాలింపగ త్వరితము పరిపూర్ణముగా
వరలుకొని భళారే కరి
కరి నినుడాక్రమణ చేసె కాంక్షలు హెచ్చన్ !
జిలేబి
ReplyDeleteసూపర్స్టాటరనిరిగా
నా పాఠవమును, కమింట్లు, నాదగు శైలిన్
తాపీ గా వేయు విధము
యోపిక లెల్ల భళి గాంచి యొప్పగ జనులున్ :)
జిలేబి
ReplyDeleteమీ యొడయురాలికి భళా
నే యొప్పు విధంబులనిక నేర్పెద నయ్యా
సాయుధముగ మీ వ్యసనము
లాయువు తీరు వినుడయ్య లావణ్యముగా :)
నారాయణ
జిలేబి
ReplyDeleteబ్లాగుల చదవడ మన్నద
దోగుల! విడవడమదెట్లు, తోచదు, యిట్లా
మ్రాగితిమిచ్చట మేమ
య్యా! గిరి తప్పించుకొనగ నవసరమాయెన్ :)
జిలేబి
ReplyDeleteరుణమకరము నుండి విము
క్తిని పొంది రయితులు శాంతి కీర్తిని గానం
గ, నుడివితి శుభము బడయం
గను సంక్రాంతి విరియవలె కటకట బోవన్
జిలేబి
ReplyDeleteనందితాదాసు కట్టిన నైసు సేల
లున్ సొగసుగా స్మితాపాటిలు నునుపారు
యుడుపుల కొన కోరికగల యువతి నైన
నేమి దస్కము దండిగ నెట్లు కొనుట?
జిలేబి
ReplyDeleteమదిరనయన! మూర్ఖుండగు
చదువక, పండితుఁడగు మఱి చదివి, మొఱఁకునౌ
చదివిన దానిని మరువన్
పదిలపరచుకొనుమ పద్య పాఠంబిదిగో !
జిలేబి
ReplyDeleteపారీంద్రంబై యొనరిచె
నారా వారికి నెరవుల నాణ్యంబుగ నా
సోరణి దివ్వెల నగరం
బౌరా యమరావతికి ప్రభవమును గూర్చన్!
జిలేబి
ReplyDeleteవెలుతురు బాకై వచ్చెను
భళా వనజ తాతినేని పదముల్ దరువుల్
కలకాలము నిలచుచు కవి
తలు జనులెల్లరకు మేల్మి తమగము గానన్ !
జిలేబి
ReplyDeleteమగరాయుండదిగో మా
ళిగలోన భళా వసతిగ లింగంబాయెన్
జగదాంబతోడు నీడగ
సగుణోపాసకుడ నీవు సత్యము గానన్
జిలేబి
ReplyDeleteనేనొప్పుకునే వాడిని
కాను సుమా సౌమ్య గారు కార్యాలయమం
దైనను వైట్నరు నో! నా
దైన విధంబు టయిపిస్టు తైతై లాడన్ :)
జిలేబి
ReplyDeleteభజరంగ భళీయనుచున్
తజల్లి గాహ్ మాంత్రికుండు తంత్రము చేయన్
గజ గజ యని వణికెడు నా
నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్
జిలేబి
ReplyDeleteమజ! వేరుసెనగ గాంచెన్
సజగ్ధి గానంగ దాని జాలిక నొలిచెన్
పజదొర యిచ్చిన తెలివి, ద
య, జగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్!
జిలేబి
ReplyDeleteఅజగరముగ కుండలిని మ
నుజులందు నిదురను గాంచును వెసన్ తా నం
గజముగ బ్రాకన్ శక్తిగ
నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్!
జిలేబి
ReplyDeleteభుజగపు చక్కెరబుగడను
మజలాగుచు బిలమునన్ సమారాధన జే
సి జమను పంచుకొని భళా
నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్!
జిలేబి
ReplyDeleteఖాదీ షాపు ధరలనే
నో దినమున చూసినాడ! నోరెగయగలే
దే! దస్కమున్న నేతన
కో దబ్బున కొనగ నేను ? కొనలేదయ్యా :)
జిలేబి
ReplyDeleteపండుగ యౌనా యౌనా
పండుగ యని నాదు బుర్ర బరబర గోకన్
దండిగ, నేనేమన్నా
తొండాడుచు చేయమంటి తుంటరి నరుడా? :)
జిలేబి
ReplyDeleteపండగ పొద్దుట కీబో
ర్డండగ కొట్లాడనేల రండి సుజనులై
కొండాట్టము చేసుకొనుచు
నిండా ముసుగెట్టి నిదురని కలల గాంచన్ :)
జిలేబి
జిలేబి గారు, మీరు కుశలమేనా? మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDelete
Deleteఅన్యగామి గారికి
ఉభయకుశలోపరి !
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteకరయై యాక్రమణ గన మ
కరమ్ము నదిగో నభమున కార్మికుడు ప్రభా
కరవిభవమ్ము, భళా రా
క రయముగా, సంకురాత్రి కందువ సొబగౌ!
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteచేయండి మెయిలు భళిభళి
మీ యడ్రస్సును దిగబడి మీ వ్యసనంబుల్
మాయంబగునట్లిక చే
స్తా! యమ యమహో జిలేబి చక్కెరకేళీ :)
జిలేబి
ReplyDeleteసిగ్గెగ్గేమియు లేకన్
మొగ్గా కామింట్లనిడుచు ముంగట వచ్చే
పగ్గెలపోవు జిలేబీ
తగ్గుముఖంబట్టవే కతల్ మరవేలా :)
జిలేబి
ReplyDeleteచిన్నది యున్నది యరరే
మిన్నగ బుగ్గపయి చిటిక మించారుగవే
యన్నమ్మినంత వరకున్
పొన్నమ్మా సిగ్గు వేయు పోవే గుమ్మా :)
జిలేబి
ReplyDeleteమున్నాలే నీ పోనా
పిన్నాలే వారె! కిళియె పిరియర దెండ్రల్
మిన్నల్వేండామ్ వేండామ్
పొన్నమ్మా వాడి యెన్ సపోటా వాడీ :)
జిలేబి
ReplyDeleteఎంత మాటండి మాస్టారు! మిమ్ము మరచు
టెట్లు వీలగు! ఆహ్వాన మెల్లపుడును
మీకు కలదండి! రండి సుమీ సుజన! సృ
జన! యిదిగిదిగో మామాట చక్కనయ్య !
జిలేబి
ReplyDeleteకోన సీమ యాస గోదావరి పలుకు
లెల్ల చదువ గాను లెస్సగా మ
దియు భళారె తూగె దీని తస్సదియ! యె
న్ని దినములయె కతల నిట్లు గాన !
జిలేబి
ReplyDeleteవిజయవాడ బ్లాగరెవరోతెలుపుమయా
విన్నకోట రాయ విదుర మాకు
తెలుపు డయ్య నిపుడె తేటతెల్లముగ జి
లేబులూరగా భలే! యెవరయ !
జిలేబి
ReplyDeleteపగవారికైన వలదోయ్
సిగరెట్ సిగపట్లు; మనకు శ్రేయము గూర్చున్,
మొగదల జీవముపోయుచు
దగదగ భూతాత్మ స్వచ్ఛత సుమీ రమణీ!
***
పొగ త్రాగుట హానికరము!
జగడము లాడుట చెలులకు సరికాదు కదా!
తిగకంటి!యెటుల సుమ్మీ
సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్?
***
భుగభుగ పొగలు సుడులు సుడు
లుగ తిరుగుచు పక్కన చెలులుగ తిరుగగ నా
జగణపు జిలేబులు, భువిని
సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!
***
సిగపట్లకు గలరు జిలే
బి గారు సీతమ్మ చెల్లి విదురుల్, సొబగై
సిగరెట్టుకు గలరు కవులు
సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!
***
మగువల తోడున్, భుగభుగ
ల గుంజనం బెడతెగని విలాసమ్ముగ తా
నగజాతంబుగ కోరగ
సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!
***
సిగరెట్లకు శ్రీనాథుడ!
తగినట్టి మగడను సతికి తవమొనరిచి గాం
చెగదా పెన్మిటిగా! గన
సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!
***
తగురీతిగా పురుషులకు
సిగరెట్, సిగపట్లు మనకు, శ్రేయముఁ గూర్చున్
మగువా! యెక్కువగా మరి
పొగబెట్టక బతుకు సాగి పోవలె నెపుడున్ :)
***
భుగభుగ తా పీల్చగ నా
సిగరెట్, సిగపట్లు మనకు, శ్రేయముఁ గూర్చున్
మగడిని ముకుదాడున క
ట్టి గట్టి గాను పెనవేసి టెక్కును నాపన్ :)
***
హడ్తాల్ కరో బంద్ కరావో :)
మగ వారలు మన మాటల
తగదని చెప్పుచు జిలేబి, తకరారు గనన్,
జిగజిగలాడింపగ నా
సిగరెట్, సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!
***
వగచకు వగచకు వలదని
సిగరెట్ సిగపట్లు; మనకు శ్రేయముఁ గూర్చున్
జగతిని బుర్రనవియె వే
డిగచేయును పనుల చేయ డింకగ దిటమున్!
***
మగరాజ! వలదు సుమ్మీ
సిగరెట్ సిగపట్లు; మనకు శ్రేయముఁ గూర్చున్
భగవంతుని ధ్యానమయా!
జగదాంబపలుకుల నీవు చక్కగ వినుమోయ్ !
***
దిగులేలనొకో ? వలదా
సిగరెట్; సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్
దగని పలుకు! పడతిని నీ
బిగి కౌగిలినిడుమయా లభించు జిలేబీ !
***
జగడాలమారి! లాగకు
సిగరెట్! సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్,
తగువుల చేయ విడాకుల
గు! గవనముగొనుము జిలేబి గుబ్బెత పో పో !
***
జిలేబి
ReplyDeleteఅగొ! వ్యసనమ్ములను జిలే
బి, గుడ్డిగా పాపములని భీతిలకమ్మా
తగినట్టి శిక్షయె సుమా !
సిగరెట్, సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!
జిలేబి
ReplyDeleteఅగొ! బ్రెక్జిటు! కాలెన్ పో
సిగరెట్, సిగపట్లు; మనకు శ్రేయముఁ గూర్చున్
జగతిని యని థెరెసా మే
ప్రగతిని కోరగ జిలేబి ఫ్లాప్ షో అయెనే!
జిలేబి
ReplyDeleteవిధవిధముల కందమ్ముల
ను ధగధగ యనుచు తృటిని పనుపడు జిలేబిన్,
సధవయె నప్రస్తుముగ న
వధాన మన మేడసాని వడవడ వడఁకెన్!
***
సుధలొల్కగచేయుమిక న
వధానమన మేడసాని, వడవడ వడఁకెన్,
సధవ జిలేబియు పసలే
ని ధంధణమను పని కాదని తెలుసుకొనగా :)
***
మధురిమ లొల్కంగవలె న
వధానమన మేడసాని, వడవడ వడఁకెన్,
దధివడ యనుకొన్న జిలే
బి, ధిగుల్లున కందివారు వేదిని నెక్కన్ :)
***
మధురిమ లొల్కంగవలె న
వధానమన మేడసాని, వడవడ, వడ, కెం
పు,ధన, జిలేబుల దత్తప
ది, ధంధణగ శ్రీచరణుడదియె పూరించెన్ !
***
విధవిధముల వేదికల న
వధానమును చూడనేమి, పసలేకయు సా
గు ధణధణమను జిలేబి య
వధానమన మేడసాని వడవడ వడకెన్!
***
బుధజనులే బిల్వంగ న
వధానమని, సర్ది కండువాను సభని తా
బధిరులను చూపి చేయుడ
వధానమన మేడసాని వడవడ వడకెన్!
***
బుధజనులకు వలయున్ సమ
వధానమన మేడసాని, వడవడ వడకెన్
"బుధిలుడ నే" ననుకొన్న
ట్టి ధిషణహీనుడు తనదు పటిమ తెలవారన్ !
***
నారదా :)
అధరముల కింక వలదు వ్య
వధాన మన "మేడసాని", వడవడ వడఁకెన్
బుధజనుడు బడుద్దాయి, స
మధికంబుగ పొంగగా సుమధురపు కొసరుల్!
జిలేబి
మధురాధర బింబాధరి
ReplyDeleteఅధర సుధలు ద్రావ బూను నంతెరుగని కా
మ ధరా బధిరుని సురతా
వధాన మన ' మేడ 'సాని వడవడ వడికెన్
Deleteమధురాధర బింబానన !
అదురహో రాజా !
జిలేబి
ReplyDeleteఅరయగ సధవ జిలేబియె!
పరమాత్ముని రూపమైన పతిని కొలుచుచున్
గురువువలె చూచి, తానను
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
***
మరిమరి నిన్నే కొలుతును
మరియాదకు మారుపేరు మహిళను మగడా
సరిబండయే తగు! ననా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
***
సరి! దేశమ్మున కై మో
డ్చి,రాణిని నను విడిచితివి డిమ్మరి ! నే వా
తెఱ తెరువననుచు శిష్టా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
మరి మాటలతో విన నొ
ReplyDeleteల్లరు కొందరు వెధవలు బుధు లట్టి పతులకున్
సరియగు రీతిని హైహీల్
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్ .
Deleteరాజా వారీ మధ్య మరీ దుష్టయిపోయినారు :)
నారదా!
జిలేబి
ReplyDeleteఅరయగ జానకి రాముని
శరాసనమునెక్కిడ తను సతియై చేరెన్
తిరుమాళిగవలదని నను
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
***
కొరకొర చూచెను శ్రీపతి
ని,రతగురువును, విడువంగ నియతిని; పెండ్లా
మరరే దిగ్గున లేచెన్
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
***
కొరియా దేశపు పిల్లయె
వరునిగ తెలగాణ మగని వరముగ పొందెన్
సరి తెలుగున సరి యుచ్చా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
జిలేబి
ReplyDeleteచరణంబును ద్రొక్కె నతడు
వరునిగ, తమకంబు హెచ్చి పతిని విటుడి తో
డు రహస్యముగా చంపి ప
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
***
తిరుమల శ్రీవారిని తా
పరమ పవిత్రముగ కొలిచి బ్రమరు పతిని సా
దరముగ చూచి యతని శ్రీ
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
(యెవరమ్మా ఆ శ్రీరంగరాయడు?)
***
పరిచయ మైన నిమేషము
సరి యితడే మగడనుకొని సతియై యోడం
గ రణమున బుస్సనుచు తా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
***
మురిపెమ్ముగ ముద్దులతో
వరించి పెన్మిటికి వలయు వసతిని కల్పిం
చి రతీదేవివలె సదా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
***
హరియొక్కడె పతి యగు నె
ల్లరికి తతిమ్మా పడతులె లావణ్యవతీ!
హరిపూజయె మేలన నను
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
***
పురివిప్పిన నెమలివలెన్
ధరణిని నాట్యంబులాడు తరుణి జిలేబీ
సరసము లాడి మదిని నా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్!
***
ReplyDeleteమురిపెపు ణిసిధాత్వర్థము
ను రతగురువు కోరగాను నునుసిగ్గుల నా
పరిగృహ్య మెయికొనగ, శం
కరి నినుడాక్రమణ జేసె కాంక్షలు హెచ్చన్!
జిలేబి
ReplyDeleteతిక్క సన్నాసి ! చదివి మతియు చెదరెనొ
కొ? తల లో గడ్డి యెక్కెనకొ?పలు మార్లు
నేర్చు కొంటివి గదరా దినేశ! యెట్లు
కుక్క గడ్డిని, మాంసమున్ గోవు, దినును?
జిలేబి
ReplyDeleteఅచ్చు తప్పు లాయె నయ్య ముందు పలుకు
లోన చేతి వ్రాత లొల్లి యో! జి
లేబి మాయయో? తెలియదయ్య మార్చుడి
వీలు గాన నిపుడె విదుర! మేలు!
జిలేబి
ReplyDeleteతిక్క సాముల దేశము తీరు తెన్ను
లేని నగరము చూడగ లెస్స గాను
కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును
దారి తప్పి వెళ్ళవలదు తమ్మికంటి !
జిలేబి
ReplyDeleteమా హై దరబాదున మె
ట్రో హై ! జాతీ హు చడ్కె టోకురు తోడన్
సాహో నుమాయిషునకున్
చాహే తో ఆవొ ఆవొ చకచక రమణీ :)
జిలేబి
ReplyDeleteమేమనకండి! మన మనం
డీ!మాస్టారండి!నౌకరీ కొరకండీ
మేమీ దేశంబొచ్చే
మూ మీలాంటి నరులము సమోస జిలేబీల్ :)
జిలేబి
ReplyDeleteఅయితే ఓకె! అలాగే !
ప్రియమైన హితుడ కుమార ప్రేమయు మీరన్
జయమగు నీకే మనకే
పయనమున బతుకు పయనపు బాటని పవనా :)
జిలేబి
ReplyDeleteఆరవ పొత్తంబొచ్చెను
శ్రీరస్తు! శుభముల జేర్చు చిరు కానుకగా
సారము జీవిత సారము
ధీరత ధీమతయు చేర్చు దీటుగ శర్మన్ !
జిలేబి
ReplyDeleteముందు మాటగ రాసిరి ముద్దుగా జి
లేబి యెవరికో ఫిట్టింగు లెస్స గాను
చూచెనకొ రమణి? గమనించుట మరచెనొ
కో తెలియలేదె! నారద కొంత చూడు :)
ఏ పొత్తమున కెవరు రాసిరి ముందు మాట :)
జిలేబి
ReplyDeleteదత్తపది - 152 (సంధి-సమాస-కారక-క్రియ)
సంధి - సమాస - కారక - క్రియ
పై పదాలను ప్రయోగిస్తూ
భారతార్థంలో
***
క్రియగొను మయ్య కిరీటీ!
భయమేలన్? కారకుడను! పని నీదయ్యా
నియతి,దెస, మా సతద గా
పయనము సాగించు, సంధి, పరిధిని దాటెన్!
జిలేబి
ReplyDeleteకుంతీదేవి తో కర్ణుడు
ఓ యమ్మ సమాసక్తి క
లాయె! యపక్రియను చేయ! లక్ష్యము పార్థుం
డే యితరుల తాకను! నే
నై యపకారకము గాను యభిసంధియిదే!
జిలేబి
ReplyDeleteఓపిక తోవిను రమణీ
తాపము కోపము పిరియము తమతమ పరిధిన్,
లాపము మదమత్సరములు
పాపము, లేకున్న, జగము పాడైపోవున్!
జిలేబి
ReplyDeleteమల్లెల గురించి యాంధ్రుల
కెల్లలు లేని తెలివిడి సఖీ గలదు సుమా
చిల్లర తెలగాణ జనుల
కెల్ల యివి తెలియ తరమకొ కేకే కేకా :)
నారదా
జిలేబి
ReplyDeleteమల్లెల వాసన మత్తున
కల్లాకపటం బెరుగని కబరపు శ్రేష్టుం
డల్లే పేరొందిన వా
రల్లా! నారదుడయిరి మరకత జిలేబీ :)
జిలేబి
ReplyDeleteవ్రాయగ జిలేబి పద్యము వాహిని వలె
కొట్టుకొని పోయె గాలికి, కొండలెల్ల,
కోనలెల్ల దాటి గురువు కొల్వు జేరి
శంకరాభరణముగ విస్తరిలెనచట !
జిలేబి
కొట్టుకొనిపోయె గాలికి , కొండలెల్ల
ReplyDeleteనిండి , మదగజమ్ముల మాడ్కినుండు నీర
దములు కురియకనె , యకట ! దాహ మెటుల
తీరు వనచరముల కిక , దేవ దేవ !
ReplyDeleteఏడవ పొత్తంబొచ్చెన్
చూడగ తడిమె క్షవరమును చువ్వనగ జిలే
బీ! డమ డమ కల్యాణం
బాడబ సరిగమపదనిస పదనిస గరిసా !
జిలేబి
ReplyDeleteసదనమున శంకరులు కై
పదమివ్వగ నా జిలేబి ప్రత్నపు శతక
మ్ము దయ పదముల జొనిపి తన
పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ!
***
పదరక త్రోసుకు చకచక
పదండి ముందుకని తాను ప్రగతికి బాటై
కదనపు శ్రీశ్రీ వేగపు
పదములు లేకుండ కవిత వ్రాసిన కవియౌ?
***
చదరంగపు పావుల జరు
పు దరువు వివిధముగ నడిపి, పూరణకై తు
మ్మెద ఝంకృతి వలె తనరెడు
పదములు లేకుండ కవిత వ్రాసిన కవియౌ?
***
కదనము చేయవలె జిలే
బి! దగదగ మనవలె నమ్మ విస్తారముగా
సదనమున నన్యదేశ్యపు
పదములు లేకుండ కవిత వ్రాసిన కవియౌ!
***
కుదురుగ నిలకడగ జనుల
మది నిలచెడు విధముగ సయి మధురిమ లొలుకన్
హృదయంగమముగ, డాంబిక
పదములు లేకుండ, కవిత వ్రాసిన కవియౌ!
***
బెదరకు! వణుకు భయమ్ము వ
లదమ్మ రుచిరపు జిలేబులవి వృత్తంబుల్
కుదురుగ దుష్టసమాసపు
పదములు లేకుండ, కవిత వ్రాసిన కవియౌ!
***
పదిలమ్ముగ నిలబడవలె
పదికాలములవి జిలేబి పది మందికి చం
దదిగాన ననౌచిత్యపు
పదములు లేకుండ, కవిత వ్రాసిన కవియౌ!
జిలేబి
ReplyDeleteవిదుషీమణినా ! నమ్మో !
పదుగురి లోనొకతెనయ్య భారతి నంతే
సదమలపు మనసు కలిగిన
విదురులు భాస్కరులు మీరు విస్తృత పరిధిన్
జిలేబి
ReplyDeleteపల్లె టూరి వాళ్ళము జిలేబమ్మ! సప్త
పదిని నమ్మిననూ మరి భయము విడువ
మమ్మ యేడన నే యనమమ్మ నగరి
బామ్మ వినవమ్మ మామాట పంచులచ్చి :)
జిలేబి
ReplyDeleteనాదేముందండీ! అం
తా దేవుని దయయె! రామ తారక మంత్రం
బే దన్ను నాకు విదురా
వేదన మీరగ బిలచితి విభుడిని నెపుడున్!
జిలేబి
ReplyDeleteవారి నిజ నామ ధేయము
సారూ కనుగొను పని మన చావిడి లో చా
లా రోజులుగా వుందం
డీ! రుషి మూలము కనుగొనుడీ యన తరమా :)
జిలేబి
ReplyDeleteకులమనునది శ్రమ విభజన
వలన జిలేబీ కలిగెను వసుధని వినుమా
పలకా బలపపు బాలుడు
పలికె నదురహో యనంగ పాఠము గానన్ :)
జిలేబి
ReplyDeleteపాట యెన్ని సార్లు పడతుక విన్నను
తనివి తీర దమ్మ తమ్మి కంటి !
నాటి పాట నోట నానెను సరళము
గా జిలేబి వలె సుగమము గాన!
జిలేబి
ReplyDeleteరాదను కోకమ్మ జిలే
బీ!దరసల్ ఛందమేమి భీకరమనుకో
కే! దృఢముగా యతనమును
నీదగు రీతి తనివార నిమ్మ దరిగనున్ !
జిలేబి
ReplyDeleteతీగను లాగగ డొంకయు
బాగుగ కదిలె మరియొక టపావచ్చునికన్
మా గురు వర్యుల జ్ఞానము
చేగూర్చు మరియొక మణిని చెలియ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteసప్తమును తెలుగున పలుక
క్లుప్తము గా నారునకొక కూడికతో ని
ర్లిప్తత చూపుదురుగదా
క్షిప్తము గా చూచి రమణికి తెలియనిదకో ?
జిలేబి
సప్త ఋషులు, ఏడడుగులు అంతా భ్రాంతియేనా ?
Delete@నీహారిక గారు
Deleteసప్త ఋుషులు భ్రాంతి కాదే ! 😀
సప్తర్షులు √
Deleteసప్తఋషులు ×
అవును మాస్టారూ. నేను కూడా తప్పుగా వ్రాశాను. థాంక్స్ 🙏.
Deleteఏడు సంఖ్య మంచిది కాకపోతే సప్తర్షులూ, ఏడడుగులూ దండగే కదా ? ఇన్నాళ్ళూ ఏడడుగులు నడిచేస్తే పెళ్ళయిపోయినట్లే అని అన్నారు కదా ఇపుడు ఆరున్నొక్క రాగంలో ఏడవాలా ?
Deleteఏడు అనే అంకెనే కాదు ఒకటి అంకెను కూడా ధాన్యం
Deleteకొనుగోలులో జరిగే కొలమానంలో పలుకరు .ఇది వ్యాపార లాభాపేక్షకు సంబంధించిన అంశం . ఏడు అశుభం ఐతే పెండ్లికంటే శుభకార్యం మరోటి ఏముంటుంది ? తెలుగువాళ్ళు మూడు ముళ్ళు , ఏడడుగులు అనే మాటలు తరచుగా వాడేరంటే ఈ అంకెలు శోభనమయాలే .
ReplyDeleteసీతా నీచేతను నా
చేతను వెదికించిరి ప్రతి చెట్టూ చేమా
ద్యోతక మవ పువ్వుల! పని
యీతరముగ పొద్దుగూకులివి మనకేలన్ ?
జిలేబి
భలే గొణుక్కుంటున్నారు! కానివ్వండి కానివ్వండి. మీరేమనుకున్నా నాకు మాత్రం పొద్దుగూకులా ఇదేపని. సరేనాండీ?
Delete
ReplyDeleteవృత్తుల జోడించిరిగా
గుత్తుగ నాపై జిలేబి గుసగుస లన్ బా
గొత్తుచు పద్మార్పిత! మీ
రత్తరి తానిత్తరి కత రంజుగ సాగెన్ :)
జిలేబి
ReplyDeleteకలని గొణుక్కుంటున్నా
రలెవుంది! విడువను నేను రఫ్ఫాడిస్తా !
అలవైకుంఠపు దేవుడి
వలె నిలచిన చాలదు! మరి పని చేయిస్తా :)
జిలేబి
ReplyDeleteఆపుకొన లేక శలభము
దీపమున పడి మృతి నొందె దిగ్గు నెగయుచున్
దీపంబణగారగ నా
దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్!
***
దీపము బెట్టుకొనెను తా
నా పడతుక బుగ్గ చిదిమి నచ్చగ పెండ్లా
మై పక్కన రాగా, నా
దీపముపై నొక్క యీగ ధీరత వ్రాలెన్ !
***
నీ పద చింతన యే మే
లౌ పుడమిని వేంకటేశ! లగ్గగు పొలియున్
నాపద మొక్కుల రాయుని
దీపముపై నొక్క యీగ ధీరత వ్రాలెన్ !
***
ఆ పోలీసుల బండిని
దీపమ్మే యెర్రగాను దీప్తిని చేయన్
నోపిక తాళక బిరబిర
దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్
జిలేబి
ReplyDeleteమన సభలో జీపీయెస్ వారు :)
అల్లాటప్పా యే కా
రల్లా టములేని వారు రయ్యన గానన్
చల్లగ మెల్లగ పద్యపు
భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్!
***
వేట గాడు - వేట, 'గాడు' :)
అల్లా దయ! దూరె బరిసె
భల్లూకము కడుపులోన! భానుఁడు పొడిచెన్
నుల్లాసముగా నెత్తెను
జొల్లను దాటి గృహమునకు జోరుగ చేరెన్ !
జిలేబి
ReplyDeleteమల్లెల మాసము ! ప్రేయసి
యుల్లాసము ప్రియునిచేరె! యుజ్యపు యానం
బల్లన జల్లన భళ్ళన
భల్లూకము; కడుపులోన భానుడు పొడిచెన్ !
జిలేబి
తల్లీ ...ఈ పద్యమునకు అర్ధం చెపుతారా ?
Delete
Deleteతెలియదు
జిలేబి
ReplyDeleteగందర గోళము సర్వము!
సుందర రాముడయిజాకు సూచన యదిగో
ముందర నే బ్లాగునకిక
తొందర బీగమును వేతు తొప్పని పోకన్ :)
జిలేబి
ReplyDeleteవలదన్నన్ విజ్ఞులు నే
నలుకను కీర్తనల రామ నామము పయినన్
కలగాంచను స్వామి చదువ
రులు వత్తురని సుజనా! గురో నరసన్నా !
జిలేబి
ReplyDeleteముందు కోప మెక్కువ నాకు మొరలిడుదును
స్వామి మన్నింప! విడువను స్వామి చరణ
ములను విడువను విడువను మోద మదియె
నాకు జీవన వాహిని నాదు గాన !
జిలేబి
ReplyDeleteఅంకెలు శోభన మయములె!
లంకెల వేయుచు మనజను లర్థము పర్థం
బింక కనరాక నమ్మిక
వంకన కట్టిరి కతలను వనిత ! జిలేబీ !
జిలేబి
ReplyDeleteవచనైక్యత కావలెన
మ్మ చకచక పదముల వేయు మహిళా పద్మా!
కిచకిచ లాడించగ త
ల్లి చరణములనెల్ల యే ఫలితమిక గలదోయ్ ?
జిలేబి
ReplyDeleteబంధము లన్నియు సత్సం
బంధములే! రాముని దయ ప్రాప్తము గానౌ
సంధాన పడెనను కొనుము
దంధనమే యైనను మరి తప్పని దయ్యా !
జిలేబి
ReplyDeleteమానసము సేద దీరును మహిని రమణి,
జవనము వలె కలుగు ధృతి చక్క గాను
జబ్బు లేమియె భాగ్యము జనుల కెల్ల,
వనమునన్ సంచరింప వైభవము దక్కు!
జిలేబి
ReplyDeleteఏదో మీ అభిమానము !
సాదరముగ వందనములు శర్మాజీ ! మీ
ఆదరణ మరువ లేనిది
నా దే దో కొంత యేను ! నాజిమ్ మీరే !
జిలేబి
ReplyDeleteవిన్నకోట వాగఱ మరి విశద పరచ
కుండ తేటతెల్లగచేయు కుండ బద్ద
లవదు కాని నీరము పారు లక్షణముగ
విశ్వదాభి జిలేబియ వినవె భామ :)
జిలేబి
. . . విశ్వదాభి జిలేబియ వినవె భామ . . .
Deleteమరీ యింత అర్థంపర్థంలేని విధంగానా? విశ్వదాభి ఏమిటీ? అసలు విశ్వదాభిరామ అన్నది విశ్వదాభి + రామ అనుకుంటున్నారా మీ విద్వత్తుతో? అది విశ్వద+ అభిరామ అని! విశ్వదాభి అట విశ్వదాభి. రాముడా తెలుగుభాషని రక్షించవయ్యా!
Deleteజిలేబి విశ్వదాభి :)
విశ్వద + అభి :)
విశ్వపు లిపి :) గుండు గుండుగా యుండును
ఇట్లు
విశ్వదాభి జిలేబి
హతవిధీ!
Deleteఅభి అనేది ఉపసర్గగా మాత్రమే వాడుకచేస్తారండీ. మీరేమో ఏమిటేమిటోగా మాట్లాడుతున్నారు. కర్మ.
Deleteమీ తెలుగు వాళ్ళతో వచ్చిన చిక్కే యిదండి :)
ఆ కాలంలో వాళ్ళు అట్డా చెప్పేరు కాబట్టి అట్లాగే
రాయాలంటారు :) అబ్బబ్బ బలే చిక్కండి బాబోయ్ !
అభి అంటే లిపి అన్న పదముంటే విశ్వదాభి అని రాసి పడేసా :)
అబ్బబ్బ ఈ తెలుగయ్యోర్లతో మహాచిక్కేను :)
జిలేబి
ReplyDeleteతెలుగును కాపాడుటకును
జిలేబి, రావలెను సీత చిత్తేశుడె పో
తలరాత యేమి చేతు ని
లలో విడువడు నను సదమలపు భక్తుడె పో :)
జిలేబి
. . . సీత చిత్తేశుడె . . .
Deleteఇచ్చవచ్చినట్లు వ్రాయకండి. సీతా చిత్తేశుడె అన్నదే సరైన సమాసం.
ఐనా మీకు సలహా ఇచ్చే దుర్గతి యేమిటి నాకు!
సీత చిత్తేశుడు కరక్టే
Deleteలక్ష్మి వల్లభుడు లాగ
లక్ష్మీ వల్లభుడు , లక్ష్మి వల్లభుడు , సిరి చెలువుడు
ఇవన్నీ కరక్టే .
Deleteహమ్మయ్య!
లక్కాకుల వారు కాపాడేరు !
నెనరులు
జిలేబి
శ్యామలీయం గారికి కోపం వస్తే మంచి పద్యాలు రాలతాయ్ సీతాపతీ !
Delete
Deleteఏతావాతా శ్యామలు
డే తగు సీతాపతికి ఫిడేలునట జిలే
బీ తనివిని వాయింపన్
కైతలు కైపెక్కును మనకై కోపమునన్ :)
జిలేబి
ReplyDeleteవానప్రస్థపు వనమున
మీనాక్షీ తొంగొనక సమీక్షించు సుమా
నానాటి కతల పద్యపు
దీనారముల విభవమ్ము తియ్యందనముల్ :)
జిలేబి
ReplyDeleteఅయినా సలహా మీకి
చ్చు యవారము నాకదేల! చుప్ చాప్ పోకన్ !
వయసాయె తాళదుగదా
సయింప తప్పు తడకల బజారున రామా :)
జిలేబి
ReplyDeleteమీ విదురుని నానుళ్ళవి !
నే విన్నది కాదు దారిని చదివి పోదా
రీ విదురుల పల్కుల కిది
యే వివరణయో యనుకొని యెర తెలుపంతే :)
జిలేబి
వెండి చెప్పుతో కొట్టి క్షమించమంటే దేవుడు క్షమిస్తాడా ?
Deleteఈ మ్రొక్కు భలే ఉంది. కోట్లమంది చూస్తుండగా నేను చెప్పుతో కొట్టాలనుకున్నవాళ్ళను కొట్టగలిగితే వెండి పాదుకలు సమర్పించుకుంటా !
Deleteరండి
రండి మీ కోసమే లాగిందది :)
నారదా!
కొండాట్టమే కొండాట్టమిక !
యేమేమి పేలబోతాయో యిక :)
జిలేబి
అంతే, కొన్ని పనులు డబ్బులిస్తే జరుగుతాయి, కొన్ని పనులు బెదిరిస్తే జరుగుతాయి 🦁.
Delete
ReplyDeleteతన పరిధిని మీరడనుచు తరుణి మన
మల్పుఁ జెప్పనగు; మహాత్ముఁ డనుచు
చెప్ప గలము సూవె చెన్నుగ దన్నుగ
గళము విప్పిన మన గాంధిని చెలి !
జిలేబి
ReplyDeleteకొత్త కొత్త మొక్కుల సరి కొత్త గా జి
లేబి కనిబెడు తున్నారు లెస్సగాను
వెండి చెప్పుల కతకిక వేతు తాళ
మును జనుల కుతిలంబిక ముదురు గాక :)
జిలేబి
ReplyDeleteముకుదాడు బట్టి లాగిరి
పకాలు న నగవును రువ్వు ప్రద్యుమ్నుడినే
సకి, ముందుమాట రాయమ
ని, కవచిత ఘృతాచిని, కమనీయంబాయెన్ !
జిలేబి
ReplyDeleteపొత్తంబొచ్చెను గా సరి
కొత్తగ శర్మ కబురులు! పకోడి జిలేబీల్
కొత్తు పరోటాలై సఖి
సత్తువు కల్గిన విదురుని చదురుదనముగా !
జాల్రా జిలేబి
కష్టేఫలి వారి తొమ్మిదవ పొత్తానికి గ్రీటింగ్స్ 🙂
ReplyDeleteమైలవరపు వారి కీచకుడు :)
సరసిజ! లగనంబిదియే
సరసకు రా!కప్పడమగు సరసుడ నేనే
సరిచేపడు రమణీ! న
త్తరి సైరంధ్రి తిరుగకు! స్మితా!కీచకుడన్!
జిలేబి
ReplyDeleteశ్రీకృష్ణుడు రణరంగంలో పార్థునితో
నా మేనత్త కుమారుడ!
నీమము ! చేపట్టుమయ గుణిన్ జలగడుగన్!
జామిగ కప్పడివలె పా
ర్థా మగటిమి వీడకు! బవరముసాగింపన్!
జిలేబి
ReplyDeleteనేటి భారతం :) ఇందిరా గాంధి తరువాయి చార్మ్ కోల్పోయిన స్థలమును మళ్ళీ మా నీరజ నేత్ర ప్రియాంకయే పట్టాలి :)
ప్రజల గళమెవరికి వలయు
ను జోటి? చేపట్టవలయును మన ప్రియాంకా
గజగామినిగా కప్పం
గ జనుల కన్నులు జిలేబిగా నత్తలమున్ :)
జిలేబి
ReplyDeleteగరికిపాటి వారి అదురహో నిషిద్ధాక్షరి కందం !
మా వాడు రాజు గాడా
శ్రీవారున్ లేరు నవ్వరే నన్జూడన్
రావా తల్లీ దిక్కిక
నీవే కావన్ ప్రియాంక నీరజ నేత్రా!
ReplyDeleteసాగెను జీవన యానము
రాగద్వేషములు తొలగ రతగురువతడే
శ్రీగురువును చేరగ సం
యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్!
జిలేబి యోగము :)
ReplyDeleteబీగము వేసెను నింటికి
సాగె చలిమలకు విదురుడు సాగిల బడగా
జోగి! గురో! యని యోగికి
యోగికి, యోగమ్ము నేర్పె యోగి ముదమునన్!
జిలేబి
ReplyDeleteరోగములు వీడు జనులా
రా గబగబ ! యోగ మహిమ! రారండయ్యా
యోగా డేయిదియే! ప్రతి
యోగికి, యోగమ్ము నేర్పె యోగి ముదమునన్!
జిలేబి
ReplyDeleteఆ గుజరాతుని మోడీ
సాగిల బడజేసె! మెప్పు సాధించె! భళా
సేగిని ద్రోలగ సేనా
యోగికి, యోగమ్ము నేర్పె యోగి ముదమునన్!
సర్జికల్ స్ట్రయిక్ !
కర్మణ్యేవాధికారస్తే !
జిలేబి
ReplyDeleteమక్కిలి కాదు జిలేబీ
మిక్కిలి ! టైపాటు సూవె !మిడతంబొట్టై
టక్కున తప్పుగ పడెనోయ్
చక్కని చుక్క వినవమ్మ చక్కెర కేళీ :)
జిలేబి
అన్నిటికీ ఇరవైనాలు గ్గంటలూ వెక్కిరింపు కొక్కిరాయి గిద్యాలేనా? ఒక ప్రక్కన ఎంతో మానసిక గ్లానితో ఉన్న స్థితి. మరొక ప్రక్కన నాది నిమిత్తమాత్రపాత్రగా వస్తున్న కీర్తనాస్రవంతి.ఈమాటలను కూడా హాస్పిటల్ బెడ్ ప్రక్కన కూర్చని మొబైల్ సాయంతో వ్రాస్తున్నాను. ఇందులోనూ టైపో లుండవచ్చును.
Delete
DeleteYes sir
I came to know.
Take care.
By His grace all will be set right.
జిలేబి
ఏమైంది శ్యామలరావు గారూ? ఏవైనా ఆరోగ్యసంబంధిత చికాకులా? ఏమయినప్పటికీ అంతా త్వరలోనే మెరుగవుతుందని ఆశిద్దాం.
Delete
ReplyDeleteఎంత మాట సులుబు వారు ! ఎంత మాట
చెప్పి రభిమానమంతయు! చేవ మీది
కాస్త ముందుగ చూడన్ సఖా యనుమతి
నిచ్చిరి పదివేలదియేను నెమ్మి తోడు !
జిలేబి
ReplyDeleteసూటిగ ప్రశ్నించేరం
డీ!టక్కరి మృగమువలె పడి మనల హింసిం
చే టింగురంగ గాళ్లకు
కోటింగిచ్చేరు పద్మ కొవ్వును బోవన్ !
జిలేబి
ReplyDeleteఅద్దరి మాకందముగా
నిద్దరి యుత్పలముగా తనివి తనరారన్
ముద్దుగ కైపద సేవల
నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ !
జిలేబి
ReplyDeleteఅరెరే చూడండయ యు
త్తరము నిరర్థకపు పేటి దాగెనకో న
త్తరి?కంది శంకర తెలుపు
డరయగ మాకు దయచేసి టప్పున సుమ్మీ
జిలేబి
ReplyDeleteఅత్తరి స్వయంజనిత ప్ర
త్యుత్తరమది వచ్చినదకొ తూణీరముగా?
సత్తెము గా చేరినటులె
నుత్తర మమ్మా జిలేబి నొవ్వు బడయకే :)
జిలేబి
ReplyDeleteపొద్దు తిరుకట్టెని నొకతె
నిద్దుర పోవు సమయము గునిసి యాడి వెసన్
గుద్దు శతముఖి మరియొకతె!
యిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ :)
***
వద్దనక కట్టుకొనవే
నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ
నద్దరి సత్యను గనుమా
ముద్దని శ్రీరాముని సతి ముద్దేమి గనెన్ ?
***
అద్దరి ధరణిగ నొకతెయు
నిద్దరి తన కాళ్లమాటుని నొకతె భళిరా
నిద్దుర యే యోగముగా
నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ!
***
హద్దరి బన్నా నెమ్మిని
చద్దెపు వణ్ణము వలెన్ కొసరి కొసరి నిడెన్
పొద్దనక రాత్రనక నా
నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ!
***
వద్దే వద్దు! జిలేబీల్
ముద్దని మనువాడకు! మును ముందర గండం
బద్దరి! నమ్మకు నిజమని
నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ!
ಜಿಲೇಬಿ