Thursday, May 21, 2020

రిలయన్స్ షేర్ 1200 వందలకు కొనుక్కోవడం ఎలా ?



రిలయన్స్ షేర్ 1200 వందలకు కొనుక్కోవడం ఎలా ? 

ఈ మధ్య రిలయన్స్ షేరు మార్కెట్టు లో టాక్ ఆఫ్ ది టవున్ అయిపొయింది. మా తాత గారు కూడా అబ్బో నాకు ఆ రైట్స్ షేరు కావాల్సిందే నేనా షేరు ౧౨౫౦ రూపాయలు పెట్టి కొనే కొంటాను అని మంకు పట్టినారు. 

ఈ మంకు చూసి ముచ్చటేసి తాతగారు ౧౨౫౦ రూపాయల కెందుకు కొన్ని రోజులు ఆగండి ౯౯౯ రూపాయలకే మార్కెట్టు లోకి వచ్చును ! అప్పుడు జీ భర్ కొనేసు కోవచ్చంటే సుతరామూ కుదర దంటారు. నాకిప్పుడే కావాలె అంటూ మంకు ! 

వాడేమో జూన్ నెలలో ఇవ్వ బోతాడు. కాబట్టి జూన్ నెలలో రిలయన్స్ షేరు ఎట్లా ౧౨౦౦ రూపాయలకు కొనుక్కోవడం ? అన్న దాని మీద ఈ టపా అన్న మాట. !

ముఖ్య గమనిక- మీరు నిజంగానే ౧౨౦౦ రూపాయలకు కొనుక్కోవాలె అనుకుంటే నే ఈ మార్గాన్ని ఎంచుకోండి :)  

Advices are subject to market risk and all risk on your own. Zilebi has no liability what soever 

అనెడు పూర్వ నో పూచీ కత్తు టపా ఇది. 

ఏమి చెయ్యాలె ? 

డబ్బులు సరాసరి ఓ రెండు లకారాలు మీ బ్రోకింగ్ అకౌంట్ లో పెట్టేసు కోండి. మిగిలిన నాలుగు లకారాలు మీ బ్యాంకు అకౌంటు లో వుండే టట్టు చూసుకోండి. ఉల్టా పుల్టా అయి మీరు నిజం గానే ౧౨౦౦ కొనవలసి వస్తే కొనుక్కోవడానికి . 


ఆ తరువాయి  

మార్కెట్టు స్లయిడింగ్ దినాన  రిలయన్స్ షేరు జూన్ ౧౨౦౦ పుట్ ఆప్షన్ కనీసం  ఓ యాభై రూపాయలైనా  పలికే రోజు ౧౨౦౦ జూన్ పుట్ ఆప్షన్ ఓ కాంట్రాక్టు ( ఒక కాంట్రాక్టు ౫౦౫ షేర్లు ) అమ్మండి. ఇలా అమ్మడం ద్వారా ప్రీమియం మీకు ౫౦౫ * ౫౦ రూపాయలు వస్తుంది అంటే ౨౫,౨౫౦ రూపాయలు. 

ఇప్పుడు జూన్ నెలాఖరు ఆప్షన్ ఎక్పైరి కి వైట్ చేయండి. ౧౨౦౦ వందలకు వస్తే  అప్పటికి మీకా యావ స్టాకు కొనుక్కోవాలే అని ఇంకా ఉంటే ఆప్షన్ డబ్బులు పోను మిగతా డబ్బులు పెట్టి కొనుక్కోండి. 

లేదూ రాలేదూ అంటే ఆ ఇరవై ఐదు వేలు దక్కిందే లాభం అనుకోవడమో దానితో ఆ నాటికి ఎన్ని షేర్లు ముఫత్ లో వస్తే కొనుక్కోవడమో చేసుకోండి :) 


ఇట్లు 

జిలేబి 

జాం బజారు జగ్గు నా సైదా పేట్టై కొక్కు :) 

Friday, May 15, 2020

కొంత హాయిగా నవ్వుకుందామా


ఎంజాయ్ !




చీర్స్
జిలేబి