రిలయన్స్ షేర్ 1200 వందలకు కొనుక్కోవడం ఎలా ?
ఈ మధ్య రిలయన్స్ షేరు మార్కెట్టు లో టాక్ ఆఫ్ ది టవున్ అయిపొయింది. మా తాత గారు కూడా అబ్బో నాకు ఆ రైట్స్ షేరు కావాల్సిందే నేనా షేరు ౧౨౫౦ రూపాయలు పెట్టి కొనే కొంటాను అని మంకు పట్టినారు.
ఈ మంకు చూసి ముచ్చటేసి తాతగారు ౧౨౫౦ రూపాయల కెందుకు కొన్ని రోజులు ఆగండి ౯౯౯ రూపాయలకే మార్కెట్టు లోకి వచ్చును ! అప్పుడు జీ భర్ కొనేసు కోవచ్చంటే సుతరామూ కుదర దంటారు. నాకిప్పుడే కావాలె అంటూ మంకు !
వాడేమో జూన్ నెలలో ఇవ్వ బోతాడు. కాబట్టి జూన్ నెలలో రిలయన్స్ షేరు ఎట్లా ౧౨౦౦ రూపాయలకు కొనుక్కోవడం ? అన్న దాని మీద ఈ టపా అన్న మాట. !
ముఖ్య గమనిక- మీరు నిజంగానే ౧౨౦౦ రూపాయలకు కొనుక్కోవాలె అనుకుంటే నే ఈ మార్గాన్ని ఎంచుకోండి :)
Advices are subject to market risk and all risk on your own. Zilebi has no liability what soever
అనెడు పూర్వ నో పూచీ కత్తు టపా ఇది.
ఏమి చెయ్యాలె ?
డబ్బులు సరాసరి ఓ రెండు లకారాలు మీ బ్రోకింగ్ అకౌంట్ లో పెట్టేసు కోండి. మిగిలిన నాలుగు లకారాలు మీ బ్యాంకు అకౌంటు లో వుండే టట్టు చూసుకోండి. ఉల్టా పుల్టా అయి మీరు నిజం గానే ౧౨౦౦ కొనవలసి వస్తే కొనుక్కోవడానికి .
ఆ తరువాయి
మార్కెట్టు స్లయిడింగ్ దినాన రిలయన్స్ షేరు జూన్ ౧౨౦౦ పుట్ ఆప్షన్ కనీసం ఓ యాభై రూపాయలైనా పలికే రోజు ౧౨౦౦ జూన్ పుట్ ఆప్షన్ ఓ కాంట్రాక్టు ( ఒక కాంట్రాక్టు ౫౦౫ షేర్లు ) అమ్మండి. ఇలా అమ్మడం ద్వారా ప్రీమియం మీకు ౫౦౫ * ౫౦ రూపాయలు వస్తుంది అంటే ౨౫,౨౫౦ రూపాయలు.
ఇప్పుడు జూన్ నెలాఖరు ఆప్షన్ ఎక్పైరి కి వైట్ చేయండి. ౧౨౦౦ వందలకు వస్తే అప్పటికి మీకా యావ స్టాకు కొనుక్కోవాలే అని ఇంకా ఉంటే ఆప్షన్ డబ్బులు పోను మిగతా డబ్బులు పెట్టి కొనుక్కోండి.
లేదూ రాలేదూ అంటే ఆ ఇరవై ఐదు వేలు దక్కిందే లాభం అనుకోవడమో దానితో ఆ నాటికి ఎన్ని షేర్లు ముఫత్ లో వస్తే కొనుక్కోవడమో చేసుకోండి :)
ఇట్లు
జిలేబి
జాం బజారు జగ్గు నా సైదా పేట్టై కొక్కు :)
మరీ అంకెలు కూడా తెలుగులో రాసేసరికి దేని రేటు ఎంతో అర్థం కావట్లేదు.
ReplyDelete
Deleteమిగితా మొత్తము అర్థమయిందంటారయితే :)/
ఆల్ ది బెష్టు ఫార్ యువర్ ట్రేడ్ :)
జిలేబి
మీకు కోటీశ్వరుడు కావాలని ఉందా అని ఒకడు నిన్న యూట్యూబ్ లో వీడియో పెట్టాడు. ఒక్కరోజుకే మూడు లక్షలమంది చూసారు. వీడియో చూసినవాళ్ళ సంగతేమో కానీ ఆయన మాత్రం కోటీశ్వరుడు అయ్యాడు.
Deleteరిలయన్స్ రైట్స్ కూడా అదే బాపతు.
నాకొచ్చినవి 3 rights. 205 రూపాయల లెక్క అమ్మివేసితిని.
ReplyDeleteమీ షేర్లు ఏమో కానీ మీరు షేర్ చేసిన తెలుగు దానిపైన మీ అభిమానం కనబడేలా చక్కగా వివరించారు.
ReplyDeletehttp://sskchaithanya.blogspot.com
ReplyDeleteప్చ్! ఈ రిలయన్స్ షేరు వెయ్యెన్ని రెండు వందల రూపాయలకు రాకుండానే ఆప్షనెక్స్పయిరీ అయిపోతోందే మరీను !
:)
జిలేబి
RIL partly paid share selling @ 1200 today :)
ReplyDelete
Deleteకొండలు కూలుచున్నట్లున్నవి. అమ్మి డబ్బులు చేసుకుని ఉంటే సరి :)
జిలేబి
Yes. Right time to make money. Sell
ReplyDeletetesting
ReplyDelete