Saturday, February 10, 2024

విప్లవ తపస్వి! పీవీ! భారత రత్న!

 

ప్రావీణ్యానికి పట్టము!

పీవీ! విప్లవ తపస్వి! వికసిత భారత్

నీ వదలని పట్టాయెన్

భావితరానికి వెలుంగు  భారతరత్నా!https://www.telugubooks.in/te/products/viplava-tapasvi-p-v


జేజేలు


జిలేబి

52 comments:

 1. -

  నరసింహుడు! పట్టువదల
  ని రాజ కీయమ్ము స్ఫూర్తి నింపెడు రూప
  మ్ము! రచయిత వేయిపడగలు
  పురికొల్పగ హిందిభాష పుష్టిపడెనుగా!


  ReplyDelete
 2. హరిభక్తులు మరలా పు
  ట్టరు; కాదనిన హరిని చెడుటయె సత్యము! శ్రీ
  హరియే శ్రీరాముడు! దా
  శరథియె సత్యమ్ము మాకు సంశ్రయమతడే!


  ReplyDelete
 3. -

  ఒద్దిక గా కూర్చొని వర
  సిద్ధి వినాయకుని నొప్పు చిత్రము వేయన్
  బుద్ధికలిగె నా మదిలో
  నద్దాని ఫలితమరుదు గణాధిపతి యిగో!

  ReplyDelete
 4. -
  వ్యయముల నొనరించి పరిపరి వెదుకుచు
  కనుల పడిన వారి కాళ్లకెల్ల
  మ్రొక్కుటేల! చిలుకు మోయి మదిని నంద
  భయముఁ గూర్చువాఁడె పరమగురుఁడు!


  ReplyDelete
 5. ఓ బ్యాచిలరు వ్యధ

  ఏమని చెప్పుదు బాధను!
  భామినులెవరు దరిరారె! వయసుడిగెను నా
  కామితఫలమ్ము తీరదొ!
  ప్రేమికుల దినోత్సవమని విలపింపదగున్.


  ReplyDelete
 6. -

  సాకీ పై ధ్యానిస్తూ
  నే కించిద్ధీర్ఘమైన నిదురుని జారన్
  సాకీ రానే వచ్చిం
  దీ కోమలపు మధుపాత్రని కెడనిడి చనెన్!  ReplyDelete
 7. -
  సాంప్రదాయపు షాపింగు చాల చాల
  కిక్కు జేర్చునాన్లైనులో కెలికి కెలికి
  కొనుటకన్న ! అదో తృప్తి గూర్చు మనకు
  బేర మాడ భలే మంచి బెట్టు చేసి  ReplyDelete
 8. -
  మీ పరిచయాలను సరి
  గ్గా పనులన్ జేసుకొనుట కై యుపగించే
  రే! పడి గాపులు గాచిరి
  పాపము జనులెందరో సిఫారిసు లేకన్


  ReplyDelete
 9. -

  దొంగ పెనిమిటి పెండ్లాము దొంగ! నాకు
  తెలియనికతలు లేవురా తిక్క వెధవ
  లార! మీ చరితలు చాల లావు నాకు
  తెలియు తిక్కసన్నాసులు తెలుసు కొనుడి


  ReplyDelete
 10. -

  When tides are against you don't fight the market :)

  చెంగున మారగ మార్కెట్
  వంగి నమస్కృతిని చేసి పక్కకు తొలగన్
  టంగున నిర్ణయమున్ గొని
  సంగరమున నోడువాఁడె శౌర్యధనుండౌ!


  జిలేబి

  ReplyDelete
 11. -
  భాస్కరుని తేరు నడువన్
  తస్కరుడగు చీకటి త్వరితము బోవన్ శ్రే
  యస్కరమగు సుదినముల తి
  రస్కారములతిశయించె రథసప్తమిగాన్!  జిలేబి


  ReplyDelete
 12. -

  సాలరీ వచ్చిందాండీ ?

  అడుగులకుమడుగులనుసుతారమైన
  కైపులనడుమ నొద్దుచు కమలినట్టి
  విడియమిచ్చి భార్య యడిగె, "వేతనమును
  ప్రభుత యిచ్చెనొ యీనెల ప్రాణనాథ!"

  ReplyDelete
 13. -
  బాధెందుకోయి మానవ?
  రాధనమేల కనరాదు రా నేవస్తే?
  నాదానివనుచు సాకీ
  నీ దరి క్షణికమని తెలిసి నేనేడుస్తా

  ReplyDelete
 14. -

  కుక్క తోక వంపు కొంచెమైనను నీటు
  చేయ తరమగునకొ చేవయున్న
  తాత కతల జెప్ప తల్లడిల్లకబోవు
  నక్కొ వినవె బాల నాదు మాట :)


  ReplyDelete
 15. ఎ పి వా ఆ :)

  తెలుసు కొంటి తొందరపాటు తెప్పదెరలు
  నిర్ణయమనుచు వ్రాయుట నేను మాన
  లేను వేసుకొందును చెంపలేసుకొందు
  నాదు జన్మహక్కు రచనానందమయ్య


  ReplyDelete
 16. -
  ఎందు కొచ్చిన బ్లాగ్శోష! యెక్కడ గల
  రండి మంచి డాక్టర్లు !ఖరారు దుడ్డు
  దెయ్యములెగాని! నిలువుదోపిడియె వారి
  వృత్తి ధర్మమాయె సదా ప్రవృత్తి యయ్యె


  ReplyDelete
 17. -
  నిజమే నండీ ! ఆ తర
  పు జనులు వారి విలువలు యిపుడెచట గలవం
  డి!జవాబుదారి నడతయు
  ప్రజల కెడ కనబడదాయె! పలవింపదగున్


  జి- లేబుల్స్

  ReplyDelete
 18. వెజి టేరియన్ ఈతి బాధలు :)

  ఫారెను రెస్టారెంట్లం
  దౌరా వెజిటేరియనెటులార్డర్ చేతున్?
  హైరానా పడి వేసే
  స్తారే సీ ఫుడ్డొ చికెనొ తాళింపుగనే!  జి- లేబుల్స్

  ReplyDelete
 19. -
  ఇది మోదీజి ప్రభుత యొ
  క్క దిగ్విజయమిది ! యెడారి కర్వరి లో నా
  ల్గు దెసల సనాతనము, సం
  ప్రదాయపు విలువలు నిలచి వర్ధిల్లంగాన్ !

  ReplyDelete
 20. -

  మీ రాకను హర్షించే
  వీరుల్లో నేనొకండ వినుడీ సారూ!
  చీరేస్తా యెవరైనా
  మారు బలుక బండి తోలి మార్చెద వార్లన్

  ReplyDelete
 21. ఓ యబ్బో :)

  నాకభిమానులు కలరని
  హా! కుళ్ళుకునెడు జిలేబులకటా గలరం
  డీ! కుళ్లనిచ్చెదమలా
  గే కోన్కిస్కా జనులను కేర్ చెయ్యనికన్  ReplyDelete
 22. ఆహా!/యేమి నాట్యమయూరి నిఫ్టీ బ్యాంకు నిఫ్టీ :)

  ఓ నా బ్యాంక్నిఫ్టీ! కొం
  తైనా ఆగక వడివడి తారాపథమం
  దానాట్యమాడిన విధము
  వేనోళ్లపొగిడెద ! సాటి వేరెవ్వరు లే!  ReplyDelete
 23. -
  మధుసేవనమ్ము లోన క
  లదోయి కొండాటము జనులకుబోధపడన్
  తుదకర్థము వెతుక కనబ
  డదది అనుభవైకవేద్యరాధనమగునోయ్!  ReplyDelete
 24. -
  గలరండి అనానిమసులు
  జిలేబులూరు మధురంపు చిరునామాలోన్
  గలరండీ బుచికీలున్
  తళతళ సూర్యుళ్లు మెరయ తమ్ముళ్లున్నూ :)


  ReplyDelete
  Replies
  1. అనానిమస్సుల గురించి మీరే చెప్పుకోవాలి, ఖర్మ 🤨.

   Delete
 25. మీరే అనానిమస్సుల
  జోరు గురించి పలుకవలె జోహార్లు జిలే
  బీ! రుసరుస బుసలన్ విన
  రా రువ్విరి వ్యాఖ్య చూడ రాధనమాయెన్ :)

  ReplyDelete
 26. “ఆంధ్ర భారతి” నిఘంటువుకు ఏదో అయినట్లుందే?
  // This Account has been suspended.“”// అని చూపిస్తోంది. ఏమిటయ్యుండనోపు?

  ReplyDelete
  Replies
  1. మీ బ్యాంకు అకౌంటు గోవిందా అయిపోయి ఉండవచ్చు :)


   Delete
 27. ఓ కుంచిక మరో కామెంట్ కింగ్ ల వ్యధ :)


  గోవిందా ! యేమయ్యిం
  దే!వెతుకగ ఆంధ్రభారతి సయిటు ? తెరువన్
  గావటములేదు? సస్పెండ్
  సూవె! అకౌంటని మెసేజు చూపిస్తుందే ?
  ReplyDelete
  Replies
  1. సహబాధితులు కూడా ఉన్నట్లున్నారే 🤔? .

   Delete
 28. విన్నకోట నరసింహా రావుFeb 22, 2024, 11:40:00 AM

  అత్తగారికి కోడలిమీద కోపమొచ్చిందండి! అంతే!!!

  ReplyDelete
  Replies
  1. అయ్యుంటుంది సర్ 🙂. వాళ్ళిద్గరూ కూడా టీవీ సీరియళ్ళు చూస్తారో ఏమిటో గోల?

   Delete
 29. విన్నకోట నరసింహా రావుFeb 22, 2024, 11:40:00 AM
  కనపడె! కనపడె!! చూడుడీ!!!

  ReplyDelete
  Replies
  1. అవునండోయ్ శర్మ గారు 👌. అమ్మయ్య, “జిలేబి” గారు భయపెట్టినట్లు నా బ్యాంక్ అకౌంటుకేమీ కాలేదేమో ?

   అత్తాకోడళ్ళు కలిసిపోయుంటారు. కోడలు కాఫీ తెచ్చి “తీసుకోండత్తయ్యా, లేకపోతే మీకసలే నీరసం వస్తుంది” అనుండాలి, దాంతో సమస్య పరిష్కారమయ్యుంటుంది 🙂.

   Delete

 30. విన్నకోట నరసింహా రావుFeb 22, 2024, 7:50:00 PM
  అత్తాకోడళ్ళు కలిసిపోయుంటారు, నిజమండి. :) ఎంతైనా ఇద్దరూ ఒకటే కదండీ:)

  విన్నకోటవారు,
  ఒక చిన్నమాట. ఆంధ్రభారతి తదితరాలను ఒక వెబ్ లోప్రచురించి ఉంచాలంటే హోస్ట్ కి కొంత సొమ్ము అద్దె చెల్లించాలి లేదా వెబ్ ని కొనాలి. అత్తగారి పెత్తనం తప్పదు కదండీ కోడలుగారు ఉచితంగా విజ్ఞానం పంచిపెడతానంటే కుదురునా!అత్త పెత్తనం లేక? వీటికి అద్దె చెల్లించి వాటిని నిత్యమూ చూచుకోవాలంటే వారు చేసే శ్రమ ఎంత? వీటిని శ్రమైనా ఓర్చి నిర్వహిస్తున్న శ్రీ వాడపల్లి శేషతల్పశాయి మరియు శ్రీ కాలెపు నాగభూషణరావుగార్లకు జేజే లు

  ReplyDelete
  Replies
  1. అవును శర్మ గారు. అద్దె చెల్లించాలి.
   కందెన బెట్టక పరమేశుని బండియైన బారదు సుమతీ అన్నాడుగా బద్దెన గారు 🙂.

   Delete
 31. -
  నైవేద్యము భాస్కరునికి
  సై వడి పరమాన్నము వయసైన జనులకున్
  సేవకు సేవా భుక్తికి
  త్రోవా! మనుజల బలమ్మురో ప్రత్యూషా!
  ReplyDelete
 32. -

  అమ్మరొ అత్తా! యేలన్
  సొమ్ముకొరకు కోడలి వెలి సొబగులిడునకో?
  నిమ్మళముగ నీఖర్చున్
  తమ్ములిరువురున్ కలిసి వ్రతముగ నడిపిరే!


  ReplyDelete
 33. -
  జనుల మనసెరిగి తన మత
  మును నెలకొలిపి తుది శూన్యమును గమ్యమటం
  చును ప్రాకృతమున బౌద్ధ
  మ్మును స్థాపించి సరికొత్త ముందడుగునిడెన్  ReplyDelete
 34. -

  ఎవరి పులకింత రఘురా
  మ! వారికానందమయ్య! మా వడ్లను బా
  గు వొలిచి కానుక గా ని
  చ్చి వందనమిడుదము గోజి సేవకులమయా


  ReplyDelete
 35. -

  అవునండి శర్మ గారూ!
  భవనానికి దక్షిణనిడి ఫైర్వాలూ వం
  టి వసతుల గైకొనుచు నడు
  పవలెన్ వెబ్సైటు నపుడె వరలు దృఢతయున్


  ReplyDelete
 36. -

  త్రీడీ ప్రింటెడట జిలే
  బీ డంబము చూడరండి బిసిబిసి వేళన్
  చూడమనసొప్పలేదనె
  వేడుక, ఆనంద్మహేంద్రు ట్వీటుచు సుమ్మీ


  ReplyDelete

 37. -

  వాత్సాపు మసాజు :)

  భార్య ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ యిచ్చింది.


  ఈ వాక్యంలో ఏడుస్తున్నదెవరు ?

  ReplyDelete
  Replies
  1. కామా ఎక్కడ పెడతారో దాన్ని బట్టి అర్థం మారుతుంది.

   Delete
  2. 1.భార్య, ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ యిచ్చింది.
   2.భార్య ఏడుస్తూ, కూర్చున్న భర్తకు కాఫీ యిచ్చింది.
   3.భార్య ,ఏడుస్తూ, కూర్చున్న, భర్తకు, కాఫీ, యిచ్చింది.

   Delete
 38. -

  కామా యెక్కడ పెడతా
  రో మారును దాని బట్టి రూఢిగ నర్థం
  బౌ!మొగుడో భార్యయొ యే
  డ్చే మూడెవరిదొ తెలివిడి రెపరెప లాడున్ :)

  ReplyDelete
 39. తాత మాట వినవె తమ్మికంటి :)


  నోరు మంచి దైనన్ మంచి యూరు దొరుకు
  పెయ్య పైన విసురరాయి పెంట మీద
  గెంతు; గుమ్మడి కాయదొంగెవ్వరనగ
  భుజముల తడిమి నట్టు ముప్పు తెలుపంగ
  తెలుప కున్న తప్పగునువే తెలుగు బాల!  ReplyDelete
 40. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?బొట్టు పెట్టుకోవటం వల్ల ఏమి లాభం ఉంది!
  ఒకే ఒక శాస్త్రీయమైన ప్రయోజనం చెప్తాను. మనం ఒక మనిషిని ముఖం చూసి కదా గుర్తు పట్టేది,ఆ ముఖం వైపుకు చూస్తున్నప్పుడు మన దృష్టి మొదట ముక్కు కొన మీద పడి అక్కడినుంచి ముఖంలో ప్రత్యేకమైన భాగం వైపుకు మళ్ళుతుంది.అంతే గాక,ఆ ముఖం నచ్చితే ఆ మనిషి పట్ల అనుకూల భావాలు కలుగుతాయి,నచ్చని పక్షంలో ప్రతికూల భావాలు రగులుతాయి.మనని చూస్తున్న వాళ్ళు పైకి నవ్వుతూ లోన విషం చిమ్మితే మనం గమనించకపోయినా అవి మనకి హాని చేస్తాయి.
  ఈ హానికరమైన దృష్టిని వెనక్కి పంపిస్తే?అంటే,మన ముఖం మీద ఒక అద్దాన్ని పెట్టి ఎదటివాళ్ళు మనని చూస్తున్నప్పుడు వాళ్ళలో మనపట్ల పుడుతున్న ప్రతికూలతని పరావర్తనం చెయ్యగలిగితే ఎలా ఉంటుంది,చెప్పండి!
  మనని చూస్తున్న వాళ్ళు పైకి నవ్వుతూ లోన విషం చిమ్మితే మనం గమనించకపోయినా అవి మనకి హాని చెయ్యని ఏర్పాటు అది - ఎదటివాళ్ళు మనని చూస్తున్నప్పుడు వాళ్ళలో మనపట్ల పుడుతున్న ప్రతికూలతని పరావర్తనం చెయ్యగలిగిన భూతద్దం లాంటిది బొట్టు.
  జై శ్రీ రామ్!

  ReplyDelete
  Replies
  1. आहा एमि विन्नाणमु

   Delete
  2. మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణామ్
   సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణామ్
   భావనాతశ్చిత్త ప్రసాదనమ్

   పతంజలి
   యోగ సూత్ర 1:33

   Delete
 41. -

  చూచితి నెండను దీర్ఘం
  గా! చప్పున సాకి వచ్చె కనులెదుటన్! ఆ
  లోచనలేనాయెపుడున్ ?
  వేచెన్మధుశాల ప్రక్క వీధిని చెప్పా!


  ReplyDelete