తానైవెల్గెతివీవు విశ్వ మున నాద్యంతంబుగా వేణునా
దానందమ్ముగ కాలవాహినిగ కాంతారమ్ము గా వేదమై
ప్రాణంబై జనులెల్ల తృప్తి గొను సారంగమ్ముగా నిక్కమై
నీ, నా భేదము లేని కంబుధరుడా! నిన్మ్రొక్కెదన్ కావుమా!
శుభోదయం
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
తానైవెల్గెతివీవు విశ్వ మున నాద్యంతంబుగా వేణునా
దానందమ్ముగ కాలవాహినిగ కాంతారమ్ము గా వేదమై
ప్రాణంబై జనులెల్ల తృప్తి గొను సారంగమ్ముగా నిక్కమై
నీ, నా భేదము లేని కంబుధరుడా! నిన్మ్రొక్కెదన్ కావుమా!
శుభోదయం
జిలేబి
-
ReplyDeleteజనుల వ్యావహారికముల శర్మగారు
ప్రాజ్ఞులకటా నిఘంటువు పరిసరముల
రా ననుమతి నిత్తురకో పరాకు నైన
కొంత చింతించి చూడుడి కోవలుపడు!
జిలేబుల్స్
-
ReplyDeleteజ్యోతిష్యపు రెట్రీటెపు
డో? తన్నెదను దరిరాన్ బడుద్దాయుల నే
వాతలు బెట్టెద డబ్బుల
తో తంత్రముకొనదలచిన తొండరులైనన్
జిలేబుల్స్
-
ReplyDeleteరావో యి బావ! యింటికి
కోవా జాంగ్రీ జిలేబి కుష్కా బిర్యా
నీ వైనూ చిక్కెను క
ర్రీ వండా నీకటంచు రేతిరి నీదే
అందరి వాడండీ , మన
ReplyDeleteసుందర రామయ్య , ఇన్నిసుగుణాలుండే
వందారు రామచంద్రుని ,
ముందర ప్రణమిల్లుదాము , ముక్తి లభించున్ .
ఏమండీ లక్కాకుల వారు
Deleteపార్టీ ఫిరాయించేసారు ? :)
-
ReplyDeleteవాసుదేవ ! కృష్ణ!ముకుంద! ప్రభు! పరాత్ప
రా! పరంధామ! యదుకుల రత్నదీప!
క్రొత్త వత్సర మున వేడు కొందుమయ్య
కావుమయ్య శ్రీహరి! చల్ల గా జగతిని
స్వాగత మిరువది నాల్గూ !
ReplyDeleteనీ గమనం , బిలకు శుభము నిచ్చెడు గాతన్
రాగానుబంధ హృదయ , సు
భగానువర్తులయి , జనుల బతుకులు పండున్ .
వరదు డనంతుడు కృష్ణుని
ReplyDeleteచరణాంబుజ సేవనమున సమరస మొప్పన్
సరసామృత భాషణమున
వరూధిని విరియును గాక ! వీర విహరణన్ .
-
Deleteభాషణము మీకు సమతా
భూషణమై పెన్నిధివలె, ప్రోవడి పోకన్
యోషా! జిలేబి!, నెలకొని
భాషాయోష కెలసమున భాసిల్లవలెన్
-
ReplyDeleteఆనందపు జాతర మహ
దానందము పాతజీవితము తెర మరుగై
క్షీణింప కొత్త జీవిత
మానందపు తెర తొలగె అహంబ్రహ్మాస్మీ!
జిలేబి
“జిలేబి” గారు,
ReplyDelete// “ చాలా చక్కగా వివరించారు.చదువుతున్నంతసేపు మనస్సు ఆనందం తో పరవశించి పోయింది.ధన్యవాదములు" //
😜
-
Deleteవినరా వారు
కామింటు బాగుంది, సమకాలీనంగా ఉంది.
ఈ కామింటు ఇదివరలో ఎవరో మింటేరని అనిపిస్తోందే 🤔🤔 ?
జిలేబి
“కష్టేఫలి” శర్మ గారి బ్లాగులో నిన్న ఇదే కామెంటుని మీరు పెట్టినప్పుడు “ఇదివరలో ఎవరో మింటేరని” మీకు అనిపించలేదా? 😑
Deleteహమ్మో ! హమ్మో ! ఎవరండీ వారు ! హెంత ధైర్యం ! హెంత ధైర్యం!
Delete-
ReplyDeleteఅవగాహన శిబిరము! పం
చవటి సమూహమున చేరి సాధన నేర్వం
గవడిన్ సెక్రటరీని క
లవండి యోగాను నేర్వ రారండర్రా!
జిలేబుల్స్
-
ReplyDeleteవినరా వారు జిలేబి వ
లె నచ్చిన కమింట్ల హుళుహుళిక్కి యని భళా
రె నిటన్ తమ వ్యాఖ్యగ పో
స్టునింపిరహొ! కందమిదియె సుతిమెత్తంగన్!
హా హా, the pot calling the kettle black 😏.
Deleteటెల్గూ టెల్గూ మే బోలియే :)
Deleteగురివింద గింజ లాగానన్నమాట. సరేనా?
Delete-
Deleteగురివిందగిజ వలె సుమా!
విరిబోణి కెలుకుల రాణి వినుడి సరేనా ?
పరమానందమ్మాయె వి
నరావరులు కూడ ఘనులు నానుళ్లకహో!
జిలేబి
మాధవుడే ' మా ' ధవుడని
ReplyDeleteరాధయు , రుక్మిణియు , సత్య , రమణులె గాకన్ ,
ఈ ధరణిన్ ప్రకృతంతయు
నాధుండని ' పరమపురుషు ' నారాధించెన్ . 🙏
-
Deleteమాధవుడె మాధవుడని ప్రమదలు రాధ
రుక్మిణీ సత్యయు తదితరులు, ప్రకృతియు
నాధ యని పరమపురుషు నామ జపము
జేసిరి యశోద తనయుని చెంతచేరి
https://www.facebook.com/share/r/UTuLKaDXMmwQNRDk/?mibextid=jaSYs6
ReplyDeleteపచ్చి మిర్చి జిలేబి, విజయవాడలో.
యా అల్లా :)
Deleteపిచ్చి ముదిరి “పాకాన” పడింది 😑.
ReplyDeleteవినరా వారి విసురు అదురహో అదురు :)
Deleteపొగడనా కృష్ణయ్య ! పొలుపైన పద్యాల
ReplyDeleteతేనెలా తియ్యని తెనుగులోన
కీర్తించనా హరీ ! ఆర్తితో గూడిన
సుమధుర హృదయ సంస్తుతులతోన
పాడనా కన్నయ్య ! పవళింపు సేవలో
పాల్గొని నిద్దుర పట్టు దాక
పాదము లొత్తనా పలు లోగిళుల్ చన్న
యలసటల్ తీరంగ నంబుజాక్ష !
ఏమి సేయ మందువుర , నాకేమి పాలు
బోదు , పరమాత్మ ! నినుజేరు మోక్ష పథము
నే యుపాయము చేత బన్నింప నగునొ !
దారి జూపుము మాధవా ! చేరి కొలుతు .
-
Deleteచేరి కొలుతు మాధవ! నిను
జేరుట కై మోక్షపథపు జిత్తును తెలుపం
గారమ్మ! యేమి సేతును
రా రాధాకృష్ణ! రమ్మ ! రారమ్మ హరీ!
-
Deleteపొలుపైన పద్యములనే
జిలుగు తెలుగు తేనె తొనలు జీరాడగ నా
యలసట తొలగన్ వ్రాసెద
నలోజ నాదంబు మ్రోగ నందరి మదిలోన్
గ్రేట్ పండిట్ అని ఎవరు చెప్పేరండీ ?
ReplyDeleteమా ఆవిడ చెప్పిందండీ ::(
-
ReplyDeleteఆ యేడ్చేదేదొ తెలుగు
లో యేడవయా సమీరు లోకుల కర్థం
బై యేదో నాలుగు ఛీ
ఛీ యో , లైక్లో దొరకును చేపెట్లొ సుమీ
-
ReplyDeleteమట్టి ప్రమిద లోన , మరి కాను పించడు
నూనె లోన గనగ , నోప మతని
ప్రత్తి లోను , దాని వత్తిలో గనరాని
శివుడు , దివ్వె లోన చేరి వెలుగు .
- లరారా గారు
మట్టిలోను గలడు మరికని పించునూ
నియని ప్రత్తిలోను నీవు గాంచ
గలవు వత్తిలోను గాన ప్రమిదలోను
గాంచ గలవు హృదిని గాన మొదట
కౌంటర్ అటాకు :)
జిలేబి
లేదండీ ! తమ తెలివిడి ,
Deleteవాదుకు తగనండి నేను , పండితుడను గా
నీ దూకుడు నాపై కం
టే , దయ జేసి , విదురుల లయింపుడు విబుధా !
-
Deleteతమ తెలివిడి మాకేదీ ?
తమ దూకుడు తట్టుకొనుట తరమా నా వ
ల్ల! ముదము గా విబుధులపై
న మురిపెమున్ జూపి ఝుమ్మనండి జిలేబీ
నీ సొగసు చూడ తరమా !
ReplyDeleteహే సరసీ రుహ సునయన ! హేమాంబర ధా
రీ ! సుస్వర మురళీ రవ !
భాసుర శుభమంగళ తను వైభవ కృష్ణా !
-
ReplyDeleteదేవ దాసు లాగ దేహల మున్ ద్రావ
గ పొర పాటు కింక తావు లేదు !
మిగులు విషయముల సమీక్షింప కుడియెడ
మలకు తార తమ్యమయ్య గలదు!
నీదు సొగసు గాన నీలాంబర తను వి
ReplyDeleteహారి! యెన్ని జన్మలగునొ కృష్ణ!
సుస్వరపుటలోజ సుశ్రూషలన్ మది
సేద దీర వలయు శ్రీనివాస!
మబ్బులు చినుకులై మంగళా కారుని
ReplyDeleteపదములు కడుగంగ కదలి వచ్చె
పండు టాకులు విడి పరమాత్మ పదముల
పడి పడి మ్రొక్కంగ పడుచు వచ్చె
గాలికి పూవులు రాలి పరుగు లిడి
రంగని పదము చేరంగ వచ్చె
పుట్ట తేనియ కారి నెట్టన పత్రాల
నిండి కృష్ణస్వామి నెలవు వచ్చె
ప్రకృతికి కలదొ లేదొ ! స్వభావ గరిమొ ?
బుధ్ధిగల మానవుడు రాడు , పూజ సలుప
తాను పురుషోత్తముని జేర , మేను వడలి ,
స్వాస్త్యమును గోలు నందాక , స్వామి కడకు .
మంగళాకారు పదముల మది నిడుకొని
Deleteచెంగలువపుష్పమాలల సేవ జేసి
హరిని బంధించి గట్టిగ యతని కాంతి
పుంజముల వెద జల్లు సంపూర్తిగాను
-
ReplyDeleteఉన్నాడోయ్ ఉన్నాడూ
అన్నారోయ్ శర్మగారు హద్దరి బన్నా
మున్నెప్పటి వాడోనట
కన్నులకు కనపడ డోయి కంద జిలేబీ
జ్యోతిస్స్వరూప ! పారం
ReplyDeleteజ్యోతీ ! పరమాత్మరూప ! యోగేశ్వర ! హే !
ప్రాతస్స్మరణీయ ! సకల
భూత హృదయ నిలయ ! పాద పూజ్యా ! కృష్ణా !
-
Deleteపారంజ్యోతి! పరాత్ప రా! నినువినా ప్రార్థింతు నేనెవ్వరిన్
శ్రీరామా! హరి! పాదపూజ్య! ప్రణతుల్ శ్రీరంగధామేశ్వరా!
వేరొక్కండ్రికలేరు గావ మము శ్రీవేదాంత యోగీశ్వరా!
భారూపా! హృదయాంతరంగమిదె నీ పాదమ్ములన్ చేరనీ
ఏమీపద్య విభావరి !
Deleteరామా ! నిన్నీజిలేబి రసధుని ముంచెన్ ,
ఈ మాదిరి పొగిడింపులు ,
భూమిజ విని , తనిసి , మీకు పుణ్యము లొసగున్ .
ఏమీ పద్యవిభావరీ! మదిని తాకేనమ్మ రో మాలినీ!
Deleteరామా! నిన్ను జిలేబి ముంచెను మహీప్రాచీరమందిచ్చటన్!
ఈమాత్రమ్ము పొగడ్త లెంతయొ మనో క్షేత్రమ్ము లోమోదమున్
వేమార్లైనను గూర్చు సీతనెరవై వేంచేసి దీవించుమా!
కన్నారా యని , దుడుకుగ
ReplyDeleteఅన్నా రేమండి , బుధుల నట్లడుగంగా ,
విన్న జనాలకు , హవ్వా !
మన్నన వద్దాండి ? మీరు మారరు సుమ్మీ !
లరారా
కన్నా ! రా యని దుడుకుగ
అన్నానా ! వెన్నుడు మన వాడండోయ్ రా
జన్నా! అభ్యంతరమా
చిన్నా ! రారా యటంచు సేవింప హరిన్ ?
కౌంటరు :)
జిలేబి
చెప్పదబద్ధము శీధువు
ReplyDeleteతప్పున్నతెలుపు తటాలు తరతమ భేదం
బెప్పుడు పాటించదు తా
నప్పా రాజన్న చెప్పె నాంచుడు లేకన్
అద్ద మబధ్దము జెప్పును ,
Deleteనిద్దపు ' ప్రతిబింబము ' , మరి , నిజమయ్యేనా ?
ఇద్దరి , నిజ మొక టుండగ ,
అద్దములో గనిన రూపు , ' అస ' లెట్లగునో ?
-
Deleteప్రతిబింబమెట్లు నిజమగు
నొ తీయ బోడి పలుకవె ! మనోఫలకంబం
దు తిరగబడి నిజమగున
య్య తర్క మున చూడ "బింబయాత్ సా బింబః"
చైంచిక్ జాల్ రా :)
ReplyDeleteగాన సౌలభ్యమునుబట్టి కాస్త వెసులు
బాటు తో చిన్ని మార్పులు పాటలోన
సహజము హరిబాబూ! కాని సాధువేది
యో అసాధువేదియొ కొంత యోచన మరి
చేయవలెనయ్య అర్థము చెడక సూవె
జిలేబి
-
ReplyDeleteనీరు నిశ్చల మైనచో నిజము చెప్పు
గాదె? మరదేలనొ జవాబు కాదు సూవె ?
కాంతునికి సమాధానపు దాహమెపుడు
తీరునొ? తెలిపెదరొ తాత తీయగంటి :)
-
ReplyDeleteఏదో సరదా నాదం
డీ! దండాలండి మెచ్చిరి అనుప్రాసన్
మీదైన రీతి, సరదా
నాదండీ చిన్నపాటిదండీ నెనరుల్ :)
చైంచిక్
-
ReplyDeleteఇంగిత జ్ఞానంబనగా
యెంగిలి పీసు మరి తెలుగు యెంచక్కంగా
బంగీ జంపుల జేయుచు
చెంగున దూకి కలుపుట బుచికి బుచికి యనన్ :)
జిలేబుల్స్
ఇంగిత ఙ్ఞానంబనగా ,
Deleteహంగుగ , ' నితరుల మనసుల యందున్నది ' ఏ
కంగా , తెలిసుక వర్తిం
చంగా నగు తెలివిడి యగు , సహదేవ సుతా !
-
ReplyDeleteతొలివలపు తొణికిన క్షణము
కలిసిన సుదినమిదియె కల గాదోయి సఖీ
చెలిమి వరమైన జీవన
మిలలో బృందావనముగ మించారె సఖీ!
జిలేబుల్స్
This comment has been removed by the author.
ReplyDeleteసకల శుభములతో భూమి సందడించ ,
ReplyDeleteసకల సంపన్నులయి ప్రజల్ సంబరపడ ,
సకల సంతోష యుతముగ ప్రశాంతతలను
తెచ్చుగావుత ! సంక్రాంతి , తెలుగు క్షితికి .
-
Deleteసకల శుభమ్ముల తో భూ
మి కలకలయనంగ ప్రజలు మిక్కిలి సంతో
షకరముగా కొనియాడ చె
రకు తియ్యదనాల సంకురాతిరి వచ్చెన్
పరమాత్మ ! పరంధామా !
ReplyDeleteపరమేశ్వర ! పావనా ! శుభ ! పరంబ్రహ్మా !
వరదాయక ! కృష్ణా ! కా
వర , నిన్నే నమ్మితి , హరి ! వసుదేవ సుతా !
కన్నా! కృష్ణ! మురారి!చక్రి! కమలాక్షా! అవ్యయానంతుడా!
Deleteఎన్నో జన్మలు పాద సన్నిధిని చేరేవేళకైవేచెరా!
నిన్నే నమ్మితి పావనా శుభకరా! నీయండ మాకున్న చా
లన్నా మా వెత లెల్ల దీరు త్వరితంబయ్యా పరేశా! హరీ!
నిగమ , నిగమాంత వర్ణిత
Deleteభగవన్నారాయణా ! ప్రభాకర కిరణా !
జగదాధారా ! కృష్ణా !
అగణిత గుణ నామ కీర్తనా సంస్మరణా !
-
Deleteఅగణిత గుణ నామ! ఆనంద నిలయవా
సా! ప్రభాకర నిగమాంత వాస!
శ్రీని వాస! కృష్ణ! శ్రీరమణ! జగదా
ధార! వాసుదేవ! స్తవము జేతు!
-
ReplyDeleteరూటు మారింది లెండి! మరో గమమ్ము
పట్టి నాను జాగ్రత్తలు బాగు జూసు
కొంటు తెల్లవారి నడక కొంతయైన
చేయ గల్గుతున్నాను విచిత్రమిద్ది
జిలేబుల్స్
అంద రానంద పరవశ మందు మునిగి ,
ReplyDeleteక్రొత్తబట్టలు , నవకాయ కూర్మి రుచుల
పిండి వంటలు , పెద్దల పేర్మి దలచు ,
శుభద సంక్రాంతి పర్వ సంశోభ నేడు .
-
Deleteపరవశ మందు మునిగి ఆ
పరమాత్ముని మది దలంచి పబ్బము కొనియా
డి రకరకము వంటల నా
ల్క రుచిగొనన్ రండి సుజనులారా రండీ !
వైదిక- తమ విశ్వాసాలు వేల సంవత్సరాల క్రితానివి, లక్షల సంవత్సరాలకు పూర్వానివి అని చెప్పటం ఆధునిక కాలంలో కుదరదు. ప్రతి దానికి ఆధారాలు చూపాలి. సరైన ఆర్కియలాజికల్, భాషాపరమైన, జన్యుపరమైన ఆధారాలు చూపి ఏ వాదనైనా సహేతుకంగా చెప్పినప్పుడు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండాలజిస్టుల పరీక్షలకు తట్టుకొని నిలబడగలుగుతుంది. లేకపోతే ప్రపంచ చరిత్రకారులముందు మన వాదనలు Hoax లు గా మిగిలిపోతాయి.
ReplyDeletehttps://sahitheeyanam.blogspot.com/2024/01/blog-post_15.html
ఎదలో లక్ష్మీ కళలతొ ,
ReplyDeleteకదిలెను సారంగపాణి కనకాంబరుడై ,
పృధివీ స్థలమున , యమునా
నది పరిసర , మధుబని దిగి , నందించె నటన్ .
-
Deleteగడుసు కైదువ జోదుడె కదిలె నచట
మధుబనిని నాట్యమాడ ప్రమదలె పరవ
శింప నెదలోన లచ్చిమి జ్యేష్ఠభార్య
గా నవతరింప రుక్మిణియై పుడమిని
-
ReplyDeleteకంది వారి బ్లాగు సమస్యాపూరణము శంకరాభరణమున ఐదే పూరణలా? వాట్ ఎ పిటీ! ఏమైనారు కవీశ్వరులచట!
ఓమాతా ! తల్కమునకు
మామాటగ తరలమనుచు మనుజేంద్రుండే
నీమమిడిరి నా నమ్మిక,
వేమార్లును కోరుగాక వెడలెద నెపుడున్
17-1-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
కాక - తాత - నాన - మామ
పై పదాలతో రామాయణార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
జిలేబి
రామా ! మరి నా నమ్మిక ,
ReplyDeleteభూమిని , ' నామామృతా తపోనిష్ట ' యనే
నేమమెకా , కలల ఫలము ,
భూమిజ , లక్ష్మణ , హనుమ ప్రభో ! రఘు రామా !
అద్భుతమైన పూరణ.
Delete// “కంది వారి బ్లాగు ……. “ //
ReplyDeleteవారి బ్లాగు “మాలిక” నుంచి మాయమైంది కదా, “జిలేబి” గారు. అందువల్ల జనాల దృష్టిలో నుంచి కూడా మాయమైయుండచ్చు, ఏదో మీలాంటి “ప్రెగడరాణ్ణరసుల” దృష్టి నుంచి తప్ప 🙂. Out of sight, out of mind అని తెల్లవాడు ఏనాడో అన్నాడు కదా.
పల్లా కొండలరావు గారి బ్లాగు కూడా అంతేగా.
సార్ ,
Deleteమేడమ్ గారు ప్రధమ శ్రేణిలోనూ ,
నేను అధమ శ్రేణిలోనూ
పూరించేము కదా !
ఈ రోజు ఎన్ని లక్షలకోట్లు ఇన్వెస్టార్ల రూపాయలు హుష్ కాకీ అయిపోయేయో :)
ReplyDelete-
ReplyDeleteదిగ్గున నాకసమ్ము నకు దీటుగ లేచిన కోపతాపముల్
నెగ్గున నెల్లకాలములు నెమ్మది యోచన లేను మేలురా
పగ్గము బట్టకున్నను స్వభావపు రీతిని తానకమ్ముతో
దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్
దిల్రూబా
బొగ్గు లమ్ము కొనిననేమి బువ్వ కొరకు
దగ్గు వారలకే శాంతి దక్కుచుండు
కర్మ యోగమునకు సాటి కలదె భువిని
విశ్వ దాభి రమణి వినవే జిలేబి
బాదుషా
తగ్గిరి పాండవుల్ విరటు ధాత్రి విభున్ కొలువందు నెంతయున్
Deleteతగ్గె నలుండు నెంతయును తా ధరణీశ్వరుడయ్యు నింకనూ
తగ్గిరి సత్యపాలనకు ధాత్రిని కాలము చాలనప్పుడున్
దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్ .
“కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్”
Deleteపింజారి వెధవ యొక్కడు
Deleteరంజక ధనవంతు డయ్యె రాజిత విబుధుల్
భంజన సేయగ సేరిరి
కుంజరయూధంబు దోమ కుత్తుక సొచ్చెన్
-
ReplyDeleteఅంతా ఆ పైవాని దయయే
కావాలని యే కీర్తన
నే విరచించను ! రఘుపతి నిర్దేశింపం
గా వెలువడునవియే నా
ప్రావీణ్యత లేదచట ప్రవాహమతనిదే
-
ReplyDeleteఎందుకలా అనుకున్నా
రెందుకు రాజన్న ? మీరు రేడండీ ! మా
కందమ్ము మీదు వ్యాఖ్యలు
డెందంబార చదువ కల రిచ్చట ప్రజలున్
అంతా రామమయం , జగ
ReplyDeleteమంతా రామమయ మయ్యె , మా రాముడె , మా
చెంత నిలిచి నట్లుగ , మే
నంతయు పులకించె , భక్తి యలవరుసలతో .
-
Deleteరామమయమౌర జగమెల్ల రమ్య మౌ అ
యోధ్యలో భూజ రాముల యోగి మోడి
జోడి జనులెల్ల స్తుతిజేయ శోభలలర
రామ రామ నామమను సురభిని ద్రేల
-
ReplyDeleteపండితమ్మన్యుల కెడ సావాస దోష
మున జిలేబి నేర్చుకొనె ప్రముఖులు వారి
లోన కష్టేఫలి గురువులు ! తెలియనివి
వారి కేదియు లేదు వివరము లరయ!
అందరును పండితోత్తమ
Deleteదందడి గలవారె , పండితమ్మన్యులె , లే
రిందందు వెదికి చూచిన ,
బంధురముగ కృష్ణపదము బట్టిన బుధులే .
-
ReplyDeleteహేరాళముగా పెనిమిటి
వారల తలిదండ్రుల పటపటలాడింపన్
పో! రా! యని బిలువ నతని
ధారావాహికలు జ్ఞానదానముఁ జేయున్!
-
ReplyDeleteపో! రారా! యని పెన్మిటిన్ బిలువ అబ్బో! యేమిగొప్పోయటం
చారాదీసి కుటుంబమంతయుదురాచారుల్ బటానీముఠా
యేరాయంచు వివాదనల్ సలుపగా హేరాళమై బాపురే
ధారావాహిక లంబుజాక్షులకు నందంజేయు సంస్కారమున్!
నేరారోపణ లేల భార్యల పయి , న్నేనాడు భర్తోత్తముల్
Deleteపోరాముల్ విడినార ? , టీవి గనుడే పోరామియా? సీరియల్
నేరంబా ? అట , నందులోగల కధల్నేనిన్ వినోదించరా ?
ధారావాహిక లంబుజాక్షులకు నందంజేయు సంస్కారమున్
-
ReplyDeleteఅనుకుంటే యెందుకు వ్రా
యనుకాదండీ ? రఘుపతి యానయటంచున్
కొనసాగించండీ పా
రును పదపడి పదములానరోత్తముని కెడన్
జిలేబుల్స్
-
ReplyDeleteఅచ్చం మా లచ్చిమిలా
పచ్చల హారమ్ము చూడ వచ్చందమ్మున్
మెచ్చి మనువాడ రావ
చ్చొచ్చో ఆళ్లయ్య ను కలిసొచ్చిండ్రంటా
-
ReplyDelete"మా రామయ్యకు జేజేల్"
హేరాళమ్ముగ జనాళి పేరోలగమున్
జేరి ప్రదర్శింపంగా
పోరామిని పదపడిరి ప్రభో! కరుణింపన్
జై శ్రీ రామ్!
ReplyDelete22-1-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చేరె నయోధ్యకుఁ గొలువఁగ జీసస్ రామున్”
(లేదా...)
“ఔరా జీససు వచ్చె నల్లదె యయోధ్యారాము సేవింపఁగన్”
(బందరు దుర్గాప్రసాద్ గారు పంపిన సమస్య)
***
శ్రీరాము గొలువ మోడీ?
శ్రీరాహుల్ గాంధి యిటలి చేరిరదేలా?
పారె సరయు చేర వడిని?
చేరె నయోధ్యకు; గొలువగ జీసస్; రామున్
***
శ్రీరాహుల్ చనిరంట రోము విధిగా సేవింప సంప్రీతితో
డౌరా జీససు! వచ్చె నల్లదె యయోధ్యారాము సేవింప గన్
శ్రీరాజేంద్రుడు దేశమంతయు నమో! సీతాపతే! శ్రీకరా!
శ్రీరామా! పరమాత్మ! స్వస్థలమిదే చేగూరె నౌరాయనన్
శుభాకాంక్షలతో
జై జై శ్రీరామ్!
-
ReplyDelete23-1-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో”
(లేదా...)
“చినదానిన్ వరియించి వచ్చె ననుచున్ జేపట్టె వృద్ధుం డహో”
***
ఇందులో సమస్య యెక్కడుంది ? :)
అనుకోకుండా కలిసిరి
వనమ్మున నొకరినొకండ్రు పరవశమున ద్రే
లెను మది గుండెలెగిసిపడె
చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో!
****
అనుకోలేదిరువుండ్రు మాలిని మనోల్లాసమ్ములో నాతడే
మునకల్ వేసి వయస్యుడాయె యెదయేమోచేయగా జవ్వనిన్
తనువూగెన్ మది తూగుచున్ పొలుపులో తానాడె సయ్యాటగా
చినదానిన్ వరియించి వచ్చె ననుచున్ జేపట్టె వృద్ధుం డహో
జిలే బుల్స్ :)
యంగ్ అట్ హార్ట్ ఫార్ ఎవర్ :)
-
ReplyDelete23, జనవరి 2024, మంగళవారం
సమస్య - 4654
24-1-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మంచికి వోటిడిన క్షతి గ్రమమ్ముగ మనకౌ”
(లేదా...)
“మంచికి వోటు వేసినఁ గ్రమమ్ముగ దేశము నాశమయ్యెడిన్”
(ఆముదాల మురళి గారి అష్టావధానంలో నాంచారయ్య గారి సమస్య)
***
కొంచెంబైనను మేలగు
మంచికి వోటిడిన; క్షతి గ్రమమ్ముగ మనకౌ
ద్రుంచగ సరాగముల వా
దించుచు చేజారనీయ ధీమతి! హక్కున్!
***
అమరునభివృద్ధి యేను మ
నము మంచికి వోటు వేసినఁ; గ్రమమ్ముగ దే
శము నాశమయ్యె డింగరు
లమై మనము తొత్తులై వెలకు బోవంగన్
జిలే బుల్స్ :)
-
Delete"బాంచను కాలు మొక్కెదను" పాదపు సేవల జేయ నాయకుల్
వంచన చేయు వారలయి పంచగ భిక్షపు పాత్ర, పూసకా
మంచికి వోటు వేసినఁ గ్రమమ్ముగ దేశము నాశమయ్యెడిన్
ద్రుంచుడి బాని సత్వమును దోపిడి దొంగల పాఱనొత్తుడీ!
-
ReplyDelete25-1-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దోమను మనువాడి కరి ముద్దుల నొసంగె”
(లేదా...)
“దోమను బెండ్లియాడి కనుదోయిని ముద్దిడెఁ గుంజరం బహో”
(కవిశ్రీ సత్తిబాబు గారికి ధన్యవాదాలతో...)
***
కుట్టినన్ తప్పదా డ్యెంగు ! కోరి వెన్క
పడుచు ఝుంకారముల తోడు పాటపాడు
దోమను మనువాడి కరి ముద్దుల నొసంగె
కుంజరుడు జొచ్చెనా దోమకుత్తుకనదె!
****
ఆమని కోయిలక్కొ? తన దాత్మకు స్నేహితురాలొ? ఝుంకృతిన్
దామన సందు లేపె సుడులన్ ముదమారగ నుగ్గడింపగా
ప్రేమయె కొల్లగొట్టె హృది; పేర్మిని చూపుచు చిన్ని ప్రాణియౌ
దోమను బెండ్లియాడి కనుదోయిని ముద్దిడెఁ గుంజరంబహో!
జిలే బియర్స్ :)
-
ReplyDeleteరామ రామ రామ యనుచు రామ నామ
మును వినుచు రక్తి కలిగి రాముని గొలిచెడు
భక్తుడేవాడగున్ రామ భక్తుడగును
దేశపు ప్రధాని యైన మోదియె జిలేబి!
-
ReplyDelete26-1-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఓర్పు సన్యాసులకు నుండు నొక్కొ కనఁగ”
(లేదా...)
“అకటా యోరుపు లేని మానవులె సన్యాసంబుఁ గైకొంద్రు పో”
****
వలయు మోక్షగాములకు ప్రబలము గాను
నోర్పు; సన్యాసులకు, నుండు నొక్కొ కనఁగ
వేరు మార్గము, దైవము, వేదవిత్తు
లైన నేమి యా పండితులైన నేమి!
***
తకధోం! ధోంతక! క్రింద మీద పడుచున్ తైతక్కలేబోదురౌ
రకటా యోరుపు లేని మానవులె; సన్యాసంబుఁ గైకొంద్రు పో
వికటింపన్ గృహ సీమ లోసుఖములే వీరాధివీరుల్ జిలే
బి కనాకష్టము జీవితమ్ము వినవే వేసారి పోబోకుమా!
జిలే బుల్స్
చైంచిక్ :)
ReplyDeleteపదిహేనేళ్లా అప్పుడె!
మొదలెట్టిరిగాదె నిన్నొ మొన్నో ? సమయ
మ్మదె నూపిరి గొననీయదు
కదా నెమలికన్ను బ్లాగు కలికితురాయీ!
-
ReplyDeleteక్రిస్టలేనివర్సరి ! డిజర్వ్స్ క్రెడిట్! అమే
జింగ్! యు ఆరె ప్రాడిజీ మురళిజి!
నెమలి కన్ను ఈజమేజింగ్క్రియెటివిటి!
విష్ యు ఆల్ ది బెస్ట్ ! ది బ్రెవిటి బ్యూటి!
చీర్స్
-
ReplyDeleteగత పది సంవత్సరములు
సుతిమెత్తని మీ టపాలు , సూటిగ మది చే
రు తరమగు శైలి హృదయము
ను తాకె మురళీ! చదివితి నుడివిన దెల్లన్ !
-
ReplyDeleteకూడోస్ఫార్లాంగ్ రన్నింగ్
వైడేంగల్బ్లాగ్మురళిజి! వ్యాక్యూమ్ మై సెల్ఫ్
ఐడూ ఫీల్ పీపుల్ డోంట్
క్రేడిట్ ఓనర్స్! పిటీ!
-
ReplyDeleteపదిహేనువత్సరమ్ములు
కుదురుగ వ్రాయటము మురళి గొప్పవిషయమౌ
చదువుట మానితి బ్లాగుల
మదిమది చదువంగ మీదు మరువనెపుడునే!
-
ReplyDeleteవిపరీతపు పోకడలని
దె పాఠకుల దృష్టికిచట తేవటమే నా
దు పని యిలాంటివి యెన్నె
న్నొ పిచ్చి వాదనలు ! నేను నొవ్వన్ నొవ్వన్
-
ReplyDeleteనా యేకాగ్రతనివ్వి స
ఖా! యేమాత్రమ్ము కీడు కలిగింపన్ లే
వోయీ! రాముని సేవకు
నాయుల్లము తూగు నెపుడు నామజపమునన్
-
ReplyDeleteనువ్వూ ఒక కవి వేనా ?
తవ్విన కొలదిగ కనబడె తప్పుతడకలున్
హవ్వా! యితరుల తిట్టుచు
నొవ్వింపంగ నధికార మొనరిచె యెవరోయ్?
ఒక కింగు మరొక రాట్టుకు ఉబోస :)
ReplyDeleteమీరే బజారు పడిరో?
దారిని బోయెడు వెధవల తమ తలపై నె
ట్టేరో? ఉబోస ! దురదే
లా రాశిగ వారి చెత్తల టపా గూర్చన్ ?
దునిమాడె ననానిమసే
ReplyDeleteమన గురువుల లెఫ్టు రైటు మండి గురువులే
తన వ్యాఖ్యల పూమాలగ
తనివారన్ గుచ్చిరోయి తన్వి జిలేబీ
-
ReplyDeleteకుక్క కూసుకున్న కొంచెమాయెనొ జంగ
ము పర పతి కవీశ! ముదురు జనుల
మాటలకు విలువల మాలలేలనొ శ్యామ!
ఈమనుజులు మారిరెపుడు రాయ ?
-
ReplyDeleteదోచుకొను! దాచుకొనురా!
ఈచాపల్యముల కంతు లేదోయ్; వేళొ
స్తే చాలన్నీ తన్నే
స్తో చస్తావ్! విడు దురాశ దోపిడి వలదోయ్ !
-
ReplyDeleteచెప్పేదది చేసేదది
గొప్పోళ్ల చరిత్ర చూడ గోల్మాల్ గోల్మాల్
కుప్పల కొలదిగ శాస్త్రం
బొప్పింతురు తమకు చిక్కు పొడలేకున్నన్
రెట్రీటులు ! ట్రీట్లు ! ట్వీట్లు :)
ReplyDeleteచదవండర్రా పొత్తము
లు దార్శనికత తెలివిడి సుళువుగా నబ్బున్
కుదురుగ ధ్యానమ్మును నా
సదనమ్మున నేర్వ గలరు చక్కగ నాపై!
-
ReplyDeleteనిజమండీ! ఝాన్సీ ల
క్ష్మి జగమెరిగినట్టి రూపసి, తెగువ తోడై
విజయము సాధించిన నీ
రజాక్షి! మనదేశపు సమరాంగణరమణీ !
-
ReplyDeleteదొందూ దొందే :)
నేను కదల్లేకా పో
యానూ! మీరున్ను శ్రీని వాసా! ఏముం
దీ! నూరడుగులు మీరే
స్తే నేనోవంద వేయ శీఘ్రమె మీటింగ్ :)
-
ReplyDeleteఇది ఇరవయిరెండొందల కీర్తనయగు
నాదు రాముని ఆనగ నాదు కలము
పారె గీతమై సంగీత భావఝరులు
గాన తనదె నన్నియు నాది కాదు యేది
-
ReplyDeleteహోరాహోరిగ నీదు జీవితములో పోరాడి శోషిల్లగా
వారాంతంబున పబ్బు కేగవలె? కైవల్యంబు సిద్ధించగన్
సారంబొప్పెడు భారతాదుల కెడన్ సాంగత్య మేదక్కు; రా
రా! రాజిల్ల విచార మెల్ల మరువన్ రామా యనన్ సర్వదా!
-
ReplyDeleteరాసే ఉత్సాహాన్ని
చ్చే సుమధుర జ్ఞాపకాల సిరిమల్లియలం
దా సౌగంధములే జి
జ్ఞాసువులకెపుడు మదిని సుశక్తిని జేర్చున్
-
ReplyDeleteచదువు తున్నందులకు సంత సము జిలేబు
లార! ఇంకెన్నొ రచనలు రావలెనని
మీరు కోరుట అభి.మాన మేను ! వ్రాసె
దనిక తప్పక మీరెల్ల తనివి తీర!
-
ReplyDeleteధార్మిక సభ! కాశీలో
నర్మిలితోడు చనదలచినారు వడివడిన్
శర్మాజీ! కష్టేఫలి!
పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్!
ఈ గాంగ్ పూర్ ఎక్కడుందండీ ?
-
ReplyDeleteధార్మిక సభ! కాశీలో
నర్మిలితోడు చనదలచినారు వడివడిన్
శర్మాజీ! కష్టేఫలి!
పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్!
ఈ గాంగ్ పూర్ ఎక్కడుందండీ ?
-
ReplyDeleteవినరా వారిని కలిసే
మనుకొన్నవిధముగ రాజధాని నగరమం
దున విస్రృతముగ వారి మ
ననమున బ్యాంక్హైపు తగ్గె ననిపించె సుమా
వారిని కలిసాను, వీరిని కలిసాను అనే మీ కథలు దేవతావస్త్రాల కథలాగా ఉంటాయి.
Delete😑
చాలా బాగా చెప్పారండీ
Deleteఇలాంటివన్ని మీ లాంటి పెద్దల ద్వారా వివరంగా తెలుసుకోవ టం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం.
బ్యాంక్హైప్ ౩౫% డమాలు :)
Delete-
ReplyDeleteకందాలు మాని మాకై
అందంగా చెప్పగలరు సందడి చేసే
బృందపు విషయమ్ముల మా
డెందంబారంగ సంగడిని పూబోడీ
-
ReplyDeleteహనుమాన్ చాలీసా! చ
ట్టని తొందర పడుచు పండితమ్మన్యుడు వ్రా
సెనొకటపా! ప్చ్ ఆ వా
ర్త నొక తడవ చదివివున్న తప్పేదికదా!
-
ReplyDeleteఅవునండీ! నిజ మేను! అ
నవసరముగ తొందర పడినాననుకుంటా!
గవనముగచదివి వుంటే
చివాలున నిటుల యెగిరి వచించక పోదున్ :)
-
ReplyDelete5-2-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప”
(లేదా...)
“సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా”
***
ఒకడు దామోదరుండు మరొక్కడమితు
డౌత! జోడుగలిసిరి గుర్జలపు రాష్ట్ర
మందు! ప్రగతిపథమ్మున మనల నడుప
సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప
***
క్షేమంబంచు జనాళి జాగృతులవన్ శ్రీమంతులైవెల్గగా
రామా నీవు గృహమ్ము చేరి నిలువన్ రాజ్యాధికారమ్ముతో
సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా
యీమార్పుల్ గన భారతాంబ సుకృతాలెన్నెన్ని చేయంగనో!
-
ReplyDeleteవేడ దగినట్టి వానినే వేడవలయు
వేడ దగిన విధముగాను వేడవలయు
వేడ దగినట్టి శ్రీరామ విభుని వేడు
వేల వేలజన్మల ముక్తి విభుడొసంగు
-
ReplyDeleteతూర్పారబట్టె నొకడౌ!
వేర్పాట్లేవియును లేదు విభులనడుమ! నీ
కార్పణ్యముతగదోయీ
మార్పన్నది లేనిది పరమాత్మ యగునురా
తాతగారి సంతోషమే హ్యాకర్ల సగము బలము :)
ReplyDeleteనాకు విదేశమ్ముల నుం
డీ కాల్స్ వస్తున్నవండి! డిగనురుకులనే
నాకాల్సెత్తుట కుదరదు!
యేకాల్స్వెనుక యెవడుండు నెవరికి తెలియున్ :)
-
ReplyDeleteహ్యాకోత్సాహము గలదని
సైకోవలె కాలు సేసి సైసై యనకోయ్
నీ కా తెలివే వుంటే
రా ! కష్టేఫలి విదురుల రఫ్ఫాడింపన్ !
-
ReplyDeleteశాశ్వతమగు పరమాత్ముడు
విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్?
నశ్వరమైన మన హృదియె!
విశ్వాసము వలయు నతడె విధి మన కెల్లన్
సోకు మాడ కుళ్ళకే :)
ReplyDeleteకుళ్లొద్దె జిలేబీ నా
వాళ్లెంతోమంది గలరె బహరెయినున! నా
కాళ్ళకు మొక్కేందుకనుచు
వాళ్లెల్లరువచ్చెదమని కాల్జేస్తారే!
-
ReplyDeleteతినగ పిజ్జాను పాస్తాను ద్రేన్పు వచ్చె
కడుపు నిండెను తీర దాకలియె సుంత!
యేమి జంకుఫుడ్డో! వశ! యేమి ఇటలి
మాయయో! జిలేబీ తెల్పుమా మడతుక!
-
ReplyDeleteపాపం జిలేబి! అయ్యో
పాపమ్ము జిలేబులమ్మి! బతుకేమో పా
డై పోయేనే కుళ్లుచు
పాపమ్మిక మారటమ్ము భగిని కుదరదే!
-
ReplyDeleteవాసిగ నాహృదయపు సిం
హాసన ముననుండుమన్న దాసునకు ప్రభో
నీసన్నిధి వరమీయక
భాసురముగ నీ వయోధ్య వాసివయితివే
-
ReplyDeleteధీరత్వము దాతృత్వము
తీరగు ప్రియమైన పల్కు తేనియలూరన్
ప్రేరేపించెడు స్నేహిత
మౌరా లభ్యమతికష్టమౌత పుడమిలోన్
-
ReplyDeleteఎవరోయి సత్తి బాబూ!
యెవరోయీ సుబ్బరాజు ? యెవరిమనస్సం
దెవరోయి దూరి పలికే
రు విదురునివలెన్ హృదయపు రొదల తెలుపుచున్
-
ReplyDeleteముక్కాబలా ! జిలేబీ
ముక్కాబల! వెనుతిరుగకు మున్ముందుకుపో
తిక్కకుదురునటుల సదరు
నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్
ఆహా! నే రాయక పోడానికి కారణం నువ్వేనోయ్
ReplyDeleteఅంటూ గడుసుగా తప్పించుకోవడం గోజీలకే చెల్లు :)
విరమిస్తున్నా ! నాదిక
కరకర లాడెడు టపాలు కనబడవోయ్ తిం
గరి బుచ్చి ఒప్పు కున్నావ్
మరి తెలుసుకొనేవు తప్పు ; మన్నించేసా!
-
ReplyDeleteవిరమించిన నేతకు జేజేలు !
ప్రావీణ్యానికి పట్టము!
పీవీ! విప్లవ తపస్వి! వికసిత భారత్
నీ వదలని పట్టాయెన్
భావితరానికి వెలుంగు భారతరత్నా!
సెబాసో
హాఫ్ లయన్ నరసింహా!