ఈ చిత్తూరు పాత కాలం నాటినుంచి అరవ దేశం లో ఉండటం తో ఇక్కడ అరవం వాళ్ళ ప్రాబల్యం ఎక్కువే అని చెప్పొచ్చు. బోర్డర్ ఏరియా కాబట్టి - ఇప్పటికి అరవం వాసన చిత్తూర్ లో ఎక్కువే ఉంటుందనుకుంటా.
ఓ మోస్తరు అరవై ఎనభై ప్రాంతాలలో ఈ ఊళ్ళో తెలుగు కన్నా అరవం తో నే కాలం గడప వచ్చు. ఇప్పటికి మారి ఉంటుందనుకుంటా.
ఈ అరవం అమ్మాయిలూ స్కూళ్ళల్లో గానివ్వండి - కాలేజీ లలో గానివ్వండి చేసే "కిసిమిసు" (అరవం వాళ్ళు మాట్లాడితే - ఏమంటారు - గులక రాళ్ళ డబ్బా సౌండా?) ఇంతా అంతా కాదు.
అబ్బాయిలని గలాటా చెయ్యడం లో వీళ్ళ చాతుర్యం వేరే వేరు. అప్పటిదాకా మాట్లాడుతున్నఅరవం యాస తెలుగు సడన్ గా అరవం లో కి మారిపోయి గల గల నవ్వు ల పరంపర ఎక్కువవడం - ఈ అబ్బాయిలు బిక్క మొహం వెయ్యడం చాల సాధారణ విషయం! ఆ పై పక్క గ్రామాలలోనించి వచ్చే తెలుగు అమ్మాయిలు(నా లాంటి వేరే ఊళ్లలో నించి వచ్చి చదిన వాళ్ళు ఇంకా చాల తక్కువే ) ఆ కాలం లో తక్కువే కాబట్టి ఈ ఆంధ్రా అబ్బాయిలకి - ఈ పాటి కాలక్షేపం వీళ్ళతోనే సరి పెట్టు కోవలసి వచ్చేది.
ఈ అమ్మాయిలకి తెలుసు - ఇడ్లీ , సాంబార్ లేకుంటే అంత గొప్పదనం దానికి లేదని. అయినా ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అంత గొప్ప కాంబినేషన్ ఇంక వేరే ఎ కాంబినేషన్ లోను లేదు కాబట్టి - ఇడ్లీ లేకుంటే సాంబార్ వేల్యూ తక్కువే కాబట్టి - వీళ్ళ చాతుర్యానికి కొదవే లేకుండా ఉండేది.
ఇంక స్కూల్ అయ్యవార్లకి ఈ అరవం అమ్మాయిలని వాళ్ళ భాష - అంటే తెలుగు ఉచ్చారణ - మీద ఓ పాటి కామెంట్లు విసరడమూ కద్దు.
స్కూళ్ళల్లో అరవం క్లాసులు కూడా ఉండేవి.( ఇప్పుడూ ఉన్నాయా? నాకైతే తెలీదు) - ఈ గల గలా అమ్మాయిలు - ఆ ప్రక్క క్లాస్సుల్లలో "కిసిమిసు" ఈ పక్క క్లాస్సుల్లలో ఆంధ్రా అబ్బాయిలకి జోకులు వేసుకోవడానికి ఫస్ట్ క్లాసు మేటర్.
వీళ్ళ ట్రేడ్ మార్క్ - నెత్తి పై విభూతి బొట్టు- (అరవం వాళ్లకి ఈ భస్మం పెడితే నే పొద్దు పొడిచినట్టు అనుకుంటా) - దానికింద కుంకం బొట్టు - ఇవన్ని ఆ (మా ) కాలపు ముచ్చట్లు !
చీర్స్
జిలేబి.