ధమాల్ ధమాల్ డబాల్ డబాల్ !
ఏమోయ్ మనవడా, అంత విచారం గా ఉన్నావ్ ? అడిగా మా వాణ్ని, ఇంటికి వస్తూనే ఉస్సురు మన్నాడు వాడు.
వచ్చింది అర్ధ రేతిరి దాటి.
చేసే పని 'పాడు' మాలిన (పని పాటా లేని అనాలా లేక పాడు మాలిన పని అనాలా?) ఐటీ ఉద్యోగం. దేశాన్ని అభివృద్ధి కి తెచ్చిన 'సాఫ్ట్ 'వేరు' బ్యాక్ ప్యాకు మానవుడు!
'ప్చ్' అన్నాడు.
ఏమిరా అన్నా?
'నేను ప్రో ఏక్టివ్ కాదటే ' అన్నాడు వాడు.
అంటే ఏంట్రా మనవడా ? అడిగా.
' అంటే, నేనన్ని ట్లో నా అంతగా చొరవ గా దూసు కెళ్ళడం లేదటే ? '
అంటే ?
అంటే, తెల్ల మొగం పెట్టాడు వాడు.
పోనీ లేరా భోజనం చేసి పడుకో అన్నా
ఆకలి లేదే అన్నాడు ' ఈ ఇయర్ నా బోనస్ ధమాల్ ధమాల్ డబాల్ డబాలే' విచారం గా ముఖం పెట్టేడు.
వాణ్ని గమనించా.
నిండా ఇరవై నాలుగు కూడా దాటలేదు. మానవుడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. నడి సంద్రం లో నావ లా, చుక్కాని లేని పడవలా తెల్ల ముఖం పెట్టి ఉన్నాడు. ప్రపంచం లో ని భారం మొత్తం వాడి తల మీదే ఉన్నట్టు ఉంది.!
ప్చ్..
"We had everything, twenty years go, but just little of everything and yet we were happy. Now, we have more of everything, but little is gratifying the soul"
జిలేబి.