కంది వారి సభలో "కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!" సమస్యా పాదాన్ని ఇస్తే,
అబ్బే ఇదేదో తెలిసిన పాదం లా వుందే అనుకుని చట్టని కొట్టు కొచ్చి ఇలా పూరించా :)
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తి ....
అబ్బ! ఇక్కడి దాకా బాగుంది :) ఇంక ఎట్లా ఫిట్టింగు పెట్టడటం సమస్యా పాదానికి అనుకుని ఆలోచిస్తా వుంటే , తాళ్ళ పాకవారి పద్య పాదం (అని అనుకున్నా కాని క్షేత్రయ్య అని ఆంధ్ర భారతి ఉవాచ ) "సఖియ నీ చన్గవలు సంగటి కొండలందురుగాని కొండలైతే-కోట తలుపులేవే" అన్నది గుర్తు కొచ్చి ఆహా ఇదేదో ఫిట్టించేస్తే బాగుంటుందనుకుని, ఆ పై అసలే పండిత సభ కాబట్టి కొంత బెరుకు పుట్టుకుని మార్చేసు కుని రాసి వేసేసా :)
ఘటుండు రాము డా
మండప మందు విల్లు తునుమాడగ నాదము పిక్కటిల్లగా
కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!
పూర్తి గా :)
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తిఘటుండు రాము డా
మండప మందు విల్లు తునుమాడగ నాదము పిక్కటిల్లగా
కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!
కొట్టు కొచ్చినవి రెండు పాదాలు (దాశరధీ కరుణా పయోనిధీ :) సమస్యా పాదం ఒకటి, మన కిట్టింపు పాదం ఒకటి వెరసి వాహ్ క్యా బాత్ హై వృత్తం తయార్ జిలేబి తయార్ అనుకున్నా :)
దీని పై కంది శంకరుల వారు :-
జిలేబి గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ఇది మీరు వ్రాసిందేనా? సందేహమే! అంటూ ఒక స్మైలీ పెట్టేరు :)
సరే అందుకని మరో ఉత్పలము రుబ్బి నాము :)
ముట్టగ కైపదంబొకటి ముంగట శంకరుకొల్వులోనటన్,
కొట్టున కొట్టుకొచ్చె తను కొంచెమకో? భళి రెండు పాదముల్!
కట్టె జిలేబి పాదము ను గట్టిగ నొక్కటి యుత్పలంబవన్
చట్టని వేసె కొల్వున సజావుగ నాల్గన వృత్తపాదముల్!
అని - మొదటి ఉద్దేశం గురించి ఇలా అన్నా :)
కంది వారు,
మండప మందు విల్లు తునుమాడగ జానకి చన్నుగుబ్బలా కొండలు... అని రాస్తా మనుకున్నా ! అసలే పండితుల సభ యేమంటారో అని భయపడి కొంత నాదపు పిక్కటిల్లుతో సర్దేసా! ( తాళ్ళపాక వారి చన్గవలా సంగటి కొండలు పాదము గుర్తు కొచ్చి)
****
దీనికి పోచిరాజు వారు వచ్చి -
జిలేబి గారు కుచ సౌందర్య వర్ణన లేని కావ్యము సంస్కృ తాంధ్ర వాఙ్మయ ప్రపంచములోనే లేదు. అతిమాత్రము వర్జనీయము. మీ రొక తమిళ పద్యమును తెనుఁగు లిపిలో వ్రాసి తదనువాద పద్యము ప్రకటించిన చూడాలని యుందండి.
తస్సదియ్య సవాలే విసిరేరు గా అనుకుని కన్డే న్ సీతయై అన్న కంబ రామాయణ పద్యాన్ని అరవంలో చదివి మన కిష్ట మైన కందం లో కిట్టించి వేయడం జరిగినది ఆ పై పోచిరాజు వారికి 'హమారీ ఫర్మాయిష్ ' తెలిపి నాము :)
పోచిరాజు వారికి నమో నమః
పూర్తిగా సరిగ్గా అని చెప్పలేను గాని కొంతవరకు నావల్లయినంత వరకు :) ( కందంలో నాకు వీలైనంత ఫిట్టు చేయగలిగినంత వరకు :))
కనుగొంటిని సచ్ఛీలపు
మణి సీతను లంకని!తడుమనయున్ దుఃఖం
బును విడుమయ్యా! రామా
హనుమంతుడ డింగరుడ సహాయకుడనయా!
కంబరామాయణము-
கண்டனென், கற்பினுக்கு அணியை, கண்களால்,
தெண் திரை அலைகடல் இலங்கைத் தென் நகர்;
அண்டர் நாயக !இனி, துறத்தி, ஐயமும்
பண்டு உள துயரும்’என்று, அனுமன் பன்னுவான்;
**
కణ్డేన్ కర్పిణిక్కు అణియై కణ్ణాల్
తెన్ తిరై అలై కడల్ ఇలంగై తెన్ నగర్
అణ్డర నాయగ ఇని తురత్తి, యైయముమ్
పన్డు ఉళ్ తుయరుమ్, యెన్డ్రు అనుమన్ పణ్ణువాన్ !
ఫర్మాయిష్ అబ్ ఆప్ సే యహ్ హై కి ఊపర్ పద్య కీ అంగ్రేజీ తర్జుమా (see below) సే ఆప్ కీ టెల్గు పద్య ఇదర్ దేఖ్నే కా :)
ధన్యబాద్ !
I saw ,
the jewel of chastity,
with my own eyes
in the southern city
of Lanka
on the clear twirling wavy ocean,
lord of gods
from now on
relinquish doubts and
all your sufferings.’
said Hanuman
and continued with his details.
Awaiting your marvellous vrutta sir
పై దానికి పోచిరాజు వారి (అద్భుతః ) శైలి లో ఉత్పల మాల : -
జిలేబి గారు ధన్యవాదములు. నా ప్రయత్నమును జూచి కంబ రామాయణ పద్య భావము స్ఫురించినదో లేదో చూడండి.
చూచితి స్వీయ నేత్రముల శుద్ధ చరిత్ర వసుంధరా సుతన్
వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
ద్రోచన తీర లంక నిఁకఁ దూర్ణము వీడుమ శంక నిర్జరుల్
కాచ సమర్థులం చనియుఁ గాదిలి హన్మయె పల్కెఁ గ్రమ్మఱన్
అద్భుత మైన అనువాదం - "వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
ద్రోచన తీర లంక " - తెన్ తిరై అలై కడల్ ఇలంగై తెన్ నగర్ - in the southern city of Lanka on the clear twirling wavy ocean !
( తెలుగు అనువాదం - పూతల పట్టు శ్రీ రాములు రెడ్డి గారు -
వారి అనువాదం - ఇలా వుంది (క్రింది లింకులో రెండవ భాగం లో సుందర కాండ లో ) మత్త కోకిల
కాంచినాడ సతీత్వ భూషను గణ్యవర్తన జానకిన్
గాంచినాడ మదీయ దైవము గన్నులారగ లంకలో
గాంచినాడను శంక వీడుము కాంచుమా మది నెమ్మదిన్
గాంచితిన్ మరి మాటలాడితి గ్రమ్మరిల్లితి రాఘవా !
పూతల పట్ట్టు శ్రీరాములు రెడ్డి గారి - కంబ రామాయణం తెలుగు అనువాదం లింకులు :
భాగము - 1
https://archive.org/details/in.ernet.dli.2015.385206
భాగము - 2
https://archive.org/details/in.ernet.dli.2015.385207
కొండలు గాలి తాకిడికి కొట్టుకు పోయె ! మొత్తము మీద ఇప్పటికి ఇక్కడ ఆగింది :) ఇంక చూద్దాం ఏమేమి వస్తాయో అని !
చీర్స్
జిలేబి
Scholarly! కంబ రామాయణంలో వర్ణన మనోహరంగా వుంటుందని ఎవరో చెప్పగా విని తమిళ్ నేర్చుకుని ఎప్పటికైనా చదవాలని బోల్డంత ఆశ పడ్డాను, కానీ అదెప్పటికి వీలవుతుందో, అసలు కుదురుతుందో లేదో కూడా నాకు నమ్మకం లేదు. ఇవాళ మీ బ్లాగ్‌లో రాసిన ఒక్క శ్లోకం అన్నా చదవగలిగిందుకు చాలా సంతోషంగా వుంది.
ReplyDelete"ఎక్కడ దొరుకుతాయండీ ఈ పదాలు మీకు?"
ReplyDeleteఆకాశంబున నుండి వ్రాలు గదరా హైరాన జేయంగనన్
చీకాకుల్ పడజేయునట్టి పదముల్ జీలేబి దోసిల్లలోన్
నాకోసంబని వచ్చెనేమొ విడువ న్నాంధ్రమ్ము భాషన్ను నే
కోకల్ సిల్కువి పట్టు చీర లిడుదున్ కోపేశ్వరీ! నీకు నేన్
🙏
చిన్న సవరణతో:
ReplyDeleteచూచితి స్వీయ నేత్రముల శుద్ధ చరిత్ర వసుంధరా సుతన్
వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
ద్రోచన తీర లంక నిఁకఁ దూర్ణము వీడుమ శంక నిర్జరుల్
కాచ సమర్థులం చనియు గాదిలి హన్మయె పల్కెఁ గ్రమ్మఱన్
“యంచనియు గాదిలి”
ReplyDeleteఅధమునిగా శక్తియు లే
క ధనధన మనుచు పరుగిడకయె గుర్రమహో !
విధిగా కబళము వలయును
విధ, వారమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్ !
జిలేబి
Deleteవిధ - గుర్రపు దాణా ( అట - ఆంధ్ర భారతి ఉవాచ )
గుర్రపు దాణా కూర్పుగ కోరె సతి :)
ఆ ప్రేమ గుర్రము పై పతి పై కాదని గమనింప వలె :)
వారు - కూర్చు
ReplyDeleteసుధలొల్కగ నే కొమరా
ల! ధరణిలో వేరొకరు గలరకో పూబో
డి ధగద్ధిగమనగ ? యనుభ
వి! ధవా !రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్
జిలేబి
ReplyDeleteఅధకిమ్? నీకై వేచిన
మధురాధరములివి సూవె! మహజరదేలా!
సధవయు చేసెడు సేవలి
వి! ధవా !రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!
జిలేబి
ReplyDeleteచంద మామవలె సొబగు సక్క గుండె
నందమూరి యందము గాన! నవ్య మైన
రీతి గా తన రారె నరె యతడి కని
కట్టు తెలుగునేలపయిన గట్టి గాను :)
జిలేబి
ReplyDeleteఈ మూవీ చూసినపుడు
మా మది గోదావరియయె మాత ! జిలేబీ !
మైమరుపునుగనుచున్ తా
సామజ వరగమన యనెను సఖియా వినవే :)
జిలేబి
ReplyDeleteనిజమున్నచో జిలేబీ
ప్రజలంగీకారము తెలుపవలెన్ ! లేకు
న్న జలకడగాలె వాస్తవ
ము జల్ది వెలుగును గనన్ సముచితముగ సుమీ
జిలేబి
ReplyDeleteగురుదేవా వందనములు!
తరగతి లో మీరు నేర్పు తర్ఫీదునకున్
సరిచక్క దిద్ది నేర్పెడు
తరహాకున్ కవి వర ప్రణతంబుల గొనుడీ !
జిలేబి
ReplyDeleteనా లాప్టాప్లో కాఫీ
లా లావుగ నుండెనయ్య లావా లా సు
మ్మీ! లెఫ్టండు రయిటు కూ
పీ లాగితి నయ్య నిపుడె భీతిల జనులున్:)
జిలేబి
ReplyDeleteచక్కని దౌ పూరణ నెం
చక్కని భావపటిమయు పసందగు పదముల్
చుక్కెట్టి ముద్దు గా సరి
తక్కెడ లోతూకముగన తరముగ నిలుచున్:)
జిలేబి
ReplyDeleteఓటును యథేచ్చగా అ
మ్మేటోళ్ళ స్వదేశమాయె ! మేల్గానమనన్
చేటుకు పట్టమిడు జనుల
బేటా వీలగునకో తబీయతు త్వరగా ?
జిలేబి
విధినేమందును ? మదనుని
Deleteకధలల్లి యనేక గతుల గమకించిననూ ,
బుధుడివి , కళ లెరుగని కవి
వి , ధవా !ర ' మ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!
Delete:(
విధి!మదన కామ రాజుని
కధలల్లి యనేక గతుల గమకించిననూ ,
బుధుడ ! సరసమెరుగని కవి
వి , ధవా !రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!
జిలేబి
విధినేమందును ? మదనుని
Deleteకధలల్లి యనేక గతుల గమకించిననూ ,
'బుధకవి' ననుకొనెడు జడుడి
వి , ధవా !ర ' మ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!
ReplyDeleteఎవరికి లభ్యంబయ్యెడు
లవణపు తిండి భళివారు లాగించెదరోయ్
పవలూ రాత్రి యనక నా
నువెజ్జు లాగించడము మనుజుల బెడగయెన్
జిలేబి
ReplyDeleteహైజాకాయెను బో సౌ
మ్యాజీ మీ బ్లాగు !తెలుగు మాస్ స్టార్ లు భళా
రే జప్తీ చేసుకొనిర
కో? జర జాగ్రత్త గనుడి కోమలవళ్లీ :)
జిలేబి
ReplyDeleteఅసలైన హోస్టు పత్తా
యసలే కనరాదు ! మనము యాహూ అంటూ
గుసగుస లాడేస్తున్నా
ము సక్క గా గెస్టులని సముచితంబిదియో ?
జిలేబి
పసగల ఘన హితులందరు
Deleteవిసవిస నొకచో పసందు విందు భుజింపన్
కసిమసగి కుళ్ళుకొందురు
రసనాగ్రపు సొళ్ళు దీర రాలేని హితుల్ .
కసకసమని నవలగ గసగసాల్ నిండిన మసాలా కోడి కూరా
Deleteలసలసమని వదులవవే పస ఉడిగిన ముసిలి చివుళ్లకటా !
కసుబుసు మని ఈ రుసరుసలేల పసగల ఓ గురువరా
నసనసల రావులందరి విసవిసల్బుసల్ విన తొడగొట్ట నదేల అనఘా !
... ఏదో ఊరుకుండలేని నస గురువు గారూ ...
బెజవాడనుండి వచ్చిరి
Deleteసుజనులు మా బండి దొరలు సోకులు మాడన్
గిజ గిజ లాడిరి పాపము
నిజము దెలిసి కోడి కూర నెందును గనకన్ .
ReplyDeleteచర్చంటూ మొదలెట్టగ
పర్చీ మనదగ్గిరుండు ప్రశ్నే లేదోయ్
తర్చెడు కమింటు దారుల
యర్చన తప్పదు జిలేబి యాహూ గూగుల్ :)
జిలేబి
ReplyDeleteఏ లాగుననిను పొగిడెద?
యే లాగేసుకొననేమి యెందుకు పొగడా
లా? లాగున్నా లేకు
న్నా లక్షణములిక మారునా చెప్పుమయా !
జిలేబి
ReplyDeleteఆవల శూర్పణఖ ముదము
తో వరియించు మనుచుండె ! త్రోయంగనరే
కైవల్య పదము ఖాయము!
భావజు సుమబాణమె యమపాశమ్ము గదా!
జిలేబి
ReplyDeleteకైవల్యపదము చేరగ
నావగ జీవితము నడిపినాను విభునికై !
యేవపు తలపుల బడితిన్
భావజు సుమబాణమె యమపాశమ్ము గదా!
జిలేబి
ReplyDeleteపాపం పిచ్చోడు :) వెంట తగులుకున్న భామను వలదను వాడు :)
అరె! వెస బ్రహ్మ చారినని యందెల చప్పుడు చేసి బిల్వ నే
ల రమణి ! వెంట రావలదు ! లంపటపెట్టకు ! లాగు లాడ నే
ల!రసికురాల! మాయని కలన్ సయి భావన చేయజాలనే !
మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్!
జిలేబి
ReplyDeleteఅరె! ప్రవరాఖ్యుడన్ ! పడతి! యమ్మవు నీవు సుమా వరూధినీ !
పరుగిడ నీకు నీ మదిని భావన చేయకు తప్పు దారులన్
కురుచపు బుద్ధి వీడుమిక కొంగుముడిన్ దిగ జార నీకుమా !
మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్!
జిలేబి
ReplyDeleteబావా బావా పన్నీ
రూ! వారిజలెల్లరున్ మరుగుగా తన్నే
రూ! విలుకాడు విడువగన్
భావజు సుమబాణమె యమపాశమ్ము గదా!
జిలేబి
ReplyDeleteసందర్భమేమి లేకయు
నందరి నీరమ్మటంచు నడ్డివిరుగగా
విందు కటంచు బిలువ మీ
యందరి వలెపని మరేమి యమ్మికి లేదా :)
జిలేబి
కోటి గిద్యాల వ్రతమెప్డు కోమలాంగి !
ReplyDeleteపూర్తి చేసెదరో ? తమ పుణ్య వశము
న , రసనకు నెప్డు తుప్పు తునక లగు నని ,
ముసిలి ముచ్చట్లు తెగ లాగి మురియు చుండ్రు.
ReplyDeleteఔర! కోటికి చేరున కౌక్ష మందు
పద్య గిద్యములు జిలేబి వారిదిచట?
చదువరుల తాట వొలుచున చక్కగాను ?
చూచెదము పోకడనిక కచోడి పూరి :)
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteవడ కచోడి పూరి దడ దడలకు , పద్య
ReplyDeleteగిద్య విద్యలకును , గిల గిలమని
కొట్టుకొని మడియు బకులిట లేరు విహిత !
గట్టి పిండములను గాంచ నగును .
ReplyDeleteగట్టి పిండములము మేము కంద పద్య
దురద గొండియాకు జిలేబి దువ్వ గాను
భయము గాంచము చదువుచు వల్లె వేయు
వార మమ్మ తెలుసుకొను వారిజాక్షి :)
జిలేబి
ReplyDeleteపదియవ పొత్తంబొచ్చెను
సదమలమగు యంతరంగ చక్కదనముగా,
అదిగో హస్తోదకమది
గదిగొ కరతలామలకము కష్టేఫలియై!
జిలేబి
ReplyDeleteమీ లెక్క తప్పి నట్లుం
దే? లాతము బుచ్చుకొనిరదేను జిలేబీ
బేలా నీహారిక? రం
గీలా సదనపు రమణి బిగిలు నూదెనుగా :)
జిలేబి
ReplyDeleteరానే రాను సుమా విం
దైన వదులుకొందునే పద పదమ్మ పదా
నేనేదో నాగోలే
దో నామానాన పడెద! తొంగలి పట్టన్ :)
జిలేబి
విందులు బందు , కోడి పదవే యిక , వాపసు , కూత కూయగా ,
Deleteకందొవ విందుగా , షరతు గట్టిరి , కంద జిలేబి కోటితో ,
విందుకు నేను రాననిరి , వేసరి ముందట నన్ను మర్చినా
రందరటంచు నల్గిన మహాత్ములె , రావులు ! అందరందరే .
మిత్రులు రాజారావు గారు, మన్నించాలి. కంద కోటితో విందుకు నేను రానూ అననండి. కందాలు కందాలవలె ఉంటే మహదానందం కదా. కాని గణాల్లో అక్షరాలు పొదిగే విన్యాసాలూ వాటికోసం నిఘంటువులను దున్నటమూ, అన్వయమూ శైలీ సుభగతా వంటివాటిని అస్సలు పట్టిచుకోకపోవటమూ నాకు మింగుడు పడవండి. పోనీండి. చాదస్తుణ్ణి. మీకు నొవ్వు కలిగిస్తే మన్నించాలి.
Deleteమీరలా అంటే ఎలాగండీ ? జిలేబీ గారి గిద్యాల కంద పుస్తకానికి ముందుమాట మీరే వ్రాయాలి. డొక్కా సీతమ్మ తర్వాత ఆవిడే అని పొగడాలి. చివరిమాట వీ ఎన్ ఆర్ గారో, వై వీ ఆర్ గారో వ్రాస్తారు. మా అన్నగారు నాలుగు పద్యాలు వ్రాస్తారు. మీరంతా తలో చేయి వేస్తే పుస్తకావిష్కరణ ఘనంగా చేసేయవచ్చు.
Delete# నీహారిక గారు
Deleteనన్నొదిలెయ్యండి మహాతల్లీ. నేను పద్యాలు కాదు గదా గిద్యాలూ కట్టలేను, పద్యాల పుస్తకానికి చివరిమాట / ముందుమాట / ఏమాటా వ్రాయలేను. పాత మాయాబజార్ సినిమాలో "అతడికి మీ తెలివేదీ, అతడికి మీ సుళువేదీ" అంటారు చూశారా, నేను ఆ అతడు బాపతు అన్నమాట. థాంక్స్.
బైదివే, డొక్కా సీతమ్మ గారు పెద్దచెయ్యి కలిగిన అన్నదాత గానీ కవయిత్రి కారు.
ముందు మాటలు వ్రాసిరి , బుధుల వలన
Deleteమెప్పు వడసిరి , వలపక్షమేల యిపుడు ?
చులకనయ జిలేబీ కందములన ? పండి
తులకు - సమదర్శనత నుండి , తొలుగ తగదు .
భూనభాంతరమందు భానుమండన దీప్తి
Deleteయొప్పారు విబుధుల మెప్పు వడసి
ఘన మహా గర్జన గళ ఘళం ఘళలతో
కందాల ఠేవల గజ్జ గట్టి
సాహితీ సమరాంగణా హుంక్రియద్భాంకృ
త కవిశేఖరుల జోతలు గొనకొని
సంస్కృ తాంధ్రాంగ్ల విస్తార పరిఙ్ఞాన
సురుచిర రసన భాసురత గలిగి
ఆంధ్రభారతికి జిలేబి యండయో , క
నంగ నాంధ్రభారతియే తనకొక యండ
గా నిలిచెనో యనంగ దిగ్గజము రీతి
జెలగు మాత జిలేబీకి జెట్టి యెవరు ?
భూ నభోంతర
Deleteనభాంతర టైపు పొరపాటు
బృందపాకం కదా అని డొక్కా సీతమ్మతో పోల్చాను ఖర్మ గాంధీ తో పోలుస్తారా మీరూ ?
Delete
ReplyDeleteకొండాట్టము బోయె భళా
తిండాట్టము పోయె కోటి తీయ పవనమున్
బండియు కోటయు రాజును
చండామార్కులు వలదన సరదా పార్టీ :)
జిలేబి
ReplyDeleteకన్నడగునౌ జిలేబియ కదనమందు
నర్జునున కాప్తమిత్రుఁడౌ నంగరాజు
శల్యు డామాద్రి తమ్ముని సారథిగ కు
దుర్చు కొననయ్యె నతడె మృత్యువుకు దూత!
జిలేబి
ReplyDeleteకందములు కందములవలె
యందము గా నుండవలె సయాటగ రాజా
పొందిక లేక నిఘంటువు
నందు పదముల కలబోతలా కన రాదోయ్ !
జిలేబి
ReplyDeleteచేయంగవలదు దూరము
తోయంగవలదు జిలేబి తోడ్పాటిదియే
సాయముగా కామింటిది
గో యయువు వలెపరుగిడుచు గోలీ లాడన్ :)
జిలేబి
ReplyDeleteనన్నొది లేయండమ్మా
మున్నెపుడూ పద్యగిద్యముల రాసిన రా
యణ్ణేకానమ్మా ! నర
సన్నను సాదా మడిసిని సరసిజ నేత్రా :)
జిలేబి
ReplyDeleteనష్టంబెపుడు జిలేబీ
శిష్ట జనాళి కనిపించి చింతను జేర్చున్
కష్టముల గాన దోచున్
దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్!
జిలేబి
ReplyDeleteకష్టము లన్ భరి యించుచు
నష్టము లెల్ల తలదాల్చి నకనక యనుచున్
భ్రష్టుపడి పోవనా ని
ర్దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్!
జిలేబి
ReplyDeleteతవిలించితివోనన్ మా
నవుడా ? యట్లైన నన్ను, నాదారిని వీ
డి వితత మవనేలనయా?
సవడించి సతతగతి వలె చాగనదేలా ?
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteమిత్రులు రాజారావు గారు,
ReplyDeleteచులకనయ జిలేబీ కందములన? అన్నారు మీరు. క్షమించాలి, నా అభిప్రాయం సూటిగానే చెప్పాను. కందములు ఆవిడ వ్రాసిన పక్షంలో నాకేమీ అక్షేపణ ఉండదు. కాని ఆవిడ జిలేబీగారు వ్రాస్తున్నవి కందాలూ కావు అవి ఏమాత్రమూ లక్షణంగానూ లేవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.
మీకు ఆవిడమీద అఖండమైన గౌరవాభిమానాలుండటాన్ని తప్పక గుర్తించి గౌరవిస్తాను. కాని ఆవిడ వ్రాస్తున్న మీ-దృష్టిలో-కందాల పట్ల నాకు తీవ్రమైన అసంతృప్తి ఉండటాన్ని కూడా మీరు అర్థంచేసుకోగలరని ఆశిస్తున్నాను. మీరెలా అవి ఆమోదిస్తున్నారని నేను ఆక్షేపించటం లేదు - అవి మీకు నచ్చటం మీ యిష్టం. నాకు నచ్చకపోవటం తప్పు అని మీరు దయచేసి తప్పుబట్టవద్దని ప్రార్థన - అవి నాకు నచ్చకపోవటం కేవలం నావ్యక్తిగతం.
నాకు తోచిన కారణాలు నేను చెప్పుతున్నాను నచ్చకపోవటానికి. మీకు తోచిన కారణాలు మీరు చెబుతున్నారు మీకు నచ్చటానికి. నాకేమీ ఇబ్బంది లేదు. ఎవరినీ వ్యక్తిగతంగా చులకన చేయటం లేదు. నాకు నచ్చనిది నచ్చలేదంటున్నాను, ఎందుకు నచ్చలేదో కూడా చెబుతున్నానంతే.
ఆవిడ ఆకాశమూ నేను పాతాళమూ అని మీరు భావించినా మరొకరు భావించినా నాకు చింతలేదు. ఐతే నా అభిప్రాయం వ్యక్తపరచటం వలన పెద్దలకు ఇబ్బంది కలుగుతున్నపక్షంలో అలా చేయటమూ క్రమంగా మానుకుంటాను.
ఈ కారణజగత్తులో నేను ఎవరినుండీ ఏమీ అశించటం లేదు. మన్నించాలి.
రాజారావుగారు మిమ్మల్ని ఉద్దేశ్యించి అనలేదు.వీ ఎన్ ఆర్ గారి ని ఉద్దేశ్యించి వ్రాసారు. మీరు అలగడం బాగాలేదు.
Deleteచూచితిరా జిలేబి హిత ! చోద్యము చూచెదరేల ? చాలు? సం
Deleteకోచము లేదు నాకు తమగూర్చి , మహోన్నత పాండితీ ప్రభా
రోచిషి మీకు సొంతమగు , రూఢిగ శ్యామల రావుగారునూ
వాచకమున్ వెలార్చిరి భవాదృశ శోభల , శోభిలన్ దగున్ .
# నీహారిక గారు
Deleteరాజారావు గారి వ్యాఖ్య నన్ను గురించేనని నేనూ అనుకున్నాను. కానీ అది తన గురించని శ్యామలరావు గారు అనుకోవడం నాకూ ఆశ్చర్యమే.
Deleteమొత్తం మీద ఈ మహా కన్ఫ్యూషన్ నుండి లలితా సహస్రనామ ఆవిర్భావం జరిగింది.
పంచదశలోకానికి మరో సరికొత్త బ్లాగు వచ్చింది :)
శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని వూరికే అన్నారా పెద్దలు
కుట్టు కుట్టు లోన కుట్టు గలదుసూవె :)
జిలేబి
కందుక క్రీడగా దలచి కందము లల్లును , వ్యావహారికా
Deleteనంద పద ప్రయోగము కనంగ విచిత్రము నాకు , నింతగా
మంది వచించు పల్కులు రమారమి పద్యములోకి మార్చుటల్
యెందును గాంచిరా ! ప్రతిభ లివ్వి , జిలేబికి గర్వకారణాల్ .
జిలేబీ గారి ప్రతిభా పాటవాల నుటంకిస్తూ నాలుగు పద్యాలు వ్రాయవలసినదిగా మా సోదరి నాకప్పగించిన పనిని దిగ్విజయం గా పూర్తి చేశాను .
ఆంధ్రభారతికి జిలేబి యండయో , క
Deleteనంగ నాంధ్రభారతియే తనకొక యండ
గా నిలిచెనో యనంగ దిగ్గజము రీతి
జెలగు మాత జిలేబీకి జెట్టి యెవరు ?
ధన్యోస్మి !
Deleteలక్కాకులయ్య నేర్పగ
చక్కగ నేర్చెను పదముల చడుగుడు సత్యం
బిక్కడ యిదియే చదువగ
నెక్కడ యిన పేర్చె తాను లెక్కగ గణముల్ :)
జిలేబి
ReplyDeleteచులకన యకో జిలేబీ
గిలగిల లాడించు పద్య గిద్యములనగా
భళినే చెప్పెద తప్పక
కలలో గాండ్రించి నన్ను కలవర పెట్టెన్ :)
జిలేబి
ReplyDeleteదిగ్దంతియగు జిలేబీ
వాగ్దేవినిఁ గొలుచువాఁడు, వ్యర్థుఁడు జగతిన్
దుగ్దను నొందును గొల్వక
వాగ్దేవతను, వినుమా నివారణ గనుమా !
జిలేబి
ReplyDeleteఅమ్మ ఆజ్ఞ యనుకొని ప్రయత్నము సరి
చేసెదను లలితమ్మా కచేరి లోన
చేవ జేర్చు యర్థములను చేర్చెదనిక
కంచి స్వామివారి చలువ గాను నేను!
జిలేబి
ReplyDeleteవ్యాఖ్యా వ్యాసంగంబిక
విఖ్యాతము చేయబోను! వీడెద! బ్లాగ్లో
కాఖ్యుని శపథంబిదియే !
ముఖ్యము గా వేరుపనులు ముంగట గలవోయ్ :)
జిలేబి
ReplyDeleteనేనే భుజముల తడుముకొ
నేనకొ? ఏమో ? మదిమది యెవరికి తెలియున్ ?
కానున్నదిక జిలేబీ
కానేరక తప్పు నా నికరముగ నమ్మీ !
జిలేబి
ReplyDeleteలలితా సహస్ర నామం
బుల గాధలివి లలితమ్మ పుట కొత్తది నే
వెలువరచితిని చదువగా
పలువురు మేలుబడయంగ ప్రార్థనలివియే !
జిలేబి
ReplyDeleteభంగును త్రాగి పలికెదవ
చెంగున ప్రాంగణము దూకి చెప్పుము భడవా
తింగరి బుచ్చి, యెచటరా
సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్?
ఇవ్వాళ పెందరాళే ముందే వచ్చేసిందేమిటి :)
జిలేబి
ReplyDeleteకొంగున నంగీ దోపగ
తింగరి మనువాడెనర్ర తివిరి జిలేబిన్
ఠంగున వచ్చెను తెలివిడి
సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్!
జిలేబి
ReplyDeleteరంగడి కేళిని నాటక
రంగంబుగ లోకమాయె! రంగుల కలలో
హంగులు నావే యనుకొని
సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్!
జిలేబి
ReplyDeleteబెంగాల్బేనర్జీ తా
కంగారసలుపడదు తడకట్టు తనకు లే
దంగట! రాష్ట్రము భోజ్యము!
సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్!
జిలేబి
ReplyDeleteపోయెను రాముడు లలితయు
పోయెను వచ్చెను జగనుడు బ్రువ్వట బాబా
ధ్యేయము వీడెను మార్గము
మాయా మయమగు జిలేబి మహియే సుదతీ :)
జిలేబి
ReplyDeleteఅంగజు కేళిని తేల్చగ
పొంగుచు నయ్యరు జిలేబి పొలతిని వరుడై
చెంగట, ణిసిధాత్వర్థపు
సింగము నోటన్ వసించె జిలుక ముదమునన్ !
జిలేబి
అంగజు కేళికి జిక్కి , శు
Deleteకాంగన తరుమంగ , మగశుకము భయపడుచున్ ,
చెంగటగల భీకర ' రా
సింగము ' నోటన్ వసించె చిలుక ముదమునన్ .
ఈ పద్యం అర్ధం కాలేదు 😔
Deleteఆడ చిలుకకు మగచిలుక భయపడి రాతిసింహము నోటిలో దాక్కుంది .
Delete# రాజారావు గారు
ReplyDelete// “..... నాలుగు పద్యాలు వ్రాయవలసినదిగా మా సోదరి నాకప్పగించిన పనిని దిగ్విజయం గా పూర్తి చేశాను .” //
👏
ఇక పుస్తకావిష్కరణకే పూనుకోవాలి నీహారిక గారు. ఆల్ ది బెస్టూ 👍.
Deleteకొంపదీసి నా పద్యాల్ని అచ్చేయించి ఆవిష్కరణకు నన్ను పిలువబోతున్నారేమిటి :)
మానాన్నే !
మాయమ్మే !
మాయమ్మే
ఆహా యేమి నా భాగ్యము !
భాగ్యంబన్న జిలేబి దేగద సభాప్రాంగశాతోదరీ :)
చీర్సే చీర్సు
జిలేబి
ధన్యవాదాలు సార్ , తమరు వేరొకచోట ....
Deleteముందు మాటలు వ్రాసిరి , బుధుల వలన
మెప్పు వడసిరి , వలపక్షమేల యిపుడు ?
చులకనయ జిలేబీ కందములన ? పండి
తులకు - సమదర్శనత నుండి , తొలుగ తగదు
నా ప్రశ్నకు బదులేదీ .....
@జిలేబి,
Deleteపుస్తకం అచ్చు వేస్తాము. తమరు ఒప్పుకున్నట్లేనా ? తమరిని కలిసే అవకాశం ఇస్తే తదుపరి చర్చలకు అవకాశం ఉంటుంది కదా ?
వీ యన్ ఆర్ సార్ కు విన్నపం .....
Deleteఅనఘా ! తామును పట్టు వీడుడు బుధా ! అంతేసి పాండిత్యతా
ఘనతల్ తెల్గున నాంగ్లమందు నరిసింగన్నా ! తవాధీనముల్ ,
మన నీహారికనూ , జిలేబి బుధులన్ మన్నింపరాయేమి ? , మీ
మనసారన్ దగు ' ముందుమాట ' నిడుమా , మన్నింపుమా మమ్ములన్ .
# నీహారిక గారు
Delete// “తమరిని కలిసే అవకాశం ఇస్తే తదుపరి చర్చలకు అవకాశం ఉంటుంది కదా ?” //
—————————
హ్హ హ్హ హ్హ, దీన్నే Catch-22 సిచ్యుయేషన్ అంటారు 😀😀.
# రాజారావు మాస్టారు Feb 09, 2019 at 4:21 pm; Feb 11 at 10:18 pm; Feb 11 at 11:48 pm
Delete———————————————
వలపక్షం కాదు, చులకన అంతకన్నా కాదు. ముందుమాటో, చివరిమాటో వ్రాయాలంటే సదరు పుస్తకాన్ని చదివి, అర్థం చేసుకోవాలి కదా. వారి పద్యాలు చదివి అర్థాన్ని ఆకళింపు చేసుకునేటంత వైదుష్యం నాలో లేదని నాకు తెలుసు. శ్యామలరావు గారు అన్నట్లు అడుగడుగునా ఆంధ్రభారతిని “దున్నడం” కూడా నావల్ల అవదు. కాబట్టి ఈ విషయంలో నిస్సహాయుడిని. నన్నొదిలేయండి.
అసలు ఆ మాటకొస్తే పద్యాలు కట్టగలిగే సామర్థ్యం కలిగిన మీరే పద్యాల పుస్తకాలకు పరిచయవాక్యాలు వ్రాయడానికి ఎంతైనా అర్హులన్నది నిర్వివాదాంశం. అందువల్ల మీరే ఆ పని చేస్తే సొంపుగా ఉంటుంది, ఆ పుస్తకానికి శోభనిస్తుంది. మీ “సోదరి” గారు కోరినట్లుగా మీరు వ్రాసిన ఆ నాలుగు పద్యాలను కూడా మీ ముందుమాటలో భాగంగా చేసెయ్యవచ్చు. కాబట్టి “ఆ రకంగా ముందుకు పోదాం”.
జిలేబీ వారు ఎవరేమి మాటాడినా , ఆమాటలను యథాతథంగా పద్యాలలో చెబుతున్నారు . ఏతావత్ ,
Deleteమన మాటలే అవన్నీ . మామూలు మాటలే . కొబ్బరి పీచు వొలవక్కరలేదు . టెంక పగులగొట్టక్కరలేదు .
ఇక , నేను పద్యాలను కట్టగలను . కాని , తమ వలే ముందుమాట రాయగల భావుకుడిని గాను . అందుకే , ఆ కార్యానికి మిమ్మల్ని న అనుకున్నట్లు న్నారు . అనుభవము గలదు కూడానాయె . పద్యాలింకో నాలుగు రాయమన్నా నేను రాస్తాను లెండి . ఇంతకూ , పాపం జిలేబీగారు తనవాళ్ళెవరో , పెర వాళ్ళెవరో ఇకనైనా .....
Deleteఎవరేమి మాటలాడిన
గవనము గా చూసి దాని గణముల్ లెక్కె
ట్టి వరుస పద్యంబుల గ
ట్టి, వాహ్ జిలేబీయముగ తృటిని చెప్పిరిగా :)
జిలేబి
🦁,
Deleteyou can't get people without funding, but you can't get funding without the people there in the first place 👍
# నీహారిక గారు
DeleteCatch-22 కు మరొక ఉదాహరణా 🙂😀 ?
🦁
Deleteడబ్బులు లేక జనాలను
సుబ్బా తెచ్చుకొనలేవు సూ! భువిని జనా
లబ్బో లేకున్న నరే
డబ్బులు రావయ్యరొ నరుడా విను వినుమా :)
జిలేబి
ఏమిటీ హఠం ఈ వయసులో .... అన్నీ నేనే చూసుకుంటానని రెండ్రోజుల క్రితమూ చెప్పాగా ? అయినా ఎందుకు తాత్సారం ? మిమ్మల్ని కలిసి పుస్తకం గురించి చర్చించే అవకాశం ఎపుడిస్తున్నారు ? రాణీపేటక్కూడా వీసా కావాలా ?
Delete🦁,
Deleteజిలేబీ గారిని catch చేయాలంటే తప్పదుగా 😆
Deleteఅద్భుతమైన కట్ పేష్టుతో మొదలుపెట్టారు. అనేక విషయాలు తెలియపరుస్తున్నందుకు కృతజ్ఞతలు.
:)
జిలేబి
జిలేబీ గారి రెకమెండేషన్ కదా ? హరికాలం కూడా మొదలయ్యింది పండగ చేసుకోండి.
Delete
ReplyDeleteకవితల రాయించిన రా
ఘవుడే కామింట్ల వేయ కారణమగున
య్య విదుర! జైగొట్టి పలికె
ద వచ్చు నట్టి సమయమ్ము దగ్గిర లోనన్ :)
జిలేబి
పోతన "పలికించెడి వాడు రామభద్రుడు" అన్నారు కదండీ.
Delete
ReplyDeleteమనసున చంద్రుండు కలడు
కనుబొమ్మనసూర్యుడమ్మ కందజిలేబీ
కనుబడ, మదియదుపున్ బడ
నినబింబము పగటిపూట హిమగోళ మగున్!
జిలేబి
ReplyDeleteమనసున మనసై తనువున
తనువై హృదయంబులో హృదయమై గానన్
మనుగడ రతగురువున్ కెడ
యినబింబము పగటిపూట హిమగోళ మగున్!
జిలేబి
ReplyDeleteమనుజుల్ కాలుష్య నివా
రణ మదినెంచక బతుక మరణపు మృదంగం
బనుగీతియై జిలేబీ
యినబింబము పగటిపూట హిమగోళ మగున్!
జిలేబి
ReplyDeleteప్రోజెక్టుల పైనన్ భళి
ప్రాజెక్టులనే తెరిచెడు రాయులమయ్యా
ప్రాజెక్టు క్లోషరనెడు ప్రొ
సీజరు లేదయ్య డీజి చింతవలదయా :)
జిలేబి
ReplyDeleteఅవుతా నేనే డాక్టరు
నవుతా డబ్బులు గలగలలాడ జిలేబీ
నవుతా షుగరూ బీపీ
చవుకగ వచ్చెడు బతుకున చకచక ₹పయా :)
జిలేబి
ReplyDeleteపరిహాసమకో రాముడె
తిరమని నమ్మిన జనులన ? దిమ్మ తిరుగున
ట్లు రయముగా మా రాముడె
పరుగిడి వచ్చు గడగట్టు భక్తుని గావన్ :)
జిలేబి
ReplyDeleteబండి వారటంచు పండితులకనుమా
నంబదేల కలిగె ? నరస రాయ
లయ్య పట్ట గాను లబ్మని పాయింటు
రాజు వారు చెప్పిరచటనరరె :)
జిలేబి
ReplyDeleteఈ యలక లేమిటండీ
సాయంకాలమ్ము చవితి చంద్రుడు సరదా
గా యయ్యవారల జిలే
బీయము గా చూసినాడ విపరీతముగా :)
జిలేబి
ReplyDeleteతట్టని దానివలననే
గట్టిరి మన శాస్త్రి వరులు కంద జిలేబుల్ :)
కట్టల్ కొలదిగ సిగరెట్
చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!
జిలేబి
ReplyDeleteబండి దొర నొచ్చు కున్నా
రండయ్యా బుజ్జగింపు రప్చరు నాపన్
దండిగ చేసితిమయ్యా !
కొండీలున్ లొల్లియున్ ఖగుడ లేదు సుమా :)
జిలేబి
ReplyDeleteనీలాపనిందలండీ!
నీలమణిన్ కూడ విడువనే లేదుగదా !
మాలాటివార లేపా
టీ! లావణ్యవతి ముప్పటిల్లును త్వరగా :)
జిలేబి
ReplyDeleteమీ రెకమెండేషను గా
దే రమణి జిలేబి , హరియు తెరపై వచ్చెన్ ?
ఔరా ! యిది మా మాయా?
పోరడ మా లక్కుపేట పోరడ చెప్మా :)
జిలేబి
ReplyDeleteచిరునామా లో శ్రీలలి
త రసమయపు బ్లాగు చూడ తనివారె జిలే
బి! రకరకాలు సుమా పే
ర్లరయగ దేవతలకు మరి రహియొకటె సుమా !
జిలేబి
ReplyDeleteబ్లాగ్లోకపు ఫత్వాలు :)
బ్లాగుముఖంగా యేకే
స్తా గురుడ సహస్రనామ జపపు పదములన్
ఓ గురుతర బాధ్యతగా
బ్లాగున వివరించక త్వరపడి యెగ జోపన్ :)
జిలేబి
ReplyDeleteఇంతకు యనానిమసెవరు
కొంతైనా తెలిసెనో ? కకుత్తెవరిదకో ?
వింతగ వుంది జిలేబీ
సుంతయు తెల్వక జనులు విసుగునొందిరిగా :)
జిలేబి
ReplyDeleteనాకర్థంబయి చావద
యా కొంతైనన్ జిలేబి యమ్మివి పద్యా
లే! కోవిద వేదంబిక
నాకెట్లర్థమయి చచ్చు నయ హరిబాబూ :)
జిలేబి
ReplyDeleteవేదాల్లో నరె సైన్సు లేదకొ? మరీవెర్రాయి కామోసు సు
మ్మీ! దా! నేర్పుత ! సైన్సు, వేదములలో మేలైన శాస్త్రంబొరేయ్
లేదంచున్ తను ప్రూవు చేయగలదా ? లెక్కెట్టి చూపిస్త రం
డ్రా దమ్ముంటె ! సవాలిదేను! హరి నర్రా గట్సు హాల్మార్కు రా!
జిలేబి
ReplyDeleteమట్టిని కలిసెదవయ్యా
చుట్టల్ గాల్చిన! లభించు సుఖసంపత్తుల్,
పెట్టని కోటై మారును
దిట్టగ నారోగ్యము, వలదీ పొగ పొంకాల్ !
***
ఎట్టెట్టెట్టెట్టా పొగ
చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్?
గట్టిగ అనమాకయ్యా
చట్టని పోలీసు వెన్క చట్టము వచ్చున్ :)
***
నేటి సినిమాలు
పొగ, మద్యపానం త్రాగటం హానికరం అని statutory warning పెట్టేసి ఫ్రేమ్ ఫ్రేమ్ లో చేతిలో బాటిల్ నోట్లో సిగరెట్ అందరి చేతా పెట్టించేసి హిట్ పిక్చరు తీసి రాజభోగాల్ అనుభవించడం :)
చట్టము చెప్పెను శిక్షని
చుట్టల్ గాల్చిన ; లభించు సుఖసంపత్తుల్
ముట్టవలదంచు పలుకుచు
నెట్టుకొలుప ఫ్రేము ఫ్రేమునే నద్దానిన్ !
***
బాహుబలి :)
అనూష్కయే సుఖసంపత్తి :)
కట్టప్పా! వెస దివిటీ
చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్,
దిట్టగ నెద్దుల కొమ్ముల
గట్టి తరుమగ మనకే యికన్ జయము సుమీ
***
అథ యోగానుశాసనమ్
యోగః చిత్త వృత్తి నిరోధః
చట్టని ధ్యానము చేయుము
పట్టు విడువ వలదు సూవె పద్మాసనమం
దట్టడుగు చెలగు తలపుల
చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!
***
చుట్టాల్వచ్చిరి యింటికి
పట్టమ్మా దస్కముగల బందుగులు సుమీ
చట్టని తీపి జిలేబీ
చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!
***
నెట్టింట నారదాయిత
ReplyDeleteమట్టి మషాణములు హితుల మనసులు కలగన్
దట్టించి రుచిర కందపు
చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!
ReplyDeleteఅంతర్జాల ఉషశ్రీ!
వంతెన ! కష్టేఫలి! ప్రతిభాశాలి కతల్
వింతైనవి! జీవితపు ప్ర
శాంత సమయమందు చేర్చె సద్భావనలన్ !
జిలేబి
ReplyDeleteదూకుడు మొదలెట్టా బ్లా
గ్లోకము లోన టపటప యిగోలాగిస్తా
నా కలమును శక్తికొలది
పాకము గావేసెదన్ టపాల జిలేబీ :)
జిలేబి
ReplyDeleteవేదాల్లో నరె సైన్సు లేదకొ? మరీ వెర్రోళ్ళు కామోసు సు
మ్మీ! దా! నేర్పుత ! సైన్సు, వేదములలో మేలైన శాస్త్రంబొరేయ్
లేదంటూ తను ప్రూవు చేయగలదా ? లెక్కెట్టి చూపిస్త రం
డ్రా దమ్ముంటె ! సవాలిదేను! హరి నర్రా గట్సు హాల్మార్కొరేయ్ :)
జిలేబి
ReplyDeleteఅయినా బిరుదుల నిచ్చుట
కయినా పుచ్చుకొననైన కార్చిచ్చు కులా
ల యిసయము లెందు కండీ ?
వయసాయెనుబుద్ధి మట్టు బ్లాగ్చండీ పో !
జిలేబి
"అంతర్జాల ఉషశ్రీ" అనే మాటపై బిరుదుల గురించి నీహారిక గారు ఇక్కడ వ్రాసిన అకారణ scathing వ్యాఖ్య, దానిపై నా స్పందన సంకలినులలో మాత్రం కనిపిస్తున్నాయి గానీ మీ బ్లాగులో కనబడడం లేదేమిటి చెప్మా, ఏం మాయ చేశారు "జిలేబి" గారు 🤔 ?
Deleteబిరుదుల గురించి నిన్ననొక వ్యాఖ్య వ్రాశాను ఇక్కడ. ఇంకా ప్రచురించలేదే? ఉన్నట్లుండి మోడరేషన్ విధించినట్లున్నారు.
Delete
Deleteపొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య...
పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య...
పాట చూడవలె :)
జిలేబి
ReplyDeleteఓరయ్యో పెద రాజ! మోపు తలపై సోకుల్ వయారంపుతో
జీరాడంగను వచ్చినా కవితకై చిత్రంబుగా నయ్యరో
యేరాలమ్ముగ నన్ను చూడ తృటిలో యేటో పదాల్ వస్తయం
టా రాయన్ సరి మూట కట్టుకునినేటాటా యనంటానులే !
జిలేబి
ReplyDeleteచేయాలేమో ఫిర్యా
దేయిక బ్లాగరు కరరె! యిదేమయ గూడున్
వాయించేస్తుండ్రు సదా
స్థాయిన్ మించిన పొడలన సౌభాగ్యమకో :)
జిలేబి
ReplyDeleteకనుడయ్య యీయెరువుని! మ
హిని మీ పంటల కిదేను హితమగును ! రసా
యనికముగ పెరిగి బరువున
మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్
జిలేబి
ReplyDeleteచూడ కళ్ళు పోయె సుందర వదనా జి
లేబి! కాళ్ళు పోయె లేవ కష్ట
మాయె!చీకటి బతు కాయె నారాయణా!
కూచి! వచ్చె హరిమ గూడు బోవ !
జిలేబి
ReplyDeleteపొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య...
పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య...
ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది
ఎనక్కొస్తే ఎగిరి కాలు ఝాడిస్తుంది...
ఓహో... ఓ... హోయ్...
ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది
ఎనక్కొస్తే ఎగిరి కాలు ఝాడిస్తుంది...
విసురుకుంటూ కసురుకుంటూ
ఇటూ అటూ అటూ ఇటూ డిర్‌రరర్‌ర్..
కుంకిళ్లు పెడుతుంది కుప్పిగంతులేస్తుంది
హాయ్... పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య.
ఓరయ్య...
అదిలిస్తే అంకె వేయు తిట్టిపోయు గిత్తరా
అరెరెరెరెరే కదిలిస్తే గంతులేసి కాండ్రుమనే గిత్తరా
దీని వ్యాఖ్య తీరు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతది
నడక జోరు చూస్తుంటే నవ్వు పుట్టుకొస్తది
అహ... అహ అహ అహహ ...
జిలేబి
ReplyDeleteకుదిమట్టంబుగ జెట్టిమబ్బుగ మరే గుంజాయిషీ గుబ్బగా
అదిరేచూపుల తీయగంటి సమ వయ్యారంబు! నిన్జూడగా
మదిరెండాడక చెప్పి నారు వినవమ్మాపూవుబోడీ జిలే
బి! దువాడించుచు విన్నకోటవరులే విప్పార్చు నేత్రమ్ములన్ :)
ReplyDeleteఅడ్డదిడ్డము గానుబోవుచు నాంధ్రదేశము చుట్టుచున్
గడ్డికోసితి మోపుగట్టితి గట్టిగానటు చేలలో
వడ్డనమ్మును చేయరండయ వాసిగానగ పద్యముల్
తెడ్డువేసెడు వారలెవ్వరు తేటగీతిని తోడుగా :)
ReplyDeleteఒకటే విషయము కావ
చ్చు కవివరుడ వివిధములగు సొబగులు వేర్వే
రు కడలి యలలవలె జనులు
నికుంభిలను కొలుచు రీతిని సదా నరుడా!
జిలేబి
ReplyDeleteభావుకత యసలు లేదే?
మీ వాక్యంబులు సొబగుగ మించారట్లే
పై వరుస లోన పెట్టికి
భావంబేమో జిలేబి పద్మా! తెలుపన్ !
జిలేబి
ReplyDeleteఓయీ! రిబాల్డు! సయి మటు
మాయ! జిలేబి జర భద్రమమ్మరొ పలుకుల్
సాయం సమయపు వారల
కీయవు శోభల్ వినదగు కీసర వలదోయ్ !
జిలేబి
ReplyDeleteసంపక తింటావేలా !
కంపర మెత్తెను నరునికి కంద జిలేబీ
కుంపటి రగిలెను వేయన్
నింపాదిగ పొద్దుట నితనెవడో తెలిసెన్ :)
జిలేబి
ReplyDeleteకనుడయ్య యీయెరువుని! మ
హిని మీ పంటల కిదేను హితమగును ! రసా
యనికముగ పెరిగి బరువున
మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్
జిలేబి
ReplyDeleteకన మందమతులె సుమ్మీ
మన మేధావులు జిలేబి! మనుగడ యననే
మని తెలియదు! యెట్లగునే
మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్?
జిలేబి
ReplyDeleteతనరారు గ్రామపు సొబగు
లనుగని మించారు పొలములను నేపుగ వృ
ధ్ధినిగాంచుచు ధ్యానంబున
మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్!
జిలేబి
ReplyDeleteవచ్చే వారానికి ఆకాశవాణి సమస్యాపూరణ
దత్త పది - కరి గిరి దరి సిరి అన్యార్థంలో దేశభక్తి ప్రబోధకముగా
పుల్వామా సైనికులకు నివాళి -
పద! రిపువుల నడచంగ ! మ
న దేశ భద్రత కొరకు మనమళుకరియె కా
దు!దువాడించుచు పుల్వము
గ దునిమి గిరికవలె తిరిగి కసి రివ్వుమనన్ !
వందేమాతరమ్
జిలేబి
ReplyDeleteహమ్మయ్య హంసపాదు గట్డెక్కింది :)
ఏదో శర్మాజీ మీ
కై దేవి సమభిధల గమకంబాపనయా
ఆదేశంబొకరైనన్
నాదరణగ చేర్చినారు నాకది పదివేల్ :)
జిలేబి
ReplyDeleteరాములోరు పోయేరరె! రాజ్ఞి లలిత
మాత వచ్చేను! జోషొచ్చె మంచిగాను
మేటి అమ్మోరి తలపులో మెండుగాను
నామ జపమాయె వివరణ నామములకు
జిలేబి
ReplyDeleteవాసన పట్టగల నరుని
నే సుమ్మీ యిది జిలేబి నెగడై గంధ
మ్మే సూవె! యనానిమసుని
వేస మెవరిదమ్మ చిలుక వేగిర తెలుపన్ :)
జిలేబి
ReplyDeleteహీరోలకు కలరే సొగ
సై రోడ్డుసయిడభిమాన సంఘాలరరే
జీరో లయ్యిరి సైనికు
లే!రాముని కోతిమూకలే మన వీరుల్ !
జిలేబి
ReplyDeleteయోగము మేలు! విడుమికన్
రాగద్వేషమ్ముల! విడరాదు మునులకున్
క్రేగంటిచూపులు! జిలే
బీ గట్టి నియమమువలయు పిరియము తోడై!
జిలేబి
ReplyDeleteదీనిని భాష్యంబనరం
డీ! నరసన్నా జిలేబి డింగరి వక్రం
బేనయ్యా బ్లాగ్బాంధవ!
బోనగిరి పలికిరి సూవె పూబోడి వినన్ :)
జిలేబి
ఏమిటో! జిలేబి మాయ? నన్ను కందంలో ఇరికించేసారు. కోపం వచ్చిందో, ఏమో?
Delete
Deleteఅబ్బే ! మీ మీద కోపమా ! నెవర్!
మీ జన్మ ధన్యమయిందండీ బోనగిరి గారు .
చూడండి యెంత అందంగా సునాయాసంగా కందంలో యిమిడి పోయేరు
జిలేబి
ReplyDeleteఅయయో చోరులు ! నా బ్లా
గయయో యేమాయెనో ! పగలురాత్రీ యే
మయెనో ! యీమాయను బ్లా
గయ గూగుల్కంపెనీకి కతగా చెబ్తా :)
జిలేబి
ReplyDeleteఏ కవిరాజింటబతికె
నో కుక్కబతుకిలని నిపుణుండాయె నితం
డా కర్మని వాసనలను
మాకొన నీజన్మ లోన మరి పద్యములన్ !
జిలేబి
ReplyDeleteహమ్మయ్య ఒక కందం గిట్టెను :)
అంకితం మారెళ్ళ వారికి !
వామనకుమార! సరిలో
తా ములుగగు బేసిలో సుతారముగ జిలే
బీ మాదిరి, బేసిని సరి
లో మునుగును నమ్రతన్ తళుకులీనంగన్ !
జిలేబి
ReplyDeleteమానవుడు తెలుసుకున్నది
ఓ నరుడా యణువు మాత్ర మోయి తెలివి యం
తేను! తెలియ దైవంబును
తా నింకను నెంతయో యతనము గనవలెన్!
జిలేబి
ReplyDeleteఔరా ! మాశకారుని హైజాకు చేసేసారే :)/అదురహో
ఔరౌర విట్టుబాబు శ
కారుని కాపీ రయిటు సకలము జిలేబీ
దౌరౌరా చోరముతో
నారాయణ మంత్ర జపము నరక మొసంగున్
:)
జిలేబి
ReplyDeleteభారములను తొలగించును
నారాయణ మంత్ర జపము, నరక మొసంగున్
కోరికలపుట్టయేను ! ము
రారి పదముల శరణనుము రమణి జిలేబీ !
జిలేబి
ReplyDeleteనారాయణ - నార+ అయన
నార యనంగ పిసినిగొ
ట్టౌర!అయన మాయె దారి ! టంకంబులకై
నారాయణయని చేయగ
నారాయణ మంత్ర జపము నరక మొసంగున్!
జిలేబి
ReplyDeleteనోరారంగయనవలెన్
నారాయణ మంత్ర జపము! నరక మొసంగున్
హేరాలమ్ముగ తప్పుల
నౌరా చేయంగ దండన మలకమెరుపై !
జిలేబి
ReplyDeleteఏమండీ యనుచున్ సదా పెనిమిటిన్ నింపాదిగా ముద్దుగా
నా మందాకిని బిల్వ గా మనుజుడా యర్థంబులేవేరయా
ఆమృత్యుండట వేచివున్న బిలువన్ నార్యుండ! నన్జూడుమా
నీమార్గంబున నన్నుకూడ గొనిపో నిద్దానినీయంచురా
జిలేబి
ReplyDeleteపలువిషయమ్ముల పరిచయ
ము, లబ్జుగ ప్రవీణుడవు సముచితముగా నీ
విలలో మన మతమునటుల్
చులకన గా చూడగోరు స్టుపిడిటి యేలా :)
నారదా!
జిలేబి
ReplyDeleteవాజమ్మలము గురువరా
ఈజీ గా గుర్తు గాన నీ నామములన్
బేజారనుకోక తెలుపు
డీ జర రెఫరెన్సులయ్య డింగరుడనయా :)
జిలేబి
ReplyDeleteమనుజుల మది చీల్చు మతముల మత్తున
హింస; గల్గఁ జేయు హితము భువికి
సఖి యహింస మేలు సమసమాజము సుమీ
విశ్వదాభి భూజ వినవె భామ
జిలేబి
ReplyDeleteఅరవను సుమ్మీ మేలుగ
వరుసన మీ సూచనలను పరిశీలింతున్
మరువక పాటించుటకు కు
దిరినంత వరకు యతనము దీటుగ చేతున్ :)
జిలేబి
ReplyDeleteఅమరులయిరే జవానులు
విమతపు బుద్ధుల మనుజుల వికటాట్టహసం
బు! మరణ మృదంగమదిగో
హిమగిరి మండెను భగభగ హేమంతమునన్!
జిలేబి
ReplyDeleteపాయెన్ రాముడు ! మనకిం
పాయెన్ గద రాజకీయ వాచాలత్వం
బే! యేమి మాయ చేస్తవు
రా యెంకటరమణ నీవు రాతల మార్చన్ !
జిలేబి
ReplyDeleteదేవుడు గలడు గలడనే
భావన ధైర్యమును చేర్చు ప్రార్థింపంగన్
నావల కలడు కలండనె
డా విభుడే వజ్రముగ కడానియగు సుమీ !
జిలేబి
ReplyDeleteమతమిచ్చు ధైర్యము జిలే
బి తరమయినదేనకో ? కుపితుడడిగెనటన్
పతనంబందరునొందుదు
రు తరుణి విశ్వాసమొకటె రూఢియు కాదే :)
జిలేబి
ReplyDeleteదబదబ బైబిలు చదివితి
సబలునిగా నిర్బలునిగ, సకలంబున తా
ప్రబలు నిరాకారిగ మే
లు బికారిగ పిరియముగ ములుగుగా నతడిన్ !
ఈపాటి తెలియడానికి బైబిలు చదవాలా ప్రవీణూ :)
జిలేబి
ReplyDeleteసరదా గా వున్నాయం
డి రవణముగ పేరడీలు డిగనురుకె సుమీ
వరుసగ రాగమయముగా
పరుగిడు పదములు సొబగగు పరుగులు తోడై :)
జిలేబి
ReplyDeleteలోకమ్ముపైన మీదుగ
లోకుల పైనన్ జిలేబి లోకాచారం
బై కలదజ్ఞానపు ఛా
యా కల్మషములు వెరసి భయమునకు తలమై!
జిలేబి
ReplyDeleteపేరేమో తెలుగాయెన్
పోరడి వ్రాతాయె నాంగ్లపు కెలుకు బుచికీ!
సారు నిను పోల్చిరెవరో
మూరెడు తోకను మడిచి తెములుమయ్య వెసన్ :)
జిలేబి
ReplyDeleteమానవతకు, దర్పణముగ
యీ నాటి మనబతుకులకు, మీకథ నిలిచెన్
తేనీరువలె రుచికరము
గా నిమ్మదిని యొనరిచె సకలమున తానై
జిలేబి
ReplyDeleteనిత్యము బరకటను, నియతంబుగ తననే
భజన సేయువాడు భక్తుడగున?
నిత్య సత్యమును పునీతముగాగాన
భజన సేయువాడు భక్తుడగున?
జిలేబి
ReplyDeleteమత గ్రంధములన్నియు నా
యతీశ్వరుల మానస వలయములో వెలుగై
స్మృతియై మతమై సమ్మత
ము తిరము గాగాంచినట్టి ములుగు జిలేబీ !
జిలేబి
ములుగు = ?
Delete
Deleteకోశాగారము
పలుగూ పాఱా పట్టుక
Deleteనిలు వాలుగ తెలుగు భాష నేలలు త్రవ్వీ
విలువ గల పదము లేరుక
ములుగున దాచుంచి రమ్మ ! ముద్దు గదమ్మా !
ReplyDeleteమనుజులకు సంశయమ్మది
విను తప్పది కాదు సూవె విషయము తెలియన్
మనికియు శోధింపవలెన్
తన యునికికి మూలమెద్ది తరమెద్దియనన్ !
జిలేబి
ReplyDeleteక్రమబద్ధమైన ధర్మము
లమరు పదార్థములలోన లావణ్యముగా
సమవృధ్ధిని గానంగన్
శ్రమయెవరిదకో? తెలివిడి, శక్తి యెవరిదో ?
జిలేబి
ReplyDeleteహోమాలు ఫలించాలం
టే మనుజుడ వలయు క్లారిటీ!తెలుసు కొనం
గా మహిని బాగు పడెదవు
కోమలి నీహారిక పలుకులను వినుమయా :)
జిలేబి
ReplyDeleteమదిలోన భక్తి భావం
బదిలేకన్ పూజలను గబగబ యనుచు చే
య దరిసెనము దక్కునకో ?
ప్రదర్శనలతో జిలేబి ప్రభువగుపడునో ?
జిలేబి
ReplyDeleteహోమానికి యెక్సుపయిరి
భామా గలదే జిలేబి! పవనుని పల్కుల్
కోమలి నీహారిక విన
వే! మహి లో స్వాములు బతి కేదెట్లే సూ :)
జిలేబి
ReplyDeleteకట్టుకథలతో మంచిని
చట్టని చేయగలవనిన సఖి కాష్మోరా
పుట్టించే దడతో సరి
మట్టముగా చేయగలవు మహిని జిలేబీ :)
జిలేబి
ReplyDeleteపదవీ యోగంబెవరికి
పద గలదో? స్వామివారి ప్రజ్ఞని కలదో?
సదనంబున తెలుపువలెను
మదినొందును సుఖమపుడె కమలనయనికహో !
జిలేబి
ReplyDeleteఇంకా యేవేవో సా
యంకాలంపు పనులుండు యమహో యమహో
ఢంకా గాన భజానా
లింకా వారికి గలవు! జిలేబి తెలుసుకో :)
జిలేబి
ReplyDeleteఫ్యూచరు యోగంబెవరిక
హో ? చప్పునచెప్పరమ్మ హోన్హార్ స్వాముల్ !
నే చెప్పితినపుడే గా
దా చంద్రుల రాజ్యమని ఖుదాసాక్షిగ సూ !
జిలేబి
ReplyDeleteఉత్తుత్తిగ సర్వే మన
కిత్తరి యేల వలయు మన కిస్మతు పెంచే
ముత్తెపు కైపుల సర్వే
సత్తె పెమాణముగ సూవె చంపకమాలా !
జిలేబి
ReplyDeleteఆశయు పుట్టగ మోసము
పాశము గా మారునోయి ప్రావీణ్యుల్ కూ
డా శమనము గాన కుదర
దే శాస్త్రము కర్మవిధి యిదేయనును గదా
జిలేబి
ReplyDeleteతెలియని దానికి కట్టుక
తలకు ప్రవీణు గలదోయి తరమగు తేడా
యిలలో కాష్మోరా గా
థల వీరేంద్రుండు వ్రాయ తావిడిచె సుమీ :)
జిలేబి
ReplyDeleteదాతలను మీరు నేరుగ
జోతల నడుగక, స్వయముగ చొక్కదనము రాన్,
జాతర ఖర్చులకని, తా
మై తమ వద్దకిక, బంబ మనవలదు సఖా !
జిలేబి
ReplyDeleteజంతుబలులు లేవుకద ? ర
వంతగ సంశయమయ గురువర్యా రాజా
కొంతయు తప్పది కాదే
వింత సఖా నరసరాయ విదురా విదురా :)
జిలేబి
ReplyDeleteదేవుణ్ణెంతగ నమ్మిన
నూ వర్షాకాలమందు నూటెక్కుచు ముం
పై వరదై పుష్పమ్ముల
తావరలుకొనంగ చంపు దాక్షిణ్యము లే !
జిలేబి
ReplyDeleteవామాచారము పాటిం
చే మర్యాదగలదయ్య శ్రీనరసింహా!
మీ మాటలకు నెనరులయ
మా మాటంటే మదిమది మామాటేనౌ
జిలేబి
ReplyDeleteదేశభక్తి గలదని ఒట్టి మాటలు చెప్పక
దామోదరదాసు మోడి వలె ప్రభోదాత్మకంగా
In action వుండాలి
మసి రివ్వున చేసెద రిపు
ని సంహరణ తప్పుకాదు! నెమ్మియు కరికె
క్క సదయునిగ చేతు గిరిక
గ సర్వదేశముల తిరిగి కష్టేఫలియై!
మేరా భారత్ మహాన్
వందేమాతరం
జిలేబి
ReplyDeleteపుల్వామా లో అమరులైన సైనికులకు నివాళి
పద! రిత్తవడకు! కడపు ! మ
న దేశ భద్రత కొరకు మన మళుకరియె కా
దు! దువాడింపన్! పుల్వము
గ దునుము! గిరికవలె నీదు కసి రివ్వుమనన్!
వందేమాతరమ్!
జిలేబి
సోదరి నీహారికయున్
ReplyDeleteమేదురముగ పద్యరచన మీద మనస్సున్
సాదరముగ జేసె లయము ,
మోదంబిది , పద్య విథ మమోఘము చూడన్ .
ఎ క డా ?
Delete
Deleteఎకడా?
నీహారికఫిబ్రవరి 23, 2019 6:58 AM
Deleteసాగిలపడవలె దైత్యులు
యోగులదేశమిక రివటయో యంకసిరిన్?
దాగిరి ముష్కురులచటన్
వేగిరపడు బెదిరి నీవు వెనుతిరుగకుమా
మీరు కాదా ?
Where is this comment ? It's not mine.
Deleteమాలికలో సమస్యాపూరణల బ్లాగుకు సంబంధించినదిగా చూసేను . బహుశః మీపేరుగల ఇంకొక పండిత కవి కావచ్చు . అయితే , నా ప్రశంశ వారికే చెందుతుంది . ధన్యవాదాలు .
Delete// "Where is this comment ? It's not mine." //
ReplyDeleteహెట్టెట్టెట్టా, మరి "శంకరాభరణం" పద్యాల బ్లాగులో ఈరోజు "నీహారిక" పేరుతో కనిపిస్తున్న ఈ పద్యవ్యాఖ్య ఎవరిదన్నట్లు? Blogger profile లో కనిపిస్తున్న బొమ్మ కూడా మనకు తెలుసున్న నీహారిక గారిదేనే 🤔..
-----------------
శంకరాభరణం 23, ఫిబ్రవరి 2019, శనివారం దత్తపది - 154 కరి - గిరి - దరి - సిరి
నీహారిక ఫిబ్రవరి 23, 2019 6:58 AM
సాగిలపడవలె దైత్యులు
యోగులదేశమిక రివటయో యంకసిరిన్?
దాగిరి ముష్కురులచటన్
వేగిరపడు బెదిరి నీవు వెనుతిరుగకుమా
--------------------
శంకరాభరణం బ్లాగులో నీహారిక గారి పద్యం
Deleteఅదిగో నీహారికయున్
సదనంబున పద్యమును పసందుగ వేసెన్
అదియును దత్తపది! జిలే
బి, దాగిన కళాత్మకత సభికుల నలరిచెన్!
జిలేబి
ప్రొఫైల్ పిక్ ఎవరైనా పెట్టుకోవచ్చు. అది 2018 బ్లాగర్ ప్రొఫైల్.
Delete