డిసెంబర్ 22, 2012:
ముంబై షణ్ముఖానంద చంద్రశేఖరేంద్ర ఆడిటోరియం లో డాక్టర్ మంగళంపల్లి వారికి 'Life time achievement in Fine arts' అన్న అవార్డుని సభా వారు అందించారు. మహారాష్ట్ర గవర్నరు గారు బాలమురళి కృష్ణ గార్ని సత్కరించారు. ఈ సమయం లో మరో ముగ్గురు యువ కళా కారులని కూడా సంగీత శిరోమణి అని సత్కరించారు.
ఈ సందర్భం లో గవర్నరు గారు బాలమురళీ గారిని పొగుడుతూ, సరస్వతీ, మహాలక్ష్మీ పరిపూర్ణ కృపా కటాక్షాలు డాక్టర్ మంగళంపల్లి వారికుందని ఆయన సంగీతానికి 'gggreat service' (అదేమండీ మూడు 'జీ' లు పెట్టేరు అంటారా, గవర్నరు శ్రీ శంకర నారాయణన్ గారు మలయాళీ లాగున్నారు , గ్రేట్ సర్వీస్ ని వారు అలా 'నొక్కి' వక్కాణించారు మరి, కేరళా స్టైల్ లో) చేస్తున్నారని చెప్పారు.
వారి ప్రసంగం తరువాయి మంగళంపల్లి వారు ఈ పిట్ట కథ చెప్పేరు
'గవర్నరు గారు సరస్వతీ, మహాలక్ష్మీ కటాక్షాలు నా పై ఉందని చెప్పడం నా జీవితం లో జరిగిన ఒక సంఘటన ని నాకు గుర్తుచేస్తోంది.
తమిళ నాడు లో చెట్టియార్ వారి పెళ్లి లో పాడడానికి వారు వెళ్ళినప్పుడు జరిగినది ఇది. చెట్టియార్ గారి పెళ్ళిళ్ళలో ఒక విద్వాంసుడు మూడు గంటలు పాడితే, మరో చెట్టియారు మరో విద్వాంసుడిని పిలిచి ఆ విద్వాంసుడి కన్నా ఎక్కువ సేపు పాడాలని చెప్పే రకం అన్న మాట అంటే, ఎవరెక్కువ సేపు పాడితే వారి అభిప్రాయం ఆ విద్వాంసుడే మరీ గొప్ప అన్న మాట!.
వీరు వెళ్ళిన పెళ్లి లో బాలమురళీ గారు, మూడున్నర గంటల పైన కచేరీ చేసేరు. ఆ పై న ఆ చెట్టియారు వచ్చి 'సామీ, మోహనం పాడండని అడిగే డ ట.
మంగళం పల్లి వారన్నారట,చెట్టి గారు మొదట నా ముందు మనీ పెట్టండి ఆ పైనే మోహనం పాడతా అని.
చెట్టి గారు మరీ కోప్పడి, 'సామీ, చెట్టి వారు, ఎప్పుడైనా కచేరీ కి డబ్బులివ్వక పోయారా?' అన్నాడు
మంగళం పల్లి వారు, తాను భీష్మించు కున్నారు, మనీ ముందర పెడితే గాని మోహనం పాడ నని.
ఈ మారు చెట్టి గారికి మరీ కోపం వచ్చి, 'ఇది మాకు ఇన్సల్ట్' అంటే, అదేమో నాకు తెలీదు, ముందర మనీ పెట్టండి మోహనం పాడతా అని మంకు పట్టేరు బాలమురళీ వారు.
మొత్తం మీద చెట్టి గారు, డాక్టరు గారి ముందు మనీ పెట్టారు
ఆ పై బాలమురళీ వారు మోహనం గా మోహనం పాడారు.
అది విని తాదాత్మ్యం చెందిన చెట్టి గారు, స్వామీ, ఇంత గొప్ప గా పాడేరు, అయనా ఆ మనీ ముందర పెట్టడం అన్నదానికి ఎందుకు మొండి పట్టేరు? మా మీద మీకు నమ్మకం లేదా ? మీరు పాడేక , డబ్బులివ్వమని సందేహమా మీకు ? ' అని వాపోతే,
మంగళం పల్లి వారన్నారట, 'చెట్టి గారు, మోహన రాగం స,రి,గ ప ద స , స ద ప గ రి స. అంటే, మోహనం లో మ, ని లేదు. అందుకే మనీ ముందర పెట్ట మన్నా. స్వప్త స్వర ఘోష అయ్యింది కదా, మీ పెళ్లి లో, అంటే, చెట్టి గారు మరీ ఖుషీ పడి , డాక్టరు గారిని మరింత గొప్ప గా సత్కరించేరు.!
అదీ కదా సరస్వతీ, మహా లక్ష్మీ కటాక్షం అంటే !
చీర్స్
జిలేబి
ముంబై musings!
(photo పెడతా నను కున్నా, ఆ ఫోటో మా మనవడు మొబైల్ లో పట్టాడు అక్కణ్ణించి ఎట్లా ఈ టపా లో కి ఎక్కించడం నాటు తెలీదు. వీలైనప్పుడు ఈ సందర్భపు ఫోటో పెడతాను- జిలేబి)