"అయ్యరు వాళ్ నాకు విడాకులు కావాలి" మా అయ్యరు గారి చెవిలో పోరు పెట్టు కుని చెప్పా. చెప్పా అనడం కన్నా ఆర్డర్ వేసా అని అనడం సబబు.
'దానికేమోయ్ , విడి ఆకులే కదా మన పత్తి శెట్టి గారి కొట్టు కెళ్ళి పట్టు కొస్తా , ఈ మధ్య విడాకులు రావటం లేదట , మార్కెట్ లో, కుట్టిన విస్తరాకుల నించి పుల్లల్ని తీసి విడాకులు ఇవ్వమం టా ' అన్నారు మా అయ్యరు గారు
నాకు భలే కోపమొచ్చింది.
'ఆయ్ , విడాకులు అంటే వేళా కోళ మై పోయిందా మీకు ' ఇంతెత్తు కు ఎగిరా .
వారి ముందు లాపు టాపు పెట్టి, బులుసు వారి టపా చూపించా.
'అసలే నాకు కళ్ళు కనబడి చావడం లేదే ఇట్లా తెలుగు బ్లాగులు చదవటమంటే ఎట్లాగే ? అని మసక బడ్డ కళ్ళా ద్దల లోంచి చూసేరు.
చ, చ, ఈ సోడా బుడ్డి నా నే ప్రేమించింది అని నన్ను నేనే తిట్టు కున్నా.
'ఏమోయ్, జిలేబీ, ఏమన్నా నన్నన్నావా ఇప్పుడు ' ఓ చెవి నా వైపు పెట్టి కొంత ప్రశ్నా మార్కు పెట్టేరు అయ్యరు .
చ, చ, ఈ మానవుడికి చెవులు కూడా వినిపించడం లేదు మరీ పోను పోను.
'మళ్ళీ, చెవిలో గట్టిగా చెప్పా, 'నాకు విడాకులు కావాలి '
ఈ మారు కొంప మునిగేటట్టు ఉందని ఓపిగ్గా, టపా చదివేరు అయ్యరు .
'ప్రభావతీ ప్రద్యుమ్నుల్లా మనమూ విడి పోదామం టా వేమిటే ? ' అడిగేరు .
హమ్మయ్య ఇప్పటికి ఈ మట్టి బుర్ర లో ట్యూబు లైటు వెలిగింది అని సంతోష పడి పోయి, 'అవునని' తలూపా.
'అదేమిటే నువ్వట్లా, వెళ్లి పొతే నీకు వంటా వార్పూ చేసి పెట్టేదెవరే మరి ? '
'అబ్బా, ఈయనికి హోటలు బిజినెస్సు, వంటా వార్పూ వచ్చని ఇన్నేళ్ళు గా వంట చెయ్యడం నేర్చుకోక పోవడం, ఎంత తప్పై పోయింది సుమీ ' అని బిక్కు మని, కొంత, సేద తీరుకుని,' ఆ, ఏముందీ, ఆ ఓల్డ్ ఏజ్ హొమ్ లో వాళ్ళే, గంట కొట్టి భోజనం పెడతారులే ' అన్నా.
అన్నా గాని, మా అయ్యరు గారిలా వంట చేస్తారేమో వారు తెలీలే. ఎంతైనా, ప్రభావతీ ఉంటుంది కదా కాస్త మాట తోడూ ఉంటుంది అనుకుని, కొంత ఊరట పడ్డా.
'సర్లేవే, నువ్వడి గినది నేన్నెడైనా కాదన్నా నా. అట్లాగే విడి పోయి ఉంటాం లే. ' అంటా రని కొంత ఆశ తో ఎదురు చూసా.
చెళ్ళు మని, చెంపకాయ దెబ్బ పడింది.
'మీ ఆండోల్లకి చదువు నేర్పించట మంత బుద్ధి తక్కువ పని వేరే ఏమీ లేదు ' సూటిగా చూసేరు అయ్యరు గారు.
అవాక్కై పోయా.
ఈ మాట అయ్యరు గారేనా, అదీ, జిలేబీ తోనే నా అన్నది ? హమ్మో, కొంత దడ పుట్టింది.
జీవన వసంతం లో , తను చెప్పింది ఎప్పుడూ జవదాటని, రామచంద్రుడు, ఇవ్వాళ, సీతమ్మ తల్లికి ఎదురు చెబ్తాడా అని కుడి కన్ను అదిరింది
'ఇదిగో, చూడవోయ్ జిలేబీ, ఏదో బ్లాగులు, టపాలు రాసుకుంటూ టీం పాస్ టైం పాస్ చేసుకుంటూ, ఏదో 'ఉద్యోగం 'ఇస్త్రీ' లక్షణం' అని చెబ్తే, పోనీ లే ఊరుకున్నా. ఇట్లా విడాకులూ, పెడాకులూ అన్నా వంటే, నీ ఒళ్ళు పెట్రేగి పోతుంది' ఈ మారు కొంత సీరియస్ గా చెప్పేరు
అబ్బా, ఈ పురుషాహంకారం వీళ్ళకి తగ్గనే తగ్గదు సుమీ ' అని ఉస్సూరు మన్నా.
అంతే నంటారా ? విడాకులు ఇవ్వరా మరి ?
'జిలేబీ, నీకు విశ్రాంతే కావా లను కుంటే, ఇంట్లో కూర్చుని వంటా వార్పూ చేసుకో. ఉద్యోగం మానేయ్ '
హమ్మో, వంటా వార్పే, వద్దే వద్దు సుమీ ! , ఈ ఉద్యోగమేదో చేసుకుని అయ్యరు గారి మీద ఆజమాయిషీ చేసుకుంటూ ఉండటమే బెటరు ! ఏదో ఒక్క ముక్క 'విడాకు' కోసం ఇట్లాంటి సౌలభ్య మైన 'భరించు వాడు' భర్త
ని పోగుట్టు కోవ డమా ! వద్దే వద్దనుకుని'
అయ్యరు వాళ్ , ఇవ్వాల్టి 'సమయల్ ' ఏమిటి ? మళ్ళీ ఆర్డర్ వేసా.
నీకిష్టమైనా జిలేబీ చేశా నోయ్ ~
అబ్బా, ఈ పెనిమిటి ప్రెభువులు మన మూడ్ ని బట్టి తాజా మరీ చేస్తారు సుమీ అనుకుని, నోరు వెళ్ళ బెట్టేసా.
చీర్స్
జిలేబి.
అయ్యర్ వాళ్ చెంప దెబ్బ కొట్టేరంటే నమ్మనుగాక నమ్మను, మీరే కొట్టి ఆయ్యర్ వాళ్ మీద తోసేస్తున్నారు పాపం అయ్యర్ వాళ్.
ReplyDelete:) :)
ReplyDeleteఅయ్యరు వారు కరెక్టే. ప్రభావతికి విశ్రాంతి కావాల్సి వచ్చింది. జిలేబి గారు ఉద్యోగం చేసుకుంటూ విశ్రాంతిగానే ఉన్నారు కదా..............దహా.
ReplyDelete