చాగంటి జిలేబీయం - విశాఖా విశేషాలు
ఈ మహానుభావుడు జిలేబీ 'కాలం' లో తప్పి పుట్టాడు సుమీ అనుకున్నా.
చాగంటి వారి ధర్మసోపానం ప్రవచనం విన్నాక జిలేబీ రాయక పొతే, అదీను అమావాస్య నాడు టపా ముట్టక పోతే తప్పే తప్పు అదీ కాకుండా, శ్రీ కష్టే ఫలీ బ్లాగ్ 'గారడీ' గాంధీ గారు , వనజ వనమాలీ గారు జిలేబీ ని తలచిన శుభ దినమాయే కూడాను ఇవ్వాళ ! మరి !
ఓ నాలుగు రోజులు పై బడి శ్రీ చాగంటీ వారి ప్రవచనాన్ని విన్న తరువాయి 'కర్ణములు ' హోరెత్తి పోయేయి.
భద్రం కర్ణే భి శృణు యామ దేవా అని ఊరికే చెప్పారా ఋగ్వేదం లో మరి ?
ఇంతకీ వీరికి ఈ వాక్పటిమ ఎట్లా అబ్బింది సుమీ అని అబ్బుర పడి పోయా !
మనకు ఒక్క వాక్యం రాయాలంటే నే అంత కష్టం గా ఉన్నదే మరి , ఈయన ఒక్క పదం తప్ప కుండా ఇట్లాంటి పొడుగాటి వాక్యాలు ధారాళంగా , అలవోకగా అల్లుకు పోతాడే సుమీ అని మా అయ్యరు గారిని అడిగా
ఏమండీ ఇదెట్లా వీరు అనర్గళం గా అల్లుకు పోగలుగుతారు ? అన్నా
'వాక్శుద్ది మనో నైర్మల్యానికి సిద్ది ప్రతీక ' అని ఒక్క ముక్క లో చెప్పేసేరు నాకర్థం అయ్యే రీతిలో అయ్యరు గారు.
సరే,ఏది ఏమైనా వీరు జిలేబీ సమకాలీకులు గా వడం జిలేబీ చేసు కున్న పుణ్యం సుమీ అని సంతోష పడి పోయా !
అట్లాగే మన పంచ దశ లోకం లో అలవోకగా టపాలు రాసి గారడీ చేసే శ్రీ కాలక్షేపం శర్మ గారు ఓ సంవత్సరం పై బడి దినం తప్పక టపాలు రాసేరు కూడాను !
అబ్బో, ఈ గోదావరి తీరం వాళ్ళని గురించి ఎంత రాసినా తక్కువే సుమండీ మరి !
చాగంటి వారు కూడా గోదావరీ తీరం వారేనా ?
ఇంతకీ , మాయన్ కాలెండరు ఇరవై ఒకటి రావడానికి ఇవ్వాళ అమావాస్య సంసిద్ది పడు తోంది ! వేచి చూడాలి మరి .(ఆలోచనా తరంగాలు సత్య నారాయణ శర్మ గారు ఏమి చెబ్తారో మరి !)
స్వస్తినః పూశాః విశ్వ వేదాః !
జిలేబి
>> అబ్బో, ఈ గోదావరి తీరం వాళ్ళని గురించి ఎంత రాసినా తక్కువే సుమండీ మరి !
ReplyDeleteఅది మా గొప్పతనం కాదు సారూ. అమ్మ గోదావరి నీళ్ళు అలాంటివి. అవి మా రక్తంలో కల్సిపోయి మమ్మల్ని ఒక ఆట ఆడిస్తున్నాయి.
"గంగైచ యమునైచైవ గోదావరీ సరస్వతీ, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు" :-)
చాగంటి వారి ప్రవచనాలు అద్భుతం . నిజం గా వారి సమకాలీనులవడం మన అదృష్టం
ReplyDeleteబ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కాకినాడ, గోదావరి వాస్తవ్యులు, అమ్మ ఇచ్చినవరం ఆయన వాగ్ఢాటి. నిజంగా వారు పుట్టిన కాలంలో పుట్టి వారి పలుకు వినగలిగినందుకు జన్మ ధన్యమైంది. మీరు చెప్పిన మనో నిర్మలత్వం ఆయన సొత్తు, పోగేసుకోవాలనే ఆశ లేకపోవడమే ఆయన గొప్పతనం.చెప్పడం తేలిక, ఆచరణ కష్టం. ఇదే త్రికరణ శుద్ధి అంటే. అది ఉన్న వారి మాటకి పదునుంటుంది, విలువుంటుంది, అన్న మాట జరుగుతుంది.
ReplyDeleteఇక నాది మీరు చెప్పినట్లు మాటల గారడీ మాత్రమే. జిలేబీ గారూ, అని అర్తితో తలిస్తే ఇద్దరు భక్తులం ఒకేరోజు, ఏక కాలంలో, భక్తా! ఏమి నీకోరిక అని ప్రత్యక్షమయ్యారు. మీ విష్ణు మాయ ముందు నాది గారడీ కాదా
ఇంకో భక్తుడు కూడా హాజర్......దహా.
ReplyDelete