Friday, December 28, 2012

4వ ప్రపంచ జిలేబీ ఆవృత్త సభల స్వీట్ ఆహ్వానం!

అందరికీ 4వ ప్రపంచ జిలేబీ  ఆవృత్త సభల
 
స్వీట్ ఆహ్వానం ! హాటాహాకారం !
 
ఓ పాప ముప్పై ఏడేళ్ళ ముందు పుట్టింది.
 
ఆవిడకి జిలేబీ అని పేరు పెట్టేరు.
 
ఆ అమ్మాయి పరువానికి వచ్చింది.
 
పదహారు పరువం లో  ఓ ద్వీపం లో దారి తెలీకుండా
 
దిక్కు తెలీకుండా పోయింది.
 
చాన్నాళ్ళు అసలు పరువంపు జిలేబీ ఉందా అన్న సందేహం వచ్చేసింది.
 
ఇప్పుడు ముప్పై ఏడేళ్ళ ముత్తైదువై మళ్ళీ
 
ఇరవై పై బడ్డ సంవత్సరాల తరువాయి 
 
ఆంధ్ర దేశాన్ని వెదుక్కుంటూ వచ్చింది.
 
అమ్మాయి పరువం దాటి పోయింది.
 
ముదురాకు అయిపోయిందేమో అనిపిస్తోంది.
 
మాతృ భాష మరిచి పోయిందేమో అని పించేలా కనిపిస్తోంది.
 
పరువం లో ఉన్న ఆ అమ్మాయి స్నేహితురాండ్రు 
 
'మణీ ' ద్వీపానికి వెళ్లి పోయేరు.
 
స్నేహితురాండ్రు ల పరువాల జిలేబీ జ్ఞాపకాలు  మదిలో నిక్షిప్తం.
 
ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కలిసేరు.
 
జిలేబీ తిరిగి రాక పరువాల సోయగాలను మళ్ళీ తెస్తుందా ?
 
ఓ జిలేబీ! నీకిదే నీరాజనం!
 
 
 
జిలేబి.

Thursday, December 27, 2012

Me, तू, न, గుండు సున్నా (మిథునం!)

 
 
Me, तू, न, గుండు సున్నా (మిథునం!)
 
Me बिना तू ना ही,
 
तू बिना Me ना ही,
 
Me, तू, न, గుండు సున్నా (మిథునం!)
 
 ಜಿಲೇಬಿ 

Sunday, December 23, 2012

మనీ ముందు పెట్టు, మోహనం పాడతా -భీష్మించు కున్న డాక్టర్ బాలమురళీ కృష్ణ

డిసెంబర్ 22, 2012:

ముంబై షణ్ముఖానంద చంద్రశేఖరేంద్ర ఆడిటోరియం లో డాక్టర్ మంగళంపల్లి వారికి 'Life time achievement in Fine arts' అన్న అవార్డుని సభా వారు అందించారు. మహారాష్ట్ర గవర్నరు గారు బాలమురళి కృష్ణ గార్ని సత్కరించారు. ఈ సమయం లో మరో ముగ్గురు యువ కళా కారులని కూడా సంగీత శిరోమణి అని సత్కరించారు.

ఈ సందర్భం లో గవర్నరు గారు బాలమురళీ గారిని పొగుడుతూ,  సరస్వతీ, మహాలక్ష్మీ పరిపూర్ణ కృపా కటాక్షాలు డాక్టర్ మంగళంపల్లి వారికుందని ఆయన సంగీతానికి 'gggreat service' (అదేమండీ మూడు 'జీ' లు పెట్టేరు అంటారా, గవర్నరు శ్రీ శంకర నారాయణన్ గారు మలయాళీ లాగున్నారు , గ్రేట్ సర్వీస్ ని వారు అలా 'నొక్కి' వక్కాణించారు మరి, కేరళా స్టైల్ లో) చేస్తున్నారని చెప్పారు.

వారి ప్రసంగం తరువాయి మంగళంపల్లి వారు ఈ పిట్ట కథ చెప్పేరు

'గవర్నరు గారు సరస్వతీ, మహాలక్ష్మీ కటాక్షాలు నా పై ఉందని చెప్పడం నా జీవితం లో జరిగిన ఒక సంఘటన ని నాకు గుర్తుచేస్తోంది.

తమిళ నాడు లో చెట్టియార్ వారి పెళ్లి లో పాడడానికి వారు వెళ్ళినప్పుడు జరిగినది ఇది. చెట్టియార్ గారి పెళ్ళిళ్ళలో ఒక విద్వాంసుడు మూడు గంటలు పాడితే, మరో చెట్టియారు మరో విద్వాంసుడిని పిలిచి ఆ విద్వాంసుడి కన్నా ఎక్కువ సేపు పాడాలని చెప్పే రకం అన్న మాట అంటే, ఎవరెక్కువ సేపు పాడితే వారి అభిప్రాయం ఆ విద్వాంసుడే మరీ గొప్ప అన్న మాట!.

వీరు వెళ్ళిన పెళ్లి లో బాలమురళీ గారు, మూడున్నర గంటల పైన కచేరీ చేసేరు. ఆ పై న ఆ చెట్టియారు వచ్చి 'సామీ, మోహనం పాడండని అడిగే డ ట.

మంగళం పల్లి వారన్నారట,చెట్టి గారు మొదట  నా ముందు మనీ పెట్టండి ఆ పైనే మోహనం పాడతా అని.

చెట్టి గారు మరీ కోప్పడి, 'సామీ, చెట్టి వారు, ఎప్పుడైనా కచేరీ కి డబ్బులివ్వక పోయారా?' అన్నాడు

మంగళం పల్లి వారు, తాను భీష్మించు కున్నారు, మనీ ముందర పెడితే గాని మోహనం పాడ నని.

ఈ మారు చెట్టి గారికి మరీ కోపం వచ్చి, 'ఇది మాకు ఇన్సల్ట్' అంటే, అదేమో నాకు తెలీదు, ముందర మనీ పెట్టండి మోహనం పాడతా అని మంకు పట్టేరు బాలమురళీ వారు.

మొత్తం మీద చెట్టి గారు, డాక్టరు గారి ముందు మనీ పెట్టారు

ఆ పై బాలమురళీ వారు మోహనం గా మోహనం పాడారు.

అది విని తాదాత్మ్యం చెందిన చెట్టి గారు, స్వామీ, ఇంత గొప్ప గా పాడేరు, అయనా ఆ మనీ ముందర పెట్టడం అన్నదానికి ఎందుకు మొండి పట్టేరు? మా మీద మీకు నమ్మకం లేదా ? మీరు పాడేక , డబ్బులివ్వమని సందేహమా మీకు ? ' అని వాపోతే,

మంగళం పల్లి వారన్నారట, 'చెట్టి గారు, మోహన రాగం స,రి,గ ప ద స , స ద ప గ రి స. అంటే, మోహనం లో మ, ని లేదు. అందుకే మనీ ముందర పెట్ట మన్నా. స్వప్త స్వర ఘోష అయ్యింది కదా, మీ పెళ్లి లో, అంటే, చెట్టి గారు మరీ ఖుషీ పడి , డాక్టరు గారిని మరింత గొప్ప గా సత్కరించేరు.!

అదీ కదా సరస్వతీ, మహా లక్ష్మీ కటాక్షం అంటే !

చీర్స్ 
జిలేబి 
ముంబై musings!

(photo పెడతా నను కున్నా, ఆ ఫోటో మా మనవడు మొబైల్ లో పట్టాడు అక్కణ్ణించి ఎట్లా ఈ టపా లో కి ఎక్కించడం నాటు తెలీదు. వీలైనప్పుడు ఈ సందర్భపు ఫోటో పెడతాను- జిలేబి)

Saturday, December 22, 2012

తిరపతయ్య బోడి గుండు కథ (సం 'పూర్ణం')

 
తిరపతయ్య సినీ రంగం లో అడుగు పెట్టేటప్పుడు చేతిలో 'కాలణా ' లేదు అని చెప్పుకోలేడు గాని . ఆ పై అదృష్టం కలసి వచ్చింది. స్వయం కృషి తో పై పై కి ఎదిగాడు. విలన్ గా, హీరో గా , క్యారెక్టర్ ఆక్టర్ గా ఇలా ఇదంటూ లేకుండా అట్లా మాస్ హీరో గాను ఇట్లా క్లాస్స్ హీరో గాను పేరు గాంచాడు.

తన జీవితం మొత్తం ఈ కళామ తల్లికేనా ? తన పేరు సార్థకం అయ్యేదేలా? అన్న సందేహం అతనికి ఓ రోజు కలిగింది. తిరపతయ్య అని తన వాళ్ళు ఊరికే పేరు పెట్టి ఉండరని అతని మనసుకి తట్టింది. ఆలోచించాడు. కొండ పైన దేవర కోసం అందరికి బోడిగుండు కొట్టేందు కు చాలామంది ఉండనే ఉన్నారు. కాని నిజం గా వీళ్ళు 'త్రికరణ శుద్ధిగా అందరికి క్షవరం చేస్తున్నారా ? అబ్బే లేదే అని వాపోయాడు.
 
ఆ రోజు తెల్లారి లేస్తూనే తన తమ్ముణ్ణి పిలచి - 'ఒరేయ్ అబ్బిగా నేను అందరికి బోడి గుండు కొట్టాలని అనుకుంటున్నాను రా ' అన్నాడు. తమ్ముడు గాలి కన్నా వేగం ! అన్న ఆ అంటే తమ్ముడు సై అనే రకం !
 
' అన్నోయ్ - దానికేముంది బ్రహ్మాండం గా మనమే ఒక బోడిగుండు దుకాణం పెట్టేద్దాం ' అన్నాడు. అనడమే కాదు - వెంటనే కార్య రంగం లో కి దిగాడు. త్రికరణ శుద్ధి గా ఎవరెవ్వరు అందరికి బోడి గుండు కొట్టాలని అనుకుంటూ న్నారో వాళ్ళంతా తనని వెంటనే కలవాలని తనకో మెగా ప్లాన్ ఉందని చాటేశాడు.
 
అక్కడ కొండ పై ఉన్న బోడి గుండు సంఘం వాళ్లకి బెరుకు పుట్టిన మాట వాస్తవం . అయినా వాళ్ళు బింకం వదలలే.
'ఆ వీడు పేరుకే తిరపతయ్య - బోడిగుండు కోడతానంటే అందరు వీడి దగ్గరికి ఎందుకు వెళతారు? తర తరాలు గా కొండ దేవరకి 'తల' 'నీలాలు' అర్పించుకున్న అర్భకులు ఇవ్వాళ కొత్త సెలూన్ వస్తే దానికి వెళ్తారా ఎవరైనా? ' అని నిబ్బరం గా ఉన్దామానుకున్నారు.
 
అందులో తల పండినవాళ్ళు కొంత మంది ముందాలోచన చేసి ఎందుకైనా మంచిది - ఈ మధ్య కొండ దేవర పేరు చాల దిగ జారి పోతోంది - కాబట్టి - ఈ తిరపతయ్య ని వలలో వేసుకుని వాణ్ని తమ బోడి గుండు సంఘం లో నే చేరి అందరికి బోడి గుండు కొట్టు కో రా అబ్బిగా - నీకు ముందస్తే ఎలాంటి అనుభవం లేదాయెను - బోడి గుండు కొట్టడం అంత సులువైన పని కాదు - దానికి మెలుకువలు తెలియాలే - కొండ దేవర దీవెనలు ఉండాలే ' అని బుజ్జగించి చూసేరు. !

చత్ - బోడి గుండు కొట్టడానికి అనుభవం దేనికి - నాకున్న పేరు చాలు - తిరపతయ్య బోడిగుండు కొట్ట లేక పోవటం ఏమిటి? ' నా దుకాణం మీ కొండ మీదే కాకుంటే - కొండ కిందే పెడతాను ' అని శపథం చేసి - తమ్ముడు దుకాణానికి నాంది పలుకు ' అన్నాడు తిరపతయ్య.
 
తమ్ముడు నాంది వాచకం పలికాడు. దేశం లో ' బోడిగుండు' తాతయ్య ల ఫోటో లు వెతికి వెతికి పాపులర్ అయిన బోడిగుండు తాతయ్యని సూపెర్ మెగా లెవెల్ లో సెంటర్ లో పెట్టి 'తిరపతయ్య బోడిగుండు దుకాణం కనీ వినీ ఎరుగని తీరులో ప్రారంబించాడు.
 
ఇసుక వేస్తె రాలని జనం 'రంభోత్సవానికి' వస్తే - తస్స దియ్య ఇంత మంది బోడి గుండు కొట్టు కోవడానికి వేచి ఉండడం అతనికి కంట నీళ్ళు తెప్పించింది. 'అనాధ భాష్పాలు ' చూసి జనాలు కూడా ' ఆ హా మాకు బోడిగుండు కొట్టే దానికి కొత్త దుకాణం తయార్ ' అని కంట నీళ్ళు చిందించారు.
 
రెండో భాగం

తిరపతయ్య బోడిగుండు దుకాణం ప్రారంభోత్సవం తరువాయి అతనికి చాల చాలా మెప్పులు మన్నెనలు దీవెనెలు కొండొకచో 'జాగ్రత్తగా ఉండాలి సుమా' అన్న హెచ్చరికలు కూడా వచ్చేయి.

వేటూరి మావైతే - "తిరపతయ్యా ఇలా బృందవానాన్ని వదిలి బెట్టి అలా దండకారణ్యం లో వెళ్లి బోడిగుండు చేస్తానంటా వేమిటయ్యా " అని చింతించాడు కూడా.
 
దానికి తిరపతయ్య నవ్వి - దండకారణ్యం ఐతే ఏమి మావా - దాన్ని బృందావనం గా మార్చేస్తా అన్నాడు.

'అబ్బీ- నేను కలకత్తా పురి - యమహా నగరి అని పాటరాసిన మాట వాస్తవం. కాని వాస్తవాలకి కలలకి చాల వ్యత్యాసం ఉంది ' అని ఊరుకున్నాడు వేటూరి మావయ్య.

కొండ దేవరకి బ్రహ్మోత్సవాల సీసన్ వచ్చింది. ఇక తన బోడిగుండు దుకాణం ఎడతెరపి లేకుండా సాగి పోతుందని తమ్ముడు చెప్పాడు తిరపతయ్య కి.
 
బ్రహ్మోత్సవం అంటే మాటలా మరి? కాణీ కర్చుకాకుండా దేవేరి లక్ష్మమ్మ నగర సందర్శనం అవుతుందా? ఖర్చులకి జంక కుండా తన బోడి గుండు దుకాణానికి ప్రకటనలు ఇచ్చాడు తిరపతయ్య.

ప్రకటనల పేపర్లు చదివి ఆహా ఓహో అన్నారు జనాలు. ప్రకటనలే బోడి గుండు కొట్టినట్టుందని తెగ మెచ్చుకున్నాడు ఓ ప్రవాస భారతవాసి . తానూ బ్రహ్మోత్సవాల లో పాల్గొంటే తప్పకుండా తిరపతయ్య బోడిగుండు దుకాణం లో నే బోడి గొట్టించు కుంటా అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కూడా.
 
బ్రహ్మోత్సవాల సీసన్ భారీ గా జరిగింది . తిరపతయ్య దుకాణం ముందు నించే  చాల మంది తరలి వెళ్ళారు.

'రంభోత్సవం' నాడు కంట తడి పెట్టిన జన సందోహం, సమయం వచ్చేససరికి తిరపతయ్య దుకాణం లో బోడిగుండు కొట్టించు కోవడానికి నామోషి పడ్డారు.

అధునాతనం గా ఉంది సెలూన్. అంతా ఫ్రెష్ బ్లడ్ - స్మార్ట్ గా ఉన్న సేవకులు - రా రమ్మని పిలచే రామ చిలుకలని మరిపించే సంగీత వాయిద్యాల స్వరాలూ వస్తున్నాయి దుకాణం నించి. అయిన ఎందుకో జనాలు నామోషి పడ్డారు తిరపతయ్య దుకాణం లో బోడి గుండు కొట్టిన్చుకునేదానికి.
 
ముగిసన బ్రహ్మోత్సవాల తరువాయి లెక్క చూసుకుంటే తిరపతయ్య తల గిర్రున తిరిగింది. చేసుకున్న ఖర్చు గురించి తను బాధ పడలేదు గాని - తిరపతయ్య అని పేరుండి కూడా తన దుకాణం లో ఈ జనాలు ఎందుకు బోడి గుండు కొట్టించు కో కుండా వెళ్లి ఆ బోడి గుండు సంఘం వాళ్ళనే నమ్మారు ? అన్న సందేహం అతన్ని వదలలేదు.

ఇట్లా బ్రహ్మోత్సవాలు రెండు మూడేళ్ళు సాగాయి. మూడో బ్రహ్మోత్సవానికైతే - బోడి గుండు దుకాణం లో తల వెంట్రుకలు కింద కనిపిస్తే ఒట్టు అన్న స్తితి కి వస్తే - తమ్ముడు 'అన్నయ్యా - సెలూన్ లో హెయిర్ ఒకటైన కనిపించ కుంటే ఎట్లా ? ' అని వాపోతే - మచ్చుకకి తన జుట్టునే ఓ పారి లాగి కింద పడేసి - ఇది బోడి గుండు దుకాణమే సుమా ' అని చూపించు కోవాల్సిన పరిస్థితి కి వచ్చింది తిరపతయ్య గ్రహచారం.
 
ఈ మూడేళ్ళలో తిరపతయ్య బోడి గుండు దుకాణం గురించి చాల బాగానే ప్రాక్టికల్ గురించి కూడా తెలియ జేసుకున్నాడు.
 
ఏదైనా ఫీల్డ్ లో దిగితినే దాని లోటు పాటు లు, లోతుపాతులు, తెలిసి వస్తాయి అన్నది తిరపతయ్య కి తెలియని విషయం కాదు.
 
అందుకే చాలా సీరియస్ గా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టి తను బృందావానాన్ని వదిలే ఆలోచన లేదే లేదని అట్లా అని దండ కారణ్యం లో బోడి గుండు దుకాణాన్ని బంద్ చెయ్య బోవడమూ లేదని ఓ మెగా స్టేట్మెంట్ ఇచ్చాడు. 
 
దాని తో ప్రెస్ వాళ్లకి మసాల సమాచారం దొరికి వాళ్ళ రాతలకి - వాళ్ళ పేపర్ల డిమాండ్ కి కొరత లేకుండా పోవడమూ , దాని తో బాటు తెలుగు బ్లాగర్ల కి రాసుకోవడాని కి కొత్త టాపిక్ దొరకడమూ కూడా జరిగింది.

ఈ మధ్యలో - కొండ దేవరలని కొలిచే బోడి గుండు వాళ్ళ సంఘం - ఎందుకైనా మంచిదని - కొండ దేవరకి కొన్ని ఐడియా లు ఇచ్చారు. తిరపతయ్య బోడి గుండు దుకాణం సరిగా జరగక పోయినా - తను మా సంఘం లో లేదు కాబట్టి ఎప్పటికైనా అపాయమే !
 
అందుకే తిరపతయ్యని కొండ దేవర బోర్డు కి కుర్చీ మనిషి గా అయినా నియమించి అతన్ని కట్టి పడేయాలి లాంటి ఉపాయాలు కూడా పన్నారు. అవన్నీ ఓ కొలిక్కి రాలేక పోయాయి కూడా.
 
మధ్యలో - బోడి గుండు సంఘం వాళ్ళ చీఫ్ ఎవడికో షేవింగ్ చెయ్య బోయి - భస్మాసుర హస్తం స్టైల్ లో తన ప్రాణాన్ని ఆకాశ గంగలో వదిలిపెట్టడమూ, వాడి కొడుకు - తానె బోడి గుండు సంఘానికి వారస నాయకుడి నని చెప్పు కోవడమూ జరగటం - దానికి కొండ దేవర - అభ్యంతరం తెలిపి -
 
నీకన్న పెద్దలైన వయోవ్రుద్ధులైన బోడి గుండు తాతాశ్రీలు - నిజమైన బోడి గుండు తో వెలుగొందుతూ ఉంటే - నువ్వు అర్భుకుడివి - అదీ ఫుల్ క్రాప్ ఉన్న వాడివి - నువ్వెలా బోడి గుండు సంఘానికి చీఫ్ అవుతవోయి - అని తీసి పారేయ్యడమున్ను -
 
ఆ కుర్ర కుంక - తట్ - నే నేమి తక్కువ తిన్న వాణ్ని కాను సుమా అని జన సందోహం లో కలయ దిరిగి బోడిగుండు చీఫ్ గురించి చీఫ్ చేసిన త్యాగాల గురించి చెప్పుకోవడమున్నూ, ఏడుపులూ పెడబొబ్బలూ పెట్టడమున్నూ కూడా జరిగేయి.
 
మూడో భాగం 

బోడి గుండు చీఫ్ బాల్చీ తన్నే క - అప్పటికే మరో నియో బోడి గుండు సంఘం వాళ్ళు కొండ దేవరతో మొరలేట్టారు , ఘీమ్కరించారు - మా బోడి గుండు సంఘం కి కుంపటి వేరేగా పెట్టి తీరాల్సిందే అని.
 
కొండ దేవరకైతే - మరీ చీకాకు పుట్టింది. ఈ బాపతు లో వెళ్తూంటే తన పరపతి కే మోసం వచ్చేట్టు ఉందని అనిపించింది కొండ దేవరకి.
 
పోను పోను అసలు జనాలు బోడి గుండు కొట్టుకోవటానికి తనని కొలవడానికి అసలు కొండ కి వస్తారా అన్న సందేహం కూడా వచ్చేసింది కొండ దేవరకి.
 
ఇట్లా అతలాకుతలం అవుతున్న తరుణం లో తిరపతయ్య తీవ్రం గా అలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇక తాను తన నిజ స్వరూపాన్ని చూపించాల్సిందే అని.
 
కొండ దేవర కూడా తీవ్రం గా అలోచించి తన కొండ పై జరుగుతున్నఈ సమస్యలకి ఓ సమాధానం కాకుంటే సర్దుబాటు చెయ్యాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేడు.
 
అల్కెమిస్ట్ పుస్తకం లో రచయిత పోలో కోఎల్హో ఒక చోట అంటాడు - ఒక మనిషి తాను కోరుకున్నది ఎట్లాగైనా  జరిగి తీరాలి అనుకుంటే - ప్రపంచం మొత్తం ఆతని ఆలోచనలకి సప్పోర్ట్ ఇస్తుందని.
 
ఇదేమి కొత్త విషయం కాదు. యతో కర్మః తతో ఫలః అన్నదాన్ని కొద్ది పాటి మార్పులతో చేర్పులతో సుందరం గా ఇలా కూడా చెప్పవచ్చు. అంతే. !
 
ఇలా తిరపతయ్య , కొండ దేవరల ఆలోచనలు ఓ కొలిక్కి వస్తూనే - ఓ ఓ రోజు భారీ గా ప్రెస్ మీట్ కొండ దేవర సమక్షం లో తిరపతయ్య పెట్టి - జనాలకి షాక్ ఇచ్చాడు. - తన బోడి గుండు దుకాణం కట్టేస్తున్నాని - ఇక మీదట జనాలు కొండ మీది బోడి గుండు సంఘం వారి తో నే బోడి గుండు కొట్టించు కోవాలని -
 
అంతే గాకుండా - తా ను కూడా తన యావద్పరివారంతో బాటు - బోడి గుండు సంఘం లో చేరి పోతున్నాని - తన దగ్గిర ఇక బోడి గుండు కొట్టించు కోవాలని ఆరాటపడే వాళ్ళు - ఇక మీదట తనని బోడి గుండు సంఘం వాళ్ళ ద్వారానే సంప్రదించాలని కూడా వాక్రుచ్చాడు.
 
ఆ ప్రెస్ మీట్ లో ఓ వెధవ రిపోర్టర్ ఎకసక్కం గా అడిగాడు - " తిరపతయ్య - మొదట్లో నీ కేమి సత్తా ఉందని బోడి గుండు దుకాణం పెట్టేవు ? ఇప్పుడు ఏమి క్వాలిఫికషన్ ఉందని బోడి గుండు సంఘం లో చేర్తున్నావు ?"
 
తిరపతయ్య - అప్పటిదాకా - సిని ప్రపంచంలో గాని - పబ్లిక్ ప్రదర్శనలలో గాని చూపించని నిజాన్ని సవినయం గా చూపాడు- తన తలపైనున్న విగ్గు ని ఊడ బెరికి - నునుపైన , సొంపైన , నిగ నిగ మెరిసే తన బోడి గుండు ని టీవీ వాళ్లకి , ప్రెస్ వాళ్లకి సవిస్తారం గా చూపి - ఇంతకన్నా ఏమి క్వాలిఫికేషన్ కావాలి నాకు బోడి గుండు దుకాణం పెట్టడానికి, కాకుంటే - బోడి గుండు సంఘం లో చేరడానికి అని ఎదురు ప్రశ్న వేసాడు తిరపతయ్య.
 
శ్రీమధ్రమానంద హరీ ! హరిలో రంగ హరి ! ఈ తిరపతయ్య బోడి గుండు కథ పరిసమాప్తం ఇంతటి తో !
 
ఈ కథ చదివిన వారికి , విన్న వారికి , బ్లాగ్ లోకం లో కామెంటిన వారికి  - అందరికి ఆ కొండ దేవర మా తిరుమలేసు ఆశీర్వాదాలు సకల వేళల ఉండాలని - మా తిరపతయ్య లా నిజాయితీ గా వాళ్ళంతా వర్ధిల్లా లని కొండ దేవర ని కోరుకుంటూ !!
 
(సమాప్తం)
 
చీర్స్
జిలేబి.
(పునః టపాకీకరణం)

Friday, December 21, 2012

మోడీ మస్తాన్ !


 
మోడీ మస్త్ 'ఆన్'!
 
మోడీ మస్తాన్ !
 
Modi Must On!
 
Jayaho Bhaarath!
 
cheers
zilebi.

Thursday, December 20, 2012

మీటింగ్ మిస్టర్ సుబ్బూ ఇన్ ముంబై (సుబ్బూస్ wisdom !)

మీటింగ్ మిస్టర్ సుబ్బూ ఇన్ ముంబై (సుబ్బూస్ wisdom !)

హలో మిస్టర్ సుబ్బూ, హాశ్చర్యం మీరెక్కడ ఇట్లా ముంబై లో దర్శనం ? ముంబై లో సుబ్బూ ని చూసి ఆశ్చర్య పోయా

'ఆ ప్రశ్నే నేనూ మిమ్మల్ని అడుగుదా మానుకున్నా, జిలేబమ్మా ! మీరెక్కడా ఇట్లా ముంబై లో ? తిరుగు ప్రశ్నా బాణం సంధించాడు సుబ్బు.

'అబ్బా, ప్రశ్న కి ప్రశ్న సమాధానం కాదోయ్ '  అన్నా.

'సర్లెండి, అట్లా గుజరాత్ వెళ్లి మోడి , మస్త్ ఆన్ గా ఉన్నాడో లేదో చూసి ఇట్లా తిరుగు ముఖం పట్టా, ' ఈ  మారు నేరుగా సమాధానం చెప్పాడు సుబ్బు.

అవునా, మరి గుజ్జూ భాయీ లె లా ఉన్నారోయ్? మోడీ ని మస్త్ ఆన్ లో పెట్టేరా ? Is he must on again? ' అడిగా.

మోడీ గురించి చాలా విని వున్నా, చదివి ఉన్నా గాని, నేరుగా ఇట్లా సుబ్బూ వెళ్లి చూసొస్తే ఆతని తో మాట్లాడిన జ్ఞానం పెంపొందించు కోవడం మరీ గొప్పే గా.

'జిలేబమ్మా , మోడీ మరో మారు  రాజ్యానికే అంకితం అయి పోయాడు, ప్చ్, పెదవి విరిచాడు సుబ్బూ.

అదేమిటి సుబ్బూ, మోడీ గుజరాత్ ఒకరికి ఒకరు సరి జోడు కాదా మరి ? అడిగా.

'అవుననుకోండీ , అయినా, తన మీద దేశానికి ఎన్నో ఆశలు ఉన్నాయి. తాను ప్రధాని అవుతాడని ' చెప్పాడు.

'అవుననుకో, దానికీ దీనికీ లంకె ఏమిటో ? గుజరాత్ తరువాయి దేశానికి కూడా అవ్వొచ్చు గా? ' చెప్పా.

జిలెబమ్మోయ్ , ప్రస్తుతం మోడీ 'ఫార్మ్ ' ఉన్నాడా ?

అవును కదా మరి ?

ఇట్లా, 'ఫార్మ్ ' ఉన్నప్పుడే కదా ట్వెంటీ ట్వెంటీ ఆడగలడు ఎవడైనా?

'అవుననుకో, అయితే?' అడిగా.

ప్చ్, మళ్ళీ ముఖ్య మంత్రి అయ్యాక రాజ్య భారాలు ఎక్కువవు తాయి కదా తనకి ?

అవుననుకో... ఈ మారు సంశయం గా అన్నా.

అటువంటప్పుడు తను రాజ్యం లో నే కదా తన శక్తి యుక్తులని కేంద్రీ కరిస్తాడు ?

తలూపా.

'ప్చ్, దేశానికి మరో ప్రధాని ని వెతుక్కోవలసిందే మరి' సుబ్బూ ఖరారు చేసేడు.

'సుబ్బూ... మన తిరపతయ్య ఉన్నాడు గా... ' చెప్పా.

జిలేబమ్మోయ్ , మీరు ఇట్లా బ్లేడు జోకులు కూడా వేస్తారా అన్నాడు మిస్టర్ సుబ్బు సీరియస్ గా.

'బ్లేడు '
జిలేబి
ముంబై musings!

Wednesday, December 19, 2012

ఆవుకి మేత పెట్టండి, పుణ్యం మూట కట్టు కోండి (అనబడు నగదు బదిలీ కథ)!

ఆవుకి మేత పెట్టండి, పుణ్యం మూట కట్టు కోండి (అనబడు నగదు బదిలీ కథ)
 

మా అమ్మే, మా తల్లే, ఏమి బుర్ర రా బాబు ముంబై కర్ లకి అనుకోకుండా ఉండ లేక పోయా!

అయ్యరు గారు, నేనూ కలిసి మాటుంగా వెళితే, అక్కడో పెద్దావిడ , ముఖాన ఐదు రూపాయల బిళ్ళంత (పూర్వ కాలం లో 'రూపాయ బిళ్ళంత ' కుంకుం బొట్టు అనేవారు, ఇప్పుడు, ఇన్ ఫ్లేషన్ ఎక్కువై పోయింది కదండీ అందుకని అన్న మాట , ఐదు రూపాయలంత బొట్టు అనడం) కుంకుం బొట్టు పెట్టి, ముందర ఆవుకి కావలసినంత మేత, దాణా పెట్టు కుని ఉంది. ఆవిడ ఎదుట ఓ మాంచి  బొద్దైన ఆవు మేత మేస్తోంది.

మా అయ్యరు వేష కట్టు చూసి 'సామీ, మాడు కు సాప్పాడు పోడు , పుణ్యం వరుం' అంది వచ్చీ రాని అరవం లో.

ఇద్దరికీ అర్థం కాలే. చూస్తే ఆవిడ ఆవు లా ఉంది అక్కడ ఉన్న ఆవు. ఆవిడ మేత  పెట్టు కోవాలి గాని మేము పెట్టడం ఏమిటి అని హాశ్చర్య పోయా.

'అంబ దు  రూబా, ఒరు కట్టు, మస్తు పుణ్యం , ఐనూరు రూబా క్కూడ  పన్న ళాం , आप को माता जी पूर्ण आशीर्वाद देंगे '

ఔరా, ఈవిడ తెలివే తెలివి!. ఆవు తనది, దాణా తాను పెడితె అది ఆవిడ కర్తవ్యం. మనం పెడితే పుణ్యం ! కర్తవ్యానికీ పుణ్యానికీ  మధ్య వ్యత్యాసం సో, నగదు బదిలీ అన్న మాట అనుకున్నా.

సో, కొంత డబ్బు పెట్టి ఆవుకి మేత పెట్టి కూసింత మూట పుణ్యం కట్టు కున్నాం.

'మాతాజీ ఉంగలుక్కు భలా కరే ' అంది ఆవిడ.

నగదు బదిలీ కి ఇంత మహత్వం ఉన్నదన్న మాట !

మరి , దేశ మాతాజీ, నగదు బదిలీ కార్యక్రమం లో ఎంత పుణ్యం వస్తుందో మరి ! అబ్బా, ఊరికే అన్నారా, మేరా భారత్ మహాన్ అని, భారత దేశం కర్మ భూమి అని !

పుణ్యం సంపాదించు కోవడం మరింకా ఏ  దేశం లోనూ కుదరదు సుమీ భారత దేశం లో కుదిరి నంతగా !


చీర్స్ 
జిలేబి 
ముంబై musings!

Tuesday, December 18, 2012

పారి పోయిన పరువం

 
పారి పోయిన పరువం - ఇది ఒక సామాజిక స్పృహ కలిగిన కవిత


ముందో వెనుకో కాదు, నన్ను నడిమధ్య కాల్చి 
భారమైన ఇసుక పాతర వేసి నాకు నువ్వు చేసిన ద్రోహం 

నా కనుల కన్నీళ్ళ లో ఈదులాడే భావాలని 
మది తెలిపే వ్యధ గా నీకు వినిపిస్తున్నా దుష్మన్,  నీ కోరిక పై 

వణికే పెదవులు చలికి కొరికే సు కుంటూ 
చెప్పనా వద్దా అన్న సంశయం లో నేను 

చిట్లిన పెదవుల పై కారప్పొడి అద్దాలని నువ్వు 
నడుమ నగ్న చలి దూరి కట్టని కరిచేస్తూం టే 

 నువ్వే నా దుష్మన్ అయినా వన్న ఎద రొదలు 
చెప్పకనే చెప్పిన పోలీసు జులూం లై చెవిని కోయగా 

అది ఎరిగిన నువ్వు హత్యావేశం తో  పెను మంటై రగిలి 
ఎల్ల లెరుగని కోపానికి హద్దులు ఏమీ లేవంటే 

ఒక వైపు నిరాకరించే మనసుకు 'కాముణిజాం ' వచ్చి 

సుదూర మృత్యు తీరాలకు నే పారి పోవాలంటే 
ఆలోచిం చంటూ  తీరని వ్యధలు వెనక్కు లాగ

తెర వెనుక నగ్న బోమికనై నేను బోరు మంటూంటే 

నా నిస్సహాయతను నువ్వు నడి రోడ్డున నిర్వీర్యం గావిస్తే 
సంఘం బట్ట బయలైన పరువం గా గుసగుసలాడగా

బంధించే ఈ భాధ్యతలేలని తెంచుకుని పారి పోనా 
తెగించి  కాదని కట్టుబాట్లచెరసాలలో పుప్పోడై పోనా ?

ఛ ,రాస,
ఛీ లే, బి.

Monday, December 17, 2012

పనిలేక ... కాలక్షేపం కబుర్లు ... డోంట్ 'బీలేజీ' !


పనిలేక ... కాలక్షేపం కబుర్లు ... డోంట్ 'బీలేజీ'
 

సుబ్బు హటాత్తు గా కాలక్షేపం కబుర్లు శర్మ గారిని రోడ్డు పై చూసి అచ్చెరు వొందేడు.!

పంతులు గారూ, మీరు ఇట్లా రోడ్డున పడ్డా రేమిటీ  ?

పంతులు గారు టోపీ పెట్టి భుజానికో బ్యాకు ప్యాకు జమాయించి, మంచి సోగ్గుడ్డ , ఉత్తరీయం పంచకక్షం కట్టి కాళ్ళకి ఆడిదాస్ షూస్  తో దర్శనం ఇవ్వడం తో ఈ మాడరన్ మానీషుని గమనించి 'दांतों तले उंगली दबाया'!

'ಅದು ಏನಂತ ರೆ, ನನಗೆ, ಒಂದು ಹೊಸವಾಗಿ ಉದ್ಯೋಗ ಸಿಕ್ಕಿದ್ದು'  చెప్పారు శర్మ గారు.

వామ్మో అదేమిటండీ మధ్యలో కన్నడం లో కి మారి పోయేరు ?

అదేమిటోయ్ సుబ్బూ, మన పక్క దేశమే కదా 'కర, నాటకం' ?

అంటే ?

చేతులు ఖాళీ గా ఉంచడ  మెందు  కానీ, ఓ కొత్త ఉద్యోగం లో చేరి పోయానోయ్, అదే, ఈ 'కర' నాటకం' !

శర్మ గారూ, ఈ వయసులో మీకిది తగునా ?

అదేమిటోయ్, ఆ జిలేబీ గారు ఈ వయసులో 'సబ్బాటికల్  నించి మారి మళ్ళీ ఉద్యోగం లో కి వెళ్ళ  గా  లేనిది, మరి మేము వెళ్ళ  కూడ దంటావా  ?

సుబ్బూ కి అసలు ఈ ఫండా అర్థం కాలేదు

సుడిగాలిలా మాయమై మళ్ళీ సుడిగాలిలా పనిలేక కాస్త తీరిగ్గా కూర్చుని ఉన్న డాటేరు  రమణ గారి ముందు ప్రత్యక్ష మయ్యెడు.

రమణ మావా కాఫీ , తల తిరిగి పోతోంది.

ఇదిగో, సుబ్బూ, తల తిరిగి పోయేంత పని నీ కేముందోయ్ ?

మావా,  ఈ మధ్య రీటైర్ అయిన వాళ్ళంతా బ్లాగ్ లోకాని కి వచ్చి టైం  పాస్, టీం  పాస్ చేసు కుంటున్నా రా ?

కాదా మరి  ఎంత మంది అట్లా లేరు ? అబ్బా , నా కు రీటై ర్ మెంటు దొరికి తేనా , నేను హాయిగా దుప్పటి లాగించి నిదుర పోయే వాణ్ణి

ఈ రీటైర్ మెంటు వాళ్ళంతా ఒక్కరొక్కరుగా మళ్ళీ ఉద్యోగం లోకి వెళ్లి పోతున్నారు మావా !

ఆ మధ్య జిలేబీ అట్లా చెప్పింది . మళ్ళీ ఇప్పుడేవరోయ్  ?

అదే, మన పంతులు గారు లేదూ... కాలక్షేపం వారు వారు కూడా రోడ్డు న పడ్డారు ! మావా ఇదేమి చోద్యం ? హాయిగా రీటైర్  మెంటు వయసులో 'రెస్టు' తీసు కో కుండా ఇట్లా వీళ్ళంతా మళ్ళీ ఉద్యోగం లో కి వెళ్ళటం ?

అదే బెటరోయ్ , డాక్టరు ఉవాచ !

ఎందుకో మరి ?

పని లేక ఉంటే బుర్రలు ఖాళీ అయితే, దాని పీత బాధ లు ఎక్కువోయ్ !

అబ్బా, మావోయ్, పనిలేక పొతే, బుర్రలు ఖాళీ అయి ఉంటే, అన్ని విధాల ప్రాబ్లెమ్స్ ఒస్తాయంటావా  ?

కాదా మరి ?  An idle man's brain is a devil's workshop!'

సింగపూరు మాజీ ప్రధాని, లీ క్వాన్ యూ ఏమన్నాడో తెలుసా ?

చచ్చేంత దాకా అసలు పని చెయ్యడం మాన కండి . ఎంతో కొంత పని చెయ్యండి, మీరు వయసులో ఉన్నప్పుడు చేసినంత గా కష్ట పడ  నక్కర లేదు. కానీ 'పార్ట్ టైం ' పని చెయ్యండి, చలాకీ గా ఉండండి' అన్నా డోయ్ ! అంతే గాక, మీరు చేసే పని వల్ల  మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుం దని  ఆయన ఉవాచ !

సో, కష్టే ఫలే ! డోంట్  బీలేజీ ! 'పని లేక' ఉండ కోయ్  సుబ్బూ.



చీర్స్
జిలేబి 

Friday, December 14, 2012

ఔను వాళ్ళిద్దరూ 'వాడి' పోలేదు ! (ఔను వాళ్ళిద్దరూ విడి పోయారు - భాగం రెండు )


"అయ్యరు  వాళ్  నాకు విడాకులు కావాలి" మా అయ్యరు  గారి చెవిలో పోరు పెట్టు కుని చెప్పా. చెప్పా అనడం కన్నా ఆర్డర్ వేసా అని అనడం సబబు.

'దానికేమోయ్ , విడి ఆకులే కదా మన పత్తి  శెట్టి గారి కొట్టు కెళ్ళి  పట్టు కొస్తా , ఈ మధ్య విడాకులు రావటం లేదట , మార్కెట్ లో, కుట్టిన విస్తరాకుల నించి పుల్లల్ని తీసి విడాకులు ఇవ్వమం టా '  అన్నారు మా అయ్యరు  గారు

నాకు భలే కోపమొచ్చింది.

'ఆయ్ , విడాకులు అంటే వేళా  కోళ మై పోయిందా మీకు ' ఇంతెత్తు కు ఎగిరా .

వారి ముందు లాపు టాపు  పెట్టి, బులుసు వారి టపా చూపించా.

'అసలే నాకు కళ్ళు కనబడి చావడం లేదే ఇట్లా తెలుగు బ్లాగులు చదవటమంటే ఎట్లాగే ? అని మసక బడ్డ కళ్ళా ద్దల లోంచి చూసేరు.

చ, చ, ఈ సోడా బుడ్డి నా నే ప్రేమించింది అని నన్ను నేనే తిట్టు కున్నా.

'ఏమోయ్, జిలేబీ, ఏమన్నా నన్నన్నావా ఇప్పుడు ' ఓ చెవి నా వైపు పెట్టి కొంత ప్రశ్నా మార్కు పెట్టేరు అయ్యరు .

చ, చ, ఈ మానవుడికి చెవులు కూడా వినిపించడం లేదు మరీ పోను పోను.

'మళ్ళీ, చెవిలో గట్టిగా చెప్పా, 'నాకు విడాకులు కావాలి '

ఈ మారు కొంప మునిగేటట్టు ఉందని ఓపిగ్గా, టపా చదివేరు అయ్యరు .

'ప్రభావతీ ప్రద్యుమ్నుల్లా మనమూ విడి పోదామం టా వేమిటే  ? ' అడిగేరు .

హమ్మయ్య ఇప్పటికి ఈ మట్టి బుర్ర లో ట్యూబు లైటు వెలిగింది అని సంతోష పడి  పోయి, 'అవునని' తలూపా.

'అదేమిటే నువ్వట్లా, వెళ్లి పొతే నీకు వంటా వార్పూ చేసి పెట్టేదెవరే  మరి ? '

'అబ్బా, ఈయనికి హోటలు బిజినెస్సు, వంటా వార్పూ వచ్చని ఇన్నేళ్ళు గా వంట చెయ్యడం నేర్చుకోక పోవడం, ఎంత తప్పై  పోయింది సుమీ ' అని బిక్కు మని, కొంత, సేద తీరుకుని,' ఆ, ఏముందీ, ఆ ఓల్డ్ ఏజ్ హొమ్ లో వాళ్ళే, గంట కొట్టి భోజనం పెడతారులే ' అన్నా.

అన్నా గాని, మా అయ్యరు  గారిలా వంట చేస్తారేమో వారు తెలీలే. ఎంతైనా, ప్రభావతీ ఉంటుంది కదా కాస్త మాట తోడూ ఉంటుంది  అనుకుని, కొంత ఊరట పడ్డా.

'సర్లేవే, నువ్వడి గినది నేన్నెడైనా  కాదన్నా నా. అట్లాగే విడి పోయి ఉంటాం లే. ' అంటా  రని  కొంత ఆశ తో ఎదురు చూసా.

చెళ్ళు  మని, చెంపకాయ దెబ్బ పడింది.

'మీ ఆండోల్లకి చదువు నేర్పించట మంత  బుద్ధి తక్కువ పని వేరే ఏమీ లేదు ' సూటిగా చూసేరు అయ్యరు  గారు.

అవాక్కై పోయా.

ఈ మాట అయ్యరు  గారేనా, అదీ, జిలేబీ తోనే నా అన్నది ? హమ్మో, కొంత దడ  పుట్టింది.

జీవన వసంతం లో , తను చెప్పింది ఎప్పుడూ జవదాటని, రామచంద్రుడు, ఇవ్వాళ, సీతమ్మ తల్లికి ఎదురు చెబ్తాడా అని కుడి కన్ను అదిరింది

'ఇదిగో, చూడవోయ్ జిలేబీ, ఏదో బ్లాగులు, టపాలు రాసుకుంటూ టీం పాస్ టైం  పాస్ చేసుకుంటూ, ఏదో 'ఉద్యోగం 'ఇస్త్రీ' లక్షణం' అని చెబ్తే, పోనీ లే ఊరుకున్నా. ఇట్లా విడాకులూ, పెడాకులూ  అన్నా వంటే, నీ ఒళ్ళు పెట్రేగి పోతుంది' ఈ మారు కొంత సీరియస్ గా చెప్పేరు

అబ్బా, ఈ పురుషాహంకారం వీళ్ళకి తగ్గనే  తగ్గదు సుమీ ' అని ఉస్సూరు మన్నా.

అంతే  నంటారా ? విడాకులు ఇవ్వరా మరి ?

'జిలేబీ, నీకు విశ్రాంతే  కావా లను కుంటే, ఇంట్లో కూర్చుని వంటా వార్పూ చేసుకో. ఉద్యోగం మానేయ్ '

హమ్మో, వంటా వార్పే, వద్దే వద్దు సుమీ ! , ఈ ఉద్యోగమేదో చేసుకుని అయ్యరు  గారి మీద ఆజమాయిషీ చేసుకుంటూ ఉండటమే బెటరు ! ఏదో ఒక్క ముక్క 'విడాకు' కోసం ఇట్లాంటి సౌలభ్య మైన 'భరించు వాడు' భర్త
ని పోగుట్టు కోవ డమా ! వద్దే వద్దనుకుని'

అయ్యరు  వాళ్ , ఇవ్వాల్టి 'సమయల్ ' ఏమిటి ? మళ్ళీ ఆర్డర్ వేసా.

నీకిష్టమైనా జిలేబీ చేశా నోయ్ ~

అబ్బా, ఈ పెనిమిటి ప్రెభువులు  మన మూడ్ ని బట్టి తాజా మరీ చేస్తారు సుమీ అనుకుని, నోరు వెళ్ళ  బెట్టేసా.


చీర్స్
జిలేబి.