మీ పేరు ?
భారతి
వయస్సు ?
అరవై ఏడు
వృత్తి
సంతానోత్పత్తి
కులం ?
పోయే కాలం లో ఏ కులమైతే నేమిటి ?
తట్ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అధిక ప్రసంగం కూడదు
సర్
ఆధార్ కార్డు ఉందా ?
పిచ్చి ప్రశ్న ! దానికోసమే కదా వచ్చి ఉంట !
వోటర్ కార్డు ?
లేదు
అట్లీస్ట్ రేషన్ కార్డు ?
లేదు
మరి బర్త్ సర్టిఫికేట్ ?
నే పుట్టినప్పుడు జనాలు జయహి జయహి అన్నారు సర్టిఫికేట్ అప్పట్లో లేదు
పాస్ పోర్ట్ ?
లేదు
ఎప్పుడు పుట్టావ్ ?
ఆగస్ట్ పదిహేను 1947
మరి ఇన్నేళ్ళ కి ఆధార్ కార్డ్ తీసుకుని ఏం జేస్తావ్ ?
అంటే ?
ఇన్నేళ్ళు ఏం చేసావని మరి ?
తెలీదు
ట ట్ టట్ ! you are dismissed ! Next please
జిలేబి