అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? - భాగం ఏడు
అమృత నాద ఉపనిషత్ - కృష్ణ యజుర్వేదం నించి
అష్టాంగ యోగ గురించి విపులం గా విని ఉంటాము .
ఈ అమృత నాద ఉపనిషత్ షట్ అంగ (ఆరు అంగములు ) యోగం గురించి చెబ్తుంది
యోగం యొక్క ఆరు అంగములు - (వీటిలో ఐదు పతంజలి అష్టాంగ యోగ పధ్ధతి లో భాగమైనవి)
ప్రాణాయామ ,ప్రత్యాహార, ధారణ, ధ్యాన , తర్క , సమాధి
ప్రత్యాహారః తథా ధ్యానం ప్రాణాయామః తథ ధారణ !
తర్కశ్చైవ సమాధిశ్చ షడంగో యోగ ఉచ్యతే !!
యోగ అభ్యాసి ఓంకార రథం ఆరోహించి విష్ణువే సారథి గా బ్రహ్మ లోక పదాన్వేషి అయి ఉండాలి. గమ్యం చేరాక ఇక ఆ రథం కూడా విడిచి పెట్ట గలిగి ఉండాలి
ఇంద్రియ కృత్య దోషా లను నివారించు కోడానికి ప్రాణాయామ ఉపయోగ పడుతుంది అంటుంది ఈ ఉపనిషత్
యథా పర్వత ధాతూనాం దహ్యంతే ధమనాన్మలాః
తథ ఇంద్రియ కృతా దోషా దహ్యంతే ప్రాణ నిగ్రహాత్ !!
ప్రశాంత త లక్షణం గురించి చెబ్తూ - అంధ వత్ పశ్య రూపాణి అంటుంది ఈ ఉపనిషత్
అంధ వత్ పశ్య రూపాణి శబ్దం బధిరవత్ శృణు
కాష్టవత్ పశ్య తే దేహం ప్రశాంతస్యేతి లక్షణా !!
అట్లాగే సమాధి గురించి చెబ్తూ - ఆగమస్య అవిరోధేన (దేనికి విరోధం కానిదైన ?)
సమ అధి అవడం అంటుంది .
ఇట్లా 'థియరీ' మాత్రమె కాకుండా ప్రాక్టికల్ గా ఎట్లా చేయాలో కూడా ఈ ఉపనిషత్ చెప్పడం ఇందులో విశేషం గా కనిపిస్తుంది .
ఇక అభ్యాసం ఎట్లా చేయాలి అని చెబ్తూ - పద్మకం స్వస్తికం భద్రాసన వీటిల్లో ఏదేని ఒక ఆసనాన్ని స్వీకరించి యోగ అభ్యాసం చేయమని చెబ్తుంది .
నిబద్ధత తో అభ్యాసం గావిస్తే మూడు నెలల్లో జ్ఞానం స్వయం గా వస్తుందని ఉద్ఘాటి స్తుంది
నాలుగో నెల లో పశ్యతే దేవాన్ ఐదో నెలలో తుల్యవిక్రమః అవుతాడు కూడాను .
ఆరవ నెలలో ఇచ్చా కైవల్యం ఖచ్చితం .
స్వయం ఉత్పధ్యతే జ్ఞానం త్రిభిర్మాసై న సంశయః
చతుర్భిహి పశ్యతే దేవాన్ పంచభిహ్ తుల్య విక్రమః
ఇచ్చయాప్నోతి కైవల్యం షష్టే మాసి న సంశయః
విశేషం గా ఇందులో ప్రాణమునకు ప్రాణమైన ప్రాణం యొక్క ఒక కొలమాన పరిచయం 'త్రింశత్ పర్వాంగుళః ప్రాణః ' అని వస్తుంది .
ఒక అంగుళం లో ముప్పై వ వంతు (త్రింశత్ పర్వాంగుళః) ప్రాణస్య ప్రాణం కొలమానం?
త్రింశత్ పర్వాంగుళః ప్రాణో యత్ర ప్రాణః ప్రతిష్టితః
ఏష ప్రాణ ఇతి ఖ్యాతో బాహ్య ప్రాణస్య గోచరః
అశీతిశ్చ శతం చైవ సహస్రాణి త్రయోదశ
లక్షశ్చైకోన(లక్షశ్చ ఏకోన ?) నిశ్వాస అహోరాత్ర ప్రమాణ తః
శతం చైవ సహస్రాణి త్రయోదశ లక్షశ్చ ఏకో = నిశ్వాసాలు = 1,13,100 . ఈ లెక్ఖ కి ఆధారం ఏమిటి ?
ప్రాణ , అపాన వాటి రంగుల గురించి ఈ ఉపనిషత్ చెబుతుంది =
ప్రాణ = రక్తవర్ణ మణి ప్రకీర్తితః !
అపాన - ఇంద్ర గోప సమ ప్రభ ! - ఇంద్ర గోప = ఆరుద్ర పురుగు - పట్టు పురుగు !
(అపాన ప్రాణ మధ్యమం లో ఉంటుంది ?)
సమాన - ప్రాణ అపాన మధ్య లో - గోక్షీర ధవళ ప్రభ లా = తెలుపు రంగులో ?
ఉదాన - ఆపాండుర - (పాండు వర్ణం? - Slightly pale in color?)
వ్యాన = అర్చి సమ ప్రభః
(According to Sivanandaonline.org its Archil? -
Vyana resembles the colour of archil - that of ray of light).
Quote from Sivanandaonline.org
THE COLOUR OF PRANAS
Prana is said to be of the colour of blood, red gem or coral.
Apana, which is in the middle, is of the colour of Indragopa
(an insect of white or red colour).
Samana is of the colour between that of
pure milk or crystal or of oily and shining colour,
i.e., of something between both Prana and Apana.
Udana is of Apandura (pale white) colour and that of
Vyana resembles the colour of archil (or that of ray of light).
కొంత పదాల పొందు లతో - అబిజాయత , అభిజాయత అన్న పద జాలపు విరుపు తో ఈ ఉపనిషత్ ముగుస్తుంది !
యస్య ఇదం మండలం భిత్వా మారుతో యాతి మూర్ధని |
యత్ర తత్ర మ్రియెద్వాపి న స భూయొ అబిజాయతె |
న స భూయొ అభిజాయత |
English Translation - Link
http://www.yogavision.in/articles/a166795f-62b2-4f94-bc7d-507c8efc3993.aspx
Full Sanskrit PDF - Link
http://sanskritdocuments.org/all_pdf/amritanada.pdf
శుభోదయం
జిలేబి