Friday, April 1, 2016

స్త్రీ స్థాయి తత్వాలు :)


స్త్రీ స్థాయి తత్వాలు :)
 
మగవాణ్ణి నమ్మబోకు వనితా
అగచాట్లను పొందబోకు వనితా
 
బిరుసు గలిగి యుండవే వనితా
అలసి సొలసి నతనేవచ్చు వనితా
 
బూచిజేయు నాతడు వనితా
నమ్మినావ నరకమేను వనితా
 
సన్నాసి కి సుద్దులేల వనితా
సంసారి కి ముద్దులిమ్మ వనితా
 
నమ్మితీవు మగడని వనితా
పదారు వేలవాడే వనితా
 
సూరీడని వెంటబోకు వనితా
సుర్రుసుర్రు నినుగాల్చు వనితా
 
ముద్దు జేసి మోహమను వనితా
వద్దు వాడి భ్రమల బడకు వనితా
 
వగచి వచ్చు వీరువోలె వనితా
వగలు పోవు వాడిపోవ వనితా
 
రంగు జూచి మోసపోకు వనితా
రకతమాంసము తినునతడు వనితా !
 
ఒంపు నీదను యింటజొచ్చు వనితా
చంపు ఆపైన నిను గూడను వనితా
 
మెరమెచ్చున బడితీవా వనితా
మరమత్తు జేయునిన్ను వనితా
 
కొంగు బట్టవచ్చుగాన వనితా
కొండముచ్చు నాతడే వనితా
 
పసిడి మేను పట్టిజూడ వనితా
పరమ చేటును జేయును వనితా
 
సిగ్గు వీడి సరసమేల వనితా
ఒగ్గు వగల జిక్కబోకు వనితా
 
మగాడంటే నరకమేను వనితా
గాదిలోన సుఖము లేదు వనితా
 
ఓరజూపు మీటునిన్ను వనితా
కోడెత్రాచు నాతడే వనితా
 
మగవాడి మాటలెపుడు వనితా
అబద్దాల మూటలేను వనితా
 
మగవాణ్ణి దరిజేర్చకు వనితా
మైలు దూరానబెట్టు వనితా
 
జిలేబి మాటలన్నీ వనితా
జిగేలు మనుమూటలే వనితా !


చీర్స్
జిలేబి
(పరార్!)

Thursday, March 31, 2016

శోధిని ! సరిక్రొత్త తెలుగు అగ్రిగేటర్ - బ్లాగిల్లు వారి నించి !

శోధిని !
 
సరిక్రొత్త తెలుగు అగ్రిగేటర్ - బ్లాగిల్లు వారి నించి !
 
బ్లాగిల్లు శ్రీనివాస్ గారి
 
శోధిని అగ్రిగేటర్ 
(Its more than an aggregator!)
 
link
 
శోధిని వచ్చెను తెచ్చెను
మీదగు మీ శ్రీనివాసు  మీరును జూడన్ !
మోదము!  తెలుగుకు చేవగ
కాదగు సంకలిని వచ్చె గదవే జూడన్ !
 
త్రీ చీర్స్
జిలేబి

Tuesday, March 29, 2016

బ్లాగిల్లు శ్రీనివాస్ గారి కి - అవిడియాలు !

బ్లాగిల్లు శ్రీనివాస్ గారి కి - అవిడియాలు !


ఈ మధ్య జిలేబి వదన అగ్రిగేటర్ అంటూ జిలేబి తూచ్ అని ఓ స్టాప్ గేప్ బ్లాగ్ లిస్టింగ్ పెట్టింది ఆఖరి గరిక మా మాలిక గూడా మొరాయించటం తో !

బ్లాగిల్లు శ్రీనివాస్ గారు కామింట్ లాడుతూ శుభ సూచకం ఇచ్చారు ! - రాబోయే ఉగాది పండగ నాటికి వారి చలువ తెలుగు బ్లాగు లోకానికి మరో సరి క్రొత్త అగ్రిగేటర్ వస్తుందని !

హమ్మయ్య అనుకున్నా !

సో ఈ రాబోయే అగ్రిగేటర్ కోసం ఎదురు జూస్తో

ఈ అగ్రిగేటర్ కి సలహాలు ఏమన్నా ఇచ్చే దైతే ఇక్కడ ఇవ్వగలరు !
జిలేబి సలహాలు

చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తో శ్రీనివాస్ గారిని పరేషాన్ జేయ దలచు కోను !
లేటెస్ట్ స్క్రోల్లింగ్ పోస్ట్స్ + కామెంట్స్ (ఇది ముఖ్యం జిలేబి కి మరీను :) లిస్టు జేస్తే అదే ఇప్పటి పరిస్థుతుల్లో గొప్ప సహాయం తెలుగు బ్లాగు లోకానికి !

డబ్బులిచ్చి లిస్టింగ్ జేసుకోవాలా ? ఊహూ ! వలదు వలదు !

అగ్రిగేటర్ గూగుల్ ప్రకటనల మాధ్యమం ద్వారా గాని మరి ఏవిధమైన మాధ్యమం ద్వారా గాని డబ్బులు గిట్టు బాటు అయితే చేసు కోవచ్చా ? తప్పక చేసుకోవచ్చు అనుకుంటా నా వరకైతే నవ్య వార పత్రిక స్టైల్ అదే ! ఆ టెంప్లెట్ బ్లాగ్ అగ్రిగేటర్ ఫాలో అయితే సైడ్ బార్స్ ప్రకటనల కి ఉపయోగ పడొచ్చు ! దస్కం అగ్రిగేటర్ కి వస్తే మహద్భాగ్యం !

రండి సరి కొత్త తెలుగు బ్లాగు రాబోయే బ్లాగు కి స్వాగతం పలుకుదాం !

మీ సలహాలు అవసరం ! కామింటు రూపేణా గాని వారి ఈ మెయిల్ కి గాని తెలియ జేస్తారని ఆశిస్తో !

కోట్ :

జిలేబీ గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు. తెలుగు బ్లాగర్లకు ఓ వేదిక లేకపోవడం నాకూ బాధగానే ఉంది . బ్లాగిల్లు మూతపడిన తరువాత కూడలి , ప్రస్తుతం మాలిక ... ఇక తెలుగు బ్లాగర్లకు ఏమీ మిగల్లేదు అనే అనుకోవాలి.
మీ అభిమానం కొనసాగితే త్వరలోనే మరో ఆగ్రిగేటర్ రావచ్చు . ఉగాదికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను.
ఎలా ఉండాలి అనే దానిపై మీ సలహాలు నాకు మెయిల్ చేయండి. srinivasrjy (ఎట్) gmail dot com

శ్రీనివాస్  క
అన్కోట్

చీర్స్
జిలేబి

Monday, March 28, 2016

It is It !

It is It
 
The sort of it is It
The it of it is It
The all of it is It
---Semple
 
 
 
 
 
 
 
 
Freedom
 
The past is frozen
The future is melting
The present is weather
 
---HawaH
 
With a feather
the Universe is untangled
 
---Will Duprey
 

Friday, March 25, 2016

జిలేబి వదన ! సరికొత్త బ్లాగు అగ్రిగేటర్ !

జిలేబి వదన ! సరికొత్త బ్లాగు అగ్రిగేటర్ !
 
బ్లాగిన బ్లాగరుని గ్రక్కున బట్టన్ !
కామింటిన కామెంటరు ని గ్రక్కున బట్టన్ !
త్వరితము చూడుడు జిలేబి వదన



సరికొత్త అగ్రిగేటరు ! లింకు క్రింద ఉన్నది !
చిత్రము నొక్కుడు !
చిత్రము గణగణ
జూడన జిలేబి వదన !
 
జిలేబి వదన ! అగ్రిగేటర్ !

 
చీర్స్
జిలేబి
(తూచ్!)

Tuesday, March 22, 2016

ఇట్స్ టైం ఫర్ కాఫీ విత్ అయ్యర్ :)

ఇట్స్ టైం ఫర్ కాఫీ విత్ అయ్యర్ :)



అయ్యరు గారందించిన కాఫీ సిప్ జేస్తో 'అహా' కుంభకోణం డిగ్రీ కాఫీ బాగుందండోయ్' అంటే ,

ఏమోయ్ జిలేబి ఈ మధ్య మరీ బిజీ బిజీ అయి పోయేవ్ ? అన్నారు కుశలము విచారిస్తో !

వారు నా కుశలాన్ని విచారించే పధ్ధతి ఇదే గా మరి అనుకుంటూ

ఏముంది లెండి ! ఈ మధ్య పద్య రచనల మీద పడ్డా ! మీకు తెలుసుగా ఒక పదం కుదిరితే మరో పదం కుదరదు ! పోనీ  పాదం కుదిరింది అని ఆనందం తో మీరిచ్చిన కాఫీ సిప్ జేస్తే మరో పాదం రాలె ! ఇట్లా కుస్తీ ల తో నే సరి పోతోందండోయ్ - చెప్పా !

ఓహో ! నత్త బాధ లన్న మాట ! హిందూ పేపరు లో తల బెట్టి న్యూసు చదువుతో అన్నారు !

అయ్యర్ వాళ్ ! ఈ పద్యాల గోళం లో పడి ఈ మధ్య దేశం లో ఏమి జరుగు తోందో తెలీక పోయే ! ఏమిటి దేశం ఖబుర్లు అన్నా ! అర్రెర్రే ! బడ్జెట్ సీసన్ కూడా అయిపోయే వాటి మీద కూడా జిలేబి ఏమీ కామెంటరీ వ్రాయక పోయెనే అనుకుంటూ !

ఆ ఏముంది లే జిలేబి దేశం లో ఆర్ట్ అఫ్ లివింగ్ వాడు గ్రాండ్ స్కేల్ లో కల్చరల్ ఈవెంట్ పెడితే హిందూ వాడు దాంట్లో ఎక్కువ రంద్రాన్వేషణ పెట్టాడు !

అంటే !

నెగటివ్ పాయింట్స్ అన్నీ పట్టు కొచ్చి అబ్బే ! వీళ్ళకి ఈవెంట్ మేనజ్ మెంట్ తేలీదని తేల్చి పారేసాడు !

ఓ !

అంతే కాదు ! రవిశంకర్ మొదట్లో పొలిటికల్ లీడర్ లా మాట్లాడ ప్రయత్నించి తాను ఆధ్యాత్మిక గురువు అన్న మాట గుర్తుకొచ్చిందేమో సరిదిద్దు కుని హృదయం తో మాట్లాడటం మొదలెట్టాడు !

ఓ !

అదే మీటింగు లో మోడీ వాళ్ళ కి కావలసినంత జోష్ భరీ మస్త్ భారీ స్లోగన్ లు అందించాడు కూడా ! ఏ ఓ ఎల్ అంటే ఏమిటి అంటూ వాళ్ళ కే వాళ్ళ గురించి తెలీనిది చెప్పాడు :)

ఓ ! మన మోడీ గారేం చేస్తున్నా రండీ  ఇంకా !

వారా ? ఈ మధ్య ఒక సూఫీ కాన్ఫెరెన్స్ లో వాళ్ళు మస్త్ ప్యార్ భరీ ఉర్దూ లో రాగం తీస్తో మాట్లాడితే , తన ఫేవరైట్ భాష హిందీ లో జబర్దస్త్ వాయించ కుండా అరువు ఆంగ్లం లో వాళ్ళ కి మెసేజ్ ఇచ్చాడు ప్రసంగం లో !

ఏమని ?

అల్లాః హి రహ్మాన్ అవుర్ రహీం హై ! అని !

వారెవ్వా ! ఇంకా ?

ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు గాని ఏమిటి ఇవ్వాళ నా మీద పడ్డావ్ ? కాఫీ బావుందా ? 

కాఫీ బ్రహ్మాండం ! ఇంతకీ అయ్యర్ వాళ్ ఈ మధ్య ఒక పద్యం వ్రాసా ! చదివి వినిపించ మంటా రా !

అయ్య బాబోయ్ ! జిలేబి ! ఎన్నై విట్టుడు ! ఎనక్కు వేండామ్ ఉన్ పద్యం !

అయ్యర్ వాళ్ మళ్ళీ గోముగా మరో మారు పిలిచా !

ఇదిగో జిలేబి నీకు పనీ పాటా లేదు ! అట్లా గాదు గా నా కైతే !

వంటా వార్పూ నా మెడ కి అంట గట్టావ్ ! ఆఫీస్ పనంటూ !

ఆఫీస్ పని ఏమి నిర్వాకం చేస్తా ఉన్నావో మన మురుగ ప్పెరుమాళ్ కే ఎరుక ! ఎప్పుడు జూసినా ఒకటి రెండూ ఒకటి అంటూ గణా లని గుణిస్తో ఉన్నావ్ తప్పించి ఆఫీసు పనీ ఏమీ చేసినట్టు  దాఖలాలు లేవు ! పనీ పాటా లేక పోతే వంటా వార్పూ చెయ్య కూడదు నాకు మరి కొంత రిలీఫ్ కూడా !

అయ్యర్ వాళ్ అయం వెరీ వెరీ బిజీ ! మరో కప్పు కాఫీ బట్రాండి ! హుకూం జారీ చేసా !

హుసూరు మని హుజూర్ అని అయ్యర్ గారు మళ్ళీ వంట గది ముఖం పట్టేరు !

హమ్మయ్య! ఇట్లాంటి అయ్యరు గారు ఉన్నంత వరకు మన టైం పాస్ కి డోకా వచ్చింది ఏమీ లేదను కుంటూ  మళ్ళీ భారీ శరీరాన్ని కరిగించు కోడా నికి పద్యాల తో కుస్తీ పట్టటం మొదలెట్టా తూలికా రమణి చెప్పిన కిటుకు యిదే గా మరి ! జాలం మీద పడి బరువు తగ్గించు కో అని సరి కొత్త తెకినీకు అన్న మాట :)

చీర్స్
జిలేబి

Monday, March 14, 2016

నడుమున చేతులు జేర్చన్ !

నడుమున చేతులు జేర్చన్ !
 
రేఖా చిత్రం శ్రీ పొన్నాడ !



నడుమున చేతుల జేర్చన్
సడి సడి జేసెను కురులను సరసపు మోమున్
ఒడి తడి వేదిక నయ్యెన్
విడివడని ఒడులు ఒడుపుగ విరహము దీర్చెన్
చీర్స్
జిలేబి

Sunday, March 13, 2016

మన మోహన జిలేబి యాగం :)

 
శ్యామల తాడిగడప రా
యా! మన మోహన జిలేబి యాగము నందున్
ఆ మాస్టారి అనుకరణ
నే మది గొనినిటు బుడిబుడి నేర్చితి గనుమా
****
కందివరుల కొలువున నే
బొందితి ఆదరణ, నాదు పొడిపొడి పలుకున్
అందముగ జేసి నేర్పిరి
కందము, కవి శంకరయ్య కవనపు రాజుల్
***

చందము సాఫ్టున మరిమరి
డెందపు అమరిక నిఘంటు డేటా బట్టన్
అందపు బ్లాగుల కామిం
ట్లందరి జేరెను జిలేబి టపటప వేసెన్ !
***
వేసిన కామింట్ల చదివి
ఆశీస్సులనిచ్చిరి గద,  ఆ దరువు గనన్
కాసిని తెలుగును నేర్చితి
మా సిరి యిదియే జిలేబి మాటన్ గనుమా !
***
సరళపు చెలువపు తెలుగున
గిరగిర పలుకుల నడకల కిటుకుల లక్కా
కు రచనల జూచి నేర్వన్
కరముగ శ్రీపాద గురువు కరుణన గంటిన్ !
****
మత్త గజం తికజం శివ
మెత్తగ జాంజాం గిరిగిరి మేనియు జుట్టెన్
కొత్తగ జిలేబి కందము
మత్తగు వాసన, గుభాళి , మా దరి గాంచెన్
***
బీజాం గిరిరాజ తనయ
పూజనువాసన జిలేబి పూరణ గాంచెన్
మా ఝరియిన్ గువ గువలా
డే జాము గుభాళి శంభుడే గొని తెచ్చెన్ !
***
చింతన గనుమా ! మిడిమిడి
బొంతర! నిమ్మది నెటుగొనె ?  బొగ్గు యగుదువే
వింతగు మా పెనిమిటులకు
కొంత తెలియ ! కీచక! తొలగుము వెలగమురా
***
మాలిని మధురిమ జూడన్
స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై,
బాలిక లకు నేర్పవలెన్
కాళిక మెరుపున్ జిలేబి కరుణయు గూడన్
***
సదనము నిదియే కవివర
కదనము జేయన్, కవనపు కందివరు సభా
సదు లార మీరు కవితా
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్ !
***
ఊహా గానము జేసిరి వేదము ఊపిరి మీరగ  పారులు పాడన్
ఆహా మాచన జెప్పెను జూడర ఆ దరువు నిత్య సత్యము జూడన్
ఓహో తెలిసెను వేదము మేటిర ఓపిక గూడగ సామము పాడన్
ఔహా అనునవి వాడుక ఊహా ఔరా ఆయెను గదరా జూడన్
***
కథవిను మాచన జెప్పెన్
పథమున బోవన ధబిల్లు పాగెము లేకన్
అధకిమ్ రైలున కంకెర
నిధనము జేయగ విధి యిది నిక్కము సుమ్మీ
 
 
చీర్స్
జలేబి 
 

Thursday, March 10, 2016

మూసిన కనుతీరు జూడన్ :)

మూసిన కనుతీరు జూడన్ :)
 
రేఖా చిత్రం పొన్నాడ !



మూసిన కనుతీరుగ నిను
జూసితి వేణీ జిలేబి జూడగ మెరిసెన్
వ్రాసితి నిచటన్ కందము
నీ సిరి సబల సిరి గదవె నీల చకోరీ
 
జిలేబి

Tuesday, March 8, 2016

అయ్యో పాపం ఏకేశ్వరుడు :)

అయ్యో పాపం ఏకేశ్వరుడు :)

మా దేవుడు ఏకేశ్వరుడు

అవునా పీతాంబరధారి యా ?

అబ్బే దిగంబరి .

ఎట్లా ఉంటాడో ?

మీరంతా మూఢులు ;  దేవుడు ఎట్లా ఉంటాడు అంటా రేమిటి ? అమూర్తి వాడు ; మా ఏకేశ్వరుడు నిరాకారి ;

అయ్యో పాపం ! ఏమన్నా ఆహారం పానీయం, ప్రసాదం గట్రా పుచ్చుకుంటా డా ?

ఛీ ఛీ మీరంతా చీడ పురుగులు ; ఎప్పుడు  ప్రసాదం, తిండి యావే నా ? మావాడు ఏమీ తినడు ;

ప్చ్; బక్క చిక్కి డొక్క లేని వాడన్న మాట ;  ఎక్కడ ఉంటాడో ?

ఎక్కడైనా ఉంటాడు గాని మీకు కనిపించడు ; వినిపించడు ;

ఈ నల్లని రాళ్ళ లో ? పాముల పుట్ట లో ? నీలి మేఘం లో ?

చెప్పాగా మీరు మూఢులు  అని; మీదంతా మూఢ భక్తి ; ఛీ ఛీ రాళ్ళ లో ఉండట మేమిటి ?  పాములా ? ఛ ఛ అంతా చాదస్తం ; మీకు బాగా బ్రెయిన్ వాష్ చేసేసారు ;

పోనీ మనుషుల్లో ? జంతువుల్లో ?

ఛీ ! వెధవాలోచన ; మీరంతా పాపులు !

మరీ ఇంత కనిపించ కుండా ఎక్కడ దాక్కున్నా డబ్బా ?

మావాడు స్వతంత్రుడు ;  ప్రత్యేకము గలవాడు ;

అంటే ? వాడొక్క డే కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ ఉంటా డా ? మరీ అసంఘ జీవి యన్న మాట !

ఛీ ఛీ ! వాడు మీతో కలవడు ; మీరంతా భ్రష్టు పట్టి పోయారు

మీకు ఏమీ తెలియదు ; మా దేవుడు ఏకేశ్వరుడి గురించి ; మీ బుర్ర లంతా వట్టి మట్టి బుర్రలు !

నీ పేరేందబ్బాయ్ ?

అవివేక్ :)

ఓ, small brain అన్న మాట :) పేరు బాగుందబ్బాయ్ :)


చీర్స్
జిలేబి