Monday, October 30, 2017

సమస్యా పూరణ -అసభ్యత - అశ్లీలముసమస్యా పూరణ -అసభ్యత - అశ్లీలము


నిన్న 'నే కవిని గాను' అంటూ మా నరసన్న వారు శంకరాభరణం లో ఓ సమస్య ని చూసి (తండ్రితో రతికేళినిఁ దనయ కోరె) 'చదవడానికే జుగుప్సగా ఉంది నా మటుకు'. అన్నారు.

అంటే అన్నారు పొండి.

వివరాల లోకి వెళితే , కొన్ని సంవత్సరాల మునుపు, (అప్పట్లో 'కంద' జిలేబి లేదు :)) 'సీతమ్మ మా యమ్మ' శ్రీరాముడు మా తండ్రి' అంటూ త్యాగయ్య కీర్తనలతో మురిసి పోతున్న రోజులలో - సమస్యా పూరణ అంటూ సీతమ్మ వారి శీలం మీద 'తప్పుగా' కనిపించేలాంటి ఓ సమస్య చదివి కుతకుత ఉడికి పోయి ఏమోయ్ కవీశ్వ రా మీకు సభ్యత లేదా ? సీతమ్మ వారి మీద ఇంత అవాకులూ చెవాకులా ? అనేసా మండి పోయి !

అప్పడు కంది వారు వివరంగా చెప్పేరు - సమస్యా పూరణ అంటే ఇట్లా ఉంటుంది అంటూ ...


"పృచ్ఛకుడు అడిగిన ' సమస్య ' యొక్క భావం చాలా అసంగతంగా, అసంబద్ధంగా, అసందర్భంగా, ఒక్కొక్కసారి అశ్లీలంగా కూడా వుంటుంది. కవి తన ప్రతిభతో దానిని సభ్యతాయుతంగా, అసంభవాన్ని సంభవంగా నిరూపిస్తూ పూరించాలి" .

ఈ విషయం మీద ఆలోచించి వరుసగా కొన్ని దినాలు సమస్య లను గమనించడం మొదలెట్టా ! మాలిక అగ్రిగేటర్ లో మొదటి వాక్యం మాత్రం 'చదవ' గానే ఔరా ఏమిటీ 'పర్యయము' అనుకుంటూ 'వీళ్ళ నోట్ల బండ బడ అనుకున్నా !

ఆతరువాత పూరణ లని చూసేక ఔరా అని దాంతో తలే ఉంగలీ దబాయా ! పూరణ ల లో ఆ అశ్లీలత గాని, అసంబద్ధత గాని కనిపించక హుష్ కాకీ అయిపొయింది :)

ఓహో ! సమస్య ని చదవ కూడదు . సమస్య ని సమస్య గానే చూడాలి. దాన్ని విడ గొట్టాలి అన్నది అర్థ మయ్యింది.

ఆ తరువాత నించి (ఛందస్సు లేకుండా ) మనకిష్ట మొచ్చిన శైలిలో రాయటం మొదలెట్టా ఆ సమస్య లని సమస్యలు గానే చూసి ; ఎవరో ఓ పెద్దాయన అబ్బుర పడి తల గోక్కొని, నేనెన్నో ఛందస్సు లను చూసేను గాని ఈ జిలేబీ వారి ఛందస్సు ఏమిటి ? ఏ ఛందస్సు లో పూర్తి చేసే రని ప్రశ్నించేస్తే ,  దానికి కీర్తిశేషులు పండిత శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారు శ్రీ జిలేబి గారిది జిలేబి ఛందస్సని 'విట్టేసారు' :)

ఆహ్ జిలేబి ఛందస్సు అనుకున్నా :)

ఆ తరువాత ఛందస్సు సాఫ్టువేరు కనిపించి ఔరా ఇట్లా కూడా ఓ పరికరం ఉందా అనుకుంటూ 'పిచ్చి పిచ్చి గా' పదాలను గుచ్చేసు కుంటూ , అర్థం ఉందో లేదో, చదివే వాళ్లకు అర్థం అవుతుందో లేదో మనకేమిటి ? అనుకుంటూ,( 'గొంగళి లో తింటూ వెంట్రుక లేరు కోరు అని శ్యామలీయం వారు మొత్తు కునే దాక :)) యడాగమాలు, సంధులు,  సమోసా' లు మనకు జాన్తా నై, ఖాతర్ నై అనేసు కుంటూ , పంచ దశ లోకపు జనాలు జుట్టు పీక్కునేటట్టు 'జిలేబీ' ఫ్యాక్టరీ  పద్యాలు మొదలెట్టే సా :),

వెంకట రాజారావు గారు ఊ అంటే మనం సయ్యంటూ పద్యాలు లాగేసు కుంటూ, కొత్త పదాలకు, జాతీయాలకు, సామెతలకు,  కార్ఖానా అయిన కష్టే ఫలే వారి బ్లాగు ని ఫాలో అయిపోతూ, పాటల తో అలరిస్తున్న పాట తో నేను లో సినీ పదాల ని గమనిస్తూ వాటిలో ని ఛందసు గమనిస్తూ ...

ఇదెంత దాకా పోయింది అంటే, తనకంటూ ఓ స్టాండర్డ్ ఉన్న 'ఈమాట' లో జిలేబి 'సమోసా' గా , జిలేబి చందస్సు ఎ.తె. ఛందస్సు గా మారి కథా రూపమై , బ్లాగ్ లోకం పై ఓ సెటైర్ గా మారి పోయేంత గా అన్న మాట :)

నిజం చెప్పాలంటే ,సమస్యా పూరణ ఇచ్చిన వాళ్ళు మొదట్లో నే దానికి సరియైన సమాధానం పెట్టు కునే ఇస్తారు, కవి ఇది కుదరదు పూర్తిచేయడానికి అంటే, అబ్బే ఇట్లా చెయ్యోచ్చండి అని చూపించ టానికి (ఎక్సెప్షన్ - నాకు తెలిసినది -  మా లలిత గారు, గిరీశానికి మధుర వాణి ని అమ్మాయి గా చేసేసి, చంపక మాల లో నరాల వారికి సమస్య నిచ్చి , వారు ' అమ్మాయ్ - దీనికి పూరణ నీ దగ్గర ఉందా అంటే , బిక్కమోగం పెట్టేసేరట :)

కాబట్టి ప్రతి సమస్య కు  ఓ లానే గాకుండా, ఎన్నో విధాలు గా జవాబు లుంటాయి. (దీని ద్వారా నేర్చు కోవలసినది ఇది అన్నది గరికి పాటి వారి ఉవాచ )

టు కట్ షార్ట్  (ఈ వాక్యం ఎవరదో చెప్పుకోండి చూద్దాం బ్లాగ్ లోకం లో :)) ,

నేర్చు కున్న దేమి టంటే సమాజం లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. (సమస్య ని చదివితే చెడు లా అనిపిస్తుంది) . చెడుని పక్కకు తోసి మేధస్సు కు పదును పెడితే మంచి ని దాన్నించి లాగొచ్చు . అట్లాగే సమస్య ని చదవ కుండా, సమస్య గానే స్వీకరించి, మేధో మధనం చేస్తే, బ్రెయిన్ వేవ్స్ స్ట్రాంగ్ గా మారి ఈ 'బామ్మ' కాలం లో శరీరపు చురుకు దనం తో పాటు, మేధస్సు కూడా చురుకు గా ఉండే రీతి గా మనల్ని మనం మార్చేసు కోవచ్చు అన్నది కనుక్కున 'రహస్యం' (జిలేబీ రహస్యం :)) - మన పుస్తకాలన్నీ రహస్యం అనే పేరు పెట్టు కునే లా అన్న మాట :) - మన బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి జ్యోతిష్య రహస్యం, ఆ రహస్యం, ఈ రహస్యం లా అన్న మాట :))

కొసమెరుపు - ఇంతా రాసింది ఎందుకంటే, విన్నకోట వారు కూడా పద్యాల్ని రాయటం మొదలెట్టా రంటే కొన్నాళ్ళ కే సమస్య లని చదవటం మానేస్తారని :)

రెండో కొస మెరుపు - అక్కడ ఫణి అనే వారు, "ఈశ్వర నిందకు కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ గురునిందకు లేదు అని శాస్త్రము. గురువుగా ఒకరిని భావించిన తరువాత వారి తప్పొప్పులను ఎంచు అధికారము శిష్యులకు లేదు. ఈనాటి కవి మిత్రులందరికీ గురునిందాదోష పరిహారము కావలెనని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను."

ఇట్లాంటి మూఢ నమ్మకాలు పెట్టేసు కున్నందు వల్లే దేశం లో గుండు గురువులు ఎక్కువై పోతున్నా రనుకుంటా !

గురువైనా , శిష్యుడై నా, మనమందరము ఒక పరిధి లోని వారమే .

కాబట్టి ఇట్లాంటి గుడ్డి నమ్మకాలు వేష్ట్ !

విద్యాధికులే ఇట్లాంటి నమ్మకాలు పెట్టేసు కుంటే, ఇక  మిగిలిన వారి గురించి చెప్పాల్సిన అవసరం అసలు లేదు.

తప్పక మ్యూచ్యువల్ రెస్పెక్ట్ ఉండాలి. అంతే కాని అది మూఢ నమ్మకం గా మారి పోకూడదు.


చీర్స్
జిలేబి
హమ్మయ్య ! చాన్నాళ్ళకి మేటరు దొరికె
'రాసు' కోవటానికి :)

6 comments:

 1. మీర్రాసిన మేటరులో నా పేరు చూసుకుని మురిసిపోయా :)

  ReplyDelete
 2. < "హమ్మయ్య ! చాన్నాళ్ళకి మేటరు దొరికె
  'రాసు' కోవటానికి :)"

  మీ నారదమనోగతం అర్థమవుతోంది గానీ ఈ "మేటరు" దొరకడం నావల్లనే జరిగింది (తప్పో, ఒప్పో) కాబట్టి మీరు నాకు థాంక్స్ చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా 🙂 .
  ----------------------------

  < ".... విన్నకోట వారు కూడా పద్యాల్ని రాయటం మొదలెట్టా రంటే ...."

  మీ మేటివేషన్ ప్రయత్నానికి థాంక్స్, బట్ నో థాంక్స్. అంత ఆసక్తి, ఉత్సాహం, సామర్ధ్యం లేవండి. ఈ విషయంలో ఔత్సాహికులు GPS గారికి హేట్సాఫ్ - రిటైరయిన తరవాత ఈ వ్యాసంగం మొదలెట్టారు.

  ReplyDelete
 3. 'రాసు(జు🔥)'కోవటానికి...
  😉

  ReplyDelete
 4. బుధ్ధికి పదను బెట్టంగ బుధ్ధిలేని
  కడు జుగుప్సాకర సమస్యనిడి ' విబుధులు '
  ' వహ్వ వహ్వా ' యని భుజాలు విహ్వలింప
  నందరొకటైరి భళి ! భళీ !! నందమయ్యె .

  ReplyDelete
 5. విన్నకోటవారికొక విన్నపం
  ----------------
  ఆర్యా !
  నేనింతకుముందొకపరి
  ధ్యానించితి చేతులొగ్గి దయచేసి యిలా
  మానితము గాని వాటిని
  రానీకుడటంచు , కాని రావే బుధ్ధుల్ !


  విన్నకోట మాన్యులు ! నాదొక విన్నపమ్ము ,
  వినరు , మానరు విబుధులు , వింత వింత
  పోకడలు వారివి , అటకువోవ తగదు,
  పండితులగోల మనకేల ? భవ్యచరిత !

  ReplyDelete
 6. ఆ సమస్య కంటె అశ్లీలతలకంటె
  నాదు వ్యాఖ్య కడు వినంగ తగద ?
  శ్రీ జిలేబి గారి చిత్త మిట్లయ్యెనా ?
  తీసివేతు రేల ? ధీరు లిటుల .

  ReplyDelete