Tuesday, October 10, 2017

రండి ముతక సామెతలు, జాతీయాలు లోకోక్తులు నేర్చుకుందాం :) - 1


రండి ముతక సామెతలు, జాతీయాలు లోకోక్తులు  నేర్చుకుందాం :)


బ్లాగ్ వీక్షకులారా !
మీ మనసు దిటవు పరచు కొనుడు.

ముతక సామెతలు, జాతీయాలు, లోకోక్తులు, జనబాహుళ్యము లో ని వి. వాటి ని మీరు నిరసిం చుకున్నా , చీ యని ఛీ కొట్టినా వాటికి వచ్చే నష్టము లేదు.


సామాన్య జన పలుకుల్ని రత్తాలు రాంబాబు ద్వారా రావి శాస్త్రి పలికించాడు విపరీతం గా. ఎంత గా అంటే అవి నిఘంటువు ల లో కెక్కేటంత గా.

ఆ కాలం లో రత్తాలు రాంబాబు చదవని వారంటే వెర్రి వెధవాయిలే.

కావాలంటే మా పనిలేని డాటేరు బాబు గారిని అడగండి. వారు రావి  శాస్త్రీ యాన్ని వడ గట్టి, ఎండ గట్టి గట్టి కాఫీ కింద తాగిన వారు. (ఈ మధ్య ఫేసు బుక్కు కే వారంకితం అయిపోయేరు - జైలు ఖానా లో ఖైది అయిపోయారన్న మాట ) :)

సరే విషయానికి వస్తే వేమన తాత ఏమన్నా తక్కువా ? ముతక పదాల్ని ఆట వెలది లో చందం లో ఇమడ్చ డానికి ?
(బ్రహ్మయ్య లను ఎండ గట్టేడు కాబట్టి తాత ఐపోయేడు. లేకుంటే ఐలయ్య లా పలికి ఉంటె తన మీద జనాలు ఎగ బడి ఉండే వారేమో ? ఊహ మాత్రం అంతే - లేకుంటే

పిండములను జేసి పితరుల దలపోసి కాకులకు బెట్టు గాడ్డెలార ! పియ్య తినెడు కాకి పితరు డెట్లాయెరా అని దమ్ము గా అని వుండే వాడా ?

సరే నేటి ముతక సామెత - ఇది కొట్టు కొచ్చినది . ఎక్కడి నుంచి ? కనుక్కోండి చూద్దాం.

అంటూ సంటూ లేని కోడలు దాని మేనమామ కొడుకు చిక్కుడు చెట్టు క్రిందికి పోయి పక్కలు ఎగుర వేసి నారట !


ఇవ్వాల్టి కథా కమామీషు
పరి సమాప్తము

ఇట్లు

జిలేబి


 

3 comments:

  1. పిండములను జేసి పితరుల దలపోసి కాకులకు బెట్టు గాడ్డెలార ! పియ్య తినెడు కాకి పితరు డెట్లాయెరా" ఈ వేమన పద్యం అదిరిపోయింది జిలేబిగారు.
    మరిన్ని పోస్టులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ReplyDelete
  2. అహా హా హా..కానివ్వండి

    ReplyDelete