Friday, November 24, 2017

చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ :)చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ !
 
 
చుక్క కనిపించి నదకో ?
పక్కా గాదోయ్  జిలేబి పరమాత్ముడనన్ !
చిక్కుల్ గనుమోయ్ పథమున్
చక్కా బోవన్ కుదురదు చతురత వలయున్ !


జిలేబి

204 comments: 1. జీరాడు కవిత్వ ములన్
  వారావధివలె నిలుపుచు వచనమ్ములతో
  పౌరుల హృదయము దొంగిలు
  చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌ నే?

  జిలేబి

  ReplyDelete


 2. రైతుల ప్రాణములకు విలు
  వే తగ్గె! మన ప్రభుత యిక వేగము గా యు
  ర్రూతల వచ్చును! జనులా
  రా! తండ్రి వలె తలగాచు రాజుని నేనౌ !

  జిలేబి

  ReplyDelete


 3. భగవద్గీతుందా? మీ
  రు గట్టి హిందువులు సూవె ! రుబ్బవలెన్ దా
  న్నకొ బైబిలువోలె, జిలే
  బి, కొంత జాంగ్రీ యనంగ బిగియును సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 4. బాంచన్నీకాల్మొక్తను,
  మంచానికి మూడుకాళ్లు మనిషికి వలెనే
  కొంచెము కూడా తప్పే
  గాంచను దొర నన్నొదులుము కామందన్నా :)

  జిలేబి

  ReplyDelete


 5. భూషణములుగా గాన్పడు
  రోషము మదలోభములును, రొండుడు సయి కా
  వేషము, మాత్సర్యములన్
  భేషజముల నెల్ల వీడవే, శివ మయమై !

  జిలేబి

  ReplyDelete


 6. సజ్జన పుష్పాపచయము
  సజ్జనులకు ప్రీతికరము, సారాకొట్టే
  సజ్జ గద జిలేబీ లకు
  గజ్జెలు లేకయు నటనము ఘల్లన జేయన్ :)

  జిలేబి

  ReplyDelete


 7. మరియొక మనుజుడు బుట్టన
  గిరికీల పడెను పదముల గిరగిర గనుచున్
  హరిహరి యనవలసిన నరు
  ల రవము లుకకుక జిలేబు లాయెన్ బోవే :)

  జిలేబి

  ReplyDelete


 8. పుల్లేల జిలేబమ్మకు
  యెల్ల హరిమ పులకరింతయే గద తనకున్
  విల్లంబుల కందంబుల
  తల్లకెడవుల కవనమ్ము తకధిమి యనగన్ :)

  జిలేబి

  ReplyDelete


 9. రామాయణంబదేల మ
  రో మారు సుమీ ! జిలేబి రుబ్బుడు గాదే ?
  రాముడు మా రామయతం
  డ్రీ మా సీతమ్మ సృత్వరి గదా మాకున్ !


  జిలేబి

  ReplyDelete


 10. నగరము లో కోలాహల
  ము! గబుకు సుందరి యివాంక మోడీ భాయీ
  జిగిదేర పలుకు దురటా !
  జిగిబిగి చాయ్పే జిలేబి జీ హా యనునో :)

  జిలేబి

  ReplyDelete


 11. హ! వడముల వడ ఘుమఘుమల
  గవనం బంతే, జిలేబి, గట్టిగ హనుమం
  త! విడువను విడువననుచున్
  పవమాన తనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

  జిలేబి

  ReplyDelete


 12. కరువుల్లేనిభువి గదా !
  తరువున వెల్గొందుచుండె తారాగణముల్,
  సిరిసిరి మువ్వుల వెల్గుల
  కరివరదుని కరుణ గాన కంద జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 13. వడమున వడల ఘుమఘుమలు !
  చడుమక చదువ హనుమాను చాలీసాయున్
  బడబడ యనుచు జిలేబియ
  ట డంగయి పవన తనూజు ఠారెత్తెనటన్ !

  జిలేబి

  ReplyDelete


 14. వస్తిని హస్తిని మస్తుగ
  యిస్త జిలేబులను మీకు యిమ్ముగ సుమ్మీ
  కాస్తో కూస్తో యున్నటి
  మస్తిష్కమ్ములిక మీకు మత్తున దేలన్ :)

  జిలేబి

  ReplyDelete


 15. మీదే కులమమ్మ? జిలే
  బీ దే కులమన్న నేమి వివరించును దా!
  బీదా బిక్కీ జనముల
  కేదోయి కులము సముద్ర కెరటమ్ములనన్ !

  జిలేబి

  ReplyDelete


 16. తల్లకెడవుల తపస్సును
  యెల్ల సమయములట మేలు యెల్లలె రుగక
  న్నుల్లాసముగా జేసెన్
  మళ్ళీ మళ్ళీ జిలేబి మది శివ శంభో !

  జిలేబి

  ReplyDelete


 17. నాలుగు వారమ్ములలో
  బేలా! ఆకాశవాణి పెట్టా బేడా
  యేలన్ కట్టేసే తా
  మేలౌ ప్రక్రియ గదా సుమేధా జీవీ !

  జిలేబి

  ReplyDelete


 18. మెటికల విరచుచు పదముల
  కుటిలత్వముఁ జూపఁగాఁ దగున్ గవులారా,
  పటిమన్ గనుచున్ కైపద
  మెటులై నన్ దీర్చగాను మెచ్చుదురెల్లన్ !

  జిలేబి

  ReplyDelete


 19. చదివే వారికి రొప్పుడు
  కుదిరెన్ బోయతి జిలేబి కోటలు గట్టెన్ !
  పదిలము గా వ్రాసుకొనుము
  మదినిండుగ కందమయ్యె మహిలో సుదతీ :)


  జిలేబి కోటల్ గట్టె :)

  ReplyDelete
  Replies
  1. శ్రీరామచంద్రా 😧:(
   కాదేదీ జిలేబీ కందానికనర్హం - అనుకోవాలి 😕

   Delete


  2. శ్రీరామచంద్ర ! కాదే
   దీ రా కందము జిలేబి తీరుగ గూర్చన్
   ధారాపాతము నరసిం
   హా రావుల పలుకులాయె హద్దరి ఛందం :)

   జిలేబి

   Delete


 20. రవిగారి టపా కూడా
  చవులూ రెనయా జిలేబి చందము వోలెన్
  అవసర మిక్కడ లింకది
  యెవరికయిన చూడగాను యెంచక్కనహో !

  జిలేబి

  ReplyDelete


 21. కాదేది, జిలేబమ్మా
  మీ ధాటికి కందమౌ సుమీ! మా వ్యాఖ్యల్
  రా దారిన రాక మునుపు
  మీ దారిని యెట్ల గాంచె మిరుమిట్లగుచున్ :)

  గోల్ మాల్ హై భాయ్
  సబ్ గోల్ మాల్ హై :)

  జిలేబి

  ReplyDelete


 22. అంకతి చంచల బుద్ధియు
  పంకిల మది పోవగాను పంకజ జన్ముం
  డంకిత మై నంది యవగ,
  శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్!

  *శంకరుడెత్తె- శంకరుడు స్మరించె, వెడలె

  పంకజనాభుని కోరిక
  పంకజ జన్ముని చంచలత్వం
  తరువాయి విష్ణువు ప్రార్థింప, బ్రహ్మ శరణు వేడి నందియై మారగ... ఆపై శంకరుడు వెడలె హిమగిరికి సతి సమేతంగా (శివ పురాణం)

  జిలేబి

  ReplyDelete


 23. ఆటాపాటల్ రాముండేబో!
  మాటాడంగన్ మాన్యుల్లెల్లన్
  మీటెన్విల్లున్ మించారంగన్
  తాటంకమ్ముల్ తారాడెన్బో !

  జిలేబి

  ReplyDelete


 24. మీటెన్ విల్లున్, నారిన్
  మీటెన్, మీటెన్ హృదయము, మీటెన్ జనులన్!
  మాటే బాణము! రాముని
  బాటన్నడిచెను విడువక భామామణియే!

  జిలేబి

  ReplyDelete


 25. విలవిల లాడకు రమణీ
  విలువల మరువక జగత్తు వివరంబిదియే
  చెలువము మీర మృదుల పలు
  కుల తత్త్వ మెఱింగియున్నఁ గూడును సుఖముల్!

  జిలేబి

  ReplyDelete


 26. మోడీ దెబ్బకు ఠాయని
  ఓడినవాఁ డలర, గెలిచి, యొక్కం డేడ్చెన్,
  వాడోదర నగరంబున
  గోడల్పైనన్ జిలేబి గొడవల్లవగన్ :)

  జిలేబి

  ReplyDelete


 27. తడబడెడడుగుల ముద్దుల
  బుడతడి నడుగ మురిపెమ్ము పూర్తిగ తీరన్,
  జడగంటలాడ చక్కని
  కడుపాయెను కొడుకు చేతఁ గాంతామణికిన్!

  జిలేబి

  ReplyDelete


 28. రావే చెలీ! సఖీ రా
  రావే ప్రాణేశ్వరీ ! పరాకేలా ! రా
  రావే నెచ్చెలియా ! నీ
  రావమ్మే యమ్మి నాకు రబ్డి‌ జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 29. మీరే పద్మార్పిత! మీ
  రే రప్ఫాడించగలరు రెంటము గాళ్ళన్
  పారా హుషారనుచు సు
  మ్మీ రక రకమై నతిట్లు మిరుమిట్లాయెన్ :)

  జిలేబి

  ReplyDelete


 30. ఘనసారపు పల్కులవా
  రు నరస రాయలు జిలేబి రూఢిగ గనుమ
  మ్మ నలుదెసల తిరుగుచు వా
  రు నచ్చినన్ మెచ్చుదురు విరుగపండాయెన్ :)

  జిలేబి

  ReplyDelete


 31. జగతిన్నేలన్ తప్పక
  దగరములన్ త్రోసివేయ ధరణిన్ జనులా
  ర! "గకారముల" మది నిలిపి,
  పగతుర పాదములఁ బట్టవలె, వీరులకున్!

  జిలేబి

  ReplyDelete


 32. పూల మాల వేసి పొలతిని బిలువగ
  కలక లయను రీతి కరుణ జూప
  నిలకడగని వచ్చు నెచ్చెలి, యభిముఖ
  రాల గాంచ జీవితాలు వెలుగు!

  జిలేబి

  ReplyDelete


 33. పామరుడ పామరుడనని
  యేమారవలదు మనుజుడ యిక్కట్లే సు
  మ్మీ! మానవుడికి విభుడే
  మీ మేధస్సు పనిలేక మిక్కిలి గనెనో :)

  జిలేబి

  ReplyDelete


 34. నీ కర్థంబవకున్న
  న్నీ కర్మగదా జిలేబి నీల్గుడదేలా !
  పోకిరి బుడతల పండితు
  లౌ? కసరత్తులను జేసి లావై గనిరే :)

  జిలేబి
  (పరార్:))

  ReplyDelete


 35. ఓయమ్మ జిలేబీ ! రా
  మాయణమున్ జదివి భారతార్థము జెప్పె
  న్నాయన లార! వినుడు విను
  డోయీ కథలన్ గనంగ డుగుడుగుడుక్కే :)

  జిలేబి

  ReplyDelete


 36. భైరవుడు పెనిమిటి గదా
  గౌరికిఁ; గేశవుఁడు భర్త గావలె నెన్నన్
  హీరకు గదా, జిలేబీ,
  సారసగర్భుడు మగండు శారద కమ్మా!

  జిలేబి

  ReplyDelete


 37. గాంధీ ! మూర్ఖ జిలేబీ !
  భ్రాంతుల తేలితివి గాద బార్డర్ క్లాషుల్
  సాంద్రత గనలేక సుమీ !
  రంధ్రాన్వేషణ ల బాబు రభసల్ రబ్డీ :)

  జిలేబి

  ReplyDelete


 38. మగరిస! పదనిస సనిదప
  మగరిస ! పదనిస సనిదప మగరిస నిదపా
  మగరిస సనిదప పదనిస
  మగరిస పదనిస సనిదప మగరిస గమపా :))

  జిలేబి

  ReplyDelete


 39. ఏమనెదరో సురేశన్ !
  "e- మానవు" లయ్యిరోయి ఈమోజీలై
  కోమాలో కెళ్ళిరహో !
  ఓమాటైనన్ పలుకరు ఓన్లీ స్మైలీస్ :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మీరన్న "e-మానవులు" అక్షరసత్యం - దురదృష్టవశాత్తూ.

   సురేశన్ మాస్టారు అరుదుగా దొరికే ఒక మంచి లెక్చరర్ జిలేబి గారూ. ఈనాటికీ ఓపికగా బోధిస్తూనే ఉన్నారు (వారు మాకు పాఠాలు చెప్పింది ఏభై ఏళ్ళ క్రితం నాటి మాట).

   వారి ఫొటో చూడాలనుకుంటే ప్రతాదివారం వచ్చే "ఈనాడు" పేపర్లో "ప్రతిభ" పేజ్‌లో కనిపిస్తుంది

   Delete


 40. చేతల కున్ పలుకులకు
  న్నే తెఱగుల పొత్తులేక నీమపు మాటల్
  రోత కలుగు జేయు నరులు,
  నీతుల బోధించువారె, నీచులు ధాత్రిన్!

  జిలేబి

  ReplyDelete


 41. హరినట తరుముచు వెనుక హంతకుడట!
  కావుమని శరణననగ కష్టమట ! న
  సత్యమును బల్కఁడఁట! హరిశ్చంద్ర నృపతి
  వారసుడనని యనుకొనె పారుడు గద!

  జిలేబి

  ReplyDelete


 42. చంపా రావే ! రావే
  కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్
  గంపెడు గడ్డిని తేవే !
  చంపావు గద కథగట్టి ఛంద జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 43. మనమెల్ల లయోలైట్సు గ
  ద! నరసరాయ ! హరిబాబు ! దరువుల్ సయి బ్లా
  గ్వనముల వైవీ ! సింహము
  లనగ మజ మజా జిలేబులమ్మీ గనవే :))

  జిలేబి
  పరార్ :)

  ReplyDelete
  Replies
  1. మా ముగ్గురి లయోలా చదువుక్రమం కరక్ట్‌గా చెప్పారే జిలేబి గారు 👏.
   (మళ్ళా దీనిమీదో పద్యం వ్రాయకండి 🙏)

   Delete
  2. నరసింహారావుగారిలో సింహం వుండనే వుంది. సింహానికి హరి అనే పేరుంది. మరి నేను సింహమెట్లయిత? లయోలా సింహాల గ్రూపులో వున్నందునా? లేక సింహానికి పర్యాయపదం హరికి మరోపేరైన శ్రీనివాసునైనందునా?
   జిలేబిగారు ఇదే పద్యంగా రాసేయండి.😊

   Delete

  3. ఏమండోయ్ వైవీ గారు

   నిజంగానే చెప్పమంటారా సింగమెట్లవుతరని ? :)

   జెకె :(

   చీర్స్
   బీలేబి

   Delete


 44. జగనన్నా ! మరుగుల్లే
  వు,గగన కుసుమంబయినది వున్నత చదువుల్
  సిగకొప్పుల వెలుగవలసి
  న కన్యలకటా జిలేబి నగుబాటయిరే !

  జిలేబి

  ReplyDelete


 45. ఏరాలంబుగ మనసుల్
  శ్రీరాముం డపహరించె, సీతాదేవిన్
  ధారాళముగ జిలేబీ,
  మా రాముని సాటి యెంత మాత్రము గలరే !

  జిలేబి

  ReplyDelete


 46. ఆపిలు బాధల గనుమోయ్
  మా పిలకాయలు జిలేబి మాలావు గనన్
  షాపుల ముందున క్యూలో
  రాపాడి నిలబడిరమ్మ రాత్రింబవలున్ :)

  జిలేబి

  ReplyDelete


 47. ఇదిగిది గో జూ వెళ్ళెద
  మిదిగో రమ్మా జిలేబి ! మించగ ఝంపా
  క దరువు, గానన్ వాటిన్,
  మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్ :)

  జిలేబి

  ReplyDelete


 48. గదయిత్నువట జిలేబికి
  ముదముగ కొన్న చరవాణి ముంగటి లోనే
  యదవద క్రాషవ్వంగన్
  మదిమెచ్చిన సుందరాంగి, మర్కట మయ్యెన్ !

  జిలేబి

  ReplyDelete


 49. ముదముగ నైఫోనుకొనన్
  కుదురుగ పనిచేయక సరకు డమాలవ్వ
  న్నదవద మగడిని గీరుచు
  మది మెచ్చిన సుందరాంగి, మర్కట మయ్యెన్ :)

  జిలేబి

  ReplyDelete


 50. నాదో ఉడతా భక్తి స
  భాదరణల గాంచినట్టి పద్యము లన్నో
  మాదిరి వాత్సాపుల నుం
  డీ దిగుమతి జేయగన్ చిడిముడి జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 51. కవితా జగత్తు మత్తున
  సువిశాలంబగు పదముల సుమధుర కైపుల్
  రవిగాంచని పడతుకల మ
  ది వింగడములన్ జిలేబి దించితి వమ్మా :)

  జిలేబి

  ReplyDelete


 52. శాపము‌ లిత్తురు పెద్దలు
  పాపము చేయంగ; వలెను భాగ్యము నందన్
  తాపము బోవగ భక్తిగ
  గోపాలుని సేవ సూవె కొమరు‌ జిలేబీ !

  జిలేబి

  ReplyDelete


 53. కుహుకుహు జిలేబి యవగన్
  "బహు"! పత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్!
  వహవహ యని పతి యనగన్
  జహనారా బేగమా మజ,ముడేసుకొనూ :)

  జిలేబి

  ReplyDelete


 54. పద్మాక్షరాలకు ఫిదా
  బద్మాష్గాళ్ళైనను యవవలసిన దే పో !
  గద్మను బట్టుచు ముద్దుగ
  సద్మను పోగొట్టునయ్య చక్కని చుక్కా :)

  జిలేబి

  ReplyDelete


 55. పడిపోయా నేనైతే
  వడి పద్మార్పిత కవితల వర్షపు ధారల్
  సడిజేయగ మది తా అల
  జడిగనె నోయీ జిలేబి జవజవ యనుచున్‌

  జిలేబి

  ReplyDelete


 56. అయిదుగురు పుత్రులు కలిగి రాయె మాత
  కుంతికి ; శతసుతుల్ గల్గ సంతసిల్లె
  తల్లి గాంధారి ! కథలను తరచిజూచి
  రయ్య కాలపు తీరుల రమ్యముగను !

  జిలేబి

  ReplyDelete


 57. గురువుల తాకిన నీరోయ్
  పరుగుల రా! పావనమ్ము పట్టుకు పోదాం !
  ఉరుకుల పరుగుల కాలువ
  మురికియని తలచకు తీర్థము సుమ ! జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 58. జీవన యానము లోనన్
  మా వనవాటికల యందు మహితార్థములన్
  నే వరుసగ గంటి జిలే
  బీ, వారావధి యదే సుభిక్షము గానన్ !

  జిలేబి

  ReplyDelete


 59. పద్యాలన్ ఛందస్సున
  గద్యము వలె తెలుపగన్ ప్రగల్భత గలదే ?
  విద్యార్థిగ మారుమయా
  మద్యార్కమువలె జిలేబి మత్తుల తేలన్ :)

  జిలేబి

  ReplyDelete


 60. "ఛందోబద్ధం" గానే
  అందం గా పద్యములను అందరి కొరకై
  డెందంబరయ పసందుగ
  కందంబున తెలుపగలముగ చిరంజీవీ :)

  జిలేబి

  ReplyDelete


 61. మేజికు భాయీ మేజి
  క్కూ! చక్కగచేసెనోయి కూడలి లోన
  న్నాజను లెల్లరు మెచ్చగ
  తాజా ట్రిక్కులు జిలేబి తాజుబ్బనగన్ !

  జిలేబి

  ReplyDelete


 62. విజయానికి చిరునామా
  సుజనులు పల్కిరి జిలేబి‌ సూటిగ నీవే
  మజ గాంచిన పద్మములన్
  సజావుగా నిలిపినావు చక్కని చుక్కా :)

  జిలేబి

  ReplyDelete


 63. అంతే లేదు పయనమున
  కంతే లేదు మజిలీలు గలవంతేనోయ్,
  వింతగ నయనంబులకు
  న్నందనిది తలపులు తప్ప అన్నెము గలదే !

  జిలేబి

  ReplyDelete


 64. రాసేదెలాను తెలుగే
  గా! సిగతరగ తెలుగేల కాస్తైనా లే
  దే! సోగ్గాడా ! తెలుగే
  లా సామీ నేర్వలేదు లావుగ సుమ్మీ :)

  ReplyDelete


 65. పురుషుడొక్కడె! పరమాత్మ !పూవుబోడి
  తెలుసు కొనవమ్మ యెల్లరు తెమ్మరవలె
  వీచు పడతుకల మతని వెనుక సూవె,
  వేంకటపతికి భామలు వేయిమంది !

  జిలేబి

  ReplyDelete


 66. చెంగట నిరువురయ్యిరి చెంగలువగ
  వేంకటపతికి; భామలు వేయిమంది
  యంబరమణికి ; కాంతుల కంతు లేదు
  విను జిలేబియ వినువీధి విభుని దాయె !

  జిలేబి

  ReplyDelete

 67. హద్దుల వేలన్ పద్మా
  ముద్దుగ విరబూయనిమ్మ మురిపెపు పద్మా
  లద్దరి పదముల కొలనున
  నిద్దరి వేచితిమి గాద నిగడ జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 68. అఱజాతివాడు, యితరుల
  పరిహాసము చేయువాఁడె; ప్రాజ్ఞుఁడు జగతిన్
  సరసపు పల్కుల జనులను
  పురిగొల్పునటన్ జిలేబి పొత్తుగుడుచుచున్ !

  జిలేబి

  ReplyDelete


 69. మీయక్షరాభరణములు
  మాయెద తాకెన్ జిలేబి మాబోటి జనుల్
  పైయెద సయ్యన పదముల
  వేయండమ్మ పరిమళము వెదజల్లంగన్ !

  జిలేబి

  ReplyDelete


 70. తలలో కొత్త తలంపులు
  మిలమిల గాన తలపోత మిమ్ముల వీడ
  న్నిల పైరగాలిని షికా
  రుల బోవ నయనము గాద రూఢి జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 71. తలుపులు తెరువగ జిగిబిగి
  తలపులు మిలమిల మెరయుచు తరుణము గనుచున్
  కిలకిల యని మది, తలపుల
  హలమున పొలయు కృషిచేయ, హరితవనమగున్ !

  జిలేబి

  ReplyDelete


 72. అదిగో వచ్చిరి గురువులు
  సదనంబందున జిలేబి చక్కర్లకికన్
  పదములు సుష్టుగ గంపెడు
  కుదురును రాజేయగాను కుంపటి సుమ్మీ :)

  జిలేబి
  పరార్ :)
  వెల్కం బెక బెక :)

  ReplyDelete


 73. నేనే మీ పండితుడను
  కానే కానోయ్ జిలేబి, కానీ యిస్తా
  నే నా దగు రీతిన్ మ
  స్తైనట్టి కమింట్ల సూవె స్టైలుగ సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 74. విస్మయ బేలలు దుష్టులు
  కస్మాలంబాయె తెలుగు కంద జిలేబీ !
  తస్మాత్జాగ్రత్త వలయు
  తాస్మాకంగడి సరకని తలచకు సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 75. కుందనపు బొమ్మ పారుని
  విందుకు బిలిచి నమనములివి, గురువుల కనన్
  డెందంబరయగ "యిడియా
  ప్పం", దే నా కిష్ట మనుచు బాపఁడు పలికెన్!

  జిలేబి

  ReplyDelete


 76. అతివిలువైనవి సుమ్మీ
  మితమై నట్టి పదముల అమితమై న తలం
  పు ! తమంగంబున అక్షర
  క్రతువులు జేసితివి సూవె కవనపు పద్మా !

  జిలేబి

  ReplyDelete


 77. దండిగ వలయు జిలేబీ
  మెండుగ మెచ్చెడు చెలంతు మించారు జనుల్!
  కొండెము చెప్పెడు కవులున్
  పండితులు వసింపని ధర పావనము గదా!

  జిలేబి

  ReplyDelete
 78. మన తరం నటుడు శశి కపూర్ వెళ్ళిపోయాడు.

  హిందీ సినిమా డాయన్ పృధ్వీరాజ్ కపూర్ గారి కొడుకుల్లో ఆఖరివాడు, హిందీ సినిమా హీరోనే గాక మర్చంట్-ఐవరీ ఫిలింస్ వారి ఆంగ్లచిత్రాల నటుడు, అందగాడు అయిన శశి కపూర్ స్మృతికి మీరొక పద్యం అయినా సమర్పించలేదే
  Zilebi గారూ ! 🤔

  ReplyDelete
  Replies
  1. మా బ్లాగ్జోతిష్కుల వారి జాతక పరిశీలన కోసం వెయిట్ చేస్తున్నానండి :)

   జిలేబి

   Delete

  2. కాదనడమెందుకు

   శ్రీ శశికపూరుడా! మా
   కాసిని నిదురను జిలేబి గావించావే
   ఓ సరసపు పల్కుల రా
   జా! సినిమాలోక మెల్ల జష్న్ గోల్పోయెన్ !

   जिलेबी

   Delete
  3. Thanks. బ..బ్రాహ్.. లాగా అనిపిస్తున్నప్పటికీ మొత్తానికి మీ పద్యనివాళి బాగుందండీ.

   Delete

  4. బ...బ్రాహ్ అనగా యేమండి ? వికోన గారు ?

   Delete


 79. ఓయి తియతీపి గద కవి
  రాయలకున్ దెలుఁగు; రాదు రసముం గ్రోలన్,
  మీయయ్యరుకున్నైనన్
  నీ యవ్వారముల నోర్చి నిలిచిరి గదవే :)

  జిలేబి

  ReplyDelete


 80. ఏబీసీడీ లన్నా
  సాపాటులకది గదన్న సర్వస్వమమై !
  బాబోయ్యిట్లా యేకే
  స్తే భారతదేశ మెట్ల స్టేప్ఫిట్టన్నా :)

  జిలేబి

  ReplyDelete


 81. ఆ వైకుంఠంబందున
  సేవల గర్వాటుగాను చేసెన్నాపై,
  భావంబు రాక్షసుడవగ
  రావణుడు, ప్రియాత్మజుండు రఘురామునికిన్!

  జిలేబి

  ReplyDelete


 82. త్రిగుణపు నిష్పత్తి రవం
  త గిరగిర గిరయని మారు, తరమగు గుణముల్
  జగణ జిలేబీ మారవు
  జగతి గుణమిది గనవమ్మ చక్కగ సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 83. నండూరివారి నడిగిర
  టండి ! జిలేబులను వేయటమెటుల్? చెప్పే
  రండట వారు జి లేబీ
  లండీ మీకర్థమై వెలయవలె మొదటన్ :)

  జిలేబి

  ReplyDelete


 84. జిలేబీ వారి గానము ఎఫెక్ట్ :)

  వానయు వెలిసె, జిలేబీ
  గానసుధారసముఁ గురిసె, గాడిద లొకటై
  తానము లాడగ నోండ్రిం
  చేనయ వచ్చిన పదుగురు చెల్లచెదురవన్‌ !

  జిలేబి

  ReplyDelete


 85. ఏరాలముగ జిలేబీ
  వీరావేశముల మాని విభుని తలచుచున్
  భూరిగ మధురిమలన్ మన
  సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్!

  జిలేబి

  ReplyDelete


 86. ఆస్ట్రేలియా వారు "ఏకలింగ పెళ్ళి" కి లా ఇవ్వాళే పాస్ చేసేరట :)

  పోరడ! పో! పో పోవే
  నారీ! యాస్ట్రేలియాన ననబోడుల్ నాం
  చారుల, పోరులు పోరల !
  నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ :)

  జిలేబి

  ReplyDelete

 87. గంగ ను చూడగ సీత సంతసము

  రవళించుచు పరుగిడుచుం
  డె,వనములకు తావునిచ్చి, డెందంబరయ
  న్నవనినట,కప్పుటైదువ
  సవతిని గని, సీత మిగుల సంతసమందెన్ !

  కప్పుటైదువ - పార్వతి
  కప్పుటైదువ సవతి = గంగ  జిలేబి

  ReplyDelete


 88. గనుము ! హరిబాబు రచనయ
  ట!నిరంతర భోగయాత్ర! టముకులు గనుమా!
  గొనవే జిలేబి వెనువెం
  ట! నచ్చగన్ మెచ్చుమోయి టాంటాం యనుచున్ :)

  జిలేబి

  ReplyDelete


 89. ఓ సోదరా! కుశలమా !
  రాసాము గదయ్య నాడు రచనల నెన్నో;
  మూసగ వెడలితి మయ్యా
  ఫేసుబుకులకు మన బ్లాగ్లు బేకారవగన్ :)

  జిలేబి

  ReplyDelete


 90. రాసే దేదో బరబర
  రాసేసు కొనుచు జిలేబి రవమై బోవే !
  కూసింత కాలమున నీ
  కే సిగదరగ తల తిరుగు కించితు చదువన్ :)

  జిలేబి

  ReplyDelete


 91. గోతాము లోన కట్టెడు
  భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్,
  చేతము రారండి జిలే
  బీ, తరముగనిప్పుడే విభిన్నపు జోతల్ :)

  జిలేబి

  ReplyDelete


 92. యాడికి బోయిననూ కథ
  గాడిని పడుచు పవనుండి కాడికి వచ్చెన్ :)
  మోడీ భాయ్జర కాస్కో
  మా డంకాజోడుబాబు మస్తు జిలేబీ :)

  జిలేబి

  ReplyDelete


 93. అసమానతలన్నవి యె
  ల్ల సమయ మందున జిలేబి లబ్జుగ వుండెన్ !
  మసకగ యెల్ల సమాజము
  ల సమరముగ శక్తిగాను లబ్జుగ నిలిచెన్ !

  జిలేబి

  ReplyDelete


 94. ఆ మేడంబందడచెను
  రాముఁడు రావణుని; మెచ్చి రాజ్యమ్మొసఁగె
  న్తా ముందే యభయంబని
  శేముషి యై శరణుజొచ్చి చేర దహరుకున్ !

  జిలేబి

  ReplyDelete


 95. అప్రకృతి పలుకులివియౌ
  "విప్రులఁ బూజించిన నపవిత్రులు గారే"
  కప్రపు సాక్షిగ చెప్పితి
  నప్రతి సుమ్మీ జిలేబి నమ్మను వలదే !

  జిలేబి

  ReplyDelete


 96. ఎప్పుడు చూసిన మదిరొద
  చప్పుళ్లేనా జిలేబి! చక్కని చుక్కా !
  రొప్పుచు రోజుడు ధుమధుమ !
  గప్పున విడువుము శుభాంగి కావ్య కుమారీ !

  ReplyDelete


 97. ఉన్నది లేదని ఎవడోయ్
  అన్నది? అడిగిన జిలేబులకుచెప్పుమయా
  హన్నా! ప్రశ్నల వేయట
  మన్నది నా హక్కుసూవె మరిమరి వేతున్ :)

  జిలేబి

  ReplyDelete


 98. https://youtu.be/0GiRZcsg4oQ

  కలమూ గళమూ కోటగ
  వెలసిరి యూట్యూబులోన వెలుగై వారే
  లలితమగు పద్యముల రే
  డు లబ్జుగన్ రాజశేఖరులు గనుమమ్మా !


  చీర్స్
  జిలేబి

  ReplyDelete


 99. ఏరాలమ్మగు నష్టము
  మారణహోమమ్ము కూర్చు మహిలో; శాంతిన్
  ధారాళమ్ముగ కోరన్
  వారావధియై సహనము వచ్చు నరులకున్ !

  జిలేబి

  ReplyDelete


 100. దశావతారాలు-తిరుపతి వేంకటకవులు !

  ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.
  పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు కదా!
  'అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి' అన్నారు.
  దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది.
  సరే! వెంకటశాస్త్రి గారు 'జలచర ఢులి కిరి నరహరి' మొదలుపెట్టారు. ఒక పాదం అయిపోయింది నాలుగవతారాలతో. పృచ్ఛకుడు ఆపాడు. 'ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే'దన్నాడు. 'అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి.. అర్థం చెప్తాము' అంటే, 'అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి' చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’అనుకున్నారు.
  జలచర ఢులి కిరి నరహరి
  కలిత వటు త్రివిధ రామ..
  మూడు రామావతారాల గురించి 'త్రివిధ రామ' అని వచ్చింది. అరే వీళ్ళు దాటేసుకుంటున్నారే అనిపించింది పృచ్ఛకుడికి. జలచరం - మీనావతారం, ఢులి - కూర్మావతారం, కిరి - వరాహావతారం. నరహరి - నృసింహావతారం, నాలుగు అవతారాలను మొదటి పాదంలో పెట్టేశారు. మూడు గణాలలో. రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కలిత వటు, ఆయన ఎవరు? వామనావతారం. త్రివిధ రామః - రామో రామశ్చ రామశ్చ - పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. మూడు రామావతారాలను 'త్రివిధరామ' లో ఇరికించారు. 'అయ్యా! మాట' అన్నాడు పృచ్ఛకుడు, మళ్ళీ చెయ్యెత్తి. 'దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి'. సరే దానికేముందని,
  క. జలచర ఢులి కిరి నరహరి
  కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం
  డిల తిరుపతి వేంకటశా
  స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.

  అదీ వారి పాండిత్యం


  శ్రీ జి జనార్ధన రావు

  ReplyDelete


 101. పెళ్ళామే బెల్లమ్మోయ్
  తల్లీ తండ్రీ జిలేబి యల్లమ్మోయీ
  కొల్లాయివారి కిమ్మా
  జల్లను కమ్మంచుచీర చాందిని కిమ్మా :)

  జిలేబి

  ReplyDelete


 102. చట్మని‌ చెప్పెను పోరడు
  కుట్మలదంతీ ! జిలేబి! గోరిక గల్గెన్,
  తట్మని నచ్చిన చెప్మా !
  కట్మల్లామల బిలిచెద కసమస వలదోయ్ :)

  జిలేబి

  ReplyDelete

 103. కుశలమ్మే సోదరుడా!
  వశమై మళ్లీ జిలేబి వలలో చిక్కా
  కసబిస టపాల మధ్యన
  రసికులు లేకన్ చదువను ; రమ్మా మళ్ళీ :)

  జిలేబి

  ReplyDelete


 104. కిమ్మన కుండు జిలేబీ !
  నెమ్మది లేదనిన చెప్పు నిన్నా వృద్ధా
  శ్రమ్మందుచేర్చె దన్ రా
  రమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్!

  జిలేబి

  ReplyDelete


 105. విక్రమ్ సారా భాయీ
  సక్రమమముగ చదివెనుగ చక్కగ గీతన్ !
  చక్రి పలుకులవ్వి జనుల
  కై క్రియ లన్ శక్తిగాను గావించు సుమీ !

  జిలేబి

  ReplyDelete


 106. తలపోటోయ్ హరి బాబూ !
  వలవల యేడ్వకు జిలేబి పక్కకు రాకోయ్
  కలమును బట్టితి మెండుగ
  యిలలో నిలుపన్ విభుడిని యిమ్ముగ సుమ్మీ !

  జిలేబి

  ReplyDelete


 107. ఇది తెలుగేనా హరిబా
  బదిరిపడెను వెంటనే టపటప‌పదములన్
  కుదురుగ వేసె జిలేబీ !
  ఇది తెలుగేకద? యని యడిగి మురిసె బోవే :)


  జిలేబి

  ReplyDelete


 108. మనిషై పుట్టాక మదిరొ
  ద నరుడ తప్పదు వినుము సదనపు‌ పలుకులన్ !
  కనుకొలకుల కన్నీరుల్
  నిను వీడవికన్ జిలేబి నెమ్మది గనుమా !

  జిలేబి

  ReplyDelete


 109. మీ యక్షరాలు పద్మా
  మాయా మయ లోకమందు మహిమాన్వితమై
  గాయాలను మాన్పుచు మది
  లోయల తాకుచు జిలేబు లొప్పారెన్బో :)

  జిలేబి

  ReplyDelete


 110. కారుణ్యంబొప్పెడు యవ
  నారిన్ మదిలో జిలేబి నమ్ముచు మహిలో
  వారావధిగా మానస
  చోరునిఁ బూజించువారె శుద్ధాత్ము లిలన్!

  జిలేబి

  ReplyDelete


 111. ఇదితెలు గేకద ? కాదా ?
  అదిరెను గాద హరిబాబు యద్దరి కంద
  మ్మదిరెన్ బో! పాదమ్ముగ
  కుదిరెన్ బోవయ్య పలుకు కులుకుచు సుమ్మీ :)

  జిలేబి

  ReplyDelete


 112. పవళముల తలచు మనుజుడు
  చవట కదా! నిన్నుఁ దలప శంకరపత్నీ
  శివమయమైన జగత్తున
  భవబంధమ్ములను మీరి భవితను గనునే !


  జిలేబి

  ReplyDelete


 113. గాయంబయితే నొప్పీ
  సాయంబట్టగ జిలేబి చక్కగ మానున్
  మాయమ్ము చేయు కాలం
  బోయమ్మ యిడుములనెల్ల బో విను మమ్మా !

  జిలేబి

  ReplyDelete


 114. మాయంబవలే మామ సు
  మా!యేమండి టయిపాట? మా సందేహం
  బాయెన్ !మాయామయ జగ
  మాయెను పున్నమి సమయము మహిమాన్వితమై !

  జిలేబి

  ReplyDelete


 115. మిన్నంటెనోయి ప్రేమా!
  పున్నమి దినమయ్యెను; శశి పొడఁగట్టఁడుగా!
  అన్నుల మిన్నగ చేరగ
  కన్నడిని, జిలేబి వేచి కాచెన్ కన్నుల్ !

  జిలేబి

  ReplyDelete


 116. శాశ్వతుడను నేనోయీ
  విశ్వంబెల్లన్ జిలేబి విరివిగ నేనే !
  ఆశ్వాసకుడన్నేనే
  ఆశ్వాసితుడను పదపడి అరయన్నేనే !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. అవును,ఉన్నాను!అప్పుడూ ఉన్నాను,ఇప్పుడూ ఉన్నాను,ఎప్పుడూ ఉంటాను - నేను శాశ్వతుణ్ణి!

   Delete


  2. ఉన్నా నప్పుడు నిపుడూ
   వున్నా ! నెల్లెప్పుడున్ను వుంటా నోయీ
   కన్నడి కాలపు వాణ్ణీ
   మిన్నగ శాశ్వతుడను మిరు మిట్లుగొలిపిదెన్ !

   జిలేబి

   Delete


 117. ప్రతిమదికీ ఓ కథగల
  దు! తిరగతోడ కథమారదు జిలేబీ ! జీ
  విత మంటే కష్ట సుఖము
  లు తిరముగ వెలయు గదా! పలుకుల కొలికియా !

  జిలేబి

  ReplyDelete


 118. దీనపు బతుకుల కాలము
  లోన సమయమునకు తగని లొగ్గడి గానన్
  మీనకుమారి! యకాలపు
  వానలు రైతులకు దుఃఖభాజనము లగున్!

  జిలేబి

  ReplyDelete


 119. మీరూ నాలాగేనా?
  తారల విషయంబులోన దవ్వుల వీక్షిం
  చే రక మకో ? సుజను లా
  రా! రాపిడి పెరుగ గాను రావ(బ)డి పెరుగున్ :)

  జిలేబి

  ReplyDelete


 120. మొదటెక్కడన్నెవరితో
  మొదలెట్టారో జిలేబి ముద్దుగ చెప్పెన్
  గద భారతకర్త భళా
  సదనంబందున మరువగ చదివెడి జనులున్ :)

  జిలేబి

  ReplyDelete


 121. మీ పూరణ బాగున్నది
  కైపద శంకరు పలుకుల కందము పలుకున్
  తా పర్యవేక్షకుండై
  సౌపానముల వెలయించె ఛందంబునకున్ !

  జిలేబి

  ReplyDelete


 122. చెప్పారండి భళిభళీ !
  చప్పున కోపము గలుంగు చక్కగ నాకౌ
  టప్పున మోసము బోయా
  నిప్పుడెటులన ! మగవాడి నిమ్మళమేదీ ?

  జిలేబి

  ReplyDelete
 123. అనుష్క శర్మ - విరాట్ కొహ్లీ ల పెళ్ళయినట్లుందిగా జిలేబి గారూ. హమ్మయ్య, ఇక శాంతి. వీళ్ళిద్దరి ప్రేమకథ, చెట్టాపట్టాలేసుకుని దేశదేశాల్లో కనిపించారనే వార్తలు, ప్రణయకలహాలు వచ్చాయా అంటూ ఊహాగానాలు, వీళ్ళ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు - వగైరా "ముఖ్యమైన" కబుర్లు పేపర్లలోను టీవీమీద ఇంతకాలం చూసిచూసి తరించిపోయాం.

  ReplyDelete


 124. కమ్మనిది పదపడి కాగబెట్టిన కారు,
  రమ్ముఁ, గ్రోల జబ్బు రాదు దరికి,
  నమ్మ దగు జిలేబి నాటి పెద్దల మాట
  లమ్మ పట్టు గొమ్మ లవియె ససికి !

  జిలేబి

  ReplyDelete


 125. ఇమ్ము గన్ జపమ్ము యీశుని యక్షస
  రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి,
  వమ్ము కాని దమ్మ వరమగు నమనము
  సొమ్ము లవియె మనకు సొబగు గూడ!

  జిలేబి

  ReplyDelete


 126. చోద్యంబగు పదములకు
  న్నద్యతనీయ పదములకు నర్థము తెలుపన్ :)
  పద్య కుసుమమ్ము లకు మీ
  వుద్యానవనమున కేల రుసుము జిలేబీ :)

  నమో నమః :)

  జిలేబి

  ReplyDelete


 127. తామరతూపరి పని తీ
  రే మరి వేరు! తమకంబు రేకెత్తింప
  న్నీమము వీడగ జనులా
  రా! ముని భార్యలకు నింద రానే వచ్చెన్!

  తామరతూపరి - మన్మథుడు

  జిలేబి

  ReplyDelete
 128. అనుష్క శర్మ - విరాట్ కొహ్లీ ల పెళ్ళయినట్లుందిగా జిలేబి గారూ. హమ్మయ్య, ఇక మనకి శాంతి. వీళ్ళిద్దరి ప్రేమకథ, చెట్టాపట్టాలేసుకుని దేశదేశాల్లో కనిపించారనే వార్తలు, ప్రణయకలహాలు వచ్చాయా అంటూ ఊహాగానాలు, వీళ్ళ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు - వగైరా "ముఖ్యమైన" కబుర్లు పేపర్లలోను టీవీమీద ఇంతకాలం చూసిచూసి తరించిపోయాం.

  ReplyDelete
  Replies


  1. అరె!ఇటలీ లో పెళ్ళట!
   విరూష్క దంపతులయిరట! విన్నార జిలే
   బి? రసమలాయివలె మజ క
   త రంజుగా విన్నకోట తరమై తెలిసెన్ :)

   జిలేబి

   Delete


 129. వృత్తపు చుట్టుకొలతకున్
  వృత్తపు వైశాల్యమునకు బృందారముగన్
  చిత్తపు కైపు జిలేబియు
  కొత్తగ యనుబంధము కనుగొనె హరి బాబూ :)

  జిలేబి

  ReplyDelete


 130. వీటిని కూడా కందము
  లో టాంటామని జిలేబు లొప్పారించన్
  లే! టక టక లాడించుచు
  మాటా మంతీ కలుపుము మహిలో సుదతీ :)

  జిలేబి

  ReplyDelete


 131. మనదేనోయ్ భువి లో ప్రే
  మనగ! రహస్యార్థములను మన్నిక గానన్
  మనమంతా కలిసి తెనుగు
  న నలుగురి కొరకు వెలయిచి నాము లలితమై !


  మరో జిలేబీ తయార్ :)


  జిలేబి

  ReplyDelete


 132. మనలాటి వారెవరు గల
  రు? నమ్ము డయ్య జనులార! రూఢిగ మనమే
  మనకున్ సాటి! జిలేబీ
  వినుమా విదురుల పలుకులు విభుడే హరి ఓం :)

  జిలేబి

  ReplyDelete


 133. గలరే లోకము లోనన్
  జిలేబి మాలాటి వారు ! చిక్కుల పడెనో
  యిలలో గురుండు యెవరికి
  తెలియున్ ! రాబోవు జవ్రి తెరగు గనదగున్ !

  జిలేబి

  ReplyDelete


 134. మొన్నటి నుండీ చూస్తు
  న్నాన్నండీ కవివరా! మన సదనమందున్
  పున్నమియే కైపదమై
  వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్ :)

  జిలేబి

  ReplyDelete


 135. మూన్నాళ్ళుగ వింజామర
  వెన్నెలయే! చెలి,తనువును వెచ్చఁగఁ జేసెన్!
  విన్నానమ్మ యనూష్కా !
  వెన్నంటి విరాటు కొహిలి వేడిమి యటనే :)


  ಜಿಲೇಬಿ

  ReplyDelete


 136. బాలా కుమారి వినుమా
  ఏలూరున నుండువార లెల్లరు కవులే
  మా లావుగ చెప్పెదర
  మ్మా లక్షణముగ కవితల మాటల కైపున్ :)

  జిలేబి

  ReplyDelete


 137. పొగడాకు తేనియలతో
  జిగిబిగి పొదరిండ్ల గూర్చి జిగదేరగనన్,
  పగడము రతనమ్ములతో
  గగన గతుల తో జిలేబి గావింపదగున్ !

  జిలేబి

  ReplyDelete


 138. కద‌నము జిలేబి ఛందము,
  కుదురునె యిష్టమగు చాళి గూర్చన్! గానన్
  సదనమున వ్యావహారిక
  పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్ !

  జిలేబి

  ReplyDelete


 139. పదుగురు మెచ్చవలెన్ కై
  పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
  పదపడి పరుగెత్తవలెన్
  హృదయస్పందనల రవళి హృత్సారమ్మై !

  జిలేబి

  ReplyDelete


 140. హృదయపు కుహురము తెరచుచు
  పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
  పదుగురి గుండియలన్ తా
  కి దుముకవలె గంగవలె సఖి కవన మదియే!

  జిలేబి

  ReplyDelete


 141. పదరకు! యీ పదముల వలె
  పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
  పదపద పో యనని గురువు
  లు!దంగవకు! కుదురుగన్ తెలుపు కందివరుల్

  ReplyDelete


 142. ఔరా! జీపీయెస్! మా
  పై రయ్యన కందమొకటి పరుగెత్తించా
  రే!రామ రామ! వేయుము
  వారికి కందంబొకటి గబగబ జిలేబీ :)
  జిలేబి

  ReplyDelete


 143. చాలా సంతోషం సార్ !
  మీ లీవు సమయములోన మీ యనుమడ నే
  వాలంబిప్పెద నయ్యా
  జాలము లోనన్ జిలేబి సాయము గానన్ :)

  జిలేబి

  ReplyDelete


 144. కలిగె మన్నన గద తెల గాణ మందు
  తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగు! నె
  వముల కిక తావు లేదు! సభాస్థలిగ ర
  బీంద్ర భవనము సయి జిలేబీయమయ్యె !


  జిలేబి

  ReplyDelete


 145. మీరధ్యాపకులాండీ ?
  వారెవ్వా! యేమి తిట్టు వాయింపండీ !
  ఊరక బోవున, నాతడు
  మారక బోవున గురువ! నమనము నమనముల్ :)

  జిలేబి

  ReplyDelete


 146. సారస్వతసభ లోనన్
  పారించెన్ పద్యములను ఫాలాక్షుండ
  య్యా! రా మశర్మ కున్ స
  త్కారము ఘనముగ జిలేబి గావించెనయా !

  జిలేబి

  ReplyDelete


 147. రోసము మగరాయలకున్
  మీసములే, సొబగుఁ గూర్చు మెలఁతల కెల్లన్
  కైశిక మందున పుష్పము
  లే! సింగారీ జిలేబి లెస్సగ గనుమా !


  జిలేబి

  ReplyDelete


 148. కనుగొనె ఫిబొనే సీకిన్
  మన జ్యోతిర్లింగములకు మనవాడోయ్ లిం
  కును భళిభళి యనుచున్ సూ
  వె! నూతన విషయముగ గలవే చదువనహో !

  జిలేబి

  ReplyDelete


 149. నుడువన్ జిలేబి గురువులు
  పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్
  వడవడ వణుకుచు చలిలో
  వడకుమలన్ యోగరాజు వరమై నేడే !

  జిలేబి

  ReplyDelete


 150. వడివడి ప్రభాక రుండొ
  చ్చి డిగనురుకులన్ జిలేబి చేర్చగ కందం
  బు ఢమ ఢమ శబ్ధములతో
  పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్!


  జిలేబి

  ReplyDelete


 151. ప్రతి మాటలో తెలంగా
  ణ తీరుగన్నాటలాడె నౌరా యనగన్
  స్తుతమాయెన్ పాటలతో
  డ తెలుగు పూబాట కోడెరౌతు జిలేబీ !


  జిలేబి

  ReplyDelete


 152. ఆంధ్ర భారతమును రసమయ తెలుగున
  నన్నయ రచించెఁ! గావ్యముఁ గన్నడమున,
  నారణప్ప రచించెను; నాటి కథలు
  మేటిగ నిలిచెను జిలేబి మెచ్చుకొనుమ!

  జిలేబి

  ReplyDelete


 153. కమనీయం గణనీయం
  రమణీయం పూరణమ్ము రసికుల హృదయ
  మ్ము మరిమరి తాకెనయ్యా !
  సుమధుర కైపద జిగేలు సుమమై వెలసెన్ !

  జిలేబి

  ReplyDelete


 154. ఆటగదరా శివాయని
  పాటల పూబాట వేసె ఫాలాక్షునికిన్
  మాటల భరణి జిలేబీ
  కోటల గట్టెన్ భళిభళి కోకనదునికిన్ !

  జిలేబి

  ReplyDelete


 155. బమ్మెర పోతన ప్రాంగ
  ణమ్మందున కల్వకుంట నమనము లిడెనో
  యమ్మ గురో యనుచు! జిలే
  బమ్మా ! తెలగాణ రాజు భళి చంద్రుండే !

  జిలేబి

  ReplyDelete


 156. కమలనయనుండగు నలుడు
  దమయంతినిఁ బెండ్లియాడె; ధర్మసుతుఁ డొగిన్
  కమలముఖి ద్రౌపదిని పెం
  డ్లముగ బడసెగద జనని దురాయిగ సుదతీ !


  ಜಿಲೇಬಿ

  ReplyDelete


 157. ఎద తాకే గాలులకే
  సదా ఖుషిన్ పొందితే రసమయంబెట్లౌ
  యెద గిల్లించుకొను గబగ
  బ దండిగ ఫిదా యవన్ జబర్దస్తీగన్ :)

  జిలేబి

  ReplyDelete


 158. గుడి యనంగ భయము గుంగిలి యౌ చేత
  బడి యనంగఁ బ్రజలు భయపడుదురు,
  వదల రమ్మ భయము వంకర టింకర
  బతుకనగ జిలేబి‌ భయము భయము !

  జిలేబి

  ReplyDelete


 159. ఔత్సాహకరము గా లే!
  వాత్సల్యము బోవ, బ్లాగు వదిలిరి విదురుల్
  కత్సవరముపై బరువున్
  తాత్సారము జేయక భళి తప్పించెరకో !


  జిలేబి

  ReplyDelete


 160. సూరీడమ్మా సూరీ
  డూ! రయ్య న కనుమరుగయె రుధిరపు రంగున్
  పారించి జిలేబీయం
  బై!రా రండీ గనండి బై బై ఫార్ నౌ :)

  జిలేబి

  ReplyDelete


 161. అలుక వలదయ కవి ! యమ్మహనీయుడు
  తెలుఁగుఁ జదువువారు దేహి యన, రె
  పరెప మనుచు వెతలు పడనీయకన్ జేసె
  భళి తెలుగు మహా సభ నెఱ వేర్చి!

  జిలేబి

  ReplyDelete


 162. లేపుకు పోవయ్య మగడ
  చాపితి కరముల జిలే‌బి జాణన్ నేనే
  నోపక బోతి నయా నీ
  జ్ఞాపక మే తూగులాడె చానా చానా :)

  జిలేబి

  ReplyDelete


 163. నే బతుకులో ప్రవాసుడ!
  నా బాలాగున స్వదేశి నరుడ నరసరా
  యా! భారతి దయ రాసితి
  నే పట్టుగనుచు టపాల నెమ్మది గానన్ :)

  జిలేబి

  ReplyDelete


 164. జిమ్మడ కథ నీకేలా
  గమ్మని పోవయ్య బాబు గప్ చుప్ యనుచున్
  జుమ్మనెదరు మాయయ్యరు
  కమ్మని ఆసామి వారు కందము వోలెన్ :)


  జిలేబి

  ReplyDelete


 165. పిచ్చాపాటి కబురులివి
  కచ్చా నోట్సులను చేర్చి కట్టితిని టపా!
  బుజ్జబ్బాయీ బైబిలు
  సొచ్చెము చదువుమయ రెడ్డి సొగసుల్లబ్బున్ :)

  జిలేబి

  ReplyDelete


 166. వేడి వేడి గాను వేయనిడ్డలియు, సాం
  బారనంగ మురిసె బాపనయ్య,
  ఔర! పొద్దు పొడిచె ! అయ్యరు హోటలు
  లోన భళి జిలేబులూరెఁ జూవె !


  జిలేబి

  ReplyDelete


 167. వారిజ నేత్రి! జిలేబీ !
  పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా!
  జోరుగ సమ్మార్జనియే
  వీరవనితల దళపమ్ము వినవే బాలా!

  జిలేబి

  ReplyDelete


 168. హేరాలమ్ముగ తిట్టుచు
  ధారాళమ్ముగ తెగడుచు ధణధణల జిలే
  బీ, రాద్ధాంతము చేయుము
  పో! రాటముఁ జేయ శస్త్రముల పని యేలా!


  రాటము - రంపు, రచ్చ

  జిలేబి

  ReplyDelete


 169. బానగిలె రైతు సావుకు
  వానలు లేకుండ; మెట్ట వరి ఫలియించె
  న్నేనాడైన జిలేబీ ?
  చాన దినములాయెనమ్మ జల్లుల జూడన్ !

  జిలేబి

  ReplyDelete
 170. చందన చర్చిత కార్మొగి
  లందపు మేనిగలవాడు లక్ష్మీపతియే !
  సుందర వదనము భాసిలు!
  వందన మే రీతి నిడుదు వనమాలి! నమో !  భాసిలు వసతిగ శ్రీనిల
  యే! సుమమొప్పారు ముఖమయే! యవనారీ,
  శ్రీసుమ చందన చర్చిత
  మే సంహతి! లలితకుసుమ మే రీతి, నమో !  శ్రీలక్ష్మీనిలయే! సుమాంజలి! నమో! శ్రీవల్లభా! వేంకటే
  శా!లంకారి!అనంత!భాసిలు వనేశా!శ్యామ! కంసారి! గో
  పాలా!చందనచర్చితాంగ కపిలా! పర్జన్య! నక్షత్ర నే
  మీ!లావణ్యము నీది గాద నమనమ్మేరీతి నిత్తున్నకో !  జిలేబి

  ReplyDelete


 171. అల్లన మెల్లన మన్మధు
  జల్లన బాణమును వేయ జానకి రాము
  న్నుల్లము పొంగె జిలేబీ,
  విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే!

  జిలేబి

  ReplyDelete


 172. జల్లనె మహీజ యుల్లము
  నల్లని వాడట ధనువున నారిని మీటన్ !
  విల్లది జిలేబి పుండ్రపు
  విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే!

  జిలేబి

  ReplyDelete


 173. ఆర్యా! అయ్యరు గారూ,
  భార్యను సేవించునట్టి భర్త తరించున్,
  సూర్యుడట పొద్దు పొడిచెను
  కార్యములమొదలెడ కప్పు కాఫీ తెండూ :)

  జిలేబి

  పై జిలేబీయానికి జీపీయెస్ వారి పేరడి :)  ఆర్యా! అయ్యరు గారూ,
  భార్యను సేవించునట్టి భర్త తరించున్,
  సూర్యుడట ప్రొద్దు గ్రుంకెను
  కార్యములను కట్టిపెట్టి కంచము తెండూ :)

  జీపీయెస్

  ReplyDelete
  Replies
  1. ఆర్యా ! అయ్యరు గారూ !
   ధైర్యముగా కఱ్ఱ తెండు తడవ తడవకున్
   శౌర్యము జూపించుడు మరి
   భార్యను సేవించు నట్టి భర్త తరించున్

   Delete
  2. ఆర్యా ! అయ్యరు వర్యా ! సర్వే పతి సుఖభవంతు,
   భార్యే మరి దిక్కు, బతుకు, పర్యాణము* తాను గనుక,
   పర్యాయము లేని సొదకు, తూర్యమ్మౌ* సొంపు తుదకు,
   మర్యాదకు, మనుకువకు మనకు, నిర్యాతిది* నిజము కధా!

   *పర్యాణము : లంగరు
   *తూర్యము : వాద్యపు మ్రోత, a sweet-toned bugle trumpet
   *నిర్యాతి : ప్రస్థానం

   :) jk / jf ...

   Delete


  3. :)

   సర్వే పతి :)   జిలేబి

   Delete
  4. సర్వే జనాః
   సర్వే పతీ:
   :) Jf ...

   Delete


 174. పర్యనుయోగము బొందడు
  భార్యను సేవించునట్టి భర్త, తరించు
  న్నీర్యము గూడన్ జీవన
  పర్యంతమ్మాతడౌ సఫలతను గనుచున్ !

  ಜಿಲೇಬಿ

  ReplyDelete


 175. ఆకాశంబున తిరిగెడు
  కాకవెలుగు చలువ వార కాల తిథులనన్
  ఓ కాలాంతకుడా! యే
  యేకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్?

  జిలేబి

  ReplyDelete


 176. ప్రభువా! నీ కరముల నే
  త్రిభువన మందు జతగాంచి తిరముగ నాడన్
  తుభముగ నీ వెనువెంట స
  రి భాగ్యమున్ గాన నొక పరి కరుణ గనుమా!

  ఆమెన్
  పరిశుద్ధాత్మానంతరంగ
  జిలేబి

  ReplyDelete


 177. చుమ్మా చుమ్మా యనుచున్
  జుమ్మంచున్నాట్యమాడు సుందరిని గనన్
  రమ్మా! జిలేబి బామ్మా
  అమ్మా యని పిలువగానె యాగ్రహమందెన్:)

  జిలేబి

  ReplyDelete


 178. కృతహస్తనుడయ్యరు మూ
  ల తత్వము నెరిగినవాడు లక్షణముగ వం
  ట తనదగు రీతి చిత్తము
  న తరించుచు చేయువాడు నమ్ముము స్వాతీ !


  బత్తళిగ మూల మయ్యరు
  వత్తాసుపలుకుల నేను హస్తము కలుపన్
  చిత్తపు కైపుల్ స్వాతీ
  మెత్తని సున్నుండలున్ను మేల్మి జిలేబీల్!

  జిలేబి

  ReplyDelete


 179. హ్యాపీ న్యూయియ రాండీ ?
  కౌపీనపు పండగండి కాదిది మనదీ
  టాపుల్లేపెదరండీ
  కోపుల పై మోత నిచ్చి కొట్టుచు జనులున్ :)

  జిలేబి

  ReplyDelete


 180. కొపురు గాననెల్లరు వచ్చె కొత్త గాను
  తరుణ మమ్మ జిలేబి! యిత్తరుణ మందు
  సాధనల జేయ సఫలత సాధ్యమై వె
  లుగును సంతోషపు దినములు యతనపడు !


  నూతన వత్సర శుభాకాంక్షలతో

  జిలేబి

  ReplyDelete


 181. నేటి మాట:)


  కొట్టు డయ్య సాలిదియేను కొత్త దన్న,
  తన్ని తరుముడు జనుల మొత్తముగ, తెలుగు
  జనుల కేల ఫిరంగీల సాలయ, జను
  లు కొనియాడ యుగాది పలుగు గలదయ !


  జిలేబి

  ReplyDelete


 182. అర్భకులగాచు వాడే
  ఆర్భాటమ్ములను జేయ నడచుచు మన యం
  తర్భూతమ్మై వెలయుచు
  దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే!

  జిలేబి

  ReplyDelete


 183. గురవయ్యా!హరి బాబూ!
  పరమ పురుషుడా! టపాల పాటవము లనన్
  వరమై నావయ బాలా
  గు రాజ! యభిమాని నయ్య గురువా గురువా :)

  జిలేబి

  ReplyDelete