Saturday, November 18, 2017

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా-డబ్బైయ వ వడి లో నా ఆలోచనలు



నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా ..
సరదా పడితే వద్దంటానా
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ
నీ కోరిక చూపే .. నను తొందర చేసే
నా వళ్ళంతా ఊపేస్తూ ఉంది నాలో ఏదో కోర్కే !
ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
నీ కధలే విందీ .. నువు కావాలందీ
నా మాటేదీ వినకుండా ఉంది నీకూ నాకే జోడందీ !

ఈ పాటండీ నా ముప్పై ఏళ్ల ప్రాయం లో నండి కన్నదండి, విన్నదండి ఆయ్ !
కానండీ, ఇప్పుడో డబ్బై పైబడి వయసొచ్చేసినాదండి
కాళ్ళు కాట్ వదల నంటోందండీ కాట్ వదిలితే  కాట్ కి ఐ చేరే చోటికే కాబట్టి నో నో అంటోందండి ఆయ్ !
ఆ జుజుబి ప్రాయం లో విన్న పాటండీ, చిత్రమండి మరో చరిత్ర దాని దర్శకుడు బాలచందర్ బాల్చీ తన్నేసే రండీ ఆ మధ్యే, మరో చరిత్ర పైన ఇంద్ర లోకం లో రాసేసు కుందామని వెళ్లి పోయే డండి.
అంతకు మునుపే రాసినాయనా  ఆత్రేయ (కిలంబి వెంకట నరసింహాచార్యులు) అండి, ఆ చిత్రం తరువాయి దశకం లో విష్ణు సేవ కై వైకుంఠం వెళ్ళి పోయే  రండి ; అంటే ఓ ముప్పై దరిదాపుల్లో సంవత్సారా లై పోయే నండి ఆయ్ 
అదే చిత్రం లో నాయకి సరిత అండి ఈ మధ్యే త్సునామీ అక్క గా సిలోన్ సినెమా లో  కనిపించిందండి
ఆ చిత్రం నాయకుడండి, 'తమిళ నాట రాజకీయ ప్రక్షాళనం' కోసం ఈ మధ్య నడుము కట్టేడండి,
అంటే పురచ్చి తలైవి బాల్చీ కట్టేసే కండి,
కళ్ళజోడు ఆసామి బాల్చి కోసం చూస్తున్న తరుణం లోనండి,
అదేదో సినిమా హీరోయిన్ల నడుమును కట్టేసు కున్నంత సుళువు అనుకుంటూ !
అంతంత ఎం జీ ఆర్ కూడా కట్టేసు కో లేంది, కట్టేసు కుని ఫ్లాప్ అయి పోయిన శివాజీ గణేశన్ కట్టేసు కో లేనిది, తా కట్టు కో లేనా అనుకుంటూ .
ఆయ్ దారి తప్పినట్టున్నా కదండి 'సావాస కష్టే ఫలి ' దోషమండి :) 
సరే ఈ పాట ని ఓ మోస్తరు డబ్బై పై బడి వయసు లో మనమూ రివ్యూ చేసి పారేద్దా మని చదివే నండీ !
అయ్య బాబోయ్ ! ఎంత వేదాంత మండీ ఆత్రేయ కలం లో అనిపించిందండి ; అందుకే నండి టపా కట్టేసే నండి (ఇందులో పన్నేమి లేదండి :))
మా వెంకన్న అంటున్నాడండి
"
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా"
నేనే నండి గమనించ లే ! స్వామి వారిని అడుగు తామే  ఉండాము  కాని వారూ ఏనాడైనా లేదన్నా నా  అంటూ ఉబ్బెస్తున్నారే  కానీండి  , తనని రా రా నాతో అని ఎప్పుడు పిలవనే లేదండి ; అయ్యో అయ్యో అని అయిపోయినాదండి మనసు :)
ఉబ్బెసే సాముల్నే గమనిస్తున్నాం కానీండి, దరి నీవుండ రా కొండల రాయని పిలవటం లేదని పించి నాదండి
నీ ముద్దూ ముచ్చట కాదంటానా ..
సరదా పడితే వద్దంటానా  అంటూ సామి కూడా దోబూచు లాడ తానే ఉండాడండి :)
కాట్ ఐ కాలం లో "నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ" అనుకుంటున్నామండి ఆయ్ !
మా అయ్యర్ గారే మో నండి , ఏడు కొండల వాడా " నీ కధలే విందీ .. నువు కావాలందీ
నా మాటేదీ వినకుండా ఉంది నీకూ నాకేమీ  జోడంటని అడుగు తోందని" వాపోతున్నారండి
అదండీ కథ !

ఆఖర్నండి ,
నీ కోరిక చూపే .. నను తొందర చేసే
నా వళ్ళంతా ఊపేస్తూ ఉంది నాలో ఏదో కోర్కే !
కోరికలేవీ ఉండ కూడదటండి , కానీ కొండల రాయని చేరే ఒక్క కోరిక మాత్రం ఓకే అన్నారండి ; అందుకే సామీ , "ఎన్కటి" సామీ, నీ కోరిక చూపె , నను తొందర చేసే అనుకోవచ్చండి  అని అనుకుంటున్నానండి 

మీరేమంటారండి ?
చీర్స్
జిలేబి 

12 comments:

  1. తల్లీ! ఈ పాట వయసు పిలిచింది సినిమాలోది!!ఎక్కడెక్కడి బ్లాగు కంటెంటునీ ఎత్తుకొచ్చేసి ప్యారడీ చేసే హడావిడిలో ఎవరూ పట్టుకోలేరనుకున్నావు - ఆయ్!అమ్మ!డమ్మ డక్క డాయి!

    ReplyDelete
    Replies


    1. హతోస్మి :)

      మధ్యలో ఈ సినిమా పేరు కూడా గందర గోళమైపోయిందన్నమాట ;)

      మొత్తం మీద వయసు పిలిచిందంటే పిలవదు మరి కాట్ ఐ కి కాళ్లు పోతోందాయె :)

      అన్నీ కొండాట్టమ్మే !

      జిలేబి

      Delete
    2. అమ్మడి పేరు కూడా తప్పే:) అక్కడ హొయలు ఒలకబోసింది నల్లని సరిత కాదు తెల్లని సుప్రియ:-)

      Delete

    3. డబల్ గయోస్మి :)

      ఇంకా ?

      జిలేబి

      Delete
    4. సుప్రియ కాదు శ్రీప్రియ.

      Delete

    5. ట్రిపల్ డమాలు :)

      హై చక్కా :) హరిబాబు కూడా డమా డక్కా :)

      ఇంకా ?

      జిలేబి

      Delete
    6. జాటర్ ఢమాల్!
      అవును!నేనూ తప్పులో కాలేశా:-)
      నేనే నా బుచికి పనిని చెప్పేద్దామనుకున్నా:-(
      లలిత గారి మీద బోల్డు ఖోపం వొచ్చేసింది!
      అందికే జాటర్ ఢమాల్ అన్నా!

      Delete
  2. ఆత్రేయ గారు 'కాట్ ఐ' కి కాళ్ళు చాపుకొనికూడా ఇంతకంటే romantic పాటలు రాసేరండీ..ఆయ్..ఆయన మనసు ని ముది వయసు పిలవలేదండీ..కన్నె వయసు మాత్రమే ఆయన మనసుని పిలిచేదండీ..కొన్నేళ్ళ తరువాత నేను కూడా టపా కట్టే ముందు ఇలాంటి టపా లే టప టపా రాస్తానేమోనండీ.. .ఆయ్..ఇంతకీ నే సెప్పొచ్చేదేటంటే....ఆత్రేయ శరీరం పోయినా, ఆయన మనసు మాత్రం చానా చానా యేళ్ళ వరకూ ఇలా అక్షరాల రూపం లో, బైట్స్ రూపం లో, qubits రూపం లో , audio/video ల రూపం లో బతికేస్తూనే ఉంటుందండీ..

    ReplyDelete
  3. నళినీ నయనే!కదళీ
    వళినే!అళగే!అళేన వలయిత దళినే!
    పళనీ మహిళే!కలహిత
    పళితే!రళితే!భళీ!సఫల తను విదళే!

    Zilebi,can you decode?

    ReplyDelete
    Replies

    1. పండితమ్మన్యులకే అర్థమవుతుందండి :)

      మేము పండితపుత్రికలం :) కాబట్టి కోడింగు డీకోడింగు తెలియ దండి :)


      జిలేబి

      Delete

    2. పండితమ్మన్య శ్రీమాన్ హరిబాబు ఉవాచ

      .నళినీ నయనే = one who has lotus eyes
      2.కదళీ వళినే = one who has banana palm thighs(వళి means many and కదళీ is banana and It is the only part of a woman suitablee to be compared wirh the tree)
      3.అళగే = one who is beautiful
      4.అళేన వలయిత దళినే = one who had petals which were surrounded by many butterflies
      5.పళనీ మహిళే = favorite woman of palani subramanya
      6.కలహిత పళితే = one who was experienced in romantic quarrrels(palita is white hair and We can took La and la s similar)
      7.రళితే = one who talks too much and makes the surroundings vibrating.
      8.భళీ = oh!
      9.సఫల తను విదళే = one who was so much tired and successfull in her work (vidala means torn out petals)

      The meaning of each and every adjective is double take on both immortal jaganmaata and
      mortal household woman!

      పద్యాలు రాసుకుని
      భాష్యాలు చెప్పుకొనదగు
      వినదగు నెవ్వరు చెప్పిన :)


      చీర్స్
      జిలేబి

      Delete
    3. "కోడింగు డీకోడింగు తెలియ దండి :)"
      తెలియదండీ అంటూనే చిత్రవిచిత్రాలు చేస్తారు..
      మీరు రాసినవి చదివి ఢమాల్ ఢమాల్ :)

      Delete