Wednesday, December 29, 2010

మాలతి పెళ్లి

మాలతి పెళ్లీడుకి వచ్చింది.

తల్లి -లెక్ఖ ప్రకారం అమ్మాయి పెళ్లి వేగిరం అయి పోవాలి. ఏదో ఒక అయ్యా చేతిలో దాన్ని పెడితే - దాని జీవితం సాగి పోయినట్టే లేక్కః.

అయ్య కి కూడా ఆత్రుత గా వుంది. అమ్మాయి పెళ్లి ఎంత బిరీనగా అయి పొతే అంత మంచిది. ఏళ్ళు పై బడే కొద్దికి అమ్మాయి పెళ్లి తను చెయ్యాలనుకున్నా అయ్యే కర్చులు తనని చెయ్య నివ్వ్వవు

సో, అమ్మాయి పెళ్లి వెంటనే అయి పోవాలి.

' అయ్యా నే పై చదవులకి వెళ్తా అన్నది మాలతి. అమ్మ గుండె బరువయ్యింది. ఈ కాలం పిల్లలో ఇది ఎదురు చూసిందే - కాని తన మాలతి కూడా ఇలా అంటే అమ్మ ' పిచ్చి పిల్లా పై చదువులకి వెళ్లి ఏమ్చేస్తావే. పెళ్లి చేసేసుకో అంది. మాలతి పట్టు బట్టింది. గవర్నమెంటు చదువు చెప్పిస్త నన్నది అంది మాలతి అయ్యతో .

'ఎన్నేళ్ళు ?'

ఓ పాటి నాలుగు అంతే అంది మాలతి.

అయ్య నిట్టూర్చాడు. ఖర్చుల లెక్క ఊహించుకున్నాడు. ' గవర్నమెంటు ఇస్తాది లే అయ్యా' అంది మాలతి

నాలుగు ఏళ్ళు తిరిగాయి. అమ్మాయి పట్నం లో ఇంజనీరింగ్ ముగించింది.

అమ్మాయ్ - ఇప్పుడు చేసేసుకోవే పెళ్లి అంది అమ్మ

'నాకు స్కాలర్షిప్ వచ్చింది అయ్యా' అంది మాలతి ' పై చదువులకి అమెరికా వెళ్తా అన్నది.

'దాని కేమి లే తల్లీ - ఆ పెళ్లి చేసేసుకుని వెళ్ళు ' అంది అమ్మ.

మాలతి నవ్వింది. అయ్య ఏమి జేప్పలేక పోయాడు.

ఎన్నేళ్ళు?

ఓ పాటి నాలుగు అంతే అంది మాలతి.

ఏళ్ళు తిరిగాయి. అమ్మి పై చదువులు అయింది. ఆ పై చదువులకి వెళ్తా అన్నది మళ్ళీ -

ఈ పారైన పెళ్లి చేసుకో అంది అమ్మ. అమ్మ తల నెరవడం గమనించింది మాలతి.

'లేదే - పై చదువులకి అక్కడే ఒప్పుకున్నా' అంది మాలతి ముభావంగా.

ఇంకా ఏమి పై చదువులే అమ్మీఇట్లా చదువుతూ పొతే - నీకు మొగుడు చిక్కాలంటే - నీకన్న పై చదువులు చదివినాడు కావాలి కాదే మరీ? అంది తల్లి.
అయ్యా నువ్వైనా చెప్పు అంది అమ్మ .

ఎన్నేళ్ళు ? అడిగాడు అయ్య.

ఇది పై చదువులు అయ్య- రిసెర్చ్ తో బాటు - ఫెలోషిప్ అంది మాలతి.
మాలతి చెప్పింది తనకి అర్థమైనట్టు తలూపాడు అయ్య.

ఇట్లా జరిగే నాలుగేళ్ల ప్రహసనం లో - ఓ మారు మాలతి తీరిగ్గా ఓ రోజు అద్దం ముందు నిలబడి ఉంటె - ధగ ధగ మెరిసే నెరిసిన తల వెంట్రుక గమనించింది. ఓ మారు ఆలోచింది తన కి ఎన్ని ఏళ్ళు? అని - దాదాపు యాభై పైనే ఉండవచ్చు అనుకుంది.

ఆ రోజు - తనతో బాటు తీరిగ్గా రిసెర్చ్ చేస్తున్న జోసెఫ్ - తనకి ఓ అరవై ఏళ్ళు ఉండవచ్చేమో - తో ' మనమిద్దరం పార్ట్ నర్స్ - అవుదామా అంది. తలూపేడు జోసెఫ్ కూడా- తనకీ ఓ తోడూ ఉంటె మంచిది అనుకున్నాడు.

ఈ మారు అయ్యని అమ్మని కలవడానికి జోసెఫ్ ని వెంటేసు కొచ్చింది మాలతి.

ఎవరే అంది అమ్మ గుస గుసలాడుతూ. నేనితన్ని పెళ్లి చేసుకోబోతున్న అంది మాలతి - లైఫ్ పార్ట్ నర్స్ ని అమ్మకి ఎలా చెప్పాలో తెలియక.
అయ్య చూసాడు - నెరిసిన జుట్టు అమ్మాయి - అంతకి మించి నెరిసిన జుట్టు అల్లుడికి - ఈడు జోడు బాగానే ఉంది కదా అనుకున్నాడు. - తండ్రి మనసు - నిట్టూర్చడానికి తావులేదు- ఇంత కాలం తరువాతైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటా అన్నది కదా అనుకున్నాడు.
అమ్మ - మురిసిపోయింది. ఆవిడ బోసినవ్వు తో - గుస గుస లాడుకుంటున్న వాడ జనాల్ని గదమాయించింది- మా మాలతి కి కాబోయే మొగుడు అని చెబ్తూ.

పదహారులో క ల లు కన్న స్వప్నం అరవైలోనైనా నెరవేరిందని తల్లి హృదయం సంతోష పడింది. ఎంతైనా తల్లి హృదయం కదా మరి. !

చీర్స్
జిలేబి.



Friday, December 24, 2010

కనపడని భగవంతుడు- కనిపించే గురువు-కానలేని భక్తుడు

భూ మండలం మీద జీవ రాశి - మానవ రాశి పుట్టినప్పట్నించి భగవంతుడు కనపడలేదు. సో, ఆయన కనిపించని 'భగవంతుడు' ! - ధనవంతుడు అంటే ధనం ఉన్నవాడు. భగవంతుడు అంటే మరి 'భగ ' ఉన్నవాడనుకోవచ్చా ? అసలు 'భగ' అన్న పదం ఉందా. ?

ఆ కనిపించని భగవంతున్ని తెలియ జెప్పే వాడు - గురువు - లోపల ఉన్న అంధకారాన్ని పోగొట్టేవాడంటారు గురువు అన్న పదానికి అర్థం.

మరి భక్తుడో? కానలేని వాడు. కళ్ళున్న కబోధి ? అంతః చక్షువు తెరిస్తే గాని కానలేడు ఆ భగవంతుడ్ని అని మధ్య ఉన్న గురువు చెబ్తాడు.

ఈ మూడింటిని సమన్వయించి - అన్ని కాలాల్లోనూ భగవంతుడి గురించి వెతుకులాట జరుగుతూనే ఉంది.
కాలం మారుతుంది. కొత్త గురువు వస్తాడు. భక్తుడు కూడా కొత్త దనంతో వెతుకులాట సాగిస్తాడు.
ఈ సమీకరణం లో మారనిది ఏదైనా ఉందంటే - అది కనిపించని భగవంతుడు మాత్రమె - ఎందుకంటే అతను 'మారలేని' స్తితిలో ఉన్నాడను కోవచ్చా?

మారని భగవంతుడు- మార్పు చెందే గురువు - మార్పు చెందే భక్తుడు - ఈ మూడు - ' ప్రళయాంత కాలం లో ఏమవుతాయి? అంతా విష్ణు మాయ కాకుంటే - దీనికి ఎవ్వరు సమాధానం చెప్పగలరు? చెప్పినా అది ఊహ మాత్రమె అనుకోవాలి -

చీర్స్
జిలేబి.

Thursday, December 16, 2010

భగవంతుడు చెవులు మూసుకున్నాడు

లేజీ గా నిద్ర పోతోన్న భగవంతుడు ఉదయత్పూర్వమే ఉలిక్కి పడి లేచాడు.

నిద్రా భంగం తో బాటు - ఓ లాంటి భయోత్పాదానికి గురి అయ్యాడు కూడా ను.

ఇంతకీ నిద్రా భంగానికి కారణం ఏమిటబ్బ అని పరికించి భూలోకం లో ఎవరికినైనా ఆపద వచ్చిందేమో తన్ను తలచు కున్నారేమే అని ఓ మారు ద్రిష్టిని క్రిందికి సారించాడు. అబ్బే ఎ మానవుడు తనని తలవలేదు.

ఓ పాటి విపరీతమైన శబ్ద ప్రవాహం క్రింద భూమినించి వస్తోందని గమనించాడు. డిసెంబర్ నెల - ప్రొద్దు ప్రొద్దునే జనవాహిని అదేదో కొంపలు మునిగి పోయేట్టు ఏకదాటి తో గొంతులు చించుకుని భజన స్టార్ట్ చేసి - మైకులు పెట్టి ఒకడ్ని మించి మరొకడు ఉచ్చ స్థాయిలో - అయ్యప్ప ని అదే పనిగా పిలుస్తూన్నారు.

ఓహో ఇదన్న మాట విషయం అని మరి అయ్యప్ప ఏమైనాడో చూద్దామని అయ్యాప్పా అన్నాడు భగవంతుడు.
'స్వామియే శరణం' అన్నాడు అయ్యప్ప.

'అయ్యప్పా ఇంతమంది నిన్ను పిలుస్తూంటే అదేమిటి పలకకుండా ఉన్నావు. నాకైతే మరీ చిరాకుగా ఉంది
పొద్దుటే నిద్రా భంగానికి ' అన్నాడు భగవంతుడు.

'స్వామీ - నువ్వు నిరాకారుడివి. నీకే ఇంత చిరాకైతే - నాకెట్లా ఉండాలి - నీ అంశ మాత్రుడిని నేను. ఏదో భక్తీ గా నా మళయాళ దేశం వాళ్ళు నన్ను కోలుస్తూంటే ఓకే అని సంతోష పడి పోయి వాళ్ళు చేసిన మర్యాదలన్నీ స్వీకరిస్తిని. ఆ పై వాళ్ళు నన్ను ఇంటర్- స్టేట్ భగవంతుడిని చేస్తే - పోనీలే ప్రక్క రాజ్యం వాళ్ళేగా అనుకున్నా ! ఇది మరీ విపరీతమై - ఇంటర్ కాంటినెంటల్ అయి కూర్చుంది. ప్రతి ఒక్కడు - ఆ అరవ సినిమానో కాకుంటే తెలుగు సినిమా నో పాటలు రావడమే చాలు - దాని కి మక్కీ కి మక్కీ కాపి కొట్టి - పాడేసుకుని నన్ను బెదిరించడం మొదలయిపోయింది ' అని వాపోయాడు అయ్యప్ప స్వామి!

'సరే నీ తంటా లేవో నీవే పడు ' అని చెవులు మూసుకుని ఓ పక్క గా వత్తిలి మళ్ళీ నిద్ర ప్రారంబించాడు భగవంతుడు.
'స్వామియే శరణం' అనుకుంటే - ఈ భగవంతుడు కూడా నా మొర ఆలకిన్చలేదే అని అయ్యప్ప స్వామి మళ్ళీ యోగనిద్ర పోస్ కి వెళ్లి పోయాడు- నరులార - మీ కర్మ ఏదో మీరే అనుభవించండి అని.

(తెలుగు యోగి గారి బ్లాగు చదివాక- టీవీ చూస్తూంటే - - అయ్యప్ప స్వాముల సినిమా పాటల పేరడీ ప్రార్థనా పరంపరాలని గమనించడం జరిగింది - దాని పరిణామం - ఈ టపా. )

చీర్స్
జిలేబి.

Wednesday, December 8, 2010

రెండో పెళ్ళాం కథ

అమ్మాయి మురిసి పోయింది

అమ్మాయి అమ్మ నాన్న మురిసి పోయారు - అమ్మ తన వాళ్ళ తో రవ్వంత గర్వం గా చెప్పింది - మా కాబోయే అల్లుడు ఐటీ లో పని చేస్తాడని. వాళ్ళూ మురిసి పోయేరు - అమ్మాయి జీవితం అమెరికా జీవితం అయి పోయిందని ఆమె లైఫ్ సెటిల్ అయినట్టే లెక్క !

అమ్మాయి పెళ్లి అయ్యింది. మురిసి పోయింది అమ్మాయి . శ్రీ వారి తో చెట్టాపట్టాలేసుకుని - ఆకసాన ఎగిరింది - అమెరికా నగరానికి !
సొగసులు - మురిపాలు జీవన నౌక విహారం !

ఓ రోజు సాయంత్రం - అబ్బాయి గారు గర్వం గా ఇంటికి వచ్చేరు- శ్రీమతి తో - చెప్పాడు- 'ప్రియా' నాకు ప్రొమోషన్ వచ్చింది ' అని.

అమ్మాయి మురిసిపోయింది. అమ్మాయి వాళ్ళ అమ్మ - తన వారందరి తో చెప్పింది - మా అమ్మాయి భాగ్యం అల్లుడు గారి నౌకరీ లో ప్రొమోషన్ కి కారణం అని .

అబ్బాయి గారు ఓ రోజు కొత్త మొబైల్ తో వచ్చేరు. ' ప్రియా నా ప్రొమోషన్ కి ఈ మొబైల్ అఆఫీసు లో ఇచ్చేరు అని.

అమ్మాయి మురిసి పోయింది.

ఒక వారం రోజులలో అబ్బాయి కొత్త లాప్ టాప్ తో వచ్చేరు. ' ఇదీ ప్రమోషన్ చలవేనా? ' అమ్మాయి మురిపెం గా అడిగింది.
'ఏమనుకున్నవన్నట్టు ' గర్వం గా చూసేడు అబ్బాయి.

ఆ పై తెలిసి వచ్చింది అమ్మాయి కి - తన శ్రీవారు - ఇక ఆఫీసు పని ఆఫీసు లో మాత్రమె కాకుండా ఇంట్లో కూడా టపటప ఇంట్లో కూడా లాప్ టాప్ తో సంసారం చేస్తారని ! ఇక ఆ లాప్ టాప్ ఆయన రెండో పెళ్ళాం అయి కూర్చుంది.

పిచ్చి పిల్ల - ఈ సారి మురిసి పోలేక పోయింది. కొత్త గా ఇంట్లో కి వచ్చిన రెండో పెళ్ళాం తో ఎలా వేగాలబ్బ అని కంట తడి పెట్టింది. . మరి శ్రీవారికి ప్రమోషన్ అంటే మాటలా మరి?

చీర్స్
జిలేబి.

Friday, December 3, 2010

వికి లీక్స్ - ఫ్లాష్- 2G - Issue !!!

అమావాస్య కి అబ్దుల్ కాదర్ కి సంబంధం ఏమిటి అన్నది నానుడి. అట్లా వికి లీక్స్ కి 2G కి సంబంధం ఏమి ఉంటుందండి మీరు మరీను !

విషయం ఏమిటంటే - ప్రపంచ పత్రికా లోకం వాళ్ళు వికి లీక్స్ మీద గగ్గోల్ ఐపోతూన్నారు ఏదో గొప్ప విషయం సాదించి నట్టు. నాకైతే - మన తెలుగు ఇండియా మీడియా వాళ్ళు ఇంతకన్నా ఘనమైన లీకులు సర్వసాధారణం గా న్యూస్ ఐటెం క్రింద రాస్తూ ఉంటారు. వారి కన్నా గొప్ప వార ఈ వికి లీక్స్ వారు? కానే కారు ! మన మీడియా వాళ్ళని వదిలి ఉంటె - వికి లీక్స్ ఏమిటి కర్మ - మొత్తం అమెరికానే లీక్ కాకుంటే అమ్మకానికి పెట్టి ఉండే వారు ! ఏమంటారో మీడియా వాళ్ళు ఈ టపా చదివాక !

చీర్స్
జిలేబి.