Wednesday, December 8, 2010

రెండో పెళ్ళాం కథ

అమ్మాయి మురిసి పోయింది

అమ్మాయి అమ్మ నాన్న మురిసి పోయారు - అమ్మ తన వాళ్ళ తో రవ్వంత గర్వం గా చెప్పింది - మా కాబోయే అల్లుడు ఐటీ లో పని చేస్తాడని. వాళ్ళూ మురిసి పోయేరు - అమ్మాయి జీవితం అమెరికా జీవితం అయి పోయిందని ఆమె లైఫ్ సెటిల్ అయినట్టే లెక్క !

అమ్మాయి పెళ్లి అయ్యింది. మురిసి పోయింది అమ్మాయి . శ్రీ వారి తో చెట్టాపట్టాలేసుకుని - ఆకసాన ఎగిరింది - అమెరికా నగరానికి !
సొగసులు - మురిపాలు జీవన నౌక విహారం !

ఓ రోజు సాయంత్రం - అబ్బాయి గారు గర్వం గా ఇంటికి వచ్చేరు- శ్రీమతి తో - చెప్పాడు- 'ప్రియా' నాకు ప్రొమోషన్ వచ్చింది ' అని.

అమ్మాయి మురిసిపోయింది. అమ్మాయి వాళ్ళ అమ్మ - తన వారందరి తో చెప్పింది - మా అమ్మాయి భాగ్యం అల్లుడు గారి నౌకరీ లో ప్రొమోషన్ కి కారణం అని .

అబ్బాయి గారు ఓ రోజు కొత్త మొబైల్ తో వచ్చేరు. ' ప్రియా నా ప్రొమోషన్ కి ఈ మొబైల్ అఆఫీసు లో ఇచ్చేరు అని.

అమ్మాయి మురిసి పోయింది.

ఒక వారం రోజులలో అబ్బాయి కొత్త లాప్ టాప్ తో వచ్చేరు. ' ఇదీ ప్రమోషన్ చలవేనా? ' అమ్మాయి మురిపెం గా అడిగింది.
'ఏమనుకున్నవన్నట్టు ' గర్వం గా చూసేడు అబ్బాయి.

ఆ పై తెలిసి వచ్చింది అమ్మాయి కి - తన శ్రీవారు - ఇక ఆఫీసు పని ఆఫీసు లో మాత్రమె కాకుండా ఇంట్లో కూడా టపటప ఇంట్లో కూడా లాప్ టాప్ తో సంసారం చేస్తారని ! ఇక ఆ లాప్ టాప్ ఆయన రెండో పెళ్ళాం అయి కూర్చుంది.

పిచ్చి పిల్ల - ఈ సారి మురిసి పోలేక పోయింది. కొత్త గా ఇంట్లో కి వచ్చిన రెండో పెళ్ళాం తో ఎలా వేగాలబ్బ అని కంట తడి పెట్టింది. . మరి శ్రీవారికి ప్రమోషన్ అంటే మాటలా మరి?

చీర్స్
జిలేబి.

4 comments:

  1. If TV serials can compensate the 'top time slot' (evening 6.30 PM TO 10.30 PM) time for women, why not laptops allowed for Men ?

    Just Kidding. :-)

    ReplyDelete
  2. cute .. I mean your narration is, not the end of the story.

    ReplyDelete
  3. బావుంది
    ఇకనైనా దాన్ని ఒళ్ళోంచి దించుతారా ! అని నేను మా ఆయనతో పోట్లాడ్టం గుర్తొచ్చింది

    ReplyDelete