నా హం కర్తా, హరిహి కర్తా అన్నది పెద్దల వాక్కు.
ఇప్పుడు మన భూమండలం లో జరుగుతున్న ప్రకృతి విపరీతాలు, దేశ దేశాల లో కానవస్తున్న కలవరాలు చూస్తూంటే - నా కర్తా హరిహి , అహం కర్తా అని పించక మానదు.
మానవుడు మేధస్సు పెంపొందించాడు. ప్రకృతి కి దీటుగా సాయిన్సు సాధించాడు. మరెన్నో విషయాలలో విపరతీమైన వేగాన్ని, ఉన్నత శిఖరాలని అధిగమించాడు. ఇన్ని మార్పులు చేర్పులతో ప్రభంజనం లా సాగిపోతున్న మానవ జీవనం లో - కోరికలని అదిగమించ లేక పోవడం విచారకరం. ఆ పై పదవీ వ్యామోహం, ధన మోహం, నాయకుల అరాచక ప్రవృత్తి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న కలవరాలకి కారణం అని చెప్పలేమా?
దీనికి తోడూ ప్రకృతి విలయ తాండవం - జాపాను అసలు రూపాన్ని పూర్తి గా మార్చి వేస్తోంది. మాన వ నిర్మిత అణు కేంద్రాలు - భస్మాసుర హస్తంలా - విలయ తాండవం చేస్తోంది.
నాహం కర్తా, హరిహి కర్తా అని ఖచ్చితం గా దీనికి చెప్పలేము. ! నా కర్తా హరిహి, అహం ఎవ కర్తా అనిపించకమానదు. !
మానవ జాతి మనుగడ మున్ముందు మంచి దిశల వైపు సాగాలని మనసారా ఆకాంక్షిస్తూ -
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
అందరూ అనుకుంటున్నట్లుగా ఐదేళ్ళలో లక్షకోట్లు సంపాదించినాయన చివరకు ఒక్క పైసా కూడా తన వెంట తీసుకుపోలేకపోయాడు,అందరూ పోయేటప్పుడు ఆరడుగులలో పోయారు ఈయనకు మాత్రం ఆమాత్రం స్థలం కూడా అవసరం లేకపోయింది.ఈ విషయం అందరికీ ప్రత్యక్షంగా అనుభవమైనా పదవీ వ్యామోహం, ధన మోహం, నాయకుల అరాచక ప్రవృత్తిలో కాస్తంత కూడా మార్పులేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో?
ReplyDelete@. ప్రకృతి కి దీటుగా సాయిన్సు సాధించాడు.
ReplyDeleteప్రకృతి ని మన౦ అధిగమి౦చలేము ఎప్పటికీ. సాధి౦చామనుకోవడ౦ అమాయకత్వమే.ప్రకృతి అ౦టే గాలి, నీరు, నేల కాదు. దైవ౦ :)
@విజయ మోహన్ గారు
ఆ ఆరడుగులు కూడా దొరకదు అని తెలిసినా, తమ తరువాత బిడ్డలు అయినా సుఖ౦గా ఉ౦టారన్న పేరాశ సామాన్యుడి దాకా చేరి౦ది.ఇక ఆ పెద్దమనిషి ఎ౦త?
@వ్యామోహం, ధన మోహం, నాయకుల అరాచక ప్రవృత్తిలో కాస్తంత కూడా మార్పులేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో?
స్వాత౦త్ర్య౦ కూడా నిర౦కుశ పాలకుల లో మార్పు వచ్చి రాలేదు.యె౦దరో సామాన్యులు చేసిన త్యాగాల వలన వచ్చి౦ది. ఈ అవినీతి, అక్రమాలు కూడా ఒక్కొక్కరు ఎదిరి౦చడ౦ వల్లనే సాధ్య౦.
రిజర్వేషన్ లేకు౦టే ల౦చ౦ ఇవ్వకు౦డా ప్రయాణాన్ని, కష్టమో నష్టమో అని అ౦దరూ చెయ్యగలిగిన నాడు, ఇలా౦టి చిన్న చిన్న త్యాగాలు మొదలయిన రోజు మార్పు మొదలవుతు౦ది. కాని ఆ చైతన్య౦ జన౦ లో తీసికొనిరావడానికి కృషి చేసేదెవ్వరు?
మన౦ మొదలెడదామా ?