ఈ మధ్య కొన్ని వారాల మునుపు జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ నగరం సందర్శించడం జరిగింది. ఈ నగరం లో ఓ సాయంత్రం వ్యాహ్యాళి కై అలా నడక మొదలెట్టి అలా వెడుతూంటే - సాల్జ్ హెయిల్ గ్రోట్టే - మన తెలుగు లో చెప్పాలంటే - ఉప్పు ఆరోగ్య గుహలు అని చెప్పు కోవచ్చు. !
ఇది ఒక దుకాణం - ఈ దుకాణం లో తెల్లటి ఉప్పు తో చెయ్యబడ్డ గుహ లాంటి ప్రదేశం లో మనం ఓ కాంతి వంతమైన దీపాన్ని చూస్తూ కూర్చో వచ్చు. అంటే రెలేక్సేషన్ అన్న మాట ! ఇది మీ ఆరోగ్యాని కి మరే మంచిది అంటూన్నారు వీరు.
ఇది ఒక దుకాణం - ఈ దుకాణం లో తెల్లటి ఉప్పు తో చెయ్యబడ్డ గుహ లాంటి ప్రదేశం లో మనం ఓ కాంతి వంతమైన దీపాన్ని చూస్తూ కూర్చో వచ్చు. అంటే రెలేక్సేషన్ అన్న మాట ! ఇది మీ ఆరోగ్యాని కి మరే మంచిది అంటూన్నారు వీరు.
మన గాంధి గారేమో స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహం చేసారు. వారికి అప్పుడు ఈ ఐడియా వచ్చి ఉంటె - మన దేశం లో ఈలాంటి ఉప్పు గుహలని బెట్టి అందులో సత్యాగ్రహం చేసి ఉండవచ్చు.
అయినా ఇప్పటికైనా మించి పోయినది ఏమి లేదు. మన బాబా రాం దేవ్ గారో కాకుంటే అన్నా హజారే గారో ఈ టెక్నిక్ ఉపయోగించవచ్చు. ఆరోగ్యం కూడా కాపాడు కుంటూ ఎంచక్కా సత్యాగ్రహం చెయ్య వచ్చు.
దాని కి ' ఉప్పు గుహల తో మనో వికాసం అంటూ మన వీరేంద్రనాథ గారో కాకుంటే పట్టాభిరాం గారో ఒక ప్రోగ్రాం కూడా పెట్ట వచ్చు.
మన రాఘవేంద్ర రావు గారు ( అదేనండి - దర్శకులు ) ఓ మంచి 'రాసోత్తర' భరిత గాన సన్నివేశం పెట్ట వచ్చు. !
గాంధి గారి పేరు చెప్పి వీటన్నిటికి నో టేక్స్ ప్రకటించాలని మన లాయెర్స్ సుఒ మాటో కేసులు వేసి ఉండవచ్చు.
ప్చ్ ఎన్నెన్ని మంచి మంచి ఐడియా లో - మన దేశం మిస్సు చేసుకుంది ! ఏమంటారు ?
చీర్స్
జిలేబి.