Tuesday, June 21, 2011

శ్రీ శ్రీ శ్రీ నవ్వండి బులుసు బ్లాగానంద గారి త్రి చాతుర్మాస్య వ్రాత పూర్తి బ్లాగోపన్యాసం


(మా 'ఏకైక'   ప్రతినిధి - జిలేబి వార్తా సమీకరణ )

శ్రీ శ్రీ నవ్వండి బులుసు బ్లాగానంద గారు తమ త్రి చాతుర్మాస్య వ్రాత పూర్తి గావించినారు.
ఈ సందర్భం గా అర్ధ శత బ్లాగ్బందువులు పై గా వారి పై కామెంటు కాంక్షలు తెలిపినారు.

వారు మరీ మరీ నొక్కి వక్కానించినారు - తాము మరిన్ని క్రొంగొత్త 'వ్రాతములను' గావిన్చేదననియు, క్రొంగొత్త సంస్కృతాంధ్ర భాషా సూక్తములను , స్త్రోత్రములను భట్టీయం గావిన్చేదననియు నొక్కి ఘోషించి నారు.

వారి సుమధుర సుహాస్య సువ్రాతా వ్రతముల వల్ల పెక్కెడు బ్లాగ్ బాంధవులు కడు సంతోషముల తో ఓల లాడినారని వారి శిష్య పర మాణువు లైన తీవ్ర వాది అప్పారావు శాస్త్రీ గారు మరీ మరీ సెలవిచ్చినారు.

ఈ వ్రాత పూర్తి ' సందర్భాగంగా ' వారు ఈ జిలేబి వార్తా ప్రతినిధి కి ప్రత్యెక భేటీ ఇచ్చి సర్వ బ్లాగు బంధవులకీ ఆశీర్వాదములు శుభ కామనలు తెలిపినారు.

వారు రాబోవు త్రీ చాతుర్మాస్య వ్రాత కోతలకై తీవ్రముగా ఆలోచించు చున్నారని కూడా సెలవిచ్చినారు.

 అనగా తమ ఈ చిన్ని వేదిక ఐన బ్లాగ్ లోకమును విడనాడి బడా లోకమైన టీవీ ల లో కూడా వెళ్లవచ్చునని ఈ విలేకరి ఊహించిడం జరిగినది.


శ్రీ శ్రీ శ్రీ నవ్వండి బులుసు బ్లాగానంద గారి త్రీ చాతుర్మాస్య 'వ్రాత' పూర్తి సందర్భం గా వారికి కేజీ ల కొలది జిలేబి లు వారి ఏలూరు ఆశ్రమ్ వద్ద ఉన్న అన్గాడి నుంచి అందరు గొని పోయి ఇవ్వ వచ్చునని వారు అందరికి ఆ కీజీ ల బరువులని బట్టి వారి ఆశీర్వాదముల వెయిట్ ఉంటుందని వారి ఆశ్రమ మేనేజర్ నోటీసు బోర్డు పెట్టినారు.

(ఆ అన్గాడి వారి ఆధ్వర్యం లో నే జరుగు చున్నదేమో అని వారి శత్రువులు కొంచం సంకం గావించినా కూడా వారి శిష్య లోకం దానిని తోసి పుచ్చ్చి ఆ అన్గాడి అన్నా రావు స్వామీజీ వారి భక్త కోతులలో ఒక కోతి మాత్ర మే ని వ్రాక్కుచ్చి నారు ) .



చీర్స్
జిలేబి.

2 comments:

  1. శుభమస్తు...
    కేజీల కొలది జిలేబీలా?? బాబోయ్..

    ReplyDelete
  2. హృదయ పూర్వక ధన్యవాదాలు.

    ఆశ్రమ పనుల తో కొంచెం బిజీ గా ఉండడం వల్లనూ, తీపి పదార్ధాలు ఎక్కువగా తినడం వల్ల కలగిన అస్వస్థత వల్లనూ ఈ టపా కొంచెం లేటాలస్యం గా చూశాను.:))))

    ReplyDelete