Friday, August 12, 2011

ఆతతాయి - ఈ పదం తెలుగు పదమేనా ?

ఆతతాయి - ఈ పదం తెలుగు పదమేనా ?

ఒరేయ్ ఆతతాయి వెధవ అని మా వాణ్ని అన్నాను వాడి చేష్టలు భరించలేక .

వాడు తిరుగు ప్రశ్న వేసాడు - అమ్మోవ్ - ఆతతాయి అంటే ఏమిటి అని?

నీలాంటి పెంకి ఘటాల్ని  అలా నే అంటారు అని తప్పించు కున్నాను.

ఆ పై ఈ పదం గురించి ఆలోచిస్తే - ఇది అసలు ఎ భాషలో ని పదమో అర్థం కాలేదు. చాల సులభం గా ఉపయోగిస్తాం ఈ.  పదాన్ని కాని.

భాషా కోవిదులకి ఈ పదాన్ని గురించి పుట్టు పూర్వోత్తరాలు తెలిస్తే దయ చేసి తెలియ జేయ్యగలరు !

చీర్స్
జిలేబి.

8 comments:

  1. అది "ఆకతాయి" అనుకుంటాను.

    ReplyDelete
  2. ఆతతాయి కాదు ఆకతాయి, చిలిపివాడు, అల్లరివాడు, పనిపాట లేక వీధుల వెంట తిరిగేవాడిని కూడా అలనే పిలుస్తునారు, అప్పుడు అప్పుడు చూస్తుంటాం కదా పార్క్ లో ఆకతాయి లు ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు అని, తప్పులు ఉంటె క్షమించండి ,తప్పుగా మాట్లాడిన క్షమించండి ...

    ReplyDelete
  3. ఆతతాయి అంటే చంపడానికి ఉద్యుక్తుడైనవాడు....

    వీళ్ళు ప్రధానంగా ఆరు రకాలు....అగ్నిదుడు (అగ్నితో చంపటానికి పూనుకున్నవాడు), గరదుడు (గరళంతో చంపటానికి పూనుకున్నవాడు), శస్త్రపాణి (శస్త్రాలతో చంపటానికి పూనుకున్నవాడు), ధనాపహుడు ( ధనం కాజేసేవాడు), క్షేత్రాపహారి (రాజ్యం , ఆస్తి కాజేసేవాడు) , దారాపహారి (వేరొకడి భార్యను కాజేసేవాడు) ....

    ఇవ్వన్నీ పాతకాలం "రకాలు / కేటగొరీలు" - ఇప్పటి రకాలు మీరే నిర్వచించుకోవచ్చు....

    అయినా ఈ పదం మీరెక్కడ నేర్చుకున్నారు మీ వాడిని అనటానికి?

    ReplyDelete
  4. అది అక్షరాలా తెలుగు పదమే! ఆతతాయి అంటే చంపడానికి ఉద్యుక్తుడు అయిన వాడు అని అర్ధం
    వీళ్ళు ఎన్ని రకాలంటే:
    ౧. అగ్నిదుడు - నిప్పుని ఉపయోగించి చంపడానికి పూనుకున్న వాడు ఉదా: మహాభారతంలో పాండవుల లక్క ఇల్లు కాల్చిన వాళ్ళు
    ౨. గరదుడు - విషమును ఉపయోగించి చంపడానికి పూనుకున్న వాళ్ళు ఉదా: మహాభారతములో భీమసేనుడిని చంపదలచిన వాళ్ళు
    ౩. శస్త్ర పాణి - ఆయుధములను ఉపయోగించి చంపడానికి పూనుకున్నవాళ్ళు
    ౪. ధనాపహుడు - ధనమును, ఐశ్వర్యమును కాజేసి అడ్డు వస్తే చంపేవాళ్ళు
    ౫. క్షేత్రాపహారి - రాజ్యమును, ఆస్తిని కాజేసి అడ్డు వస్తే చంపేవాళ్ళు
    ౬. దారాపహారి - వేరొకరి భార్యని అపహరించి అడ్డు వచ్చిన వాళ్ళని చంపాలనుకునే వాళ్ళు ఉదా: రామాయణములో రావణాసురుడు

    ఇహ ఆకతాయి తనం అనేది వేరు!! పిల్లలని తిట్టేటప్పుడు మాత్రం ఆకతాయి తనం ఎక్కువయింది అంటూ ఉంటాం.

    ReplyDelete
  5. ఆకతాయికి వ్యుత్పద్యర్ధం చెబ్తారా ప్లీజ్. #I mean# అసలు ఆకతాయి అన్నపదంలో చంపటాన్ని సూచుంచే పదమేది?

    ReplyDelete
  6. ఆతతాయి అంటే ఇదా అర్థం! ఈరోజే తెలుసుకున్నాను. అందరికీ ధన్యవాదములు!

    @Indian Minerva
    "ఆతతాయి", "ఆకతాయి" ఈ రెండూ వేర్వేరు పదాలు, వేరే అర్థాలు.

    ReplyDelete
  7. Wow!! రెండూ వేరేనా. అయినా my question rests :-).


    ఇంకోటి "అమీతుమీ తేలుకుందాం రా" అంటారుకదా. దాని ఆరిజను బెంగాలీనా?

    ReplyDelete