అమ్మకానికో బ్లాగిల్లు - కొనడానికో ....
మొత్తం మీద మరో అగ్రిగేటర్ డమాల్ ! బ్లాగిల్లు మూట కట్టే సారు మా 'స్టారు' శ్రీనివాసు గారు.
అదేమిటో ఈ తెలుగు బ్లాగు లోకాని కొచ్చిన ఖర్మ !
ఒక్కటొక్కటే బ్లాగులు మూత పడి పోతా ఉంటె , దానితో బాటు అగ్రిగేటర్ లు కూడా మూట కట్టేయ్యటం !
బ్లాగిల్లు శ్రీనివాసు గారు ఇచ్చిన కారణం - బ్లాగిల్లు కి అంత 'రెస్పాన్స్' రావటం లేదు అని .
బ్లాగులు వ్రాసే వాళ్ళు ఎందుకు వ్రాయటం లేదు అంటే ... అబ్బే అంత 'రెస్పాన్స్' రావటం లేదండీ అని.
ఇట్లా ప్రతి ఒక్కరు చూస్తా ఉంటె మిగిలిన వాళ్ళ కోసమే వ్రాస్తా ఉన్నట్టు ఉన్నారుస్మీ ! జేకే !
(ఈ మధ్య శ్యామలీయం వారి బ్లాగులో కామెంటి జేకే అంటే - జేకే అంటే ఏమిటి అని అడిగారు శ్యామలీయం వారు - అబ్బే జేకే తెలీక పోవటమేమిటి వీరి కి అనుకున్నా ! జేకే !)
ఏమండీ బ్లాగిల్లు శ్రీనివాసు గారు, కూడలి, మాలిక గట్రా వాళ్ళు ఏమి ఆశించి ఇంకా తమ అగ్రిగేటర్ లని నిలబెట్టి ఉన్నారు ?
మరో ఆలోచన వస్తుంది - అగ్రిగేటర్ ల ని పెట్టిన వారు - అగ్రిగేటర్ ని మరీ 'పెర్సనల్' గా చూస్తూ న్నారేమో అని ! బ్లాగులోళ్ళం మేమైతే బ్లాగులకి కామింటులు వచ్చాయా లేదా అని ఆతుర పడుతుంటాం గాని అగ్రిగేటర్ లు 'క్లిక్కులు' వచ్చేయా లేవా అని రోలు కర్ర రూలు కర్ర పట్టుకుని లెక్కెయ్యడం జేసి అగ్రిగేటర్ ని మత పెట్టేస్తే ఇక మా లాంటి బ్లాగులొళ్ళ కి వ్రాసే టపాల కి ఎక్కడ ప్రచారం ఉంటుంది ?
సో బ్లాగిల్లు శ్రీనివాసు గారు మీరు మళ్ళీ మీ అగ్రిగేటర్ ని త్వరతిం గా నే తెరవండి .
ఆ కామింటు ల సెక్షన్ ని హారం లా తయారు చెయ్యండి (exactly like 'haram' comment section) అప్పుడు చూడండి మీ అగ్రిగేటర్ కి వచ్చే హిట్లని :)
చీర్స్
జిలేబి