ప్రతి తెలుగు వాడు తప్పక చదవాల్సిన పుస్తకం - ఇదండీ మహాభారతం !
తెలుగు వారి కి సులభ శైలి లో మహా భారతాన్ని రంగనాయకమ్మ గారు అందించారు.
ఇందులో కథా పరం గా , అక్కడక్కడా వారి వ్యాఖ్యానాన్ని అందిస్తూ మూల మహాభారతానికి అతి దగ్గిరగా అచ్చ తెనుగులో మహా భారతాన్ని వీరు అందించారు .
దరిదాపుల్లో నాలుగు వందల పేజీ ల లో మహా భారతాన్ని ఎట్లాంటి 'భేషజాలు' , ఉత్కృష్ట ఉపమానాలు లేకుండా కథ ని కథావస్తువు ని యథార్థం గా అందించారు.
వారు అక్కడక్కడ కొట్టిన సెటైర్ నవ్వు తెప్పించ వచ్చు.
కొండొకచో వెటకారం గా అని పించ వచ్చు.
కూసింత వెగటు కలిగించ వచ్చు.
వీటన్నిటి ని పక్క న బెట్టి, ఒక మామూలు సాధారణ జన సమాజానికి ఈ మహా భారత కథ ఏమన్నా విలువల్ని అందిస్తాయా అని వారు ఎక్కు బెట్టిన బాణం మనల్ని ఆలోచింప జేస్తుంది.
వారి సైడు కామింటు లని పక్క న బెట్టి మహా భారతాన్ని ఆస్వాదించ వచ్చు.
సైడు కామింటుల తో సహా చదివితే తల తిరిగ వచ్చు. దానికి వారిని బాధ్యులని చేయ రాదు.
మహా భారతాన్ని ఇట్లాంటి కోణం లో నించి కూడా చూడ వచ్చు అనడానికి రంగనాయకమ్మ గారి పుస్తకం ఒక సర్వోత్క్రుష్ట మైన ఉదాహరణ.
చదవండి . ఆలోచించండి. అన్నింటినీ యధాతధం గా (వారి 'కిక్కుల'ని కూడా) తీసు కోవాల్సిన అవసరం లేదు.
చీర్స్
జిలేబి
చదివానండి:)
ReplyDelete