Monday, September 5, 2016

వినాయక చవితి జిలేబి శుభాకాంక్షలు !

వినాయక చవితి జిలేబి శుభాకాంక్షలు !





న్యూస్ కర్టసీ  :_ ఈనాడు న్యూస్  "మింటిన" వారు  - సిరిలేనివాసు :)

ముంబయి: వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు రకరకాల పదార్థాలు ఉపయోగించి వినూత్నంగా బొజ్జ గణపయ్యలను తయారు చేస్తారు. మట్టి, బియ్యం, చాక్‌పీస్‌, ఛాక్లెట్‌లు ఇలా రకరకాల వాటితో చేసినవి చూస్తూనే ఉంటాం. కాని ముంబయికి చెందిన కొందరు కళాకారులు జిలేబీల గణపయ్యను తయారు చేశారు. పసుపు రంగులో ఉన్న ఈ జిలేబీల గణనాథుడు సందర్శకులను తెగ ఆకట్టుకుంటుంది. సోమవారం వినాయకచవితి సందర్భంగా ముంబయిలోని ఓ వీధిలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.


బ్లాగ్ వీక్షకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు !

వార్తా ప్రదాత శ్రీ సిరిలేని వాసుల వారికి నెనర్లు !


గణపతి జిలేబి బప్పా !
ననుదినము కొలుతుము మంచి నడతయు గనగన్
వినుమా విన్నప మిదియే !
జనులందరిని గనవయ్య చక్కగ నీవే !



శుభోదయం
జిలేబి 

11 comments:



  1. మట్టి గణపతిని జేయగ
    గట్టిగ నిర్ణయము జేసి గణనాధుని కా
    ల్బట్టెదము నిక్కము గనన్
    చట్టను సమయము సరి మనసక్కడ నిలుపన్

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అయ్యయ్యో గణపయ్యా బొంబాయెల్లి జిలేబీ వేషము గట్టితివా
      అయ్యా ఇన్ సే పెహలే జిలేబీ మాయి కా అస్లీ వేషము గనుమా
      కుయ్యో మొర్రో అను వారల నిత్య వా(రో)దనలు వినుమా
      తియ్య తియ్యని 'జిలేబీ బప్పా' లకు మురిసి జలేబీ బుట్టను పడకుమా !
      :)

      వినాయక చవితి శుభాకాంక్షలు...

      Delete


  2. మేని మీదను మోహము మేలు మేలు
    యను కొనుచు దినమొక గడియారము వలె
    గడుపు చుంటిని నినుజూడగా నిజమగు
    నన్ను గురుతెరిగితిని గణాధిపతిగ !

    జిలేబి

    ReplyDelete


  3. ఓయీ బండీ రావూ
    భాయీ, బెహెనోయి మాకు ప్యారి జిలేబీ !
    కాయలు గూరలిక వలదు
    మాయను వీడితి జిలేబి మాకు తగినదీ :)

    జిలేబి

    ReplyDelete
  4. ‘‘‘‘భం చిక్ భం చిక్ చేయి బాగా
    మేకతో యోగా మంచిదేగా‘‘‘‘


    మేకలతో యోగా...ఎంతో హాయిగా
    ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: అది అమెరికాలోని ఓరేగాన్‌ విల్లియామిల్టీలోయలో ఉండే ఓ విశాల ప్రదేశం. ఇటీవల కాలంలో ప్రజలు తండోపతండాలుగా అక్కడకి వెళుతున్నారు. ఎందుకో తెలుసా యోగా చేయడానికట. అందులో వింతేముంది అనుకుంటున్నారా? అక్కడ మనుషులతో పాటు మేకలు కూడా యోగా చేస్తాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ..
    లైనీ మోర్స్‌... ఒక యోగా గురువు. ఆమె పదేళ్లపాటు ఫొటోగ్రాఫర్‌గా పని చేసింది. కానీ ఆరోగ్యం సహకరించక పోవడంతో ఆ వృత్తికి స్వస్తి చెప్పి ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఓ యోగా కేంద్రాన్ని ప్రారంభించింది. జనాన్ని ఆకట్టుకునేలా కొన్ని మేకపిల్లలకు తర్ఫీదునిచ్చింది. యోగా చేయడానికి అక్కడికి వచ్చేవారితో కలిసి ఆ మేకలు కూడా యోగా చేస్తాయట. దీనివల్ల మనస్సుకు మరింత ప్రశాంతత చేకూరుతోందని యోగా చేయడానికి వచ్చే వారు అభిప్రాయపడుతున్నారు. ఆ యోగా కేంద్రంలో శిక్షణ పొందడానికి వందల మైళ్ల దూరం నుంచి కూడా జనం వస్తున్నారంటే అతిశయోక్తిగా లేదూ..?

    http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break117

    ReplyDelete
  5. వీరంతా ‘గుమ్మడికాయల’ క్రీడాకారులు..!
    బెర్లిన్‌: గుమ్మడి కాయ.. ఈ పేరు వినగానే దిష్టి తీసేందుకో లేక.. ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉండేందుకో కడతారని అనుకుంటారు. కాని అవే గుమ్మడి కాయలతో వినూత్నంగా కళ్లు చెదిరే అద్భుతమైన శిల్పాలను తయారు చేయొచ్చని నిరూపించారు. జర్మనీలోని ఎర్‌ఫర్త్‌లో ‘ఎగా’ ఉద్యానవన ప్రదర్శన ప్రారంభమయింది. ఇందులో భాగంగా ‘ఆటమ్‌ పంప్‌కిన్స్‌ ఎగ్జిబిషన్‌ స్పోర్ట్స్‌’ విభాగంలో గుమ్మడి కాయలను వినూత్నంగా ప్రదర్శించారు. స్విమ్మింగ్‌, గుర్రపు స్వారీ, స్కీయర్‌, డిస్కస్‌ త్రోవర్‌ ఇలా రకరాల శిల్పాలు రంగు రంగుల గుమ్మడి కాయలతో రూపుదిద్దుకున్నాయి.
    ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉద్యాన వన ప్రదర్శన అక్టోబర్‌ 31 వరకు కొనసాగనుంది. కళాకారులు ప్రస్తుతం వాటిని ఆకర్షణీయంగా తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అద్భుతంగా ఉన్న ఈ శిల్పాలను చూసేందుకు సందర్శకులు భారీగానే తరలివస్తున్నారు.
    http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break114

    ReplyDelete
  6. వినాయకచవితి శుభకామనలు,
    సావీ! ఈ సంవత్సరమైనా నీలాపనిందలు లేకుండా జెయ్యీ!! గణపతి బప్పా మోరియా అని దణ్ణవెట్టుకుని గుంజిళ్ళు తీసేరా? లేదా? తియ్యండి వెంటనే.

    ReplyDelete


  7. నీలాపనిందలను తల
    నీలాలనగన్ విడిచిన నీకూ మేలౌ !
    మాలావుగ గుంజీలిడు
    బాలా ! లెస్సగ పలికిరి భాస్కర శర్మా!

    జిలేబి

    ReplyDelete
  8. వినుమయ్యా ! గణపయ్యా !
    అను నిత్యము 'మనసు కోతి' అటు నిటు చనెడిన్ ,
    తననిక కట్టడి సేయుము ,
    వినలేదా , తోక కాల్చు , విఘ్నాధిపతీ!

    బుధ్ధి మాన్ జిలేబి వర్యుల సుద్ది వింటి
    వినయముగ చేతులొగ్గితి విఘ్న రాజ!
    మంచి బుధ్ధి యొకింత మా మనసు కిచ్చి
    కార్య సిధ్ధికి జేర్చుము గణపతయ్య !

    వినాయక చవితి శుభాకాంక్షలతో. ....

    ReplyDelete
  9. హిందువులు మరీ ఇంత సిగ్గులేనివాళ్ళు అనుకోలేదు!ఒక నాస్తికుడి దగ్గిర మరీ ముఖ్యంగా రామద్వేషి దగ్గిర తమ భక్తిరసాన్ని ఒలికిస్తున్నారు,వాడేమో సమయం అసందర్భం కూడా చూసుకోకుందా బాపు లాంటి రామభక్తుల్ని రచ్చ ర్చహ్చ చహెస్తుంటే మళ్ళీ యేడ్చి గింజుకునేదీ వీళ్ళే!!వీళ్ళు యేది చేసినా వాడికి మంచిదే, పగలబడి నవ్వుకుంటాడు - తన రామద్వేషాన్ని రామభక్తులు కూడా సమ్మతించేశారు గనక ఇంకా రెచ్చిపోతాడు - ఎవరికీ పట్టని ధార్మికక్షాత్రం నాకు దేనికి?ఇనటితో నా బ్లాగు ప్రయాణం ముగిసిపోయింది.ఇదే నా ఆఖరి పోష్టు!ఇంక కొత్త పోస్టులు ఉండవు.

    ఓక్ప్పుడు కొన్ని రోజులు మాత్రమే వ్యూహాత్మకంగా చేశాను గాబట్టి మళ్ళీ ఒక నాల్రోజుల తర్వాత వస్తాడులే అని అనుకోవద్దు.ఆ బ్లాగు పోష్టు కన్నా అక్కడ రామభక్తులు వేసిన,ఇంకా వేస్తున్న కామెంట్లు అన్ను వెక్కిరిస్తున్నాయి!

    ReplyDelete


  10. వీణా తంత్రుల గణపతి
    గానము బాజా భజంత్రి గావించె నిటన్ !
    మా నగుమోముల సామీ,
    మా నాజూకు వెనకయ్య మంచిగ జూడూ !

    జిలేబి

    ReplyDelete