మాన్యు 'మెంటల్' 'మిస్' మేనేజ్మెంట్ - అయ్యరు గారి తో కాఫీ - జిలేబీయం !
వేడి వేడిగా పొగలు సెగలు కక్కుతున్న కాఫీ టేబిల్ మీద పెట్టి
"ఏమోయ్ జిలేబి ఏమిటి నీ బ్లాగు విశేషాలు" పృచ్చించేరు మా అయ్యరు గారు.
వేడి కాఫీ తాగుదామని పెదవుల దగ్గిరికి తీసుకుని చప్పరిస్తో ఆ ప్రశ్న కి ఉలిక్కి పడితే పొలమారి కాఫీ గుండె లో కి దూసు కెళదామా అని చూసింది !
అయ్యర్వాళ్ నేనే కదా దేశం లో పరిస్థితులు ఏమిటి అని మామూలు గా అడిగే దాన్ని ఏమిటి మీరు ఈ మారు అడుగు తున్నారు ? అంటూంటే
అయ్యరు గారు హిందూ పేపర్ లో తల బెట్టేసేరు అంత లో !
".... మొన్న జిలేబి తయారు చేస్తామని ప్రయత్న్తిస్తే అది మైసూర్పాక్ అయి పోవడం గుర్తు కొచ్చి చెప్పా
ఈమధ్య యింటి పట్టున
మైమరచి జిలేబి జేయ మైసూర్పాకై
తా మారగాను జయ్యని
నో మారు వసుంధరమ్మ నోట్సు కదిపితీ :)
మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంటోయ్ మా అయ్యరు గారు సెలవిచ్చారు !
మాన్యుమెంటల్ మిస్ మేనేజ్ మెంట్ ! నోరు వెళ్ళ బెట్టేసా !
అవునోయ్ ! జిలేబి పేరు పెట్టు కుని జిలేబి తయారు చేస్తే మైసూర్ పాక్ అది కాస్తా అయితే మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంట్ కాకుంటే ఇంకేమిటి ? అన్నారు అయ్యరు గారు.
గుర్రు గా చూసా వారి వైపు. !
అంటే అర్థం ఏమిటండి ? అడిగా వారిని సందేహం తో !
యిదిగో జిలేబి నాకు తెలిసిన తెలుగు చాలా తక్కువ - స్మారక అనిర్వహణ అనొచ్చను కుంటా అన్నారు వారు !
స్మారక అనిర్వహణ ? అడిగా సందే హం తో అంటే అపస్మారక అనిర్వహణ కూడా ఉంటుందేమో అనుకుంటూ !
అవునోయ్ ! ఈ మాట నాది కాదు మన మనమోహనుల వారిది !
మనమోహనుల వారిదా !
అవునోయ్ !
అయితే అది ఖచ్చితం గా అపస్మారక నిర్వాకమే అయ్యుంటుంది లెండి అన్నా మళ్ళీ జిలేబి వేద్దామా లేక , సమోసా కాపీ రైటు కూడా మనమే కొట్టేద్దామా అన్న ఆలోచనలో పడి పోతూ !
ఏమోయ్ , మిస్, ఏమి మేనేజ్ చేయాలను కుంటున్నావ్ ?
నోట్లోంచి పదాలు రావటం లేదండి !
అయితే ఓ స్పీకర్ పెట్టు కోవోయ్ ! అట్లా అయితే అది మరో మాన్యుమెంటల్ "మిస్" మేనేజ్ మెంట్ ఖచ్చితం గా అవుతుంది అన్నారు అయ్యరు గారు ! 'దేశం లో యిప్పుడు ముగ్గురు 'మిస్' మేనేజ్ మెంటు చేస్తొంటే వాళ్ళ తో బాటూ నువ్వు కూడా చెయ్య వోయ్'
యిదిగో అయ్యర్వాళ్ మీ పోలిటిక్స్ నాకర్థం కావు సుమండీ !నా జిలేబి చుట్టటం లో నే పడతా అంటూ కాఫీ ముగించి మళ్ళీ నా పదాల వేటలో నే పడ్డా !
చీర్స్
జిలేబి