ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా !
కొండ మీద ఏడు కొండల రాయుడికి ఏకాంత సేవ మొదలయింది. భోగ శ్రీనివాసుల వారికి పానుపు సేవ చేస్తూ స్వామి వారిని చూచి 'స్వామీ! ఇవ్వాల్టి కి బాగా నిద్ర పొండి! రేపట్నించి మన లైఫే వేరు ' పూజారి స్వామి వారు చెప్పారు !
నిద్ర పోయే ముందు కనుక్కుందామా లేదా ఆ ఏమైతే ఏముంది లే ! అంతా విష్ణు మాయే గదా అని రవ్వంత ఆలోచనలో పడి, సావకాశం గా ఎందుకైనా కనుక్కుంటే మంచిదే అనుకుని, మరీ 'ప్రాబ్లం' ఏదైనా వస్తే 'సిక్ లీవ్' పెట్టేయొచ్చు అనుకున్న స్వామి వారు, 'ఏమోయ్ ! ఎందుకు రేపటి నించి లైఫే వేరు అంటున్నావ్ ' అన్నాడు సందేహం గా !
అర్చక స్వాముల వారు ముసిముసి నవ్వులు నవ్వారు !
స్వామీ ! ఇక మీరు మీ కుబేరుల వారి బకాయి చెల్లించే రోజులు దరిదాపుల్లో కి వచ్చేస్తాయను కుంటా ! చెప్పాడా యన !
స్వామి వారికి మహానందం కలిగింది ! 'నిజంగానా' ! అంటూ దాంతో తలే ఉంగలీ దబాయించేసారు !
అవును స్వామీ ! మీ అనుంగు శిష్యుడు మోడీ దేశం లో పెద్ద నోట్లకి బందు చెప్పేసాడు. ఇక మీకు పండగే పండగ ! కట్టల కొద్దీ నోట్లు యిక హుండీ వశం ! డబ్బులు మానావరి గా వస్తే మీ బకాయి తీరినట్టే కదా !
నిజంగా వస్తుందంటావా ? స్వామి వారు ఇంతకు మునుపు కూడా ఇట్లాంటి వి చూసి వున్నారు ! ఆ మారు కూడా బకాయి తీరలే! ఏమో ఈమారైనా వస్తుందా ? తన బకాయి తీరు తుందా !
హు! ఆశ ఎవరిని విడిచింది ! ఏమో బకాయి తీరేంత దస్కం వస్తుందే మో ! ఎవరికీ తెలుసు - స్వామి వారు ఆశా భావం వ్యక్తం చేసారు !
అందుకే స్వామీ ! ఇవ్వాళ బాగా రెస్టు తీసుకోండీ ! రేపట్నించి నోట్ల లెక్కలు ఇక మనం జబర్దస్తీ గా 'మోడీ' లెట్ట వచ్చు ! అర్చక స్వామి వారు చెప్పారు !
స్వామి వారు ఆవులించారు !
ఆ ఆవులింత లో జగమంతా అర్చక స్వామి వారికి కనబడి పదునాలుగు లోకాలావల పంచదశ లోకం లో జిలేబి కూడా కనబడింది :)
చీర్స్
జిలేబి
స్వామివారేదో అప్పు తీర్చే నెపంతో భూలోకంలో కూచుంటే ఈ మోడీ గారు పడనిచ్ఛేలా లే డే !!
ReplyDeleteఅయినా కుబేరుడు పాత 500,1000 నోట్లు తీసుకోనంటాడేమో , చూద్దాం.
ReplyDeleteమోడీ స్ట్రయికూ , ట్రంపు హిట్టూ గురించి బ్లాగ్జ్యోతిష్ శర్మ గారి గ్రహ పరిస్థితుల టపా యింకా రాలేదేమిటి చెప్మా :)
జిలేబి