Tuesday, November 8, 2016

కుదురిన సమయము టపాల కుంకుమ నిడితీ !

 
 
 
 
కుదురిన సమయము టపాల కుంకుమ నిడితీ !
అదిరిందా ? కుదిరిందా ?
ముదితా !రమణీ !జిలేబి ! ముద్దుల పద్యం
బదురుచు దాగెన్బోవే !
కుదురిన సమయము టపాల కుంకుమ నిడితీ !
 
 
చీర్స్
జిలేబి
 
 
 

200 comments:



  1. విసిరెను వాల్జెడ లొయ్యా
    రి సుతారముగా జిలేబి రింగున రింగుల్
    గుసగుస లాడగ మది, రూ
    పసిబాలుడు పెండ్లియాడి పడసె కుమారున్!

    జిలేబి

    ReplyDelete
  2. అసమ శరుని తూపుల బడి
    రసమయ రమణీ మనోఙ్ణ ప్రాయము విరిసెన్
    శశి వదనకు మనసిడి తా
    పసి బాలుడు పెండ్లియాడి పడసె కుమారున్ .

    ReplyDelete
  3. అసమ శరుని తూపుల బడి
    రసమయ రమణీ మనోఙ్ణ ప్రాయము విరిసెన్
    శశి వదనకు మనసిడి తా
    పసి బాలుడు పెండ్లియాడి పడసె కుమారున్ .

    ReplyDelete



  4. నమ్మకము సెంటిమెంటుల
    వమ్మగు మాటల జిలేబి వగచెను తానౌ !
    కమ్మని జీవన మధురిమ
    యిమ్మనుజుల కిట గనంగ యిక్కట్లేమౌ ?

    జిలేబి

    ReplyDelete


  5. అన్నను మించిన తమ్ముడు
    మిన్నగు పద్యంబులవియె మిరుమిట్లు గనన్
    తిన్నగ జెప్పెను వాటిన్
    యెన్నదగినవగుచు నిలచె యెప్పటి కైనన్!

    జిలేబి

    ReplyDelete


  6. ఐసఫరు దేరు ఫోరన
    నైసౌ హేవు మనసు, గననైతి నిజంబున్ !
    భేషౌ స్వామీ వైవీ
    రేసా నందా వెలసిరి రేటింగ్వలయున్ :)

    జిలేబి

    ReplyDelete

  7. వజ్రపుటుంగర మదిగో !
    యాజ్రమున గలిగె జిలేబి యావత్కాంతీ !
    యుజ్రము కలిగిన దినమున్
    కజ్రీ వోలె గమకముల కందము గనవే !

    జిలేబి

    ReplyDelete


  8. అన్నిటికీ నీవున్నా
    వన్నా! రామన్న, గావ వయ్యా జనులన్ !
    మిన్నగ నాతని తలచుచు
    కన్నుల గాంచెను జిలేబి ఖైదీ గానన్ !

    జిలేబి

    ReplyDelete


  9. చిత్ర మైన బతుకు చితికెను పెనిమిటి
    బోవ గాను గట్టి బుద్ధి గాంచి
    దత్తత గొనె యతిని, తనకొక కొమరుని
    భర్తృరహిత సంతుఁ బడసి మురిసె!

    జిలేబి

    ReplyDelete


  10. శతకోటి దరిద్రాలకు
    చితికిన బతుకుల జిలేబి చిట్కా గనదా !
    వెతికున దారుల్లేవా
    కతికిన డబ్బులకు లెక్క కనుగొన లేరా !

    జిలేబి

    ReplyDelete


  11. Modi's timing of black money surgical strike :)

    నిన్నే మో మోడీ! నే
    డన్నా డోనాల్డు పేల్చె డమడమ ఔట్ల
    న్నన్నా ముంబై మార్కె
    ట్టన్నా చచ్చె పొరిమాలె ఠవఠవ యనుచున్ !

    జిలేబి

    ReplyDelete


  12. థెరెసా మే! చీర్సులివీ !
    భరతావని మురిసె చీర పసిడి గనంగన్!
    కరతాళంబుల బెంగ్లూ
    రు రసన గాంచె హలసూరు రుద్రుని గొలువన్

    జిలేబి

    ReplyDelete


  13. వలపు సెగ లంటు కుంటే
    తలపులు తియ్యని జిలేబి తమకంబయ్యెన్ !
    కలయందొక రాజా వా
    రలవోకగ గానిపించె రసికత జేర్చన్ !

    జిలేబి

    ReplyDelete


  14. మోడీ! డోనాల్డూ ! పూ
    బోడి జిలేబి ! గనవచ్చు బోల్డగు డెసిషన్ !
    వేడి గనవచ్చు పాకి
    స్తాన్ దండిగ గానవచ్చు సైడున కిక్కుల్ :)

    జిలేబి

    ReplyDelete

  15. తెంపరి విజేత ట్రంపౌ !
    కంపించిరి గాద యమెరికా జనులచటన్ !
    చింపిరి చేష్టల గాడే
    బంపరు ప్రైజును జిలేబి బాగుగ గెల్చెన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ట్ట్రాంపితిరి గద ట్రంపెట టముకేసి మరీ
      ట్రంపును తిరగేసీ మరగేసీ చింపేసీ ఒంపేసీ
      ఇంపుగ తా గెల్చినను చింపిరి ముదరేసీ
      చంపగ నిటుల న్యాయమే సింపులుగ, తంపుల మదరాసీ ...
      :) jf ...
      మీ పద్యం బహు సూపరో ...
      డూపర్ ...
      __/\__ ...

      Delete


  16. అదిగో "అనంత" పవనుడు !
    కదిలింది యనంతపురము కథలను విననన్
    గద! సీమాంధ్రపు హక్కుల
    కదన జిలేబి మన పవన కల్యాణుడనన్ !

    జిలేబి

    ReplyDelete

  17. ప్రాతః కాలము వచ్చె
    న్నీతరుణమనన్ జిలేబి నీమము గానన్,
    సీతమ్మా ! జడకుచ్చి
    ళ్ళే తరుణి సుగంధ పాదలేపనములగున్ :)

    జిలేబి

    ReplyDelete


  18. మళ్ళీ యేటీ యెమ్ములు
    కళ్లాపుల దీకొని కళకళ లాడుచు మా
    కళ్ళకగుపించెనుగదా !
    మళ్ళీ రాదే జిలేబి మన సమయమిదే :)

    జిలేబి

    ReplyDelete


  19. ఉద్యోగస్తులకున్నూ
    సద్యోగపు డ్రయివరులకు చక్కని లాట్రీ !
    అద్యత నీయ కరెన్సీ
    మధ్య దళారికి జిలేబి మస్తుగ కమిషన్ :)

    జిలేబి

    ReplyDelete


  20. పాకిస్తానుకు గండీ !
    మీకికలేదోయి మార్గ మేదీ, మోడీ
    తాకిడియిది తెలుసుకొనుడు
    బాకీ నకిలీ బటారుబయలు కరెన్సీ !

    జిలేబి

    ReplyDelete


  21. శ్రీ చిన్నజీయరటు కా
    ణాచి గదా వేదమార్గ నడవడి కలన
    న్నాచరణల సాంఘిక సే
    వాచయముల చాల మేలు వారధి గూడన్!

    జిలేబి

    ReplyDelete


  22. కాలా దందాలిక చె
    ల్లేలా లేదోయి యెల్ల లే లేక
    న్నోలా డ్రైవరు విపినుడి
    మేలైన నడతను ఢిల్లి మేల్గాంచెనుగా!

    జిలేబి

    ReplyDelete


  23. ఔమల్ల ! మస్తుగా జె
    ప్పే మాయమ్మోవ్ జిలేబి, పేల్చేవు టపా
    లో మాంచి కవిత పద్మా !
    యేమై నాయో పదాలు యిన్నాళ్లు గదా :)

    జిలేబి

    ReplyDelete


  24. మెక్కెను దండిగ చిక్కిన
    ముక్కల డెందము సుగంధ మోదము గానన్
    గ్రక్కున బట్టుచు చక్కగ
    కుక్కకుఁ దలఁ బ్రాలు వోయు కుతుకము గలిగెన్.

    జిలేబి

    ReplyDelete


  25. మేకమెరికాను గ్రేటని
    తా కంఠంబు సరిజోషు తాకత్తులతో
    బాకా నూదె జిలేబీ,
    పోగాలం బొచ్చె పాకు బొత్తము లూడన్ :)

    జిలేబి

    ReplyDelete


  26. మోడీ గుజ్జూ భాయి మ
    రే డోనాల్డు బిజినెస్సు రేడు! యమెరికా
    జోడు యిక మేలు గాంచు
    న్నో డమడమలాడుచూ మనోళ్లందరికిన్ !

    జిలేబి

    ReplyDelete


  27. పాపం శ్రీధర బుక్యా !
    తాపమ్ముల ప్రేమ రాగ తాళంబుల నా
    లాపించుచుండె, నోట్ల క
    లాపమ్ముల విష్ణుమాయల తలతిరిగె బో :)

    జిలేబి

    ReplyDelete


  28. కష్ట సుఖాలు మనసులో
    యిష్టాయిష్టాలు, యింట యింతి జిలేబీ
    సుష్టగు సేవలు, యింతయ
    దృష్టమ్ములనిచ్చె బ్లాగు దృగ్ధము మేలై !

    జిలేబి

    ReplyDelete


  29. మానిని జీన్సుల నాడెను
    తానము తప్పుచు జిలేబి తయితక్కలనన్,
    మానమ్ములిడిరి చీరకు
    తానమ్మిడి నమెరికన్ల తరుణీ రమణుల్ !

    జిలేబి

    ReplyDelete


  30. జీన్సుల నొదలదు చీరల
    చాన్సుల నొదలదు జిలేబి చక్కని చుక్కా :)
    గన్సటు కౌముది పెనిమిటి
    కన్సో గల నీలవేణి కమనీయంబై :)

    జిలేబి

    ReplyDelete


  31. నోట్ల ప్రహసనంబు నెమలి
    దాట్లకు సరిపోయెగాద దస్కము రాకన్ :)
    కోట్లకొలది రూపాయలు
    యెట్లిక మార్తురు జిలేబి యెవరికి తెలుసూ !

    జిలేబి

    ReplyDelete


  32. రాముని కీర్తన లు చదువ
    యే మనుజునికీ జిలేబి యిచ్చుక లేదే !
    సోమరి పోతులు గదవే
    కామెంట్లూ పెట్టరిచట కానదు సాయం !

    జిలేబి

    ReplyDelete


  33. చదివే నాధులు లేరే
    మది తానిక యెట్లు గూర్చు మంచి కవితలన్‌!
    కదలండి తెలుగు జనులా
    ర దమ్ము బట్టండి మీరు రంజిల జేయన్

    జిలేబి

    ReplyDelete

  34. న్యూజీ లాండున సూచన
    హో! జేజేబువ్వ దినమహో !జను లారా
    ఆ జలధిజునిది కార్యం
    బే ?జర భద్రం జిలేబి భీకర దినమౌ !

    జిలేబి

    ReplyDelete


  35. గొంగళి పురుగుకు తెలియక
    సింగారంబుల విచిత్ర చిత్రము వోలెన్
    బంగరు వర్ణమయంబుగ
    చెంగటతా మారెను మరి శీఘ్రము గానన్ !

    జిలేబి

    ReplyDelete


  36. సారంగ యే యజెండా
    తో, రంగులకళ్లజోడు తో, పని జేస్తోం
    దో, రంగమ్మది యెవ్వరి
    దో, రంజు జిలేబి యెవరిదో, తెలిసెను బో :)

    జిలేబి

    ReplyDelete


  37. ట్రంపుకు ఓటేశాడని
    పింపిళ్లాడుచు‌ జిలేబి పెనిమిటి దూరం
    బంపెను నెలరో జులకిక
    కుంపటి మాటుకికరాకు, కోరిన కొరడా :)

    జిలేబి

    ReplyDelete


  38. మమతా వేశం బదిగో !
    యమలిన బంగ్లా జిలేబి యవసర మేమో ?
    కమలమున కెదురు బోవగ
    సమిష్టి యత్నముల జేయ చకబెక లాడెన్ !

    జలేబి

    ReplyDelete


  39. ఇదిగో పచాసు దినములు
    విధిగా నోపిక గొనవలె విధిరాతల మా
    ర్చెద యచ్చేదిన్ వచ్చును
    కుదురును దేశము కుదేలు కూసింతగనన్

    జిలేబి

    ReplyDelete


  40. మూలపు రుషుడౌ హరియే
    మూల పురుషుడుగద, రామమూర్తి జిలేబీ!
    మూలాధారంబతడౌ,
    యేలిక యతడు మనకెల్ల యేలుబడియనన్

    జిలేబి

    ReplyDelete


  41. కోటాను కోట్ల దస్కపు
    మేటల బేర్చుచు జిలేబి మేగారంబున్
    వాటముగ నొక్కి ఘనమై
    పాటుపడినవారి కెట్లు ఫలితము దక్కున్?

    జిలేబి

    ReplyDelete


  42. గగన విహారములను జే
    యగ తక్దీరు గలవాడు యమెరికను సుమీ !
    మగధీరా, ట్రంపూ యీ
    జగమ్ము నేలవలె చాలు చాలను వరకున్ :)

    జిలేబి

    ReplyDelete


  43. బండికి యిరుసై యీశుడు
    మండలమై గంగయై కమండలమై తా
    నిండుగ వెలయుచు భక్తుని
    గుండెల ఝరులన శివకవి గుంఛము‌ గాంచెన్

    జిలేబి

    ReplyDelete


  44. ఆటగ నాటవెలది స
    య్యాటలనగ తేటగీతి, యావన్మందీ
    బాటన రావలయును కో
    లాటము నేర్వన్ జిలేబి లబ్జుగ నేడే !

    జిలేబి

    ReplyDelete


  45. పౌర్ణమి ! బ్లాగ్జ్యోతిష్కులు
    యర్ణపు మహిమన జిలేబి యవలీలగన
    న్నర్ణోభవమూదిరి గద
    యూర్ణము వికసింప శర్మ యుత్పల మాలన్ :)

    జిలేబి

    ReplyDelete


  46. కష్టాలెల్లప్పుడునూ
    నిష్టగ యున్న జనుల దరి నిలవదు గదవే
    యిష్టాయిష్టంబులటు య
    రిష్టంబుల మూలమగుచు రేకవిడిలునౌ !

    జిలేబి

    ReplyDelete


  47. భండన శంకరుడయ్యరు
    గుండెల నిండుగను ముద్దుగుమ్మ యనంగన్
    గుండమ్మజిలేబీ, చా
    ముండను, వీక్షించి మగఁడు మోదము నందెన్

    జిలేబి

    ReplyDelete


  48. సినిమా చూపించెను మన
    జనులకు మోడీ జిలేబి‌ జంతర్ మంతర్!
    వినుడో‌యీ మన జీవన
    మున మార్పులు వచ్చు గాద మున్ముందుగనన్

    జిలేబి

    ReplyDelete


  49. వీర జిలేబీ మాతా !
    మీరడిగిన కారటూను మీదౌ జాంగ్రీ
    కారప్పూస యరిసె మై
    సూర్పాకన వవిధ షడ్రశోపేతంబౌ :)

    జిలేబి

    ReplyDelete



  50. శంకా మా"నస" యను మా
    నం కాయులు పాలకోవ, నారద సంవా
    దం కందంబు జిలేబీ
    యం కమనీయ యరిసెల మయంబౌ జాంగ్రీ :)

    జిలేబి

    ReplyDelete


  51. పొగిడెన్నో లేక జిలే
    బి గిల్లెనో తిరుమలేశు బిత్తరు బోయెన్
    జిగినా పలుకుల సారం
    గ గూర్చి తెలియని జనులిలన గలరా రమణీ :)

    జిలేబి

    ReplyDelete


  52. బాలుడ ! షికారు కెళ్ళెద
    కాలాకాలము గొఱియల కాచెద నోయీ !
    కోలాహలముగ భళిరా
    చాలు యముడి వాహనంబు చక్కగ నుండెన్!

    జిలేబి

    ReplyDelete




  53. ఆకాశ సీత గాదా
    మాకామెంటుల జిలేబి ! మామి విహారం
    బే కందమూలములనన్
    మాకందరికీ బలంబు మంచిగ జేర్చున్ :)

    జిలేబి

    ReplyDelete


  54. మీ గురువు గారి సంగతి
    మీకు తెలియవలెను లంఘమేమియు లేకన్
    లక్ష్మణ్ కార్టూన్లెల్లను
    బాగుగ జూచితిమి బో గభాలున సెహభేష్ :)

    జిలేబి

    ReplyDelete


  55. శ్రేష్టము జిలేబి కావ్యా
    ప్రేష్టిత సంఘంబునందు పెనకువ గానన్
    యిష్టంబుగాగ జేయన్
    కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్

    జిలేబి

    ReplyDelete


  56. క్షవర "నకలాయనమ్ముల"
    వివరమ్ములు తెలియవచ్చె విపణీ నగరిన్!
    సవరమ్ముల బంగారము
    ను వంకదారిన మహాజనులు గొట్టిరిబో !


    జిలేబి

    ReplyDelete


  57. పట్రావే పదముల నిటు
    చట్రాతిని నారఁదీయఁ జయ్యన వచ్చు
    న్నాట్రగడపు సొగసు, కుదురు
    వట్రము లోనన్ జిలేబి వలె కందంబౌ !

    జిలేబి

    ReplyDelete



  58. కలిగిన మారాజు వవీ
    బలము కలిగి యుండె నోయి బండికి బలమై
    వెలిగెను జోడెడ్లు, బతికె
    నిలలో యజమాని కొరకు నిమ్మళముగనన్ !

    జిలేబి

    ReplyDelete


  59. మార్కెట్టు కూలడానికి
    జర్కుల డోనాల్డుకున్ను జర సంబంధం
    బేర్కొనమనెను సహచరుడు
    మర్కటముల పోకడ గద మార్కెటు రీతీ :)

    జిలేబి

    ReplyDelete


  60. గూర్ఖా వోలెన్ తిరుగుచు
    బుర్ఖా ల వెనుక ద్రవిణము బుంగుడు పరచన్
    సర్ఖాల నణచవలె నను
    మూర్ఖత్వ మదేలనోయి మోదీ భాయీ :)

    జిలేబి

    ReplyDelete


  61. కక్షలు కార్పణ్యమ్ములు
    శిక్షలు లేకన్నడవిని సింహము రాజై
    భిక్షగ ప్రకృతిగ వేటన
    భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్ ?

    జిలేబి

    ReplyDelete


  62. ఒకపరి కొకపరి జూచుచు
    సకలము మరిచెను ప్రియుండు సత్యము గానన్
    నికటపు సుమధుర మాధురి
    సకియ నయన సమము లగునె జడగతు లెపుడున్


    జిలేబి

    ReplyDelete


  63. వానా వానా వల్ల
    ప్పా నానా తిప్పలు పడబాకయ్యా మా
    మీనా రాణి సుహాసిని
    వీణా నాదంబు లెల్ల వినిపించుదురౌ !

    జిలేబి

    ReplyDelete


  64. రైలటు కూలంగ జనులు
    కాలాతీతమ్ము గాక కరుణా కార్యం
    బై లెక్కలేని యయిదొం
    దల్నో టుల పంచి మేలు దయజూపి రటన్ !

    జిలేబి

    ReplyDelete


  65. నయన మిదం ధన్యం" బను
    నయ గారపు పొత్తముకట నావిష్కృతి! సం
    చయమది మోడీ పద్యపు
    లయలకు సంసృత జిలేబి లక్షణమిడగన్‌!

    జిలేబి

    ReplyDelete


  66. చిల్లర చితికెను నరుడా
    యల్లర్లకు గడ్డు కాల యాపన వచ్చెన్
    గల్లా గల్లంతు గనన్
    భిల్లా రంగా బినామి భిక్షాం దేహీ‌!

    జిలేబి

    ReplyDelete


  67. ఈమధ్య యింటి పట్టున
    మైమరచి జిలేబి జేయ మైసూర్పాకై
    తా మారగాను జయ్యని
    నో మారు వసుంధరమ్మ నోట్సు కదిపితీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అదేవిటి, జిలేబి చెయ్యబోతే మైసూర్పాక్ గా రూపాంతరం చెందిందా?! మీరు పాకశాస్త్రంలో చెయ్యి తిరిగిన వారనుకున్నానే?! 🙂

      Delete

    2. విన్న కోట వారు

      అబ్బే , కిచన్ యిలాఖా మా అయ్యరు గారిదండీ ! ఎప్పుడైనా ఓ సారి బుద్ధి పుడితే పోదారి‌ అని ప్రయత్నించడం అంతే జేకే :)

      జిలేబి

      Delete
    3. వీర జిలే be మాతా,
      కిచన్ లలో అయ్యరులే ఎందుకుందురు? అయ్యంగారులెందుకుండరు? తెలిసీ చెప్పనిచో మీ అయ్యరు డీకిచెనైజేషన్ అగుగాక.

      ఇట్లు తమ అనుంగు శిష్యలు
      శంకా మీ నసు లు
      కలాకాన్, బాసుంది, దూద్ పేడ, కజ్జికాయ వగైరాలు.

      Delete

    4. స్త్రీలేని బాసుగారు

      చాలా సింపల్ అండీ ; అయ్యర్లు భోళాశంకర్లు ; అయ్యంగార్లు చాలాక్ విష్ణుసంభూతులు :)

      జిలేబి

      Delete
    5. మరి యొక సం దేహము
      అయ్యంగారుల వంట యిళ్ళలో అయ్యరులను ప్రవేశింపనిత్తురా?
      లేక, అయ్యంగారులే వంటమనుషులుగా తెచ్చుకుందురా?

      Delete

    6. ఇది చాలా సీక్రెట్ విషయమండీ .

      చెప్పడం కుదరదు :)

      ఆమ్యామ్యా ఎమన్నా గిట్టు బాటు ఉందా ? అయితే ఎంత ? దాని మీద సమాధానం ఆధార పడి ఉంటుంది :)



      జిలేబి

      Delete
    7. తమరు నిగూఢమగు రహస్యమును తెలియజెప్పుటకై మా గురుమారాణి జిలేబీ తీర్థస్వామినివారి‘‘సహస్ర మేధోచ్ఛేద అపూర్వ ఏ.తె. పద్యమాలిక’’ యొక్క ప్రథమ అముద్రణ యొక్క మొదటి ప్రతిని ‘‘ఆ మ్యావ్ మ్యావ్’’ గా తమకు సమర్పించుకొనెదనని నొక్కి వక్కాణించుచున్నాను.

      ఇట్లు
      స్వామి కిచకిచానంద
      వానర నగర్,
      మర్కటాశ్రమము,
      జిలేబీ తీర్థ స్వామిని వారి ప్రాంగణము.

      Delete


    8. అక్కడక్కడా ఉంటారండీ . అక్కడక్కడా ఉండరండీ


      జిలేబి

      Delete


  68. మేమన్యదేశ పదముల
    మామూలుగ పరిగణించి మాండలికములన్
    సామాన్యముగా యెన్నిక
    గా మన్నించము జిలేబి గమనిక వలయున్ !

    జిలేబి

    ReplyDelete


  69. పిసినారి కాపురమ్మున
    కొసరి కొసరి వడ్డనలను గూర్చు పెనిమిటీ !
    పిసరంత పిండి కొండం
    త సంబడముగాను జేయు తరుణి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  70. వెలుగుకు సూర్యుడు చంద్రుడు
    జిలుగుకు తారలు జిలేబి చిలిపి కనులు మే
    ల్కొలుపులకు తావి మకరం
    దలాలితముగన్ కుముదిని దర్శనముగదా !

    జిలేబి

    ReplyDelete


  71. ఆడ యీడ యెక్క డైనాను బడబడ
    లాడువారు, బొంకు లాడువారు,
    కూడి జనుల చెడుపు కుటిలులు, వినవే జి
    లేబి లేకి తనము లేల మనకు !

    జిలేబి

    ReplyDelete


  72. తెలిసిన వారికి చెప్ప న
    సలవసరము లేదు తెలివి చక్కగ గల వా
    రులెటులయిన నేర్తురు గద !
    తెలియని వారికి వచింప తెలియదు బోమ్మా !

    జిలేబి

    ReplyDelete


  73. మానావరిగా మన్నిక
    గానగునో యివి జనులకు కరకర లాడన్
    చీనా వాడివి దోసెలు !
    పానం పయిలం జిలేబి ఫారెను వలదే !

    జిలేబి

    ReplyDelete


  74. కొసరుకు మలి కొసరడుగుచు
    రసవత్తరముగ జిలేబి రాణించగనన్
    ముసిముసి నగవుల మురిపె
    మ్ము సరాగములాడెనోయి ముద్దులకొలికీ !

    జిలేబి

    ReplyDelete


  75. చదువుల మత్తున గూర్చిరి
    వెదకగ దొరకని కొలచన వేంకట శర్మన్
    కుదురుగ నేర్చి యెదిగితిమి
    పదుగురు పొగడన్ జిలేబి పట్టుగ మేమూ !

    జిలేబి

    ReplyDelete


  76. మార్నింగ్ చాయ్ బిస్కెట్టులు
    మోర్నింగు సమయములోన మొహరించెను బో !
    వార్నింగిదే జిలేబీ,
    మర్నా మిట్నా "మనీ" కి మనిషికి తప్పవ్ :)

    జిలేబి

    ReplyDelete

  77. గురువుకు నామా లిడవలె
    పరిపరి విధముల జిలేబి భయము భయముగా
    పరుగిడవలెనోయి యతం
    డరుగున రాకూడదెపుడు రయ్యన బోవన్ :)

    జిలేబి

    ReplyDelete

  78. అవనిని బేర్చిన రాగము
    లవలీలగ నారదాదులకు వినిపించ
    న్నవ భావోద్వేగముతో
    భువి వీడితి వోయి బాలమురళీ కృష్ణా !

    జిలేబి

    ReplyDelete


  79. కొత్త మొబైలు, కొత్త పెళ్ళాం మోజు ఇంతింత గాదయా !


    అరచేత చిక్కిన రమణి
    కరవాణి సరసములాడు కనులార్చుగనన్
    మురిపెమ్ముతోడ ముద్దుగ
    పురుషుడు పసుపాడి ముడిచెఁబూమాలనొగిన్ :)

    జిలేబి

    ReplyDelete


  80. ఆజాను బాహువుండ త
    డే జాహ్నవి పతి జిలేబి రేడై నిలచెన్
    సాజము నాతని నడతయు
    కూజంతం రామరామ కువలయ రామా !

    జిలేబి

    ReplyDelete


  81. దంతుర్తి శర్మ యెవరో
    చెంతన దంతపు నవాబు చిక్కె, నమెరికా
    కొంత కెలుకంగ తెలియన్
    వింతగ గాంచెన్ జిలేబి విదురుల తీరున్ :)

    జిలేబి

    ReplyDelete

  82. గుమ్మడి కాయల బరువ
    మ్మమ్మా మానిక జిలేబి మారుతి చేతన్
    నిమ్మళము గాను సుంకము
    డామ్మని రప్పించెను గద రాముని మహిమన్ !

    జిలేబి

    ReplyDelete


  83. పోగాలమ్మది రాగన్,
    భోగములకు గద్దెనెక్కు పురుషుడె, యార్యా,
    రోగములచేత చిక్కును
    వేగము వలదోయి, నేల విడి సామేలన్ !

    జిలేబి

    ReplyDelete


  84. మనమోహనుడు నిదురవిడి
    చె నల్లధనము సమరమది చెల్లదనెను బో !
    తనదైన శైలి వారిది,
    మనోహరుడు మాటలోన మంకు జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  85. ఆ రాజ్య సభన పలికిరి
    చారణు డచ్చట జిలేబి చకితము గానన్,
    స్మారక యనిర్వ హణయట,
    మారకమును మార్చు తీరు మహిలో సుమతీ :)

    జిలేబి

    ReplyDelete


  86. ఎంత తపనో మనుజుడా
    సాంతంబు గవర్నమెంటు జాబును వీడెన్
    వింతైన చిత్ర సీమన
    కాంతా కవితన్ జిలేబి గావింప చనెన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "ఎంత తపనో మనుజుడా ......."
      చాలా సొగసుగా చెప్పారు జిలేబి గారు 👌.

      Delete


  87. చెప్పులు కుట్టించుకొనెను
    మెప్పుగ యిచ్చెను యిరాని మేలౌ వందా!
    కొప్పున్నావిడ కదిగో
    చప్పున దొరికెన్ జిలేబి చక్కని సమయం‌!

    జిలేబి

    ReplyDelete


  88. టెన్ కే రన్నున్ కేటీ
    యార్ గావించెను జిలేబి యాహూ యనుచున్
    బాకా చరణూ, మిర్జా ,
    సాగెను జనవాహిని చకచక పరుగులనన్ !

    జిలేబి

    ReplyDelete


  89. ఒద్దనె నరాచకమ్మును
    బుద్ధుఁడు, హింసయె హితమని బోధించె నిలన్,
    రుద్దుచు వైషమ్యముల
    న్నద్దరి లష్కరు మనుజులు నరకము గానన్ !

    జిలేబి

    ReplyDelete


  90. వందలు వేలన లక్షల
    మందికి దస్కము జిలేబి మస్తుగ బోయెన్
    కొందరి కైనను బతుకున
    గంధము బూయన్నవి సహకారంబౌనో !

    జిలేబి

    ReplyDelete

  91. సిగ్గెగ్గులిక వదులవలె
    పగ్గము బట్టగ జిలేబి పదవులు మ‌నవే !
    నెగ్గ వలయు జీవితమున
    పెగ్గుల కైపుల పదవుల పెదరాయుడనన్

    జిలేబి

    ReplyDelete


  92. మా మాట పైన, మీ పలు
    కేమో మరి కింద యుండి కేలుగొనవలెన్
    మేమే రాజుల మోయీ
    యీ మా పలుకే జిలేబి యీ భువి నేలున్!

    జిలేబి

    ReplyDelete


  93. హిందూ వివాహ వేదిక
    యందము గనవే జిలేబి యద్భుత మదియే !
    డెందము నెరయ మనుజు లా
    నందము గాన నెలకొల్పిన పరిణయమదీ !

    జిలేబి

    ReplyDelete


  94. ఆక్రోస దివశ మిదియే
    చక్రము మొదలాయెనోయి చర్నా కోలన్
    డిక్రీ లిచ్చె విపక్షపు
    జిగ్రీ దోస్తులు జిలేబి జిమ్మడ వీడన్ !

    జిలేబి

    ReplyDelete


  95. మనువాడి, మదిని దోచుచు
    వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టు
    న్ననుమానము వలదు సుమీ
    మన చిత్తంబులను విష్ణు మాయల దేల్చున్ !

    జిలేబి

    ReplyDelete


  96. స్థాలీ పులాక న్యాయము
    మాలావుగ వంట జేసి మాచన వడ్డిం
    చే లావణ్యంబిదియే!
    యేలాటి టపాలకైన యెసరుగలదిటన్ :)

    జిలేబి

    ReplyDelete


  97. మనుజుల నైజంబన యెస
    రును బెట్టుదురోయి జాగురూకత వలయున్
    మునుపటి కన్నను హెచ్చై
    న నాణ్యతగల యెసరివ్వి నమ్ము జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  98. అత్తెసరు మార్కు లొచ్చెను
    నత్త నడక చదువులన్న నరసింహన్నా !
    బిత్తరు బోవుచు జనులటు
    యొత్తిడి బెట్టగ చదివిన యుక్తి చదువులౌ‌!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. 'నరసింహన్నా' అంటే మరీ వీధి రౌడీని పిలిచినట్లుంది 🙁. ఎంతయినా రాయుడిని కదా 'నరసింహరాయా' అనండి 😎(ఛందస్సు సంగతి మాత్రం నాకు తెలియదు).

      Delete
    2. మిన్నమాట నరసింహారాయుడు గారూ ...
      :)

      Delete
    3. ధన్యవాదాలు బండి వారూ. మా తాత గారి పేరదే, నా దగ్గరకి వచ్చేసరికి "రావు" అయింది 🙂.

      Delete
    4. పేరు మార్చుకుంటున్నారా ఏంటీ :)

      Delete
    5. అబ్బే, లేదు శర్మ గారూ. వేరే వాళ్ళు నా పేరు మార్చేయకుండా ఏదో నా జాగ్రత్త 😀

      Delete


  99. నిలబడితే కలబడుతుం
    దిల కల బడిన నిలబడు నది యట జిలేబీ !
    కలవారి పలుకులవి ! య
    ర్థ లకారంబివ్వవలెను రాబడి గలదో :)

    జిలేబి

    ReplyDelete


  100. నిదురన మరచెను నాతని
    కుదురుగ తెలియక కువలయ కునుకులు దీసెన్
    పదిలంబవ మనసతని స
    పదిని గనంగ తహతహ యుపాసన జేసెన్ !

    జిలేబి

    ReplyDelete


  101. అనునిత్యపు ముద్దుల మరు
    వను వీలగునా పుడమికి వాస్తవ మిదియే !
    మనువాడుచు ధరణి యనం
    తుని నాకాశంబుగా స్తుతించె జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  102. గోదారి నీళ్ళ కేన్సరు !
    బాధా కరమైనది గద బతుకుల తీరుల్ !
    వేదన యేలన్ సరి పరి
    శోధనతో కలుషిత నది సూక్ష్మము గనుమా !

    జిలేబి

    ReplyDelete


  103. నరసింహన్నా యంటే
    మరీ గడుగ్గాయి యన్న మాట వలె జిలే
    బి రకంబు గాద, యింపొల
    యు రాయ నరసింహరాయ యుత్తమము సుమీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. 'గడుగ్గాయి' కాదు, 'గల్లీ రౌడీ' 🙂.
      Yes, 'నరసింహరాయ' ఉత్తమం. థాంక్స్👌
      (తెనాలి రామకృష్ణ కవి "నరసింహ కృష్ణ రాయని" పద్యం తెలుసుగా😀)

      Delete


  104. భద్రంబపార్టు మెంట్లన్
    చిద్రంబాయెను జిలేబి చిన్న పలకరిం
    పౌ ద్రఢిమ గాంచెను జిలే
    బీ, ద్రప్సంబాయె బతుకు భీతిని గనుచున్

    జిలేబి

    ReplyDelete

  105. అరసోలన చిత్రంబులు
    సరస్వతి పలుకుల సవ్యసాచిటపాలున్
    చెరగని నుడికారంబులు
    తరుగని జాతీయములు జతగ సామెతలౌ !

    జిలేబి

    ReplyDelete


  106. వెలుగు నిక వెలగపూడి,క
    లలు సాకారంబుగాన లక్షణము గనన్
    సులగనము నేడు చంద్ర
    న్న లబ్ధి యమరావతిగన నాంధ్ర జిలేబీ !

    జిలేబి

    ReplyDelete


  107. మా పల్లోళ్లు మెషీన్లన్
    స్వైపింగ్లన్ తెచ్చినారు సయ్యనుచు జిలే
    బీ,బతుకనేర్చి నజనులు,
    మీపట్నపు యేడ్పులే సుమీ మీ వీక్నెస్ :)

    జిలేబి

    ReplyDelete


  108. చదవడము పెద్దల పలుకు
    ల దిశా నిర్దేశమనుచు లక్ష్యము గానన్
    మదినెంచి యనుభవములను
    గుదిగుచ్చి టపాలనిడితి కుదిరిన వేళన్ !

    జిలేబి

    ReplyDelete


  109. పరహిత వైద్యము జనులకు
    నిరవధికముగ మన యొజ్జ నీమము గా జే
    సిరి మేలుగాను సుగుణ వి
    దురులు గద, జిలేబి వోలె దొరలే సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete


  110. అపసవ్య కాల సర్పమ
    ది పరిగొనె జనుల జిలేబి దిక్కుల ధాటి
    న్నుపయోగమ్మేమి సుమా
    యపరిష్కృతమైనకర్మ యన్నిటి మూలం !

    జిలేబి

    ReplyDelete


  111. పోస్టు మార్టములను జేసె పో జిలేబి
    ఘోస్టు దినమున వార్తల గుచ్చి జూచి
    బెస్టు గాను తెలిపెనోయి బెమ్మ రాత
    జస్టు మిస్సాయె గతులెల్ల జబ్బ బలము !

    జిలేబి

    ReplyDelete


  112. దండగ గదవే యోలగ
    ముండాయని పిలువమనుచు ముదితయె జెప్పెన్,
    బండారము బయ టపడగ
    నిండా మునిగిరి జిలేబి నీమము లేకన్

    జిలేబి

    ReplyDelete


  113. చంద్రన్న యనంత పురము!
    హంద్రీ నీవా నదులటు హత్తుకొనగన
    న్నాంధ్రా జిలేబి రాయల
    కేంద్రము, రతనాలసీమ కేదారంబౌ !

    జిలేబి

    ReplyDelete


  114. వందా పాతిక పరకల
    చిందుల విందుల జిలేబి చిత్రంబుగన
    న్నందరు యెంతో కొంతన
    బిందాసు గనన్ బినామి బిల్లుల గాళ్ళం !


    జిలేబి

    ReplyDelete


  115. ఒకటో తారీకు కథల
    చకచక జెప్పెను జిలేబి చలచల్లని కా
    లగమనము జీత మెల్లను
    సగంధ యింటావిడకటు చప్పున యివ్వన్ :)

    జిలేబి

    ReplyDelete


  116. పదచాతుర్యము తో గ
    ట్టి దరువులను బేర్చె టింగు టింగున పద్మా
    ర్పిత, పంచదశపు లోకము
    నుతించె తనదైన శైలి‌ నూతన రీతిన్ :)


    జిలేబి

    ReplyDelete


  117. రణమేల రాని రాగ‌ము
    ల నాలపించుచు జిలేబి లకుముకి పిట్టా!
    కనులన జూడకు తప్పొ
    ప్పను మాట వలపుల మాటు పలుకవలదు బో :)

    జిలేబి

    ReplyDelete


  118. జాతీయ గీతమును సిని
    మా తెర తీయగ జిలేబి మాన్యత గానన్
    వేతురు జనులెల్లరటన్
    జోతలు తెలుపవలె జోరు జోరుగ జయహో !

    జిలేబి

    ReplyDelete

  119. అవహేళన కోర్టార్డరు
    లవశ్యమా ప్రచురణ? జనులటు రాయగనన్
    సవరించుట మీ బాధ్యత
    గవనుల గాపాడ రావు గారికి సలహా !

    జిలేబి

    ReplyDelete


  120. కోటికి పడగెత్తిన తెలి
    సేటట్లుగ జేయలేరు సేట్లటు నేడౌ !
    చేటల కొలదీ నోట్లటు
    కోటల జేరెను జిలేబి కోట్లే కోట్లూ !

    జిలేబి

    ReplyDelete


  121. సినిమాల కనుగుణముగా
    మునుపటి జాతీయగీత మును మార్చవలె
    న్ననుమాట వలదు వలదో
    యి నరస రాయల జిలేబి యింగితము గనూ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మొత్తానికే సరికొత్త గీతాన్ని తయారు చేసుకోవడం .... అని నా కవిహృదయం. మునుపటి గీతంలో మార్పులు చేసి తిరగరాయాలని నేననలేదు, అటువంటి మాట అపచారం కదా.
      అయినా నా మునుపటి వ్యాఖ్య jk మాత్రమే.

      Delete
    2. jk ok గురువు గారు కానీ ఆ మాత్రానికి
      కొత్త గీతమవసరం లేదు సింపుల్గా
      ట్యూన్ మార్పుతో కిర్రెక్కించేయగల
      ధ్వని ముద్రణగాళ్ళున్నారు గదా!
      jk again ...
      :)

      Delete


  122. కవనము సరిరాగన్, సరి
    కువలయ కుముదిని కుహుకుహు గుణముల గానన్
    నవరాగముల గనన్, కే
    శవ పూజల వలన జన్మ సార్థక మగురా!

    జిలేబి

    ReplyDelete


  123. ఖాతా భరణము నివ్వడు
    పోతే పించనును కోరి, పోకిరి జేసెన్
    చేతులు కాలేయ్ బాబోయ్ !
    గోతులు తవ్విరి జిలేబి గొంతుక నులిమీ !

    జిలేబి

    ReplyDelete


  124. భండారు వారు మీకూ
    మండెడు మీ ప్రియ యనానిమస్సులకున్నూ
    గుండెల నిండా దండము
    లండయ్యా సామిరంగ లజ్జే లేదోయ్ !

    జిలేబి

    ReplyDelete


  125. బ్యాంకున క్యూలో నిలబడె
    చాంగు భళా గర్భిణియగు సర్వేషా నొ
    ప్పుంగనగన్ పురుడాయె
    న్నంగట బేబీ జిలేబి నవ్వుల బూయన్ !

    జిలేబి

    ReplyDelete


  126. మా చంద్రబాబు ఫోనుకు
    తా చక్కగనంపెనోయి దండిగ నోట్లూ !
    ఆచరణ లో నరేంద్రుని
    కే చక్కని పాఠములను నేర్పెడి వాడౌ !

    జిలేబి

    ReplyDelete


  127. మంట మొదలాయె మరియిక
    వంట మొదలు బెట్టు మోడి, వడ్డన జూడన్
    యింటా వంటా యెరుగని
    తంటాలుమొదలగునోయి తాటవదుల్చన్ :)

    జిలేబి

    ReplyDelete


  128. ఈశ్వరుని లీల తెలియన్
    విశ్వాసము వలయునోయి విదురుని వోలె
    న్నాశ్వాసముల చదువవలె
    శాశ్వత మగు కష్టములకు శాంతము గూడున్!

    జిలేబి

    ReplyDelete


  129. అవధాన రాజ హంసిని
    యువరాణి శతావధా‌‌ని యుక్తమయూరీ,
    కవనంబుల నాస్వాదిం
    చ వరంగల్లుకు జిలేబి చక్కగ వచ్చెన్ !


    జిలేబి

    ReplyDelete


  130. సుమతీ శతకము లో చె
    ప్పె మాచనవరుల జిలేబి పేర్మిగ జేసెన్ !
    రమణీ లలామలకు గల
    కమనీయత యది గదా సుకవివరు లారా !

    జిలేబి

    ReplyDelete


  131. అదిగో జయలలిత పయన
    మదిగో యింద్ర సభయందు మహిమాన్వితమై
    పదిలంబుగా నమరగన్,
    పదికాలము నిలుతువమ్మ ప్రజల మనమునన్

    జిలేబి

    ReplyDelete


  132. నల్ల పిల్లుల కథజెప్పి నడ్డి విరగ
    గొట్టె, సెహభేషు గాను బ్లాగ్లోక శర్మ,
    దేశ మున దరిద్రంబిక తీరు నా తె
    లుపవలెను జాతకములసలు తెలుపవలె !

    జిలేబి

    ReplyDelete

  133. పదిలంబాయెను వార్తల
    కుదేలు మనెనమ్మ జనులు కోమల వళ్ళీ !
    కదిలించావమ్మమదిని
    సదనము జేరమ్మ రామచంద్రుడు వేచెన్

    జిలేబి

    ReplyDelete


  134. శోధిని కే శోధనయౌ ?
    యోధుండట చెట్టునెక్క యోగ్యంబౌనో
    నాదరణ లేక బోవుచు ?
    రాదారికి రమ్మ తెలుగు రావిడి లాడన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "శోధిని" వ్యాఖ్యల విభాగం బిగుసుకుందనా మీ కవిహృదయం?

      Delete


  135. వెండితెర తార కలిసెను
    నిండుగ పుడమిని జిలేబి నీమంబిదియే
    కొండాట్టంబుల దినములు
    మెండుగ కలకాలమెట్లు మేనిని నిలచున్ !

    జిలేబి

    ReplyDelete


  136. అపరాధ భావనల నలి
    గి పనికి రాని పడతియని కిరికిరి యేలన్
    సపదిని గాంచిన పెనిమిటి
    సపర్యలను జేయగాను సందియ మేలన్

    జిలేబి

    ReplyDelete


  137. మరిమరి నిన్నే తలచెను
    హరిహర నాధా జిలేబి హంసను గనరా
    పరిపరి సేవల జనులకు
    పరమావధిగ తను జేసె పరమాత్మగనన్

    జిలేబి

    ReplyDelete


  138. వెర్రి తనమదేల యనన్
    సుర్రు మనె తెలుగు పదాలు సోఫా వలదే ?
    కుర్రోడా మాట వినుము
    యెర్రోడనుకోకు, యొజ్జ యెరుకైనోడూ !

    జిలేబి

    ReplyDelete
  139. "ఈ-ఉత్తరం" బను పలుకు
    యే యుగపు మనతెలుగంట యెర్రన్నా ? చా
    లా యింకా యే మైనా
    న్యూయెన్సులు వలయునా తెనుంగున తెలుపన్ :)

    జిలేబి

    ReplyDelete


  140. గుడికట్టినాము జనులా
    ర రాముని గుడియది సుందరంబై వెలిసెన్
    పరమాత్మునిదేవళమౌ
    శరణు శరణు యను జిలేబి చంపకవల్లీ‌!

    జిలేబి

    ReplyDelete


  141. అనుభవములతో యద్భుత
    ము, నాదితాళముల గీతముల నాలాపిం
    చెనుగద పద్మార్పిత, కవి
    తను గాంచితి నీదు బొమ్మ తరమూ మేలౌ !

    జిలేబి

    ReplyDelete


  142. అహ నే టాంబా యంటా !
    ఒహోఒహో బండిరావు యొక్కింత కితా
    బు! హవా జిలేబిదియటా
    యహరహ మీ బ్లాగులందు యవ్వారంబై :)


    జిలేబి

    ReplyDelete
  143. మాయాబజారు (పాత) మూవీలో పాటలాగా ఉంది సంబరం 😀.

    ReplyDelete
  144. మీ బ్లాగులో వ్యాఖ్యలకు అప్రూవల్ ఏమిటి కొత్తగా ? మీ బ్లాగు మీ ఇష్టం అనుకోండి, కానీ "టామ్ బోయ్" లు ఒకరి వ్యాఖ్యలకి వెరవరే 🤔!! jk🙂

    ReplyDelete


  145. నామాలు పెట్టినాను గ
    దా మా యెంకన్న "యెన్నదా" యిట్లా జే
    సే, మమ్ముగావు మయ్యా
    నీమంగా యిస్త సామి నీకో ఫిఫ్టీ :)

    జిలేబి

    ReplyDelete


  146. అదిగో పున్నెమ మళ్ళీ
    విధిగా వచ్చెను జిలేబి విపరీతమనన్
    కుదుపుల వార్ధా తోడై
    చెదిరెను చెన్నై నగరము జీనము గనుచున్ !

    జిలేబి

    ReplyDelete
  147. ఎక్కడా ఇంతకీ? దేశంలో కొచ్చి లైన్ లో నిలబడి చిక్కడిపోయారా? జ్వరపడ్డారా? ఆరోగ్యం బాగుందా? మీరు కనపడకపోతే అదోలాగుంది :(

    ReplyDelete


  148. బంగారమ్మ జిలేబీ
    సింగారమ్ములు తెలియగ చింతన జేయన్
    బెంగన పడెనో నమ్మయు
    చెంగున బోవ, మన రావు చేసెన్నూహల్

    జిలేబి

    ReplyDelete


  149. బంగారమ్ముల వరుస
    న్ముంగురుల సజావుగనుచు ముదిత జిలేబీ
    సింగారమ్ముల గాంచె
    న్ముంగిట యట చెన్నపట్న మందున తానౌ :)

    జిలేబి

    ReplyDelete


  150. అమ్మ దయ యున్న రాసెద
    నమ్మా బ్రాకెట్లనాటి నాగేశు కథల్
    కమ్మని రోజులు కావవి
    చెమ్మగిలటు కళ్ళు లలిత, చెప్పెద నీకై !

    జిలేబి

    ReplyDelete


  151. దేశమున కొచ్చె నోయని
    తా సందియపడె, జిలేబి తా చక్కగ నౌ
    పోశన బట్టిన యనప
    ర్తీశుని గాంచి నమనమిడి రివ్వున బోయెన్ !

    జిలేబి

    ReplyDelete


  152. జీవిత సమరపు తొలిరో
    జే వికసించెను జిలేబి జేయన మాతా
    శ్రీ వివరముల గనంగన్
    భావి తరమున కవి వెసులు బాటగు మేలౌ !

    జిలేబి

    ReplyDelete




  153. అనపర్తీశుని పలుకుల
    గనరారే యమ్మలార ఘనమై వెలిగెన్
    మన పంచదశ నగరియం
    దున మేల్గాంచుచు జిలేబి దోస్తులు వీరౌ :)

    జిలేబి

    ReplyDelete


  154. మాతాశ్రీ బ్లాగులకు
    న్నేతా వాతా సలామ నెన్నే మో మా
    ఖాతా వొలువన్ వత్తురు
    బో తాతాయని భయపడె బో బండ్రావుల్ :)‌

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మాతాశ్రీ బ్లాగులకు
      న్నేతా వాతా సలామన్నేమో మిలా
      ఖాతుగ వత్తురు హితుల్ భావి నెఱింగియు, అకటా
      తాత ముత్తాతలైన తప్పుకుందురే తగులక గుండ్రాయిల్ :)

      Delete


  155. మిరియాల కషాయమ్మును
    మురిపెము తో తాగవోయి ముద్దు జిలేబీ !
    సరసకు వచ్చిన పడిశము
    బిరబిర తుర్రుమనునోయి బెహతరు గానన్

    జిలేబి

    ReplyDelete


  156. మావూరి నీళ్ళు త్రాగిన
    గావచ్చును కవలలమ్మ కమ్మగ తల్లీ
    రావలె జిలేబులిట మే
    ల్గావలె నాశీస్సులుగొని లావుగ మాతల్ !


    *మా ఊరి పేరు దొడ్డిగుంట - దీనికి గేరంటీ యిచ్చిన వారు కష్టేఫలే శర్మగారు - :)

    జిలేబి

    ReplyDelete


  157. బ్లాగుల్లేని కమింటుల
    భోగీశ్వరులౌ జిలేబి భోయను మోయీ
    యాగీ వలదే రమణీ
    వేగము గాంచుము బిలేజి వేణికి తగదోయ్ :)

    జిలేబి

    ReplyDelete


  158. మా గూఢచారులకు తెలి
    పా కూసింత సమయమున భామ జిలేబీ
    లోకమున యెక్క డున్నా
    బాకా యూదెదరు నాకు బండికి యిరుసౌ :)

    జిల్ జిల్ జిలేబి :)

    ReplyDelete


  159. తినవలె సమానము గనన్
    మనవలె భువిలో జిలేబి మన్నిక గానన్
    వినవలె యన్నియు గను మ
    మ్మ నవ్య లోకపు గురుతులు మలినము గాదే :)

    జిలేబి

    ReplyDelete


  160. పరిశోధకుండ నపరా
    ధ రిక్తముల జేయదలతు ధరణి జిలేబిన్
    పరికించి జూడ షెర్లా
    క్సరయు సిరిసిరిసిరిమువ్వ కగుపించెను బో :)

    జిలేబి

    ReplyDelete


  161. మేటరు లేకున్నన్నే
    మీ టపటప రాసెదనిక మీకై బ్లాగుల్
    కోట నరసింహ వర్యుల
    మాటల మహిమలు జిలేబి మధురిమ లూరున్ :)

    జిలేబి

    ReplyDelete


  162. బలిపశువు లైతిమి గదా
    చెలికాడిట జవ్వనివలె చెంగట రాగన్
    యెలిమెంటరీ గదమ్మ సి
    రిలేని వాసా జిలేబి రిమ్మతెగులనన్!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. I just want to confirm that are these only for funsake or is there any other MCP reason behid?

      I concluded that the reason is some undisclosed hatred or levity.

      Reason better known to them and you.

      Any way, SF the I.




      Delete


  163. మా గూఢచారి వర్గము
    భోగట్టా తెలిపెనోయి బోడెమ్మా నీ
    క్రీగంటి జూపు లెల్లటి
    కీ గట్టిగ పెట్టెదనిక కిరికిరి వాతల్ :)

    జిలేబి

    ReplyDelete


  164. అమ్మోరెప్పుడు విసురు
    న్నమ్మో గుండ్రాళ్ళు మనసున గలదు వెన్నా
    నిమ్మళమువలయు సిరిలే
    నమ్మనుకోమాకు సొగసున మరి జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete


  165. బ్లాగ్పెట్టండి మహాప్రభు
    లాగ్పెట్టియితరులతాట లబకున లాగన్
    యగ్పెట్టిలోన సిగరె
    ట్యెగ్పెట్టగ వేడిమీద యెక్కాలేయన్ :)

    జిలేబి

    ReplyDelete


  166. ఆయిలు టాంకర్లెక్కెన
    టా! యిప్పటికిన్ జిలేబి టాపుల్ లేపెన్
    కోయిల కుహుకుహు లాడగ
    సోయగముల దారి గాచె సోగ్గాడటనౌ :)


    జిలేబి

    ReplyDelete
  167. Sixth sens indicating me, u r physically unwell. Take rest, by the time u might v consulted a good physician. Get well soon, all is well.Wish u all the best, Wish 2 see u in original colors, soon :) ok

    ReplyDelete


  168. రాగాలు తీసె రాహులు
    పోగాలంబె యిక నీకు బోవయ్యా మో
    డీ ! గల్లంతుల లో నీ
    భాగం బెంతో తెలిపెద భళ్ళున బద్దల్ :)

    జిలేబి

    ReplyDelete


  169. జంగు నజీబిచ్చెను రా
    జ్యాంగము వలదని ఫిరంగి చందము గానన్
    రంగీ తిలోదకము లే
    కంగ యమెరికా జిలేబి గా మారగనన్ :)

    జిలేబి

    ReplyDelete


  170. నలుగురునచు విశ్లేషిం
    చి లక్షణములను జిలేబి చెప్పెను మేలౌ
    కలవారివ్వవలె సదా
    నిలకడ గలుగ జనవాహిని బడయ సౌఖ్యం !

    జిలేబి

    ReplyDelete


  171. రాస్తా నన్నారు గదా
    నేస్తమ్మదియె పదివేలనెదను జిలేబీ
    విస్తా రంబు కవివరుల
    మస్తిష్కంబుల పదును సుమనసుల రీతుల్!

    జిలేబి

    ReplyDelete
  172. ఎక్కడో లలిత గారు, బండి వారు చెప్పినట్లు బ్లాగులోకం లో మీదే హడావిడి జిలేబి గారు.

    ReplyDelete


  173. అవతారము లిరువది యొక
    టి వసుధనటు గావగా నడిచివచ్చెనట
    న్నవనీ తచోరు డైనిల
    చె వారిధి యతండు మనకు చెలియా వినవే !

    జిలేబి

    ReplyDelete


  174. తొందర పడి వాగ్ధానము
    సుందరి వలదే యిరుకగు చోటులు తావుల్
    వందన మిడుమా పద్యపు
    కందము గూర్చగ జిలేబి‌ కష్టము గలదే :)

    జిలేబి

    ReplyDelete


  175. ఇంటెనక జిలేబీలను
    కొండాట్టమ్ముగన నమ్ము కొను రాముడు మే
    లంటిన్ వాల్స్ట్రీట్ యనలి
    స్టేంటి మనకు నేర్పునోయి షేర్మార్కెట్టుల్ !

    జిలేబి

    ReplyDelete


  176. పనిచేయని యెక్చేంజ్నిం
    చి నరుడెటుల ఫోనుజేసె చిక్కైన సమ
    స్య నెటులు పరిష్కరించెద
    రని వివవరములడిగిరి నరసరాయలు, హా :)

    జిలేబి

    ReplyDelete


  177. కోరక సలహా నిచ్చెన్
    పారుండొకడౌ , హరి మరి పలుకుల వినునో :)
    పోరుల హీరోలు వినెద
    రో రుజు వాక్కుల యరణ్య రోదన లేలన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వావ్! జిలేబొమ్మోయ్,,,,,,

      శానాకాలం గడిసింది నిన్ను చదివి. యాడికి బోనావ్? కిస్సుమస్సు సెలవులకేమైనా బోనావా? నేకపోతే శశికళమ్మ పిలిస్తే రాజ్ భవన్ కి బోనావా?
      సర్లే, నువ్వేడికి పోతే నాకేంగాని గీ మద్దెన ఓ మంచి పేరడీ పాట అనంత్ రామ్ గారి బ్లాగులో సూశా.
      నువ్వూ సదువుకో.

      నువ్వూ... నువ్వూ... క్రొవ్వే... నువ్వూ....
      క్రొవ్వూ... క్రొవ్బూ... నువ్వే... క్రొవ్వూ....

      మరేమో, దానిలో నేను కూడా కామెంటిన. అయి కూడా సదువు.
      http://ramaddanki.blogspot.in/2016/12/blog-post.html?showComment=1482417367694#c1971681012180838769

      Delete


  178. పోరడు పేరడి రాసెన
    టా రావే రమణి లంపటములన్గానన్
    వీరావేశము లేలా
    కోరల రక్కసి జిలేబి కోరెను గాదే :)

    జిలేబి

    ReplyDelete