Tuesday, March 27, 2018

అదేమి పదమో పులుసు- హు హు సాంబారన్న సాధువైన పదముంటేనూ !



అదేమి పదమో పులుసు !
 హు హు  
సాంబారన్న సాధువైన పదముంటేనూ !



మరీ ఇట్లాంటి అసాధువైన పదమేమిటి పులుసట పులుసు .

అబ్బే వినడానికే మరీ ఎబ్బెట్టు గా లేదూ ?

సాంబార ని శుభ్రమైన సలక్షణ మైన సుందరమైన సులభమైన ముచ్చటైన   పదముంటే అట్లా పాత కాలపు చింత కాయ పచ్చడి లాంటి పులుసు గిలుసు లాంటి పదాలేమిటో ?

అబ్బే కొంచెం కూడా అర్థం కాదే వీళ్ళ కోతలు కోటలు గట్టే మాటలు ?


మరీ తెలుగు వారి పులుసు కాకుంటే పులుసు ని పట్టుకుని సాగ దీయట మేమిటో ?

సాంబారు లో పప్పు వుంటుంది . పులుసు లో ఉంటుం దా ?

అబ్బే ! ఏమిటో భేషజాలు.

సాంబారు అన్న పదం ఎంత ముద్దొచ్చే పదం కదండీ ?

సాంబ ! శివుని పిలుస్తా మట్లా !

సాంబరి అంటే హస్త లాఘవము.

సాంబారు లో హస్త లాఘవం ఉంది కదా ! ?

అయ్యరు గారి సాంబారు కు ధీటై న దేది ?

ఏమిటో మరీ చోద్యం !


:)
జిలేబి
బ్రేవ్ !

6 comments:

  1. సాధువులు, దుష్టులు మీ సమస్యాపూరణలకే గానీ మాబోటి పామరులకేల, “జిలేబి” గారూ?

    అవునూ, మీ స్వస్ధలం తమిళరాజ్యం పక్కనున్న జిల్లా కదూ. ఆ ప్రభావం తగు మాత్రం ఉంటుంది లెండి, ఆశ్చర్యమేమీ లేదు.

    Sambar, also spelled sambhar or sambaar, is a lentil-based vegetable stew or chowder cooked with a tamarind broth originating from the Indian subcontinent. It is popular in South Indian and Sri Lankan Tamil cuisines. (Source : wikipedia) (ఇక్కడ Tamil cuisines అనే పదాలను నేను .. బోల్డ్ bold .. చేసాను)

    ReplyDelete
  2. జిలేబీ!
    ఇప్పటివరకు తమిళమామివై యుండి
    తెలుగు బ్లాగర్ల మధ్యనే తంపులు పెడుతున్నావు కాబట్టి బయటే ఉండి కుశాలుగున్నవ్..
    తెలుగు-తమిళ్ పోట్లాట రాజేస్తే అందులో ఒక పార్టీవై నువ్వూ ఇరుక్కుపోతావు సుమా!
    జరంత జాగర్త!

    ReplyDelete
  3. పులుసు పులుసే...సాంబారు సాంబారే :)

    ReplyDelete
  4. భేషుగ్గా చెప్పారు పద్మార్పిత గారు. కానీ జనాలు సర్వం సాంబారుమయం చేసేశారు.

    ReplyDelete
    Replies

    1. సాంబారు తోనే సతమతమైపోతావుంటే యెట్లాగండి విన్న కోట వారు :)అక్కడ శంకరాభరణం కొలువు చూసేరా ? :)


      నారదా

      జిలేబి

      Delete

    2. ఒక తెలుగు సినిమాలో ఒక పాత్ర ఇంకో పాత్రతో “నన్ను ఇన్-వాల్వ్ చెయ్యకండి రావు గారూ” అంటాడు. ఇక్కడ మీ ప్రశ్నకు నాదీ అదే సమాధానం 🙏. అయినా మీకు తెలియనట్లడుగుతున్నారు గానీ ఇటువంటి విషయాల మీద నా అభిప్రాయం మీకు ఆల్రెడీ తెలిసినదేగా.

      మీ భువనవిజయం లో ఏ పద్యంలోనైనా మూలకథలో గానీ, పాత్ర స్వభావంలో గానీ మార్పులు చేసినట్లనిపిస్తే విచారంతో వ్యాఖ్య పెడతాను. అంతకు మించిన విద్వత్తు నాకు లేదు.

      Delete