Thursday, October 4, 2018

" గోదారోళ్ళు " - జిలేబీయం



" గోదారోళ్ళు " - జిలేబీయం 



గోదారోళ్ళకు యెటకారం యెంత వుంటుందో మమకారం అంత ఉంటుందండీ ఆయ్ :)
 
ఎన్జాయ్ మాడి :)





చీర్స్
జిలేబి  

26 comments:

  1. బెంగళూరు ఎప్పుడు వచ్చారు?
    ఒక గంట appointment ఇస్తే అయ్యరు గారి కాఫీ తాగి తరిస్తాము.

    ReplyDelete
    Replies


    1. ఇవ్వాళే దిగబడ్డాము :)


      జిలేబి

      Delete
    2. ఈ భోగట్టా బోనగిరి గారికెట్లా తెలిసిందండోయ్? ఆ కిటుకులేవిటో చెబితే మేమూ తరిస్తాము కదా 🙁?

      Delete

    3. మీ నయనమ్ములు శక్తివంతమని అనుకున్నామే ! హతవిధీ !




      జిలేబి

      Delete
    4. విన్నకోట గారు, జిలేబి గారు "ఎంజాయ్ మాడి" అన్నారు కదా అని ఒక రాయి వేసాను.

      Delete
    5. కెలస మాడి బోనగిరివరే “బెంగలవూరు” లో వారిని కలిసినప్పుడు వారి పేరేమిటో కనుక్కునే ప్రయత్నం చెయ్యండి over a cup of Iyer coffee. ఆల్ ది బెస్టూ 👍.

      Delete
  2. https://youtu.be/leB_NdNIEaU

    ఇది కూడ చూడండి.

    ReplyDelete
  3. @“జిలేబి” గారు
    // “మీ నయనమ్ములు శక్తివంతమని అనుకున్నామే ! హతవిధీ !” //
    —————
    పాత “మాయాబజార్” సినిమాలో లక్ష్మణ కుమారుడ్ని ఉబ్బెయ్యడం కోసం అతని ఆంతరంగికులు అభిమన్యుడి గురించి “అతడికి ఆ తెలివేదీ, అతడికి ఆ చురుకేదీ” అంటుంటారు గుర్తుందా? నేనూ అదే బాపతన్నమాట 😀.

    ReplyDelete
  4. గోదావరి జిల్లాల తలమానికమైన కోనసీమ యొక్క అందాలు ఈ విడియోలో చూసి ఆనందించండి.

    "కోనసీమ అందాలు"

    ReplyDelete
  5. ప్రభుత్వోద్యోగం చేస్తూనే చిట్ ఫండ్ వ్యాపారం కూడా నడుపుకుంటున్న తాసిల్దార్.
    పుణ్యభూమి నా దేశం..ధన్యభూమి నా దేశం 🙏
    Tahsildar held

    ReplyDelete
    Replies
    1. Source 👆 :-
      Deccan Chronicle (Hyd) daily newspaper 04-Oct-2018 page no.4 "City" column

      Delete
  6. "Kochhar resigns"
    (DC-Hyd 05-Oct-2018 front page)
    --------
    Fall of giants ??
    or
    All good things come to an end (చూసేవారి దృష్టికోణం బట్టి)

    ReplyDelete
    Replies


    1. కాలవాహిని అలల సఖా యెవరయ
      శాశ్వతము బ్యాంకు తనదారి సాగి పోవు
      మింటి కెగిసి మట్టిని జేరు మిడతలైన
      మేఘ మాలిక లైనను; మెప్పు ముంపు :)


      జిలేబి

      Delete


  7. నే చెబ్తున్నా నాంధ్రా
    లో చెల్లదు, భాజ్ప నోటు లో బొక్కుందోయ్
    సోచాయించిరి చౌద్రీ
    గాచారము బాగులేదు కాబోలర్రా :)

    జిలేబి

    ReplyDelete


  8. హస్తము లోనన్ కమలము
    మస్తుగ బట్టెన్ జిలేబి మహిమాన్వితుడే
    ముస్తాబౌనిక దేశము
    పిస్తా బాదాములకు కఫీల్ సాత్ లేకే :)


    జిలేబి

    ReplyDelete


  9. ఇచటనచట కల రెచటయినను కలరు
    పరమ భాగవతులు సానివాడ నుంద్రు
    గుళ్ళు గోపుర ముల నుంద్రు గుట్ట లందు
    మేడలందు కాటినిగూడ మేల్మి బడసి!


    జిలేబి

    ReplyDelete


  10. హాయి గా రామ రామయనంచు నేను
    పొట్ల కాయ పెరుగు పచ్చడొక్క వైపు
    స్వాహ యనుచున్న సమయము సామిరంగ
    మామి మన జిలేబమ్మ తమాష జేసె

    జిలేబి

    ReplyDelete


  11. పాముల పట్నం వారు హోసూరుకు వెళితే :)


    వెడలె హోసూరున కరరె వేడి తగ్గి
    చివ్వున చలిగాలియు తాక శిరము పైన
    శంకరుం డెత్తెఁ జలి; మల! సతి! బెదరఁగ,
    వెడలె నాసుపత్రి కి సుమా వేగముగను !

    జిలేబి

    ReplyDelete
  12. “జిలేబి” గారూ, ఈ క్రింది తెలుగు వాక్యానికి అర్థం చెబుతారా ప్లీజ్ (ఒక వార్తాపత్రికలో వచ్చిన వార్త) ?

    // “బంగారు వర్తకుడి అరెస్టు” //
    🙁

    ReplyDelete
    Replies

    1. మన పాఠక సూపర్ స్టార్ గారివ్వాళ చాలా మంచి ప్రశ్న అడిగారు.

      ఈ ప్రశ్నలో చాలా సూక్ష్మము నిండి వున్నదని ఇప్పటికే పాఠకులకు తెలిసి వుంటుంది.

      ఈ నాటి ప్రశ్న మూడు పదముల కలయిక. అనగా వారు త్రిమూర్తులను, త్రిగుణములను , త్రినేత్రములను చెప్పకనే చెప్పుచున్నారని తెలియు చున్నది.


      ఇందులో దైవ రహస్యమేమి గలదు? ఒకింత పరికించి చూసెదము. బంగారు అనగా పసిడి. బంగారు అనునది సంబోధన కూడన్నూ. అనగా పసిడిని సంబోధించుట అన్నమాట.

      పసిడి అననెవరు ? దానికి మూలమై‌న తమ్మియింటిగరిత తల్లి తల్లి యేగద!

      అనగా వారు జగన్మాత‌ను తలచినారు. తలచడము మాత్రమేనా బంగారూ అని పిలిచినారున్నూ .

      తల్లిని తలచిన తొలగును నెల్లర కష్టములు కదా !

      అందువల్ల మన రావు గారివ్వాళ అందరి కష్టములు తొలంగు గాక అని జగదాంబను పిలిచినారు.

      పిలవటము తో ఆగెనా ? లేదు. రెండవ పదమును గ్రహింపుడు. వర్తకుడన్నారు.

      వర్తకుడనగా నెవరు ? అతని మనోధర్మ మేమిటి?

      రాబోయే ఇరవై మూడున్నర గంటలలో వీటి గురించి విపులంగా తెలుసుకుందాం.

      అప్పటి దాకా తెలుగులోనే కజ్జాలు పెట్టుకుంటాం కొట్టుకుంటాం.

      శెలవు :)


      జి.లే.బి.

      Delete
    2. విశ్వనాథ వారి శైలిని అనుకరించడానికి పడిన ప్రయాస బాగానే ఉంది కానీ అంత వెటకారం వద్దు. ఆ వార్తలో వాడిన పదాలు (బంగారు వర్తకుడు) నాకు విచిత్రంగా తోచాయి. ఆ వర్తకుడు అంత “బంగారు” అయితే వ్యవహారం అరెస్ట్ దాకా ఎందుకు వచ్చింది? బంగారం వ్యాపారం చేసేవాడు అని కవిహృదయం కాబోలు? లేకపోతే మీ journalese అలాగే ఉంటుందా?
      (“బంగారు” విశేషణం తగిలించి చెప్పుకునే వేరే పేరొకటి కూడా గుర్తొచ్చింది లెండి 😀😀)

      Delete
    3. ఇక్కడ ఈ పెద్ద లిద్దరూ ఏదో కోడ్ లాంగ్వేజీలో మా(పో)టాడు కుంటున్నారేమో !
      బంగార మేమిటీ ! వెటకారమేమిటీ ! జగన్మాతేమిటీ !
      సెల్లెమ్మా ! యెక్కడున్నారు !

      Delete
    4. ఏడనున్నావ్ సెల్లెమ్మా జర కనపడుండ్రి
      ఈడ పెద్దన్నకు హెల్ప్ గావాలె రాండ్రి
      తోడా వచ్చి కూసింత చెయ్యిచ్చి మల్ల
      తేడా జెప్పుండ్రి, బంగారమా మరి ఎటకారమా!?
      :)

      Delete
  13. "జిలేబి" గారూ, గోదావరి జిల్లాలంటే మీకు ప్రత్యేకించి అభిమానమని ఎందుకో అనిపిస్తుంటుంది (ఇది మీమీద "రిసెర్చ్" కాదూ అంటున్నా .. వద్దని చెప్పానా లేదా చెప్పానా లేదా అంటూ ఒకరు బెత్తం ఝళిపిస్తూ ఇటే వస్తున్నారు 😩). కాబట్టి .. ఈ లింక్ లోని అక్టోబర్ "ఈమాట" వెబ్ పత్రికలో వచ్చిన చిరంజీవి వర్మ గారి "సమవుజ్జీ" అనే కథ మీకు ఆసక్తి కలిగించవచ్చు. అచ్చమైన తూ.గో.జిల్లా యాస కథంతా కనిపిస్తుంది. కథ కూడా బాగుంది, యాస మహా శ్రవణానందంగా ఉంటుంది. మీ పడికట్టు కన్నడ మాట "ఎంజాయ్ మాడి" అనను, మన తెలుగులో :ఆస్వాదించండి" అంటాను ☺👍.

    "సమవుజ్జీ" కథ

    ReplyDelete