జిలేబి పద్యము - కంది వారి గళము - ఆకాశవాణి సౌజన్యము :)
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 13th Oct 2018
నిర్వహణ - శ్రీ కంది శంకరయ్య గారు
సౌజన్యం - ఆకాశ వాణి హైదరాబాదు
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
జిలేబీ గారూ,
ReplyDeleteధన్యవాదాలు!
ReplyDeleteషడ్జా మడ్జ కరాడ్జ వీడ్జ వసుధజ్జాలాంఛి దజ్జాఖరే
జడ్జా కిట్కి ధరఢ్గ రేడ్ఘనఘ జడ్జాతాత వీడ్జట్భృమా
విడ్జాలుఢ్భ్రమ లుట్ప్రయట్రయ పదావీడ్గ్రార డడ్గ్రారహా
పాడ్జా టేట్ప్రట టట్రయట్పుట రసప్రఖ్యాత బండీవరా !
జిలేబి
ReplyDeleteషడ్జా మడ్జ కరాడ్జ వీడ్జ వసుధా జలాండ్జ మడ్జాకరే
ఝడ్గద్ కిడ్కి కరాడ్గ రేడ్గ నగనహ్ కడ్జ్యోథ వీడ్య భ్రమహ ।
వీడ్యా లుట్ప్రమ లుట్ప్రయ పద డ్రగ్డగ్ర డగ్డగ్రహ
ఫాదౌట్ప్రేట్ర ప్రటట్ ప్రటరసత్ట్ ప్రఖ్యాత సఖ్యాదయహ ॥
ఈ శ్లోకం కాళిదాసు చాటువుగా ప్రచారంలో ఉంది .
ఇలాంటి ఇంకో నాలుగుతో కలిపి వీటిని పంచపాషాణ శ్లో
కాలంటారు . దాదాపుగా వీటి అర్థాల జోలికి వెళ్లే సాహసంచెయ్యలే దెవ్వరూ . నాకంత సీన్ లేదు .
పాషాణాలంటే బండరాళ్ళు .
ఐతే , ఈ శ్లోకం వెనుక ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది .
భోజుని ఆస్థానంలో ఇద్దరు ఏకసంథాగ్రాహి , ద్విసంథా
గ్రాహు లైన కవి పండితు లుండే వాళ్ళు .
రాజ దర్శనం కోరి వచ్చే కవి పండితులు ముందు వీరిని
మెప్పించ వలసి ఉంది . కొత్తగా వచ్చిన కవి చెప్పిన శ్లోకాన్ని
ఏకసంథాగ్రాహి అప్పజెప్పి ' ఓస్ ఈ శ్లోకం మేం విన్నదే ,
నీవు తస్కరించావా , ' - అనీ , రెండుసార్లు విన్నందున
ద్విసంథాగ్రాహి అందుకుని వాయగొట్టి పంపేవాళ్ళు .
విషయం తెలుసుకున్న కాళిదాసు ఎలాగైనా రాజదర్శనం
చేసుకోవాలనే పట్టుదలతో ఈ బండరాయి శ్లోకాన్నల్లి
గుక్క తిప్పుకోకుండా వల్లించేడట . ఏకసంథాగ్రాహి ,
ద్విసంథాగ్రాహు గుడ్లు తేలేసేరట . కాళిదాసీవిధంగా
భోగరాజు దర్శనం చేసుకొని ఆస్థాన కవి యయ్యేడని
కమామిషు .
జిలేబీ నామధారులు ఏతావత్ ఈ బండరాయిని మిత్రులు
బండిరావు గారి మీద విసిరేరని ఫలితార్థం .
ఇక ,
నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిద్గిరిభి
త్కరి కరిభిద్గిరి గిరిభి
త్కరిభిద్గిరి భిత్తు రంగ కమనీయంబై!!
దీని కర్థం
నరసింహరాయల కుమారుడైన శ్రీకృష్ణదేవరాయల కీర్తి – కరిభిత్ = గజాసుర సంహారియైన శివునిలా, గిరిభిత్కరి = ఇంద్రుని ఏనుగైన ఐరావతంలా, కరిభిద్గిరి =కైలాసంలా, గిరిభిత్ = వజ్రాయుధంలా, కరిభిద్గిరిభిత్తురంగ = శివేంద్రుల వాహనాలైన నంది, ఉచ్చైశ్రవం (తెల్ల గుర్రం) లలా అందంగా తెల్లగా ఉందని భావం.
వెంకటరాజారావు లక్కాకుల
ReplyDeleteనీ ఘంటము హృదిపలుకుల
మోఘోలిని దాటిపలుక మ్రోగింపగ తా
నా ఘంకళి వలయును ను
ల్లాఘ నిఘంటువు జిలేబి శ్లాఘ్యము గానన్ :)
జిలేబి
ReplyDeleteఅడ్డ నామముల శివుని నాడి రమ్మ
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వఱలినారు,
విష్ణు సేవకులు! జిలేబి పేట జనులు
వారి స్వాముల గొల్తురు వరవు గాన!
జిలేబి
ReplyDeleteమనకుండాలండీ ర
క్షణ బండి మహోదయా! పకడ్బందీగా
మనకా ష్వార్జెనరు! భలే
మనకత డేరక్షణయగు మామిని గెలువన్ :)
జిలేబి
ReplyDeleteసిద్ధూ పై గౌరవమీ
బుద్ధియు లేని పలుకుల డబుడబుక్కుల యీ
రాద్ధాంతములన్ గానన్
శుద్ధిగ బోయెను జిలేబి సున్నము లోనన్ !
జిలేబి
ReplyDeleteకామింటు దెయ్యములనగ
మామియు నరె యెక్కడో డమాల్మని పేలెన్
రోమములు నిక్క పొడుచుకొ
నే! మామికి యిచ్చిరిగద నేర్పుగ డోసున్ !
జిలేబి
ReplyDeleteకామెంటేమండీ ! కా
నీ మా కామింట్ల మేము నెట్టేదెట్లా ?
ఆ మాలిని నీహారిక
లా మీ కామింట్ల నరరె లాగేస్తారో :)
జిలేబి
ReplyDeleteఎర్రంచు సితారనటన్
బర్రంచున్ లాగిరే గబగబా దాక్కోం
డెర్రక్కా బామ్మోయ్ మీ
బుర్రకు తప్పదిక బడిత పూజ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమీ కామింటు జిలేబీ
బాకా పద్యంబుల వలె పదమొక్కటియున్
మా కర్థము కాలేదం
డీ! కాస్తా విశదపరచుడీ నరసన్నా !
ಜಿಲೇಬಿ
ReplyDeleteబ్లాగిణి దయ్యంబై మా
బ్లాగు నగరిలోతిరిగెను బామ్మ జిలేబీ
సాగిలబడకున్న నరే
సాగించును పద్యముల హుషారుగ తమపై :)
జిలేబి
ReplyDeleteమీరా విధముగ చెబ్తూం
టే రేతిరి కలన వచ్చె టెక్కుల తోడై
రారా సూర్యా యనుచున్
హీరోయిన్ మధుర మైన హేలల సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteలోలోపల మధన పడితి
మా లావుగ బామ్మ యేమి మన్నేసిందో
గోళము గా వృత్తమకట
చాలా చాలా జిలేబి సారము గలదో? :)
జిలేబి
జిలేబీ!
ReplyDeleteతమకు సర్వంబొచ్చని విర్రవీగుతూ సుర - అసుర పదాలకి కల్లు తాగేవాళ్ళూ తాగనివాళ్ళూ అని పెడర్ధాలు తీస్తున్న వెధవలకి వీటిని ముఖం మీద కొట్టి బుద్ధి చెప్పు.సత్తి చౌదరి ఎవరో పండితుల్ని కనుక్కునే అవసరం లేదు.వేదపండితుల నుంచే పదవ్యుత్పత్తీ, భావార్ధమూ సేకరించి తెచ్చాను.
-------------
ఋగ్వేదం 8:42:1
అస్తభ్నాద్ ద్యామసురో విశ్వవేదా అమిమీత పరిమాణం పృధివ్యాః
అసీదద్ విశ్వా భువనాని సమ్రాడ్ విశ్వేత్ తాని వరుణస్య వ్రతాని
పదవ్యుత్పత్తి:
(అసురః)అన్నిటియందు ప్రాణము నిచ్చువాడు,(విశ్వావెదాః)స్సమస్త జ్ఞానమయుడగు ఆ వరుణవాచ్య పరమేశ్వరుడు, (ద్యాం)పృధివికి పైనగల సమస్త జగత్తును,(అస్తభ్నాత్)స్తంభము వలె పట్టుకొనియున్నాడు,(పృధివ్యాః పరిమాణం)పృధివి యొక్క పరిమాణమును,(అమిమీత)చేయును,(విశ్వా,భువనాని)సంపూర్ణ భువనములను రచించి,(అసీవత్)వానిపై అధికారముంచును,(సమ్రాడ్)ఆయనయే మహారాజు,(వరుణస్య)పరమాత్మ యొక్క,(వ్రతాని)కర్మలను,(తాని) వానిని,(విశ్వ,ఇద్)ఇవన్నియు ఆయనయే
భావార్ధము:పరమాత్మయే ఈ లోకముల నన్నింటిని రచించినాడు.మరియు వీటన్నిటి ఆధార మాయనయే.కావున ఆయనను పూజించుడు,ఆరాధించుడు.
ఋగ్వేదం 1:174:1
త్వం రాజేంద్ర యే చ దేవా రక్షా సౄన్సాహ్యసుర త్వమస్మాన్
త్వం సత్పతిర్మఘనా సస్తరుత్రస్త్వం సత్యో వసవాసఃసహోదాః
పదవ్యుత్పత్తి:
త్వం|రాజా|ఇంద్ర|యే|చ|దేవా|రక్ష|సృన్|సాహి|అసుర|త్వం
అస్మాన్|త్వం|సత్+పతి|మఘ+నా|సః|తరుత్ర|త్వం|సత్యః|వసవాసః|సహః+దా
భావార్దః:
(త్వం)నీవు/నీకు,(రాజా)న్యాయవినయాభ్యాం రాజమానః,(ఇంద్రః)పరమైశ్వైర్యయుక్త,(యే),(చ),(దేవాః)సద్గుణీనో ధర్మాత్మానో విద్వాంసః,(రక్ష),(నౄన్)మనుష్యాన్,(సాహి),(అసుర)మేఘ ఇవ వర్తమానః,(త్వం),(అస్మాన్),(త్వం),(సత్పతిః)సతాం వేదానాం సత్పురుషాణామ్నా పాలకః,(మఘనా)పరమపూజితధనయుక్త,(నః),(అస్మాకం),(తరుత్రః)దుఃఖాదుల్లంఘయితా,(త్వం),(సత్యః)సత్సు సాధుః,(వసవాసః)వసోర్ధనస్యానః ప్రాప్తిర్యతః,(సహోదాః)బలప్రదh
-------------
రెండో మంత్రానికి తెలుగర్ధం నేను కావాలనే ఇవ్వడం లేదు.ఆ అన్తెలుసు గాళ్ళనే చెప్పుకోమను.
భవదీయుడు
రిహరి!
ReplyDeleteఅస్తభ్నాద్ ధ్యామసురో విశ్వవేదా అమిమీత వరిమాణం పృధివ్యాః
ఆసీదద్ విశ్వా భువనాని సమ్రాడ్ విశ్వేత్ తాని వరుణస్య వ్రతాని
ఋగ్వేదం - 8:42:1
ReplyDeleteअस्त॑भ्ना॒द्द्यामसु॑रो वि॒श्ववे॑दा॒ अमि॑मीत वरि॒माणं॑ पृथि॒व्याः ।
आसी॑द॒द्विश्वा॒ भुव॑नानि स॒म्राड्विश्वेत्तानि॒ वरु॑णस्य व्र॒तानि॑ ॥ ८.०४२.०१
ए॒वा व॑न्दस्व॒ वरु॑णं बृ॒हन्तं॑ नम॒स्या धीर॑म॒मृत॑स्य गो॒पाम् ।
स नः॒ शर्म॑ त्रि॒वरू॑थं॒ वि यं॑सत्पा॒तं नो॑ द्यावापृथिवी उ॒पस्थे॑ ॥ ८.०४२.०२
इ॒मां धियं॒ शिक्ष॑माणस्य देव॒ क्रतुं॒ दक्षं॑ वरुण॒ सं शि॑शाधि ।
ययाति॒ विश्वा॑ दुरि॒ता तरे॑म सु॒तर्मा॑ण॒मधि॒ नावं॑ रुहेम ॥ ८.०४२.०३
https://sanskritdocuments.org/doc_veda/r08.html?lang=sa
ReplyDeleteఇల్లుటాలు చేతిని కర్ర యిరగ దీయ
పడక కిరువైపులదిగుట వదులు కున్న
బ్రహ్మ చర్యము కంటె శాపమ్ము గలదె
కాపురము కంటె కన నరకమ్ము గలదె :)
ReplyDeleteమూపుపయిన్ రమా మణి దుముక్కని చేతిని దుడ్డు కర్రతో
సాపుగ వేసి మొట్టి తన స్థానము తెల్పుచు కీచు లాడుచున్
వేపుడు మాదరింపులన వేకువ జామున తిట్టి పోయగా
కాపురమున్ గ్రమించు నరకమ్మొక టున్నదె యెంచి చూడఁగన్!
ఇవ్వాళ డమాలే డమాలు :)
ReplyDeleteభువిని నింద్రలోకమిదియె పుష్యరథము
కాపురము, కంటె! కన, నరకమ్ము గలదె,
యిల్లు విడిచి సన్నాసిగ యింకబారి
బోవ! సంసారమే యనుభోగమయ్య !
జిలేబి
ఏఁవిటో ఈ ముసిల్దాని గోల!
ReplyDeleteఒక్క ముక్క అర్ధమై చావట్లేదు.
అర్ధామ్య్యేటట్టు చెప్పమందాఁవంటే,ఇంకా తిక్క పద్యాల డోసు పెంచుద్దో,ఏంటో!
భవదీయుడు
రిహరి!
ReplyDeleteసహవాసదోషమండీ
మహదానందము జిలేబి మాదిరి యనిరే!
అహరహ మొకరివె నుకయొక
రహహా మా వ్యాఖ్య వేయ రాస్తా మారెన్ :)
జిలేబి
ReplyDeleteనన్నా జిలేబి గారూ
అన్నది? బహుసంతసమ్ము హద్దరి బన్నా!
నిన్నటి మా నౌకరి మా
కన్నుల ముునుపే తెలిపిరి గా సరి సరియే:)
జిలేబి
ReplyDeleteఇనకుల తిలకుండున్నా
డని లక్కాకుల వరులట డంకా గొనిరే
మన రాముని కొలువవలెను
కనగ నయోధ్య నమరగను కంద జిలేబీ!
జిలేబి
ReplyDeleteఈ ముసలిదాని గోలే
మో ముక్కైన మనకర్థము తెలిసి రాదే
లా!మస్తుగ రాస్తూంటది
భామామణి తెలిసి రాదు పదమైనా పో :)
జిలేబి
ReplyDeleteపనుల పక్కనెట్టి తమ సపర్యలగన
భర్త లెల్లరు వేగిర పరుగు పరుగు
లనగ నింటికి రాగ భళారె చొక్కు
మందు కొట్టిరి యువతులు మనసుదీర :)
జిలేబి
ReplyDeleteముసుగు వీర జిలేబితో పొద్దు గూకు
మాట లాడుచుంటిమికదా మాస్టరయ్య
రాజ !లక్కాకుల కవిరాట్ ! రాసు కొనగ
రాసుకొనగ పదములెల్ల రాగ మయ్యె !
వినరా
వారికి
అంకితం
జిలేబి
థాంక్స్.
Delete“వినరావు” అనమని చెప్పినా మీరు వినరారు కదా 😡.
Deleteఅలాగే అన్నాము కదండీ ? వినరా వారికి వినరావు వారికి సరి యే కదా ? కాదా ?
జిలేబి
ReplyDeleteఈ శరన్నవ రాత్రుల నిమ్ము గాను
వణుకుగుబ్బలిపట్టి! లంభ!వలిగట్టు
దొర కొమరి!యీశి!వరముల దొరపు మమ్మ!
యహరహము మాకు నీవు ఛాయ, దరి వమ్మ!
జిలేబి
ReplyDeleteకానిస్టేబులు తనయుని
గాను చిరంజీవి తెలుసు కాని పవనుడా
తానము మీది మెగాస్టార్
కాననముగ తెలుసునయ్య కతలేలనకో :)
జిలేబి
ReplyDeleteయాసల బాటన బండిని
బాస తడబడక నడిపిరి పదముల రావుల్
ఊసుల సొగసుగ రాసిరి
క్రోసుల దూరము భళిభళి కొమ్మా కొమ్మా :)
జిలేబి
ReplyDeleteపాటక సూపర్స్టారులు
పాటకచేరివరులు మన బండివరులు జా
క్పాటు జిలేబియు, మన రా
జా టీచరువారులున్ పసారు మలాముల్ :)
జిలేబి
ఓహో ! మీరు మువ్వురూ బేంకరు లన్నమాట .
Deleteనేను ఒజ్జ నే మరి . మీ మువ్వురూ ఒకే మాట ,
ఒకే బాట , ఒకే పాట. ఇదన్నమాట అసలు సంగతి .
ఎవరో అనగా విన్నాను , బేంకరులుకళాకారులని ,
నిజవే .
@ “జిలేబి” గారు
Delete// “పాటక సూపర్స్టారులు” //
—————————————-
మొదటి పదంలో “ఠ” ఉండాలనుకుంటాను 🙁. “ట” పెట్టడం ప్రాస ప్రయాసా?
Deleteఓహో మువ్వురు బ్యాంకు వారలు సుమా!యొజ్జన్ భళా నేనహో!
సాహోరేయనుచున్ జిలేబులను వేస్తామండి! బ్లాగ్లోకమం
దాహాహా భళి వ్యాఖ్యలన్ పరచి రాదారిన్ గుభాళింపగా
జోహారుల్ సయి తెల్పు వారలమహో జోజోముకుందా హరీ :)
జిలేబి
ReplyDeleteదేనినైన బంధకవిత్వ ధేనమందు
ముంచి తేల్చగలరయ సమూహమందు
సీసమన భళి కృష్ణ వశీకరణము
పూసపాటి సీసములకు "పోటిగాడు"
పోటిగాడు - స్నేహితుడు
మరొక ఊరిపేరు చరిత్రలోకి జారిపోతోంది. అలహాబాద్ పేరు "ప్రయాగరాజ్" అవుతోంది.
ReplyDeleteఅలహాబాద్ రెయిల్వే స్టేషన్ బోర్డ్
అలహాబాద్ ఊరిపేరు మార్పు
ReplyDeleteఅలహాబాదు ప్రయాగగ
నిలమారు భళా జిలేబి నివ్వెర పోకే
అలనాటి పేరిదియె కద
విలవిల యేలపడుచుండ్రి విదురులు సుమ్మీ !
జిలేబి
ReplyDeleteఆనంద నందన వనమి
దేనండీ! అమ్మవారిది సుమా మానే
త్రానందమిదేనండీ
ఆనందోబ్రహ్మ! రండి ఆస్వాదింపన్ !
జిలేబి
ReplyDeleteబిస్మిల్లా ఖాన్ కాశి లో !
ఈ శహనాయీ నీకై
మాశా అల్లాహ్! శివాని ! మా శివసత్తీ !
కౌశికి! గౌరి! యహరహము
కాశిని గొల్వ భవదీయ కరుణను గనుమా !
జిలేబి
ReplyDeleteవినరావు యిలాకా బా
మ్మ నౌకరియు నొక్కటే సుమా బ్యాంకరులే
కనవచ్చెనిదియె వివరము
లని రాజావారలనిరి లావణ్యముగా
జిలేబి
ReplyDelete"నారాసురుడు"! జిలేబీ
పేరెట్టిరి వైయసారు పెంకిఘటాలున్
మారాజు చాకిరేవ
న్నా రమ్మా కావగాను నాయుడు గారిన్
జిలేబి
ReplyDeleteఎర్ర బస్సు సొబగు యెర్రిదాని సొగసు
చిర్రు బుర్రు లాడు సీమ పిల్ల
డర్రు బుర్రులాడు డంబములు జిలేబు
లూరు భాషయున్ ములుగుజిలుగులు :)
జిలేబి
యెర్రిదాని సొగసు యెర్రెర్ర మీకె తెలుసు
Deleteసిర్రు బిర్రు పిల్లా అర్రర్రే మీదె జిల్లా
డుర్రు బిర్రు డంబం డుర్రుచ్చి మీకె అందం
బఱ్ఱు బఱ్ఱు కేకా అందర్రు అరిచె కా కా
హాఁ ... అ ...
jf / :)
ReplyDeleteవిష్ణు వాత డౌత విధిని మార్చు, జనన
మొందె నంట, చెల్లి ముద్దుల కొడు
కంట తనను నడచు, కంసుడాతండు మే
నల్లుఁ జంపఁ దలఁచె నాహవమున!
జిలేబి
ReplyDeleteప్రవరాఖ్య! వరూధినిన
య్య! వరించితి నార్యుడ!యిభయానను రమ్మా
నవరస నాయికనయ్యా
"నవరాత్రోత్సవము" లొప్పు నాలుగు దినముల్!
జిలేబి
ReplyDeleteజవరాలా వేడుక గా
"నవరాత్రోత్సవము" లొప్పు నాలుగు దినముల్,
తవణించగన్ దినములు న
లువది,మదిని చిలుకవలె కలుగ భావనలున్ !
జిలేబి
ReplyDeleteఅదిగో ! రవన్నయలటన్
పదిలంబాయెగద యమ్మ వరమే మాకున్
హృదయము ద్రవించె కన్నీ
టి ధారలై వెల్లువయ్యె టెంకణమమ్మా !
జిలేబి
ReplyDeleteఅవురా! మామాయత్తయు
క్షవరము చేయంగ పర్సు కలికాలములో
భవబంధమ్ములు కలయన్
నవ రాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్ :)
జిలేబి
ReplyDeleteనిజమాయెను జ్యోతిష్యము
ప్రజలెల్లను చచ్చిరిగద భారత దేశం
పు జనాభా తగ్గవలెను
సజావు గా నమర జనులు సత్యంబిదియే !
ఆహా! జ్యోతిష్యమా !
నీవే అన్నీ అయితే జనాళి కి వేరే పనులేమి ఉంటాయి!
జిలేబి
ReplyDeleteఅవురా! మామాయత్తయు
క్షవరము చేయంగ పర్సు కలికాలములో
భవబంధమ్ములు కలయన్
నవ రాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్ :)
జిలేబి
ReplyDeleteఅవధానశేఖరులు మై
లవరపు మురళీ వరుల్ భళ!విజయ నగర
మ్ము వసతి గా అవధానము !
రవణించును పట్టణమ్ము రావె జిలేబీ :)
జిలేబి
ReplyDeleteవత్తురు రాయిని వేతురు
గుత్తగ తమ సొంతమువలె కూరుచు తప్పుల్
విత్తమిది యందరిది మన
సొత్తు మరువకు మరువకు సుశోభిల తెలుగున్
జిలేబి
ReplyDeleteఅగజానన! కొమరుని నిలి
పి గట్టి గన్వాకిట, భళి పింగేక్షణుడిన్
రగులు కొన చేసితివకట!
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే!
జిలేబి
ReplyDeleteఆ నభవుని కొలువనా యనలుని కొలు
వంగ నెల్ల హరిమ వడియె సూవె
మీన మేషముల సమీకరణము లేల
స్నాన జపము లేల జంధ్య మేల!
జిలేబి
ReplyDeleteపూట పూట కున్ను పులకరింతలనంగ
నాట, వెలది తోడు నాట లాడ
చల్ల గాను బెల్టు షాపుల బోవగ
స్నాన జపము లేల జంధ్య మేల!
నారాయణ :)
జిలేబి
ReplyDeleteఇంత గోల అవసరమా!యింతు లార
శబరిమలకు పోవగ ముక్తి సఖ్య మగున
కో? జిలేబులారా మీరు కూడ దేవ
ళమొకటిని కట్టు కొనుచు భళారె తరిమి
గొట్టుడీ మగవారల గొంతు బట్టి :)
ReplyDeleteమగడా ! ఇంట్లో వంట చేసా రారా అంటే,
బెల్టు షాపు కాడి పెన్మిటి :)
మాల్యా కింగ్ఫిషరిచ్చును,
తుల్యంబుగ నాల్క పైన తువ్వరపడుచున్
కల్యాణి, కిక్కు! మరి నీ
శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్?
జిలేబి
ReplyDeleteVeg పూరణ :)
కాల్యపు వేళన గంజియు
శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్?
తుల్యము గా వ్యాయామము
కల్యాణీ చేయవలెను కండలు గూడన్ :)
జిలేబి
ReplyDeleteఆలోచిస్తున్నా నే
నాలో చింతనల బ్లాగు నన్ సమ గూర్చన్
మాలిక గాను జిలేబీ
గోలవలెన్ వేయగనిదిగో త్వరితముగా ! :)
జిలేబి
ReplyDeleteవిను విన్నకోట పలుకుల
గనుడయ్యా వైవి యారు గర్జన నదిగో
మననర సింహా రావుల్
మన ముచ్చటతీర బ్లాగు మడిసి యగుదురౌ :)
జిలేబి
ReplyDeleteలలిత లలితోక్త చాతురి
సలిలంపు ప్రవాహమై ప్రసంగించు భళా
కలగలుపుమాటల,జిలే
బులతో త్వామనురజామి పులకిత రమణీ :)
జిలేబి
జాల్రా :)
ReplyDeleteవిముక్తి పొందెను :)
అరె! లక్కాకుల వర్యా!
పెరవారలెటు లగుదురయ ! పేర్మికి మీరౌ
తరమగు పెద్దాసానులు
సరసపు మీచిరు జిలేబి స్పామున పోయెన్ :)
జిలేబి
ReplyDeleteఅసమాసమో ? సమాసం
బొ? సంధి గలదో? విసంధి బొంకణమో ! యే
ల సమాసంబులు సంధులు !
పసందగు పలుకుల తేట పరచి పలుకవే :)
జిలేబి
ReplyDeleteబొంగలూరు మామి పూవుబోడి జిలేబి
చెంగు చెంగనుచు కచేరి లోన
బొంగరమువలె తను బోల్డుగాను తిరుగు
చుండు పదము పదము చుట్టి వేసి :)
జిలేబి
ReplyDeleteచిన్నయ సూరి కంద పురాణం :)
ఎన్నగ నిలిచె జిలేబీ
చిన్నయసూరి వలన, మృతిఁ జెందెఁ దెలుఁ గయో,
యెన్నగ నాంగ్లపు మోజున,
మిన్నగ నిపుడైన నేర్వు మేటి తెలుంగున్ !
***
ఆడ పడుచు సరదా పూరణ :)
అన్నా! తెలుంగు బతికెను
చిన్నయసూరి వలన! మృతిఁ జెందెఁ దెలుఁ గయో
యన్నుల 'చేతబడి' వలన
టన్నుల కొలదిగ పదముల టాంకారంబై :)
***
తిన్నగ నాంగ్లంబందున
మిన్నగ బతికెను జిలేబి మించారగనన్ !
అన్నా! చెప్పితి తప్పక
చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో!
***
ఏదో రాసేమా, పోయేమా అని లేకుండా సమాసాలు, సంధులు, వ్యాకరణము, దీర్ఘము, హ్రస్వము అనుచు అబ్బబ్బ యేమి తలనొప్పి తెచ్చి పెట్టితి వయ్యా బాలవ్యాకరణ మనుచు సులభమనుచు :)
అన్నా! పదాను శాసన
మెన్నగ నిచ్చితి తెలుంగు మేటిగ నిలువం
గన్నా యని రుద్దగ నా
చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో!
***
తిన్నదరగకన్ చెప్పితి
చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో!
యెన్నగ తప్పిదమాయెను
మన్నింపుడి మైలవరపు మహిమాన్వితుడా :)
***
అన్నుల పదాను శాసన
మెన్నగ నిచ్చె తెలుగునకు మేధావి సుమా
అన్నయ్యా తప్పయ్యా
చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో ?
***
స్కూలు మేష్టారు కంది వారి పలుకుగా :(
పొన్నయ్యా ! యేరా ! మా
చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో?
తిన్నగ మాట్లాడుము!లే
కున్న బడితపూజ యే! హుకుము ! మేష్టార్నోయ్ :)
***
అన్నుల మిన్న! జిలేబీ
చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో?
తిన్నగ చేయుము పూరణ
తన్నులు తినెదవిక నీవు తప్పుబలుకగా :)
***
పొన్నారిగ తెలుగయ్యెను
చిన్నయసూరి వలన, మృతిఁ జెందెఁ దెలుఁ గయో
కున్న లు టీవీ యాంక
ర్లన్నుల చేతబడి సూవె రావడి యగుచున్ :)
జిలేబి
ReplyDeleteమీ పూరణబాగున్నది !
మాపై కనికరము చూపు మమ్మ జిలేబీ
ఓ పద్యవేణి వలదే
మాపై వర్రోడుకైపు మదిమది గనుమా :)
జిలేబి.
ReplyDeleteపొన్నారిగ తెలుగయ్యెను
చిన్నయసూరి వలన, మృతిఁ జెందెఁ దెలుఁ గయో
కున్నలు టీవీ యాంక
ర్లన్నుల చేతబడి సూవె రావడి యగుచున్ :)
***
దన్నుగ శంకరు కొలువయె
చిన్నయసూరి వలన! మృతిఁ జెందెఁ దెలుఁ గయో
తన్నుకొనుచు మాలికనం
దన్నా కొన్నిదినములు రొదరొదయనంగన్ :)
జిలేబి
ReplyDeleteశాంతి పురస్కారమిదియె
వంతెన వేయంగ మోడి ప్రగతికి దూతై!
పొంతన చూడగ ఆబే
చింతన యగునా సియోలు చెంత జిలేబీ :)
జిలేబి
ReplyDeleteపాఠక సూపర్స్టారను
నా ఠాణాదారు వృత్తి నాగాడునకో?
లాఠీపట్టుకు తిరుగుచు
కాఠంబుల వేయ కుదరకన్బోవునకో :)
నారదా!
జిలేబి
ReplyDeleteకొనసాగించండయ్యా
వినరావయ్యా కమింట్ల వేగము తో, మీ
రనుకున్న టపా వార
మ్మునకొక్కటి వేయుచున్ దుముకుడీ బ్లాగ్లోన్ :)
జిలేబి
ReplyDeleteసున్నములోన నెముక ము
క్కన్నది మిగులక నడచుము కంద జిలేబీ
యన్నన్న యెంత దుష్టులు !
చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁగయో ?
జిలేబి
ReplyDeleteఓ గోపెమ్మో యిటు రా
మ్మో గడసరి దానివీవు ముత్యాలమ్మో!
ఓ గోపయ్యో అటు పో
పో! గండం తప్పునాకు పోపో వయ్యో !
జిలేబి
ReplyDeleteహరిబాబు ! ఎక్కడున్నారు ? వెంఠనే రావాలె :)
హరి బాబూ ! నిను పంపిన
నరుండెవరని తెలిసెను ఘనంబుగ నిపుడే
అరె నీహారిక గుట్టును
తెరిచెను సుమ్మీ ! సదనపు తెరలో గనుమా :)
నారదా!
జిలేబి
ReplyDeleteబుట్ట బొమ్మ ముద్దుల గుమ్మ అని ముందనుకొని
పెండ్లి చేసుకున్నాక జిలేబి విశ్వరూపం
తెలిసి వచ్చిన మా అయ్యరు వారి మనోవీధి వ్యాఖ్య గా :)
సన్నాసి బుట్టలో పడ్డాడు :)
లింకు : http://varudhini.blogspot.com/2015/02/blog-post_14.html
కానిది తప్పదు కాకన్!
రాణి జిలేబి యె బసాలు! రతిరాట్టుగ పా
రాణించి భక్తి గా దొర
సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్!
జిలేబి
ReplyDeleteదీనుల కాపాడంగన్
మా నడిమధ్య నగుపడిన మా దైవమ్మా!
కోనాడుల తిరుమలవా
సా! నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్!
జిలేబి
ReplyDeleteనీహారిక గారన్నది
ఆహా సరిసరి విధమ్మయా! యట్లే బో
తా హాహా బ్లాగులలో
మోహము తీరంగ నొద్దు మొర్రో యనెదన్ :)
జిలేబి
ReplyDeleteశ్రేయోభిలాషులండీ
సాయంబొచ్చిరి కమింట్ల సారించి సుమా
మాయా జాలంబందున
నాయనుయాయులయిరిగద నావందనముల్ :)
వినరావు పలుకుల్ :)
జిలేబి
ReplyDeleteజిల్లెళ్లమూడి ఒడిలో
చల్లగ గోవులగుపించె చక్కటి మనుజుల్
పిల్లల వలెచూసుకొనగ
నుల్లంబుప్పొంగె గన వినూత్నపు శాలన్ !
జిలేబి
ReplyDeleteఓసీ! నామది రావే
మా సీతమ్మకథపాడుమా మనసా ర
మ్మా! సాధ్యంబగు నే భా
మా సన్నిధి రామునిది సుమా విను వినవే
జిలేబి
ReplyDeleteసీతాకోకచిలుక లా
రా! తరముగ వైవియారు రాస్తా లోనన్
హాతువు చిత్రముల మరువ
మీ తావిని యద్ది నారు మించారగనన్ :)
జిలేబి
ReplyDeleteదురితములతొలగింపగ దుర్గ పూజ
నష్టమికి జరుపగ నొప్పు, నట్లతదియ
నేడు గద జిలేబులవలె నేర్పు గాను
చేయవమ్మ చిరాయువు చెల్వుగాన
జిలేబి
ReplyDeleteరాములోరి మనికి రాజకీయపు బుర
దని తగులుకొనెను సదనము లోన
అడుసు త్రొక్క నేల నాసామి రాముని
దారి వీడి విశ్వదాభి రామ !
జిలేబి
ReplyDeleteగాడిద పాలు లీటర్ 5000 రూపాయలట :)
కరభంపు దుగ్ధమునకు న
గరంబున గలదు జిలేబి గట్టి బజార
మ్మ! రహస్యమిద్ది వినుమా
ఖర పాదార్చనము హితము గల్గం జేయున్!
జిలేబి
ReplyDeleteపరమాత్ముడుకలడంతట
కరిలో హరిలో నరయగ కరభములోనన్
వెఱవక రమణీ చేయగ
ఖర పాదార్చనము హితము గల్గం జేయున్!
జిలేబి
ReplyDeleteమైకులు ఢమఢమ లాడగ
కాకుల గోల తలపించు కాలుష్యముతో
గోకుల మందున చేసిరి
యీకుల మాకులమనుచు పయికపు ప్రసరణల్
జిలేబి