Wednesday, January 23, 2019

కొండలు గాలి తాకిడికి కొట్టుకు పోయె :)



కంది వారి సభలో "కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!" సమస్యా పాదాన్ని ఇస్తే,
అబ్బే ఇదేదో తెలిసిన పాదం లా వుందే అనుకుని చట్టని కొట్టు కొచ్చి ఇలా పూరించా :)

భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తి ....

అబ్బ! ఇక్కడి దాకా బాగుంది :) ఇంక ఎట్లా ఫిట్టింగు పెట్టడటం సమస్యా పాదానికి అనుకుని ఆలోచిస్తా వుంటే ,  తాళ్ళ పాకవారి పద్య పాదం  (అని అనుకున్నా కాని క్షేత్రయ్య అని ఆంధ్ర భారతి ఉవాచ ) "సఖియ నీ చన్గవలు సంగటి కొండలందురుగాని కొండలైతే-కోట తలుపులేవే" అన్నది గుర్తు కొచ్చి ఆహా ఇదేదో ఫిట్టించేస్తే బాగుంటుందనుకుని, ఆ పై అసలే పండిత సభ కాబట్టి కొంత బెరుకు పుట్టుకుని మార్చేసు కుని రాసి వేసేసా :)


ఘటుండు రాము డా
మండప మందు విల్లు తునుమాడగ నాదము పిక్కటిల్లగా
కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!

పూర్తి గా :)

భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తిఘటుండు రాము డా
మండప మందు విల్లు తునుమాడగ నాదము పిక్కటిల్లగా
కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!

కొట్టు కొచ్చినవి రెండు పాదాలు (దాశరధీ కరుణా పయోనిధీ :) సమస్యా పాదం ఒకటి, మన కిట్టింపు పాదం ఒకటి వెరసి వాహ్ క్యా బాత్ హై వృత్తం తయార్ జిలేబి తయార్ అనుకున్నా :)

దీని పై కంది శంకరుల వారు :-

జిలేబి గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ఇది మీరు వ్రాసిందేనా? సందేహమే! అంటూ ఒక స్మైలీ పెట్టేరు :)

సరే అందుకని మరో ఉత్పలము రుబ్బి నాము :)

ముట్టగ కైపదంబొకటి ముంగట శంకరుకొల్వులోనటన్,
కొట్టున కొట్టుకొచ్చె తను కొంచెమకో? భళి రెండు పాదముల్!
కట్టె జిలేబి పాదము ను గట్టిగ నొక్కటి యుత్పలంబవన్
చట్టని వేసె కొల్వున సజావుగ నాల్గన వృత్తపాదముల్!
అని - మొదటి ఉద్దేశం గురించి ఇలా అన్నా :)

కంది వారు,

మండప మందు విల్లు తునుమాడగ జానకి చన్నుగుబ్బలా కొండలు... అని రాస్తా మనుకున్నా ! అసలే పండితుల సభ యేమంటారో అని భయపడి కొంత నాదపు పిక్కటిల్లుతో సర్దేసా! ( తాళ్ళపాక వారి చన్గవలా సంగటి కొండలు పాదము గుర్తు కొచ్చి)

****

దీనికి పోచిరాజు వారు వచ్చి -

జిలేబి గారు కుచ సౌందర్య వర్ణన లేని కావ్యము సంస్కృ తాంధ్ర వాఙ్మయ ప్రపంచములోనే లేదు. అతిమాత్రము వర్జనీయము.  మీ రొక తమిళ పద్యమును తెనుఁగు లిపిలో వ్రాసి తదనువాద పద్యము ప్రకటించిన చూడాలని యుందండి.

తస్సదియ్య సవాలే విసిరేరు గా అనుకుని కన్డే న్ సీతయై అన్న కంబ రామాయణ పద్యాన్ని అరవంలో చదివి మన కిష్ట మైన కందం లో కిట్టించి వేయడం జరిగినది ఆ పై పోచిరాజు వారికి 'హమారీ ఫర్మాయిష్ ' తెలిపి నాము :)

పోచిరాజు వారికి నమో నమః


పూర్తిగా సరిగ్గా అని చెప్పలేను గాని కొంతవరకు నావల్లయినంత వరకు :) ( కందంలో నాకు వీలైనంత ఫిట్టు చేయగలిగినంత వరకు :))



కనుగొంటిని సచ్ఛీలపు
మణి సీతను లంకని!తడుమనయున్ దుఃఖం
బును విడుమయ్యా! రామా
హనుమంతుడ డింగరుడ సహాయకుడనయా!

కంబరామాయణము-

கண்டனென், கற்பினுக்கு அணியை, கண்களால்,

தெண் திரை அலைகடல் இலங்கைத் தென் நகர்;

அண்டர் நாயக !இனி, துறத்தி, ஐயமும்

பண்டு உள துயரும்’என்று, அனுமன் பன்னுவான்;

**

కణ్డేన్ కర్పిణిక్కు అణియై కణ్ణాల్
తెన్ తిరై అలై కడల్ ఇలంగై తెన్ నగర్

అణ్డర నాయగ ఇని తురత్తి, యైయముమ్

పన్డు ఉళ్ తుయరుమ్, యెన్డ్రు అనుమన్ పణ్ణువాన్ !



ఫర్మాయిష్ అబ్ ఆప్ సే యహ్ హై కి ఊపర్ పద్య కీ‌ అంగ్రేజీ తర్జుమా (see below) సే ఆప్ కీ టెల్గు పద్య ఇదర్ దేఖ్నే కా‌ :)

ధన్యబాద్ !


I saw ,

the jewel of chastity,

with my own eyes

in the southern city

of Lanka

on the clear twirling wavy ocean,

lord of gods

from now on

relinquish doubts and

all your sufferings.’

said Hanuman

and continued with his details.


Awaiting your marvellous vrutta sir

పై దానికి పోచిరాజు వారి (అద్భుతః ) శైలి లో ఉత్పల మాల : -

జిలేబి గారు ధన్యవాదములు. నా ప్రయత్నమును జూచి కంబ రామాయణ పద్య భావము స్ఫురించినదో లేదో చూడండి.

చూచితి స్వీయ నేత్రముల శుద్ధ చరిత్ర వసుంధరా సుతన్
వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
ద్రోచన తీర లంక నిఁకఁ దూర్ణము వీడుమ శంక నిర్జరుల్
కాచ సమర్థులం చనియుఁ గాదిలి హన్మయె పల్కెఁ గ్రమ్మఱన్

అద్భుత మైన అనువాదం - "వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
ద్రోచన తీర లంక " -  తెన్ తిరై అలై కడల్ ఇలంగై తెన్ నగర్ - in the southern city of Lanka on the clear twirling wavy ocean !

( తెలుగు అనువాదం - పూతల పట్టు శ్రీ రాములు రెడ్డి గారు -
వారి అనువాదం - ఇలా వుంది (క్రింది లింకులో రెండవ భాగం లో సుందర కాండ లో ) మత్త కోకిల

కాంచినాడ సతీత్వ భూషను గణ్యవర్తన జానకిన్
గాంచినాడ మదీయ దైవము గన్నులారగ లంకలో
గాంచినాడను శంక వీడుము కాంచుమా మది నెమ్మదిన్
గాంచితిన్ మరి మాటలాడితి గ్రమ్మరిల్లితి రాఘవా !

పూతల పట్ట్టు శ్రీరాములు రెడ్డి గారి - కంబ రామాయణం తెలుగు అనువాదం లింకులు :

భాగము - 1

https://archive.org/details/in.ernet.dli.2015.385206

భాగము - 2

https://archive.org/details/in.ernet.dli.2015.385207


కొండలు గాలి తాకిడికి కొట్టుకు పోయె ! మొత్తము మీద ఇప్పటికి ఇక్కడ ఆగింది :) ఇంక చూద్దాం ఏమేమి వస్తాయో అని !


చీర్స్
జిలేబి

Saturday, January 19, 2019

కలడాతండట! కాని కాన రాడే !




మత్తేభము

కలడాతండట! కాని కన్నులకు శ్రీకష్టేఫలీ గాన రా
డిలలో దుర్భిణి వేసి చూసినను తర్ఫీదెంతయున్నన్ సుమా
అలయై వెల్గు జిలేబి యై హృదయమందాతండు సూర్యోజ్వలా
వలయంబై యణుమాత్రమై ఋతముగా భాసిల్లు సత్యంబిదే


***

శార్దూలము

శ్రీకష్టేఫలి పల్కె క్షేత్రి యొకడే! సేవింప సేవింపగా
మీకిష్టంబగు రీతి తానగుపడున్ మీనంబుగా వృత్తమై
తా, కోలంబుగ నారసింహముగ తత్త్వంబాతడై వామనుం
డై కోదండపు ధీరులై హలధరుండై కృష్ణుడై కల్కియై!


***

సీసము


కలడాతడంట నాకమున  నిచ్చోటను
హృదయపు  కుహురంబు ఋతముగ తల 
మంట! వెతుకు చుండె మనుజుడిలని జిలే
బి యగుచు మరి  నాడు విధిగ నిపుడు
కాన రాడేలనో!  కష్టే ఫలమవడే!
ప్రేమ పొంగి పొరలె పేర్మి గాన
నెల్లపుడును మది నిండుగ కన్నయ్య
రూప మై వెలుగు స్వరూపముగన!


బ్లాగు లోకపు భాస్కరు పల్కులు మన  
కనుదినము వచ్చె  ముంగిట యనవరతము
మధుర వచనములివి మన  మాచన వరు
పల్కు ననతేనియలుగాను  భాగ్య మిదియె !


కష్టేఫలి వారి పూర్తి పుస్తకము - మాతా నాస్తి పితా నాస్తి
డౌన్ లోడ్ లింకు


జిలేబి