మత్తేభము
కలడాతండట! కాని కన్నులకు శ్రీకష్టేఫలీ గాన రా
డిలలో దుర్భిణి వేసి చూసినను తర్ఫీదెంతయున్నన్ సుమా
అలయై వెల్గు జిలేబి యై హృదయమందాతండు సూర్యోజ్వలా
వలయంబై యణుమాత్రమై ఋతముగా భాసిల్లు సత్యంబిదే
***
శార్దూలము
శ్రీకష్టేఫలి పల్కె క్షేత్రి యొకడే! సేవింప సేవింపగా
మీకిష్టంబగు రీతి తానగుపడున్ మీనంబుగా వృత్తమై
తా, కోలంబుగ నారసింహముగ తత్త్వంబాతడై వామనుం
డై కోదండపు ధీరులై హలధరుండై కృష్ణుడై కల్కియై!
***
సీసము
కలడాతడంట నాకమున నిచ్చోటను
హృదయపు కుహురంబు ఋతముగ తల
మంట! వెతుకు చుండె మనుజుడిలని జిలే
బి యగుచు మరి నాడు విధిగ నిపుడు
కాన రాడేలనో! కష్టే ఫలమవడే!
ప్రేమ పొంగి పొరలె పేర్మి గాన
నెల్లపుడును మది నిండుగ కన్నయ్య
రూప మై వెలుగు స్వరూపముగన!
బ్లాగు లోకపు భాస్కరు పల్కులు మన
కనుదినము వచ్చె ముంగిట యనవరతము
మధుర వచనములివి మన మాచన వరు
పల్కు ననతేనియలుగాను భాగ్య మిదియె !
కష్టేఫలి వారి పూర్తి పుస్తకము - మాతా నాస్తి పితా నాస్తి
డౌన్ లోడ్ లింకు
జిలేబి
బ్రతకవచ్చు గాక బహుబంధనము లైన
ReplyDeleteవచ్చుగాక లేమి వచ్చుగాక
జీవధనము లైన జెడుగాక పడుగాక
మాట దిరుగలేరు మానధనులు.
_/\_
ReplyDeleteపొగిడేరా తిట్టేరా
జగణపు రమణిన్ జిలేబి సాంబారిడ్లీ
ని గురువులు తెలియ లేదే !
వగచవలదయా రమణిని వన్నెల రాజా !
జిలేబి
ReplyDeleteవలయు మాధురి రసనయు పరిపణముగ
దానికి వలయును గతి సుధారసము లొ
లుక వలయునమ్మ పులుగు!పలుకవలదిక
పద్యములలోన యతులేల ప్రాసలేల!
***
ఏల ? ఛందమదేల కుదేలు మనగ
పద్యములలోన యతులేల ప్రాసలేల?
వ్రాసెదమయ గద్యంబున వాణి రాణి
పలుక నాల్కపైన మధుర వచనమగుచు !
***
పద్యములలోన యతులేల ప్రాసలేల?
చోద్యము మన కందివరులే సొమరులీను
రీతి ప్రశ్నింపగానరె!! రిత్తపుచ్చు
టేలమా సమయము పొద్దుటేల సూవె :)
***
తేటగీతియు లలితగతిని పదముల
వేల! కందపద్యములాటవెలదులేల !
పద్యములలోన యతులేల ప్రాసలేల?
వ్రాసెద జిలేబులమరగ వరుస గాను
జిలేబి
ReplyDeleteకొండ గాలి పిలిచెనౌర గుండె ఊసు
లాడె నౌర సఖుడు వచ్చె లసితమౌర
దోచె హృదినౌర చూచుచు తొంగి మదిని
కాచె కండ్లౌర వేవేళ కాంత యౌర!
జిలేబి
ReplyDeleteచేతి దురదండి దురదా !
నే తిన్న దరగక వ్యాఖ్య నేసే రకమే
మీ? తనివారగ కామిం
టే తరహానండి పొద్దుటేల మొదలు హా :)
జిలేబి
ReplyDeleteఏమను కున్నా రర్రా
ఓ మతి లేని నరులార కుక్కను ? కాపా
డే మతి దానికి గలద
ర్రా మందమతి జనులార రాసుల కొలదిన్ !
జిలేబి
ReplyDeleteకుక్కా అని దూషింతురు
పక్కాగా తక్కువైన వారిని జనులున్
నిక్కము గా దీనికి తై
తక్కల బ్లాగ్జనులు పల్కుతారో తరుణీ :)
జిలేబి
ReplyDeleteమమ్మి! వై టెల్గు పీపులు మాస్టరింగు
సచ్చె డిఫికల్టు ఛందస్ మిషనరి జీలు
వై? ఫరే యీజి లాంగ్వేజు వై స్ట్రగుల్సు ?
పద్యములలోన యతులేల? ప్రాసలేల?
జిలేబి
సంస్కృతములోన లేదు ప్రాస , యతి మైత్రి
ReplyDeleteకనము , స్థానమున పదము తునిగి మొదల
గును , మరి , మన తెనుగునందు ఘనత కొఱక ?
పద్యములలోన యతులేల ప్రాసలేల ?
ReplyDeleteనా కెరు కైనంతవరకు
శాకా హారిని సుమండి సౌమ్యా జీ ! కా
నీ కనులకు తెలియక మాం
సాకృత్తుల కలిపి యున్న సారి! తెలియదే :)
జిలేబి
ReplyDeleteబృందపాకము చేసిచూపెద పెందరాళెను రండయా
చంద!గారెలు కోడికూరయు చక్కగానుచపాతియున్
తిందురయ్య జిలేబియున్ సయి తీపిపాకము మీకయా
యిందుకేమరి పుట్టినానయ యింతినయ్యపసందుగా
బృంద ఈటింగు తరువాయి వాతాపి కత అవుతుందేమో :)
జిలేబి
ReplyDeleteదూతాంగదము ( తెలిగింపు) - బులుసు వేంకట రమణయ్య + దోమా వేంకట స్వామి గుప్త (1934).
మత్తేభము :
అరరే ! రావణ ! రావణుల్ పలువు రంచాలింతు, మా కార్తవీ
ర్యరసాధీడ్దృఢ బాహు దండ కృత పిండాకారగుండొక్కడొ
క్కరు డా దైత్యపదాసికా పటల నృత్యోత్సాహ దత్తాన్ను డిం
కొరునిందుం దెలుపంగ సిగ్గిలుదు - నీవొక్కండవో యందునన్ ?
లింకు -
http://sathyakam.com/pdfImageBook.php?bId=12944#page/14
జిలేబి
Deleteబ్లాగాడిస్తా రవి గారి టపా
http://indrachaapam.blogspot.com/2019/02/2.html
జిలేబి
ReplyDeleteపారుని తన మగడిని తా
రా రమ్మని పిలిచె సాధ్వి; రంజిల విటులన్
క్షారితు లారా సరసకు
రా రండని పిలిచె జంత! రసికత వేరౌ !
జిలేబి
ReplyDeleteఏరాళమ్ముగ నెమ్మి తోడు మగడిన్ హేరావళిన్ గట్టి తా
రా రమ్మంచును బిల్చె సాధ్వి; విటులం రంజింపఁ జేయన్ దమిన్,
రారండీయని బిల్చె జంత యొకటే రాణంబు ! సూక్ష్మంబు గా
నౌరా చూడగ వేరు వేరు నెపముల్ నారాచి తీరుల్ సుమా !
జిలేబి
ReplyDeleteమూల మూలల తిరుగుచు ముక్కి నీల్గి
తప్పులను కన బెట్టుచు తాటవొలిచి
తాండ వములాడు జనులకు తాదృశమగు
పద్యముల లోన యతులేల ప్రాసలేల!
జిలేబి
ReplyDeleteయేయథామాం ....
ఆ రాముడొక్కడె ప్రభువు!
మీరెల్లరు ప్రియులు! జూదమీ బతుకాయెన్
చేరెద కర్మగ! మనసా
రా రమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్!
జిలేబి
ReplyDeleteతారామణి గొప్ప నటి! సి
తారగ రాజేశ్వరి, భవతారిణి వేషం
బౌర! నిజ జీవితమ్మున
రారమ్మని పిలిచె "సాధ్వి" రంజిల విటులన్ !
జిలేబి
ReplyDeleteనన్ను మరచిపోతున్నా
రన్నలు! నేనేమి చేతు రా యిట్లైనన్ ?
తిన్నగ యింటికి వచ్చే
స్తున్న! జిలేబీల నింక చుట్టండర్రా :)
జిలేబి
ReplyDeleteమళ్లీ మళ్లీ వినవలె
కిళ్లీ లేసుకుని పాట కిక్కుల నివ్వన్
త్రుళ్లీ త్రుళ్లీ మదియున్
బిళ్లం గోడాడవలె నభినయము గానన్ :)
జిలేబి
ReplyDeleteసత్యమును కనుగొన గలము
నిత్యము జీవితమునన్ తనివిని వెతుకగా
సత్యపు సృష్టి కుదరదయ
సత్యంబిదియే జిలేబి సాధన గానన్ :)
జిలేబి
ReplyDeleteభక్త శ బరినా ? కాను! వి
ముక్తి తపనగా నహల్య ముదితను గానే!
భోక్తగ వచ్చెదరో? నా
సక్తత చూపంగలేదు శ్యామల రాయా :)
జిలేబి
ReplyDeleteఔరా! కవివరులారా !
ధారాళముగ యతి ప్రాస ధారల కై మీ
రీరీ తియనద గు? నెచట
రారమ్మని పిలిచె "సాధ్వి" రంజిల విటులన్ ?
జిలేబి
ReplyDeleteగిన్నెలు గరిటెల కలుపం
గన్నన్నా నొప్పుకొనము గడుసమ్మాయీ
తిన్నా తినకున్నా మా
కన్నియు శుభ్రముగ నుండగా నచ్చు సుమీ :)
జిలేబి
తమకన్నీ తినబెట్టే
Deleteమమకారము మాది , రండి , మదిలో తేడాల్ ,
' విమలాత్ములు ' తమకేలా ?
ఘుమ ఘుమలు కనుడు , గరిటెల గోల లవేలా ?
Deleteగోలా ! గరిటెల గోలల
వేలా ! రా రండియింట వేచితి మమ్మా
కోలాహలమ్ముగా మీ
కై లెస్సగ విందు రమ్మ కంద జిలేబీ :)
జిలేబి
ReplyDeleteయుగములకు ముందు ఢిల్లీ
నిగనిగ లాడు సమయమున నివసించేన
య్య! గనపడలెదపుడిట్లాం
టి గట్టి పిండముల సయి ఘటికులన్ రాయా :)
జిలేబి
ReplyDeleteవేటూరి గారి కరె మా
తోటని పరిగెడు నది పరితోషణమయెనా !
మాటైన తెలిసి యుంటే
కోటవలెన్ కొంపనిచ్చుకొను దానినిగా !
జిలేబి
ReplyDeleteమా బెజవాడ మహారా
జా బండివరులను కూడ జల్దిగ పిలువన్
పూ బంతీ బాగుండును
మా బోంట్లకు టయముపాసు మా బాగగునే :)
జిలేబి
ReplyDeleteమనకు భయమేసె నంటే
మనసున భయమునకు భయము మా గట్టిగ వ
చ్చి ననందిని! తా మన చెం
తన వచ్చినటుల సుమీ బెదరుచు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteపాము తనను పెంచిన నా
పామరుడిని కాటు వేయ పరితాపము తా
నేమైనా గనునా? రా
ణీ మాదిరిగాను వాటిని తలచ రాదోయ్ !
జిలేబి
ReplyDeleteదాగినది నేనకో ? నరు
డా గిర గిరతిరుగు జీవుడకొ కర్మని నౌ
రా గోరంతను చేయుచు
నా గుబ్బలివలె బతుకును నష్టపరచుచున్?
జిలేబి
ReplyDeleteగాడిద మోసే బరువుని
చూడుము బానిసపు బతుకు శుభ్రము గా యీ
నాడే మేలనుకొనుమన
తేడా చూడక మెయికొను తెలివిగ చెప్మా ? :)
జిలేబి
ReplyDeleteశాఖాహారిగ మారను
దాఖలు చేస్తున్న నిపుడె! తస్సాదియ్యా
తాఖత్తు ! బల్పసందుగ
నే ఖైర్ అందేష్ జిలేబిని తెలుసుకొనుడీ !
జిలేబి
ReplyDeleteనా పర్సు పోయెను దొరుకు
నా? పండిన తలయు త్రిప్పె నా చక్రంబున్
నీ పర్సాయెను గోవిం
దా! పది గ్రహములట చెప్పె దక్కదు పోపో :)
జిలేబి
😂😂😂
Delete
ReplyDeleteసముచిత వివరణ నిచ్చిరి
సుముఖము గా సెటిలయి మనసుకు నచ్చిన బు
వ్వ మొదలెడదాము రాజ
న్న మాటలిక విడిచిపెట్టి నావికులౌదాం :)
జిలేబి
ReplyDeleteవక్రపు తుండంబొకనికి
నుక్రోషంబు నిలువెల్లను మరొక్కడికిన్ !
సుక్రతువు నీవు ! గననీ
నక్రంబులె సంతు నీకు నాగాభరణా!
జిలేబి
ReplyDeleteచక్రందిప్పెడు వాడు బావ యటనే ! శైలేయి పెండ్లామటన్ ?
వక్రంబైన మొగమ్ము తో కొడుకటన్? వైధేయుడై ధాత్రినే
నుక్రోషంబున చుట్టె నా మరొకడో ? నూరారు దోషంబులున్
నక్రంబుల్! మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా!
జిలేబి
ReplyDeleteచాలా సౌమ్యుడి నండీ !
గోలల వాయింపుడు సరి గోళీ లాటల్
యేలాగో తట్టుకొనుచు
నేల పయిన సింగముగ యునికిని బడసితిన్
జిలేబి
ReplyDeleteశ్రీమతి సీతా దేవి జి!
మీ మాకందంబు బాగు మీదగు కందం
బై మది కదంబముగ నే
తామెత్తెను భళి భళీ లతాడోలయనన్ !
జిలేబి
ReplyDeleteఏమిటో! ఈ తెలుగు భాషనెపుడు నేర్తు
నో కనా కష్టమాయెను నొవ్వు తీర
దాయె! ఛందస్సు తనరార దాయె! కంది
శంకరార్య తెలుపుడయ చక్కదిద్ది :)
జిలేబి
யாம் பெட்ர இன்பம் இவ் வையகமும் பெருக :)
ஜிலேபி
పద్య గిద్యాలు వ్రాయు ఈ పండితులకు
ReplyDeleteహేఁవిటో ! భాషపై వెగటేలనో ? క
లండు రాముం డతనిని వేడుండు , శిక్ష
ణ నొసగు నడుగకున్నను , ఘనము గాగ .
Deleteరండు రండు మీకని కవిరాయ వేచి
నామయ జిలేబులూరు పనసతొనల క
విత్వ సంపద సభలోన వెల్లివిరియ
చూచి యానందమునుగాన సుకవి రాజ !
జిలేబి
ReplyDeleteఐపీ యడ్రెసులయ్యో
రా పారుడు! వూరిలోన రండీ పట్టే
సే పారుడండి పారుడు
మా పారుడు మా విదురుడు మా విదురుడహో :)
జిలేబి
ReplyDeleteరావాలి ప్రజల లో న
ర్రా విధిగా మార్పు సు! అదిరాక జిలేబీ
యే విధమగు మార్పులు రా
వే! వివరములెరిగి నోట్ల వేయంగ దగున్ !
జిలేబి
ReplyDeleteఇతనెవరో పని లేన
ట్టి తుంటరి మనుజుడటంచు ట్రింగని స్పామ్లో
న తటాల్మని త్రోసెనకో
నతులయ్యా నరసరాయ నన్నొగ్గేయన్ :)
జిలేబి
ReplyDeleteవేదమ్ములకే భాష్యము
మీదైన తెరగుల చెప్ప మీకు తరమగున్
సాదాసీదా మనుషుల
మే! దసనాట్లు పడజేయ మేలా శర్మన్ :)
జిలేబి
ReplyDeleteనీవు ముసుగుమాటు మకిలి
వీవు! యనానిమసు నీవు వెంగళివి సుమా
చేవయు, ధైర్యములే! బుచి
కీవి పదా!నచ్చ కున్న కిమ్మనకన్ పో :)
జిలేబి
ReplyDeleteరాసా నొక వ్యాఖ్యను ! నే
రాసా నొక వ్యాఖ్యనయ్య రాలేదేమం
డీ సారూ బ్లాగున ? నే
వేసారితి కానరాక వేగిర వెతుకన్ :)
జిలేబి
ReplyDeleteసరసి! జిలేబి! చేయదగు చక్కగ నీదగు రీతి ప్రేమతో
పరులకు మేలుఁ, జేయకుము, పాప మహాబ్ధిని మున్గఁబోకుమా,
నరులకు కీడు, కర్తృకవినాశముగా! యిది పట్టుగొమ్మగా
తెరువును గాంచు జీవితము తెమ్మరగానిక సాగు నెప్పుడున్!
జిలేబి
ReplyDeleteపుణ్యగతులు కలుగునమ్మ పూవుబోడి
పరులకున్ మేలుఁ జేసినఁ, బాపమబ్బు,
కీడొనర్చిన వారికి! కిస్తి తప్ప
దమ్మ సరిసమానముగ సదా బతుకున!
జిలేబి
ReplyDeleteష పై షూపరు షెటైరు :) నర షింహా రావు గారు :)
ఈ తరం వారికి ఇదే బాగా అలవాటయిపోయిందండీ. వాళ్ళ నుండి తరవాత తరం వారు అదే నేర్చుకుంటారు, అదే సరైన ఉచ్చారణ అనుకుంటారు.
సినిమా కళాకారులూ, గానగంధర్వులూ కూడా అంతే ... ముఖ్యంగా 'ష' (సమాజంపై వీళ్ళ ప్రభావం మరింత తేలికగా పడుతుంది). నిన్న పేపర్లో చూశాను ... "షక్కు" బాయి అని వ్రాశారు, చూ'షా'రా మరి 🙁? "షితార", "షాటర్ డే", "షన్ డే", "షెప్టెంబర్", "డిషెంబర్" అని పలికేవారూ ఎక్కువవుతున్నారు. 'షుక్ర'వారాలు, 'షని'వారాలు సరేసరి.
ఇక ఒత్తుల విషయం కూడా అధ్వాన్నమే. కొంతమంది సినిమా తారలు ఒత్తులు పలకలేరు .... "బార్యాబర్తల అనుబందం" అని డైలాగ్ చెబుతారు.
'ష' ఫ్యాషన్ అనుకుంటారేమో మరి ... టీవీలో వచ్చే కొంతమంది వయసుమీరిన వారు కూడా (మా తరం వారిలా కనిపించేవారు) అలవాటు చేసుకుని పట్టిపట్టి అనవసరమైన చోట 'ష' పలుకుతుంటారు. నిజానికి అటువంటి వారిని చూస్తే నాకు జాలేస్తుంటుంది.
ఏం చెయ్యగలం, కొంచెం 'నీల్ల'తో 'కల్లు' తుడుచుకుంటుందాం, మనసుకు కాస్త 'షాంతి'గా, 'ప్రషాంతం'గా అనిపించవచ్చు ? 🙁
విన్నకోట నరసింహారావు గారు
థాంక్యూ, థాంక్యూ "జిలేబి" గారూ. "షెటైరు" కాదండీ, తెలుగు భాష భ్రష్టు పట్టటం చూస్తుంటే కలిగిన ఆవేదన 🙁.
Delete(పైన నా పేరు చివర "గారు" మీరు తగిలించినదే గానీ నా వ్యాఖ్యలో నేను తగిలించుకున్నది కాదండోయ్ ☝️🙂)
Deleteతెలుగు "బాస బస్టు" పట్టటంగురించేనా మీరంటున్నది ? :)
జిలేబి
అంతేగా 🙁, 'ష'రిగ్గా చెప్పారు "జిలేబి" గారూ 🙂.
Delete
ReplyDeleteఇదె ఆవకాయ రెండో
దిదె జాడీ నరసరాయ తిందాం రండీ
కుదిరెను శ్రీశ్రీ దాశర
థి దాని కారమ్ము పెంచి ధీంధీం యనగా :)
జిలేబి
ReplyDeleteఈ తవిక బాగు బాగం
డీ! తల తిక్కగ కమింట్ల డీకొన లేనం
డీ! తింగరి బుచ్చిని నే
నే తెంపరిమడిసిని మరి నేనే నేనే :)
జిలేబి
ReplyDeleteఅల్లుడు అని ముదమారగ
పిల్లను ఓ అయ్య చేత పెట్టి పిలువగా
మెల్లన పదిపై నేండ్లగు
సల్లాపంబావకాయ సరిసరి యగునో :)
జిలేబి
జిలేబిగారూ,
Deleteమా పిల్లను,అల్లుడిని కందంబున అందంబుగ బంధింపగ డెందంబున మాకెంతో మోదంబయ్యెన్
Deleteమహా :)
జిలేబి
ReplyDeleteతవికల నల్లు కౌముదికి తావిని జేర్చగ కైపదంబు చా
లు! వెస జిలేబులై పదములున్ భళి దొర్లును; వేగ వేగమై
కువకువ లాడు పెన్మిటిని కొమ్మమెకమ్ముగ మార్చివేయగా
రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్
జిలేబి
ReplyDeleteదుష్టుడౌ రవి! గీరును దుందుడుకుగ
నాడవాండ్ల పై వ్రేళ్ళు సన్నగ జొనుపగ
చూచెనౌర జిలేబియె చుర్రుమనెను
"రవి" కయే చాలుఁ గద, చీర రమణి, కేల
నాతతాయి బాలుడి చెంప నాల్గు మార్లు !
జిలేబి
ReplyDeleteసక్కంగున్నవు నీవెం
సక్కంగున్నవు జిలేబి ! సల్లాపముగా
పక్కన రా, నా మరదలి
అక్కా, రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్!
జిలేబి
ReplyDeleteఆంక్షలు లేక సుఖమ్ముల
మంక్షువుగా పొందగాన్ తమ యభీష్టములా
కాంక్షలు కాని, విభునిపై
కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్!
జిలేబి
ReplyDeleteమున్వచ్చేను తెమాసెకైన నగరమ్మున్జూచి యేండ్లాయెనే!
కన్వెన్గానగ స్కూటునెక్కి త్వరగా కాల్మోపెదన్ విన్న కో
టన్విన్నందుకొనంగ విందునట తట్టంచున్ భలే లేహ్యమా
నాన్వెల్లుల్లియ యూరగాయ రుచులే నాస్వాదనల్జేతునే
జిలేబి
ReplyDeleteకొత్తావకాయ వెన్నయు
నత్తరి యా ముద్దపప్పు నాహాయనుచున్
చిత్తము లాగంగ "మహా"
సత్తువ చేర్చును జిలేబి చవులూరంగన్
జిలేబి
ReplyDeleteతెలుసనుకుంటా వారికి
కలిసితి మే యెన్నిమార్లు కథలన్ చెప్పం
గలగల గాన జిలేబుల్
మిలమిల లాడంగ తీపి మించారంగన్ :)
ఎవరో వారెవరో :)
జిలేబి
ReplyDeleteమీ యింటికి కూడా వ
స్తా! యిచ్చిన నీయకున్న సాదరముగ మా
కై యింతజామును జిలే
బీ!యిదె! వచ్చునిదె రాక వేగిరముగనే :)
జిలేబి
ReplyDeleteమొదలెట్టాలా బ్లాగున్?
ముదమారన్ పార్కలాం! సముచిత సమయమం
దు దులిపెద జాడ్యమున్ భళి
సదనంబదిరి నరసింహ!సాహోరె యనన్ !
జిలేబి
ReplyDeleteఅనుకుంటేనే పద్మా
తనివారగ రాయగలరు తరుణి జిలేబీ
అనుకొనుడీ రాస్తూపొం
డి! నా వలె చదువు జనులు పడిపడి చదువగాన్ :)
జిలేబి
ReplyDeleteఅమనస్కుడనై నడిచితి
సమాధులన్ దాట పెనుమసనమని తెలిసెన్
ఘుమఘుమ మల్లెల వాసన!
చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్ !
జిలేబి
ReplyDeleteమెండుగ జిలేబి వేడగ మెచ్చె కపుడు
మండు టెండలో కురిసెను మంచు జల్లు
యండగొట్టక చల్లని యాశుగమ్మె
చండ రుక్కటు దాగెను జలధరమున !
జిలేబి
ReplyDeleteఏడన్ పోయే కామెం
ట్లేడన్ పోయెన్ జిలేబి లేదే కనరా
దే! డం టకడం! పోతా
నేడే బ్లాగున్ విడిచెద నేడేనర్రా !
జిలేబి
ReplyDeleteఇంతేను! చిత్త గించం
డింతేను జిలేబులండి డింగరులమయా
తంతే పడతామయ్యా
గుంతని దొరులుచు వడివడి గుడుగుడుగుంచమ్ :)
జిలేబి
ReplyDeleteఎన్ని తూర్లు కలిసినా తెలిదంటే ఎట్లా :)
మీ కెప్పుడు దర్శనమో
నా కప్పుడె రాయ దర్శనమగు జిలేబీ
తా కలదో లేదో యెరు
కే కనబడదాయె స్వామి కించిత్తైనన్
జిలేబి
ReplyDeleteవ్యధలాయె కాల సర్పము
సుధలొల్కవలసిన మోము శూన్యంబాయెన్
విధిరాతయందురు జిలే
బి, ధర్మ మగు బతుకు నాది బీడయెనుగదా !
జిలేబి
ReplyDeleteకలదో లేదో యెవరికి
తెలుసును మహిలోన కమ్మ తెమ్మర గానన్
కలగాపులగము గాను మి
గిలెను జిలేబియె! తను మనకిక చిక్కునకో ?
జిలేబి
ReplyDeleteజాలము లోన శ్రేష్టమగు శంకరు కొల్వున నేర్చినావుగా
చాలును! కంది శంకరయ చాలిక, నీ గుణదోష చర్చలున్
మేలును గూర్చె పద్యముల మేటిగ ధీటుగ వ్రాయ సౌమ్య! ఓ
మాలిని! వందనమ్ములిడు మాస్టరుగారికి, వారి యోర్మికిన్!
చాలిక - చాలిమి సామర్థ్యము
జిలేబి
ReplyDeleteమూలముగా జిలేబులకు ముద్దుగ నిల్చెను స్థావరమ్ముగా
వేలకు వేలు పద్యములు వేకువజామున విశ్వవేదికన్
"చాలు"ను, కంది శంకరయ, "చాలిక", నీ గుణదోష చర్చలున్
తాలిమి చేర్చె భారతికి తావియు చేర్చె తెనుంగు తల్లికిన్
జిలేబి
ReplyDeleteవేళయు తప్పకన్ సొబగు విద్యగ వచ్చెను మాకు చాలదే
చాలును! కంది శంకరయ! చాలిక, నీ గుణదోష చర్చలున్,
మూలమగున్ తెలుంగునకు,ముందుతరమ్మునకున్ నిఘంటువై
కాలము దాటి నిల్చునయ కైపద బైసికి జోతలివ్వియే!
జిలేబి
ReplyDeleteరాదది వేరే సంగతి
మీదరి వారేను తెల్వ మీకు సులభమే
కాదని పోతే సుమ్మీ
బాదరబంది మనకేల పదపద వయ్యా :)
జిలేబి
ReplyDeleteదొరల పాలన్ బడితిమయ్య దోవ తెల్వ
గాను దొరలుచుంటిమినిటుల్ కాంగి రేసు
తెలుగు దేశము వైపాక తేలిపోయి
తెరలు తెరలగా దుంపయు తెంచె సూవె
జిలేబి
ReplyDeleteమీరిద్దరొకే వూరుక
దా రామయ్యా వడి తను దా యేడుందో
మీరైనా కను గొనుడీ
ధారాళమ్ముగ జిలేబి దక్కున్ చిక్కున్ :)
జిలేబి
కలరాజిలేబిగారట,🦁పురంబున! కాని కానరారే, నరసింహునికైనను, సింహ(పుర)నరునకైననున్(=YVR)!
Delete(జిలేబిగారు, మీ ఈ టపా టైటిలు స్ఫూర్తితో)
Deleteకలరా జిలేబి :)
జిలేబి
అమ్మో, ఇలా అర్ధం తీశారా?
Deleteనేనే మోడిఫై చేస్తా.
కలర్-ఫుల్ జిలేబిగారట,🦁పురంబున!
క(నిపించక)వి(నిపించెడు)వారట బ్లాగ్పురమున
కాని కనరారే, వి.కో.నరసింహునికైనను, సింహ(పుర)నరునకైననున్(=YVR)!
కలరందురు సింగపురమున
Deleteకలరందురు రాణీపేటనందు
కలరందురిరు దేశములను
కలరు కలరనెడు వారు కలరో లేరో
-----------------
హేవిటో, మరీ గజేంద్ర మోక్షం మొర అయిపోయింది 🙁.
ReplyDeleteతోక ముడుచుటేలనయ ప్ర
భాకర శాస్త్రి జి! మన దరి భారంబగునో
శ్రీకందివరార్యులకు? మ
జాకా మీ నాల్గు వేల జర్ని అరుదయా!
జిలేబి
ReplyDeleteగోల గోల బ్లాగు గోలల నడుమ తా
పద్యపు మధురిమల పరిఢవిల్ల
జేసె నితడు పలుకుఁజెలికి బంగారపు
చాలు నింక, కంది శంకరయ్య!
జిలేబి
ReplyDeleteతోక ముడుచుటేలనయ ప్ర
భాకర శాస్త్రి జి! మన దరి భారంబగునో
శ్రీకందివరార్యులకు? మ
జాకా మీ నాల్గు వేల జర్ని అరుదయా!
జిలేబి
ReplyDeleteకలవంట తెమాసెక్కున
కలవంటా రాణిపేట కాడంటా ! ఈ
కలయైన జీవితములో
కలువలు వివిధములు గాదె కంద జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకలలోపల కలయో? యిల
కల కల్లయొ? కలయె నీ సకలమో ? నిజమా
కలయో కలయే నిజమో
కలయే యునికిని మరువగ కలగాంచెనకో ?
జిలేబి
ఎంత ఫిలాసఫీ లోడ్ చేశారీ చిన్న పద్యంలో🙏!!
Deleteస"కల" కళావల్లభులు😊
Deleteఎంత ఫిలాసఫి లోడే
రెంతగ సుమ్మీ జిలేబి !రింగుతిరిగె నా
కెంతయు బుర్రా ! ఆహా
కొంతయె యనిపించె గాని కోవిదత యిదే ! :)
జిలేబి
ReplyDeleteవేళాకోళము చేయన్
చాళియపు విరుపుల నోటి చాలికకు సుమీ,
కాళిక! కళింగ! కౌముది,
తాళము వేయంగనొప్పు ధర్మము నిల్పన్!
జిలేబి
ReplyDeleteవేళకు రాక నింటికి కవేలపు కన్నుల వారకాంతతో
మేళములాడ, నిన్విడిచి, మెంగతనమ్ముగ నుండబోకుమీ!
కాళి! కళింగ! భర్తకు సకాలము లో, సరియైన రీతిలో
తాళము వేయఁగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్!
జిలేబి
కేళి యదేమొ ? యెవ్వరు లిఖించిన , బ్లాగున వ్యాఖ్య , దానిపై
Deleteవైళమ , కాస్త వెక్కసపు పద్యము గట్టి , తళాంగు తధ్ధిమిన్
తాళము వేయఁగా వలెను , ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్
మేళము మేళవించి శృతి మింపుగ రాగము వెల్లువెత్తగన్
Deleteకేళియదేమో యెవ్వరు
జాలము లో వ్యాఖ్య వ్రాయ చట్టని కందం
బే లీలగ జమ కట్టును
తాళము వేయుచు బిరాన తరుణి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteటాలెంటు పలురకమ్ములు
మేలగు రీతిని ప్రతిభను మేధస్సును పూ
మాలగ నిడి చూపుదురే
లాలిత్యంబొప్పగా కళాత్మక విలువల్!
జిలేబి
ReplyDeleteనాదే ముందండీ! నే
నేదో పోతన పదముల నింపంగ మసా
లా దోసై వచ్చెనదే
దో! దాసుడ! తప్పు గాన, దోసము నాదే!
జిలేబి
ReplyDeleteమీరు సవరించినది సు
మ్మీ రసగుల్లా, జిలేబి మించారెనయా!
హేరాళముగ కలదయా
సారూ సవరింప రైటు సక్కగ మీకున్
జిలేబి
ReplyDeleteఎవ్వరి రచనల లోనే
కవ్వించుచు తప్పులన్ సఖా చూడనయా
రవ్వంతగ చందమ్మును
జవ్వాదిగ నబ్బినాను సఖ ! నరసన్నా !
జిలేబి
ReplyDeleteనామాల వివరణ వలన
మేమెంతయు చదివి విదుర మేలు బడసినా
మే! మీ రెంత సహృదయులు
శ్యామల రాయ! లలితనయ శరణు శరణయా !
జిలేబి
ReplyDeleteకలరెందరో ప్రవచన
మ్ముల చేయుచు నాంధ్రదేశమున నణువునినే
ను లలిత ! దయనా పై శ్యా
మలాంబ దై కూర్చినాడ మణిహారములన్ !
జిలేబి
ReplyDeleteపిట్టకథలు చేర్చున్ రస
పట్టును నపుడే కదా సభని ముఖ్యముగా
చట్టని సాగు లయ లలిత!
కట్టెద నేనేర్చినట్టి కతల విరివిగాన్ !
జిలేబి
ReplyDeleteబహు బాగు సుమీ మీ బ్లా
గు హవా బులుసయ్య మీదగు తెరగుల కతల్
అహహా! దహా! మహా య
ట్టహాసముల సాగె నయ్య టాంగా బండిన్ :)
జిలేబి
ReplyDeleteఈ యావకాయ యుద్యమ
మే యిచ్చె నిరువురు కొత్త మీవడ కవులన్
భాయీ! వెల్లుల్లియె సా
రాయంబయె ధీమతులకు రాయన్ కవితల్ :)
జిలేబి
//వెల్లుల్లియె సారాయంబయె//
Deleteఆయన వెల్లుల్లే వద్దంటుంటే మీరు సారాయం పోస్తే ఎలాగండీ జిలేబిగారూ!!
అట్టె అట్టె అట్టె YVR గారూ 🖐, రెండింటికీ సంబంధం లేదండీ, దేనికదే 🤘🙂.
Deleteకోరి పచించిన పప్పున
Deleteచేరెడు సధ్యో ఘృతమ్ము చేరిచి యటుపై
నోరూరు నావకాయయు
కూరిచి లాగించ స్వర్గ కుహరము దిగియున్ .
//రెండింటికీ సంబంధం లేదండీ, దేనికదే//
Deleteఓహోో, సారాయానికి Prohibition, వెల్లుల్లికి Inhibition అయ్యుంటుందిలెండి 😀😀😀😀
Deleteఅట్టట్టే ఆగండీ
కట్టడి వలదయ్య వైవి కాదంబరిపై
మట్టము తట్టవలదయా
చట్టని రెండింటినినొక చాళిని గట్టీ :)
జిలేబి
అంతేగా మరి YVR గారూ 😀.
Delete
Deleteదోశె అనాలి కదా దో
సేసారేమిటి జిలేబి ? సెప్పండమ్మా !
దోశెయెదోసయ! పైగ
స్తీ సారూ! ఆంధ్రభారతిని చూడండీ :)
జిలేబి
ReplyDeleteనన్నేల శ్రీనివాసని
యన్నా పిలిచేరు మీరు ? అడడా వారే
యన్నా వీరో ? వీరే
యన్నా వారో ? జిలేబి యమహో యమహా !
జిలేబి
ReplyDeleteమాదండీ స్వచ్ఛందో
సాదా దోసండి! రాజ సారుది ఛందో
పాదాన్వితమైన మసా
లా దోసై కాంతిమయపు లావణ్యమయా!
జిలేబి
ReplyDeleteఫీలవుతున్నారాండీ ?
డోలాయంబయెన మది బుడుగ మానవుడా
కోలాటనుకున్నావా
మాలావగు బ్లాగు వ్రాత మాది అనాథా !
జిలేబి
ReplyDeleteవెల్లుల్లే వద్దంటూ
గొల్లున మొరబెట్టుకొనుచు కూడదటంచున్
మళ్ళీ మళ్లీ యంటిమి
తల్లీ సారాయమెట్లు తగునే మాకున్ ?
జిలేబి
ReplyDeleteఆంటీ అంకులు కాలం
బంటా ! వరసలను పల్క పరిహాసంబే
నంటా! కోతీ కొమ్మ
చ్చంటా! వినరా పలుకుల చక్కగ వినుమా :)
జిలేబి
ReplyDeleteబండివరా!యేమైనా
రండీ? చాన్నాళ్ళు కాన రానేరాలే
దండీ కుశలంబేనా
నండీ? తెలుపండి వందనమ్ములు సారూ
జిలేబి
నొచ్చుకున్నట్లున్నారు.
Delete
Deleteనొచ్చుకొనినార? దేనికి ? నొవ్వ మరిచి
రండు బ్లాగులాటల లాడ రావు గారు
గుడుగుడనుచు బండిని లాగి కూనిరాగ
ముల కెరవొకేల పాడదాము తనివార !
జిలేబి
దోశె కావకాయ దొరలకు పడదండి
Deleteదోశె కోడికూర దొరకు నేమి
నొవ్వు వదలు కొనుట నవ్వులు రువ్వుట
తథ్య మగు జిలేబి తఱచి చూడ
ReplyDeleteఅనితర సాధ్యంబాయె! చె
లినిపక్కనిడుకొని తృటిని లివ్వను రీతుల్
సునిశిత కవితల తోడై
వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై!
జిలేబి
ReplyDeleteష పలకడము దోసంబో ?
తపనయెలేదు తెలుగు జనతకు తమ ఫలహా
రపు పేర్లను కాపాడుకొ
న పరిణితియు లేదు నేటి నవతకు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteఅరరే మరిచితిమికదా
త్వరగా పాశ్చాత్యపు పెను తాకిడి లోనన్
తరతరములుగా వచ్చెడు
వరసల, హాస్యాస్పదముగ వరలగ పిలుపుల్ !
జిలేబి
ReplyDeleteవావి వరసల మరచినా
రే వివరముల నరయక మరీ యన్నయ్యా
మావా యను పిలుపులతో!
తావుల మరిచిరి మన ప్రియతమ తెలుగోళ్ళే !
జిలేబి
ReplyDeleteఈ చిన్ని పద్యమందున
దాచిరి గా కోవిదతను తరుణి జిలేబీ
దోచిరి మా మదిని భళీ
తోచెను చెప్పంగ భేషు తొయ్యలి భేషో!
సెల్ఫు డబ్బా :)
జిలేబి
ReplyDeleteమన తెల్గున సూవె స శ ష
లని నిర్దుష్టముగ మూడు లావణ్యంబొ
ప్పు నిఘుష్టమ్ములు గలవ
మ్మ! నివేదించితి జిలేబి మరువగ రాదే!
జిలేబి
ReplyDeleteఅరవలు త ద శబ్దాలక
రరే ఒకే అక్షరమును రాస్తారుగదా
మరి పలకడమ్ము కూడా
సరళంపు జిలేబిగా పొసగుడు గనిరకో?
జిలేబి
ReplyDeleteదోశ దోసెల కత త్రోవను కనలే జి
లేబి వచ్చె తెచ్చె లెస్స గాను
భారతిని నడుమ సెబాసనగ తిరిగె
చర్చ శ సె ల పైన చాళి గనుచు :)
జిలేబి
ReplyDeleteసత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్
మగువా! సత్కృతి నంకిత
ము గొనఁగ జంకెదరు జనులు మోదము కాదం
చు గరికిపాటిగ త్రోయుచు
సగర్వముగ తాము పల్క సరియే యనుచున్!
జిలేబి
జిలేబి గారూ,
సమస్యాపాదాన్ని స్థానభ్రంశం చేస్తూ చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు,
కంది శంకరయ్య గారు
హమ్మయ్య ప్యాసై పోయామన్న మాట!
జిలేబి
ReplyDeleteచిక్కిన బాగుండునయా!
మక్కువగానుండె చూడ మదిలో బాలన్
తక్కువ కొంచెంబైనను
చక్కిలి గింతల జిలేబి చక్కెరకేళీ :)
నారదా!
జిలేబి
ReplyDeleteఏ చర్చనైన నరరే
తా చక్కగ తిప్పునయ్య తనవైపు జిలే
బీ చాతురి యన్ననిదే
గాచారమ్ము మనమే టకాల్మని చిక్కేం :)
జిలేబి
ReplyDeleteపరుషము లేను జిలేబీ
సరళమ్ములు లేవటా !మసాలా తోసై :)
అరె! గోపాలా ; కోబా
లరె! పూకిసు బూగిసున్ను లరె యొకటేనో?
జిలేబి
ఈ పద్యాన్ని చంధస్సు సాఫ్ట్వేర్ లో తయారు చేసారా ? ఒక్క ముక్క అర్ధం కాలేదు.
Delete#MeToo :(
Delete
Deleteముక్కైనా అర్థంబిక
యక్కోయ్ కాలే ! జిలేబి యవ్వారంబై
చిక్కుము డిపడేనుగదా
పక్కూరాయనకు వెలిగె? పదయదె చాలున్ :)
జిలేబి
జిలేబీజీ,బూగిసు కోసం ఆంధ్రభారతిలో వెతక వలయునా?సింహపురియందు వెతుక వలెనా? ☺
Delete
ReplyDeleteలలితా జీ మీ స్టయిలే
భళి! లలితముగ పలుకంగ వరుసేదైనా
నిలలో మేలంటారా !
కలరా భువిని తమవంటి కరుణామూర్తుల్ :)
జిలేబి
ReplyDeleteవెతకాలెక్కడ యెక్కడ!
సుత "రాము" తెలియదు మాకు సుమతి జిలేబీ
సతమత యర్థంబవలే
కత యెక్కడిదే తెలుపుమికన్ త్వరితముగా :)
జిలేబి
ReplyDeleteఅరరే! జిలేబి పద్మా !
నిరాశపు సెగలవి వీడని పెనుతుఫానై
వరుసగ చేస్తున్నాయే
కరుకైన విధముల దాడి కాస్త కుదురుకో !
జిలేబి
ReplyDeleteదండాలమ్మ జిలేబి మీకు పదముల్ తండోపతండంబుగా
చెండాడంగను పద్యమాలలనుచున్ చేకూర్చిరే కుప్పగా
కొండాట్టంబుగ బ్లాగు లోని జనులే కోపమ్ముగా చూడగా
జండాపాతిరి మీదు కైపులనఘా జాగ్రత్తగా మేలుగాన్
జిలేబి
ReplyDeleteవచ్చెన్ తానాటలతో
తెచ్చెన్ కొత్తవరవడిని తేనియలూరన్
ముచ్చెమటల పద్యమ్ముల
గుచ్చెన్ పదముల విడువక గుచ్ఛంబులుగా :)
జిలేబి
ReplyDeleteబాల్ - రన్ - వికెట్ - విన్
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో - దత్తపది
ఉత్తరుని ప్రగల్భము
బాలకుడనుకాను సుమా
చాలమి దరిచేరదింక! చాపము విన్నం
గా లాగి రన్తృ వయ్యెద
నాలాటి తరస్వికెట్టు నానమ్ములగున్?
జిలేబి
ReplyDeleteతిరుమ లాంధ్రుడదిగదిగో దిగెను బరిని
తరము మారును చూడగ తండ్రి కొడుకు
ల! ప్రజలార రండిక చూడ లాభమెవరి
కో! యిది యెజిలేబి పిలుపు కూతయిదియె :)
జిలేబి
ReplyDeleteపట్టణంలో అంగడి పెట్టుకున్న చెలికాడు, స్వాధ్యాయి (వర్తకుని) తో
స్వాధ్యాయీ ! చెలి కాడా!
నే ధ్యానించితిని మేలు నీయంగడియే!
నా ధ్యాసకు లపకెక్కడ?
అధ్యాపక వృత్తి కంటె నధమము గలదే
లపక - ధనము
జిలేబి
ReplyDeleteఈ పుర మందు వెల్గితివి యిమ్ముల గాంచుచు శ్రేష్ఠిగా సఖా
బాపడ! విద్య నేర్పుటయె బాగని గొప్పలు చెప్పుకొంటివే
మేపుచు మంద మందల సమేతము దస్కము పూజ్యమాయె న
ధ్యాపక వృత్తి కంటె నధమాధమమైనది గల్గ దెద్దియున్!
నారద ఉవాచ
జిలేబి
ReplyDeleteమీ బండబడ !తవికలను
మా బోంట్లపయి వెదజల్లి మహిని జిలేబీల్
కాబోలనుకొను రీతిగ
సాబూతును చేసిరే కసాయి జనులె సూ :)
జిలేబి
ReplyDeleteఅంతయు నొక యాత్మేనా ?
నంతయు యేకశిలయే? మన నడుమ వ్యత్యా
సం తన్నొచ్చిన రీతిని
నింత యదేలా ? ప్రసాదు ! నీవిక చెప్మా :)
జిలేబి
ReplyDeleteగీతా! త్యాగీ జిమ్మి
క్కే! తమ్ముడు! యనవసరపు కిరికిరియేలా
ఆ తీయటి యమృతత్వమ
నే తత్వము సాధ్యమేన ? నీవల్లగునా ?
జిలేబి
ReplyDeleteఅతుకుల బొంతగ మిగులును
మతిలేని నరుండు; మిగుల మన్నన నొందున్
స్థిత ప్రజ్ఞుడే జిలేబీ
సుతిమెత్తగ మెలగుచున్ వసుధని వసతి గాన్!
జిలేబి
ReplyDeleteసూర్యుడి నీ చంద్రు డినీ
హ్వార్యము మ్రింగుటయ! వారెవా యేమి కతా!
స్థైర్యము లేని జనుల ని
ర్వీర్యుల చేసి కతలల్లిరి జిలేబివలెన్!
జిలేబి
ReplyDeleteగడియారములో టయమే
సుడి? మంచి ముహూర్త మిద్ది సూవె జిలేబీ ?
అడడా నరుడా భళి తెలి
విడి విన్నాణంబులో ప్రవీణుడివి సుమా!
జిలేబి
ReplyDeleteఆహా చూస్తుంటేనే
వాహో! చల్లదన మనుభవమ్మున కొచ్చెన్
సాహో ముంజెల తోడుగ
నే హాయినిగాంచెదనిదె నే నిచ్చటనే :)
జిలేబి
ReplyDeleteతమరి టేలెంటు తమదాయె తరుణి వారి
దయ్యె టాలెంటు వారిది ! ధర్మ మిద్ది
యే పరస్పర మైత్రిని నెంచి మెచ్చు
కొనుట తరముగ మీకున్ను కొంగుపసిడి
జిలేబి
ReplyDeleteదొంగవుతాడోయి తను వి
హంగము వలె నెగురు పుట్టు హంగుల వేళన్
రంగుల నద్ద జిలేబీ
భంగిమ గాను తలరాత బ్రహ్మయె రాయన్ !
జిలేబి
ReplyDeleteమొలతాడు మీద తవికా !
కలతయె చెందె బుచికీ ! టకాల్మని కాల్చెన్
విలవిల లాడి జిలేబీల్
ఫలితము కనరాలె సూవె బ్లాగ్లోకములో :)
జిలేబి
ReplyDeleteమియ్యావ్ మియ్యావనవలె
నయ్యయ్యో పద్మ! వినవె నామాటల నే
కుయ్యో మొర్రో ననెదన్
గుయ్యని పేలె చెవులేను గుమ్మ ! జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఅరరే దస్కము దక్కెను
కరుణానిధి కూఁతురునకుఁ, గల్మష మంటెన్,
సరిగా నుపయోగము చే
సి రవంతయు దేశమున పసిడినింపకనే !
జిలేబి
ReplyDeleteఈ రోజుల్లో పొజెసివ్
గా రాణీవలె నడవడిక గలిగి పతియే
దారకు మునిమాణిక్యము
గా రాజిల్లవలెననెడు కాంతల్ గలరే :)
జిలేబి
ReplyDeleteదేవుళ్లుగ నిల బెట్టుచు
కోవెల లను కట్టుచు మన కులపోడంచున్
హా! వికటాట్ట హసములన్
తావుల తప్పి నడచుకొని తరియించిరిగా !
జిలేబి
ReplyDeleteసినిమాను చూడ నేలా
పనిలేక! పొలో మటంచు బాధ పడుచునే
డ్వనదేల కనుల నీరుబు
కన!అడుసున్ ద్రొక్కి కాళ్లు కడుగనదేలా !
జిలేబి
ReplyDeleteకాదయ్య కోడి ముందూ
కాదయ్యా గుడ్డు కూడ! ఖచ్చితము సొనే
నాదిది జిలేబి థియరి ని
వేదించితి నయ్య మీకు విరములరయగాన్ :)
జిలేబి
ReplyDeleteవామ్మో వామ్మో ! ఇంత కత నడిచిన నాదా!
హరిబాబునౌర బ్లాగుల
మరి వది లేసి తను బోవ మర్యాదన్ చే
సిరి తమరేనా! శ్రీకాం
తు!రహస్యము తెలిసెనిపుడె దుత్తూరమహో!
నారదా!
జిలేబి
https://te.wikisource.org/wiki/అభిరామి_అందాది
ReplyDeleteமொழிபெயர்க்கவும்
ReplyDeleteపిల్లేమో గడుసాయెన్
పిల్లోడయె మామ కొడుకు ప్రేమాయణమై
పిల్ల మెడవంచ గా మే
నల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్
జిలేబి
ReplyDeleteరెండు రెళ్ళెనిమిది ! రిమ్మ తెగులువీడ
నాలుగారులు పదునాలు గగును!
ఊరి కేగ నయ్య నుసికొలుపువిధము
లెక్ఖ నిచ్చి తాము లెస్స వెడల!
జిలేబి
ReplyDeleteధోబీ ఘాటంటా ! నర
రే బూగిస్సంట! బాపురె జిలేబీ! సుం
గైబులొ! కామన్వెల్తు! జ
గా! బై ఒన్ గెట్ టు ఫ్రీ! నగరమదె వినరా!
జిలేబి
హా తెలిసెన్ .....
Deleteషాపింగ్ ఏరియా అనే బదులు “బూగీసు” అన్నారుగా, అంటే మీరు సింగపూర్ నివాసేనని ... తెలిసెన్. అంతవరకు రూఢి అయ్యింది 😎.
ReplyDeleteహా! తెలిసెన్ మాకు జిలే
బీ! తెలిసెన్ మీ పురమ్ము విశ్వవిదితమా
యే! తెమసెక్కదియే! వై
వీ తెలిసెన్ విన్నకోట విదురుడ తెలిసెన్ :)
జిలేబి
థాంక్స్ ... కానీ పొగిడారా తెగడారా 🤔 ? “తెమసెక్క” అంటే ఏమిటి, ఏ భాష?
Delete
ReplyDeleteషాపింగు గైడు చూసితి
మీ పట్నమ్ము తెలిసెన్ సుమీ బామ్మా ! మా
మీ! పల్లెకుపోదాం ర
మ్మా! పారుని చూడగా సుమా అనపర్తిన్ :)
జిలేబి
“షాపింగు గైడు” చూడలేదు, మీరన్న “బూగిస్” అంటే ఏమయ్యుంటుందని చూశాను, షాపింగ్ ఏరియా అని తెలిసింది. ఏదో Little India తప్ప బయట ఎక్కువ తెలియని వీధి పేరుని ఉపయోగించారంటే మీరు సింగపూర్ లోకలే అయ్యుంటారని అంచనా వేసి మీరుంటున్నది సింగపూరేనని తీర్మానించడమైనది. (అన్నట్లు ఆ బూగిస్ వీధి ఒకానొక కాలంలో notorious ట కదా ?)
Deleteఇంతకూ మధ్యలో “అనపర్తీశుడి” ప్రస్తావనెందుకు తెచ్చారు?
(యాంకర్)సుమగారు అనపర్తిలో ఉన్నారు చూద్దాం రండి 😊😊😊
Delete
ReplyDeleteఅదిగో జ్యువలదిగదిగో ;
మది తూగగ చేసె నతడె మహిమాన్వితమై
పదిమంది జనులు కూడన్
సదనంబుగ విశ్వకర్మ సరి మేధస్సై !
జిలేబి
ReplyDeleteఏమి జిలేబి తెమాసె
క్కేమిటి ? యేభాషయొకొ? జిగిబిగి పదములన్
మామీ వాడుటదేలా
కామా ఫుల్స్టాఫు లేక? కాస్త తెలుపుమా :)
జిలేబి
అలా లాగారా? బాగానే విడగొట్టారు వైవీయార్ గారూ👌. ఒకే ఊళ్ళో ఉంటున్నందువల్ల మీకు కూడా ఆ గాలి బాగానే తగిలినట్లంంది 😀.
ReplyDeleteఅయిననూ "జిలేబి" గారు అనపర్తి మాటెందుకు ఎత్తారో చెప్పాలి.
ReplyDeleteపనిలేక రిటైరయిన
ట్టి నరుల లోకమ్మిదే ఘటికురాల జిలే
బి! నమస్కారము లిడవే
మన విదురులకు పరిపూర్ణమై వెలుగంగన్ :)
జిలేబి
ఓహో, “తెమసెక్కం” అయింది, ఇక ఎకసెక్కం మొదలెట్టారా ... “పనిలేక రిటైరయిన నరులు” అంటూ 😡? అయినా రిటైరయిన వారో రిటైరవని వారో ... మీ బ్లాగ్ వ్రాతలు చదివే పాఠకులు లేకపోతే మీ వ్రాతలకు రాణింపేముంటుందండీ ?
Delete
Deleteఎకసెక్కాలాయెనకో !
పకాల్మనుచు నవ్వులా ! సభని మా పలుకుల్
టకటక యని కందములో
వికసింపన్ జేసినావె విహిత! జిలేబీ :)
జిలేబి
ReplyDeleteసంతూరు సబ్బు ప్రకటన
యెంతగ నూరించెనో మయిమరచు నమ్మ
ణ్ణంతయె నూరించెగదా
వింతగ డాడీయె లవ్వు విరబూయింపన్ :)
జిలేబి
ReplyDeleteలాగేరా? మీకట్లా
బాగా యర్థంబయెనొకొ వైవీ గారం
డీ? గాలి బాగుగ తగిలె
నా గుండమ్మది తవరిది నగరంబొకటై :)
జిలేబి
ReplyDeleteనగరంబొకటేనో లే
క గడుసుగా నిరువురొకరికై యొకరు సపో
ర్టుగ మాటలాడి రా? ఓ
జగణంపు జిలేబులమ్మి సరి సరి వైవీ :)
జిలేబి
ReplyDeleteతెమసెక్కాయెను నెకసె
క్కమకో? మాతో పరాచికాలా? వినవే
రమణి రిటైర్డో కాదో
తమ రచనల చదువు వారు తరుణీ గలరే!
జిలేబి
ReplyDeleteమన వూరాయె తెనాలియె!
మన కెట్లు కవితలు నచ్చు! మనకు తవికలే
ఘనమగును బాసు! శ్రీకాం
తుని పల్కుల వినదగు పద! తోడుగ సాంబా :)
జిలేబి
ReplyDeleteఓరోరీ యజ్ఞాతా !
పోరా అర్థమవకున్న పోయి గలువ నే
ట్లో!రామాకీ వైపున
మా రాతయు నీవలెన్ సుమారే సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteఅనపర్తీశుని కలువగ
యనినారే యేల విహిత యచ్చెరువాయెన్ !
అనఘా! మావూరెళ్లుట
కు నరస రాయుల యనుమతి కూడ వలయునా !
జిలేబి
ReplyDeleteఇట్టాంటి పాటలకికన్
చట్టంచున్ బండి వారి చర్నా కోలన్
కట్టల్ ద్రెంచుకొనుచు తా
నెట్టెట్టో కలము తూగునే విరిబోణీ :)
జిలేబి
ReplyDeleteపుంజుకొను ఖచ్చితముగా
రంజిల్లన్ పెట్టలు వినరా నా రాజా !
వింజామరలే వీచగ
సంజాయిషి లేకయున్ వసంతము లోనన్ :)
జిలేబి
ReplyDeleteకనకపు వర్షంబునకై
యనఘా మూఢులు జిలేబులగుచు చదువుచున్
మనసున మయిలను వీడక
తనివార ప్రయోజనమ్ము తరుణీ కలదే ?
జిలేబి
ReplyDeleteఱంకెలు వేయు కలమ్మది
టెంకణ మిడుమమ్మ బండి ట్రింగని బోవన్
టెంకాయ కొట్టి రమణీ
వెంకాయమ్మా జిలేబి వేగిర పడవే :)
జిలేబి
ReplyDeleteపిచ్చోడా ! కినుకన్ తి
ట్టొచ్చెవరి నయిన నొరేయ్ కటువుగన్, భార్యన్
గిచ్చంగలేవు సుమ్మీ
పుచ్చలెగురు నొడయురాండ్రు పూనుకొనంగాన్
జిలేబి
ReplyDeleteరారా! మేలగురా యీ
దారా సంగమము; మిగుల దౌష్ట్యము సుమ్మీ
యీ రాత్రి నన్ను కాదని
వేరుగ బోవ ! గృహమేధి విదురా రారా !
జిలేబి
ReplyDeleteహేరాళముగా వలచితి
పారుడ! వినరా జిలేబి పల్కుల నీ సం
హారంబగు చేష్టల పర
దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ !
జిలేబి
ReplyDeleteపోరాటములన్ చేయుచు
నోరారగ నేడ్చి యేడ్చి నొప్పింపంగన్
మారామారికి హా! బృం
దా! రాసంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteచెప్పితి మబ్ధికములకున్
తప్పక శుభకామనలను తరుణంబదియో
నొప్పో కాదో చూడక
నప్పా నరసింహ రాయ నాలాయకిగాన్!
జిలేబి
ReplyDeleteపారించు సుఖమ్ముల నీ
దారా సంగమము, మిగుల దౌష్ట్యము సుమ్మీ,
ఓరోరి! రాననుచు నీ
వీ రాత్రి హఠమును చేయ వినరా మగడా!
పాపం పసివాడు :)
జిలేబి
ReplyDeleteఓరి! జిలేబి వెన్క బడి యొప్పును నొప్పునటంచు బల్కుచున్
ప్రేరణ కల్గ చట్టనుచు వేళయు చూడక పొద్దుటేళనే
దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్,
దారికనా?ఛలోయనుచు తాపతిదేవుని త్రోసె ముద్దుగాన్
జిలేబి