అలనాడు “తింత్రిణీ పల్లవ యుక్తమౌ ..... ” అని శ్రీనాధుడు చెప్పిన చాటువే ఈ విడియోలోని భాష కన్నా తేలికగా అర్థమవుతుంది.
అయినా పాపం ఆ పెద్దమవిషెవరో సాంబారును సంస్కృతంలో ఏమంటారు అని అమాయకంగా అడిగితే మీరు కనుగొన్న పేరు చెప్పి ఊరుకోకుండా "ఇన్-గ్రెడియంట్స్" లిస్టు, తయారు చేసే “పద్దతి” / “process” (టీవీ ఏంకరిణుల పరిభాష అన్నమాట 🙂) కూడా వినిపించాలా? వినిపించాలనిపించెను బో అరవంలో చెప్పే విడియోను తెలుగు బ్లాగులో మాబోటి తెలుగు బ్లాగు పాఠకులపై ప్రయోగించడం సబబేనా అని అడుగుతున్నాను. పొద్దునే మాకీ అరవసేవా భాగ్యం ఏమిటని కూడా వాపోతున్నాను.
మీ విడియో కొంత మందికి అర్థమయిందేమో కానీ నాకు అర్థమయ్యే “ఛాన్సే లేదు” (అరవల ఊతపదం) 🙂.
నీహారిక గారు, కులద్వేషం మరీ బయట పెట్టుకుంటున్నారు గానీ. ఏమండీ, బ్రాహ్మణేతరులు సాంబారు కాచుకోరా, తినరా? సాంబారుకి కూడా కులం అంటగడుతున్నవారు మహా మేధావులండీ. 👏
(అసలు సాంబారు అనే ఆ పదం మనం వాడడం నాకిష్టం లేదు. అది తమిళులది కదా. చక్కగా మన “పులుసు” అనే తెలుగు పదం ఉందిగా. కానీ దాన్ని కూడా “అగ్రహార వంట” అంటారో ఏమిటో మీ లాంటి వారు 😳😳?)
తమరికది గుర్తొచ్చిందా స్వామీ? వెల్, వై నాట్, అదీ పులుసే. అయితే పులుసు పేరు చెప్పేటప్పుడు ముందు విశేషణం తగిలించి చెబితే స్పష్టంగా ఉంటుంది.
ఈ తరం అలవాటు లాగానే ఉంది లెండి మీరడిగినది, కాకపోతే కాస్తంత నయం. సాంప్రదాయక పేర్లు మరుగున పడిపోయి, పర ప్రాంతాల పేర్లు / పర భాషల పదాలు పలకడం ఫ్యాషనై పోయింది. సాంబారు, రసం, కర్రీ, చట్నీ, రైస్, ఘీ, సాల్ట్, షుగర్ కర్డ్. మిల్క్ , వాటర్ ... ఇదీ మన భాషాపదాల మీద దండయాత్ర. ఒక పెళ్ళిలో బుఫే దగ్గర కేటరింగ్ కుర్రవాడిని పులుసు ఎక్కడుంది అని ఇడిగాను. అంటే ఏమిటండీ అని అతను నన్ను తిరిగి అడిగాడు. సరే, నేనే వెతుక్కుని, కనబడిన తరువాత ఆ కుర్రవాడిని పిలిచి మరీ చూపించాను. ఇది సాంబారండీ అన్నాడు. నా జన్మ ధన్యమయిందనుకుని అతనికో నమస్కారం పెట్టి ఇంక వెళ్ళమన్నాను.
విడియో మీద Gita’s Kitchen అని కనిపిస్తోంది. ఇక మామీ గారి మడి సంగతి ... మీ సందేహాన్ని అక్కడే కామెంట్ రూపంలో పెట్టి అడిగి చూడండి 👍🙂.
// “నీహారిక Jul 29, 2020, 10:51:00 AM మీ మొఖాలు మండ ....ఎక్కడికెళ్ళినా అగ్రహార వంటలేనా ?” // ——————- ఒరు నిమిషం, ఒరు నిమిషం. నీహారిక గారి కవిహృదయం నాకేదో వెలిగినట్లనిపిస్తోంది. వారి తిట్లకు కారణం వెల్లుల్లి వెయ్యలేదనా? అందుకా “అగ్రహార వంటలు” అని వర్గీకరించారు? అరుణ గారి మీద విసురా?
సరే, పై విడియోలో మామి గారికి వెల్లుల్లి నచ్చదేమో, అందుకని వెయ్యలేదేమో? అదే లోపం గనక అయితే మీరు వేసుకోండి .... ఇబ్బందేముంది, ఆ మాత్రానికే ఎవరి “మొఖాలూ” “మండ” నవసరం లేదుగా?
వంటావిడ పేరు గీతా అయ్యర్, చానెల్ పేరు అగ్రహార రెసిపీస్. వాళ్ళు "అగ్రహార రెసిపీస్" అని పేరు పెట్టుకుంటే తప్పులేదు కానీ నేను ఎత్తి చూపితే తప్పు కనపడిందా ? పైగా కుల ద్వేషం నాకు అంటగడుతున్నారా ...చొల్ల ముడియాదు.
అరవం అర్ధం అవ్వాలా ఏమిటీ ?వాళ్ళు చేస్తున్నది చూస్తే చాలు. పప్పుతో చేసిన వంటలు సాంబార్ లేదా పప్పు చారు అవుతాయేమో కానీ పులుసు అయ్యే చాన్సే లేదు. ఈ అగ్రహారం వాళ్ళకి అన్నీ అర్ధం అయేటట్లు చెప్పాలి కామోసు...మీకు అర్ధం అయిందా ?
విడియో మీద Gita’s Kitchen అని కనబడుతోంది అంటుంటే ఈ “అగ్రహార రెసిపీస్” ఏమిటండీ బాబో? సరే అదలా ఉంచండి గానీ ఆ మామీ పేరు గీతా అయ్యర్ అని మీరెలా కనిపెట్టారు (నా దగ్గర పని చేసిన స్టాఫ్ లో గీతా అయ్యర్ అని ఒకామె ఉండేది. ఆమే ఈమా కనుక్కుందాం ఉండండి 🙂).
భాష రాకపోయినా చేస్తున్నది చూసి పట్టెయ్య గలిగేది ఆడవారు. మగవారిలో చాలా మందికి ఆ చాకచక్యం ఉండదు.
పప్పుతో చేసిన పులుసును తెలుగులో పప్పు పులుసు అంటారు చాలా ఇళ్ళల్లో (అదే మీ పరిభాషలో పప్పు చారు). అంతే కానీ పరాయి భాషా పదాన్ని అరువు తెచ్చుకుని సాంబార్ అని చెప్పుకోవలసిన అవసరం ఏమొచ్చింది? ఇలాగే మన తెలుగు భాషాపదాలు మరుగున పడిపోతున్నాయి. ఈ తరం 90 శాతానికి పులుసు అనే మాటే తెలియదు.
నేను సోకాల్డ్ “అగ్రహారం” బ్యాచ్ అని మీరెందుకు అనుకుంటున్నారు?
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...
నల్లా ఇరికేన్ :)
ReplyDeleteతమిళావిడ సాంబారు వి
ReplyDeleteధము బావుంది తెలుగున విధానము చెబితే
సముచితముగ నర్థమగును
తమరైనా ట్రైపణంగె తప్పదు సారూ !
మీ మొఖాలు మండ ....ఎక్కడికెళ్ళినా అగ్రహార వంటలేనా ?
ReplyDeleteశర్మ గారికి అరవం అర్థమవుతుందనుకోవచ్చా?
ReplyDeleteఆ వీడియోలో వంట చేస్తున్న మహిళ “జిలేబి” గారేనా ఏమిటి, శర్మ గారూ?
శ్రీ జిలేబిగారు స్త్రీలుగాదనియు, ప
ReplyDeleteదారణాలపురుషులనీ, పేరు తెలుప
నిష్టపడని భోగట్ట, మరింక ఛాన్సె
లేదు వంటావిడ తను జిలేబియవగ .
అలనాడు “తింత్రిణీ పల్లవ యుక్తమౌ ..... ” అని శ్రీనాధుడు చెప్పిన చాటువే ఈ విడియోలోని భాష కన్నా తేలికగా అర్థమవుతుంది.
ReplyDeleteఅయినా పాపం ఆ పెద్దమవిషెవరో సాంబారును సంస్కృతంలో ఏమంటారు అని అమాయకంగా అడిగితే మీరు కనుగొన్న పేరు చెప్పి ఊరుకోకుండా "ఇన్-గ్రెడియంట్స్" లిస్టు, తయారు చేసే “పద్దతి” / “process” (టీవీ ఏంకరిణుల పరిభాష అన్నమాట 🙂) కూడా వినిపించాలా? వినిపించాలనిపించెను బో అరవంలో చెప్పే విడియోను తెలుగు బ్లాగులో మాబోటి తెలుగు బ్లాగు పాఠకులపై ప్రయోగించడం సబబేనా అని అడుగుతున్నాను. పొద్దునే మాకీ అరవసేవా భాగ్యం ఏమిటని కూడా వాపోతున్నాను.
మీ విడియో కొంత మందికి అర్థమయిందేమో కానీ నాకు అర్థమయ్యే “ఛాన్సే లేదు” (అరవల ఊతపదం) 🙂.
నీహారిక గారు,
ReplyDeleteకులద్వేషం మరీ బయట పెట్టుకుంటున్నారు గానీ. ఏమండీ, బ్రాహ్మణేతరులు సాంబారు కాచుకోరా, తినరా? సాంబారుకి కూడా కులం అంటగడుతున్నవారు మహా మేధావులండీ. 👏
(అసలు సాంబారు అనే ఆ పదం మనం వాడడం నాకిష్టం లేదు. అది తమిళులది కదా. చక్కగా మన “పులుసు” అనే తెలుగు పదం ఉందిగా. కానీ దాన్ని కూడా “అగ్రహార వంట” అంటారో ఏమిటో మీ లాంటి వారు 😳😳?)
పులుసంటే ఏమిటండీ చాపల పులుసేనా?
Delete"Agrahara Recipes" అంటూ సదరు యూట్యూబు ఛానెల్ పేరు స్పష్టంగానే ఉంది, సందేహం వలదు. అఫ్కోర్స్ వంట మామీ మడి బట్టలు కట్టుకుందా లేదా తెలువడం లేదు.
తమరికది గుర్తొచ్చిందా స్వామీ? వెల్, వై నాట్, అదీ పులుసే. అయితే పులుసు పేరు చెప్పేటప్పుడు ముందు విశేషణం తగిలించి చెబితే స్పష్టంగా ఉంటుంది.
Deleteఈ తరం అలవాటు లాగానే ఉంది లెండి మీరడిగినది, కాకపోతే కాస్తంత నయం. సాంప్రదాయక పేర్లు మరుగున పడిపోయి, పర ప్రాంతాల పేర్లు / పర భాషల పదాలు పలకడం ఫ్యాషనై పోయింది. సాంబారు, రసం, కర్రీ, చట్నీ, రైస్, ఘీ, సాల్ట్, షుగర్ కర్డ్. మిల్క్ , వాటర్ ... ఇదీ మన భాషాపదాల మీద దండయాత్ర. ఒక పెళ్ళిలో బుఫే దగ్గర కేటరింగ్ కుర్రవాడిని పులుసు ఎక్కడుంది అని ఇడిగాను. అంటే ఏమిటండీ అని అతను నన్ను తిరిగి అడిగాడు. సరే, నేనే వెతుక్కుని, కనబడిన తరువాత ఆ కుర్రవాడిని పిలిచి మరీ చూపించాను. ఇది సాంబారండీ అన్నాడు. నా జన్మ ధన్యమయిందనుకుని అతనికో నమస్కారం పెట్టి ఇంక వెళ్ళమన్నాను.
విడియో మీద Gita’s Kitchen అని కనిపిస్తోంది. ఇక మామీ గారి మడి సంగతి ... మీ సందేహాన్ని అక్కడే కామెంట్ రూపంలో పెట్టి అడిగి చూడండి 👍🙂.
మేలు, తింత్రిణీఫల'చేప'మిశ్రరసమ?
Deleteఐన, చాల రుచికరము , హాయి గలుగ
నమరు నిడ్లీకి ,దోశెకున్ , అసలు జలచ
రములు వెజ్జికోవకుజేరు, రచ్చయేల ?
@విన్నకోట నరసింహా రావు:
Deleteకొన్ని కొన్ని అంతేలెండి, ఎవరి భాష వారిది. ఉ. మా అమ్మ లెక్కలో కూరంటే కోడి కూర, subzi= శాకం only.
లక్కాకుల మాస్టారు అన్నట్టు నేములోనేముంది, రుచి బాగుంటే లొట్టలేసుకొని తింటే ఒక పనై పోతుంది. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు.
*తమిళ* బ్రాహ్మలు మడి కట్టుకొని వంట చేస్తారో లేదో? గీతా ఐయర్ మామి గారిని అడగాలంటే ఇంగిలీషులో మడి (తడి) ఏమంటారో తెలియదు. కష్టపడి కనుక్కొని అడిగినా అగ్రహారం పెద్దలు ఆగ్రహంతో నిగ్రహం కోల్పోయి శపిస్తే నా గతేమి కాను!
// “నీహారిక Jul 29, 2020, 10:51:00 AM
ReplyDeleteమీ మొఖాలు మండ ....ఎక్కడికెళ్ళినా అగ్రహార వంటలేనా ?” //
——————-
ఒరు నిమిషం, ఒరు నిమిషం. నీహారిక గారి కవిహృదయం నాకేదో వెలిగినట్లనిపిస్తోంది. వారి తిట్లకు కారణం వెల్లుల్లి వెయ్యలేదనా? అందుకా “అగ్రహార వంటలు” అని వర్గీకరించారు? అరుణ గారి మీద విసురా?
సరే, పై విడియోలో మామి గారికి వెల్లుల్లి నచ్చదేమో, అందుకని వెయ్యలేదేమో? అదే లోపం గనక అయితే మీరు వేసుకోండి .... ఇబ్బందేముంది, ఆ మాత్రానికే ఎవరి “మొఖాలూ” “మండ” నవసరం లేదుగా?
విన్నకోట నరసింహారావు గారు,
Deleteవంటావిడ పేరు గీతా అయ్యర్, చానెల్ పేరు అగ్రహార రెసిపీస్. వాళ్ళు "అగ్రహార రెసిపీస్" అని పేరు పెట్టుకుంటే తప్పులేదు కానీ నేను ఎత్తి చూపితే తప్పు కనపడిందా ? పైగా కుల ద్వేషం నాకు అంటగడుతున్నారా ...చొల్ల ముడియాదు.
అరవం అర్ధం అవ్వాలా ఏమిటీ ?వాళ్ళు చేస్తున్నది చూస్తే చాలు.
పప్పుతో చేసిన వంటలు సాంబార్ లేదా పప్పు చారు అవుతాయేమో కానీ పులుసు అయ్యే చాన్సే లేదు.
ఈ అగ్రహారం వాళ్ళకి అన్నీ అర్ధం అయేటట్లు చెప్పాలి కామోసు...మీకు అర్ధం అయిందా ?
విడియో మీద Gita’s Kitchen అని కనబడుతోంది అంటుంటే ఈ “అగ్రహార రెసిపీస్” ఏమిటండీ బాబో? సరే అదలా ఉంచండి గానీ ఆ మామీ పేరు గీతా అయ్యర్ అని మీరెలా కనిపెట్టారు (నా దగ్గర పని చేసిన స్టాఫ్ లో గీతా అయ్యర్ అని ఒకామె ఉండేది. ఆమే ఈమా కనుక్కుందాం ఉండండి 🙂).
Deleteభాష రాకపోయినా చేస్తున్నది చూసి పట్టెయ్య గలిగేది ఆడవారు. మగవారిలో చాలా మందికి ఆ చాకచక్యం ఉండదు.
పప్పుతో చేసిన పులుసును తెలుగులో పప్పు పులుసు అంటారు చాలా ఇళ్ళల్లో (అదే మీ పరిభాషలో పప్పు చారు). అంతే కానీ పరాయి భాషా పదాన్ని అరువు తెచ్చుకుని సాంబార్ అని చెప్పుకోవలసిన అవసరం ఏమొచ్చింది? ఇలాగే మన తెలుగు భాషాపదాలు మరుగున పడిపోతున్నాయి. ఈ తరం 90 శాతానికి పులుసు అనే మాటే తెలియదు.
నేను సోకాల్డ్ “అగ్రహారం” బ్యాచ్ అని మీరెందుకు అనుకుంటున్నారు?
వెల్లుల్లి తినని వాళ్ళందరూ అగ్రహారికులే !
Deletevnr గారు,
ReplyDeleteపైన వీడియోలో కార్నర్ లో కనిపిస్తున్న circle image క్లిక్కండి. gita ayyar గారి youtube channel కనిపిస్తుంది.
“అగ్రహారీకుల” మీద మీకు చాలా అభిమానంలాగా ఉంది 🙂.
ReplyDeleteమీ మరు జన్మ “అగ్రహారం” లోనే, ఇది నిక్కము ☝️😁.
(పై వాడికి నేను కూడా రికమెండ్ చేస్తాను లెండి ✋).
నరసన్న వదలరా ఈ
ReplyDeleteనిరసన వెల్లుల్లిమీద,నిజమేమనగా,
సరసాన్నప్రియులు తిందురు,
నిరసింతురు రుచులెరగని 'నీమమహాత్ముల్' .