Tuesday, April 13, 2021

ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!జవసత్త్వమ్ముల కాపా

డవలె సుమా బతుకు పరుగిడవలె జిలేబీ !

ప్లవమంటె తెప్ప యట! నా

వ వలె జనులను కడతేర్చవలెను జిలేబీ !శుభాకాంక్షలతో

జిలేబి

19 comments:

 1. >> జనులను కడతేర్చవలెను జిలేబీ

  కడ తేర్చడం అంటే తెలుసునా మామ్మా? :-) అందుకే శ్యామలీయం వారు మిమ్మల్ని ఆయన బ్లాగులో ఇటువంటి పద్యాల్ గిద్యాల్ రాయొద్దాన్నారు కాబోలు. :-)

  ReplyDelete
  Replies

  1. ఎప్పుడూ నెగటివ్ థింకింగేనా ?
   కొంత పాజిటివ్ గా ఆలో, చించుడీ :)


   జిలేబి

   Delete

  2. నుడువగనగు దరిజేర్చగ ,
   కడతేర్చవలెనుబదులు , చకచకా రామా !
   పడవవయి మముబ్రోవు , మి
   క్కడ పాజిటివిది , విహిత ! చకాచక విబుధా !


   Delete


 2. రామా కడతేర్చు జనుల
  రామా కడతేర్చు మయ్య రట్టడి చేయం
  గా మూర్ఖుల! నిలుకడ నీ
  వే! మమ్మెడకడ గనకు! సవిధమె మనుపగున్  జిలేబి

  ReplyDelete


 3. అరిగన రికార్డు వేయుచు
  కరగిన నెయి నిప్పునుంచ, గడ్డలు గట్టెన్
  మరి నా మది నాటి తలపు
  లు రయ్యనుచు తట్టగా ములుకుగ తగులుచున్!


  జిలేబి

  ReplyDelete


 4. సలసల సువాస నల కా
  వల కరగిన నేయి నిప్పుపయిఁ గాచిన! గ
  డ్డలు గట్టెఁ జూడఁగన్ ఫ్రి
  జ్జులోన పెట్టగ జిలేబి చోద్యంబిదియే!


  జిలేబి

  ReplyDelete


 5. మడిసి మదిలోని తలపులు
  సడి చేయగ శిల్పి యులిని సడియై మహ దే
  వుడి చెలువమ్ముల పార్వతి
  కొడిగట్టి జిలేబులకు ప్రగుణమై నిలచెన్ !


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ಪರಮೇಶ್ವರ ಟೂ ಉಮಾಮಹೇಶ್ವರಿ:
   చిలికి చిలికి గాలి వానకే నువిలా అలిగితే.. "నా తప్పు ఏమున్నదబ్బ.." ఎంతటి ఘనులైనను కాంతదాసులే స్థాయి: దేవుడు.. ఇక మనషులం మనమెంత

   Delete


 6. ఎలుక లన నాకసమ్మున నీఁదు నవియె
  పిల్లులన వాటి వెనుక ద్రవించి పరుగు
  లిడెడు ప్రేమ పక్షులగు! భళీ శునకము
  లింక వాటి స్నేహితులు భళీ జిలేబి!  జిలేబి

  ReplyDelete


 7. "విను" పల్కె శకారుడు చి
  ర్రున! "ఎలుకలనంగ నీ వెఱుఁగవే గగన
  మ్మున నీఁదునట్టివౌ! వా
  టి నెయ్యులగు పిల్లులు" సురటి విసురు కొనుచున్!  ఇట్లు
  జిలేబి

  ReplyDelete


 8. బ్లాగు పేరు మార్చి నారకో? బాగుంది!
  ఆలు రౌండు సామి ఆదరించె!

  :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఈ మాటేదో ఆవిడ బ్లాగులోనే వ్రాసుండవచ్చుగా? వారూ సంతోషించేవారు.

   Delete


 9. ఈ మాటేదో నేరుగ
  ఓ మాలిని వారి బ్లాగులోనే చెప్పం
  గా మేలౌగా! త్రమ్మట
  మామీ మీదర్థమవదు మాకెప్పటికిన్ !


  జిలేబి

  ReplyDelete


 10. నాకొక సందే హంబగు!
  మీకెట్లాగండి గుర్తు మీగడ తెరలై
  రాకెట్లాదూకుచునల
  వోకగ వరలు డవిలాగులున్? శ్రీకాంతా!


  జిలేబి

  ReplyDelete


 11. నేనో ఫస్ట్డే ఫస్ట్షో
  లో నే సినిమాను చూసి క్లుప్తముగా రె
  వ్యూనందించే వాణ్ణం
  డీ!నడుమ కరోన వలన డీలా పడినా:)


  జిలేబి

  ReplyDelete


 12. హేతువును వీడి చెండా
  డే తుంటరి ముక్కలన్న డ్రియ్యో యేతా
  వాతా కొన్ని విషయముల
  లో! తప్పగు బురదకప్ప రోయనుట సుమీ


  జిలేబి

  ReplyDelete
 13. జవసత్త్వమ్ముల కాపా
  డవలె సుమా బతుకు పరుగిడవలె జిలేబీ !
  ప్లవమంటె తెప్ప యట! నా
  వ వలె జనులను కడతేర్చవలెను జిలేబీ !

  ఊ...అనండి ఒకసారి🧚

  ReplyDelete
 14. This comment has been removed by the author.

  ReplyDelete
 15. కడతేర్చవలెనా ?
  కడచేరవలెనా ?

  ReplyDelete