Friday, April 7, 2023

దేశం సుభిక్షంగానే వుంది :)

 హమ్మయ్య 


బ్లాగు లోకం బతికే వుంది.


చీర్స్


జిలేబి

125 comments:

  1. ఓం మై గాడ్!!!
    జిలేబి వందాచ్చి....

    ReplyDelete
    Replies
    1. వందాచ్చి జిలేబి తధిమి
      తందానా! హృదయ లయలు తకిట తకిట ధీం
      చిందుల్వేయగ రండి ప
      సందైన కమింట్లు వేసి సరదా చేద్దాం :)


      చీర్స్
      జిలేబి

      Delete
  2. Replies
    1. బెకబెక రారండోయ్ మన
      మిక ముచ్చట్లాడుకొనెదమిచ్చట బ్యాంకుల్
      టకటక గోవిందాయను
      చు కస్టమర్లకెగవేత చూపెడు వేళన్


      చీర్స్
      జిలేబి

      Delete
    2. జిలేబి గారి మెమరీ పవర్ కూడా బాగానే ఉందండి. మీరు బ్యాంక్ లో పనిచేసేవారు అని గుర్తుపెట్టుకున్నారు.

      Delete
    3. “జిలేబి” గారు బహుముఖ ప్రజ్ఞాశాలి కదా, కాబట్టి ఆశ్చర్యం లేదు.

      Delete
  3. Replies
    1. బాగున్నామండీ బల్
      బాగున్నామ్మిదె నెనరలు భారతి గారూ!


      జిలేబి

      Delete
  4. కరోనా తో పోయారేమో అనుకున్నాం. బాగున్నారన్న మాట వెల్కం “బెక బెక” 🙂.

    ReplyDelete
    Replies
    1. అరె పోయిందను కున్నా
      కరోన వేటున జిలేబి! ఖాస్! పోలేదా :)


      జిలేబి

      Delete
    2. అమంగళం ప్రతిహతమగును గాక! క్షమించాలి... నేనూ ఆ భ్రాంతిలోనే ఉన్నాను. హమ్మయ్య!

      Delete
  5. వందాచ్చి, వందాచ్చి.
    ఆచి వందాచ్చి.
    వాంగో,వాంగో.
    ఉక్కారోంగో
    ***
    శాంతిరస్తు,తుష్టిరస్తు
    పుష్టిరస్తు, ఆరోగ్యమస్తు
    ఐశ్వర్యమస్తు.
    సర్వే జనాః సుఖినో భవంతు
    **
    సమస్త సన్మాంగళాని భవంతు.
    నిత్యశ్రీరస్తు.
    నిత్యమంగళాని భవంతు.
    సర్వశ్రీరస్తు.
    సర్వ మంగళాని భవంతు.

    ReplyDelete
    Replies

    1. వాంగో! ఉక్కారుంగో!
      చాంగుభళా! శాంతిరస్తు! సకల జనులు స
      న్మంగళ ముగా జిలేబీ
      చెంగట వెస టైముపాసు చేయన్ రండోయ్

      జిలేబి

      Delete
  6. వినుడి! గురువులందరు వం
    చనపరులే! నేనొకండ జ్ఞానిని! సీ! కొ
    య్యనగాళ్లు మీరు! పరమా
    త్ముని తెలివిడి మీకు కలుగుతుందా? నోనో!

    నేను చెప్పలేదిది :)


    జిలేబి

    ReplyDelete
  7. “Zilebi” garu coming into full form 🙂🙂.

    తమరి (తిరిగి) రాక మాకెంతో సంతోషం. శర్మ గారి ఆశీస్సులు కూడా పొందారు. కానీ ఒక సంగతి బాకీ మీ దగ్గర నుంచి. గత రెండు సంవత్సరాల మీ అజ్ఞాతవాసానికి గల (అసలు మీరే ఓ పెద్ద “అజ్ఞాత” లెండి) బలమైన కారణాలు / పరిస్ధితులు ఏమిటి అన్నది మీరు మీ ఈ బ్లాగు ద్వారా మీ బ్లాగు మిత్రులకు (ఎందుకంటే మీ అభిమానులందరూ చాలా ఆందోళన చెందారు కాబట్టి) ఎంతైనా ఉంది కాబట్టి సదరు వివరణనిచ్చి మమ్మల్ని ధన్యులను చెయ్యండి. థాంక్స్.

    ReplyDelete
    Replies
    1. ఏముంది గర్వ కారణ
      మేముందండీ ! కరోన మేరీ జాన్ లే
      లీ! మెల్లమెల్ల ప్రాణము
      రాముని దయతో నిలబడె రవ్వంత యిలన్.

      Delete
  8. What a pleasant surprise!

    Once again, the Telugu blog world gets more spicy, funny and lively!

    Welcome, welcome.

    ReplyDelete
    Replies

    1. శ్యామల రాయుని దీవెన!
      మామి! జిలేబీల వేయుమా మరలన్ ! శ్రీ
      రాముని పై కోకొల్లలు
      గా మాలలు గట్టి నట్టి కవిరాట్ వారౌ!

      చీర్స్

      Delete
    2. నిజమే... వారి జిలేబీలు తీయగా ఉండవు. కారం, మసాలాలు దట్టించి స్పైసీగా ఉంటాయి.

      Delete

  9. బలగమ్ము రంగ మార్తాం
    డ లెస్స! చూసా! జిలేబి ! డబ్బా వాయిం
    పులతోడు కృష్ణ వంశీ
    కళాత్మకత కన్నను బలగమె బెటరు సుమీ!


    ఎవరో అంటూంటే నూ :)

    ReplyDelete
  10. నిన్న సాయంత్రం మాలికలో మీ బ్లాగ్ చూడగానే ముందుగా చాలా చాలా సంతోషించినా అంతలోనే కొంచెం సందేహించాను... ఏమో మా ఆజ్యిలేబీ కారేమో ఏ చాట్-జీపీటీయో యేమో అని.

    కానీ మీ పజ్యాలు (జ్యా - intentional spelling) చూడగానే "హమ్మయ్య! మా జిలేబ్బామ్మే!" అనెంత మురిశానో మీకు తెలీదు.

    మీ క్షేమవార్త బహు-శుభ వార్త.

    మా ఇంటి నుంచి నేనూ-నా మేలిసగం మీ రాకకి చాలా చాలా ఆనందిస్తున్నాం!

    శోభకృత్ అక్షరాలా శోభకృత్!

    ReplyDelete
    Replies
    1. --

      పదముల్ చాట్ జీ పీటీ
      సదనమున జిలేబి పద్య సౌరభములుగా
      కుదురుగ వచ్చెను లలితా
      జి! దాని యొత్తిడికి కవుల చెమ్మ తరుగునో :)

      నెనరులు మీ వాత్సల్యానికి

      జిలేబి

      Delete
  11. ---

    శంకరాభరణములో

    ఓల్డ్ పీపుల్స్ రాంబ్లింగ్స్ :)

    అందరికీ శుభోదయం


    అనుకోకుండా కలిసా
    చిననాటి హితుని; జడి తెరిచి యతడు డబ్బా
    యనెనాతో "నస్యముఁ గొను
    మనుజుని వదనము సురభిళమౌను వయస్యా!"




    జిలేబి


    ReplyDelete

  12. ఇటలీ పై రెడ్ రింగట!
    తటిల్లు బ్లాగ్జ్యోతిషీ వదాన్యులు కెలికా
    రొ టపా యని చూడ విడిచి
    రట జ్యోస్యము ! టయముపాసు రాతలు బోయెన్ :)


    జిలేబులకు మేటర్లిక తగ్గె గదా :)

    ReplyDelete
  13. చాలా సంతోషంగా ఉంది.
    ఏవిటో... అప్పట్లో మదనపల్లిలో, తిరుపతిలో మనం కలుసుకున్నామనీ, మాట్లాడుకున్నామనీ అన్నారు. కాని నాకైతే గుర్తు లేదు... మిమ్మల్ని గుర్తు పట్టలేదు.

    ReplyDelete
    Replies
    1. భలేవారే శంకరయ్య గారూ, అలా గుర్తుపట్టనిచ్చేస్తే తాను జిలేబీ ఎందు కవుతుందండీ?

      Delete
  14. కం. మొన్నే‌ జిలేబి వస్తే
    ఎన్నెన్నో రాలె నండి ఇట్టే కామిం
    ట్లెన్నెన్ని రామకీర్తన
    లున్నవి కామింట్ల మాటయే యెఱుగకయే!

    ReplyDelete
    Replies
    1. కీర్తనలకు వ్యాఖ్యల సరి
      భర్తీ చేయంగ రారె ప్రజలొకరైనన్
      వర్తులపు జిలేబులకో
      మర్తులు వత్తురు పడిపడి మస్తు కమింటన్ !


      నారదా
      జిలేబి

      Delete

  15. "పుష్ప" వలె ధనమును పొంకింప నౌర, రా
    బడి యది చెరసాల బాటజూపు
    వలదు దొడ్డిదారి బతుకు నిలవదౌర
    లక్ష్మి నాల్గు నాళ్లు లక్షణముగ

    జిలేబి

    ReplyDelete
  16. జిలేబీగారూ, చాలా ఆనందంగా ఉందండీ, ఇన్నాళ్ల తరువాత మీ బ్లాగ్ పోస్ట్ చూసి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ రావు గారు
      మ్ఆఈ నందమే ఆహ్లాదము

      Delete
  17. చాల సంతోషం. మీరాక చాలా మందికి ఆనందదాయకం ఆయింది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండోయ్ రాముడు‌ గారు

      కుశలమా !

      Delete
  18. నమస్కారమండీ .. మీ రాక బ్లాగుల్లో తిరిగి ఊపు రప్పిస్తుందని ఆశిస్తున్నాం....
    మీ అదృశ్యం వల్ల బ్లాగర్లు తమ ఉనికి దాచడం వల్ల వచ్చే "పుకార్లు" గురించి అర్ధం అయింది...
    అయితే ఈ రెండేళ్ళూ ఏమి చేసారో .. ఎందుకు అజ్ఞాతవాసమో కాస్త వివరిస్తే బాగుంటుంది...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ శ్రీనివాస్ గారు .

      కోవిడాయ నమః


      జిలేబి

      Delete
    2. ఒకవేళ మళ్ళీ కోవిడ్ వస్తే మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లి పోతారా ఏంటి :(

      Delete
    3. ఏమో ! ఎవరికెరుకా ? ఊపర్ వాలే కీ మర్జీ :)

      Delete
  19. శ్యామలీయం వారి రామకీర్తన లలో "కందాలు" -4

    మంచివాడవు రాఘవా

    తిన్నగ నినుగూర్చి తెలియ
    కున్నట్టి మనుజుని నన్ను కొంతైనను నీ
    వెన్నటికి మరువక ప్రభో
    వెన్నంటిన మంచివాడ వీవె రఘుపతీ!


    జిలేబి


    ReplyDelete
  20. కలయో, కల 'కల'మో, ఇట
    ఇలనే గని మా బామ్మను, నేనుండెద
    ఇలానే, ఇకపైననూ, ముదముగ,
    కిలకిలల, కలతను వీడి, నమ్మగదమ్మా

    బామ్మా, ఇదేం'మా', గిట్టని వారల ఉసురు గొని,
    వామ్మో, గిట్టితివా యను సందేహమున ఉసురసురమ్టిమి గ
    దమ్మా! నిక్కముగ నొక మాట జారవమ్మ, ఇకపైన
    మమ్ము నిశ్చయముగ వీడనన్న కందము తోడన్ ...

    పద్య నియమాలతో మాకేం పని
    విద్యల నెరిగిన తల్లిని మరలా గని
    హృద్యమున మురియునిక బ్లాగ్వని
    మాధ్యమము! వాద్యమిదె వరూధిని


    (మీకేమైనదో యన్న బెంగ నన్ను పీడించెనన్న మాటకు సత్యప్రమాణ ప్రమాణం : https://nmraobandi.blogspot.com/2022/02/my-song-parody-balm-ma-karaoke.html
    నమ్ముదురన్న నమ్మకం వమ్ము కాదను భరోసానిమ్ము, అమ్మరో సమ్మతించి ...)
    (("తొందరపడి ఒక కోయిల ముందే కూసెనా ..." యన్న పెద్ద గురువుల జ్జ్యోతిష్యాన్ని కూడా ఎప్పటిలానే లెక్క సేయక ఇప్పటికిలా, ఇక్కడికిలా, మరలా, మర లా యేతెంచి, గతించెనా
    యన్న కుశంకను, పటాపంచలు గావించిన మా "పద్య పురచ్చి తలైవి" కిదే మా వారుకై వరవేయుర్కేన్ ...))

    may you outlive others, with flying feathers ...
    REALLY GLAD THAT YOU'RE BACK WITH A BANG ... SAME AS ALWAYS ... LOVE YOU BAAMMAA ...

    ReplyDelete
    Replies


    1. వామ్మో! ఎంత పెద్ద చర్చ జరిగిందండీ మీ రెట్టిన లింకు టపాలో!


      మీ ఆప్యాయతకు నెనరులు.


      Delete
    2. “ఎంత పెద్ద చర్చ జరిగిందండీ” అంటూ మురిసిపోవడం బాగానే ఉంది కానీ ఇక ఇప్పుడైనా మీ నిజనామం, ప్రస్తుత ఊరి పేరు బ్లాగుముఖంగా తెలియజేస్తే బాగుంటుంది.

      Delete
    3. ఎంత పెద్ద చర్చయటంచునంతలోనె
      మురిసి పోకె జిలేబీ సముచిత రీతి
      నీ విలాసము, నామము నీదు బ్లాగు
      మూలముగ తెలుపు జనులు ముదము నొంద :)


      జిలేబి

      Delete

  21. మదిని దోచి నారు మన బండివర్యులు
    వారి కారవోకె వరద లో జి
    లేబి మునిగి మునిగి లెస్స లివ్వుమనగ
    తేలి వెలిగి వెలిగి తేలి పోయె

    చీర్సు సహిత
    జిలేబి

    ReplyDelete

  22. మీతో పరిచయమున కు
    ర్రూతగ లదు నాకు; ఓరి రూట్ నీదీ నా
    దీ తన్నుకు చచ్చిన కల
    బోతవ దోయ్ పోర పో! నిపుణిడిని నేనోయ్


    చీ చీ పో పో :)


    జిలేబి

    ReplyDelete

  23. భారత రత్నయె చేసెద
    మూ రారండీ జిలేబి ముదితను జనులా
    రా! రాత్రింబవలున్ దా
    హోరెత్తించుచు పిడకల హోమమొనరిచెన్


    జిలేబి

    ReplyDelete

  24. ఔరా భారత దేశము
    పోరాడి సమస్యల, గెలుపు తనదె యనగా
    హేరాళమ్ముగ నా కే
    దారములో నీశ్వరుండు దాండవమాడె‌న్


    జిలేబి

    ReplyDelete
  25. నేనే బ్రహ్మాస్మి :)

    మీరంతా బచ్చాల్రోయ్
    నా రహదారి సుళువక్కొ? నాతెలివేమీ ?
    మీరెక్కడతూగెదరోయ్?
    సారీ నా శిష్యులగుట సాధ్యము కాదోయ్


    ఎవరో అంటూంటేను :)

    ReplyDelete
    Replies
    1. ఆయనకు కూడా ఒక పద్మశ్రీ పడేస్తే పోలా ?

      Delete
    2. మళ్ళీ దాని మీదో పోస్ట్ పెడతాడేమో? ఎందుకొచ్చిన తంటా, ఊరుకుందురూ.

      Delete
    3. "అమ్మల, బాబాల నీడ దేశానికి పీడ"
      చిన్నప్పుడు గోడల మీద చదివాను.

      అయినా అమ్మ కి బాబాకి తేడా ఏమిటబ్బా?

      Delete
  26. విధిరాత కారణముగా
    ప్రధర్షణను తాళలేక బ్రతుకుతెరువులే
    క ధవము చేర్చంగ నతడు
    దధిపాత్రన్ విషమెసంగె దావానలమై!


    జిలేబి

    ReplyDelete
  27. బీపీ మందుల తరహా
    కౌపీనమ్ముల వివిధ రకముల వలె వెరై
    టీ! పద తెలివిడి గొను బ్లా
    గ్లో పండిన తలయు వ్రాయ కూర్పుగ రమణీ :)

    ReplyDelete
  28. -

    పదముల పిడకల వలె త
    ట్టి దుముకుచు దుముకుచు నెగిరి టింగణమువలెన్
    సదనమును చుట్టి కామిం
    ట్ల దువ్వి పండితుల మోది ఠారెత్తింపన్ :)


    జిలేబి

    ReplyDelete

  29. చిరుజీవియె బామ్మెప్పటి
    కి! రుసరుసలబుసబుసల వికీరించు సదా
    మురుకులు చుట్టు జిలేబీల్
    గరగర కష్టేఫలి యని ఖర్మకొలదిగా :)

    జిలేబి

    ReplyDelete
  30. కరుపుల్ చరుపు విరుపులున్
    మరెవ్వరికి సొంతమండి మన బామ్మకు త
    ప్ప? రమించు పజ్యపు పిడక
    ల రావడి సడిన్ జిలేబి లంఘింపులతో :)


    జిలేబి

    ReplyDelete

  31. బాబాలమ్మల నీడ జి
    లేబీ దేశానికి తగిలిన పీడ సుమా
    నే బో నగిరి యడిగెదన్
    బాబాలమ్మలకి తేడ పడతీ గలదే ?


    ஜிலேபீ

    ReplyDelete
  32. నాకు డౌటే,

    నిజంగా పాత జిలేబీయేనా?హాలీవుడ్డు జాంబీ సినిమాల్లోలా చచ్చిపోయి పూడ్చిపెట్టాక సమాధి నుంచి మళ్ళీ లేచొచ్చిన పాత(కి) జిలేబీయా!

    సాక్ష్యాలూ రుజువులూ లేకుండా నేను దేన్నీ నమ్మను గాక నమ్మను.

    నువ్వు పాత జిలేబీవేనని గ్యారెంటీ ఏంటి?
    నాకు తెలియాలి.అసలు నిజం తెలియాలి.

    జై శ్రీ రామ్!

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారూ ఆ భయంలో మీరు జై హనుమాన్ అనాల్సిన చోట అలవాటు కొద్దీ రాముడికి జై కొట్టినట్లున్నారు. అయినా ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ జైభీం trending సార్.

      Delete
    2. నాకేం డౌట్ లేదు. “జిలేబి” గారి శైలి అనితరసాధ్యం. అలాగే వారి పద్యరచనా నైపుణ్యమున్నూ (🙂). ఏం సందేహం లేదు.

      Delete

    3. నాకు తెలియాలి తెలివిడి
      నాకు వలయు నువ్వు నువ్వె నాయనుచు జిలే
      బీ! కావుకదా పాత(కి)?
      సాకారమ్మునకు వలయు సాక్షి కసబిసా :)

      Delete

    4. -

      అనితర సాధ్యము వారిద
      గు నూత్న శైలి హరిబాబు ! కొంతయు కూడా
      అనుమానము లేదు పదము
      ల నైపుణి వివిధత సరి విలక్షణత సుమీ!


      జిలేబి

      Delete
  33. తన సంతాపసభకు తా
    ను నడచి వచ్చునకొ లేక నూత్నవిధముగా
    తను భూతమై కనబడునొ
    వినినంతనె భయము కలిగె విపరీతముగా !


    జిలేబి

    ReplyDelete

  34. పెద్ద గురువు గారు పేదరాశి జిలేబి
    యిరువు రొకరి నొకరు యెన్ని మార్లు
    తగువు లాడుకున్న తస్స దియ్య విడిచి
    పెట్టుకొనరు గాక పెట్టుకొనరె!

    జిలేబి

    ReplyDelete
  35. Even a Blank Sheet of Paper has to go through a Printer to become a Document.

    ReplyDelete
  36. బిజిలే అమ్మణ్.. ఎపటి ఇరుక్క.. నల్ల ఇరికిరాంగ వందానో. తుంబ సంతోష అయితు. సిహి కనసిగళు ఎల్లరిగు.

    ReplyDelete
    Replies
    1. -


      శ్రీధరనిత గారండీ!
      మాధాంధూం మెచ్చుకొనెడు మంచిమ నిషి మీ
      రౌ! ధన్యవాద ములు మది
      రాధన మొందె నిదె మీదు రాక తలచుచున్


      జిలేబి

      Delete
    2. ధన్యోస్మి బిజిలే అమ్మణ్. సదా ఆశీస్సులు కోరుచు

      Delete

  37. శర్వాణి!తెలుపుమెవరిని
    ఊర్వశి పెండ్లాడె? రాము నుత్సవ మూర్తిన్
    పర్వపు దినమందెటుల స
    గర్వము గా ద్రిప్పిరి ప్రజ గ్రామపు వీధిన్?

    జిలేబి

    ReplyDelete
  38. -


    మనసను కీటకము భ్రమర
    మను భక్తికి చిక్కి విభుని మదిలో గొల్వం
    గనవరతము, శరణాగతి
    మనుగడ యై గాచు నిన్ను మహిని జిలేబీ


    జిలేబి

    ReplyDelete
  39. సరే,ఇప్పుడు ఏం చేద్దాం జిలేబీ మామ్మా!

    నేను చూస్తే ముఖపుస్తకం దగ్గిర చాలా నిజీ అయిపోయి నా బ్లాగుని దాదాపు మూసేశాను.చాగంటి వెంకట్ గారు University pf Applied Vedic Sciences అని స్థాపించి ఆన్లైన్ క్లాసుల ద్వారా వేదం చెప్తానంటే అక్కడ జాయిన్ కావడం కోసం ఎదురు చూస్తున్నాను.

    మొదట (1) Siksha (VE-01),(2) Astadyayi (VE-02),(3) Chandas (VE-03),(4) Negantu/ Neruktam (VE-04),(5) Jyothishya (VE-05)
    (6) Kalpa (VE-06) నేర్పి ఒక సర్టిఫికెట్ ఇస్తారు.దీనివల్ల మనమే వేదమంత్రాలకి అర్ధాలు తెలుసుకుని ఇతర్లకి చెప్పగలుగుతాము.చిరుడ్రీంసు లాంటి స్కవుండ్రల్సు వేదంలో గోవధ ఉంది అని నకిలీ వేదమంత్రాలకి తప్పుడు అర్ధాలు చెప్తూ దబాయిస్తున్నప్పుడు నోరెళ్ళబెట్టుకుని కూర్చోనక్కర లేదు.

    "ఉపాధికీ సంపాదనకీ పనికిరాని సర్టిఫికెట్లు దేనికీ!" అని వంకలు పెట్టేవాళ్ళకి ముఖం మీద కొట్టినట్టు energy sector మొదలు aviation వరకు పది సంటిఫిక్ బ్రాంచీలలో మన క్రియేటివిటీ చూపించి మార్కెట్ దగ్గిర డిమాండు ఉన్న వస్తువుల్ని తయారు చెయ్యడం కోసం రీసెర్చి చేసి డాక్తరేట్ తీసుకోవచ్చు. ఉత్తినే డాక్టరేట్ ఇచ్చి పంపించెయ్యడం కాదు,మనం డబ్బు సంపాదించుకోవడానికి మనం తయారు చేసిన వస్తువుల మీద పేటెంటు సౌకర్యమూ క్లయింట్లని పట్టుకుని మన వస్తువులని అమ్మి పెట్టటం కూడా యూనివర్సిటీయే చేస్తుంది.

    ఆ పని పూర్తైతే ఇక పాలిటిక్సులోకి డైరెక్ట్ ఎంట్రీయే - తొక్కలో పోష్టులు పెట్టి గవ్వకు కొరగాని జడ్డి వెధవలతో పోట్లాడాల్సిన దరిద్రం ఉండదు.ఇంక బ్లాగుల్లో పోష్టులు పెట్టటానికి అస్సలు తీరిక ఉండదు.

    నీకు ఉషారుగా ఉంటే చెప్పు.లింకు ఇస్తా నువ్వూ వేదం నేర్చుకుందువు గానీ.

    ".వస్తావా? మురిపిస్తావా? - వస్తావా? మురిపిస్తావా?
    // కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
    మూగమనసులో మాట ఓ జిలేబీ! //
    వస్తావా? మురిపిస్తావా? - వస్తావా? మురిపిస్తావా? ఓ జిలేబీ!"

    ReplyDelete
    Replies
    1. జిలేబి ఆల్ రెడీ అక్కడ లేదని ఎలా ఊహించారు హరిబాబు మనవడు గారు ? :)

      All the best complete asap and enter politics to do some thing good to the country :)



      Delete
    2. ఉంటే కలుద్దాం జిలేబీ బామ్మా:-)
      ఇప్పటికే శ్రీవిద్యా ఉపాసన మొదలుపెట్టి చాలా కాలం అయ్యింది.గట్టి ప్రయత్నం చేస్తే దివ్యదృష్టీ,దూరశ్రవణం లాంటివి కూడా సాధించొచ్చు.అప్పుడు నువ్వెవరో కనుక్కోవడం చాలా ఈజీ.

      జే కే :-)

      Delete
    3. ఆశ దోశ అప్పడం వడ :)
      ఇలాంటి చిన్ని‌ చిన్ని కోర్కెల వీడి కొంత పెద్ద గోల్ పెట్టుకోండి. :)



      Delete
  40. -

    ద్వేషంబబ్బిన విధముగ
    యోష! జిలేబి మనుజులకయో భక్తి సదా
    జోషివ్వదె కుందనమా
    వేషములకు దొరకడె ప్రభు వెప్పుడు సుదతీ




    జిలేబి

    ReplyDelete

  41. ఎండలు తగ్గగ కలిసెద
    మండీ కలిసెదము మిమ్ము ; మామి జిలేబీ
    మొండిఘటపు కాళ్లు తిరిగి
    యుండునొ గమనించుటకిక యుక్తి కలదకో ?


    జిలేబి

    ReplyDelete
  42. -

    చేసే వారుంటే ఓ
    సోసీ చేయించుకొనెడు సోంబేరుల్, తో
    సేసి పనుల నీపై, గల
    రే, సిత్రంబైన లోక రీతి జిలేబీ !

    జిలేబి


    ReplyDelete
  43. -

    తెలుగు కుంచిక రాజ్యపు తీరు తెన్ను
    నిర్ణ యించు మహారాణిని వల దోయి
    పనికి రాని వాగ్యుద్ధపు ప్రతిఘటనలు
    నాదగు రచన లిష్టము నాది సూవె!

    జిలేబి

    ReplyDelete

  44. పొరలన్నియు తొలగిన వె
    ల్గురేఖ కనబడునొ ! ఆశలొకవైపిక ద
    గ్గరవను సాకులు వెతికి, వి
    వరింప లేని కడగండ్ల వడి నిట్టూర్పుల్.

    ReplyDelete
  45. మరలొచ్చిన బామ్మా!
    మఱపొచ్చెనా - ఈ మనవడిని తలవ?

    ReplyDelete
  46. http://pannaari.blogspot.com/2023/04/blog-post.html

    ReplyDelete
    Replies
    1. Pun, नारीजी, :)

      मा राक मी नालुगु वत्सराल बुरखानु तीयिन्चे गदा आ सन्तोशमे माकु पूर्ति बलमु :)


      जिलेबी

      Delete
  47. -

    చెప్పిరి పండితులెందరొ
    చప్పిడి పద్యముల రచన చాల్చాలుమికన్!
    అప్ప జిలేబీ వినెనా ?
    దెప్పిన పల్కులను బేర్చి దెబ్బలు వేసెన్ :)

    నారదా! బేగనే బారో :)

    శంకరాభరణంలో హల్చల్ :)


    ReplyDelete

  48. -
    అనయము శ్యామా ! మీ కీ
    ర్తనల హృదయమున తలంతు రామా రామా
    యని వెర్రులెత్తగా మది
    యు నమనమలతో సులలిత యున్మాదినియై :)

    నేనలే :)

    జిలేబి

    ReplyDelete
  49. -

    ఎంత మాటండి! మహితాత్ము లెంద రో జి
    లేబు లను రాము లోరిపై లెస్స చుట్టి
    నారు నావంతు గా చుట్టి నాను నేను
    కూడ! రామయ్య దయయే కూడగాను


    జిలేబి


    ReplyDelete
  50. చలికాలపుగొప్పతనమ
    దలిక కలిగి చెరువు జలము దళసరి గా దు
    వ్వలువన్ సరి కప్పుకొనిన
    టుల దట్టపు మంచు పొర మిటుకులాడివలెన్!

    జిలేబి

    ReplyDelete
  51. శాంతము నిండిన మనసున
    చింతన పరమాత్మునిదగు చిరుకోరికలున్
    చింతలు కలిగిన మనసున
    చింతన విభునిదెచట ? శివశివయను సుదతీ!


    జిలేబి

    ReplyDelete

  52. సామాన్యులనంగ నెవరు ?
    మామి అసామాన్యురాలు ! మరిఫాలో అ
    య్యేమన బోంట్లెల్లరికన్
    సామాన్యులమండి ! డెఫనిషనిదే నండీ :)


    ReplyDelete
  53. మనమే అధికారులమను
    కొనుచు శరీరమును గాచి కొడిగట్టి జిలే
    బి! నమనమలతో డశ్వర
    మును పూజలు సేయనేల ! మున్జూపు గొనన్!

    జిలేబి

    ReplyDelete
  54. -

    హేయము నాదను వాదము
    లాయెనని తెలుగు రచయితల తలపు లకటా!
    చేయ ననువాదము లనిక
    ధ్యేయము కుంచికది తెలుప తెలుగు తనమ్మున్!


    పోతే పోనీ అని సమయం వెచ్చించి అనువాదాలు చేసి మంచి గ తెలుగు తనమ్మును ప్రోత్సహిస్తామనుకుంటే బడుద్ధాయులారా విమర్శల జడివాన కురిపిస్తారట్రా ! పోండ్రాపోండి.



    ReplyDelete
  55. పొందెద ననయమతని కెడ
    డెందంబారంగ నే కడిమిని జిలేబీ !
    నిందింపనేమి లోకులు
    బంధము నాదీ ప్రియునిది ప్రసువు శిశువుదౌ!


    జిలేబి


    ReplyDelete
  56. -

    మధుమేహంబదె తప్పదు
    సుధలొల్కు జిలేబుల తినుచుండగ నటులే
    ముదమార కందమూలము
    ల దమ్ము బట్టితినగన్ ఫలమొకటె శ్యామా !


    రాముడెటుబోయెనో
    జిలేబులమ్మి :)

    ReplyDelete
  57. -

    అములూ! నందిని ! విజయ ! తి
    రుమలా! హెరిటేజు ! దొడ్ల! రుసరుస ఆవి
    న్ను! మొదట వలయున్ మార్కె
    ట్టు! మరల యేభాషయైన టోకించదగున్ :)


    జిలేబి

    ReplyDelete
  58. -
    Inflation will go back to 4%

    లేదోయ్ ద్రవ్యోల్బణమే!
    మోదమ్ముగ స్వీకరింపు మోయి జిలేబీ
    లేదోయ్ మార్కెట్లో యే
    దీ ధర లెక్కువ ! సరసమిదె సరసమమ్మీ!


    జిలేబి



    ReplyDelete
  59. -


    సూడాను లో సమస్యలు!
    మోడీ జైశంకరుల, సమున్నత సౌదీ
    జోడీ, మన ప్రజలను కా
    పాడెన్ " ఫ్రెండ్లీ బ్రదర్లి" వరము జిలేబీ


    జిలేబి

    ReplyDelete
  60. ఓహో నా మార్కెట్టూ ఎటు బోతావే :)

    Quarterly bullish pattern emerged?

    అయిసీ అయిసీ అయ్యి ! రి
    లయన్సు! మార్కెట్టు బీటులహె! యస్ బ్యాంకో
    కయికట్టులలో నొదిగె! మ
    రియింక కొండెక్కు నిఫ్టి ? రేపటి సస్పెన్స్ :)


    జిలేబి


    ReplyDelete
  61. -
    అడగ మన్నారు కాబట్టి అడుగేసా :)


    నాదను వాదము లకటా
    వేదన కలిగించెనంట విదురులకు జిలే
    బీ! దరిమిల తెలుసుకొనన్
    సోదరి! యింత సమయమ్ము శోభిల్లునకో :)

    జిలేబి

    ReplyDelete

  62. -

    గృహమేను స్వర్గ సీమా!
    అహరహమీ దేశమునకు మావంశపు ని
    ర్వహణయె దోహద మాయె! దు
    రహమ్మిది జిలేబులది! అరాచకమిదియే!

    జిలేబి

    ReplyDelete
  63. -

    ఆవేశమ్మున పల్కగ
    కావేషమ్ములు వెలువడె కడకు జిలేబీ
    లావారిస్సయె పార్టీ
    నీవే దిక్కిక ప్రియాంక ! నీరజ నేత్రా !


    జిలేబి

    ReplyDelete
  64. -

    కంటే ఆశ్వాదింపగ
    నింటను గట్టి దినుసుల తనివితీర రుచుల్
    ఒంటికి బట్టను వండగ
    పంటి పదును జూచె ఘాటు సొంఠి మరువమా!


    జిలేబి


    ReplyDelete
  65. -

    సామీ ఆశ్రమమున మే
    రేమిటి చేస్తారు ? తిక్క రేగిస్తామోయ్
    పాముల్దోల్తారా ? సీ
    దా ముట్టికి ముట్టి తట్టి తరిమేస్తామోయ్ :)

    నేనన్లే :)
    జిలేబి

    ReplyDelete
  66. -

    దాటగలవా నరహరీ
    ఆటోలన్ బస్సుల వడి కార్ల జనాళిన్
    పోటీల్ పడెడా ట్రాఫిక్
    డ్యూటీ కాన్స్టేబుల బిగిలూదుల నడుమన్


    జిలేబి

    ReplyDelete
  67. --

    అభిలాషయు నాసక్తియు
    విభిన్న మైనట్టి కృషియె వీటికి మూల
    మ్ము! భవంతి కట్టుడిక మీ
    ప్రభావమున్ జూపు వేళ వచ్చె జిలేబీ


    జిలేబి



    ReplyDelete
  68. -

    శ్యామా! స్పందించాలం
    డీ మా పద్యరచనల గురించి ! జిలేబీ
    లా మీ రుబ్బుడు కీర్తన
    లూ మీ రాముల పొగడ్తలూ యిచటేలా ?


    నేనలే

    ReplyDelete
  69. -
    తమరేం తిన్నా లే బా
    ధ! మా తలల తినకు మా నితంబవతి! కరీ
    పముల వలె బేర్చు చున్ ప
    ద్యముల జి లేబీయమౌ పదమ్ముల తోడై!


    జిలేబి

    ReplyDelete
  70. రామ ! రామ ! నేనన్లే :)

    నా యవగాహన కోస
    మ్మీ యనవసర సలహా సమీక్షల వేలా !
    ఓయబ్బో! నీకే య
    న్నీయెరుక? పద పదవయ్య నీదారిని పో


    జిలేబి

    ReplyDelete
  71. విలువలు తెలియును ఛంద
    మ్ములకు తనకటంచు సదనమున వేగిరమై
    సలహాలకు శ్యాముడు బో
    వ లకలకలకా జిలేబి వడ్డన గిట్టెన్ :)


    జిలేబీయము :)

    ReplyDelete
  72. తోపెల్ల బాలుడె గురువు
    నా పద్యరచనలకని పునాది సహాయ
    మ్మా పండితులదని తెలిపి
    నా పన్నికల పయి కొండెమా ? పో పొమ్మా

    ReplyDelete
  73. వచ్చుట, గిచ్చుట, హెచ్చగు మాముచ్చట మా ఎచ్ఛుల బామ్మకు,
    ఇచ్చటి అచ్చూ, రొచ్చూ, కచ్చలు, మెచ్చని ముచ్చు బచ్చాల కిదె
    హెచ్చరిక, రచ్చ నచ్చని చిచ్చా గాండ్లిక పోవచ్చునెహె, పిచ్చాపాటి నాపి,
    బొచ్చూ,పెచ్చూడి, చచ్చక మునుపె, కొచ్చిన్ పోవ, కిచ్చా సుదీపు తోడన్ ...

    jf / jk :)
    (మనవడు బచ్చా :)

    ReplyDelete
  74. --

    మీరన్నది నిజమండీ!
    ఔరౌరా యెంత మాట యనె కుంచికయే!
    ఓరిమి తో నేర్ప వెడల
    కారాల్ మిరియాలు నూరె కసబుస యనుచు‌న్!


    నారదా వింటున్నావా ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మా బామ్మ పాళీకి రెండు/డూ/ నాళి/లి/కలే :)

      Delete
    2. దాంట్లో సందేహమేముంది బండి వారూ? ఎటు కావాలంటే అటు తిప్పగల సమర్థత “జిలేబి” గారి సొంతం కదా 🙂.

      Delete
    3. “జిలేబి” గారు,
      నారదుడేనా, “ఘృతా”చి ని కూడా ఆవాహన చెయ్యక పోయారా?

      Delete
  75. రామ రామ! ఇదేమి లొల్లి తల్లీ, బ్ర
    తిమిలాడి కైమోడ్చిననూ దయ గానవదే
    వమ్మ! అయ్యరో! అయ్యరైననూ చెప్పడా
    ఏమమ్మ! ఆపుము బ్లాగ్జనులకు కందము రుద్దన్
    (ఏమమ్మ! మాపుము బ్లాగ్జనులకు కందపు దురదన్)

    జెఫ్ / జేక్
    (మనవడు బచ్చా :)

    ReplyDelete
    Replies
    1. ఆపడమా? అరవల ఊతపదం ప్రకారం “ఛాన్సే లేదు”.

      Delete
  76. --

    కాబేజీ యో? లేక గు
    లాబీయొ! భలే జిలేబి ! లలలా లలలా!
    బాబోయ్ మనవళ్లందరి
    కీ బామ్మోయ్! మాయెయే ! షకీలా షాడో!

    ReplyDelete
  77. -

    ఆపడమా ! ఛాన్సే లే
    గా! పండితుల ముకుదాడు గట్టిగ లాగు‌న్
    రాపాడున్ పిడకలతో
    డా పజ్యాలాజ్యముల గుడా పాకంతో!


    జిలేబి

    ReplyDelete
  78. -
    సలహా యిదె! క్లీనింగ్యా
    డుల కీర్తనలుగ లిఖింపుడు జిలేబీ ల
    డ్డులుగా జనాళి తలచెద
    రిలలో విను కర్త కర్మ క్రియలవియె సుమీ


    జిలేబి

    ReplyDelete
  79. -

    ఓ కీర్తనపాడి జిలే
    బీ కూసింత మడిసి మురిపెము తీర్చగరా
    దే! కవి వరు తాడింపం
    గా కీర్తన నీదు బుర్ర కై రాన్ మునుపే :)


    జిలేబి

    ReplyDelete
  80. -

    పద్యాలు మీరు వ్రాయగ
    వేద్యంబుగ నతడు చెక్కు వేడ్కలమరగా
    చోద్యంబుగా జనాళి మ
    హోద్యమమును చూచి "యాడహో" యందురుగా


    జిలేబి

    ReplyDelete
  81. -

    నలభై పై యేండ్లైన న
    వలకు పరిచయమ్మొ? దాసు వడ్డెర చండీ
    విలువైన "అనుక్షణికము"
    కళాత్మకంబైన రచన కద! సో ఓకే !

    జిలేబి

    ReplyDelete
  82. -

    ఇల సెప్టికు టాంకులపై
    జిలేబి యే పద్యముల్ గజిబిజీ వ్రాయం
    గలరని లెస్స పలికితిరి
    భళి! మీసాటి గలరక్కొ వ్యాఖ్యాతలిలన్

    అబ్బో! కామెంట్ కింగ్ కదా :)



    జిలేబి

    ReplyDelete
  83. -

    నే కాన? మనసు లో లే
    నా ? కనులంత కనిపించకా నా మనసం
    తా కదిలించకె! నేని
    న్నేకో రాను నను చేర నీవే రావే !


    అబ్బో :)


    జిలేబి

    ReplyDelete