ఈరోజు Dr.యల్లాప్రగడ సుబ్బారావు గారి 126వ జయంతి (జనవరి 12). వారు వైద్యశాస్త్ర పట్టభద్రులు, వైద్యరంగంలో పరిశోధనలు చేసిన ప్రముఖ సైంటిస్ట్. 1922 లోనే అమెరికా వెళ్ళిపోయి Harvard University లాంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లోను, Lederle Labs లాంటి ప్రముఖ కంపెనీలోనూ పరిశోధనలు చేసి పేరుప్రఖ్యాతులు గడించిన, మనం గర్వించ వలసిన భారతీయుడు, ఆంధ్రుడు.
అమెరికాలోని Lederle Labs లో లైబ్రరీకి వారి పేరు పెట్టారు, ముంబయి సమీపంలోని బల్సర్ (Bulsar) లోని ఆ కంపెనీ ప్రాంగణంలో వారి శిలావిగ్రహం పెట్టారు (అని ... ఆ ప్రాంతాలను సందర్శించిన ఒక వ్యక్తి ద్వారా నేను విన్నాను) (ఇప్పుడు ఆ కంపెని కూడా లేదు, తరువాత తరువాత వేరే కంపెనీ Pfizer లో కలిసిపోయింది). భారత ప్రభుత్వం గాని, ఆంధ్రా ప్రభుత్వం గాని ప్రతేడూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు ... గతంలో ఎప్పుడో ఒకసారి కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక తపాల స్టాంప్ జారీ మినహాయించి.
పలు జబ్బులకు మందులు కనిపెట్టిన సుబ్బారావు గారు మానవాళికి మాత్రం ప్రాతఃస్మరణీయుడు ��.
===================== WhatsApp message :-
"TODAY IS 126 THE BIRTH ANNIVERSARY OF A GREAT TELUGU MAN BUT LESS SUNG AND LONG FORGOTTEN* PLEASE READ AND PASS ON TO THE NEXT GENERATIONS, FRIENDS! HIS discoveries deserved Noble prize but for the World War-2 !"
మరొక తెలుగుతేజం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో (Indian Air Force) ఉన్నతాధికారి (Air Vice Marshal) ఎయిర్ వైస్ మార్షల్ జొన్నలగడ్డ రాజేంద్ర కు “అతి విశిష్ట సేవా మెడల్” (AVSM) లభించింది. ఈ రిపబ్లిక్ దినోత్సవ పురస్కారాలలో భాగం 👏.
రాజేంద్ర విజయవాడకు చెందినవారు. మా కాలేజ్ పూర్వ విద్యార్థి కూడా (Andhra Loyola College) 😎.
నీరజనేత్ర! రాగమయి! నెవ్వపు రూపు కరోన కైవడిన్ ప్రేరణ కొంత తగ్గవలె క్రీడల వేళల ముద్దులాటలోన్ మారిన కాలమిద్ది! భళి మాస్కులు మోమును కప్పుచుండు ప్రా కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
పైన “జిలేబి” గారు పెట్టిన కామెంట్ April 23, 2021, వారు పెట్టిన లేటెస్ట్ పోస్ట్ April 12, 2021 ఉగాది నాడు. అంటే రెండు నెలలు కావస్తోంది. వారి భోగట్టా కనుక్కోవలసిందే. ఎలా అన్నదే పెద్ద ప్రశ్న.
(btw ఇదిగో ఇటువంటి అవసరాల కోసమే నేను నా స్నేహితులను, బంధువులను వారి రెండో ఫోన్ నెంబర్ / emergency number కోసం అడుగుతుంటాను. అవి సేకరించే పనిలో ఉన్నాను.)
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...
No earing.
ReplyDeleteనో ఇయర్ రింగ్స్ , కలవు పువ్వులే , ఇక విన
ReplyDeleteగ తెలుగు బహుపసందు , థాన్క్సండి తమకు ,
కంద మందుకోండిక , తాడిగడప గోరె ,
మాలికనుజూడ మనసాయె మహిత మతికి .
ఆహా, ఏం వాగ్ధాటి ! ఆ ఘాటయిన తమిళ-తెలుగు మిశ్రమం పెద్దగా అర్ధం కాలేదు కానీ మొత్తం మీద అదరగొట్టేసింది 👌.
ReplyDeleteఅయినా "అన్నగారు" NTR చెప్పినట్లు - "వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా, తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది" 🙂.
That is bileji
Deleteఈ కోవై అక్కయ్యను అర్జంటుగా మంచు లచ్చక్క చేత లైవు ఇంటర్వ్యూ చేయించి పుణ్యం కట్టుకోండయ్యా టీవీ బాబులూ.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఈరోజు Dr.యల్లాప్రగడ సుబ్బారావు గారి 126వ జయంతి (జనవరి 12). వారు వైద్యశాస్త్ర పట్టభద్రులు, వైద్యరంగంలో పరిశోధనలు చేసిన ప్రముఖ సైంటిస్ట్. 1922 లోనే అమెరికా వెళ్ళిపోయి Harvard University లాంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లోను, Lederle Labs లాంటి ప్రముఖ కంపెనీలోనూ పరిశోధనలు చేసి పేరుప్రఖ్యాతులు గడించిన, మనం గర్వించ వలసిన భారతీయుడు, ఆంధ్రుడు.
ReplyDeleteఅమెరికాలోని Lederle Labs లో లైబ్రరీకి వారి పేరు పెట్టారు, ముంబయి సమీపంలోని బల్సర్ (Bulsar) లోని ఆ కంపెనీ ప్రాంగణంలో వారి శిలావిగ్రహం పెట్టారు (అని ... ఆ ప్రాంతాలను సందర్శించిన ఒక వ్యక్తి ద్వారా నేను విన్నాను) (ఇప్పుడు ఆ కంపెని కూడా లేదు, తరువాత తరువాత వేరే కంపెనీ Pfizer లో కలిసిపోయింది). భారత ప్రభుత్వం గాని, ఆంధ్రా ప్రభుత్వం గాని ప్రతేడూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు ... గతంలో ఎప్పుడో ఒకసారి కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక తపాల స్టాంప్ జారీ మినహాయించి.
పలు జబ్బులకు మందులు కనిపెట్టిన సుబ్బారావు గారు మానవాళికి మాత్రం ప్రాతఃస్మరణీయుడు ��.
=====================
WhatsApp message :-
"TODAY IS 126 THE BIRTH ANNIVERSARY OF A GREAT TELUGU MAN BUT LESS SUNG AND LONG FORGOTTEN* PLEASE READ AND PASS ON TO THE NEXT GENERATIONS, FRIENDS! HIS discoveries deserved Noble prize but for the World War-2 !"
ప్రఖ్యాత సైంటిస్ట్ Dr.యల్లాప్రగడ సుబ్బారావు గారు
https://en.m.wikipedia.org/wiki/Yellapragada_Subbarow
=====================
మరొక తెలుగుతేజం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో (Indian Air Force) ఉన్నతాధికారి (Air Vice Marshal) ఎయిర్ వైస్ మార్షల్ జొన్నలగడ్డ రాజేంద్ర కు “అతి విశిష్ట సేవా మెడల్” (AVSM) లభించింది. ఈ రిపబ్లిక్ దినోత్సవ పురస్కారాలలో భాగం 👏.
ReplyDeleteరాజేంద్ర విజయవాడకు చెందినవారు. మా కాలేజ్ పూర్వ విద్యార్థి కూడా (Andhra Loyola College) 😎.
ReplyDeleteభవ్యము! కీడు తొలగు! మా
లవ్యా! వేసుకొను హితుడ! లాభమ్మే! రా
నవ్యత దీని సొబగనన్
కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్!
జిలేబి
ReplyDeleteభవ్యంబైనది మందు వేసుకొనుడీ ప్రాణాంతకంబైన రో
గవ్యాప్తిన్ సరి చేయవచ్చు పిలువన్ గంభీరతన్ మోడియే,
సవ్యంబైనది దేశమందెపుడురా జాగ్రత్తగన్ చేసిరో?
కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా!
జిలేబి
ReplyDeleteఓ తింగరిబుచ్చీ! నీ
పాతివ్రత్యముఁ జెఱచితివా! సావిత్రీ
మాత కథచదువ వే! తల
రాతను మార్చుకొనవే తిరముగ జిలేబీ!
జిలేబి
ReplyDeleteపాతాళమ్మె జిలేబి దాని గతి! యవ్వారమ్ము తీవ్రమ్మయెన్!
పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్టి! సావిత్రి యే
మో తన్వంగికి పేరు! జాణెతయె వామ్మో దాని తీరాయెగా!
యీ తంత్రమ్ముల పూవుబోడి కెడ నీకేలన్బొ సాంగత్యముల్!
జిలేబి
ReplyDeleteదాశరథియు మా సీతమ్మ తల్లి యకట
పంచవటిలో వసించిరి; పాండుసుతులు
కష్ట పడిరకట జిలేబి కాననమున !
తాత తలరాత యెవరికిన్ తప్పదాయె!
జిలేబి
ReplyDeleteఅరె! సీతారాములు దే
వర! లోకులు మెచ్చఁ బంచవటిలోన వసిం
చిరి, పాండునందనుల్ దా
చిరి తలలను కాననమున చింతయు తొలగన్
జిలేబి
ReplyDeleteఇంతి తన పెండ్లినాఁడు, బాలెంతరాలు
లేఖ యనబడు మిత్రురాలిని బిలుచుచు
మగనికి పరిచయముచేయ, మగువ వారి
ని తన గేహమునకు రమ్మనెను ముదమున!
జిలేబి
ReplyDeleteపద! లే యను భాషమ్మదె
యుదయమె కొక్కొరొకొ యని,మయూరము లేపున్
మది యుర్రూతల నాట్య
మ్మదె చేయుచు! ప్రకృతి యేను మన పెన్నిధియౌ!
జిలేబి
ReplyDeleteపురివిప్పుచు నాట్యంబు గ
నుర ఉదయమె నిద్ర లేపును మయూరము! కొ
క్కొరొకో యటంచుఁ దాన్ పు
చ్చి రయ్యన నటునిటు తిరుగు సేవా రీతిన్
జిలేబి
'కొక్కొరొకో' యనియరచిన
ReplyDeleteఠక్కున చికెనొండుకోద టక్కరిలోకం,
బక్కా! యిదేమి చోద్యం?
బక్కడ 'మనగురుడు' తిని, సమస్యగ నిచ్చెన్ .
ReplyDeleteప్రముఖము గా కాన్పడు చూ
డుము! కూడునుఁ బెట్టునా యిడున గూడును ప
ద్యములెన్నఁడేనియున్? కవు
లు మూఢులని తెలియవచ్చు క్లుప్తముగ సుమీ!
జిలేబి
ReplyDeleteలేని పోని సమస్యల లెస్స లెస్స
యని ప్రతిదినము చింతించి యందరికి ప
ని కలిపించి ఖుసిపడుట నిక్కమయ్య
కూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున!
నారదా!
జిలేబి
ReplyDeleteకూడుఁ బెట్టు, నా పద్యముల్, గూడు నిడున
యా తెలంగాణ రాష్ట్రమందయ్య ! ముఖ్య
మంత్రి ప్రోత్సహించె కవుల మంచి గాను
నిండు సభలోన మన్నిక నిడుచు నాడు!
తెలుగు మహాసభలలో కవుల సన్మానము
జిలేబి
ఇంకేం, బ్రహ్మాండం జిలేబీ గారూ. అభినందనలు!
Deleteకవులకు కూడెట్టిండ్రా !?
ReplyDeleteఅవునా ! సన్మానమిదియ ! అద్భతముగదే!
అవు నవు , తామూ గురుడూ
చవులూరగ తింటిరా ? విశారదలు గదే !
ఎటువోయిరి ఫ్రెండ్సంతా ,
ReplyDeleteకటకటవడి పూని నన్నుగాని విడిచిరా ,
ఇటులగుటకు కతమెయ్యది ,
నిటలాక్షుండెరుగుగాక ! నేనో, వారో?
Deleteఎటువోయిరో ? ఫేస్బుక్కులో యిరుక్కున్నారు :)
ReplyDeleteనాయకుల్ నీతి మాలిన నష్టమగు, న
మో! జిలేబి పల్కుల వినుమోయి! యేరి
పార వేయవలయునయ్య వారి నెల్ల
నీదు పాలన లోన కనీసమైన!
జిలేబి
ReplyDeleteబూందీ రౌండు భలె భలే!
బిందా సయ్యెను గొడుగులవి! జిలేబీయ
మ్మందాలొలికె చిలుకలున్
చందం బైనట్టి పెళ్ళి శర్కరి కంగ్రాట్స్!
జిలేబి
ReplyDeleteబండి - రథము - ఓడ - విమానము
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ఒక అదృష్టహీనుని దీనావస్థను వర్ణిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం చెప్పండి.
***
జంబం డిగనురికెను ! పీ
తాంబరధారీ! మనోరథము కూలబడెన్!
కెంబసువు రంగులోడగ
మంబరపునయనపు జీవి మానము గావన్!
జిలేబి
దొబ్బండి మనోరథముల ,
ReplyDeleteనిబ్బడి ముబ్బడి సమస్య లిడి , జిలేబీ !
సబ్బండ విబుధు లోడగ ,
మబ్బుగలిసి మందితెలివి , మానముజావన్ .
Deleteఅబ్బో! రోసము పొంగెను
రబ్బబ్బోరాజ! వ్రాయ వ్రాయగ నేదై
నబ్బబ్బో ఫిట్టింగులె
గాబ్బ! సినబ్బా తమ కవగతమె కదబ్బా!
నారదా వింటున్నారా :)
జిలేబి
కోపం బెందుకు విబుధా !
Deleteతోపే గురుదేవుడు , కడు దోచుకుతినగా
రాపాడి పద్యపూరణ
రూపమ్మున కవులయొద్ద రూకలు బహుదా .
ReplyDeleteభగవంతుడు వీడనుకొని
పగవానికి సేవఁ జేయవలె! మేల్గలుఁగున్
జగడమ్ములు తగ్గు జిలే
బి!గడబిడవలదు! సుగతుని విరివిగ నరయన్!
జిలేబి
ReplyDeleteజగడాలమ్మి! భయపడకు
పగవానికి! సేవఁ జేయవలె మేల్గలుఁగున్
జగనన్నకు ! పచ్చదన
మ్ముగదా మన సింబలు పద! ముందుకు పోవే!
జై జగన్ జై గ్రీన్ :)
జిలేబి
ReplyDeleteకరుణగలాడా! ఓ దా
శరథీ! నేనెరుగుదునయ సక్కగ దిక్కై
వరలెడు పరమాత్మవురా!
శరణు శరణు శంకలేని స్వామీ రారా!
ఎక్కడో చదివినట్టుందే :)
జిలేబి
ReplyDeleteజై శంకరాభరణం ! జై జై కందివర! జైజైజై ఈ సభాసదులకు సెల్ఫ్ డబ్బా :)
కూసింతైనను తెలియదు!
వ్రాసెను పద్యములను కవి వరుల వరుసలోన్
లేసాయిది? కంది చలువ!
వాసన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్!
జిలేబి
ReplyDeleteఅనుమానమేల నో చ
ప్పున వాసన లేని పువ్వు బుధవర్గము మె
ప్పును బొందె వింతగన్! వ్రా
సెను కైతల సుదతి కవుల చెంతయు చేరన్!
జిలేబి
ReplyDeleteఅరకొర వడ్డించిరి ముర
ముర అన్నము! సున్నమైన ముదమంది భుజిం
చిరి బంధులెల్లరున్ చన
వరి మోమును జూచి కష్టపడుచు జిలేబీ !
జిలేబి
ReplyDeleteమదిమది నవ్వవలదు ! నిజ
మిది! మల్లాది కథ వినుడి! మీగడ మారిం
దిదె! అన్నమయ్యె సున్నము
ముదమంది తినిరి జిలేబి ముద్దారంగన్ !
జిలేబి
ReplyDeleteపనిలేక కైపదమ్ముల
పనిగట్టుకు నిచ్చుచుంటివయ్య కవీశా?
విను మా ఆక్షేపణ! యే
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్?
జిలేబి పరార్ :(
జిలేబి
This comment has been removed by the author.
Delete
ReplyDeleteఅనఘా! మూర్ఖుడ! భక్తి యిద్ది యనుకొన్నావట్ర సన్నాసి? యే
శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్?
సినిమాల్ జూడగ బుర్ర పాడు వడెనోయ్ శీఘ్రమ్ముగా మార్పు కో
రిన మేలౌను విచిత్రమైన నడతల్ రివ్వంచు వీడున్ సుమా!
జిలేబి
ReplyDeleteగ్రామస్థులవాసమ్మో ?
భీముని పుత్రుండెవరు? గుభిల్లుమనంగా
సామాన్యులపై యసురుడు?
గ్రామమున; ఘటోత్కచుండు; గ్రౌర్యముఁ జూపెన్!
జిలేబి
ReplyDeleteఉదయపు సూర్యుని వేడియొ
సొద గ్రామమునన్! ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూ
పె దయావిహీనుఁడై ఆ
కదనంబందు దునిమాడె కౌరవుల వెసన్!
జిలేబి
ఏమి జెప్పేది అవస్థ.. సఱ్ఱున పాదరసం పాద రసం పీల్చగా.. ఏడింటికే ఏడి సెగలలిమే.. ఒంటి గంటకు ఒంటిలో నీరు ఆవిరౌ.. రాతిరి ఏడింటి వరకు ఏడి వడగాల్పుల రొత.. సమ్మర్ హీట్ కా ఝట్కా లగే జోర్ సే
Delete
ReplyDeleteవచ్చిరి డీజి పదమొకటి
యిచ్చిరి బ్రంచిన్నరంచు యిస్తరి పరచే
రచ్చట యొకపూట కడికి
బచ్చా జనరేషనుకు సెబాసు జిలేబీ :)
జిలేబి
బచ్చా జనరేషనంటు "పెదా పెదా" పదాలు వాడునదే బిజిలే అమ్మణ్.. యొక్క పూటైనను తినఁగనే ఆయేనా పంచభక్ష్యపరమాన్నాల విస్తిరి అహో.. బ్రంచిన్నరరిన!
Delete
ReplyDeleteవ్యర్థ జీవితమని సదా బాధపడెడు
ఈసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు?
యెప్పటికి కుదరనిమాట యిది జిలేబి!
ప్రాణశక్తి వాడిచ్చిన పట్టుగొమ్మ!
జిలేబి
ReplyDeleteఒకానొకప్పుడు మాలికలో శంకరాభరణపు కవుల పై చురకలు జల్లిన ప్రబుద్ధుల కాలం!
అనుదినము వ్రాసితిమిగా!
మన పద్యమ్ములఁ బఠించి మాన్యతఁ గనరే
ల? నినాదమ్ముల తోడై
పని లేని కవులని ద్రోసి ఫక్కున నగిరే!
జిలేబి
ReplyDeleteమన పద్యమ్ముల నెల్లరుం జదివి యాత్మజ్ఞానులై వెల్గరే
ల? నినాదమ్ముల తోడు తిట్టెదరుగా లావణ్యమొప్పారలే
దని! బ్లాగ్లోకము కూసె గా పనియు లేదంచున్ బుధానుల్ శ్రమ
మ్మున నిట్టూర్చిరిగా యొకప్పుడు! జనుల్ మూర్ఖుల్వెడంగుల్ కదా!
ReplyDeleteరామ కీర్తనలను వ్రాసి వ్రాసి నీదు
జీవితమ్మును గడిపి రంజిలగ బుట్టి
నావు తమ్ముడ నీకిదె నాదగు శుభ
కామనలయ శోభిల్లు రాగభరితముగ!
చైంచిక్
జిలేబి
“తమ్ముడు” కాదు అన్నగారు.
Delete
Deleteరామ కీర్తనలను వ్రాసి వ్రాసి నీదు
జీవితమ్మును గడిపి రంజిలగ బుట్టి
నావు రోయన్న నీకిదె నాదగు శుభ
కామనలయ శోభిల్లు రాగభరితముగ!
జిలేబి
ReplyDeleteకాలమ్ము మార లేదం
డీ!లెస్స! మనుజుల బుద్ధి డిగనురికె సుమం
డీ! లక్ష్యమ్మును వీడిరి
వాలక మేను పెడతోవ పట్టెను డీజీ!
ఓ యబ్బో!
యేమి విశ్లేషణ :)
చైంచిక్
జిలేబి
ReplyDeleteమోహను బాబుండగ మా
సాహసమున కడ్డెవరు కసబిస కసబిసా!
సాహిబ జిలేబి యిదిగో
మా హుంకారపు సవాలు మదరాసొస్తా!
ఓయబ్బో!
సవాలే సవాల్!
జిలేబి
ReplyDeleteఅయినా ముగింపు కనరా
దయ శ్రీధరణీ యనిత! ముదావహమిది కా
దయ! జనుల పై కరోనా
నియంత గా మారి దీర్ఘనిద్రను ద్రోసెన్
జిలేబి
ReplyDeleteఅమ్మణ్ణి ! నాదు ప్రాణ
మ్మమ్మ తొలుత! దాని పిదప మాకేదైనన్
బొమ్మాళి ముఖ్యమగు! న
మ్మమ్మా నిత్యావసరము మాకు జిలేబీ !
జిలేబి
ReplyDeleteఅద్భుత మైనట్టి కళ! మ
హాద్భుత మీ చిత్రము ! భళి యబ్బదు సౌల
భ్యాద్భూతమై జిలేబీ
సద్భావన పెంపు కొరకు చక్కగ నమరెన్!
జిలేబి
ReplyDeleteరాతియుగపు మనుషుల్లా
రా! తింగరి బుచ్చి జనులురా మీ రంతా
ఖాతా తెరిచానోయ్ మీ
జాతకముల చూసినాడ సన్నాసులురా!
జిలేబి
ReplyDeleteనిజమా అనునట్లగుపిం
చె!జాగురూకతవలయు వచించె జిలేబీ
ప్రజలకు సందేశముగా!
సుజనుల్ కాపాడదగు వసుధనిక ప్రకృతిన్
జిలేబి
ReplyDeleteఅబ్బే! అదెట్లు కుదురున్?
జబ్బల్బట్టి తమరనగ జార్వాలునకో
తబ్బిబ్బైపోరండీ
డబ్బున మాబండి వారు డాబుసరి భళీ :)
నారదా
జిలేబి
సాకుదురే యరే పిల్లలన్ పిడుగుల మాదిరి
ReplyDeleteయరెరె యిపుడా పిల్లలే గదా పిడి గుద్దులతో
కన్న వారినే యనాదగా నెంచేదరు లోకఁబున
నెత్తి నోరు బాదుకుని బాధ పడనేల అయోమయాన
~శ్రీత ధరణి
Deleteసాకుదురరరే పిల్లల
మేకుల మాదిరి యిపుడు సుమీ వారెంచ
క్కా కన్నవార్ని తరిమిరి
సాకుల తో శ్రీధరా విసవిసా కదరా!
జిలేబి
ReplyDeleteసుముహూర్తమ్ము! కిరీటి! ని
జము! నన్ గనినంత విజయ! శాంతి లభించెన్
ప్రముఖము గానెల్లరకున్
విముఖత వలదు రణమునకు విజయము నీదే!
జిలేబి
ReplyDeleteవిముఖత యేల యుద్ధమన? వీరుడ! అర్జున! నిత్యమైన తే
జము! ననుఁ జూడఁగా విజయ! శాంతి లభించె జయప్రదమ్ముగన్
సుముఖము గా జనాళికి! వసుంధర వాసనకెక్కె మేల్మిగా
కమలిన పుష్పమై నిలువ కయ్య కిరీటి ధనుస్సు నెక్కిడన్!
జిలేబి
ReplyDeleteవినరా విన్నపాలనోయన్నన్నా !
ఏమి కభాష యిదయ్యా
స్వామి! తలతిరిగెను మాకు ! ఫారెన్ లాంగ్వే
జీ మీదుమించి శ్రీధర!
ఓ మాటా అర్థమవదురో యన్నన్నా !
జిలేబి
ReplyDeleteతెలిసిన ప్రేమాయణమం
దలసి సొలసినట్టి నా హృదయమున ప్రభవిం
చి లయమగు పేరడీల్ విదు
ర లబ్జు! రామాయణము పరాన్నమగునయా
జిలేబి
ReplyDeleteసాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ!
హు! హు! హు! నువ్వు మగాడివే? హుంక రించె
పట్నపు జిలేబి! బెదిరెను పాప మా పె
నిమిటి! గడగడ వణికెను నీరసపడి!
జిలేబి
ReplyDeleteనాకము భూమి చేరెను త్సునామిని చేర్చెను ప్రత్యహమ్ము! హా!
శోకము తీరునెప్పుడకొ! సూనృతమెప్పుడు దక్కు జీవికిన్!
చాకలి జీవితమ్ము ! మరి చాలని జీతము! కస్తి గంపెడౌ!
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ!
జిలేబి
ReplyDeleteపడిలేచెడు సంద్రపుటడ
లడి! సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జె
ప్పెడి వాఁడె భర్త యౌరా?
సుడిగుండములోన బతుకు సున్నమయెనురా!
జిలేబి
ReplyDeleteసిటీ లైట్స్ అండ్ లైఫ్!
బడుగు జీవి పయనమయ్యె బడిత పూజ
లయ్యె దేవుని దీవెనలౌర ! నరుడు
యొంటి కంబపు మేడలో యొప్పలేక
సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ!
జిలేబి
ReplyDeleteఅనుమాన పిశాచి ! జిలే
బి!నుడివెదవిను! గను శ్యామ విదురుని ! ప్రేరే
పణ గనవే గుబ్బెత! మే
లు నీకు గల్గు రమణీ చలో! చల్ ! పదవే!
నారదా
జిలేబి
ReplyDeleteకోతి యొకటి వచ్చె పిదప
వాత యొకటి పెట్టె నోయి పండితులకు ! తే
గా తేనీటిన్ తాగిరి
రాతిరి పగలు పనిచేసి రావడిచేయన్ :)
జిలేబి
కోతొక్కటెగాదు , హితా !
Deleteజాతీ జాతంత వచ్చె , జాతరచేసెన్ ,
ఏతావాతా మనమూ ,
భాతిగ నందుందుమేమొ , పండితులమెగా .
ReplyDeleteమీరు చెబుతున్నది మరే
మో రూఢిగ టీవి లో ప్రముఖముగ వచ్చే
నోరున్నవారు తన్నుకు
నే రొంపటపు తల తిక్క యెపిసోడ్లాండీ ?
జిలేబి
ReplyDeleteరాజన్న వారు తవరే
మో జంతికలిచ్చిరచట ముచ్చట గా మే
మో జట్టు చేరుచు జిలే
బీ! జల్సాగ హరి రాన్ కవించామంతే :)
జిలేబి
ఎవరెవ రేమే మిచ్చిరొ
Deleteవివరించుడు కాస్త యనఘ ! విపులముగ , ప్లవం
గ విబుధులు , తినుట కన్నను
వివిధ గతుల ద్రొక్కి , విసిరి వేతురు గదవే !
ReplyDeleteతమరి కెరుక కానిది లో
కములో కలదా విదుర! ప్రకాశముగా చె
ప్పుమయా ! జిలేబి హింటి
చ్చు మాత్రమే రాజ మీకు శుభములు బడయన్ :)
జిలేబి
పండితకోతుల గోలది ,
ReplyDeleteజండూబామ్ దెచ్చుకొనక , జర మరచితిమా ,
గుండు కుదేలగు విహితా !
భండన భీముండు గూడ బల్కడు గావన్ .
ReplyDeleteపండితులు మీరు మరియున్
బండివరులు! చదు వరులము వస్తూపోతూ
చెండులతో కొంత తడిమి
మెండుగ కామింట్లిడి మరి మెచ్చెద మంతే!
జిలేబి
పండితుల సభలలోపల
Deleteమండిత ధిషణావినీలమణిగదవే ! ఉ
ద్దండమహాపండితబే
రుండా ! శాఖావిలోల లోలజిలేబీ !
ReplyDeleteకొమరాల! తిట్టు వారికి
డుము దీవెనలను పరేశుడు నిను కరుణతో
డు మునుకడగాచు! నిజమై
న మాన వత్వమును చూపు నలుగురు మెచ్చన్
జిలేబి
ReplyDeleteఅశుభము పలుకకు! నడత ప
రశ! తిట్టెడివారి కెల్లరకు దీవెనలి
మ్ము శుభమ్ముఁ గోరుచున్ వ
చ్చు శోభలు నిను వెతుకుకొనుచు జిలేబి వినన్!
జిలేబి
ReplyDeleteసాయి పల్లవి డాన్సా! తసాదియా!భ
ళారె వేడి పెనముపైన లావు గాను
చిందు లేయు సాసువుల విచిత్రమైన
నాట్యభంగిమలు కదా తనవి జిలేబి :)
జిలేబి
ReplyDeleteవద్దండి రాజ పెద్దల
దుద్దుర్లు మనకిక వారి తూటా తంటాల్
యెద్దేవాల్ నసుగుళ్లగు
సుద్దులు! మనబండి వారి సూత్రమ్ము భళీ :)
జిలేబి
ReplyDeleteచాలని పతియో యెలమిని
తేలును! ముద్దాడెడి పడతిన్ మెచ్చఁ దగున్
మేలని మరింత గా క
ల్లోలము లో తనను కౌగిలుకొన జిలేబీ !
రామరామ!
జిలేబి
ReplyDeleteఅదటున మెలపున పతి ని
బ్బది తేలును! ముద్దులాడు బడతిం గని మె
చ్చఁ దగున్ ముదమ్మునన్ పై
యెద విడిచి విడువక తనను యెలమిని తేల్చన్
జిలేబి
ReplyDeleteచాలని చాలదంచు భళి చాలమి తో పతి రాధనమ్ములో
తేలును! ముద్దులాడు బడతిం గని మెచ్చఁ దగున్ ముదమ్మునన్
చాలదు చాలదంచు పరి చారికయై పతి సంగమమ్ములో
తేలగ మేలటంచు సరి దీనికి సాటి విమోహమెచ్చటే!
నారద సంసారం :)
నారద! Some సారః :)
జిలేబి
ReplyDeleteపరువపు మధురోహలలో
న రమణి తేలుచు బిడియమున వలదనంగన్
మరులుగొలుపుచు జిలేబికి
పురుషవరుఁడు సీరఁ గట్టి పూవుల ముడిచెన్
వామ్మో !
నిన్నటి నుంచి "తేలు" విడవటంలే :)
జిలేబి
ReplyDeleteమరులున్ గొల్పుచు రావె యంచు బిలువన్ మత్తేభమైరాగనే
పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్
మరియా డేవిడు సంతసించె! పతితో మాట్లాడె "యేమండి నా
కు రువాణంపు వడమ్ము కావలెను ప్లీజ్! కొంటారుగా?" మోజుగా!
జిలేబి
ReplyDeleteచెలువము మీరగ సేలలు
వలయు ననుచు ముద్దు సేసి పతిని విడువకన్
పలువిధముల పిండుదుమయ!
అలిగిన సతులుడుగరు దగు వ్యాపారములన్!
జిలేబి
ReplyDeleteచెలువమ్ముల్, మురిపెమ్ము, పేర్మి పలుకుల్, చేయూత, మిత్రత్వమున్,
పలురాత్రుల్ పరిచారికా కొలువులాప్యానమ్ము, ముందావణీ
పొలయింపుల్, పతిసేవయే ఫలముగా, పువ్వాడి కొండొక్కచో
యలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారలై మించరే!
జిలేబి
ReplyDeleteవింతైన దేశమిది రెం
డింతలు గనులున్నను దెరువే కననైతిన్
పంతము బట్టెను కేంద్రము
కొంత వెసులుబాటులేదు కుర్సీకి కదా !
జగన్నాధుని
మనోరథ
చక్రాలు :)
జిలేబి
ReplyDeleteపనిముందుకు నడవదు మే
దిని యింతలు గన్నులున్నఁ దెరువే కననై
తి నిదేమి చోద్యమో ద్ర
వ్యనిధి కుదియుచుండె జీతభత్యములెట్లా !
జిలేబి
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !
ReplyDelete
ReplyDeleteజవనాడులుడుగుచుండెను
భవితవ్యంబేమిటో యెవరికి తెలియదే!
అవసర మీ సమయమ్మున !
ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్?
తెప్పై మమ్ము కడతేర్చవే
ప్లవనామ వత్సరమా
కరోనా కోరల నుండి!
జిలేబి
ReplyDeleteజవసత్వమ్ములు కృంగె నయ్యొ బతుకుల్ జంజాటమయ్యెన్! కరో
న విరామమ్మిక లేక యుమ్మలముతో నట్టేటముంచెన్! వెసన్
ప్లవ నామాబ్దమ రమ్ము! మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్
లవలే శమ్ము? జనాళి బాగుపడునా? లాభమ్ము పెంపొందునా ?
జిలేబి
ప్లవనామ తెలుగుగాదికి
ReplyDeleteకవయిత్రి జిలేబిగార్కి కంగ్రాట్స్ , మరియున్
నవనూత్నశుభాకాంక్షలు
జవసత్వమ్ములుకలిగి సజావుగ దిరుగన్ .
Deleteఅద్భుతంగా ఉంది రాజన్న గారు.... ఉగాది శుభాకాంక్షలు
జిలేబి
ReplyDeleteగుమ్మము - గోడ - తలుపు - అరుగు
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం చెప్పండి.
అరుగు దెంచి కీచకుడు కలాపములకు
గోడ దాటి బిలిచెనదె గోల ! రావె
ముద్దుగుమ్మ! ముద్దాడగ ముందు పడు! త
లుపుల మాటుదాగకిక చెలువుమిగులదె!
జిలేబి
ReplyDeleteఏమి తిని వాగి నావుర యెంక టేశ
అమృతమున్ మ్రింగి శివుఁడిచ్చె హాలహలము?
బడిత పూజయె సరినీకు! పగుడమంత
కూడ బుద్ధిలేదే! పలుకు ముసి ముసియె!
జిలేబి
ReplyDeleteఅవలీలగ కథ లేనే
యవ! అమృతము మ్రింగి హాలహల మందఱకున్
శివుఁడిచ్చెఁ జెచ్చెఱన్? తే
ల్చవే జిలేబి యెటులన్? భళా నీ నసుకుల్!
జిలేబి
ReplyDeleteమీ వంటి పుణ్య పురుషుల
చేవ వలన నాదు పేరు చెడెనజ్ఞాతా!
కోవా జిలేబి జాంగ్రీ
లా వరలెడు నేను కంటులా మారితిగా! :)
జిలేబి
ReplyDeleteకాళిక అదిగో నవ్వే
రా! లక లకలక! కరోన రఫ్ఫాడింపన్
బేలలు గా మారంగ జ
నాళియు విరగబడి నవ్వె నర్రా నవ్వెన్!
జిలేబి
ఏ మహాత్ముడు జనియించి భరతభూమి
ReplyDeleteపావనమయ్యె సౌభాగ్య యగుచు ,
ఏ మహాత్మునిపాద మీమహీతలమున
తాకగా పుణ్యాల తతులు విరిసె ,
ఏ మహాత్ముని నామ మిరవొంద ' రామా ' య
నుచు నిట మార్మ్రోగి నుతులు గొనియె ,
ఏ మహాత్ముని చేత ఏలబడి సుభిక్ష
మై యిచ్చటి జనులు హాయి వడిరి ,
ఆ మహాత్ము డారాధ్యుడు , రామచంద్రు
డందరకు పూజనీయుండు, డెందమందు
ఎల్లవేళల కొలువుండు నీశ్వరుండు ,
ఆ పరాత్పరు కీర్తింతు ననవరతము 🙏 .
ReplyDeleteఅముదై ప్రభువునకు జనన
ము మరణముల్ సూక్ష్మమైన మూలమ్ము సుమీ
శమనము బంధు మరణ వా
ర్త మనకుఁ, బండుగె కద సఖి ప్రభవమ్మెపుడున్!
జిలేబి
ReplyDeleteఅనఘా ప్రభవమ్మున గున
గున పండుగఁ జేయఁగాఁ దగును! బంధువు స
చ్చిన వార్త వచ్చినన్ సఖి
మనోవ్యధయు తధ్యము! నిజమైనది హముయే!
జిలేబి
ReplyDeleteరామ భక్తుడు గారండి రక్తి కట్టె
నయ్య చక్కటి సేకరణ బహు ముచ్చ
ట గొలిపె మదిని వ్యాఖ్య! వాట్సాప్మెసేజి
భేషు!మనసార నెనరులు విదుర మీకు !
చైంచిక్ :)
జిలేబి
ReplyDeleteధోరణి మార్చవె గయ్యా
ళీ! రయ్యన దుముకకె సతి లీలావతి! సం
ప్రేరణను జేర్చెడా మమ
కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా!
జిలేబి
ReplyDeleteనీరజనేత్ర! రాగమయి! నెవ్వపు రూపు కరోన కైవడిన్
ప్రేరణ కొంత తగ్గవలె క్రీడల వేళల ముద్దులాటలోన్
మారిన కాలమిద్ది! భళి మాస్కులు మోమును కప్పుచుండు ప్రా
కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
జిలేబి
ReplyDeleteకుశలమా మీకు కుశలమేనా? ఇన్నినాళ్ళు కనపడకుంటే ఏదో ఏదో అడిగాను అంతే!అంతే! కుశలమా మీకు కుశలమేనా?
ఎన్నమ్మా సౌక్యమా?
ఎవరికెవరు ఈ లోకం లో ఎవరికి ఎవరు?
మాట కోసం ఎదురు చూస్తున్నా ఆతృతగా
పైన “జిలేబి” గారు పెట్టిన కామెంట్ April 23, 2021, వారు పెట్టిన లేటెస్ట్ పోస్ట్ April 12, 2021 ఉగాది నాడు. అంటే రెండు నెలలు కావస్తోంది.
ReplyDeleteవారి భోగట్టా కనుక్కోవలసిందే. ఎలా అన్నదే పెద్ద ప్రశ్న.
(btw ఇదిగో ఇటువంటి అవసరాల కోసమే నేను నా స్నేహితులను, బంధువులను వారి రెండో ఫోన్ నెంబర్ / emergency number కోసం అడుగుతుంటాను. అవి సేకరించే పనిలో ఉన్నాను.)
క్షేమ లేఖ రాశా మీ కంది ఉంటదీ
ReplyDeleteఉన్నావా? అసలున్నావా?
ReplyDelete