శ్యామలీయ కందాలు - 51
భువనైక మోహనుని ది
వ్యవిలాసపుమూర్తిని తనివారగ దర్శిం
ప వలనకొ కన్నులున్ వే
లువేలు కలిగిన? తపమ్ములొనరింప దగున్
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
శ్యామలీయ కందాలు - 51
భువనైక మోహనుని ది
వ్యవిలాసపుమూర్తిని తనివారగ దర్శిం
ప వలనకొ కన్నులున్ వే
లువేలు కలిగిన? తపమ్ములొనరింప దగున్
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 51
భువనైక మోహనుని ది
వ్యవిలాసపుమూర్తిని తనివారగ దర్శిం
ప వలనకొ కన్నులున్ వే
లువేలు కలిగిన? తపమ్ములొనరింప దగున్
జిలేబి
-
ReplyDeleteప్రాస యతుల సరి జూచుచు
పూసల మాలవలె గుచ్చి పువ్వారుపదాల్
వేసిన మాటను వేయక
చేసిన యతనము ఫలింప చేవడి పద్యాల్
జిలేబి
-
ReplyDeleteವಾರೆವ್ವಾ ಕರ್ನಾಟಕ !
అదె కర్నాటక ! కాంగ్రె
స్సదే! శివకుమార? ? సిద్ధ రాముడ ! "నఫ్రత్
కి దుకానుబందు ముహబత్
కి దుకానిది" రాహులు పలికెను ఢిల్లీలో !
ಜಿಲೇಬಿ
-
ReplyDeleteచెలి ! ఏకనిష్ఠ వలయున్
భళి యాధ్యాత్మికముగా సఫలమొందంగా
తెలియని ఫకీరు లెల్లరు
కలియుగ దైవమనుకొనకు కంద జిలేబీ !
జిలేబుల్స్
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 52
నోరున్నదనుచు పలుకన్
కూరిమి, వారింక కారుకూతల తో ఛీ
త్కారము!పరిభవ మేలా?
శ్రీరాముని పలుకరించు శ్రీకరమౌరా!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 53
నీదయ చాలు భవమనెడు
వేదన దాటెదను రామ ! వేల్పువు నీవే
నీదు పదపంకజములె క
దా దురితదమనమయా! సతతము కొలిచెదన్
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 54
జయముల గూర్చును కోరగ
భయమును పోగొట్టు వేడ భద్రంబతడే
బయిసిన కోరగ ధనకన
క యిహపరభగముల నిచ్చు కపిరథుడతడే
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 55
ధారుణి నెల్లరు తెలివిడి
చేరంగ కొలువను మేలు సీతాపతినే
శ్రీరఘు రామా! పాహి! స
దా రహి కురిపించుమయ్య దాశరథి! ప్రభో!
జిలేబి
-
ReplyDeleteక్రీడాసక్తుని మార్చె ప్ర
గాఢపు తెలివిడి గలిగిన కవివర్యునిగా
వేడంగ జగన్మాతన్
పాడి యగును, మాత సుతునిఁ బరిణయమాడన్!
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 56
నామము చేయని బ్రతుకే
లా! మన దాశరథి పదములన్ పడని కర
మ్మేమిటికి? స్వామి సేవల
కై ముందుపడని తనువు సఖా మన కేలా !
జిలేబి
-
ReplyDeleteఛందస్సు గణాలకోసం మనమెల్లాఅయినా సాగదీసో లేక తోక కత్తిరించో రాసిపడేసుకోవచ్చు. అడిగేవాడెవడోయ్ హద్దరి బన్నా వాడికి ఒక మొటిక్కాయి వేసి కూకోబెట్టు :)
మారీచుని మారిచియని
కోరిన నెరి మనము మార్చు కొనవచ్చండీ !
వేరర్థంబది తెలుపం
గా రాదంతె! పడితరము కవివరులదెగా!
జిలేబి
-
ReplyDeleteకలలు కనే హృదయమిదే
నలవోకగ కోరె నిన్నె నా ప్రేయసి రా
వె లలన! భామిని ! ఆమని!
చెలిమికి చెకుముకి జిలేబి చెంతకు రావే
జిలేబుల్స్
ఆహా... బతికొచ్చారా. అపుడెపుడో శర్మ గారూ, బండి గారూ, విన్నకోట వారి చర్చల్లో తెలిసింది మీరు మాయమయ్యారని. తర్వాత నేను మాలిక చూడడం ఇవాళే. మీ ఉనికి రహస్యంగానే ఉణ్ణీయండి, కానీ ఇలాంటప్పుడైనా మీ క్షేమం తెలుసుకోవాలనుకునే మాలాంటి వాళ్ళ కోసం, ఏ శర్మ గారి లాంటి వారి వద్దనో మీ గురించి మౌలిక సమాచారం ఉంచితే బాగుంటుంది. ఆలోచించండి.
ReplyDelete-
Deleteఆహా ! బతికొచ్చారా !
ఓహొ! నరసరాయలు, అయయో అనగా ఆ
పై హా! ప్చ్! యన శర్మా
జీ, హా! పోయిరని బండిజీ తలచిరిగా
జిలేబుల్స్ :)
నిజంగా బతికి వచ్చిందా,హాలీవుడ్ జాంబీ సినిమాలల్లో లాగ ఆశలు చావని దెయ్యమై "నిను వీడని నీడను నేనే" టైపులో వచ్చిందా అని నాకో దౌటు,ఎవరు రూఢి పర్చాలి?
Delete-
ReplyDeleteరాయల వారివలె జిలే
బీ యవనాశ్వపు సవారి వీరాంగణయో!
ఈ యమ దొరికిన చోట
ల్లా యమ్మో ల్యాండు డీలులా కబ్జాయో!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 57
తనువున స్వస్థత లేకయు
మనసున సుంత ధృతి లేని మనుగడ యేలన్?
మనసున రాముని తలవని
మనుగడ యేల ?ససి నిమ్మ మది నినుతలవన్
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 58
నిన్ను పొడగాంచ కలిగెన్
కన్నులు రెండు మహనీయ కపిరథ! రామా!
నిన్ను మరిచి పామరులన్
మిన్నగ చూచెదనకో ? ప్రమేయము నీవే!
జిలేబి
-
ReplyDeleteసరదా టపాయె రాయొ
చ్చు! రాయరూ తాతగారు చువ్వన ప్లీజ్ ప్లీజ్
నరసింహారావయ్యా
మరి వత్తాసుపలుకండి మంచి టపా రాన్
జిలేబి
-
ReplyDeleteరామార్పణమభినందన
లీ మానస పూజకున్ భళీ శ్యామా !మీ
రాముని కీర్తన లెన్నియొ
ప్రేముడి మీరంగ నిలిచె వేదంబగుచున్
జిలేబుల్స్
-
ReplyDeleteశ్యామలీయ కందాతిశయము - 59
నేనడిగిన దెల్లా రా
మా నీ పద సన్నిధి! మణిమాణిక్యములే
మైనా కోరితి? ? అడిగితి
నా నే శక్తుల ? పదవుల నా కోరితి నే ?
కందానికి కందమ్మా :)
టూ మచ్ జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాతిశయము - 60
నిన్నే రామా నమ్మితి
మన్నింపుము నేయితరుల మదిలో నెంచన్
తన్నిన నీవే యక్కున
మిన్నగ చేర్చుకొనినన్ సుమీ నీవే రా!
కందానికి కందమ్మా !
టూ మచ్ జిలేబి :)
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 61
ముక్తివదాన్యత యుక్తియు
శక్తియు నొసగెడు ప్రసన్ను సత్యుడతనిదే
రక్తిని గొలిపెడు నామము
భక్తులు కీర్తించు పరమ పావన మౌరా!
జిలేబి
-
ReplyDelete17-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
'కిక్, కుక్, చిక్, చెక్' పదాలను ప్రయోగిస్తూ
తెలుగు భాషా వైభవాన్ని గురించి
స్వేచ్ఛఛందంలో పద్యం వ్రాయండి.
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన దత్తపది)
చిత్తూరు లో శతావధానము జరిగినదా ! తెలియక పోయెనే :)
తిరుపతి వేరే కుంపటి అయిపోనాది :)
కుక్కిన పేను నిదుర విడి
గ్రక్కున చిక్కగు సమస్య కనులన్ బడగా
కిక్కిచ్చెడు విధి పద్యపు
చిక్కదనము చెక్కు పొంగు సిరి తెలుగుదగున్
This comment has been removed by the author.
Deleteకుక్ చేసిన చిక్కెను ముక్కల నెం
Deleteచక్కగ బొక్కుచు, పక్కన కిక్కిచ్చు మందు చుక్క
లొక్కటిగ గొంతెక్క, మత్తెక్కి ఛుక్ఛుక్
చక్చక్కను తైతక్కలకు ఠక్కని చెక్ పెట్టేదెవరో! ...
(ఇది పద్యమా? ... తెలీదు గానీ ...
బామ్మకంకితం ... :)
ఏదన్నా చెప్పు అబ్బో యేమి యెండలండి బాబోయ్ అంటూ భాస్కరుడే సూర్యుని పై కంప్లైంటు :)
ReplyDeleteరాయాలండి మిగిలినది
ఈయెండయు వేడియున్ భరించుట సాధ్యం
బా యెవరికైన ? చెప్పం
డీ! యిబ్బంది మరి ! వైపరీత్యమె నండీ
నైస్ :)
జిలేబి
-
ReplyDeleteవీరు ప్రొఫెసరుగ! చెబుతుం
టారండీ కొత్తకొత్త యర్థమ్ములతో
ప్రేరేరపణలు గురువుల
వారి దయయటంచు మీదు వాదించడమున్
జిలేబుల్స్
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 62
శరణాగతరక్షకుడని
సురవైరుల కూల్చి గాచె సుచిరాయువులన్
నరజాతికి నీతిపథము
సరసముగా నేర్పినట్టి శ్యామలుడతడే
జిలేబి
-
ReplyDeleteశివకుమారుడున్ సిధ్ధుడు చెండు మల్లె
లాట లాడుకొనుచు గుద్దు లాడు దినము
ల కతి శీఘ్రము తెరతీత లక్షణములు
తెలియ వచ్చుచున్నవి శుభతారకముగ
జిలేబి
-
ReplyDeleteసరిసరి జిలేబులకిదే
తెరతొలగెన్ సిద్ధుడే ప్రతీకగ నిలచున్
వరమాల జనాళి యలం
కరించి జేజేలు పల్క కర్నాటకమే
కర్నాటకలో రెండు కర్కాటకాలు....
Deleteబ్లాగుల్లో రెండు శ్యామలీయాలు ఉన్నాయి కద!
Delete-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 63
విందుకు రమ్మని బిలచిన
యెందుకు మొగమాటమన్న యెన్నగ నీవే
డెందంబున నిండిన మా
కందంబగు దాశరథివి కరుణామూర్తీ !
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 64
పలువిధముల సామాన్యులు
బలియయ్యిరి కలియుగమున బకవేషుల్ ధూ
ర్తులు ఘనులయ్యిరయొ ప్రబు
ద్ధులు పితరుల కొట్టిరయ్యొ దుండగులు ప్రభో!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 65
హరినామమొకటె చాలున్
మరి యితరము లందితమ్ము మనకేలయ్యా
సిరులేల మనకు ధనమై
హరినామ భజనయె గలదిహపరమ్ములకై
జిలేబి
-
ReplyDeleteఉపదేశమివ్వడానికి
తపించు వ్యాఖ్యాత నచట తమరెవ రండీ
కుపితులవడానికని ద
బ్బుపన్నొకడు దూసె వ్యాఖ్య బుల్ బుల్ తారా :)
-
ReplyDeleteముద్దాయె నోట్లు రెండ్వే
లద్దానికి నామమంట! లబలబ యంచున్
పెద్ద తలలింక బ్యాంకుల
వద్ద వరుస నిలబడుదురొ వడదెబ్బలతో :)
ఓ నా బ్యాంకు నిఫ్టీ నువ్వేమంటావే సోమవారము :)
బ్యాంకు నిఫ్టీ 43950+ చిలుకు :)
జిలేబి
-
ReplyDeleteఎందుక లా ఓహ్ నవ్వొ
స్తుందండీ? ఎందుకంటె సుతిమెత్తగ చూ
స్తోందండి మన ప్రభుత్వము
సందేహము కాంగిరేసు జయముపయిననో ?
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 66
పన్నుగ సుమనోజ్ఞంబై
యెన్నెన్నో రంగుల పువులే మాలలుగా
కన్నుల పండువ తోడై
అన్నియు మన బాలునిమెడ యందమొనర్చెన్
జిలేబి
-
ReplyDeleteవెన్నుని నామపు కవివర
మిన్నగ అనుమను చెరిపిరి మీకివె దండాల్
మన్నించటాని కేమియు
చెన్నుగ లేదు పద స్వామి చెంగు పరుగులన్
జిలేబి
శ్యామలీయ కందాలు - 67
ReplyDeleteఇదియేమి జీవితమురా
యిది యెన్నాళ్లిట్లు సాగ తీతయగునురా
ఇదియే జన్మపు పాపమొ
యిది తీరున రామ ! బతుకు నీదు దిటవలెన్
జిలేబి
-
ReplyDeleteసర్వేశ్వరేశ్వరుడవయ
సర్వార్థప్రదుడవీవె స్వామీ రామా !
సర్వాసునిలయుడవయా
సర్వగుణోపేతుడవయ సర్వము నీవే
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 68
హరి రామాకృతిని గొనన్
పరిమార్చగ రావణునట, పైడినెలతయో
ధరణిజగా సతియై వెస
యరుదెంచెన్ కంబుపాణి! యబ్జాక్ష! నమో!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 69
సర్వేశ్వరేశ్వరుడవయ
సర్వార్థప్రదుడవీవె స్వామీ రామా !
సర్వాసునిలయుడవయా
సర్వగుణోపేతుడవయ సర్వము నీవే
జిలేబి
-
ReplyDeleteవీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి ?
బంగరు మణి వా రండీ
ఠంగున తెలతెల్లవారి టపటప కామెం
ట్లంగట తేదియు టైమును
ట్రింగున ప్రచురించి యిత్తురే యుత్తరమున్
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 70
భూమిని పుట్టువులున్ రా
మా! మొగమే మొత్తుచుండె మానవుగా నీ
ధామమున తొంటినౌత ప్ర
భో!మన్నింపుమనగా ప్రపుల్లవదనుడా!
జిలేబి
-
ReplyDeleteతాతగారికి,
యుగళపు జీవన మధురిమ
ల గమనపు తొలకరి జల్లు లా తల్లి జతన్
జగమున మొదలైన దినము
న గ చింతనమదె మదిని మునకలిడ ప్రణతుల్
బిలేజి.
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 71
శ్రీరామ దేవుడా ని
న్నేరా గొలిచెదను !స్వామి నెరనమ్మితి ని
న్నేరా!భూమిజనుల నే
లే రాట్టువి నీవె రామ! లీలావంతా!
జిలేబి
ఒకానొకప్పుడు నీతో పంతం పట్టి నేను కూర్చిన కందాల తీపి గుర్తులు:
ReplyDeleteయారమణ కేల పాతసి
తార ముసలి సాయితిరి,హతవిధీ - నచ్చే?
బూర గదర! మీదబడితె
పారక ఉండున?తెలివిగ పరుగిడి పోడా!
26 November 2017 at 23:45
ఏలనొ, బోరుగ నున్నది!
మాలిక యంతయు జిలేబి మయమై పోయెన్!
మూల్గెడు నక్కకు దెబ్బల
వోలె పలచబడె విజిట్లు, వోడి చనుదునా?
27 November 2017 at 23:21
పాండితి అహమును పెంచును
మెండుగ, భక్తియు కుదరదు మొండితనముచే!
మెండైనది పామరతయె,
నిండైన మనిషికి భక్తి నిండవలెనుగా!
29 November 2017 at 00:34
ఇప్పటికీ సీసం మీదకి తప్ప కందం మీదకి మనసు పోవట్లేదు.గద్యంలోనే చెప్పగలిగింది పద్యంలో ఎందుకూ అని డౌటు,అంతే!
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 72
రామ! రఘు రామ గోవిం
దా! ముని జనమోహన హరి దామోదర! శ్రీ
భూమిసుతాపతి రామా!
కామిత వరదా! శరణము గతినీవెనయా
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 73
లేమరి యోయని తిట్టెను
రామునికి సమానమెవరు రావణ యనుచున్
రాముని సంగతి తెలియక
తామస వాక్యమ్ము లాడ ధరణిజ దర్భన్
జిలేబి
-
ReplyDeleteఆహా జిలేబీయము :)
గత సంవత్సరమున గే
స్తు తన పనులను సలుపుట కుతూహలమౌ రీ
తి తెనుగున రామ కీర్తన
ల తెన్ను వ్రాసాను నేను లబ్జుగ సౌమ్యా !
జిలేబి
-
ReplyDeleteఆనందినీ కల్లోలము :)
మా యావిడతో పెళ్లికి
మాయా లోకమ్ములో ప్రమాదమ్ముల ప్రే
మాయణము సాగ కాలిడి
సోయగముల తేలిపోయి సువిదుడనైతిన్ :)
జిలేబి
వనజ వనమాలీయము :)
ReplyDeleteరుణ బంధాలనబడు కథ
అనుభవముల చిత్రమాలికాభరణమ్మౌ!
మనకింకొక్కరి పై అస
హనమనగా న్యూనత మన యందున గలదౌ
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు- 74
నీయండ చాలు నయ్యా
మాయను రామా గెలిచెద మరుగేలనయా
ఆయప వర్గము నిమ్మా
న్యాయమ్మిదె రామ! బ్రోవు నన్ దాశరథీ!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ్ కందాతిశయము - 75
నీకొఱకై యుగములుగా
నేకాళ్లబడి వగచుచు కనికరమ్మునకై
స్వీకారమునకు వేచితి
శ్రీకర! జగదీశ్వర! ప్రభు! సీతారమణా!
జిలేబి
జిలేబీయము :)
ReplyDeleteనా కరవంరాదండీ
మీ కామింటర్థమవలె మీరేమేడా
లో కాస్త తెలుగు లో నే
మా కేడ్వండి వివరముగ మహితాత్మ! వినన్
ఆహా మరో జిలే బుల్స్ :)
ReplyDeleteఇది అర వంట కదా? నా
కది తెలియదు! అర్థమేమొ కాస్తైనా తె
ల్వదు! వ్రాసే దేదో తెలు
గుదనము తోరాయుడి కలుగు నెలమియు సుమీ
జిలేబి
నారద జిలేబీయము :)
ReplyDeleteఅప్పిడి యా! యెవడుప్పూ
చప్పూ లేనట్టి వ్యాఖ్య సంధాయించెన్ ?
గప్పున రండహె ముందుకు
చెప్పిండొక కాంతుడచట చిరుబురటంచున్
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 76
హరి యింతవాడటంచున్
హరి యంతయని పొగిడెదరు హరిసేవకుడై
మరియింతగా మురియుచున్
తురగంబయ్యెడు గరుడుని స్తుతి చేయుదురే?
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 77
హరి పాదములొత్తెడు సతి
సిరిని పొగిడెదరకొ? తల్లి చినచిన్నగ శ్రీ
కరుని కొనియాడు వేళన్
మరువక ఆ పరమసాధ్వి మంతు గొలుతురే
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 78
భవబంధములను విడువవ
లె వాద శీలము విడువవలె హరికటాక్ష
మ్మె వరముగ బొందవలె నెం
చవలెన్ హరిహరులొకరని సత్యమ్మిదియే
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 79
జగమే నిజమని నమ్ముచు
భగవంతుని మది మరిచిరి బహుకాలము దం
డగ బహు బాధల తోడు తి
రిగిరి జనన మరణముల సుడిని గుండ్రముగా
జిలేబి
-
ReplyDeleteనీ యనురాగంబన్న
న్నా యెన్నెన్నో పుటుకల నాకనుబంధం
బాయెన్ విడరానిది నీ
శ్రేయస్సునుకోరెదను పరిఢవిల్లంగన్
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 80
మీరేమి చేసెదరయా
మీ రాముని కొరకు? సిరుల మీకిచ్చెనయా
మీరడగక మునుపె నతడు!
మీరేమిచ్చేరతనికి మేవడి తోడై ?
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 81
పూనితి నిదె దీక్షను రా
మా! నిన్గూర్చి మరిమరి రమారమణ! ప్రభో
గానము చేసెద నెపుడున్
మానక నీవు వినిన నెర మది నిండునదే!
జిలేబి
-
ReplyDeleteతెలుగోళ్ళకి తెనుగే రా
దిల మాచన శర్మ గారు దీన్ని తెలిపిరీ
పలకా బలకము నిమ్మా
జిలేబులను వేయు తీరు శీఘ్రము నేర్వన్ :)
జిలేబి
-
ReplyDeleteపిల్లి యనగా బిడాల
మ్మల్లె గలదె నీ జవాబు మాకు తెలుపవే
తల్లీ అప్పిడియాకున్
మళ్లీ చప్పిడికి అర్థ మసలుందామ్మీ ?
జిలేబుల్స్ :)
స్టాకు మార్కెట్టుని కుదిపేసేరేమిటి ఇవ్వాళ తాతగారూ ?
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 82
ఎన్నాళ్లకు గాచితివీ
యెన్నాళ్లకు మంత్రమిచ్చి యీడేర్చితివీ
యెన్నాళ్లకు సుకృతములకు
మిన్నగ జూపితివి కృపను మేరుసమానా !
జిలేబి
-
ReplyDeleteఉపనయన మహోత్సవమున
కు పోయినపుడచట మనసుకు రఘుపతిని కొ
ల్వ పదమ్ములు కీర్తనల
య్యె పాద సీమన నొదుగ మయియె పోరామిన్
జిలేబుల్స్
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 83
సీతా రామా నే సం
ప్రీతిగ నీవాడనైతి ప్రేముడి తోడై
సీతాపతి! నీ నామ
మ్మే తారకమంత్రమయ్య మేవడి తోడై
జిలేబి
-
ReplyDeleteవిన్న కోట వారెక్కడ :)
ఊగిస లాడెను డౌజోన్స్
వేగిర పైకెగసినట్టి బేంక్ నిఫ్టి భలే
సాగిల పడి గింగిరులన్
తూగాడు సమయము మొదలు తొందరలోనన్
జిలేబి
-
ReplyDeleteఅల్లుడనగనే సామెత
చెళ్ళున రేవందు తాడి చెట్టు నిటారై
భళ్ళున లేచినిలబడున్
పుల్లగిలి పరుగిడి నావ బోల్ మంత్రి యనన్
జిలేబుల్స్
-
ReplyDeleteతాత గారి యెండ చిరుబుర్రులు - :)
వేడి నలభై పయి చిలుకు
వాడి మసియగు సమయమ్మ వతలన్ బ్లాగ్లో
గోడును చెప్పుకొ ని మరల
నా డెస్కు ను కట్టిపెట్టి నాను సుమండోయ్ !
జిలేబి
హరి అవతారములే సకల దేవతలు ...:)
ReplyDeleteహరిబాబే హైజాక
య్యెరొ! వ్యాఖ్యల నాతతాయి యెవరో రుద్దెన్
హరిబాబు పేరిట నచట
విరివగ రామాయణపు కువివరణలన్ స్మీ :)
జిలేబుల్స్
-
ReplyDeleteపలికిరి బ్లాగ్జ్యోతిష్కులు
ఫలితము పౌర్ణమి సమయపు ప్రళయమ్మిదియే
తెలిసెను రూట్కాసని మం
త్రులుగ్గడించిరి జనాళి తునకలయిరటన్
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 84
కానయ్య లక్ష్మణుండను
నేను నిదురకాయలేను నీవె పవళ్లై
నా నాకు రాత్రులయినన్
రానిమ్మా నీ కలలె పరాత్పర ! యెపుడున్
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 85
పవలెల్ల నిన్ను కొలిచితి
చివరకు ఆ నిదుర పేర చేష్టలుడిగితిన్
భువనేశ్వర! స్వప్నమున మ
రువక నినుగొలువ వరమ్ము రూఢిగ నిమ్మా
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 86
కాపురుషుల కన నొల్లను
నా పవ లైన నిసి యైన నమ్మితి నిన్నే
తాపమెటుల నన్ దాకున్
తాపసమందార ! దశరథ కుమార నతుల్!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 87
సవినయముగ సాకేతపు
ర వాస నీ మెప్పె చాలు రహి జూపుమయా
భువిని నరుల మెప్పేల ప్ర
భు వలయు ? నీకరుణ చాలు భువనేశ్వరుడా!
జిలేబి
ఎవరీ శారద ఏమా కథ ?
ReplyDeleteశారద చేసె నతిధి స
త్కారముల ఫినిక్సు గృహము తను చేరంగన్
వారెల్లరున్ భళీ ముద
మారగ! యిల్లే సతుల ప్రమదవనము కదా!
జిలేబుల్స్ :)
// “ ఎవరీ శారద ఏమా కథ ?” //
Delete???????
రామాయణమంతా విని ………..
అపహాస్యానికి కూడా హద్దుంటుంది.సున్నితత్వం పూర్తిగా పోతోందా? పోయిందా?
Deleteఈనాటి సమాజంలోనే సున్నితత్వం పూర్తిగా పోయింది, శర్మ గారు. మాటలో, ప్రవర్తనలో అమర్యాద మొరటుదనం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. . వ్యాపారసంస్కృతి, కార్పొరెట్ట కల్చర్ లో ఇదే నేర్పుతారేమో / తమ పని అయిపోయి, డబ్బులు తమ జేబులో పడితే చాలు అనుకునే సంస్కృతి గదా?
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుJun 8, 2023, 10:36:00 PM
Deleteసార్!
మొరటుదనమే నేటి సంస్కృతిలా ఉందండి.చదువు వ్యాపార వస్తువైందికదా! ఈ శాల్తీ కార్పొరేట్ రంగం నుంచి దిగుమతి ఐనదికాదు, విద్యారంగం నుంచే దిగుమతి ఐంది. అందుకే ఇలా తయారయింది. నా మాట కూడా మొరటుగా తయారవుతోందా? తయారయిందో!
రావు గారి జమానాలో సేటు బ్యాంకు గుప్తుల స్వర్ణయుగము కామోసు :)
Deleteజిలేబీ పరార్ :)
ఈనాటి మన సమాజం
లోనే సున్నితములెల్ల లోపించెగదా!
పైన కరుడుగట్టిన జను
లే నేతలు కార్పొరేటు లెటు జూడంగన్
జిలేబి
తాతగారి ఉబోస :)
Deleteసారూ మొరటుదనమె చూ
సారూ మన సంస్కృతివలె సాగె! చదువు వ్యా
పారపు వస్తువు! ఈ శా
ల్తీ రంగము కార్పొరేటు తీరువలే లే :)
జిలేబి
-
ReplyDeleteఅపహాస్యానికి కూడ వి
ను పడతి హద్దుకలదే జినుగు తగ్గుదలా
యె పరిపరి విధములు జిలే
బి! పద్ధతులివి సరికాదు విను బుజ్జమ్మా !
జిలేబి
-
ReplyDeleteతింగరి బుచ్చీ రావే
చెంగున బుజ్జమ్మ రావె జిల్ జిల్ రమణీ
టింగణి కలహాల్రాణీ
రంగం పేట అழగాణ రాక్షసి రావే :)
ஜிலேபி
-
ReplyDeleteశ్యామలీయ కందాతిశయము - 88
పసిడికి యమ్ముడు పోన
ట్టి సేవితుల కలతెరంగు ఠీవి గల ప్రభూ!
మసకొన నీయక ముక్తి శ
వసానమందు నడిపించు నారాయణుడా
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 89
ఒక మంచి కీర్తనయె చా
లు కౌసలేంద్ర నిను మది గొలువ సౌభాగ్య
మ్మొక మంచి పద్యమలరం
గకళంక గుణాభిరామ యమితంబేలా!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 90
నీ పాద సేవ మానక
నే పట్టుగ చేతు రామ! నినుపొగుడుటయే
నా పని నను రక్షించు ప్ర
భో! పరమాత్మ! శరణు శరణు ధనుష్పాణీ!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 91
శ్రీరామ భక్తుల నెపుడు
చేరని జన్మంబదేల చిన్మయు డానం
దారాముండతడిని నే
చేరని పుట్టుక యదేల చింతించెదనే
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 92
మతిహీనుడె మధురమ్ముగ
నితరముల తలంచు రాముని సమభిధను మో
వి తరింప మప్పువాడే
యతిధన్యుడు రామరామ యని పలుకదగున్
జిలేబి
ఏదో కామెంటారు కదా ఆ మాత్రమైనా అని సంతోషింపని సాహెబులు :)
ReplyDeleteఅసలే తెలుగు పదములను
విసవిస ఆంగ్లమ్ములోన వేగమ్ముగ వ్రా
సి సరి సరి స్పేసు కూడా
యిసుమంతయు లేక పేర్చితే యెట్లాస్మీ ?
నారదా
జిలేబి
-
ReplyDeleteకొండలు కూడా అంతే
నండీ! నదులవలె నిలచు నాలుగు కాలా
లండి జనులు వచ్చిన నే
మండీ పోవంగనేమి మహిలో శర్మన్
జిలేబి
Readers may come and readers may go
DeleteBut “Zilebi” padyaalu go on forever.
🙂🙂
(with apologies to Lord Tennyson)
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 93
తలపరు రాముని మూర్ఖజ
నులు పూజింతురదె సురులను సిరులకై వా
రలకెట్లు దొరకు ముక్తి భు
విలోన దుర్లభమె యిద్ది వినరా శ్యామా
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 94
మానక యమపురికి మరల
మానవ! శ్రీరామ నామ మంత్రము వీడం
గా నీ పయనము తథ్యము
కాని పనుల కాసుల కొరకై చేయకుమా!
జిలేబి
-
ReplyDeleteఅన్నుల మిన్నయె చూచెను
కన్నులు లేనట్టివాఁడు! గన్గీఁటె నహో
చిన్నది నిజమో కాదో
తిన్నగ తెలుసుకొనగా మతింపు సరియె పో!
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 95
రావణుని పొగుడు రాక్షసు
లే వేలకు వేలు నేడు లెమ్మ పుడమిలో
నావాలమ్ముగొనిరి రా
మా! వారిని నిగ్రహింపుమా త్వరితముగా!
జిలేబి
రెండు రోజులు కనపడకపోతే ఏమయిపోయారో అనుకున్నా...
ReplyDeleteమాడర్న్ డే మెస్సయ్యా :)
ReplyDeleteఇటువంటి కొలవెరి జనుల
తటాలున క్షమించుటే కదా యుత్తమమి
చ్చట! వారి తప్పు లెవ్వి య
కటా తెలియదండి వారికై వారలకున్!
జిలేబి
// bonagiriJun 23, 2023, 1:27:00 AM
ReplyDeleteరెండు రోజులు కనపడకపోతే ఏమయిపోయారో అనుకున్నా..//
డిటో డిటో, బోనగిరి గారు.
“జిలేబి” గారు, ఇప్పటికయినా మీ వివరాలు కొన్నయినా (నిజ నామధేయం, నివాస దేశం / స్థలం, వృత్తి వగైరా వివరాలు) మీ బ్లాగులో పెట్టండి - పోయేదేమీ లేదు మీ ముసుగు తప్ప.
This comment has been removed by the author.
Deleteఅఁ!మహా మహా మల్లాది వెంకట కృష్ణమూర్తి లాంటివాళ్ళు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు.జిలేబీ గురుంచి తెలియనందువల్ల నష్టం లేదు లెండి.
Deleteఅశోకుడు అనే కల్పిత వ్యక్తిని చరిత్రలో చదువుతూ సర్దుకుపోయిన మనకి జిలేబీ వాస్తవ చరిత్ర వల్ల ఉపయోగం ఏమిటి?
నిజ నామ ధేయము - జిలేబి
ReplyDeleteస్థలము - జిలేబీపురము
వృత్తి - జిలేబీలు వేయటము కందమూలాలను లాగటము
ఏమైపోయావే బ్యాంకు నిఫ్టీ అంటూ మొరెట్టుకోవడము
గట్రా గట్రా
You are incorrigible 😡.
Deleteమనసు పడే వ్యధ కగధ
ReplyDeleteమ్మనునది లేదోయ్ జిలేబి! మనసుల కలబో
తను తెలిపెడు పంచాంగము
కనిపించదు వెతికిన మది కరగాలె సుమీ!
జిలేబి
-
ReplyDeleteఓ యబ్బో! కందం ఒలికి పోతావుంది గీతంలో :
ఔరా! నా కౌగిలికే
రారా ! ఓ సుందరాంగ! రారా ధీరా!
దోరవయసుదానినిరా!
యేరా! నీకెందుకింత గీరా! రారా!
నేనన్లే :
-
ReplyDeleteమీరేనా! నా బ్లాగ్జొ
చ్చేరా! నా భాగ్యమెంతదీ వేళయొ బా
మ్మా! రాధనమాయె సుమా!
దూరింది మనసున ప్రేమ దువ్వాటముగా!
జిలేబుల్స్ :)
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 96
భగవంతుడు రాముండై
జగమున ప్రభవించె తల్లి జగదీశ్వరి తో
డుగ జానకికాగన్ తీ
ర్చగ నొడుదుడుకుల్ జనాళి చల్లగ బతుకన్
కష్టేఫలి తాతగారి ఉభయము :)
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 97
రామా! రఘుపతి! ప్రణతుల
యా! మమ్మిదె బ్రోవుమయ్య! యవనారివి నీ
వే! మధువిరోధి! గైకొను
మా మా వందనములన్ రమానాథ! ప్రభో!
కష్టేఫలి తాతగారి ఉభయము :)
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 98
ఓ రాలుగాయి! యేలనొ
శ్రీరాముడెవడను ప్రశ్న? చివరికి సుడుగా
డే రహి చూపాలె తెలుప
మా రఘుపతి యెవ్వరని సుమా ! తల యొగ్గన్
కష్టేఫలి తాతగారి ఉభయము :)
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 99
తొలగిన భ్రాంతియు సర్వం
బిలలో రామమయమే సుభిక్షముగా మా
య లయము గాన నతనిలో
న లబ్ధి యగు మోక్షమే క్షణమ్మున శ్యామా!
కష్టేఫలి తాతగారి ఉభయము
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 100.
మా రామచంద్రుడుండగ
మా రక్షకుడై కువలయమందు ఖలులు మా
శ్రీరాముని మెచ్చని చో
పోరామికలుగునకో సుబుధులకు శ్యామా!
కష్టేఫలి తాతగారి ఉభయముతో
వందకు చేరె త్వరితముగా
జిలేబి