Saturday, September 18, 2010

యోగః 'చిట్టా' వృద్ధి అభివృద్ధి కారకః!

పతంజలి యోగ సూత్రం - యోగః చిత్త వృద్ధి నిరోధః!
ఈ జమానా లో - యోగ అన్న పదం ఎంచక్కా చిట్టా వృద్ధి కారకః!
అంటే - యోగా పేరుతో ఎలాంటి జిమ్మిక్కులు చెయ్య వచ్చో విదేశాల్లోని యోగా కంపెనీ ల నించి నేర్చుకోవచ్చు. ఈ ప్రతిభ లో - మన వాళ్ళు ఓ మోస్తరు వెనుక బడ్డ వారే !
దేనికైనా యోగా టైటిల్ ముందో వెనుకో చేర్చడం - బ్రాండ్ వేల్యూ ని పెంపొందించే సులభ సూత్రం !
మన దేశం లో కూడా ఈ యోగా కొత్త పుంతలు తొక్కుతోంది - కాకుంటే హై ఎండ్ సొసైటీ లో

యోగా పేరుతో బ్రాండింగ్ ఎలా చెయ్య వచ్చో అలాగే - దాని నిర్మలమైన ఉపయోగాన్ని కూడా పొందితే - ఈ కాలం లో ఒక విధం గా యోగ ని సాధించినట్టే!

చీర్స్
జిలేబి.

Thursday, September 16, 2010

ఇండియన్ స్టాక్ మార్కెట్ - ఎ గతి?

నదీనాం సాగారో గచ్చసి అన్నది సుభాషితం.

ఈ స్టాక్ మార్కెట్ లకి సాగరం ఎక్కడ ఉన్నదన్నది నా పెద్ద సందేహం!

ఏదో కొంపలు మునిగి పోయేటట్టు - విపరతీం గా అమ్మేసుకుని అమ్మోయ్ మేమంతా నష్ట పోయామోచ్ అని తల మీద గుడ్దేసుకుని ప్రభుత్వాలని గెంజి , బతిమాలి కాకుంటే - మా కు ఆత్మా హత్యలే శరణ్యం అని బెదిరించి డబ్బులు - ప్రజల పన్నుల డబ్బులు లాగేసుకుని - మళ్ళీ జూమ్మని తెగ స్టాక్ లు కొనుక్కుంటూ వోయ్ ఇండియా ఆసియా లో తలమానికంగా వెలుగొంద బోతూందని స్టేట్మెంట్లు ఇచ్చేయ్యడం - !

విష్ణు మాయ కాకుంటే - ప్రతి కొన్ని సంవత్సరాలకి ఇది జరగడం - ఆ తరువాయి అంతా మరిచి పోయి - వోయ్ మంచి రోజులు వచ్చేసాయ్ అని చంకలు గుద్దేసుకుని సంతోష పడి పోవడం - కాదండీ మరి ? - ఈ గతి కి సముద్రం ఎక్కడ ఉన్నది?

చీర్స్
జిలేబి.

Saturday, September 11, 2010

మాడెర్న్ గణేశ - లేజీ గణేశా-!!


మౌసే జీవనం ఈ 'ఈ ' మానవునికి'-

లాప్ టాప్ - వెబ్ - ఆహారం 'ఈ ' మానవునికి-

'ఈ ' మానవుని లేజీ లైఫ్ కి గణేశా కూడా

లాప్ టాప్ తో లేజీ గా ఇవ్వాళ

గణపతి బొప్పా మోరియా అంటుంటే -

'దైవం' మానుష రూపేణా - అన్నది 'ఊర్ధ్వ మూలం అథః శాఖం అయినట్టుంది!


గణేశ చతుర్థి శుభాకాంక్షలతో !


'బి' లేజీ -

జిలేబి.

Tuesday, September 7, 2010

స్టార్ బక్స్ & 'బక్స్'వంతుడు - బ్రాండ్ లోకం

స్టార్ బక్స్ వాడు బ్రాండ్ పేరుతో కాఫీ ని - డాలర్ ల లో అమ్ముతాడు. బ్రాండింగ్ లోకం లో అన్నిటికి డిమాండ్ ఉంది. బ్రాండ్ బాగా చేస్తే - మన భాజా బజంత్రీలు బ్రహ్మాండం గా వెలుగు తాయి. మన ఐపిఎల్ లాగ అన్న మాట.
'కాసే దాన్ కడవులప్పా అన్నాడు ఒక తమిళ కవి. డబ్బుకు లోకం దాసోహం అని వాపోయాడు తెలుగు కవి.

మొత్తం మీద మన భగవంతుడు కూడా - 'బక్స్' వంతుడు అయిపోయే! బ్రాండింగ్ లోకం లో మా తిరుపతి కొండ దేవర ని కూడా పోటీ కి నిలబెట్టి - వాడి లడ్డూలకి కూడా బ్రాండింగ్ పెట్టి - మా దేవరలు - వెంకన్నని ' బక్స్' వంతుడు గా మార్చే స్తున్నారు.

ఓ దేవర- నీవు కుబేరునికి బకాయి పడ్డావు. నీ పాటి మానవులం మేము- నీ బుద్ధీ మాకే వచ్చే. నీ క్రెడిట్ తో మా పబ్బం గడుపుకోటానికి నిన్ను బక్స్ వంతుడు గ చెలామణి చెయ్యడం తప్పలే ! కాబట్టి- విన్నపాలు విన వలెను వింత వింతలూ - మాత్రమె కాదు - నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా ! - అని నీ 'పద' కమలం లో ఈ 'బ్లాగు ' బాక్సు ' సమర్పితం !

చీర్స్
జిలేబి.

Monday, September 6, 2010

కృష్ణా - 'బాగా' నే 'బారో'

అప్పు చేసి పప్పు కూడు చిత్రం చూసాక - కృష్ణా నీవే బేగనే బారో అన్న కన్నడ పద జాలానికి నవ్వొచ్చింది. కృష్ణా బాగా నే బారో అన్నట్టుందే ఇది అని!

అయినా ప్రస్తుత జమానాలో - క్రెడిట్ లేనిదే దునియా లేదన్నుట్టుంది! ప్రతి ఒక్కటి క్రెడిట్ లో కొనాల్సొచ్చే రోజులు అయి పోయేయీ!

కాబట్టి - ఎట్లాగు క్రెడిట్ తప్పదు - సో బేగనే బాగా బారో చేసి - పప్పు కూడు తినవలె ! ఇది విస్సన్న చెప్పిన వేదం ఈ కాలానికి !( ఈ బ్లాగు మాత్రం ఏమి క్రెడిట్ మీద కాదూ రాస్తున్నది ? బ్లాగర్ వాడు స్పేస్ అరువిస్తే - అందులో మన రాతలు తెల్ల వారుతున్నాయి గదా! - అంతా అమెరికా వాడి మాయ ! )

చీర్స్
జిలేబి.

Monday, August 23, 2010

వాక్కు- మనస్సు- మేధస్సు - కర్మణ్యం

కర్మణ్యం అన్న పదం ఉన్నదా నాకైతే తెలియదు.
కర్మణ్యే వాధి కారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీతా వాక్కును అను సరించి పై పదం వాడడం జరిగినది.

మనస్సుకి, వాక్కుకి, మేధస్సు కి సంబంధం ఏమిటి?

మనో వాక్కాయ కర్మ ణే అన్న పద పల్లవిలో - ఈ మూడింటి ని కలిపి - ఒకే మార్గం లో ఉపయోగించాలని పెద్దల ఉవాచ.

ఈ సమీకరణం లో మేధస్సు ఉపయోగం ఉందా? లేక హృదయం ఈ మూడింటిని సందిస్తుందా ?

చీర్స్
జిలేబి.

Friday, August 20, 2010

చింతన - చైతన్యం - సృష్టి

ఒక ఆలోచన స్రవంతి ఐ మేధస్సుని మదించి
చైతన్యాన్ని కలుగ జేస్తే
ఆ చైతన్యం ఉత్తేజాన్ని పుంజుకుని కార్య సాధనలో
సఫలీకృతమై తే -
అందులోనించి ఉద్భవం - సృష్టి

ఆ సృష్టి కాలం పరిమితం - దాని వైశాల్యం పరిమితం
కాని దాన్ని సృష్టించిన చైతన్యం, ఆలోచన అపరిమితం

సృష్టి కి మూలకారణం చైతన్యం, ఆ చైతన్యానికి మూల కారణం ఆలోచన ఐతే
మరి ఆ ఆలోచనకి మూల కారణం ఏమిటి ?


చీర్స్
జిలేబి.

Thursday, August 19, 2010

సత్యానికి చోటు దొరకలే నా దేశంలో

దేశం లో సత్యానికి కూడా బెయిలు దొరక లే
సత్యం దూరమయి పోయే దేశంలో
అయినా సత్యానికి బెయిలు దొరకలే

సత్యమేవ జయతే అనే దేశం
తెల్ల బట్టలు ధరించే నాయకులూ -
కాషాయం ధరించే స్వాములు
ఏక పత్నివ్రతం పాటించే భర్తలు , భార్యలు
అమ్మా నాన్నల మాటలు జవదాటని పిల్లలు
దేశం బానే ఉంది- ఈ విషయాలలో -

అయినా - ఈ సత్యానికి మాత్రం ఎందుకో అంత వెరపు మనకి?
సత్యాన్ని ఎందుకిలా బందీ చేసేసాం మనం?
అబ్బే - హరివిల్లు మనకు నచ్చదా ?
ఏమో ప్రిజం లో నించే మనం జీవితాని సాగించాల?

చీర్స్
జిలేబి.

Monday, August 16, 2010

జ్యోతిష్యం ఒక కళ

కళ అంటే మనసుకి విశ్రాంతి ని కలుగ జేసేది. మానసోల్లాసం మానసిక వికాసం. మనసు ఆరాటం తీర్చేది. కాస్త శాంతి, కాస్త ఊరట, కూసింత ఓదార్పు - దానికి పెద్ద లక్ష్యాలంటూ ఉంటె - మానవ సేవయే .

ఏమండి మా అమ్మాయీ వివాహం ఎప్పుడో కాస్తా చూసి చెబ్తుదురూ అంటే - దానికే మున్దమ్మ చూసేద్దాం అని ఊరట ఇచ్చే జ్యోతిష్యులు తరుచు కనబడుతూనే ఉంటారు. కొద్ది పాటి జ్యోతిష్య జ్ఞానం ఉన్న ఎ వ్యక్తీ ఐన కూడా ఈ ఊరట ఓ తల్లి కి ఇవ్వ గలడు - ఆ ఊరట - అమ్మాయి పెళ్లి అవుతుందో లేదో గాని కొన్ని మార్లు విజయం - ఆ సమయానికి ఆ తల్లి ఆరాటం సద్దుమనుగుతుంది.

ఏమండి - మా నాన్న గారు - ఆరోగ్యం బావోలేదు. కాస్త చూడండి జాతకం - ఏమయ్యా డాక్టర్ గారి దగ్గిరికి వెళ్ళ లేదా? వెళ్ళా నండి - అయినా

డాక్టర్ చెప్ప లేడా ?

వెస్ట్రన్ వరల్డ్ లో సైకాల జిస్ట్ మాటలతో ఒదార్పునివ్వడానికి నివ్వడానికి ప్రయత్నిస్తాడు.



మన దేశం లో పెద్దలు కర్మ సిద్ధాంతం తో ఓదార్పు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు.


జ్యోతిష్కుడు తాను నేర్చిన విద్య తో జనానికి ఏదైనా ఉపయోగం ఇవ్వగల డెమో నని చూస్తాడు.

సైకా ల జిస్ట్ ఫెయిల్ అవుతాడు. మన దేశం లో పెద్దలు ఫెయిల్ అవుతారు. జ్యోతిష్కుడు కూడా ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే సక్సెస్ ఫైలూర్ డెఫినిషన్ మనం ఆపాదించుకున్న వి.

కే విశ్వనాథ్ శుభ ప్రదం పిక్చర్ తీస్తాడు - జనాలకి ఓ పాటి వినోదాన్ని కలిగిస్తుందేమో చూద్దామని . ప్రజలకి నచ్చదు పిక్చర్ ఫ్లాప్. ఉద్దేశం మంచిది. ప్రయత్నం కూడా పూర్ణత్వం తో చేసినది. కాని ఫలితం శూన్యం. దీన్ని ఫైలూర్ అంటామా? అసఫలం ఇది ఇరవై ఒకటవ శతాబ్దపు పిక్చర్ కానే కాదు. కాక పోవచ్చు. ఇరవై రెండో శతాబ్దపు పిక్చర్ ఈ తరం లో తీస్తే - దాన్ని ఆస్వాదన ఈ తరం వాళ్ళ కి కుదురు తూందా?


ప్రతి ఒక్క వ్యక్తీs తనదైన పరిధిలో - ఈ జీవిత నౌక ని సాగిస్తూ దానితో బాటు మరి కొందరికి సహాయం చేద్దామనే చూస్తాడు.



ఆ ప్రయత్నం లో - కళ ఒక ప్రక్రియ . ఉద్దేశం మంచిదే. సదుద్దేశం. దాని ప్రయత్నం కొన్ని మార్లు సఫలం మరి కొన్ని మార్లు అసఫలం - కాకుంటే - జనాల భాషలో దైవ నిర్ణయం.

చీర్స్

జిలేబి.

Saturday, August 14, 2010

జ్యోతిష్యం ఒక సైన్సు - మేథమేటిక్స్ కూడాను

సైన్సు అన్న పదం ఇరవై శతాబ్దం లో కాకుంటే పంతొమ్మిదవ శతాబ్దం లో వచ్చిన పదం.
అంతకు మునుపు ఫిలోసోఫి అనే వాళ్ళు.

ఉదాహరణకి - న్యూటన్ పుస్తకం పేరు ప్రిన్సిపెల్స్ అఫ్ నేచురల్ ఫిలోసఫి.

ఫిలోసఫి అర్థం తీసుకుంటే- అది లవ్ ఫర్ సం థింగ్. ఈ అర్థం లో తీసుకుంటే జ్యోతిష్యం ఒక ఫిలోసఫి. సైన్సు. దీన్ని చదివిన వాళ్ళు, చదవడానికి ఉత్సుకత చూపే వాళ్ళు ఓ పాటి జిజ్ఞాస తో - దాని మీద "వ్యామోహం" తో కాకుంటే- సందేహం తో ప్రారంభించి ఓ లాంటి పరిణితి వచ్చిన తరువాయీ దాని వెనుక ఉన్న నిగూఢ అర్థాలని వెలికి తీయడం లో తమ ఇంట్యూషన్ ని వాడడం గమనించ వచ్చు.

ఎన్నో మార్లు- జ్యోతిష్యం బాగా తెలిసిన వాళ్ళు - వాళ్ళకే సందేహం వస్తే- జవాబు వెంటనే చెప్పక , కొంత సమయం తీసుకుని వారి కాన్షేన్స్ అనుమతిస్తే - కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం చాలా సర్వ సాధారణం గా గమనించ వచ్చు.

అంటే ఈ జ్యోతిష్యం దాని గణాంక పరిధిని దాటి - తార్కికానికి ఆవల - "దృష్టి" ని సారించి అంటే
డిఫరెంట్ డిమెన్ షన్ లో వెళ్లి కొన్నిటికి సమాధానం చెబుతుంది.

సైన్సు పోకడ ని గమనిస్తే - ఈ కాలపు రెండు శతాబ్దాలలో - చాలా మార్పులతో వేగం గా పరిణితి చెందుతూ వస్తోంది. తాము గ్రహాలని చెప్పిన నేప్తూన్ ఇప్పుడు గ్రహం కాదని అంగీకరించడం దాక అంటే వారి "జ్ఞానం' పెరిగే కొద్దీ మన "విజ్ఞానం" కూడా పెరుగుతోందని అనుకోవచ్చు. (కాకుంటే - "అజ్ఞానం" తరుగుతోందని అని కూడా అనుకోవచ్చు)

కొన్ని శుష్క వాదనలతో సూర్యుడు గ్రహమా అని జ్యోతిష్యం ని ప్రశ్నించే "హేతవాదులని" మనం చూడడం కద్దు.
జ్యోతిష్యం డెవలప్ అయిన కాలానికి వాళ్ళు - దాన్ని గ్రహం గా సంబోధించ వచ్చు అనుకోవచ్చు గదా? మనం విజ్ఞానవంతులం అట్లా ఆన్కుంటే మన హేతువాదానికి ధోకా వస్తుంది కాబట్టి మనం ప్రస్నిన్చాల్సిందే !

క్వాంటం ఫిజిక్స్ పరిణితి చూస్తె- నాటి క్వాంటం మెకానిక్స్ మోడల్ నించి మొదలయ్యి - పుఉడు క్వాంటం ఫిసిక్స్ మరియు ఆధ్యాత్మికం దాక దాని ప్రతిపాదనలు వ్యాపించి ఉన్నది. దీనికి మూల కారణం దాని మీద - ఆ సబ్జెక్ట్ మీద పరిశోధనలు మిక్కిలి గా జరగడమే కారణం. క్వాంటం ఫిసిక్స్ మొదలైన కాలానికి అది సో కాల్డ్ సుడో సైన్సు. ఆ కాలం లో దాన్ని మనసార సమర్థించిన వాళ్ళు చాల కొద్ది మంది మాత్రమె.

ఈ నేపధ్యం లో జ్యోతిష్యం తానున్న ఇప్పటి దయనీమయిన పరిస్తి తి నించి బయట పడాలంటే - దాని పూర్వ వైభవం దానికి రావాలంటే - దాని మీద విలక్షణమైన , విశిష్టమైన , నిశితమైన పరిశోధనలు జరగాలి. అప్పుడే దాని వికాసం మనం చూడవచ్చు.

చిన్న ఉదాహరణ - జ్యోతిష్యం లో ని గళ్ళు సూర్యుని నించి మొదల్లయీ శని గ్రహం దాక ఇప్పడు సైన్సు చెప్పే ఆర్డర్ లో నే ఉండటం కాకతాళీయమ, లేక - మేధస్సు పరిణితి యా? అంటే- జ్యోతిష్యానికంటూ - ఒక నియమం, గణితం ఉన్నది. ఆ గణితం ఒక పార్టు. దాని వెనుక దాని అనాలిసిస్ మరో పార్టు. దాని అన్వయం మరో పార్టు.

మరో ఉదాహరణ- స్టాక్ మార్కెట్ లో " Derivatives" "futures and options" ఎ ఉద్దేశం లేక ఎ మోడల్ తో future ని "predict" చేస్తూన్నారు? బ్లాక్ షోలే మోడల్ అనండి, వేరే మోడల్ అనండి, కాకుంటి probability theory అనండి - దానికంటూ ఒక అర్థం వాళ్ళు చెప్పుకున్నారు. ఓ మోడల్ కాకుంటే "predictability" ఆపాదించుకున్నారు.

అట్లాగే జ్యోతిష్యానికి కూడా ఒక వ్యాఖ్యానం ఉంది కదా? ఈ జ్యోతిష్యం సైన్సు గా విలక్షణం గా పరిణితి చెందాల వద్దా అన్నది మానవ మేధస్సు మీద ఆధార పడి ఉన్నది. ఎ కొద్దిపాటి తెలుగు యోగి శర్మ లాంటి వాళ్ళు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని పరిశోధనలు చెయ్యడమో మాత్రం సరిపోదు. ఇది ఒక యజ్ఞం కాకుంటే ట్రెండ్ కావాలి.

అప్పుడే ఈ సైన్సు కాకుంటే ఫిలాసఫీ కూడా పరిణితి చెంది మన మేధస్సు కి దీటు గా వెలుగొందుతుంది. అప్పుడే దాని వికాసం. కాని ఇందులో ఓ తిరకాసు ఉంది. ఏమిటంటే - ఇందులో ఎలాంటి ధనలాభాలు లేవు.

సో, ఎంతమంది దీనికి టేకర్స్ ఉంటారు? చాల తక్కువ మంది మాత్రమె. అదే దీని ప్రస్తుత పరిస్తితి కి కారణం కూడాను. ఆ కాలం లో రాజులు పోషించారు. ఈ విజ్ఞానం వికసించింది.

ఈ కాలం లో మన గవర్న మెంట్లు వెన్నెముక లేని గవర్న మెంట్లు. వాటికి దీన్ని పోషించే కాకుంటే వికసింప చేసే ఆసక్తి ఉన్నదా అన్నది సందేహమే. అదే ఈ విజ్ఞాన్ని అమెరిక వాడు కొద్ది పాటి పరిశోధనలతో - పేటెంట్ చేసాడంటే - వెంటనే - బాస్మతి మాది అన్నట్టు కేసు వెయ్యడానికి వేనుకయ్యం మనం !

కా బట్టి వేచి చూడాల్సిందే !

కాకుంటే- ప్రశ్నా శాస్త్రం క్రింద ఈ ప్రశ్నా వేస్తాను - సమాధానం చెప్పగలిగే వాళ్ళు - ( ఈ టపా పోస్ట్ చెయ్యబడ్డ సమయమో- లేక మీరు ఈ టపాని చదివిన సమయో - కాకుంటే - మీరే ఓ ప్రస్నా సమయాన్ని ఎంచుకోనో, ప్లేస్ ఇండియా అనుకుని) భాష్యం చెప్పగలరేమో చూస్తాం- ప్రశ్న - "జ్యోతిష్యం మరింత పరిణితి చెండుతుందా ? అవదా?"

చీర్స్
జిలేబి.