పూర్వ కాలం లో - వార పత్రికలూ , మాస పత్రికలూ ఆంధ్ర ప్రజానీకాన్ని అలరారించిన కాలం లో ( అబ్బో ఇదేదో ఓ వంద సంవత్సారాల్ ముందు కాదు లెండి - ఓ మోస్తరు ఇరవై లేక ముప్పై సంవత్సారాల ముందు - ) వార పత్రికల్లో కానివ్వండి , మాస పత్రికల్లో కానివ్వండి, గొలుసు కథలు లేక గొలుసు నవల వచ్చేవి.
అంటే ఎవరో ఒక రచయితా కాకుంటే, రచయత్రి ఓ వారం కథ రాస్తే దాని ఆధారం గా వేరొకరు కథ ని పొడిగించి ఒక మంచి మలుపు ఇచ్చి వదిలేవారు. అలా అలా సాగి పోయే గొలుసు కథా ప్రవాహం లో , ఎడిటర్ గారు అల్టిమేటం ఇచ్చి ఆఖరి అధ్యాయాన్ని రాయమనేవారు. అలా అంత మయ్యేది ఆ కథో లేక నవలో .
మరి మన కాలపు బ్లాగు లోకం లో ఈ గొలుసు కథా కాకుంటే నవల ప్రయత్నం ఎవరైనా చేసారా లేదా నాకు తెలీదు.
నా ప్రయత్నం గా ఈ పధ్ధతి కి ఈ కథ మొదటి భాగం ఇక్కడ ఇస్తున్నాను - ఇందులో ఆసక్తి ఉన్న బ్లాగ్ బంధువులు ఈ కథకి రెండో భాగం రాయ వచ్చు. దాన్ని ఈ కథ కింద కామెంటులో మీరు లింకు ఇవ్వచ్చు. మీకు అభ్యంతరం లేక పొతే ఆ లింకుని నేను మళ్ళీ ఈ టపాలో లింకు కింద కూడా ఇవ్వగలను.
ఈ బ్లాగు గొలుసు పధ్ధతి ద్వారా నాకు ఏమని పిస్తుందంటే - ఒకటి కన్నా ఎక్కువైన రెండో భాగాలు కాకుంటే వేరు వేరు భాగాలు రావచ్చు. అంటే ఒకే కథ ఆరంభానికి వేరు వేరు శాఖలు రావచ్చన్న మాట ! అంటే కథ వేరు వేరు తరహాలో వెళ్ళ వచ్చు. ! ఇక్కడ ఎడిటర్ ఎవరు లేదు కాబట్టి ఆ ఆ శాఖల కథ తదుపరి భాగాలు మళ్ళీ మరో శాఖలు కావచ్చు. ! ఆలోచిస్తూంటే చాలా అద్భుతం గా అని పిస్తుంది నాకైతే ఈ ప్రయోగం !
ఈ గొలుసు ప్రయోగం ఎంత దాక వెళ్తుందో చూద్దాం ! బ్లాగర్ల కందరికీ సుస్వాగతం ! - ఈ ప్రయత్నం సాఫల్యం మీ మీద ఆధార పడి ఉంది !
మొదటి భాగం ఇక్కడ:
విజయోత్సు !
చీర్స్
జిలేబి.