Sunday, May 29, 2011

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజ వారల కథ - 2

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజులకి ఇచ్చిన మొదటి ప్రశ్న కథ

అలా వచ్చిన యువరాజులని బ్లాగు యువరాణి వీక్షించి , ఈ ప్రశ్న ప్రుచ్చించెను.

"ఒక బోయ వాడు అరణ్య మార్గాన వెళుతూంటే ఆతనికి రెండు చాతక పక్షులు ఆకసాన ఎగురుతూ కనబడినవి.
ఆ బోయవాడు తన అంబుల పొదినించి బాణాన్ని అందుకుని గురి చూసి బాణం ఎక్కు పెట్టి, వదిలాడు. ఆ రెండు చాతక పక్షులలో ఒకటి ఆ బాణ ఘాతానికి మృతి చెంది నెల వ్రాలినది.

ఆ రెండవ చాతక పక్షి ఆకసాన వృత్తాకారం లో తిరగసాగింది. ఈ మారు బోయ వాడు మరో బాణాన్ని ఆ రెండో పక్షి పై ఎక్కు పెట్టాలని బాణం కోసం అంబు ల పొది లో చెయ్యి పోనివ్వగా అతనికి ఖాళీ పొది కాన వచ్చింది.

ఆ బోయవాడు ఇక చేసేది లేక  'లేని బాణం' తో ఈ మారు విల్లు ఎక్కు పెట్టాడు. రెండో చాతక పక్షి ' లేని బాణ ఘాతానికి'  నేల వ్రాలి ప్రాణం విడిచి పెట్టింది.

స్వయం వరానికి వచ్చిన రాజ కుమారులార ఇప్పుడు చెప్పండి -

౧. 'లేని బాణం' తో ఆ బోయ వాడు ఎలా ఆ రెండో పక్షిని కొట్టాడు ?

౨. ఆ రెండవ పక్షి ఎందుకు ప్రాణాన్ని విడిచి పెట్టింది ?

ఈ ప్రశ్న లని విని రాజ లోకం లో కల కలం చేల రేగింది. ఈ యువరాణి సుకుమారి మాత్రం కాదు - కొంత మతి భ్రమించిన లలన కూడా అని. కాని ఆ సుకుమారి ని చూడగా ఆ మె తెలివైనదిగా అగుపించింది అందరికినూ.

ఈ ప్రశ్నల కి సమాధానం చెప్ప గలవారెవ్వరు అన్నట్లు మహారాజులం వారు సభ ని ఒక మారు కలయ జూసినారు.

(సశేషం )

జిలేబి.

3 comments:

  1. "లేని బాణం" అనేది ఒక రకమైన బాణం ఏమో ? !!!!

    ReplyDelete
  2. vidi baanam to sambandam lekunda pakshi maraninchindi. priyuni viyogaani bharinchaleka pranalu vdichinattundi

    ReplyDelete
  3. రెండవ పక్షి గుడ్డిది
    అది మొదటి పక్షి కోసం వెతుక్కుంటూ చక్కర్లు కొట్టింది
    విల్లు ఎక్కు పెట్టిన శబ్దానికి అది చచ్చి పోయింది

    ReplyDelete