Saturday, September 17, 2011

దీని రహస్యం ఏమి తిరుమలేశా?

దీని భావం ఏమి తిరుమలేశా?
దీని రహస్యం ఏమి తిరుమలేశా?

ఒకప్పుడు
నువ్వే నేను
నేనే నువ్వు

మధ్యలో ఏమైయ్యిందో
తెలీదు

ఇప్పుడు నేను నేనే
నువ్వు నువ్వే

దీని రహస్యం ఏమి తిరుమలేశా?
దీని భావం ఏమి తిరుమలేశా ?

జిలేబి.

 పోస్ట్ స్క్రిప్ట్:

"ఈ క్రింద ఇవ్వబడ్డ సంస్కృత పద్యానికి భావానువాదం -

यूयं वयं वयं यूयम्
इत्यासीन्मतिरावयोः ।
किञ्जातमधुना येन
यूयं यूयं वयं वयम् ॥

Wednesday, August 31, 2011

క్రమాలంకారం

అ అంటే అన్న హజారే
ఆ అంటే ఆంధ్ర రాష్ట్రం
ఇ అంటే ఇందిరమ్మ కాంగిరేసు
ఈ అంటే ఈనాడు 

ఉ అంటే ఉత్తర ప్రదేశ్
ఊ అంటే ఊకదంపుడు  
ఋ అంటే ఋణం - మైక్రో ఫైనాన్సు

ఎ అంటే ఎంకన్న
ఏ అంటే ఏమరుపాటు
ఐ అంటే - సై
ఒ అంటే ఒంటరి పోరాటం
ఓ ఓరిమి లేని రాజకీయవేత్త

అం అంటే అహం

అః ! - ఆహ - ఆహా - ఓహో - ఓహో హో -

వెరసి
అ ఆ ఇ ఈ ఉ ఊ

జిలేబి.

Saturday, August 20, 2011

మేరా భారత్ మహాన్ ! మహాన్ మేరా భారత్ !

నలుగురు నవ్వి పోదురు గాని
నా కేటి సిగ్గు
భారత ప్రజలారా

మా పంతం మాదే
మా 'తరీకా' మాదే

బ్రిటిషోడు గాంధీ ని, జనాల్ని బొక్కలో పెట్ట గా లేనిది  మేం పెడితే తప్పా ?

వారసులం - జన నేతలం - మా కన్నా
ఈ దేశం గురించి ఎవరికీ ఎక్కు వ చింత ఉండాలి ?
ఎవరికి ఎక్కువ అక్కర ?

వారసులం - జన నేతలం - మాకు పదవులు కట్ట బెట్టినారు
అంటే - మాకు రాజ్యం ఏలమని తాకీదు ఇచ్చినారు

అల్లాంటిది ఓ అల్లా టప్పా అన్నా మకుడు బువ్వ తిననని
మారం పెడితే - తల్లి రెండు దెబ్బలిచ్చి చెవి పిండి బువ్వ తినరా బుజ్జి గా
అని నాలుగు తగిలిస్తే తప్పా ?

జన నేతలం - జన వారసులం - మా కన్నా ఈ దేశం లో వేరే ఎవ్వరికి ఉంది జనాల గురించి అవగాహన ?
ఈ జనాలు ఇవ్వాళ 'అన్నామకులకి ' సప్పోర్ట్ అంటారు

రేపు ఎలెక్షన్ వస్తే - టీవీ లకి , మందులకి దాసోహమై మాకే వోటు అంటారు

వీళ్ళని నమ్మి ఈ పిచ్చోడు దేశాన్ని ఉద్దరిస్తా నంటాడు -ఎవరి పిచ్చి వారికి ఆనందం
ఇట్లాంటి జనాల్ని నమ్మి మేం రాజ్యాలు పాలిస్తే మా గతి ఏమి గాను ?

అందుకే - బుద్ధి గా మేం రాజ్యాలు జరిపే విధానాలని గురించి చింత పడ మాకండి -
మీ రేదో మీ పనీ పాట లేమిటో జూసుకోండి. - మా రాజ్యాలు మేము ఏలుకుంటాం !

ఆనందో బ్రహ్మ !

చీర్స్
జిలేబి.

Wednesday, August 17, 2011

అమ్మ అయ్య అక్క అన్న చెల్లె తమ్ముడు - భీష్మ భారతం

అమ్మ రాణి  

అయ్య చక్రవర్తి

తమ్ముళ్ళు అన్నయ్యలు రాజ భోజ్యం

అక్కయ్యలు చెల్లెళ్ళు ధన భోజ్యం

తమ్ముళ్ళు  అన్నయ్యలు అక్కలు చెల్లెళ్ళు రాజ ధన చౌర్యం

మధ్యలో తాత అన్నా సత్య 'ఆగ్రహం'

ఈ భీష్మ భారతం చేసుకున్న పుణ్యం

అరవై ఐదుల పండు ముదుసలి - నిండు జవరాలు - భారతి

మనవడు భీష్ముడు దిక్కు తెలీక కెవ్వు మంటున్నాడు

రండి రారండి మనవణ్ణి కాస్త సముదాయించండి - 

భారతి మనవడికి దారి చూపెట్టండి


చీర్స్
జిలేబి.

Friday, August 12, 2011

ఆతతాయి - ఈ పదం తెలుగు పదమేనా ?

ఆతతాయి - ఈ పదం తెలుగు పదమేనా ?

ఒరేయ్ ఆతతాయి వెధవ అని మా వాణ్ని అన్నాను వాడి చేష్టలు భరించలేక .

వాడు తిరుగు ప్రశ్న వేసాడు - అమ్మోవ్ - ఆతతాయి అంటే ఏమిటి అని?

నీలాంటి పెంకి ఘటాల్ని  అలా నే అంటారు అని తప్పించు కున్నాను.

ఆ పై ఈ పదం గురించి ఆలోచిస్తే - ఇది అసలు ఎ భాషలో ని పదమో అర్థం కాలేదు. చాల సులభం గా ఉపయోగిస్తాం ఈ.  పదాన్ని కాని.

భాషా కోవిదులకి ఈ పదాన్ని గురించి పుట్టు పూర్వోత్తరాలు తెలిస్తే దయ చేసి తెలియ జేయ్యగలరు !

చీర్స్
జిలేబి.

Tuesday, August 9, 2011

రాజీ లేని నామాలు - నామాలు లేని 'రా' జీవులు'

ఈ రాష్ట్రం లో మరీ చోద్యం - రాజీ నామాల పర్వం నిరంతరం కొనసాగుతూనే ఉంది.

ఈ గవర్నమెంటు ఉద్యోగి రాజీ నామా చేస్తే పాపం అతని కి తిరిగి ఉద్యోగం దొరకటం కుదరదు.
మన రాజ కీయ నాయకులకు మాత్రం ఎన్ని మార్లు రాజీ నామాలు చేస్తే కూడా పర్లేదు. మళ్ళీ సద్యోగం ఖాయం

గవర్నమెంటు ఉద్యోగులు కాస్త తెలివి తెచ్చి కొండి. అసెంబ్లీ సమావేశాల్లో మీకు కావలసినన్ని జీ వో లు , మీకు సముఖం గ ఉన్న జీ వో లో కాస్త తెలివిగా ప్రతిపాదించు కొండి.

ఈ నాయకులతో సమం గ మీకు కూడా అన్ని విధాలా సౌకర్యాలు కల గ జేసు కొండి. కాస్త మా మీద కనికరం ఉంటె అప్పుడు కొంత మాకు కూడా పడెయ్యండి.  అసలే మేం నామాలు, అడ్రస్ లేని జీవులం ! కాస్త కనికరించండి.


ఇట్లు

జిలేబి ల కోసం లేజీ లైన మేం సాహేబులం - ఆంద్ర వాసులం  పై పెచ్చు భారత మాత ' ముద్దు ' బిడ్డలం !

Saturday, August 6, 2011

మీ కోసం - పంచు లచ్చి - తిరపతయ్య కథా కమామీషు

తిరపతయ్య ని ఓ రకం గా పంచు లచ్చి ఈ మారు మరీ మురిపెం తో అంకుల్ అంకుల్ అంటూ మరీ పోగిడేసింది.  పాపం అంకుల్ తిరపతయ్య కి ఏమి పాలు పోక తిరుగు రిటార్ట్ పంచు లచ్చి నే ఆంటీ అని సంబోధిస్తే బాగుంటుందేమో అని ఆలోచించి, ఇది వేరే ఏదైనా విపరీతానికి దారి తీస్తే మరీ ప్రమాదం అని , పంచు లచ్చి ఫాదర్ ని అంకుల్ అని సంబోధించి ఓ రిటార్ట్ ఇచ్చి ఊరుకున్నాడు.

మొత్తం మీద తిరపతయ్య కొత్త చిత్రం ఏమి రాబోతుందో వేచి చూడ వలసిందే. ఆంధ్రా మొత్తానికి మన వన్నె రేడు గురించి పంచు లచ్చి ఇలా బాటరీ తుస్సుమని పించడం ఏమి బాలేదని బ్లాగు బాన్ధవుల ఉవాచ కూడాను మరి.
సో ఈ నేపధ్యం లో తిరపతయ్య కొత్త చిత్రం ఏమి ఉంటుంది ? పంచు లచ్చి ఈ చిత్రం లో హీరో ఇన్ గా నటిస్తుందా ? ఈ విషయాల పై ఏదైనా సినిమా పత్రిక కొత్త శీర్షిక పెట్ట వచ్చు !

చీర్స్
జిలేబి.

Monday, August 1, 2011

పేమ తో మీ కోసం - పంచు లచ్చి - అంకుల్ ప్రోగ్రాం

పంచు లచ్చి కి టీవీ ప్రోగ్రాం ఒకటి చెయ్యాలని పించింది. రాణి తలచు కుంటే రాష్ట్రం లో ఛానల్ ల కి కొదవా ? వెంటనే ఓ టీవీ వాడు వెంటనే లచ్చి కి ఛాన్స్ ఇచ్చాడు.

పంచు లచ్చి ఆలోచించింది. తన ప్రోగ్రాం అన్నీ వెరైటీ గా ఉండాలి అని. అంటే - తనకి తెలిసిన అందరంకుల్ని, ఆంటీలని పిలిచి వాళ్ళతో బాతా ఖాని పెట్టి వాళ్ళని ప్రతి ఐదు నిముషాలకోమారు అంకులనో ఆంటీ అనో ముద్దు గా పేమ తో పిలిచి , తన ముద్దు ముద్దు మాట ల స్టైల్ ఒక టి ఎస్టాబ్లిష్ చేస్తే మంచిదని పంచు లచ్చి పీ ఆర్ ఓ సలహా ఇచ్చాడు.

దీంట్లో అశేష ఆంధ్రావనికి పొపులర్ ఐన తిరపతయ్య ( తిరపతయ్య కథ చదవ దలచుకుంటే ఇక్కడ నొక్కండి ) ని కూడా పంచు లచ్చి పిలచి 'అంకుల్' అని ముద్దు ముద్దు గా పిలచి ప్రోగ్రాం జరిపించింది పంచు లచ్చి.  దానితో తిరపతయ్య కి మరీ చికాకు పుట్టి ( అసలే కొత్త చిత్రం ఒకటి చెయ్యాలని తిరపతయ్య ప్రయత్నం - ఈ అంకుల్ గొడవ ఏమిటి మద్య లో అని చికాకు పడ్డాడు తిరపతయ్య - ) ' ఇదిగో చూడు - నన్ను తీరూ అనే పిలవ వచ్చు అంకుల్ వద్దులే అన్నా కూడా ఆ పంచు లచ్చి నవ్వుతో - అంకుల్ మీ మొబైల్ నెంబర్ నా మొబైల్ లో తిరు అంకుల్ అనే ఉంది అని పంచు డైలాగు చెప్పింది. తిరపతయ్య ఉసూరు మని ఊరుకున్నాడు. మిగతా భాగం తేరా పై చూడుడు వచ్చే వారం.


చీర్స్
జిలేబి.

Friday, July 15, 2011

Apprenticed to a Himalayan Master

A very good and scintillating book to read, cherish and think about.

Link:
http://magentapress.in/new-release.html

cheers
zilebi.

Sunday, July 3, 2011

కృష్ణా ము 'కందా ' ము 'రారే' !

కృష్ణా ము 'కందా' ము 'రారే !
పద్మ నాభా - రేర్ ఆభరణ నిక్షేప నాధా !
ఏమి మాయం చేసి నావయ్య
ఇరవై అడుగుల లోతులో నిధి నీదేయ్య !


అరవం లో సుబ్రహ్మణ్య స్వామిని కందా అని పిలవడం కద్దు.

మన శ్రీ కృష్ణ స్వామిని అందం గా చందం గా జయ కృష్ణా ముకుందా మురారే అని గానం చేస్తూ- అక్కడ
గుజరాతు దేశం లో శ్రీ శ్రీ శ్రీ మోడీ గారు కృష్ణుడి కి రాస్తా చూపిస్తూ 'రాస్తా క్లీనింగ్' గావించారు.


మన అరవ తంబి లు కృష్ణుడి గురించి చెప్పాలంటే - కృష్ణా ము కందా ము రారే అనక మానరు  

కృష్ణుడి లో కూడా వారు 'కందు డిని చూడ వలసినదే ! ఎందుకంటే - సుబ్రహ్మణ్య స్వామీ అదే 'మురుగా' జీ 'తమిళ్ ' కడవుల్ ' (అరవ దేవుడని అనువాదం చేసుకోవచ్చా? ) ! కృష్ణుడి గురించి చెప్పినా రాముడి గురించి చెప్పినా మురుగా ని కలప కుండా చెప్ప కూడ దన్న మాట ! మురుగా ని తలవ కుండా ఎ దేవుడిని తలవ కూడ దన్న మాట !

అందుకే - హే కృష్ణా ము 'కందా' ము 'రారే' - అంటే కృష్ణా రా , కాని 'మా' కందుడి తో నే రావాలి సుమా అని అల్టిమేటం ఇవ్వడం అన్న మాట !

గోవిందా గోవిందా అన్నా కూడ - తిరుప్పతి పెరుమాళ్ళు - మా అరవ దేవరే సుమా - ఆండాళ్ళు లేక పోతే ఆ కొండ దేవరికి ఆ మాత్రం పేరు వచ్చి ఉండేదా?

ఈ పద్మ నాభ తిరువనంత పురం దేవాలయ రత్న మాణిక్యాలు - బంగారాలు ఆభరణాలు ఘనం గా వెలుగు లోకి వచ్చాక అయినా - మా చిత్తూరి స్వామీ ఏడు కొండల వెంకన్న గారు తమ ఆదాయాన్ని - బంగారు నగల జాబితాలని వెలుగు లోకి పూర్తి గా తెచ్చి తమ 'ఇజ్జతు' మరీ మరీ చాటి చెప్పు కోవాలని తి తి దే వారు ఈ విషయాన్ని తీవ్రం గా ఆలో 'చించ' వలె నని జిలేబి విన్నపం !


చీర్స్
జిలేబి.