Friday, December 14, 2012

ఔను వాళ్ళిద్దరూ 'వాడి' పోలేదు ! (ఔను వాళ్ళిద్దరూ విడి పోయారు - భాగం రెండు )


"అయ్యరు  వాళ్  నాకు విడాకులు కావాలి" మా అయ్యరు  గారి చెవిలో పోరు పెట్టు కుని చెప్పా. చెప్పా అనడం కన్నా ఆర్డర్ వేసా అని అనడం సబబు.

'దానికేమోయ్ , విడి ఆకులే కదా మన పత్తి  శెట్టి గారి కొట్టు కెళ్ళి  పట్టు కొస్తా , ఈ మధ్య విడాకులు రావటం లేదట , మార్కెట్ లో, కుట్టిన విస్తరాకుల నించి పుల్లల్ని తీసి విడాకులు ఇవ్వమం టా '  అన్నారు మా అయ్యరు  గారు

నాకు భలే కోపమొచ్చింది.

'ఆయ్ , విడాకులు అంటే వేళా  కోళ మై పోయిందా మీకు ' ఇంతెత్తు కు ఎగిరా .

వారి ముందు లాపు టాపు  పెట్టి, బులుసు వారి టపా చూపించా.

'అసలే నాకు కళ్ళు కనబడి చావడం లేదే ఇట్లా తెలుగు బ్లాగులు చదవటమంటే ఎట్లాగే ? అని మసక బడ్డ కళ్ళా ద్దల లోంచి చూసేరు.

చ, చ, ఈ సోడా బుడ్డి నా నే ప్రేమించింది అని నన్ను నేనే తిట్టు కున్నా.

'ఏమోయ్, జిలేబీ, ఏమన్నా నన్నన్నావా ఇప్పుడు ' ఓ చెవి నా వైపు పెట్టి కొంత ప్రశ్నా మార్కు పెట్టేరు అయ్యరు .

చ, చ, ఈ మానవుడికి చెవులు కూడా వినిపించడం లేదు మరీ పోను పోను.

'మళ్ళీ, చెవిలో గట్టిగా చెప్పా, 'నాకు విడాకులు కావాలి '

ఈ మారు కొంప మునిగేటట్టు ఉందని ఓపిగ్గా, టపా చదివేరు అయ్యరు .

'ప్రభావతీ ప్రద్యుమ్నుల్లా మనమూ విడి పోదామం టా వేమిటే  ? ' అడిగేరు .

హమ్మయ్య ఇప్పటికి ఈ మట్టి బుర్ర లో ట్యూబు లైటు వెలిగింది అని సంతోష పడి  పోయి, 'అవునని' తలూపా.

'అదేమిటే నువ్వట్లా, వెళ్లి పొతే నీకు వంటా వార్పూ చేసి పెట్టేదెవరే  మరి ? '

'అబ్బా, ఈయనికి హోటలు బిజినెస్సు, వంటా వార్పూ వచ్చని ఇన్నేళ్ళు గా వంట చెయ్యడం నేర్చుకోక పోవడం, ఎంత తప్పై  పోయింది సుమీ ' అని బిక్కు మని, కొంత, సేద తీరుకుని,' ఆ, ఏముందీ, ఆ ఓల్డ్ ఏజ్ హొమ్ లో వాళ్ళే, గంట కొట్టి భోజనం పెడతారులే ' అన్నా.

అన్నా గాని, మా అయ్యరు  గారిలా వంట చేస్తారేమో వారు తెలీలే. ఎంతైనా, ప్రభావతీ ఉంటుంది కదా కాస్త మాట తోడూ ఉంటుంది  అనుకుని, కొంత ఊరట పడ్డా.

'సర్లేవే, నువ్వడి గినది నేన్నెడైనా  కాదన్నా నా. అట్లాగే విడి పోయి ఉంటాం లే. ' అంటా  రని  కొంత ఆశ తో ఎదురు చూసా.

చెళ్ళు  మని, చెంపకాయ దెబ్బ పడింది.

'మీ ఆండోల్లకి చదువు నేర్పించట మంత  బుద్ధి తక్కువ పని వేరే ఏమీ లేదు ' సూటిగా చూసేరు అయ్యరు  గారు.

అవాక్కై పోయా.

ఈ మాట అయ్యరు  గారేనా, అదీ, జిలేబీ తోనే నా అన్నది ? హమ్మో, కొంత దడ  పుట్టింది.

జీవన వసంతం లో , తను చెప్పింది ఎప్పుడూ జవదాటని, రామచంద్రుడు, ఇవ్వాళ, సీతమ్మ తల్లికి ఎదురు చెబ్తాడా అని కుడి కన్ను అదిరింది

'ఇదిగో, చూడవోయ్ జిలేబీ, ఏదో బ్లాగులు, టపాలు రాసుకుంటూ టీం పాస్ టైం  పాస్ చేసుకుంటూ, ఏదో 'ఉద్యోగం 'ఇస్త్రీ' లక్షణం' అని చెబ్తే, పోనీ లే ఊరుకున్నా. ఇట్లా విడాకులూ, పెడాకులూ  అన్నా వంటే, నీ ఒళ్ళు పెట్రేగి పోతుంది' ఈ మారు కొంత సీరియస్ గా చెప్పేరు

అబ్బా, ఈ పురుషాహంకారం వీళ్ళకి తగ్గనే  తగ్గదు సుమీ ' అని ఉస్సూరు మన్నా.

అంతే  నంటారా ? విడాకులు ఇవ్వరా మరి ?

'జిలేబీ, నీకు విశ్రాంతే  కావా లను కుంటే, ఇంట్లో కూర్చుని వంటా వార్పూ చేసుకో. ఉద్యోగం మానేయ్ '

హమ్మో, వంటా వార్పే, వద్దే వద్దు సుమీ ! , ఈ ఉద్యోగమేదో చేసుకుని అయ్యరు  గారి మీద ఆజమాయిషీ చేసుకుంటూ ఉండటమే బెటరు ! ఏదో ఒక్క ముక్క 'విడాకు' కోసం ఇట్లాంటి సౌలభ్య మైన 'భరించు వాడు' భర్త
ని పోగుట్టు కోవ డమా ! వద్దే వద్దనుకుని'

అయ్యరు  వాళ్ , ఇవ్వాల్టి 'సమయల్ ' ఏమిటి ? మళ్ళీ ఆర్డర్ వేసా.

నీకిష్టమైనా జిలేబీ చేశా నోయ్ ~

అబ్బా, ఈ పెనిమిటి ప్రెభువులు  మన మూడ్ ని బట్టి తాజా మరీ చేస్తారు సుమీ అనుకుని, నోరు వెళ్ళ  బెట్టేసా.


చీర్స్
జిలేబి.

Thursday, December 13, 2012

చాగంటి జిలేబీయం - విశాఖా విశేషాలు

చాగంటి జిలేబీయం - విశాఖా విశేషాలు

ఈ మహానుభావుడు జిలేబీ  'కాలం' లో తప్పి పుట్టాడు సుమీ అనుకున్నా.

చాగంటి వారి ధర్మసోపానం ప్రవచనం విన్నాక జిలేబీ రాయక పొతే, అదీను అమావాస్య నాడు టపా ముట్టక పోతే తప్పే తప్పు అదీ కాకుండా, శ్రీ కష్టే ఫలీ బ్లాగ్ 'గారడీ' గాంధీ గారు , వనజ వనమాలీ గారు జిలేబీ ని తలచిన శుభ దినమాయే కూడాను ఇవ్వాళ ! మరి !

ఓ నాలుగు రోజులు పై బడి శ్రీ చాగంటీ వారి ప్రవచనాన్ని విన్న తరువాయి 'కర్ణములు ' హోరెత్తి పోయేయి.

భద్రం కర్ణే భి శృణు యామ దేవా అని ఊరికే చెప్పారా ఋగ్వేదం  లో  మరి ?

ఇంతకీ వీరికి ఈ వాక్పటిమ ఎట్లా అబ్బింది సుమీ అని అబ్బుర పడి పోయా !

మనకు ఒక్క వాక్యం రాయాలంటే నే అంత కష్టం గా ఉన్నదే మరి , ఈయన ఒక్క పదం తప్ప కుండా ఇట్లాంటి పొడుగాటి వాక్యాలు ధారాళంగా , అలవోకగా అల్లుకు పోతాడే సుమీ అని మా అయ్యరు  గారిని అడిగా

ఏమండీ ఇదెట్లా వీరు అనర్గళం గా అల్లుకు పోగలుగుతారు  ? అన్నా

'వాక్శుద్ది  మనో నైర్మల్యానికి సిద్ది ప్రతీక '  అని ఒక్క ముక్క లో చెప్పేసేరు నాకర్థం అయ్యే రీతిలో అయ్యరు  గారు.

సరే,ఏది ఏమైనా వీరు జిలేబీ సమకాలీకులు గా వడం  జిలేబీ చేసు కున్న పుణ్యం సుమీ అని సంతోష పడి పోయా !

అట్లాగే మన పంచ దశ లోకం లో అలవోకగా టపాలు రాసి గారడీ  చేసే శ్రీ కాలక్షేపం శర్మ గారు ఓ సంవత్సరం పై బడి దినం తప్పక టపాలు రాసేరు కూడాను !

అబ్బో, ఈ గోదావరి తీరం వాళ్ళని గురించి ఎంత రాసినా తక్కువే సుమండీ మరి !

చాగంటి వారు కూడా గోదావరీ తీరం వారేనా ?

ఇంతకీ , మాయన్ కాలెండరు ఇరవై ఒకటి రావడానికి ఇవ్వాళ అమావాస్య  సంసిద్ది పడు తోంది ! వేచి చూడాలి మరి .(ఆలోచనా తరంగాలు సత్య నారాయణ శర్మ గారు ఏమి చెబ్తారో మరి !)


స్వస్తినః  పూశాః విశ్వ వేదాః !


జిలేబి

Sunday, November 25, 2012

బోల్ జిలేబీ !


మీ పేరేమిటి ?

జిలేబి .

అదేమిటీ ముసల్మాను పేరా ?

జిలేబీ స్వచ్చమైన పేరు !

అట్లా కాదు లెండి, ఈ జిలేబీ అన్నది ముసల్మానులు మన దేశానికి వచ్చేక వారితో బాటు వచ్చిన చిరు తిండి గదా ఇట్లా మీరు జిలేబీ అంటే , కొంత సందేహం వచ్చింది

మాకో కజిన్ ఉన్నదండోయ్ , దాని పేరు....

దాని పేరు ?

జిల్లాలంగడి జాంగ్రి !

వాట్ !

వాట్ కాదు, జాంగ్రీ!

అదీ ముసల్మాను పేరే ?

అదేమిటండీ ఎ పేరన్నా ముసల్మానే అంటారు ? పోనీ బాదుషా పెట్టుకో మంటారా ?

బాదుషా ? నా !

పోనీ కోవా ? పాల కోవా ?

కోవా ?

వ్వా, వ్వా, ఏ  పేరు పెట్టుకున్నా ఎదో ఒక వంక పెడతారే !మరి


 సరే, తిరుపతి లడ్డు, పయణి పంచామృతం ఇట్లా ఏమన్నా పెట్టు కో మంటా రా ?

వద్దు లెండి!

సరే అఅయితే, మీరే ఏదో  ఒక పేరు తగలేట్టండీ మరి !


చీర్స్
జిలేబి

Friday, November 23, 2012

మిటాయి పొట్లం కాగితం వెర్సెస్ బిట్స్ అండ్ బైట్స్ !

మిటాయి పొట్లం కాగితం  వెర్సెస్ బిట్స్ అండ్ బైట్స్ !

'ఏమోయ్ జిలేబీ పూర్వాశ్రమం లో నీ కళా 'ఖండా లని' పత్రిక, జ్యోతీ లలో చూసు కోవాలని అహరహము కష్ట పడే దానివి. ఈ మధ్య ఆ వైపే వెళ్ళడం లేదేమిటి ?' అడిగారు మా అయ్యరు  గారు.

'మిటాయి పొట్లం' కాగితాలకి విలువ పొయిం దండీ అన్నా దర్జా గా.

ఏమిటోయ్  విషయం?

'కొన్నేళ్ళ క్రితం 'స్వాతి'  మార్కెట్ కొచ్చి పత్రిక జ్యోతీ లని ఎట్లా ఊడ బెరికిం దండీ ?'

'ఏముందీ వాడు మిటాయి పొట్లాన్ని 'మిర్చీ పొట్లం' గా, 'సాఫ్ట్' సయనాగారపు రసరమ్య వేణీ  గా 'దక్' దక్ దక్ నే లగా  మేరా దిల్ ... మోర్ నే లగా గా బాజీగర్ చేసేడు' చెప్పారు ఆలోచించి.

కాదా ? అంటే, హాల్ టేబుల్ టాప్ స్టేటస్ సింబల్ పత్రిక, ఒడిలో సయ్యాట లాడింది, కొంత కాలం దాక హాల్ టేబుల్ టాప్  పై పెడితే 'అబ్బే, వీరు ప్లే బాయ్ చదువు తారండో య్ అన్నట్లు అయ్యింది. ప్లే బాయ్ గొప్పదనం అప్పుడు ఏమిటి? స్వీప్ ది మార్కెట్ , కాదా మరి?

ఇప్పుడు భళీ బ్లాగులు, నా జిలేబీ లని వేసుకోవడానికి తీరిగ్గా నా సమయం లో రాసుకోవ డానికి  అసలు ప్రచురిస్తారా , లేదా అని 'చింత' లేకుండా మనకు మనమే రాసేసు కుంటూ ఆహ్ ఈ పాటి సౌలభ్యం ఇంకే మైనా ఉందం టారా  ? ' అడిగా.

కాదా మరి ?

కాబట్టి, మిర్చీ పొట్లం కాగితం హుష్ కాకీ !

మరి ఈ బిట్స్ అండ్ బైట్స్ చాన్నాళ్ళు ఉంటుం దంటావా ? ఆ అమెరికా వాడు దివాలా తీస్తే నీ గతేం గాను ?

'ఆ మనం రాసే రాతలకి ఏ 'గో' 'దారి' అయితే నేం ? అయితే మిటాయి పొట్లం కాగితం . కాకుంటే లాస్ అఫ్ బిట్స్ అండ్ అండ్ బైట్స్ అంతే గదా !' కాల గతిలో అన్నీ ఎనెర్జీ ఫార్మ్స్ మాత్రమె గదా ? 'energy can neither be created nor destroyed'!


(వనజ వనమాలీ గారి టపా చదివాక!)


చీర్స్
జిలేబి.

Wednesday, November 21, 2012

ధమాల్ ధమాల్ డబాల్ డబాల్ !

ధమాల్ ధమాల్ డబాల్ డబాల్ !

ఏమోయ్ మనవడా, అంత విచారం గా ఉన్నావ్ ? అడిగా మా వాణ్ని, ఇంటికి వస్తూనే ఉస్సురు మన్నాడు వాడు.

వచ్చింది అర్ధ రేతిరి దాటి.

చేసే పని 'పాడు' మాలిన (పని పాటా లేని అనాలా లేక పాడు మాలిన పని అనాలా?) ఐటీ ఉద్యోగం. దేశాన్ని  అభివృద్ధి కి తెచ్చిన 'సాఫ్ట్ 'వేరు' బ్యాక్ ప్యాకు మానవుడు!

'ప్చ్' అన్నాడు.

ఏమిరా అన్నా?

'నేను ప్రో ఏక్టివ్ కాదటే ' అన్నాడు వాడు.

అంటే ఏంట్రా మనవడా ? అడిగా.

' అంటే, నేనన్ని ట్లో నా అంతగా చొరవ గా దూసు కెళ్ళడం లేదటే ? '

అంటే ?

అంటే, తెల్ల మొగం పెట్టాడు వాడు.

పోనీ లేరా భోజనం చేసి పడుకో  అన్నా

ఆకలి లేదే అన్నాడు ' ఈ ఇయర్ నా బోనస్ ధమాల్ ధమాల్ డబాల్ డబాలే' విచారం గా ముఖం పెట్టేడు.

వాణ్ని గమనించా.

నిండా ఇరవై నాలుగు కూడా దాటలేదు. మానవుడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. నడి సంద్రం లో నావ లా, చుక్కాని లేని పడవలా తెల్ల ముఖం పెట్టి ఉన్నాడు. ప్రపంచం లో ని భారం మొత్తం వాడి తల మీదే ఉన్నట్టు ఉంది.!

ప్చ్..

"We had everything, twenty years go, but just little of everything and yet we were happy. Now, we have more of everything, but little is gratifying the soul"

జిలేబి.

Monday, November 19, 2012

చాతుర్మాస్య జిలేబీ వ్రతం !


"ఏమిరా అబ్బిగా, ఈ మధ్య ఊళ్లూ ఊళ్లూ చుడుతూ గొప్ప సన్యాసి వై పోయావట ? " అడిగా, చిన్నప్పుడు చూసిన ఏబ్రాసి వెధవ అనబడే మా ఊరబ్బాయి ఈ మధ్య పెద్ద సన్నాసి అయిపోయాడని తెలిసి వాణ్ని  కలిసి అడిగా .

వామ్మో, జిలేబమ్మ తల్లీ మీరా అన్నాడు వాడు కనబడీ కనబడంగా నే!

అవునోయ్ నేనే అన్నా

ఎట్లా మీ దర్శనం ఈ దేశం కాని దేశం లో అన్నాడు మాట తప్పించి.

"ఏమీ లేదోయ్, మీ భాష లో చెప్పా లంటే చాతుర్మాస్య వ్రతం ! ఓ నాలుగు నెలలు ఇక్కడ ఉండి పోదామని వస్తే, మనవడు చెప్పేడు ఏబ్రాసి సన్నాసి కూడా ఈ ఊళ్ళో నే ఉన్నాడు బామ్మా అని. పోదారి మనూరి బుడతడే కదా చూసి పోదామని ఇట్లా వచ్చా " చెప్పా.

'సరే ఎట్లాగూ వచ్చావు కదా తల్లీ, నా ఉపన్యాసం ఉంది విని మరీ వెళ్ళు'  అన్నాడు ఆప్యాయత తో.

'నువ్వు చెప్పి నేను వినాలట్రా ఏబ్రాసీ ' అనబోయి ఏ పుట్టలో ఏ  పాముందో మా ఏడు కొండల పెరుమాళ్ళ కే ఎరుక అనుకుని 'అట్లాగే లేరా అనబోయి, ప్రక్కన ఎవరో పెద్దాయన మరీ వంగి పోయి స్వామీ వారికి నమస్కారం చేస్తూం టే , బాగోదని , సభా మర్యాద గా, అట్లాగే స్వామీ అన్నా!

వాడు నవ్వాడు. 'ఏమి తల్లీ, నామోషీ పడి పోయావు, అట్లాగే లేరా అని ఉండ వచ్చు గా! అందరూ నన్ను గౌరవిస్తా వుంటే నా తల తిక్క మరీ బిగిసి పోదూ. ఇట్లా ఆప్యాయత తో 'రా' అని పిలిపించు కోవడం చాలా నాళ్లా యే ! గౌరవ స్థానపు ఇక్కట్లు' అన్నాడు.

ఓ మారు నింపాదిగా చూసా ఏబ్రాసి వైపు. నిండా ముప్పై ఏళ్ళూ  లేవు. స్వామీ అయిపోనాడు. ప్చ్ అన్నీ గౌరవ సంబోధన లే మరి!

కొంత విచారం వేసి,  'అట్లాగే లేరా అబ్బీ' అన్నా 'నీ ఉపన్యాసం విని ఆ పైనే పోతా' అన్నా.

సంతోష పడ్డాడు అబ్బాయి.

'ఉపన్యాస ప్రారంభం లో మా గొప్ప గా, నా గురించి చెప్పి, 'ఈ తల్లి ఇక్కడ ఉండడం చూస్తూంటే నా తల్లి ఆశీర్వచనాలే సుమీ! వేలాది మైళ్ళు దాటి వచ్చినా మన ఊరి వారిని మన దగ్గరికి పంపించింది ఆ తల్లి అన్నాడు.!

వామ్మో, వీడు మరీ నిజంగానే వేదాంతి అయిపోయేడు సుమీ అనుకున్నా !

ఏమైనా, మన ఊరి వాళ్ళు ఇట్లా ఏ  ఫీల్డ్ లో నైనా గొప్పగా పై కొస్తే, మనకు సంతోష మే కదా మరి!

ఓకే, ఇంతటి తో చాతుర్మాస్య జిలేబీ 'వ్రాత' కథ ఇంతటి తో పరి సమాప్తం !

 శుభోదయం!

చీర్స్
జిలేబి. 
(The World is round, it has no point!)

Tuesday, November 13, 2012

రామ్, చట్ , మ (ర) లా నీ (పై) కంప్లైంట్!


శ్రీ రామచంద్ర ప్రభువు మళ్ళీ తల పట్టు కున్నాడు. అబ్బా తల నొప్పి అంటూ !

సీతమ్మ చూసింది.

'కుశ లవ్ కీ మా'  అని సంబోధించాడు సీతనుద్దే శించి.

స్వామీ అన్నది అమ్మ వారు!

'తప్పైపోయి నిన్ను నేను ఒక్క సారి అడవులకి పంపి మరీ తప్పు చేసాను సుమీ ! జన్మ జన్మలకీ ఈ కారణం పట్టు కుని నన్ను శాంతి గా ఉండనివ్వ నంటున్నారు ఈ నరులు ' వాపోయాడు రామభద్రుడు. 'అవ్వా ళ  ఆ మడవాలి  మాట వినకుండా  ఇప్పటి రాజకీయ నాయకుల్లా ఉండి  'వాడెవడో చస్తే నా కేంటంట అన్నట్టు ఉండి  పోయి ఉండాల్సిం ది ' నిట్టూర్చాడు.

సీతమ్మ విచారం గా చూసింది.

పాపం స్వామీ వారు.

అడవులకి వెళ్ళిన తనే వగచ లేదు.

ఏమి జరిగిందో అది రాసి ఊరుకున్నాడు ఆ  వాల్మీకి.

దాన్ని 'వినుడు, వినుడోయీ రామాయణ గాధ ' అని పుత్ర రత్నములు కూడా 'టాం టాం ' కొట్టేసేరు'!

అన్నీ కలిపి స్వామీ వారిని యుగ యుగ ములకీ వదిలి పెట్టె టట్టు  లేదు మరి , వారి పై అభాండాలు !

'స్వామీ, బాధ పడకండి. దాన్ని 'కాంపెన్సేట్' చేయడానికే కదా,కృష్ణా వతారం లో మిమ్మల్ని కోరుకున్న వారినేవ్వరినీ మీరు కాదన లేదు ?" ముసి ముసి నవ్వులు చిందించింది అమ్మ వారు. ద్వాపర లో తన పరిణయం గుర్తు కొచ్చి మరీ సిగ్గు మొగ్గై పోయింది.

'ప్రాణే శ్వరీ , ఆ జన్మ మాత్రం ఆరోపణ లకి గురి కాలేదా ఈ మానవ మాత్రుల చేత ' మళ్ళీ వాపోయాడు రామచంద్రుడు.

'స్వామీ , అదియే కదా 'స్త్రీ' సిరి ! మీరు మమ్మల్ని ఏడిపించినా , మేము మిమ్మల్ని ఏడి పించినా , కాల గతి లో మీ పైకే ఆరోపణ లన్నీ వస్తాయి ' ఈ మారు అమ్మవారు మరీ ఆలోచించి చెప్పంది .

'ఎందు కంటావ్ ? ' అన్నట్టు చూసాడు  భోళా  రాముల వారు.

'ఏ  కాలం లో నైనా ఓ మగ వాడు , ఓ స్త్రీని తక్కువ గా చెప్పి ఇంటి కెళ్ళి బతికి బట్ట కడతా డంటారా  వాడికి తిండి ఇంట  ఆ ఇల్లాలు పెడు తుం దంటా రా ?' అడిగింది సీతమ్మ. 

' అవునోయ్, ఈ విషయం నాకు తట్ట లేదు సుమీ!

"ప్చ్ ఆ మానవుడికి ఇంట్లో తెల్లారి టిఫిను పెట్టలేదేమో వాళ్ళావిడ! కొంత ఆవిణ్ణి  ఖుషీ చెయ్యడా నికి ఇట్లా చెప్పి ఇంటి కెళ్ళి ఉంటాడు, కనీసం 'చారన్నమైనా' దొరక్క పోదా అనుకుంటూ '  "

శ్రీ రాముడి ముఖం తేట బడింది. చింత వదిలింది.

'సీతమ్మ గుంభన గా నవ్వింది. ' ఈ మగ రాయుళ్ళ 'దిమాగ్' ఇట్లా గడ్డి పోచలా ఉంటుందెందుకో  మరి ! ఓ నిమిషం లో డీలా పడి  పోతారు. మరో నిమిషం లో శ్రీ మతి కొంత ఊరట కలిగిస్తే మళ్ళీ మన లోకం లోకి పడతారు !'

అంతా  విష్ణు మాయ మరి !


దీపావళీ శుభాకాంక్షల తో -

యా దేవీ సర్వ భూతేషు ... ఇవ్వాళే  'మా సత్య' శ్రీ కృష్ణుని సాక్షి గా నరకాసురుడి  సంహారం గావిం చిందట !

శుభోదయం !
భళీ !!
జిలేబీవళీ !!!

Sunday, November 11, 2012

సోది చెబుతా నమ్మ సోది!

సోది చెబుతా నమ్మ సోది!

మీ పేరు జిలేబి.

ఓహ్ 

మీ వారి పేరు జంబు నాధన్ కృష్ణస్వామి అయ్యరు 

ఆహ్ 

మీరు యాభై  సంవత్సరాల వయసు పైబడ్డ వారు.

చ ఛ నో !

మీ పెళ్లి ఓ మోస్తరు ప్రేమ వివాహం 

సిగ్గే సింగారం!

మీరు ఆస్సాము లో పనిజేసారు చాలా కాలం పాటు.

ఓహ్ మై గాడ్ ! మీకు నా గురించి చాలా తెలుసే?

ఆ మధ్య మీరు సబ్బాటికల్ లో వెళ్ళారు.

This is too much!


మీకు స్విట్జెర్లాండ్ లో హోటలు ఉంది. మీకు స్విజ్జు లావాదేవీ లు ఉన్నాయ్!

oh my god! french leaks!

మీ అయ్యరు గారంటే మీకు మరీ ప్రేమ దోమ 

అవునోయ్ ! కాదంటా నా ?

మీకు మనవళ్ళు  మనవరాళ్ళూ ఉన్నారు.

ఈ విషయం ఎట్లా తెలుసు మీకు!

మీరు సెయింట్ మేరీ కాలేజీ లో  పట్టా పుచ్చు కున్నారు.

ఓహ్ !

మీకు రాబోయే సంవత్సరం లో రిటైర్మెంటు 

మై గాడ్!

మీ మనవరాలి పెళ్లి వేటలో మీరున్నారు.

Thats correct How the hell you know !

కాని మీ మనవరాలికి  ఆల్రెడీ బాయ్ ఫ్రెండు ఉన్నాడు!

This is too much !

ఇవ్వాళ తెల్లారి మీరు క్లోజ్ అప్ టూత్ బ్రెష్ తో కోల్గేట్ టూత్ పేస్ట్ వేసి, పళ్ళు తోమారు !

How the hell you know that!

రేపు మీరు చికాగో కి ముంబై నించి ఫ్లైట్ పడుతున్నారు ! మీ విసా ఇవ్వాళ రావాలి 

కరెక్ట్! ఎట్లా తెలుసు మీకు !

మీ గురించి ఇంకా చెప్పా లంటారా ?

వద్దే వద్దు! ఓహ్ గాడ్ ! వాట్ ఎ నెట్ వరల్డ్!

మీకు బ్లాగేశ్వరి బజ్జేశ్వరి అన్న కజిన్ సిస్టర్లు ఉన్నారు. మీకు ట్వీ ట ర రాజా అనబడే కజిన్ బ్రదర్ ఉన్నాడు!

They know about me in detail! My goodness I am still alive!


(ఓ ఫేస్ బుక్ కథ!)

చీర్స్ 
జిలేబి 

Thursday, November 8, 2012

వ్యాఖ్యల లో ఉంది మజా, అది చదివితే తెలియును లే!

వ్యాఖ్యల లో ఉంది మజా, అది చదివి అనుభవించితే  తెలియును లే! !

ఈ మధ్య ఎవరో ఒక అజ్ఞాత మానవుడు శంకరాభరణం బ్లాగు కామెంట్లు వ్యాఖ్యల పేజీ లో ఎక్కువై పోయిందని పేచీ పెట్టాడు!

మొదట్లో చాలా సీరియస్ గా బ్లాగులు గట్రా చదివే దాన్ని. ఆ పై ఈ వ్యాఖల పేజీ కనబడింది. ఏమిటో అని చూస్తే, కొన్ని రోజుల తరువాయి బ్లాగుల లిస్టు కన్నా ఈ వ్యాఖ్యల పేజీయే  మరీ రంజు గా ఉన్నట్టు అనిపించింది.

వా హ్ వా హ్  అనుకున్నా.

ఈ వ్యాఖ్యలు ఇచ్చే కిక్కు బ్లాగ్ టపా కూడా ఇవ్వదేమో మరి అన్నంత గా వ్యాఖ్యలు మాత్రమె చదివే దాన్ని.

ఈ పైత్యం నాకు మాత్రమె ఉందనుకున్నా !

కాదన్నమాట !

వ్యాఖ్యలు చదవి టపా చదివే వాళ్ళూ ఉన్నారన్న మాట నాలా మరి ! ఈ కేటగరీ వాళ్ళే ఎక్కువేమో మరి ? అగ్రిగేటర్ వాళ్ళు (మా హారం రెడ్డి గారి లాంటి వాళ్ళు, కాకుంటే సంకలిని శాస్త్రీ ) ఏమైనా ఓ 'విచారణ' కమిటీ వేసి ఈ విషయం తేల్చి చెప్పితే బాగుణ్ణు ! కామెంటు పేజీలకి ఎక్కువ  క్లిక్కులు వస్తాయా లేక బ్లాగు పేజీ కి ఎక్కువ క్లిక్కులు వస్తాయా అని అన్న మాట !

ఆ మధ్య 'ప్రవీణుడు' వరసబెట్టి కామెంటులు రాసే వాడు. ఈ మధ్య ఈ అబ్బాయి మరీ కనిపించటం లేదు మరి ! ఏమయ్యాడో మరి ప్చ్ !  అసలు ప్రవీణుడి కామెంట్లు లేక కామెంటు పేజీ లు మరీ 'సన్న' బడి పోయేయి !

సో,
వ్యాఖ్యల లో ఉంది మజా, అది చదివితే తెలియును లే!

అబ్బా, చూడండి, కామెంట్లకి ఎంత పవరు ఉందో, కామెంటు చదివి ఓ టపా రాసేసా నొచ్!

దురదస్య దురదః జిలేబీ నామ్యాః దురద గొంటాకు హ!


చీర్స్
జిలేబి.

Friday, November 2, 2012

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ పూర్వ జన్మ లో జిలేబీ ఎవరు ?


నేనెవరు అన్నారు రమణ మహర్షి వారు . who am I ?

నేనెవరు ? అన్నా మా అయ్యరు గారితో.

జిలేబీ అన్నారు వారు.

మరి పూర్వ జన్మలో నేనెవరిని ?

చచ్చాం పో. ఏడడుగుల బంధం ఏడు జన్మల బంధం. కాబట్టి పూర్వ జన్మలో కూడా నీవె నా జిలేబీ వేమో ? అన్నారు శ్రీ వారు.

అంతే  నంటారా ?

కాదనడానికి నాకు ధైర్యం చాలడం లేదు సుమీ అన్నారు అయ్యరు  గారు ! జిలేబీ యా మజాకా మరి ?

జోక్స్ అపార్ట్,, చాలా సీరియస్ టపా ఇది. పూర్వ జన్మలో మీ రెవరు అని తెలుసు కోవటం ఎలా ? అసలు పూర్వ జన్మ అంటూ ఉందా ? (ఉందనే వాదన ఎక్కువే మరి కాబట్టి ఉంది అనుకోవాలి )

ఈ ప్రశ్న ఎందు కొచ్చింది అంటారా ? శ్రీ సత్యనారాయణ శర్మ గారి పునర్జన్మలు - అప్పనాచార్య సర్ థామస్ మన్రో ఒక్కరేనా అన్న టపా చదివాకా మరి !

ఈ విషయం మీద చాలా రీసెర్చ్ అమెరికా లో జరిగినంతగా ఇంకెక్కడా జరిగి ఉండదేమో మరి. ఆ మద్య మా హిందూ వారు పాస్ట్ లైఫ్ ఆఫ్ గ్రేట్ మెన్ మీద ఒక పుస్తకం రివ్యు చేసారు. అందులో మన అబ్దుల్ కలాం గారు ఇంతకు మునుపు జన్మలో ఏమై ఉండే వారని ఆ పుస్తక రచయిత విశ్లేషించారు . అంతే  కాక జవహర్ లాల్ నెహ్రు గురించి కూడా విశ్లేషించి నట్టు గుర్తు.

అట్లా , ఈ విషయం కొంత సీరియస్ గా ఆలోచించ వలసిన విషయం మరి ! ఏమంటారు మరి ?

సరే ఈ విషయం లో స్వామీ శివానంద (డివైన్ లైఫ్  సొసైటీ సంస్థాపకులు ) గురించి చదివిన ఓ సంఘటన ఇక్కడ రాసి నేనూ గాయబ్ అవుతాను మరి !

స్వామీ గారిని ఓ విదేశీయుడు అడిగాడట (ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఈ విదీశీయులకి ఎట్లా తడతాయో మరి ?) - పూర్వ జన్మలో నేనెవరో ఎట్లా తెలుసు కోవడం అని ? అందుకు స్వామీ గారు , పూర్వ జన్మ గురించి నీ కెందుకోయ్ , మరిచి పోయి, ఈ జన్మలో నువ్వేం చెయ్యాలో అది చూడు అంటే, వాడు కుదరదు నాకది తెలుసుకోవాలి అని పట్టు బడితే నువ్వు డైరీ రాయడం మొదలెట్టు అంటే ఇవ్వాళి టి వి ఇవ్వాళ రాయి. రేపు రేపటికి ఇవ్వాళి టికీ చేర్చి రాయి. వారాంతం లో ఆ వారం మొత్తం మీదా కలిపి రాయి. ఇట్లా రాసుకుంటూ పోతే అంటే ఓ సంవత్సరం పాటు చేయి. వారాంతం లో ఆ వారం జరిగిన వాటిలో నీకు గుర్తు ఎంత ఉండేదో చూడు. ఇట్లా చేసుకుంటూ పోతే నీ జ్ఞాపక శక్తి పెరుగు తుంది. అంటే నీ మెదడు పదును పట్టిందన్న మాట . ఆ పై నీకు పూర్వ జన్మ జ్ఞాపకాన్ని బయటికి తీయడానికి వీలవ్వొచ్చు  అన్నారట !

మరి ప్రయత్నించి చూద్డా మంటారా ?

శుభోదయం !

చీర్స్
జిలేబి.