Saturday, November 14, 2020

దీపావళీయము

 

బ్లాగ్ బాంధవులకు


కర్మ వశాత్తు జీవితంలో

పంచదశలోకంలో

కలిసి సంబరాలు

చేసుకుంటున్న 

అందరికి


ఈ దీపావళి ఇప్పటి

సంక్లిష్ట పరిస్థితి నుండి

మానవాళిని

తప్పిస్తుందన్న 

ఆశాభావంతో


దీపాలు వెలుగ వలె నీ

శాపమగు కరోన తొలగి, చక్కగ మెరుగై

వ్యాపారములు, పరమపద

సోపానపు బతుకు బండి సొబగుగ కడచన్!శుభాకాంక్షలతో

జిలేబి

14-11-2020.


14 comments:

 1. మీకు, తదితర బ్లాగుమిత్రులకు కూడా దీపావళి శుభాకాంక్షలు, “జిలేబి” గారు.

  ReplyDelete
 2. ఖర్మవశాత్తు జీవితంలో

  పంచదశలోకంలో

  కలిసి సంబరాలు

  చేసుకుంటున్న

  అందరికి దీపావళి శుభాకాంక్షలు !

  ReplyDelete
  Replies
  1. ఓహో, బహుకాల దర్శనం, నీహారిక గారూ. అడపా దడపా మాత్రమే కనిపిస్తున్నారు బ్లాగుల్లో?

   పంచదశలోకంలో తిరుగాడటం మరీ అంత ఖర్మేమీ కాదనుకుంటానులెండి 🙂.

   మీకు, మీ కుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు.

   Delete
  2. ధన్యవాదాలు vnr sir. మీకు, మీ కుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు.

   Delete


 3. పంచదశలోకమును సే
  వించుకొనుచు బ్లాగులెల్ల విరివిగ నడయా
  డెంచక్కగ చదువుకొనుచు
  మించారెడు భాగ్యమెవరి కేదొరకు భువిన్

  జిలేబి

  ReplyDelete
 4. అందరికీ దీపావళి శుభాకాంక్షలు💐

  ReplyDelete
 5. ఓం చిచ్చు బుడ్డీయం నమః తుస్ తుస్ సమర్పయామి
  ఓం కాకర పువత్యీయం నమః చట్ చట్ సమర్పయామి
  ఓం హైడ్రజన్ థ్రెడ్ బాంబీయం నమః ఢామ్ ఢామ్ సమర్పయామి
  ఓం డబల్ షాట్ బాంబీయం ధన్ ధనేల్ సమర్పయామి
  ఓం ఈగల్ సౌండ్ రాకేటీయం నమః చూఁయీఁ సమర్పయామి
  ఓం థౌజండ్ వాలాయియం నమః చటర్ ఢంఢాం సమర్పయామి
  ఓం దీపావళీయం దీప ధూప ధూమ నాసిక యంత్ర కర్ణభేరి యంత్రే టెంపరరి ఆడిటరి ఫెల్యూర్ సమర్పయామి
  ఇతి దీపావళి నక్తే నానా విధానాం శోషణ వివరణ దాస్యామితి

  రెమిడి:
  దీపాలంకరణ దేదీప్యమానం లక్ష్మీం పూజనం శుభప్రదమితి

  ReplyDelete
 6. "జిలేబి" గారు,

  "నెమలికన్ను" మురళి గారి బ్లాగులో "Middleclass Melodies" సినిమా గురించి 23-11-2020 న మీరు పెట్టిన ఒక కామెంట్ "కొంపదీసి ఇది కూడా మళయాళంలో నుండి దిగుబడియా" అని అడిగారు కదా, దానికి నా వంతు వివరణ (మలయాళం అని ఎన్నిసార్లు చెప్పినా మీరు మాత్రం "మళయాళం" అనడం మానరు కదా). మురళి గారినెందుకు ఇబ్బంది పెట్టడం అని మీ బ్లాగులో వ్రాస్తున్నాను (ఎలాగూ నా కామెంట్ మీద మీరు లేవనెత్తిన సందేహమే కాబట్టి).

  కేరళీయులకు తాము, తమ రాష్ట్రం చాలా స్పెషల్ అనే భావన మెండు (కొన్నేళ్ళ క్రితం కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రపు ఒక భావి ఎం.పి. గారు మేమసలు ఇండియన్లమే కాదు లాంటి స్టేట్-మెంట్ ఒకటి ఇచ్చారు గుర్తుందిగా, అలాగన్నమాట ). అప్పుడెప్పుడో ఒక కేరళా రచయిత గారు కేరళా చరిత్ర గురించి వ్రాసిన పుస్తకంలో There is Kerala, there is India అని కనబడింది లెండి. ఆ రకంగా తాము "డిఫరెంట్"అనుకుంటారు.

  movie "డిఫరెంట్" గా ఉంది అంటే ఈ "Middleclass Melodies" సినిమా మలయాళం నుండి దిగుమతి అనే అర్ధంలో మాత్రం కాదు లెండి. ఆంధ్రా తెలుగు సరుకే (ఒకానొక పంటి క్రింద రాయి మినహా).

  ReplyDelete
  Replies


  1. చిత్రం‌ బావుందండీ ! ‌ఆ‌ తండ్రి పాత్ర మన బ్లాగ్ లోకపు భండారు వారేమో అనుకున్నా ! కాదని గోపరాజు గారని తరువాయి తెలిసింది.   ఈ చిత్రం లో కూడా రెండు మూడు " అసంభావితాలు" వున్నాయి /:) ఏమిటవి ?   జిలేబి

   Delete

  2. బై ది వే - ఈ పదం నా సొంత "సూక్షి" కాదు :) బ్రౌను దొరగారి ఇంగ్లీషు తెలుగు నిఘంటువులోనిదే :) నమ్మరామి అనెడు అర్థం లో వాడబడి వుంది.

   ఈ తెలుగోళ్లతో వచ్చిన సమస్యే యిది :) తెలుగే తెలీదు :)


   నారదా

   జిలేబి

   Delete


 7. ఆహా డౌ జోన్సూ !! ఓహో బ్యాంకునిఫ్టీ !


  డౌ జోన్సూ! బ్యాంక్నిఫ్టీ!
  బాజారున కొండనెక్కె పడతి జిలేబీ!
  తాజాగా నిఫ్టీ మర
  లా జిగి తో నాట్యమాడు లావై పోవే !  ఇవ్వాళ బ్యాంకు నిఫ్టీ 30,500 touch చేయునా :)
  నిఫ్టీ 13,500 పోవునా :) గుర్రం గాల్లోకి అలా అలా తేలి పోవునా :)


  డౌ జోన్సూ! బ్యాంక్నిఫ్టీ!
  బాజారున కొండనెక్కె పడతి జిలేబీ!
  తాజాగా నిఫ్టీ మర
  లా జిగి తో నాట్యమాడు లావై పోవే !


  ఆహా నా మార్కెట్టూ

  :)


  జిలేబి

  ReplyDelete


 8. భానోదయమన కూడదు
  రానాన్న! తెలుగు తెలియక రాయకు మా క
  న్నా! నామాట వినదగును
  మా నాన్నవు దుగ్గిరాల మన్నించదగు‌న్ !


  జిలేబి

  ReplyDelete


 9. మూర్తీ భవించిన బెరుకు!
  స్ఫూర్తి కనబడదు రవంత! శోకమ్మెపుడున్!
  గొర్తి లలితా భవానికి
  కార్తికదీపమునుఁ గాంచఁగా భయమయ్యెన్!


  :)
  జిలేబి

  ReplyDelete


 10. సుజన జిలేబికి వరుస క
  నుజ! కార్తికదీపముం గనులఁ గాంచఁగ భీ
  తి జనించె మెండుగన్, కను
  ల జలము గంగవలె పారె లావుగ సుమ్మీ!


  జిలేబి

  ReplyDelete