Monday, August 26, 2013

One week to go for options expiry - an option strategy definable?

This article deals with a thinking of defining a strategy for writing an option contract just before one week to option expiry.

This is an option strategy I wish to discuss and elaborate.

May be it has some pitfalls but surely some thinking can be done?

With in a week to option expiry time frame

(for example for August 2013 option expiry date is 29th August 2013.
Between 22nd August 2013 to 29th August 2013 we can take a week's time for calculation).


Usually around the last week there comes up a certain amount of volatility which is higher than normal volatility  The reason being options contracts getting wound, new options contracts getting written so this probably gives more volatility to the market.

During this time we see how the prices move up :

We take a stock Bank of Baroda for example:

Say on 22nd August the spot price of Bank of Baroda was around Rs. 450. On the same day the Put option of Rs.420 was priced around Rs 5.35  and Call option of 500 was priced around 4.40.

A few days later that is today(26th August 2013- 4 calendar days later precisely)

The put option of Rs. 420 is priced around Re 1 and 500 call option is priced around 3 Rs. when the stock spot price is 470 today.

Thus if we have written  a put option of 420 and call option of 500 on 22nd August (exactly one week before option expiry date) and squared off the position 4 days later (its exactly 2 working days- Friday and Monday) for writing this option we would have collected a premium of  5.35+4.40-1.00-2.5 = 9.95-3.5 = 6.45 which amounts for 500 stock approximately Rs 3250/-

Assuming brokerage paid is 250 Rs. for writing the options and winding up the options written  we get a net profit of Rs.3000/-

Good gain for 4 days is not it ?


cheers
zilebi

Tuesday, August 20, 2013

శ్రీ రాముల వారి అడుగు జాడల లో!

శ్రీ రాములవారు గడిపిన ప్రదేశాలకి యాత్ర వెళ్లి ఆ యా ప్రదేశాలని ఇప్పుడు మనమున్న కాలమాన పరిస్థుతులలో దర్శిస్తే ఎట్లా ఉంటుంది ?

ఈ ప్రశ్న కి సమాధానం గా తమిళ అయ్యంగారు ఒకాయన ఒక ఆరు వందల మంది భక్తుల లో చేసినదే  శ్రీ రామనిన్  పాదయిల్ ! (శ్రీ రాముల వారి అడుగు జాడల లో )

ఈ శ్రీ రామనిన్ పాదయిల్ ' తమిళ ఎపిసోడ్ లను ఈ లింకులో చూడవచ్చు ! అరవం అర్థం అవుతుందను కుంటా (ఆయన వాడిన భాషలో సంస్కృతం పాళ్ళు ఎక్కువ ! సో ఓపిక పట్టి చూస్తే అర్థం అవుతుందని ఆశిస్తూ !

జిలేబీ సైనింగ్ ఆఫ్ !

 
 
ఈ పై లింకులకి రిలేటెడ్ సెర్చ్ చేసిన మిగిలిన లింకులు లభ్యం ఆ సీరీస్ లో !
 
 
చీర్స్ 
జిలేబి 

 

డాలరు మొగుడు రూపాయి పెండ్లాము !

డాలరు మొగుడు రూపాయి పెండ్లాము !
 
పెండ్లాము కొంగు
మరీ ఖరీదై పోనాది 
డాలరు మొగుడు ఆకాశానికి
ఎగురు తున్నాడు ఓలమ్మో !
 
పెండ్లాము గోల్డు అడిగినాది 
అడిగినంత కోరినంత అలుక తీరిస్తే 
ఇప్పుడు మరీ సంకట మై పోనాది 
 
మెకన్నాస్ గోల్డ్ రష్ లా 
వెంకన్నాస్ గోల్డ్ నిలువ ఎంతో మరి !
 
దేశం లో డాలరు బిళ్ళ 
 
మాంగల్యం అంత పవిత్ర మై పోనాది 
వద్దనుకుంటే మరి జీవితం ఇరకాటం
ముద్దనుకుంటే మరి జీవనం గందర గోళం
 
 
గోల్డు 
జిలేబి 
 

Monday, August 19, 2013

రాబోయే ఆంధ్ర దేశానికి తిరుపతి రాజధాని


రాబోయే ఆంధ్ర దేశానికి తిరుపతి రాజధాని అవడానికి ఆస్కారాలు ఉన్నాయా ?

లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అని సామెత.

ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తూంటే ఈ అభిప్రాయం( సదభిప్రాయమే నని  మనవి చేసు కుంటున్నా) రాక మానదు

కర్నూల్, ఒంగోలు, గుంటూరు విజయవాడ, విశాఖ తిరుపతి ఈ ప్రదేశాల గురించి ఆల్రెడీ ఆలోచనలు ఉన్నాయి రాష్ట్ర రాజధానికి పోటీ గా .

అయితే , తిరుపతి కి  రాష్ట్ర రాజధాని అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నా , సదరు లోగుట్టు పెరుమాళ్ళ ప్రకారం తిరుపతి కి రాష్ట్ర రాజధాని అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి

ఈ నేపధ్యం లో  మీ అభిప్రాయం ఏమిటి ? తిరుపతి బోడి గుండు రాష్ట్ర గుండు అవుతుందా ?

మీరు ఈ ప్రశ్న కి సమాధానము తెలిసీ నను తెలియక పోయినను కామెంట క పోయిన మీ గుండు డాం డాం అని 'వెడియును' !

గుండు గుండు లో గుండుం దయ్యా వెంకన్నా !


తిరుపతి గుండు కి జేజేలు పలుకుతూ
చీర్స్ సహిత

మీ బోడి గుండు
జిలేబి

 

Saturday, August 17, 2013

జిలేబి బయో డేటా !


మీ పేరు ?

భారతి 

వయస్సు ?

అరవై ఏడు 

వృత్తి 

సంతానోత్పత్తి 

కులం ?

పోయే కాలం లో ఏ కులమైతే నేమిటి ?

తట్ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అధిక ప్రసంగం కూడదు 

సర్ 

ఆధార్ కార్డు ఉందా ?

పిచ్చి ప్రశ్న ! దానికోసమే కదా వచ్చి ఉంట !

వోటర్ కార్డు ?

లేదు 

అట్లీస్ట్ రేషన్ కార్డు ?

లేదు 

మరి బర్త్ సర్టిఫికేట్ ?

నే పుట్టినప్పుడు జనాలు జయహి  జయహి  అన్నారు సర్టిఫికేట్ అప్పట్లో లేదు

పాస్ పోర్ట్ ?

లేదు 

ఎప్పుడు పుట్టావ్ ?

ఆగస్ట్ పదిహేను 1947

మరి ఇన్నేళ్ళ కి ఆధార్ కార్డ్ తీసుకుని ఏం జేస్తావ్ ?

అంటే ?

ఇన్నేళ్ళు ఏం చేసావని మరి ?
 
తెలీదు 

ట ట్ టట్ ! you are dismissed ! Next please


జిలేబి 
 

Friday, August 16, 2013

బుద్ధా మురళి !

 
ఒక భోగి 
యోగి అయితే 
బుద్ధా  పరిమళించాడు 
 
ఒక మురళి డొల్ల అయితే 
గొల్ల వాడి చేతి లో 
నాదం వేణు గానమై పరిమళించింది 
 
యోగి సంపూర్ణం 
డొల్లా శూన్యం 
స్పేస్ టైం కర్వ్ లో 
రెండూ మమేక మయితే 
పూర్ణమిదం పూర్ణమదః !
 
శుభోదయం 
జిలేబి 

Thursday, August 15, 2013

జిలేబీ ల ఉల్లి పాయల ధర్నా !


' ఆల్ జిలేబీస్ ఫాల్ ఇన్ లైన్ ' 'హాయ్' కమాండ్ పిలుస్తోంది !

జిలేబీలు అందరూ సింగారించు కుని తమ తమ హైటెక్ కార్లలో హెచ్ ఓ కి చేరు కున్నారు

హెచ్ ఓ లో ఓ గడ్డపాయన బరివి గడ్డం దువ్వుకుంటూ ... భాయియో ఔర్ భహనొ అన్నాడు .

లిప్స్టిక్ సరిదిద్దు కుంటూ ఓ జిలేబీ కిసుక్కుమంది .

గడ్డపాయన కొంత ఉలిక్కి పడి హా ...భాయియొ అన్నాడు !

జిలేబీలు మళ్ళీ కిసుక్కుమన్నారు .

'ప్యాజ్ ధర ఎక్కువై పోయిందని మీరందరూ కలిసి ధర్నా చేయాలి ఇది 'హాయ్' కమాండ్ ఆదేశం  '

'ప్యాస్' ప్యాస్' ఓ జ్యాదా హోనేసే కోక్ యా సెవెన్ అప్ పీనే కా హై ఓ జిలేబీ ఒయ్యారాలు ఒలకబోసింది .

గడ్డపాయన బుర్ర గోక్కున్నాడు .

ఆర్డర్ డన్ సబ్ ధర్నా కేలియే చలియే

జిలేబీ లు అందరూ తమ తమ కార్ల లో పోలో మని బయలు దేరి రాష్ట్ర హెడ్ జిలేబీ ఇంటి ముందు ధర్నా చేయడం మొదలెట్టారు

జిలేబీ హటా వో ... ప్యాజ్ భర్పూర్ లావో ...

ఎ ప్యాజ్ ప్యాజ్ క్యా హోతీ హాయ్ జిలేబీ ?

పతా నహీ క్యా హోతీ హై మగర్ జమానే కో బదల్ దేతీ హై !

ఔర్ ఏక్ బార్ మౌజ్ సే ప్యార్ సే మోహబ్బత్ సే కహోనా ప్యార్ హై ప్యాజ్ సే !

శుభోదయం
జిలేబి 

Wednesday, August 14, 2013

మనమోహనూ ... గట్లా ఆటో నడుపరాదూ !


అమ్మగారు పిలుస్తున్నారండీ మిమ్మల్ని - తాకీదు వచ్చింది మనమోహనుల గారికి

ఆయ్ హాజర్ అని వెంటనే ప్రత్యక్ష మయ్యేరు అయ్యగారు .

ఏమండీ మాన్ గారూ ఓ రెండు మూడు రోజులు ఆటో నడపండీ చెప్పింది అమ్మ గారు .

మొహనులవారు ప్రశ్నార్థకం గా చూసేరు

మా ఐరోపా లో నార్వే ప్రధాన మంత్రి మారు వేషం లో టాక్సీ నడిపి ప్రజల బాగోగులు గట్రా తెలుసు కుంటున్నాడు అట్లా మీరూ చేయండి !

ఎస్ మేడంజీ

సీన్ రెండు :

హైదరాబాదు  మహా నగరం

పాత ఆటో లో ఓ సర్దారీ బాబు తీరిగ్గా గోళ్ళు గిల్లు కుంటూ కూర్చున్నాడు . సవారీ ఎవరైనా వస్తే బావుణ్ణు అనుకుంటూ .

ఆయేగా ...

సర్దార్ జీ కి మరీ ఖుషీ ఐ పోయింది  హా హా అన్నాడు .

సవారీ ఆటో ఎక్కాడు .

వెంటనే ఎందుకో సందేహం వచ్చి ... సర్దార్ జీ ని చూసి తూ తుమ్ .. ఆప్ మన్మోహన్ జీ హై క్యా ! అన్నాడు హాశ్చర్య పోయి


బిత్తర పోయాడు మన మోహను !

అసలు తను అంటూ ఓ మానవుడు ఉన్నాడని తన  గురించి అసలు ఎవరైనా పట్టించు కుంటారా అనుకున్న మానవుడి కి కన్నీళ్ళు వచ్చేసేయి .  తాను మారు వేషం లో ఉన్నా తన్ను కనుక్కున్నాడు కదా అని సంతోష పడి పోయాడు . కానీ తానె తను అని చెప్పలేక, 'నహీ సాబ్ సబ్ ఐసే హీ దీక్తే హై' అన్నాడు

ఓ, నువ్వే వారేమో అనుకున్నా . పోనీ లే దోమల్గూడా  పోలీస్ టాణా కెల్లు చెప్పేడు సవారి .

దోమల్గూడా పోలీస్ స్టేషన్ లో ఏమి జరిగింది ?

జవాబు చెప్పిన వారికి మిటాయి పొట్లం ఫ్రీ !


జిలేబి 

Monday, August 12, 2013

శ్రీ నేమాని వారి అత్యద్బుత వేదాంత తురీయం !

When the consciousness raises beyond and manifests in the states of non-dual incomprehensible 'Thuriya',  what ever seen, even of mundane experiences and day to day affairs evoke profoundly in the mind the divine connections and the thread of that 'Poorna' which is pervading in all from 'Anoraneeyaan to  Mahatoraneeyaan'.

In this exceptional couplets Shri Nemani expounds beautifully the vedantha describing the unlimited in fistful of  words which is nothing but sheer beauty and divine cosmic dance of the Almighty.

I share the joy of reading it again and again and joy increases by sharing. Read and Enjoy.

The photo that evokes that beauty is also given side by side.

(courtesy: Sankarabharanam Blog)



Pandita Nemani చెప్పారు...

వేదాంత పరముగా:

పూనికతో హృదయంబను
గానుగలో వేసి సకల కర్మముల శివ
ధ్యానముతో నాడించిన
జ్ఞానమనెడు నూనె పొంద గలరు ముముక్షుల్

జ్ఞానమ్మే తైలమ్ముగ
మానసమే ప్రమిద, వర్తి మాయ యయినచో
నానంద కాంతులంత న
నూనమ్ముగ వెల్లి విరియు నో మహితాత్మా!
 
 
 
శుభోదయం 
జిలేబి 


 

Sunday, August 11, 2013

ఐ 'సప్పో టా' నమో 'డీ' !


'సప్పోటా పండు బాగుందోయ్ కొనుక్కుం టావా ? ' మార్కెట్ లో సప్పోటా బండి దగ్గిర నిలబడి మా అయ్యరు గారు సప్పోటా ని పరీక్షించి నా వైపు తిరిగి అడిగేరు .

ఆ ఏం సప్పోటా నో ఏమో నండీ అసలే డయాబిటీస్ పేషెంట్  లం అవి తినే దానికి మన శరీరాలు సహకరిస్తాయా ? అన్నా - సప్పోటా తినాలని ఉన్నది కాని మన ప్రస్తుత ఆరోగ్య పరిస్థుతులు బాలేవు మరి .

డయాబిటీస్ ని పక్క బెట్టి అప్పుడప్పుడు ఒకటో రెండో ఇట్లాంటి వి తింటే ఏమీ తరిగి పో లేవు లే , అయ్యరు గారు భరోసా ఇచ్చి 'ఎంతోయ్' అన్నారు బండబ్బాయి వాడితో .

వాడు ధర చెప్పే టప్పుడు గమనించా , బండ్లో ఒక స్టికర్ - ఐ సప్పోర్ట్ నమో ! వార్నీ ఈ స్లోగన్ నీ దాకా వచ్చేసిందా అనుకుని హాశ్చర్య పోయి, ఏమీ తెలీనట్టు అడిగా - ఇదేమి స్టికర్ వోయ్ '

అదేమిటండీ ఆ పాటి తెలీదా ? అన్నాడు వాడు .

తెలీదోయ్ అందుకే గదా అడుగుతుంట అన్నా వాడేమి చెబ్తాడే మో చూద్దామని .

మోడీ 'బ్రాందీ' అన్నాడు బ్రాండ్ అనాలనుకున్నట్టు ఉన్నాడు కామోసు !

బ్రాందీ బానే ఉందే మరి ! ఇంతకీ ఇది వీడికి కిక్కు నిస్తుందా ?

అదే అడిగా ఏమోయ్, మోడీ మోడీ స్టికర్ పెట్టు కున్నావ్ మరి మోడీ ఎవరో తెలుసా నీకు ?

'ఆ గడ్డ పోళ్లు ' తెలీక పోవటం ఏమిటమ్మ గారు అన్నాడు వాడు .  మన బాబు గారిలా మరో గడ్డ పాయన .

అంతే నంటావా ? మరి మోడీ డిల్లీ సర్కారు చేస్తాడంటావా ? అడిగా 'కామన్' మేన్ అభిప్రాయం తెలుసు కుందా మని .

ఇదిగో నమ్మ గోరు ఇవన్నీ మనకు తెలవ్వు - మార్కెట్టు లో నుండాము ... ఇక్కడ మాకు వ్యాపారం జరగాలె. ఇది పెట్టుకోవోయ్ ఇవ్వాల్టి కి మంచి వ్యాపారం జర్గు తుందన్నాడు మా లీడరు అంతే మనకు తెలిసింది '

ఔరా ! మార్కెటు మార్కెట్టే కదా మరి ! మార్కెట్టు లో జరగాల్సింది వ్యాపారం - రాజ కీయం కాదు !

దేశం లో ఇది ఇప్పుడు తలక్రిందు లై పోయింది !

మోడీ భాయ్ ? వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ?

ఐ 'సప్పో టా'  నమో 'డీ' !

శుభోదయం
జిలేబి