Monday, August 19, 2013

రాబోయే ఆంధ్ర దేశానికి తిరుపతి రాజధాని


రాబోయే ఆంధ్ర దేశానికి తిరుపతి రాజధాని అవడానికి ఆస్కారాలు ఉన్నాయా ?

లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అని సామెత.

ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తూంటే ఈ అభిప్రాయం( సదభిప్రాయమే నని  మనవి చేసు కుంటున్నా) రాక మానదు

కర్నూల్, ఒంగోలు, గుంటూరు విజయవాడ, విశాఖ తిరుపతి ఈ ప్రదేశాల గురించి ఆల్రెడీ ఆలోచనలు ఉన్నాయి రాష్ట్ర రాజధానికి పోటీ గా .

అయితే , తిరుపతి కి  రాష్ట్ర రాజధాని అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నా , సదరు లోగుట్టు పెరుమాళ్ళ ప్రకారం తిరుపతి కి రాష్ట్ర రాజధాని అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి

ఈ నేపధ్యం లో  మీ అభిప్రాయం ఏమిటి ? తిరుపతి బోడి గుండు రాష్ట్ర గుండు అవుతుందా ?

మీరు ఈ ప్రశ్న కి సమాధానము తెలిసీ నను తెలియక పోయినను కామెంట క పోయిన మీ గుండు డాం డాం అని 'వెడియును' !

గుండు గుండు లో గుండుం దయ్యా వెంకన్నా !


తిరుపతి గుండు కి జేజేలు పలుకుతూ
చీర్స్ సహిత

మీ బోడి గుండు
జిలేబి

 

15 comments:

  1. మరీ అంత తిరుపతి వెంకన్న సమక్షంలో రాజకీయం నడపటం (అ)రాచకీయ నాయకులకు సంకటమైన స్థితే . పైగా దానివల్ల తిరుపతి వెంకన్న రాబడి పూర్తిగా తగ్గిపోతుంది . వీళ్ళ్ (అ)న్యాయాలకు రాబడి ( వీళ్ళకు లెండి ) దాచుకోవటానికి ఈ కొండలు కూడా చాలవేమో ? అందుకని దాన్ని రాజధాని చేయరు . అది రాజధాని అయితే ఆ వెంకన్న రాజుకే హానికరమైన హాని , హనీ కాదండి బాబులూ .

    ReplyDelete
    Replies

    1. శర్మ గారు,

      అంతే నంటారా ! తిరుపతి రాజధాని అయ్యే ఆస్కారాలు తక్కువ మరి ?

      జిలేబి

      Delete
  2. తిరుపతిని రాజధానిగా చేయటం వెనుక రాజకీయాల సంగతి నాకు తెలియదు.
    తిరుపతి వచ్చేపోయే యాత్రికులతో నిత్యం రద్దీగా ఉండే పట్టణం.
    తిరుపతి రాజధాని అయితే భద్రతాపరమైన ఇబ్బందులు ప్రమాదాలకు దారితీయవచ్చును.
    మన రాజకీయ నాయకులకు వాళ్ళ పట్టుదలల కన్నా దేశం అనేది ముఖ్యం కాకపోవటం శోచనీయం.

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం గారు,

      సరిగ్గా చెప్పేరు. ఆ ఒక్క ప్రాబ్లెం తప్పక ఉంటుందను కుంటాను !

      జిలేబి

      Delete
  3. మా విశాఖపట్నం లోనే రాజదాని పెట్టాలి.

    ReplyDelete
    Replies

    1. భాస్కర గారు,

      మీరూ ఒక పార్టీ పెట్టేయ్యండి మరి ఈ కోరిక పై !

      జిలేబి

      Delete
  4. నేను కూడా శ్యామలియం గారి అభిప్రాయంతో ఎఖిభవిస్తాను, తిరుపతి లాంటి పట్టణంలో రాజదాని ఉంటె దాని పవిత్రత రాజకీయాలతో కలుశుతం కాగలదు, అలాగే భద్రతా పరమయిన సమస్యలు తలెత్తవచ్చు.

    ReplyDelete
    Replies


    1. గ్రీన్ స్టారు గారు,

      అవునను కుంటాను !

      జిలేబి

      Delete
  5. విశాఖపట్నం మనకన్నా ఒరిస్సా వారికే రాజధానిగా బాగుంటుంది.

    ReplyDelete
    Replies

    1. మదన్ మోహన్ గారు,

      విశాఖ ఆంధ్ర వారికన్నా ఓడిస్సా వారికి దగ్గిరే !అయితే మాత్రం మరో ఓడిస్స్సా రాజధాని చేస్తే కటకం వాళ్ళు ఊరుకుంటా రా మరి !!

      జిలేబి

      Delete
  6. దేవుడి పాలన వస్తే ఇడుపులపాయ కూడ రాజధాని అవ్వచ్చు.

    ReplyDelete
    Replies

    1. బోనగిరి గారు,

      ఈ ఇడుపుల పాయ ఎక్కడ ఉందండీ ?

      జిలేబి

      Delete
  7. ప్రత్యెక దర్శనం పేరిట వ్యాపారాలు, లడ్డూల అమ్మకంలో తేడాలు, ఉద్యమాల పేరిట అల్లర్లు వీటన్నిటితో తిరుమలను ఇప్పటికే కలుషితం చేసారు. పవిత్రమయిన గుడికి మద్యం కాంట్రాక్టర్ల ఆజమాయీషి చేసే దుస్తితి దాపురించింది. ఇక రాజధాని వస్తే ఇంకేమన్నా ఉందా?

    తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేసి వీహేచ్పీకి తిరుమల ఆజమాయిషీ అప్పగించడం ఉత్తమం.

    ReplyDelete
    Replies

    1. జై గొట్టి ముక్కల వారికి జై !

      కేంద్ర పాలిత వాటికన్ సిటీ స్టేటస్ ?

      జిలేబి

      Delete
  8. గ్రేటర్ తిరుపతి రింగురోడ్డుకు అడ్డమని ఐదు కొండలు చదును చేస్తారు. ఏడుకొండలవాడు జంటకొండలవాడౌతాడు.
    ఏదేమైనా తిరుపతి రాజధాని అయి, ఏడుకొండలు జంటకొండలైతే అమ్మవారికి ఆనందం. ఎందుకో చెప్పండి.


    అయ్యవారు ఐదు కొండలు దిగే టైం తగ్గి మరో అరగంటన్నా తనదగ్గరుంటారు గదా అని.

    ReplyDelete